Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
ఈ విధమైనది

(ఉజ్జీవముపై మొదటి ప్రసంగము)
THIS KIND
(SERMON NUMBER 1 ON REVIVAL)
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము సాయంత్రము, జూలై 20, 2014
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, July 20, 2014

"ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత, ఆయన శిష్యులు మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళ గొట్టలేక పోతిమని, ఏకాంతమున ఆయనను అడిగిరి? అందుకాయన ప్రార్ధన వలననే గాని, మరి దేనివలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని, వారితో చెప్పెను" (మార్కు 9:28-29).


ఈ రాత్రి నేను దెయ్యములు సాతానుపై ప్రసంగము బోధించ బోతున్నాను, డాక్టర్ జె. ఐ. పేకర్ అన్నాడు "ప్రస్తుతపు సంఘ పతన దుస్థితి," దాని కారణంగా 1859 నుండి అమెరికాలో గొప్ప జాతీయ ఉజ్జీవము లేదు. నేను డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్ ప్రసంగముపై ఆధారపడుతున్నాను – ఆయన 1959 లో లండన్ లోని వెస్ట్ మిన్సిస్టర్ చాపెల్ లో బోధించిన పాఠ్యభాగము. ఆయన ప్రసంగాన ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం లేదు, నా అభిప్రాయాలు కలిపి, మూలాన్ని విషయాన్ని "ద డాక్టర్" నుండి చెప్తున్నాను.

"ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత, ఆయన శిష్యులు మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళ గొట్టలేక పోతిమని, ఏకాంతమున ఆయనను అడిగిరి? అందుకాయన ప్రార్ధన వలననే గాని, మరి దేనివలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని, వారితో చెప్పెను" (మార్కు 9:28-29).

ఈ రెండు వచనాలు ఆలోచించండి. ఈ వచనాలను అన్వయిస్తాను అమెరికా ఇతర పాశ్చాత్య ప్రపంచంలోని "పతనమైన" సంఘాలకు దేవుడు పంపిన ఉజ్జీవ అవసరతకు.

నాకు తెలుసు పదము "ఉజ్జీవము" ప్రజలను మౌన పరుస్తుంది. దాని గూర్చి వినదలుచుకోరు. సాతాను ఇలా అనుకోడానికి కారణము! ప్రజలు ఈ విషయాన్ని గూర్చి ఆలోచించడం సాతాను ఇష్టపడదు. నా ప్రార్ధన మీరు జాగ్రత్తగా వినాలని మన గుడిలోను, ఇతర గుడులలోను దీని అవసరతను గూర్చి చెప్పేటప్పుడు.

ఈ పాఠ్యము ప్రతి ఒక్కరిలో ఆసక్తి రేపాలి. మనం ఈ నాటి సంఘాల స్థితిని గూర్చి పట్టించుకోకపోతే మనం నిరుపేద క్రైస్తవులం. నిజానికి, మీరు నిజ ఉజ్జీవంలో ఆసక్తి లేకపోతే, మీరు నిజ క్రైస్తవులా అని ప్రశ్నించుకోవాలి! మీకు మన గుడి పట్ల, ఇతరుల పట్ల ఆసక్తి లేకపోతే, మీరు నిశ్చయంగా ఉత్సాహ క్రైస్తవులు కారు! మళ్ళీ చెప్తాను, నిజ ఉజ్జీవము మన అందరిలో తీవ్ర ఆసక్తి కలిగించాలి.

