Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
ఆయన నన్ను మహిమ పరుస్తాడు

(ఉజ్జీవముపై 5వ ప్రసంగము)
HE SHALL GLORIFY ME
(SERMON NUMBER 5 ON REVIVAL)
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము సాయంత్రము, ఆగష్టు 17, 2014
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, August 17, 2014


డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్ ఉజ్జీవమునకు సంభందించి జాగ్రత్త పరుడైన విద్యార్ధి. ఆయన ఉజ్జీవాల చరిత్ర చదివాడు, 1931 లో వేల్స్ లో తన స్వంత సమాజములో ఉజ్జీవము అనుభవించాడు. ఒక ఉపన్యాసములో ఆయన గొప్ప సువార్తిక హొవెల్ హేరిస్ (1714-1773) పై "డాక్టర్" అన్నాడు, "మనము మరల అంధకార మృత స్థితిలో ఉన్నాము 18 వ శతాబ్దపు ప్రారంభపు సంవత్సరాలలో వలే" (D. M. Lloyd-Jones, The Puritans: Their Origins and Successors, The Banner of Truth Trust, 1996 edition, p. 302). ఇంకొక పుస్తకములో, డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ మాట్లాడాడు "భయంకర స్వధర్మ త్యాగము గత వంద [ఇప్పుడు 150 సంవత్సరాలు] గా పెరిగింది" (Revival, Crossway Books, 1987, page. 55).

నా 55 సంవతరాల పరిచర్య స్వానుభవంలో, నేను నాటకీయ దిగజారిన స్థితి మన సంఘాల జీవితం శక్తిలో చూసాను. ఈనాటి సంఘాలు, ఎక్కువగా, నా యవ్వన సమయ సంఘాలతో పోలిక లేకుండా ఉన్నాయి –మార్పు మంచిదిగా లేదు. నిజంగా, "మనము మళ్ళీ అంధకార మృత స్థితిలో ఉన్నాము." నిజంగా, మనం "భయంకర స్వధర్మ త్యాగ" స్థితిలో ఉన్నాము.

నేను ఒప్పింపబడ్డాను ఈ భయంకర స్థితి వచ్చింది ఎందుకంటే సంఘ కాపరులు మర్చిపోయారు. నా అనుభవములో, ఏది ఒక వ్యక్తిని క్రైస్తవునిగా చేస్తుందో బహు కొద్ది భోధకులకు తెలుసు ఆచరణలో మార్పును గూర్చి కొత్త జన్మనుగూర్చి, కాని ఈ రాత్రి ఆ విషయముపై మాట్లాడడం లేదు.

ఉజ్జీవముపై మాట్లాడే చాలా మందికి తెలుసు మనకు పరిశుద్దాత్మ కావాలి ఏదో చేయడానికి మన సంఘాలను ఉజ్జీవింపచేయడానికి! కాని కొద్ది మందికి తెలుసు సరిగ్గా పరిశుద్దాత్మ అవసరత పనిని గూర్చి. పరిశుద్దాత్మ అవసరత పనివారికి తెలియదు ఎందుకంటే వారు ఎదుర్కొంటున్న సమస్య లోటు వారు గ్రహించుట లేదు. వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ వారు చాల మంది రక్షింపబడ్డారని ఇంకా అనుకుంటున్నారు కొత్త వారిని రక్షణ అనుభవంలోనికి ఎలా నడిపించాలో వారికి తెలుసనీ. అయినను ఈ విషయముపై ఏ పెద్ద బోధకుడు సరియైన దృష్టి సారించడం లేదు. ఫలితంగా, చాలా సంఘాలు, నశించు వారితో, పూర్తిగా నింపబడుతున్నాయి! మా పుస్తకంలో ఈ సమస్త్యపై లోతైన విషయాలు వ్రాసాం, ఈనాటి స్వధర్మ త్యాగము (చదవడానికి క్లిక్ చెయ్యండి).

