Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
ఒంటరి తనము యొక్క అనుభవము!

THE EXPERIENCE OF LONELINESS!
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము ఉదయము, ఆగష్టు 17, 2014
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Morning, August 17, 2014

"నా కుడి ప్రక్కకు నిదానించి చూడుము, నన్నెరిగిన వాడు ఒకడును లేడు, నాకు లేకపోయెను: ఆశ్రయమేదియు నాకు దొరక లేదు; నా యెడల జాలి పడువాడు ఒకడును లేడు" (కీర్తనలు 142:4).


రాజైన సౌలు పాపము చేసి దేవునిచే తిరస్కరింపబడ్డాడు. ప్రవక్తయైన సమూయేలు దావీదును కొత్త రాజుగా అభిషేకించాడు. సౌలు దావీదు విషయంలో అసూయ పడి దెయ్యము పట్టిన వాడయ్యాడు. పిచ్చికోపంతో, రాజైన సౌలు దావీదు పై ఈటె విసిరాడు, కాని గురి తప్పింది. దావీదు ప్రాణ రక్షణ కొరకు పరిగెత్తాడు. దావీదు అడవిలో గుహలో దాక్కున్నాడు. భయంలో ఆకలితో ఒంటరిగా ఉన్నాడు. "కీర్తనలు 142" లోని, స్పూర్తి మాటలు చూడండి, "మస్భిల్ [లేక భోధించుట] దావీదుచే; గుహలో ఆయన ప్రార్ధన." స్పూర్తి నిచ్చే పాఠ్యభాగములోని మాటలివి, తరువాత కలుపుబడలేదు. మనకు తెలుసు దావీదు పూర్తిగా తొందరపడి, భయపడి, ఒంటరిగా ఉన్నాడు – దెయ్యము పట్టిన రాజుకు భయపడి గుహలో దాక్కున్నాడు. దావీదుతో ఎవరు లేరు సౌలు రాజుకు భయపడి. దావీదు అన్నాడు,

"నా యెడల జాలిపడువాడు ఒకడును లేడు" \ (కీర్తనలు 142:4).

ఎవరు ఆయనను పట్టించుకోలేదు. ఆయన ఒంటరిగా ఉన్నాడు. కాని తనకు దేవుడు ఉన్నాడు, అది చాల ఎక్కువ కాని అది ఈనాటి యువకులకు లేదు.

నేను క్రైస్తవ కళాశాలలో వెళ్ళలేదు. నేను ఎల్.ఎ. కాల్ స్టేట్ నుండి పట్టభద్రుడనయ్యాను కొన్ని విధాలుగా నేను లౌకిక కళాశాలలో చదివినందుకు ఆనందిస్తున్నాను. యవనస్థులు ఏమి నేర్చుకుంటారో, ఏమి ఆలోచిస్తారో నాకు తద్వారా తెలిసింది. నేను ఆధునిక సాహిత్యము చదివాను. చాల మంది ఆధునిక రచయితలు నాస్తికులు ఉనికిదారులు. వారు ఆధునిక ప్రపంచములోని జీవిత పరాయికరణ ఒంటరి తనము గూర్చి మాట్లాడారు.

హెచ్. జి. వెల్స్ కాలము యంత్రము మరియు చరిత్ర సమీక్ష పుస్తకపు రచయిత. ఆయన అన్నాడు, "నేను అరవై ఐదు సంవత్సరాల వాడిని, నేను ఒంటరి వాడిని శాంతిని కనుగోలేదు." పులిస్టర్ బహుమతి గ్రహిత ఎర్నెస్ట్ హెమింగ్ వే అన్నాడు, "నేను శూన్యంలో ఉన్నాను అది ఎంత ఏకాంతమంటే రేడియో బ్యాటరీలు అయిపోయాక పెట్టడానికి కరెంట్ ప్లగ్ లేని స్థితి." ఆయన నాటకంలో, రాత్రిలోనికి దీర్ఘ దిన ప్రయాణము, యూజెన్ ఓ నీల్ అన్నాడు, "జీవితం ఒకే ఒక అర్ధము మరణము." నాటిక శీర్షిక మనిషి ఉనికి పర ఒంటరితనము. జె. డి. సాలింగర్ జీవనాన్ని సాగించాడు చిన్న కథలు నవలలు వ్రాయడం ద్వారా మన సంస్కృతి లోని పరాయికరణ యువకుల ఒంటరితనమును గూర్చి.

