Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
కావాలి – పోరాడు పురుషులు

(తండ్రుల దినోత్సవ ప్రసంగము)
NEEDED – FIGHTING MEN!
(A FATHER’S DAY SERMON)
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము ఉదయము, జూన్ 8, 2014
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, June 15, 2014

"అయితే కడవరి దినములలో కొందరు, అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు, ఆత్మలయందును దయ్యముల బోధ యందును, లక్ష్యముంచి; విశ్వాస భ్రష్టులగుదురని; ఆత్మ తేటగా చెప్పచున్నాడు" (I తిమోతి 4:1-2).


ఈ రోజు తండ్రుల దినోత్సవము. మంచి తండ్రిగా ఎలా ఉండాలి అనేది నేను భోదింపవలసి ఉంది. కాని ఈ ఉదయము దేవుడు అలా చెయ్యాలని అనుకోవడం లేదు. మంచి తండ్రిగా ఉండడానికి ఏమి చెయ్యాలో చెప్పితే అందులో నుండి మీరు ఎక్కువ పొందుకోలేరు. ఎక్కువ తండ్రుల దినోత్సవ ప్రసంగాలు నీతిని గూర్చి చెప్తాయి. డేవిడ్ ముర్రే ఒక పుస్తకం వ్రాసాడు, ఎందుకు మగవారు గుడికి వెళ్ళడం అసహ్యించు కుంటారు (డేవిడ్ ముర్రే, థామస్ నెల్సన్ పబ్లిషర్స్, 2004). ప్రతి బోధకుడు అది చదివాలి. అలా అసహ్యించుకోడానికి కారణము, ముర్రే ప్రకారము, మంచి వారుగా ఉండాలని, నీతులు చెప్పడం – దాని తాలూకు మాటలు. మగవాళ్ళకు అలాంటి ఉపన్యాసాలు ఇష్టముండవు. బాల్యములో వాళ్ళ తల్లులు అదే చేసారు – దానికి అలవాటు పడ్డారు. అలా తల్లలు చెయ్యడం తప్పు అని నేననడం లేదు. కొడుకులకు తల్లులు అలా బోధించడం సహజము. పెద్ద వాడైనప్పుడు అది నేర్చుకోడు. ఇంకొక వ్యక్తి ఉదాహరణ గైకొనడం ద్వారా మగవాడు నేర్చుకుంటాడు. మగవారు క్రీస్తును వెంబడిస్తే, జీవిత వివరాలలో తప్పు చెయ్యడానికి అంత దూరము వెళ్ళారని నేను కనుగొన్నాను. వారు రక్షింపబడి ఆయనను వెంబడించేలా నేను నిర్దారణ చేసుకుంటాను. ముర్రే అన్నాడు మగవారికి సవాళ్లు కావాలి, సైన్యములో ఉండాలి, సిలువ సైనికునిగా దేవుని కొరకు పోరాడాలి! నేననుకుంటాను ముర్రే సరియే అని! అదే బోధిస్తాను, అందుకే మన గుడి నిండా మగవాళ్ళున్నారు, "మంచి పోరాటము పోరాడి [మరియు] నిత్య జీవము చేపట్టేవారు" (I తిమోతి 6:12). మన సంఘాలలో మగవారికి అలాంటి అవసరత ఎంతైనా ఉంది. మనము యుద్ధములో ఉన్నాము – పోరాడు పురుషులు కావాలి – దేవుని కొరకు పోరాడడంలో భయపడని వారు నశించు నగరంలో మంచి కొరకు పోరాడడంలో, సాతాను ఆధీనంలో ఉన్న – మన దేశములో!

దురదృష్టవశాత్తు మనము యుద్ధ భూమిలో ఉన్నామని చాలా మంది సంఘ సభ్యులకు తెలియదు! వారి శత్రువెవరో వారికి తెలియదు! చాలా మంది కాపరులు వారికి చెప్పారు! అది ఈ ఉదయము నేను చేస్తాను! కొనసాగుదాం! మళ్ళీ పాఠ్య భాగము విందాం,

"అయితే కడవరి దినములలో, కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు, ఆత్మలయందును దయ్యముల బోధ యందును, లక్ష్యముంచి; విశ్వాస భ్రష్టులగుదురని; ఆత్మ తేటగా చెప్పచున్నాడు" (I తిమోతి 4:1-2).

అపోస్తలుడైన పౌలు "కడవరి దినాలను" గూర్చి మాట్లాడుతున్నాడు. నేను నమ్ముతాను ఇది "అంత్య దినములు" ను సూచిస్తాయి, II తిమోతి 3:1 లో చెప్ప బడినట్టు. 55 సంవత్సరాలుగా బైబిలు చదువుతున్నాను, నేను నమ్ముతాను ఆ దినాలలో ఇప్పుడు మనము ఉన్నాము. మనము "కడవరి దినాలలో" జీవిస్తున్నాము. "అంత్య దినాలలో" జీవిస్తున్నాము. క్రీస్తు రెండవ రాకడకు సమీపంగా ఉన్నాము యుగాంతమునకు కూడ. నరకము విచ్చుకొనే కాలములో జీవిస్తున్నాం. సాతాను అనుచరులు వీధులలో నడుస్తూ, ఇళ్ళలోకి చొచ్చి, మన జీవిత విధానాన్ని నాశనము చేస్తున్నాయి.