ఉజ్జీవము సమస్యలోనికి ఈ రాత్రి నేను వెళ్ళడం లేదు. నా దృష్టి మనం ఎలా ప్రార్ధించాలి మన స్థానిక సంఘములోనికి దేవుడు ఉజ్జీవము పంపాలంటే. ఒక ఉచ్చులో పడతాం ఉజ్జీవాన్ని గూర్చి పుస్తకాలలో చదివి నప్పుడు సంఘలన్నింటిలో గొప్ప మార్పు వస్తుందని ఊహిస్తాం – గొప్ప సంఖ్యలో. అలా జరగనప్పుడు మనం నిరుత్సాహపడతాం.

మనం అర్ధం చేసుకోవాలి ప్రతి మార్పు ఒక అద్బుతమని. డాక్టర్ కాగన్ నేను మారిన వారి జాబితా చూసాం. ప్రతి నెలా మార్పులున్నట్టు మేము కనుగొన్నాం. అంటే, మార్పు అనే అద్భుతం సంవత్సరంగా ప్రతి నెలా మన సంఘములో సంభవిస్తుంది. నేను "నిర్ణయాలను" గూర్చి మాట్లాడడం లేదు, నేను నిజ మార్పులను గూర్చి మాట్లాడుతున్నాను. మనం ప్రార్ధించేది ఉజ్జీవములో మార్పు అద్భుతాలు జరగాలని, దేవుడు దిగివచ్చి క్రీస్తు కొరకు ఎక్కువమందిని మార్చాలని.

ఇప్పుడు, సరిగ్గా ఏమి ప్రార్ధించాలి? నేను నమ్ముతాను మన చింత ఏముండాలి అంటే పరిశుద్దాత్మ గొప్ప శక్తితో దిగి రావాలని ప్రార్ధించాలి. నేను గ్రహించాను ఈ విషయంపై నేను చెప్పేది చాలా మంది తిరస్కరిస్తారు. పరిశుద్దాత్మపై ఇరవై శతాబ్దంలో చాల తప్పుడు బోధ ఉంది నేను వారిని నిందించడం లేదు. పరిశుద్దాత్మ వ్యక్తిగత మార్పుకు, ఉజ్జీవములకు మూలము. ఈనాడు సంఘస్తులు అనుకుంటారు పరిశుద్దాత్మ ప్రజలను "భాషలలో మాట్లాడింపచేస్తావని," ఎక్కువ ధనార్జనకు సహాయ పడుతుందని, లేక శారీరక స్వస్థత వస్తుందని. కాని అవన్నీ పరిశుద్దాత్మ, ప్రాధమిక పనితో, సంబంధము లేనివి. యోహాను 16:14 మీ బైబిలు లో చూడండి. ఇక్కడ దేవుని ఆత్మ ప్రధాన పని మనం చూస్తాం. యేసు అన్నాడు,

"ఆయన నన్ను మహిమ పరచును" (యోహాను 16:14).

గ్రీకు పదము తర్జుమా "మహిమ పరచుటకు" అంటే "గౌరవించుట, ఘన పరచుట, హెచ్చించుట, స్తుతించుట" (బలమైన #1392). పరిశుద్దాత్మ పని క్రీస్తును మహిమ పరచుట, మనం క్రీస్తును హెచ్చించేటట్టు చూడడం, క్రీస్తును ఘన పరచడం, మనం ఆయనను గౌరవించేటట్టు చేయడం.

ప్రజలు తప్పుడు మార్పు పొందినప్పుడు, దానికి కారణము వారు యేసునే తిరస్కరించారు. డాక్టర్ కాగన్ మా పుస్తకము, నేటి ధర్మ త్యాగములో ఇలా అన్నాడు,

కేథలిక్ గతము ఉన్నవారు సాధారణంగా అనుకుంటారు రక్షణ క్రియల ద్వారా వస్తుందని: కొన్ని పాపాలు విడిచి పెట్టడం, గుడికి వెళ్ళడం, యేసును వెంబడించడం, యేసును ప్రేమించడం, పశ్చాత్తాపము, "మంచిగా ఉండడం."