హెచ్. జి. వెల్స్ ఒంటరి నిరీక్షణ లేని, వృద్ధునిగా చనిపోయాడు. ఎర్నెస్ట్ హెమింగ్ వే తలపై తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నీల్స్ నవలలోని ముఖ్య పాత్ర నిస్పృహలో మత్తు పదార్ధాలతో, ఒంటరి తనమును బాగు చేసుకోవాలనుకున్న స్త్రీది. జె. డి. సాలింగర్ యువకులు లేక ఒంటరి వారు అయ్యాడు, యాబై సంవత్సరాలు ఏకాంతంలో జీవించాడు.

ఒంటరి తనము ఈ రోజుల్లో యువనులలో ప్రధాన సమస్య. గ్రీన్ డేస్ పాట, "చెదిరిన కళల బాట," చెప్తుంది స్కూలు కాలేజి వయసు యువకులు ఎలా అనుకుంటారో, "నేను ఒంటరిగా నడుస్తున్నాను. నేను ఒంటరిగా నడుస్తున్నాను. నేను ఒంటరిగా నడుస్తున్నాను." అవును, నాకు గుర్తుంది యవనునిగా నాకెలా అనిపించిందో. గుంపులో కూడ ఒంటరిగా అనిపించవచ్చు. ఒక వెబ్ సైట్ చెప్తుంది "ఒంటరి తనము వెలితి అనుభూతి నీలోని నిశ్శబ్దత. ప్రపంచం నుండి విసిరి వేయబడినట్టుగా వేరు పరచ బడినట్టుగా అనిపిస్తుంది, కావలసిన వారితో సంబంధాలు తెగిపోతాయి" (http://www.counseling.ufl.edu/cwc/how-to-deal-with-loneliness.aspx). అలా దావీదు అనుకున్నాడు, గుడిలో దాగుకొని, ఇలా అన్నాడు,

"నా యెడల జాలిపడువాడు ఒకడును లేడు" (కీర్తనలు 142:4).

మన రోజులలో చాల మంది యువకులు అలా అనుకుంటారు. అందుకే నేను మూడు తలంపులు ఇస్తున్నాను ఈ ఉదయాన ఒంటరి తనముతో సర్దుకు పోవాలని నా ప్రార్ధన.

I. మొదటిది, చాల రకాల ఒంటరి తనాలు ఉన్నాయి.

వెబ్ సైట్ చెప్తుంది,

చాల రకాల వివిధ పరిమాణాల ఒంటరి తనాలు ఉన్నాయి. ఒంటరి తనాన్ని ఒక అనిశ్చిత భావనగా సరికాని, వెలితిగా నీవు అనుభవించవచ్చు. లేక ఒంటరితనాన్ని తీవ్ర ఒత్తిడిగా లోతైన భాధగా అనిపించవచ్చు. ఒక రకమైన ఒంటరితనము చనిపోయిన కారణంగా ఒక నిర్దిష్ట వ్యక్తిని కోల్పోవడం లేక వారు దూరంగా ఉండడం. ఇంకొక రకము ఏకాంత భావన ప్రజలతో శారీరకంగా వాస్తవంగా సంబంధాలు కోల్పోవడం, అంటే ఎప్పుడు [సంభవిస్తుందంటే] రాత్రి వేళలలో పని చేస్తున్నప్పుడు లేక ప్రజలు లోపలి వెళ్ళలేని భవనములో దూరముగా ఉన్నప్పుడు. నీవు భావోద్రేకంగా [ఒంటరిగా] ఉంటావు చుట్టూ ప్రజలు ఉంటారు కాని వారిని చేరుకోలేవు (ఐబిఐడి.).

చాల మనస్తత్వ అధ్యయనాల ప్రకారము, కాలేజీ విద్యార్ధులు ప్రత్యేకంగా ఒంటరితనానికి లోనవుతూ ఉంటారు. శాశ్వత సంబంధాలలోనికి ప్రజలను విద్యాలయము తీసుకొనిరాదు. విశ్వ విద్యాలయము కాని కాలేజి కాని హాజరయ్యే యువకులు అనుకుంటారు ప్రపంచమంతా వారిని దాటి వెళ్లి పోతుందని, ఎవ్వరు వారిని అర్ధం చేసుకోరని పట్టించుకోరని. వారి దగ్గరకు ఎవ్వరు రారని.