మార్కు తొమ్మిదవ అధ్యాయములో ఉన్న సంఘటనను గూర్చి ఆలోచిద్దాం. అది ప్రాముఖ్య సంఘటన, ఎందుకంటే పరిశుద్దాత్మ గొప్ప జాగ్రత్త వహించి నాలుగింటిలో మూడు సువార్తలలో, మత్తయి, మార్కు, లుకాలలో వివరణ ఇచ్చింది. ఇప్పుడే లూకా పాఠ్యాన్ని ప్రుథొమ్ గారు చదివారు, నేను మార్కులో రెండు వచనాలు చదువుతాను. అధ్యాయము ప్రారంభంలో మార్కు చెప్పాడు క్రీస్తు పేతురు, యాకోబు యోహానులను వెంటబెట్టుకొని రూపంతరపు కొండ పైకి వెళ్ళాక వారు అద్భుత సంఘటన తిలకించారు. కాని, కొండ దిగిన తరువాత, గొప్ప గుంపు శిష్యులను చుట్టుముట్టి వారితో వాగ్వివాదము చేస్తున్నారు! యేసుతో దిగిన ముగ్గురికి ఏమీ అర్ధం కాలేదు. గుంపులో నుండి ఒక వ్యక్తి వచ్చి యేసుతో చెప్పాడు దెయ్యము పట్టడం వలన నురుగు కార్చి పండ్లు కొరికే తన కుమారుని గూర్చి చెప్పాడు. ఆ మనష్యుడు అన్నాడు, "[దానిని వెళ్ళ గొట్టమని] నీ శిష్యులను అడిగితిని గాని అది వారి చేత కాలేదు" (మార్కు 9:18). వారు ప్రయత్నించారు, కాని విఫలమయ్యారు.

యేసు ఆ వ్యక్తిని కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఆయన వెంటనే ఆ బాలుని నుండి దెయ్యాన్ని వెళ్ళగొట్టగా, బాలుడు వెంటనే స్వస్థపడ్డాడు. అప్పుడు క్రీస్తు ఇంటిలోనికి వెళ్ళినప్పుడు, శిష్యులు ఆయనతో కూడా వెళ్లారు. ఆయన ఇంటిలో ఉన్నప్పుడు శిష్యులు ఆయనను అడిగారు, "మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళ గొట్టలేక పోతిమి?" (మార్కు 9:28). వారు దానికి చాలా కష్టపడ్డారు. మునుపు చాల సార్లు నెగ్గారు. కాని ఈసారి పూర్తిగా విఫలమయ్యారు. అయినను క్రీస్తు అన్నాడు, "వానిలో నుండి బయటకు రా" వెంటనే బాలుడు స్వస్థపడ్డాడు. వారు అన్నారు, ""మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళ గొట్టలేకపోతిమి?" క్రీస్తు జవాబిచ్చాడు, "ఇలాంటిది ఉపవాస, ప్రార్ధన వలననే జరుగుతుంది" (మార్కు 9:29).

ఈ సంఘటన ఉపయోగిస్తూ ఈనాటి సంఘాల సమస్య మీకు చూపిస్తాను. ఈ బాలుడు ఆధునిక ప్రపంచ యువకులను చూపిస్తున్నాడు. శిష్యులు ఈనాటి మన సంఘాలను సూచిస్తున్నారు. మన సంఘాలు యవనస్థులకు సహాయ పడలేకపోతున్నారు కదా? జార్జి బర్నా అన్నాడు గుడిలో పెరిగిన 88% మన యువకులను, మనము పొగొట్టుకుంటున్నాం. లోకం నుండి, చాలా తక్కువ మంది యువకులను, మనం సంపాదిస్తున్నాం. మన సంఘాలు ఎండిపోయి త్వరగా విఫలమవుతున్నాయి. దక్షిణ బాప్టిస్టులు ప్రతి ఏటా 1,000 సంఘాలు కోల్పోతున్నాయి! వారి సమాఖ్య అది! మన స్వతంత్ర సంఘాలు మెరుగుగా ఏమి చెయ్యడం లేదు. ఈ సంఖ్యలు చూసిన ఎవరైనా చెప్పగలరు వంద సంవత్సరాల క్రితం సంఘ బలములో ఇప్పుడు సగం కూడా లేదు. అందుకే డాక్టర్ జె. ఐ. పేకర్ మాట్లాడాడు "ప్రస్తుతపు సంఘ పతన పరిస్థితిని గూర్చి."

మన సంఘాలు, శిష్యుల వలే, చెయ్య గలిగింది అంతా చేస్తున్నా, విఫలమవుతున్నారు. శిష్యులులానే దారుణంగా విఫలమవుతున్నారు. బాలుని సహాయము విషయంలో మనం అడుగుకొనే ప్రశ్న "మనం ఎందుకు వెళ్ల గొట్టలేము?" ఈ వైపల్యానికి కారణము ఏమిటి?