బాప్టిస్టు, సువార్తిక లేక సంస్కరణ గతము ఉన్నవారు బాప్టిస్మాన్ని నమ్ముతారు, "పాపి ప్రార్ధన" చెప్తారు, లేక మానసికంగా క్రైస్తవ సిద్ధాంతము నమ్ముతారు, అంటే "రక్షణ ప్రణాళిక"ను వల్లించడం, లేక "వెస్ట్ మినిస్టర్ కేటకిజం" చెప్పడం.

ఆకర్షణీయమైన లేక పెంతేకొస్తు గతము ఉన్నవారు సామాన్యంగా అనుకుంటారు భావనలు అనుభవాలు నమ్ముతారు. ఒక వ్యక్తికి "పరిశుద్దాత్మ" అనుభవము ఉంటే, దేవుని ఆశీర్వాదాలు అనుభవిస్తే, శాంతి ఆనందము తన హృదయంలో పొందుకుంటే, రక్షింపబడినట్టుగా భావిస్తాడు.


చాలాసార్లు అలాంటి ప్రజలు మా దగ్గరకు కౌన్సిలింగ్, భావ నిశ్చియిత పొందుకోడానికి వస్తారు వారు క్రీస్తును విశ్వసించడం ద్వారా రక్షింపబడరు (Today’s Apostasy, Hearthstone Publishing, 2001 edition, p. 141).

మన గుడిలో తరచూ వచ్చే మార్గము ఇది. సంఘ కాపరి ఎప్పుడు రక్షింపబడ్డారు అని అడిగినప్పుడు, వారు పొడవైన "షాగీ కుక్క" కథ చెప్తారు, వారు విన్న ప్రసంగము గూర్చి వారి తలంపులు చెప్తారు, మిగిలిన వివరాలు, పాపులమన్న భావన వారు చెప్తారు. సామాన్యంగా పెద్ద కథ వినిపిస్తారు, వివరాలతో, వారు మార్పును గూర్చి. అకస్మాత్తుగా ఆపేస్తారు. చివరకు అంటారు, "అప్పుడు నేను యేసును నమ్మాను," లేక "అప్పుడు నేను యేసు దగ్గరకు వచ్చాను."

మేము వారిని యేసును గూర్చి చెప్పమంటాం, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు (ఆయనను నమ్మినప్పుడు) ఏమి జరిగిందో. అప్పుడు అంతా పడిపోతుంది. ఎక్కువ చెప్పలేదు, ఏదైనా, యేసును గూర్చి. పుస్తకము, మూర్ఖ ద్వారము చుట్టులో, స్పర్జన్ అన్నాడు, "క్రూర ప్రమాదం ఉంది మనష్య్లులు క్రీస్తూనే సువార్తల నుండి తొలగించే ప్రమాదము" (Pilgrim Publications, 1992 edition, p. 24). వారితో చెప్తాను వచ్చు సువార్త వినమని. వారి సాక్ష్యాలలో యేసు కేంద్ర బిందువు కావాలని నా ఆశ. ఒకని సాక్ష్యము ఎంత ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, క్రీస్తు కేంద్ర బిందువు కాకపొతే, వారు ఇంకా రక్షింపబడనట్టే!

పరిశుద్దాత్మ నిజ మార్పులో రెండు ప్రాముఖ్య పనులు చేస్తుంది. మొదటిది యోహాను 16:8-9 లో ఉంది,

"ఆయన వచ్చి, పాపములను గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకోన చేయును: ఎందుకనగా, వారు నాయందు విశ్వాసముంచలేదు గనుక" (యోహాను 16:8-9).