గమనింపదగిన విషయము నాగరికత ఏదైతే వాహనాలు, విమానాలు, టెలివిజన్, అంతరిక్ష ప్రయాణము సృష్టించిందో ఒంటరి తనాన్ని తప్పించుకోడానికి దేనిని తయారు చెయ్యలేదు! మీ తల్లిదండ్రులు అలసిపోయి ఆఫీసు నుండి వచ్చి టివి ముందు కూర్చుంటారు. మీతో మాట్లాడడానికి గాని, వినడానికి గాని వారికి సమయముండదు. మీలో చాల మంది విడిపోయిన కుటుంభాల నుండి వచ్చారు. విడువబడిన పిల్లలు ప్రత్యేక ఒంటరితన నరకాన్ని అనుభవిస్తారు. నాతో మాట్లాడిన ప్రతి యవనస్థుడు అలానే అనుకుంటూ ఉన్నాడు.

ఒక అమ్మాయి చెప్పింది, "నేను భయంకరంగా ఒంటరి తనములో ఉన్నాను. నా పొరుగువారు నాతో మాట్లాడరు." ఒక యవనస్థుడు అన్నాడు, "నేను స్నేహితులను చేసుకోలేక పోతున్నాను, నేను స్నేహితులను కొనేవారు నన్ను వదిలేస్తున్నారు." నీవెప్పుడైనా అలా అనుకున్నావా? దావీదు అలానే అనుకున్నాడు ఆ గుహలో దాగుకున్నప్పుడు. ఆయన అన్నాడు,

"నా యెడల జాలిపడువాడు ఒకడును లేడు" (కీర్తనలు 142:4).

నేను నమ్ముతాను ఒంటరితనం కారణంగా చాల మంది యవనస్థులు ఈనాడు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీకు తెలుసా ఆత్మహత్య చావులు పొందేవారు 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉన్నారని? అమెరికాలో, రాత్రి మరియు పగలు, రెండు గంటల ఆరు నిమిషాలకు ఒక యవనస్థుడు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఏ మనస్తత్వవేత్త అయినా చెప్తాడు చనిపోవడానికి ముఖ్య కారణము ఒంటరితనము. దేవుడు సరిగ్గా చెప్పాడు ఇలా అన్నప్పుడు,

"నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు" (ఆదికాండము 2:18).

II. రెండవది, నీ ఒంటరితనానికి నీవు సహకరించవచ్చు.

అది సరియే, నీ ఒంటరితనానికి నీవే పూర్తిగా బాధ్యుడవు కావచ్చు. ఒంటరి తనముపై వెబ్ సైట్ సరిగ్గా చెప్పింది,

ఒంటరి తనము నిర్జీవ స్థితి. అంటే, మన నిర్జీవ స్పందన దానిని మార్చడానికి ఏమీ చెయ్యకపోవడం. మనం అనుకుంటాం, అదిపోతుందని, [కాని] మనం ఏమి చెయ్యం అందులోనే చుట్టబడిపోతాం. ఆశ్చర్యంగా, కొన్నిసార్లు ఆ భావనను కౌగిలించుకుంటాం. అయినా, ఒంటరితనాన్ని కౌగిలించుకోవడం ఆ భావనలో మునిగి పోవడం సాధరణంగా నిస్పృహ లోనికి నిస్సహాయత లోనికి తీసుకెళ్తుంది, తిరిగి, అది, ఇంకా నిశ్చల స్థితికి ఇంకా ఎక్కువ నిస్పృహకు దారి తీస్తుంది [ఇంకా ఎక్కువ ఒంటరితనము] (ఐబిఐడి.).

"ఒంటరితనము నిశ్చల స్థితి. అంటే, కొనసాగింపనివ్వడం ద్వారా అది ఉంటుంది." అది సరిగ్గా సరియే. అంటే ఒంటరి తనాన్ని కొనసాగిస్తుంటారు పరిస్థితిని మార్చడానికి ఏమీ చెయ్యకుండా!