ఇక్కడ, మార్కు తొమ్మిదవ అధ్యాయములో, నాకనిపిస్తుంది క్రీస్తు అదే ప్రశ్నను సంధిస్తున్నాడు. ఆయన ఇచ్చిన జవాబు అప్పటిలానే ఇప్పుడు ప్రాముఖ్యమే.

"ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత, ఆయన శిష్యులు మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళ గొట్టలేక పోతిమని ఏకాంతమున ఆయనను అడిగిరి? అందుకాయన ప్రార్ధన వలననే గాని, మరి దేనివలన నైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని, వారితో చెప్పెను" (మార్కు 9:28-29).

పాఠ్యభాగమును మూడు సామాన్య విషయాలుగా విడదీయవచ్చును.

I. మొదటి విషయము "ఈ విధమైనది."

ఎందుకు వెళ్ల గొట్టలేక పోయాం? క్రీస్తు అన్నాడు, "ఈ విధమైనది ఉపవాస ప్రార్ధన వలన, మాత్రమే జరుగుతుంది." ఆయన వారికి చెప్పాడు వేరే వేరు సందర్భాలకు తేడా ఉంటుంది. గతంలో క్రీస్తు బోధించడానికి దయ్యాలు వెళ్ల గొట్టడానికి వారిని పంపాడు – వారు వెళ్లి బోధించి చాలా దెయ్యాలు వెళ్ల గొట్టారు. ఆనందంతో తిరిగి వచ్చారు. దెయ్యాలు వారికి లోబడుతున్నాయని చెప్పారు.

ఈ వ్యక్తి తన కుమారుని తెచ్చినప్పుడు వారికి నమ్మకం ఉంది మునపటిలానే ఇప్పుడు అతనికి సహాయపడగలమని. కాని ఇప్పుడు పూర్తిగా విఫలమయ్యారు. ఎంత ప్రయత్నించినా బాలునికి సహాయ పడలేదు, ఎందుకు అని ఆశ్చర్య పోయారు. అప్పుడు క్రీస్తు అన్నాడు, "ఈ విధమైనది." "ఈ విధమైన" దానికి మునుపు మీ పద్దతికి తేడా ఉంది.

ఒక విధంగా, సమస్య ఎప్పుడు ఒక్కటే. సంఘము పని సాతాను దెయ్యాల శక్తి నుండి యువకులను విడిపించడం, "చీకటి నుండి వెలుగులోనికి, సాతాను శక్తి నుండి దేవునిలోనికి" (అపోస్తలుల కార్యములు 26:18). అది ప్రతి తరములో, సంస్కృతిలో ఒకటే. సంఘాలు సాతానుతోను దెయ్యలతోను పోరాడాలి. కాని దెయ్యాలలో తేడా ఉంది. ఎప్పుడు ఒకటేలా ఉండవు. అపోస్తలుడైన పౌలు అన్నాడు "మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాధులతోను, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోను పోరాడుచున్నాము" (ఎఫెస్సీయులకు 6:12). ఆయన చెప్పాడు వివిధ రకాల దెయ్యాలు ఉంటాయని, వారి నాయకుడు సాతాను, "వాయు మండల సంబంధమైన అధిపతిని, అవిదేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి" (ఎఫెస్సీయులకు 2:2). సాతాను పూర్తి శక్తితో ఉన్నాడు. అతని క్రింద దుష్ట శక్తులున్నాయి. శిష్యులు బలహీన దెయ్యాలను సులభంగా వెళ్ల గొట్టారు. కాని ఇక్కడ, ఆ బాలుని, అధిక శక్తి ఆత్మ ఉంది. "ఈ విధమైనది" వేరు పెద్ద సమస్య, మొదట మనం కనుగోవాలి. "ఈ విధమైనది" ఏంటి దానిని ఎదుర్కోవాలి.

"ఈ విధమైనది" మాటలు చూస్తుంటే ఈ నాటి చాల మంది కాపరులు ఆత్మీయ యుద్ధములో వారున్నారు అని గ్రహిస్తున్నారో లేవో. నాకు భాగా తెలుసు చాలా మంది కాపరులు అనుకోరు సాతాను దుష్ట శక్తులతో యుద్ధం చెయ్యడమే వారి పని అని. సెమినెరీలు, బైబిలు కళాశాలలు, మనవ పద్ధతులపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. కాని వారు బోధకులకు నేర్పరు వారి ప్రధాన సమస్య ఆత్మీయ పోరాటములో ఉందని.