పాపపు ఒప్పుకోలు దేవుని ఆత్మ మొదటి పని. మనం మార్పిడిని, ఒక చిన్న విషయంగా చేస్తున్నాం, ఒక వ్యకి కొన్ని మాటలు పలికితే సరిపోతుంది, కొన్ని పనులు నేర్చుకునే చాలు అని. దేవుడే మనకు సహాయం చెయ్యాలి! మనం పరిశుద్దాత్మను వదిలి పెట్టాం! మనం మర్చిపోయాం ఆయన లోతుగా పేరుకున్న మన పాపాన్ని తిరుగుబాటును దేవునికి వ్యతిరేకంగా దానిని ఒప్పింప చేస్తాడు! డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ వివరించాడు ఒప్పుకోలు మీ హృదయ దుస్థుతిని చూపిస్తుంది, ఆదాము నుండి నీకు సంక్రమించిన స్వభావాన్ని కనుపరుస్తుంది. ఒప్పుకోలు నీ నిస్సహాయ స్థితిని చూపిస్తుంది, నీ నిస్పృహను, పరిశుద్ద, నీతి దేవుని ముందు, ఆయన పాపాన్ని ద్వేషిస్తాడు (తీసుకొనబడింది ఉజ్జీవము నుండి, క్రాస్ వే బుక్స్, 1987 పేజి 42). అది, ఎక్కువగా, నిజంగా మార్పు నొందిన వారిలో జరుగుతుంది. డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు, "ఏ వ్యక్తి అయినా మేల్కొల్పబడి ఒప్పుకోలు పొందుకుంటే తొందరలో పడాలి. అతడు ఎలా చనిపోయి దేవుని ఎదుర్కోగలడు?" (Assurance, Romans 5, The Banner of Truth Trust, 1971, p. 18).

కనుక నిజ మార్ప్దిడిలో పరిశుద్దాత్మ చేసే మొదటి పని అది. ఆయన ప్రజలను తొందర చేస్తాడు. నీ పాప స్వభావమును గూర్చి నీవు లోతుగా అలజడి పొందకపోతే, నీవు ప్రభువైన యేసు క్రీస్తును గూర్చి ఎక్కువగా ఆలోచించవు. నీవు ఆయన సిలువపై మరణించడం వింటావు, కాని అంతగా నీకు పట్టదు. ఎందుకు? ఎందుకంటే నీవు "పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పుకోలు పొందలేదు" (యోహాను 16:8). అయినను నశించు పాపి ఒప్పుకోలులో ఉండిపోకూడదు! ఒప్పుకోలు మాత్రమే నిన్ను రక్షింపజాలదు!

ఈ మధ్య నేను ఒక యవనస్థునితో మాట్లాడాను అతనికి చాల రోజులుగా తన పాపాన్ని గూర్చి లోతైన ఒప్పుకోలు ఉంది. ఆయన రక్తము ద్వారా రక్షణ కొరకు యేసు నొద్దకు వెళ్ళాలని చెప్తాను. అలా చేసినట్టనిపించింది. యేసు నొద్దకు వచ్చినట్టనిపించింది. కొన్ని వారాలు కనిపెట్టి అతనిని అడిగాను ఎలా రక్షింపబడ్డాడో చెప్పమని. తన పాపాన్ని గూర్చి చెప్పుతూ పోతున్నాడు. లోతైన ఒప్పుకోలులో ఉన్నాడు సందేహము లేదు. కాని ఇలా ముగించాడు, "అప్పుడు నేను యేసు నొద్దకు వచ్చాను." ఇంకా యేసును గూర్చి చెప్పమన్నాను. తికమక పడ్డాడు, ఒప్పుకోలు ఉన్నప్పటికిని, అతనికి సమాధానము లేదు, రక్షకుని ద్వారా ఆయన రక్తము ద్వారా!

తరుచు ప్రజలు నన్నుడుగుతారు, "ఎలా నీవు యేసు నొద్దకు వచ్చావు?" దానికి జవాబివ్వాలంటే, యోహాను 6:44 చూడాల్సిందే,

"నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించి తేనే గాని, యోవడును నా యొద్దకు రాలేడు" (యోహాను 6:44ఎ).