కొంతకాలం క్రితం యాకోబు ఒంటరితనాన్ని గూర్చి ఆదికాండము 32:24 నుండి ప్రసంగము చేసాను. ప్రసంగము మధ్యలో ఒక యువకుడు గుడిలోనికి బయటకి పారి పోయాడు. ఒంటరితనానికి విడుగుడుగా సంఘము ఏమి చేస్తుందో చెప్తుంటే వినకుండా పారిపోయాడు. పారిపోవడం ద్వారా ఒంటరి తనాన్ని జయించలేవు! అదే కయీను కనుగొన్నాడు. దేవుడు ఆయనతో అన్నాడు,

"నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందువు అనెను" (ఆదికాండము 4:12).

గుడిలోనుండి పారిపోయే వారు దిమ్మరి వారు, ఒంటరి వారై ఉంటారు, కయీను వలే! బైబిలు చెప్తుంది,

"అయ్యో వారికీ శ్రమ! వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి" (యూదా 11).

జీవితమంతా కయీను వలే ఒంటరిగా తిరుగుట, భయంకరము – ఈనాడు చాల మంది యవనస్థుల వలే!

అందుకే అంటాం, "ఎందుకు ఒంటరిగా? ఇంటికి రండి – గుడికి! ఎందుకు నశించి పోవడం? ఇంటికి రండి – దేవుని కుమారుడైన, యేసు నొద్దకు!" దేవుడు అన్నాడు,

"నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు" (ఆదికాండము 2:18).

అందుకే దేవుడు ఆదాముకు హవ్వను భార్యగా ఇచ్చాడు. ఆదాము భార్య సంఘము చిత్రము ద స్కోఫీల్డ్ స్టడీ బైబిలు ప్రకారము. ఆదికాండము 2:23 చెప్తుంది,

హవ్వ, సంఘము మాదిరి క్రీస్తు వధువుగా (గమనిక ఆదికాండము 2:23).

అంటే ఆదాము భార్య ఒక ఉదాహరణ, ఒక చిత్ర పటము, స్థానిక సంఘానికి. దేవుడు అన్నాడు,

"నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు; ఒక సహాయకారిని చేస్తాను [సాటియైన సహాయము] ఆయన కొరకు" (ఆదికాండము 2:18).

దేవుడు ఆదాముకు సహధర్మ చారిణి సహాయకుని ఇచ్చాడు. ఆమె ఒక చిత్ర పటము, ఒక ఉదాహరణము, స్థానిక సంఘానికి "మాదిరి" దేవుడు ఆదాముకు హవ్వను ఇచ్చాడు. అతని ఒంటరితనాన్ని భాగు చెయ్యడానికి, దేవుడు ఈ సంఘాన్ని ఇచ్చాడు మీ ఒంటరి తనాన్ని బాగు చెయ్యడానికి! ఈ సంఘము ఇక్కడ ఉంది మీ ఒంటరి తనాన్ని స్వస్థ పరచడానికి!

"నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు; ఒక సహాయకారిని చేస్తాను ఆయన కొరకు" (ఆదికాండము 2:18).

"సహాయకురాలు" దేవుడు నీ ఒంటరితనానికి మందుగా ఇచ్చినది సంఘము! మేము ఇక్కడ ఉన్నాం మీ ఒంటరితనం జయించడానికి సహాయము చెయ్యడానికి! నాకు తెలుసు చాల సంఘాలు మీ సహాయ పడలేవు. నేను వాటిని గూర్చి మాట్లాడడం లేదు. సంఘాన్ని గూర్చి మాట్లాడుతున్నాను. ఇది యువ కేంద్ర సంఘము. మీకు సహాయ పడడానికి మేము ఉన్నాం!

గుడికి దూరంగా ఉండి ఒంటరి తనానికి మీరే బాధ్యులు కావద్దు! వచ్చే ఆదివారం మళ్ళీ రండి! శనివారం రాత్రి కూడ రండి! వీలయితే ఈ రాత్రి కూడ రండి! వారంలో చాల రాత్రులు యువకుల కోసం ఇవ్వడానికి మా దగ్గర ఉంది. ఎందుకు ఒంటరిగా ఉండడం? ఇంటికి రండి గుడికి!

III. కాని, మూడవదిగా, నీకు లోతైన ఒంటరితనము ఉంది.

ఆ ఒంటరి తనాన్ని గూర్చి హెమింగ్ వే చెప్తూ ఇలా అన్నాడు,

నేను ఒక శూన్యములో ఉన్నాను రేడియో ట్యూబ్ కు బ్యాటరీలు అయిపోయినప్పుడు ప్లగ్ పెట్టడానికి కరెంటు లేని స్థితి.