కనుక గతంలో విజయవంతమైన కొన్ని పద్ధతులు వాడారు. వారు గ్రహించరు పాత పద్దతులు నేటి "ఈ విధమైన" పరిస్థితికి సరిపడవని. ప్రతి ఒక్కరికి తెలుసు అవసరత ఉందని. కాని ప్రశ్న ఏంటంటే – అస్సలు అవసరము ఏమిటి? అస్సలు అవసరత తెలుసుకోకుండా, బాలుని విషయంలో శిష్యుల వలే పరాజితులమవుతాము.

II. రెండవ విషయము విఫలమైన పద్ధతులు.

మన సంఘాలలో గతంలో ఉపయోగపడే విషయాలు చూసాను, కాని "ఈ విధమైనది" పై ప్రభావము చూపడం లేదు. పాత పద్ధతులపై ఆధారపడి, మన యవనులందరిని పోగొట్టుకుంటున్నాం, లోకము నుండి ఎవ్వరిని మార్చడం లేదు. అపార్ధం చేసుకొనే ప్రమాదం లేకుండా, సబ్బాతు బడిన ఆ కోవలో చేర్చుతాను. నూట ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అది ప్రయోజనకరంగా ఉంది. ఈనాడు ఎక్కువ విలువ లేదు. రక్షణ కర పత్రాలు విషయం అంతే. ఒకప్పుడు ప్రజలు వాటిని చదివి గుడికి వచ్చారు. నేను మామూలుగా కాపరిని అడుగుతాను, "మీ గుడిలో ఎవరైనా యవనస్థులు కరపత్రము చదివి రక్షింపబడి గుడికి వచ్చిన వాళ్ళున్నారా?" "ఈ విధమైనది" గతంలో ఉపయోగించిన పద్ధతులకు సరిపోదు. నేను ఇంటింటికి వెళ్ళడం కూడా ఆ కోవలో చేరుస్తాను. గతంలో శక్తివంతంగా ఉపయోగింపబడింది, కాని ఇప్పుడు యవనస్థులను గుడికి ప్రస్తుతము "ఈ విధమైనది" ఉపయోగించకుండా.

కొన్ని నిరుపయోగమైనవి ఉన్నాయి, "ఈ విధమైనది" దానికి అన్వయించినప్పుడు. ఇంకొక మాటలలో, క్రీస్తు చెప్తున్నాడు, "మీరు విఫలులయ్యారు, ఎందుకంటే ఇతర విషయాలలో మీకున్న శక్తికి, ఇక్కడ విలువ లేదు. మిమ్ములను శక్తి హీనులను చేసింది "ఈ విధమైనది."

నాకు తెలుసు కాపరులు గ్రహించారు గతంలో మనం చేసినవి ఇప్పుడు నిరుపయోగము. పద్ధతులు నేర్చుకోవడంలో తర్పిదు పొందారు సాతాను "కుతంత్రాలు" బదులు (II కొరిందీయులకు 2:11) – పాత వాటికంటే మంచివి కాని కొత్త పద్ధతులు వైపు మొగ్గు చూపుతారు – అంటే, యవనస్థులను సంఘములో బలమైన సభ్యులుగా చేర్చుకోవడం విషయంలో. ఉదాహరణకు కొంతమంది చెప్తారు యవనస్థులకు ఆదికాండములో ఉన్న సృష్టి వివరణ నిజమని "నిరూపించాలి" శాస్త్రము అబద్ధమని చెప్పాలి. వాళ్ళు అనుకుంటారు యవనస్థులు మార్చబడతారు, ఇతరులు లోకము నుండి వస్తారని, శాస్త్రము తప్పని చెప్పి ఆదికాండము నుండి జవాబులు కనుగొంటే. ఈ పద్దతి ద్వారా ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కోవచ్చని వారు అనుకుంటారు.

డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు, "పద్దెనిమిదవ శతాబ్దపు ఆరంభంలో అంతే, [ధర్మ శాస్త్రము] పై ప్రజలు విశ్వాసాన్ని ఉంచినప్పుడు. ఇవి, వారు నేర్పించారు, క్రైస్తవత్వ సత్యాన్ని వారు చూపించేటప్పుడు, కాని వారు అలా చెయ్యలేదు. ‘ఈ విధమైనది’ ఆ పద్ధతిలో రాదు."

ఇంకొక పద్ధతుంది విఫలమైంది ఆధునిక అనువాదాలు. కింగ్ జేమ్స్ బైబిలు యవనస్థులకు అర్ధం కాదని మేము విన్నాం. ఆధునిక భాషలో బైబిలు అవసరము. యవనులు చదువుతారు. అప్పుడు వాళ్ళంటారు, "ఇది క్రైస్తవ్యము" – వాళ్ళు మన సంఘలలోనికి వస్తారు. కాని అది జరుగలేదు. నిజానికి, దానికి వ్యతిరేకంగా జరిగింది. 55 సంవత్సరాలు పూర్తిగా యవనస్థుల కొరకు పని చేస్తున్నాను. ఈ ఆధునిక అనువాదాలు యవనస్థులను ఏ మాత్రమూ ఆకర్షింపలేవని నాకు తెలుసు. వాస్తవానికి, వారు ఇలా అనడం నేను విన్నాను, "అది నిజం అనిపించడం లేదు. బైబిలుగా అనిపించడం లేదు."

ఆధునిక అనువాదము నుండి ఎప్పుడు బోధించలేదు, బోధించను కూడ. అన్ని సమయాలలో యవనస్థులు మారడం మనం చూస్తున్నాం, మన సంఘాలలో, ప్రపంచంలో కూడ. ఈ ఆధునిక అనువాదాలకు ఎంత విలువ ఉన్నా, సమస్యను పరిష్కరించ లేవు. "ఈ విధమైన" దానితో పని చెయ్యడం లేదు.

ఇంకేమి ప్రయత్నిస్తున్నారు? ఓ, పెద్దది ఏమంటే ఆధునిక సంగీతం! "సంగీతము బాగుంటే వారు లోపలికి వచ్చి క్రైస్తవులవుతారు." ఇది చాలా విచారము. దీని మీద నిజంగా వ్యాఖ్యానించాలా? ఒక బాప్టిస్టు దక్షిణ సంఘము లాస్ ఎంజిలాస్ లో అద్దెకు కలుస్తారు. పాస్టరు టి షర్ట్ వేసుకొని బల్ల మీద కూర్చుంటాడు. కొన్ని మాటలు చెప్పేముందు, గంట సేపు రాక్ సంగీతం ఉంటుంది. మాలో ఒకరు చూడ్డానికి వెళ్లారు. ఆయన ఆశ్చర్య పోయాడు. ఆయన అన్నాడు ఆ ఆరాధన చీకటి విషాదంగా ఉండి, ఆత్మీయంగా లేనే లేదని. ఆయన అన్నాడు వారు ఆత్మలు సంపాదింప లేరని, మన యవనులు చేస్తున్నట్టుగా వారానికి గంట కూడ వారు ప్రార్ధించ లేరని. గంట ప్రార్ధన అంతే? మర్చిపోండి! కనుక, ఆధునిక సంగీతం "ఈ విధమైన" దానిని వెళ్ల గొట్టడంలో విఫలమైంది.

III. మూడవది మనకు ఒకటి కావాలి అది దుష్ట శక్తి క్రిందకు వెళ్లి, మాయము చేసి వెయ్యాలి, ఒకటి మాత్రమే అది చేయగలుగుతుంది, అది దేవుని శక్తి!

డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు, "మనం గ్రహించాలి ‘ఈ విధమైనది’ ఎంత గొప్ప దైనప్పటికిని, దేవుని శక్తి అత్యధికమైనది, మనకు కావలసింది ఎక్కువ జ్ఞానము కాదు, ఎక్కువ గ్రహింపు కాదు, ఎక్కువ ధర్మ శాస్త్రము కాదు, [కొత్త అనువాదము, రాక్ సంగీతము] – కాదు, మనకు ఒక శక్తి కావాలి మనష్యుల ఆత్మలలోనికి చొచ్చి వారిని విరిచి తగ్గింపును యిచ్చి వారిని నూతన పరచడానికి. అది సజీవుడైన దేవుని శక్తి." అది మనలను తిరిగి పాఠ్యభాగానికి తీసుకెళ్తుంది,

"మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ల గొట్టలేక పోతిమి? అందుకాయన ప్రార్ధన వలననే గాని, మరి దేని వలననైనను, ఈ విధమైనది విడిచిపోదు" (మార్కు 9:28-29).

ప్రార్ధన ఉపవాసము. ఇంకేది మన సంఘాలకు సహాయము చెయ్యదు "ఈ విధమైన" సాతాను దెబ్బను జయించడానికి. మన సంఘాలు యవనులను సమీపించుట లేదు. మనం ఏమి చేసాము? "ఈలాంటిది దేనివలన కాదు, ప్రార్ధన ఉపవాసము వలననే."

లోక రిత్యా "వేత్త" చెప్పవచ్చు, "ప్రాచీన ప్రతులలో ‘ఉపవాసము లేదని.'" కాని ఆ "వేత్తకు" ఏమి తెలుసు దెయ్యాలను గూర్చి? అతనికేమి తెలుసు వీధుల నుండి అన్యులను ఎలా మార్చాలో మన పట్టణ కళాశాల ఆవరణలను ఎలా మార్చాలో? ఉజ్జీవము గూర్చి అతనికేమి తెలుసు – ప్రస్తుతము చైనాలో అనుభవిస్తున్న ఉజ్జీవము గూర్చి? వీటిని గూర్చి అతనికి ఏమి తెలియదు. నా జీవితంలో మూడు సార్లు పాపాన్ని చెదరగొట్టే ఉజ్జీవాన్ని చూసాను. ఈ మూడు ఉజ్జీవాల్లో నేను బోధించడాన్ని బట్టి నేను ఆధిక్యతగా ఎంచుకోనుచున్నాను. అది సువార్త కూటాలు కావు. ఆ సమయాల్లో దేవుని శక్తి మానవ ఆత్మలలో చొచ్చి, వారిని విరిచి, నలుగ గొట్టి, తగ్గింప చేసి, వారిని క్రీస్తు యేసులో నూతన సృష్టిగా చేసింది!

కనుక, ఆ రెండు ప్రాచీన ప్రతులు పాటించం ఏవైతే పదము "ఉపవాసము" ను తొలగించిన వాటిని. మనకు తెలుసు క్రీస్తు అన్నాడు, "మరియు ఉపవాసము" అన్నాడని. మనకు ఎలా తెలుసు? రెండు కారణాలు బట్టి తెలుసు. మొదటిది, శిష్యులు దెయ్యాలు వెళ్ల గొట్టేటప్పుడు ప్రార్ధంచారు. కొంత చేర్చబడాలి. ఇంకా ఏదో కావాలి – ఉపవాసము! ప్రార్ధన మాత్రము సరిపోదు. అనుభవము ద్వారా మనకు తెలుసు. మనం ఉపవసించి మన కళ్ళతో చూసాం దేవుడు ఏమి చెయ్యగలడో మనం ఉపవాస ప్రార్ధనలో మన హృదయాలు క్రుమ్మరించినప్పుడు.

నేను ముగిస్తాను డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్ జోన్స్ చెప్పిన విషయము చెప్పి. ఎలాంటి బోధకుడు! ఏమి గ్రహింపు! ఆయనను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాను. ఆయన ఇలా అన్నాడు,

ఇది ఎప్పుడైనా సంభవించిందో లేదో మనం ఉపవాసము అవసరతను గూర్చి ఆలోచించడం? వాస్తవం ఏంటంటే, ఈ విషయమంతా, మన జీవితాల నుండి తీసివేయబడింది, మన క్రైస్తవ ఆలోచనా పరిధి నుండి తొలగింపబడింది?

అది, ప్రాముఖ్యంగా కారణం, మనం "ఈ విధమైన" దానిని జయించ లేకపోతున్నాము.