పరిశుద్దాత్మ ద్వారా తండ్రియైన దేవుని ద్వారా నీవు యేసు నొద్దకు రావాలి. సామాన్యంగా, దేవుని ఆత్మ పాపపు ఒప్పుకోలు కలిగిన పాపిని యేసు నొద్దకు నడిపిస్తుంది, కృప కొరకు పిలిచినప్పుడు. ఎవడినైనా పరిశుద్దాత్మ యేసు నొద్దకు నడిపించినప్పుడు, వాళ్ళకు అనిపిస్తుంది మునుపు వారు అందులని, ఇప్పుడు వారి కళ్ళు తెరువబడ్డాయని – వారు సుందరుడైన రక్షకుని చూస్తున్నారు, కౌగిలించుకోడానికి చేతులు చూపి నీ ఆయనను! వారు జాన్ న్యూటన్ తో (1725-1807) పాడవచ్చు,

ఒకప్పుడు తప్పిపోయాను, ఇప్పుడు కనుగొనబడ్డాను,
అంధుడను, ఇప్పుడు చూస్తున్నాను.
("అద్భుత కృప").

కనుక, మనం ఉజ్జీవం గూర్చి మాట్లాడేటప్పుడు, సువార్త పందాలో ఆలోచించాలి. ఉజ్జీవము అంటే ఎక్కువ కాదు, తక్కువ కాదు, దేవుని ఆత్మే పాప భావన ప్రజలకిస్తుంది, తరువాత ఆయన రక్తము ద్వారా రక్షణ కొరకు యేసు నొద్దకు చేస్తుస్తుంది. ఒక వ్యక్తికి అది సంభవించినప్పుడు, కొన్ని వారాలుగా మన గుడిలో జరుగుతుంది, అది మార్పిడి, మార్పు యొక్క అద్భుతము! జాన్ డబ్య్లూ. పీటర్సన్ ఆయన పాటలో తేట పరిచాడు,

నక్షత్రాలను తమ స్థానాలలో ఉంచడం ఒక అద్భుతం;
   ప్రపంచాన్ని శూన్యంలో వ్రేలాడ దీయడం ఒక అద్భుతం.
కాని ఆయన నా ఆత్మను రక్షించినప్పుడు,
   కడిగి శుద్ధి చేసాడు,
ప్రేమ కృప అద్భుతం జరిగింది.
   ("అద్భుతం చోటు చేసుకుంది" జాన్ డబ్ల్యూ. పీటర్సన్ చే, 1921-2006).
      (“It Took a Miracle” by John W. Peterson, 1921-2006).

ఒకేసారి ఎక్కువ మందికి ఆ అద్భుతం జరిగినప్పుడు, 10 లేక 12 మందికి ఒకేసారి స్థానిక సంఘములో జరిగితే, అది ఉజ్జీవము! అది అంత సామాన్యము! ఏమి జరుగుతుంది ఒక మార్పిడిలో ఎక్కువ మంది తక్కువ వ్యవధిలో ఉజ్జీవము వస్తే. ఎప్పుడైతే పరిశుద్దాత్మ ఉజ్జీవ శక్తి ద్వారా వస్తుందో, ఆయన ఎప్పుడు యేసును మహిమ పరుస్తాడు చాల మంది మారిన జీవితాలు ద్వారా!

"ఆయన నన్ను మహిమ పరచును" (యోహాను 16:14).

ఇంకొక సారి డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ మాటలు ఇంకోసారి వినండి.