మన యవనస్థుడొకడు చెప్పాడు కాలేజి క్లాసు కొరకు హెమింగ్ వే కథ ఒకటి చదువుతున్నాడట. దాని పేరు, "పరిశుభ్ర, మంచి వెలుతురు స్థలము." అది మనిషి ఉనికిపర ఒంటరితనానికి సంబంధించినది. హెమింగ్ వే కు అది అంతా తెలుసు. దేవుని కొరకు సర్వ విశ్వ ఒంటరి తనము కలిగి యున్నాడు, ఆయన ఎన్నడు జయించలేదు. అతను ఎప్పుడూ అధిగమించలేడు. కొన్ని సంవత్సరాల తరువాత తనకు తానే చంపుకున్నాడు. వేదాంతి ఫ్రెడరిక్ నీట్ జేసే అన్నాడు, "దేవుడు చనిపోయాడు." ఆయన నాస్తికుడు అయ్యాడు. కొన్ని సంవత్సరాల తరువాత పిచ్చివాడయ్యాడు. దేవుడు లేని ప్రపంచంలో జీవించ లేకపోయాడు, అర్ధము, క్షమాపణ నిరీక్షణ లేకుండా.

చూసారా, ఈ గుడికి రావడు, ప్రతివారము రావడం, స్నేహితుల కొరకు మీ ఒంటరితనానికి విరుగుడు ఇస్తుంది. దేవుడి కొరకు మీ ఏకాంతము సంగతేంటి? ఇరవై ఒకటవ శతాబ్దపు విషాదం ఏమిటంటే చాల మంది యవనస్థులకు దేవుడు ఎవరో తెలియదు. దేవుడు లేకుండా నిరీక్షణ లేదు!

అవును, మీరు ఇక్కడకు వచ్చి సంఘములో స్నేహితులను చేసుకోవాలని నా ఆశ – దేవుని కూడ విశ్రాంతి దొరికే వరకు. అగస్టిన్ అన్నాడు, "వారి హృదయాలలో ప్రశాంతత కనుగొనే వరకు ఉంటాయి." ఫ్రెంచి వేదాంతి బ్లేయిస్ పాస్కల్ అన్నారు "దేవునిచే నిర్మాణిత శూన్యత" మన హృదయాలలో ఉంది. ఆయన ఉద్దేశము మన మానవ హృదయములో ఒక ఖాళీ స్థలముంది అది దేవుడే నింపాలి.

కాని బైబిలు చెప్పింది నీ పాపాన్ని బట్టి దేవుని నుండి పెరికి వేయబడ్డావని. బైబిలు చెప్తుంది,

"మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును నీకు మరుగు చేయుచున్నవి…" (యెషయా 59:2).

పాప కారణంగా దేవునికి నీకు మధ్య ఎడబాటు ఉంది. ఆదాము హవ్వలు పాపం చేసారు కాబట్టి ఏదేను వనము నుండి వెళ్ళగొట్టబడ్డారు. వారి పాపము దేవుని నుండి వారిని వేరు పరచింది.

బైబిలు బోధిస్తుంది మీ పాపాలను బట్టి దేవుడు మీతో కోపంగా ఉన్నాడు. అయినను, ఆయన మిమ్ములను, ప్రేమిస్తున్నాడు. నీ పాపాన్ని బట్టి నీతో కోపంగా ఉన్నాడు, అయినప్పటికీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే సిలువపై మరణించడానికి యేసు క్రీస్తును పంపాడు. నిన్ను దేవునితో సమాధాన పరచడానికి ఆయన సిలువపై మరణించాడు. దేవుడు నీ పాపాన్ని చూసి చూడనట్టు ఒదిలెయ్యడు. ఆయన యేసు క్రీస్తును పంపాడు సిలువపై పాప ప్రాయశ్చిత్తం చెల్లించడానికి, "తానూ నీతి మంతుడును, యేసు నందు విశ్వాసము గల వారిని నీతి మంతునిగా తీర్చు వాడుగా యుండుటకు ఆయన ఆలాగు చేసెను" (రోమా 3:26). కోపపడు దేవుడు సిలువపై క్రీస్తు త్యాగము ద్వారా సమాధాన పరచబడగలడు!