వచ్చే ఆదివారం సాయంత్రం 5:00 గంటల వరకు ఉపవాసము ప్రకటింపబోవుచున్నాను. ఆ సమయంలో మనం గుడికి వచ్చి సువార్తకు బయటకు వెళ్ళే ముందు సామాన్య భోజనం తీసుకుంటాం. మనం ఉపవసించి ప్రార్ద్ధిద్దాం యవ్వనుల మార్పు కొరకు వస్తున్నారు, కాని రక్షింప బడలేదు. మన గుడికి ఎక్కువ మంది యవనస్థులు వచ్చేటట్టు ఉపవసించి ప్రార్ద్ధిద్దాం.

క్రీస్తును గూర్చి కొన్ని మాటలు చెప్పకుండా ఈ కూటము ముగించ లేను. మనకు కావలసింది ఆయనలో కనుగొంటాం. హెబ్రీయుల పుస్తకంలో ఇలా చెప్పబడింది,

"దేవుని కృప వలన, ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించునట్లు, దూతల కంటే కొంచెము తక్కువ వానిగా చేయబడిన యేసు మరణము పొందినందున; మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము...కావున ప్రజల పాపములకు పరిహారము కలుగ చేయుటకై, దేవుని సంభందమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తం అన్ని విషయాలలో, ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను" (హెబ్రీయులకు 2:9, 17).

ఆమెన్.

యేసు, దైవ కుమారుడు, పాపుల స్థానములో మరణించాడు, వారికి బదులుగా. మీరు ఆయనకు సమర్పించుకుంటే సిలువపై ఆయన మరణము ద్వారా పాపాలు కొట్టి వేయబడతాయి. రక్షకునిపై నీవు ఆధారపడిన క్షణాన, క్రీస్తు ప్రశస్త రక్తము ద్వారా మీ మీపము దేవుని పుస్తకములో నుండి ఎప్పటికి తుడిచిపెట్టబడుతుంది. మీరు ప్రభువైన యేసు క్రీస్తును నమ్మి ఆయన ద్వారా రక్షింపబడాలని మా ప్రార్ధన. ఆమెన్ మరియు ఆమెన్. మీ పాటల కాగితంలో ఉన్న పాటను దయచేసి లేచి పాడుతాం.

ఉన్నట్టు నేను వచ్చెదన్, ఏమీ చెప్పకుండా,
   నా కొరకై నీ రక్తము చిందింపబడింది,
మీ దగ్గరకు నన్ను రానిచ్చారు,
   ఓ దేవుని గొర్రె పిల్ల, నేను వస్తాను! నేను వస్తాను!
("ఉన్నట్టు నేను వచ్చెదన్" చార్లెస్ ఎల్లోట్ చే, 1789-1871).
(“Just As I Am” by Charlotte Elliott, 1789-1871).

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ఫ్రుథోమ్: లూకా 9:37-45.
ప్రసంగము ముందు పాట బెంజిమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్: "పాత కాలపు శక్తి" (పాల్ రాడర్ చే, 1878-1938)
“Old-Time Power” (by Paul Rader, 1878-1938).


ద అవుట్ లైన్ ఆఫ్

ఈ విధమైనది

(ఉజ్జీవముపై మొదటి ప్రసంగము)
THIS KIND
(SERMON NUMBER 1 ON REVIVAL)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత, ఆయన శిష్యులు మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళ గొట్టలేక పోతిమని, ఏకాంతమున ఆయనను అడిగిరి? అందుకాయన ప్రార్ధన వలననే గాని, మరి దేనివలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని, వారితో చెప్పెను" (మార్కు 9:28-29).

(మార్కు 9:18)

I. మొదటి విషయము "ఈ విధమైనది," అపోస్తలుల కార్యములు 26:18; ఎఫెస్సీయులకు 6:12; 2:2.

II. రెండవ విషయము విఫలమైన పద్ధతులు, II కొరిందీయులకు 2:11.

III. మూడవది మనకు ఒకటి కావాలి అది దుష్ట శక్తి క్రిందకు వెళ్లి, మాయము చేసి వెయ్యాలి, ఒకటి మాత్రమే అది చేయగలుగుతుంది, అది దేవుని శక్తి! హెబ్రీయులకు 2:9, 17.