         ఉజ్జీవము, అన్నింటికీ మించి, దేవుని కుమారుడైన ప్రభువైన యేసు క్రీస్తును, మహిమ పరచుట. అది ఆయన పునరుద్ధరణ సంఘ జీవితానికి కేంద్ర బిందువు...పిలువబడే క్రైస్తవ్యములో విలువ ఉండదు ఆయనను పైకెత్తకపోతే, ఆయన కొరకు జీవింపకపోతే, ఆయనను [గూర్చి] సాక్ష్యము చెప్పడానికి... ప్రత్యేకంగా ఆయన నెరవేర్పు, సిలువపై ఆయన మరణము, విరువబడిన ఆయన శరీరము ఆయన కార్చిన రక్తము. మళ్ళీ పరిపూర్ణ సత్యాన్ని చెప్తున్నాను మీకు మీరు గమనించుకోడానికి. అది మీరు ప్రతి ఉజ్జీవ కాలములో చూస్తారు, మినహాయింపు లేకుండా, క్రీస్తు రక్తమును గూర్చి అద్భుత వాక్కాణింపు ఉంది. ఉజ్జీవము కాలములో ఎక్కువగా పాడబడే పాటలు, రక్తమును గూర్చినవే... ఎక్కువగా… క్రైస్తవ సువార్త హృదయము, ఇది పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున, "ఆయన తన నీతిని కనుపరచెను" (రోమా 3:25)...స్త్రీ పురుషులు సిలువ రక్తమును నిరాకరించి నప్పుడు నేను ఉజ్జీవము గూర్చిన నిరీక్షణ నేను చూడడం లేదు...(ఉజ్జీవము, ఐబిఐడి., పేజీలు 47, 48, 49).

రక్తముతో నిండిన ప్రవాహము ఉంది
ఇమ్మను యేలు సిరలునుండి;
ఆ ప్రవాహము ద్వారా పాపులు దూసుకుపోతారు,
నేరారోపణ మరకలు వదిలించుకుంటారు;
నేరారోపణ మరకలు వదిలించుకుంటారు.
("ఒక ప్రవాహముంది" విలియం కౌపర్ చే, 1731-1800; రాగము "ఓర్టాన్ విల్లీ," "అద్భుత మాధుర్యం అదీనమైంది").
   (“There Is a Fountain” by William Cowper, 1731-1800; to the tune of
      “Ortonville,” “Majestic Sweetness Sits Enthroned”).

అద్భుత సిలువను పరిశీలిస్తే
   దానిపై మహిమ రాజు చనిపోయాడు,
నా గొప్ప భాగ్యాన్ని నష్టంగా లెక్కిస్తాను,
   నా గర్వాన్ని వదులుకుంటాను.

ఆయన తల, చేతులు, కాళ్ళు, చూడు,
   విషాదము ప్రేమ మిళితమై ప్రవహిస్తుంది;
ఎప్పుడైనా అలా ప్రేమ విషాదాలు కలిసాయా,
   ముళ్ళు గొప్ప కిరీటాన్ని చేసాయి?
("అద్భుత సిలువను పరిశీలిస్తే" డాక్టర్ ఐజాక్ వాట్స్ చే, 1674-1748).
(“When I Survey the Wondrous Cross” by Dr. Isaac Watts, 1674-1748).

అపార్ధం చేసుకోకుండా, నేను భావిస్తాను ఇక్కడ ప్రజారక్షణ పెంతేకోస్తులు తప్పిపోయారు. పరిశుద్దాత్మపై దృష్టి సారించాలను కున్నారు. సిలువపై యేసు మరణము అంత ప్రాముఖ్యము కాదు. వారు స్వస్థతలు, భాషలలో మాటలాడడం, సూచనలు అద్భుతాలతో ఉత్తేజితులయ్యారు. వారు ఎంత ప్రతి ఘటించినా, వారు సిలువపై ప్రత్యామ్నాయంగా యేసు మరణాన్ని ముఖ్య విషయంగా తీసుకోరు! పాప ఒప్పుకోలు, క్రీస్తు రక్తము ద్వారా క్షమాపణ కేంద్రము కాదు. నేను తప్పక చెప్పాలి మనం సువార్తికులం ప్రాధమికులం గొప్పేమీ కాదు! మనము బైబిలును వచనము వెంబడి వచనము బోధించడంలో బిజీగా ఉంటాం నశించు వారికి క్రైస్తవులన బడే వారికి మన సంఘాలలో. ఇక్కడ మనమందరం తప్పిపోతున్నాము. క్రైస్తవ సువార్త కేంద్ర బిందువు యేసు క్రీస్తు ఆయన సిలువ వేయబడడం. గొప్ప బోధకుడు క్రైస్తవ్యములో ఇప్పటి వరకు లేని వాడు ఇలా అన్నారు,