ఏదో హటాత్తుగా యేసు సిలువపై మరణించలేదు. బుద్ధి పూర్వకంగా వెళ్ళాడు. బైబిలు చెప్తుంది, సిలువ వేయబడే సమయము వచ్చినప్పుడు, "యేరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిర పరచుకొనెను" (లూకా 9:51). అప్పుడు యేసు శిష్యులతో అన్నాడు,

"ఇదిగో, యేరూషలేమునకు వెళ్ళుచున్నాను; అక్కడ మనష్యు కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారాయనకు మరణ శిక్ష విధించి ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును, అన్యజనులకు ఆయనను అప్పగింతురు, మూడవ దినమున ఆయన మరల లేచును…" (మత్తయి 20:18-19).

ఆయన ఒక ఉద్దేశంతో వెళ్ళాడు, సిలువపై మరణించడానికి, మన పాప క్షమాపణ నిమిత్తము – ఆయన కార్చిన రక్తముతో కడిగాడు!

గెత్సమనే అంధకారములో భటులు వచ్చి బంధించారు. గొలుసులతో కట్టేశారు, ముఖముపై కొట్టారు, గెడ్డం పీకారు, రోమా గవర్నరు పొంతి పిలాతు దగ్గరకు, ఈడ్చు కెళ్ళారు. చనిపోవునంతగా వీపు మీద బాదారు. ఆయన భుజాలపై సిలువ నుంచి వీధుల గుండా నడిపించారు. సిలువపై కళ్ళకు చేతులకు మేకులు కొట్టారు. క్రీస్తు సిలువ నుండి క్రిందికి చూచి ఇలా అన్నాడు,

"తండ్రీ, వీరేమి చేయుచున్నారో వెరెరుగరు; కనుక వీరిని క్షమించుము" (లూకా 23:24).

"తండ్రీ, వీరిని క్షమించుము!" అని ప్రార్ధించాడు
ఆయన రక్తము వేగముగా ప్రవహిస్తున్నప్పటికిని;
పాపుల కొరకు ప్రార్ధించాడు ఆశ్రమలో కూడా –
యేసు తప్ప ఎవరు అలా ప్రేమించలేదు.
ఆశీర్వాద విమోచకుడు! ప్రశస్త విమోచకుడు!
కల్వరి వృక్షముపై చూస్తున్నాను;
గాయము నొంది రక్తము కార్చుతూ, పాపుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు –
అంధుడై విహీనుడై – నా కొరకు మరణిస్తున్నాడు!
("ఆశీర్వాద విమోచకుడు" ఆవిస్ బర్జెసన్ క్రిష్టియాన్ సెన్, 1895-1985).

యేసు ఆ సిలువపై చనిపోయాడు, ఆయన స్వంత శరీరంలో నీ పాపాలు భరిస్తూ (I పేతురు 2:24). మధ్యాహ్నము అంతటా చీకటి కమ్మింది. ఆయన చనిపోయినప్పుడు, గొప్ప భూకంపము సంభవించింది. ఆలయ అతి పరిశుద్ధ స్థలములో ఉన్న తెర రెండుగా చిరిగింది. క్రీస్తు మరణము సిలువపై మన పాపాలకు ప్రాయశ్చిత్తము చెల్లించింది. ఆయన కార్చిన రక్తము మన పాపాలు కడగడానికి దేవుడున్న చోటుకి మనలను నడిపించింది!

"ఆయన రక్తము వలన, పరిశుద్ధ స్థలము నందు, ప్రవేశించుటకు మనకు దైర్యము కలిగియున్నది" (హెబ్రీయులకు 10:19).

ఆయన కుమారుడు యేసు క్రీస్తు రక్తము ద్వారా పాపాలు కడగబడి, మీరు దేవుని దగ్గరకు రాగలరు. క్రీస్తు రక్తము ద్వారా మీ పాపాలు కడగబడడం ద్వారా దేవునితో మీరు సమాధాన పర్చబడతారు.

ఈ గుడిలో పాలు పంపులుంటే, మీలో కొంత మంది తల్లిదండ్రులు చెప్పి ఉంటారు మీరు మీ సమయాన్ని వ్యర్ధం చేసుకుంటున్నారని. ఎలా చదవాలో ప్రతి ఆరాధనలో ఎలా గ్రేడులు సంపాదించాలో చెప్తాను. మంచి శ్రేణులు వచ్చేలా బోధిస్తాను. కొంతమంది తల్లిదండ్రులు చెప్తారు ఇంటిలో ఉండి చదవాలని, తద్వారా పట్టభధ్రులై ఎక్కువ డబ్బు సంపాదించ వచ్చునని.