"నేను యేసు క్రీస్తును అనగా, సిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప, మరి దేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకొంటిని" (I కొరిందీయులకు 2:2).

స్త్రీ పురుషులు ఇలా చెప్పితే మన కెప్పుడు ఉజ్జీవము ఉండదు, "అప్పుడు నేను యేసు నొద్దకు వచ్చాను." దేవుడు మనకు సహాయం చెయ్యాలి! మీరు అంతే చెప్పితే దేవుని గొర్రె పిల్లను గూర్చి హింసింపబడి నీకై సిలువ వేయబడినది, నేననుకుంటాను మీరు యెహోవా సాక్షుల వలే లేక ముస్లీం వలే గ్రుడ్డివారు! వారు, కూడా, యేసును గూర్చి మాట్లాడుతారు! రక్తం ఎక్కడుంది? పోల్చలేని ప్రేమ ఎక్కడుంది ఆ ప్రేమ ఆయనను మహాకాశముల నుండి దింపి, ఉమ్మి వేయబడి, సిలువకు మేకులు వేయించింది?

కొన్ని సార్లు నేననుకుంటాను నేను మిమ్మల్ని విఫలులను చేసానని. ఏదోలా నేను మీకు బోధించలేదు యేసును ప్రేమించాలని ఆయనను గూర్చి కొంత మాట్లాడి. ఏదోలా మీరు యేసును ప్రేమించేలా చెయ్యలేను. నేను మిమ్ములను నిజంగా అనుభూతి పొందేలా చెయ్యలేను, ఇలా చెప్పే విధంగా,

నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎందుకంటే నీవు నన్ను మొదట ప్రేమించావు కాబట్టి,
కల్వరి వృక్షముపై నా క్షమాపణ కొన్నావు;
నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీ నుదుటపై ముళ్ళ మకుటం పెట్టుకున్నందుకు,
నేను నిన్ను ప్రేమిస్తున్ననంటే, నా యేసూ, ఇప్పుడే.
("నా యేసూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను" విలియం ఫెదర్ స్టోన్ చే, 1842-1878).
            (“My Jesus, I Love Thee” by William Featherstone, 1842-1878).

ఓ, ప్రియ స్నేహితులారా, మనం కలిసి వచ్చే శనివారం 5 వరకు ఉపవసించి ప్రార్దిద్దాం. మనం కలిసి ఉపవాసం ఉండి ప్రార్దిద్దాం పరిశుద్దాత్మ రెండు పనులు చేసేటట్టు – పాపపు ఒప్పుకోలు, పాపాలను ఆయన దగ్గరకు నడిపిస్తూ ఆయనను మహిమ పరచడం, ఆయన రక్తములో కడిగినందుకు. ఆమెన్.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ఫ్రుథోమ్: యోహాను 16:7-14.
ప్రసంగము ముందు పాట బెంజిమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్:
"ప్రవాహము ఉంది" (విలియం కౌపర్ చే, 1731-1800; రాగము "ఓర్టాన్ విల్లే," "అద్భుత మాధుర్యము ఆశీనమైనది").
“There Is a Fountain” (by William Cowper, 1731-1800; to the tune of “Ortonville,” “Majestic Sweetness Sits Enthroned”).


ద అవుట్ లైన్ ఆఫ్

OUTLINE