రోబిన్ విలియమ్స్ సంగతేంటి, ప్రసిద్ధ అమెరికన్ హాస్యగాడు? అందరికంటే ఎక్కువ డబ్బు సంపాదించాడు మీకు తెలుసా! అంత ఉంది. కాని ఆయనకు గుడిలేదు. దేవుడు లేదు. ఆయనకు ఆయనే చంపుకున్న రెండు రోజుల తరువాత ఆయన భార్య బయలు పరచింది ఆయనకు పార్కిన్ సన్ జబ్బు ప్రబలిందని. ఎదుర్కోలేక పోయాడు. ఉత్తర కాలిఫోర్నియాలోని మెరిన్ కౌంటి ఏరియాలో పెద్ద ఇంటిలో, ఒంటరిగా ఉన్నాడు. బెల్లు మెడ చుట్టూ చుట్టుకొని వ్రేలాడ దీసుకున్నాడు. ఎంత విషాదము! రాబిన్ విలియమ్స్ ను నేను ప్రేమిస్తాను! చాల భాదపడి ఏడ్చాను.

మీ తల్లిదండ్రులకు అది చెప్పండి! చాల డబ్బు సంపాదించవచ్చు, చెడు వార్త వచ్చాక ఏమి జరుగుతుంది, ప్రతి ఒక్కరికి అది సంభవిస్తుంది? రావడానికి క్రైస్తవ స్నేహితులు లేకపోతే ఎలా ఉంటుంది? శ్రమలో సహాయపడడానికి దేవుడు లేకపోతే ఏమి సంభవిస్తుంది?

మీకు గుడి అవసరము అని మీరు గ్రహించడంలో దేవుడు మీకు సహాయము చేయును గాక, మీకు క్రైస్తవ స్నేహితులు అవసరమని, మీ పాపాలు క్షమించడానికి దేవునితో సమాధానపరచడానికి యేసు క్రీస్తు నీకు కావాలని తెలుసుకోవాలి. అందుకే మేముంటాము, "ఎందుకు ఏకాంతం? ఇంటికి రండి – గుడికి రండి! ఎందుకు నశించడం? ఇంటికి రండి – యేసు క్రీస్తు నొద్దకు, దేవుని కుమారుడు!" దేవుడు మీ అందరిని దీవించును గాక! ఆమెన్. డాక్టర్ చాన్, దయచేసి ప్రార్ధనలో నడిపించండి.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ఫ్రుథోమ్: కీర్తనలు 142:1-7.
ప్రసంగము ముందు పాట బెంజిమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్:
"చితికిన కళల బాట" (గ్రీన్ డే చే, 2004)/"రహస్యము లేదు" (స్టువర్ట్ హీమ్ బ్లెన్ చే, 1908-1989).

“Boulevard of Broken Dreams” (by Green Day, 2004)/
“It Is No Secret” (by Stuart Hamblen, 1908-1989).


ద అవుట్ లైన్ ఆఫ్

ఒంటరి తనము యొక్క అనుభవము!

THE EXPERIENCE OF LONELINESS!

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే. by Dr. R. L. Hymers, Jr.

"నా కుడి ప్రక్కకు నిదానించి చూడుము, నన్నెరిగిన వాడు ఒకడును లేడు, నాకు లేకపోయెను: ఆశ్రయమేదియు నాకు దొరక లేదు; నా యెడల జాలి పడువాడు ఒకడును లేడు" (కీర్తనలు 142:4).

I.   మొదటిది, చాల రకాల ఒంటరి తనాలు, ఆదికాండము 2:18.

II.  రెండవది, నీ ఒంటరితనానికి నీవు, ఆదికాండము 4:12; యుదా 11; ఆదికాండము 2:18.

III. మూడవదిగా, నీకు లోతైన ఒంటరితనము ఉంది, యెషయా 59:2; రోమా 3:26; లూకా 9:51; మత్తయి 20:18-19; లూకా 23:34; I పేతురు 2:24; హెబ్రీయులకు 10:19.