అమెరికా అధ్యక్షుడు కూడ ఏదో తప్పు జరిగిందని అర్ధం చేసుకున్నాడు. గత బుధవారం ఇంకొక కాల్పు జరిగింది. 15 సంవత్సరాల అబ్బాయి ఆరెగొన్ లో తుపాకితో పాఠశాలకు వెళ్లి కాల్పులు జరిపాడు. ఇంకొక అబ్బాయిని చంపి, ఉపాధ్యాయుని గాయపరిచి, తనను తాను కాల్చుకున్నాడు. అధ్యక్షుడు ఒబామా అన్నాడు,

అలా వారానికి ఒకసారి జరుగుతుంది. తుపాకి హింస పెచ్చురేగి పోతుంది... అమెరికా దేశానికి పిచ్చి వాళ్ళపై పట్టు లేదు... కాని ఒకరినొకరం మూకుమ్మడిగా కాల్చుకుంటున్నాం [చాలా ఎక్కువగా] వేరే ఏ చోట లేనంతగా (Barack Obama, The Los Angeles Times, Wednesday, June 11, 2014).

బహుశా ఒబామా జవాబు తుపాకులు వదిలి పెట్టడం. నేను ఏకీభవించను. మన దేశములో ప్రతి తుపాకిని వదిలి పెట్టవచ్చు, కాని హింస ఉంటూనే ఉంటుంది. కొన్ని వారాల క్రితం ఒక బాలుడు వేట కత్తితో పాఠశాలలో 20 మంది విధ్యార్ధులను గాయపరిచాడు. వారి వేట కత్తులు వదిలేస్తే, వారు బండలతో విరిగిన సీసాలతో చంపుకుంటారు – లేక అగ్నితో కాలుస్తారు గతంలో లాస్ ఎంజిలాస్ లో చేసినట్టు. కయీను తన సహోదరుడైన హేబెలును తుపాకీలు కనుగొనక ముందే చంపాడు!

తుపాకిల కంటే ఎక్కువ ఉంది. నేను నిర్ధారిస్తాను సాతాను తన అనుచరులు ఈ హింస అరాచకము వెనుక ఉన్నాయి. ఇలా దేవుని రక్షణ కోల్పోయి హింస ప్రారంభమైంది. దేవుని సంరక్షణ కోల్పోతున్నాం ఎప్పుడైతే సుప్రీం కోర్టు చెప్పిందో న్యూయార్క్ పాఠశాలలో సామాన్య ప్రార్ధన చెయ్యకూడదు అని. 1962 లో కోర్టు చెప్పింది పిల్లలు ఇలా ప్రార్ధించడం చట్టానికి విరుద్ధమని,

మహా గోప్పదేవా, మీపై ఆధారపడడం మేము గమనిస్తున్నాం, మీ దీవెనలు మాపై ఉండాలని బ్రతిమాలుచున్నాం, మా తల్లి దండ్రులపై, ఉపాధ్యాయులపై మరియు మా దేశముపై,

1963 లో కోర్టు భోజనము ముందు చిన్న పిల్లలు చెప్పే ప్రార్ధనను బహిష్కరించింది,

మధుర పుష్పములకై మా వందనాలు;
తినే ఆహారానికై మా వందనాలు;
పాడే పక్షులకై మా వందనాలు;
సమస్తానికి మా వందనాలు.

ఆ పద్యములో దేవుని పేరు ప్రస్తావన లేదు, కాని కోర్టు చెప్పింది దేవుని గూర్చి వారిని ఆలోచింప చేస్తుందని! ఒక నిరుత్సాహ జడ్జి నిరాకరించి, ఇలా అన్నాడు, "ఇలా మనం కోర్టును అడుగుతున్నాం బహిష్కరించమని, పిల్లలు చెప్పేదే కాకుండా, వారు ఆలోచించేది కూడ...అది ప్రారంభిత తండ్రులను ఆశ్చర్య పరిచింది." అదే సంవత్సరము, 1963, కోర్టు శాసించింది "పాఠశాలలో" బైబిలు చదవడం చట్ట వ్యతిరేకమని. ఒక మనస్తత్వ వేత్త చెప్పిన దానిపై కోర్టు ఆధారపడింది బైబిలు చదవడం "అది, మానసికంగా హానికరము [పిల్లలకు]." అది ఆలోచించండి! ఆ మనస్తత్వ వేత్త అన్నాడు బైబిలు చదవడం పిల్లలకు "మానసికంగా హానికరము" అని! ఇదంతా 1962 మరియు 63 లో జరిగింది. అది దేవుని సంరక్షణ అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెనెడీకి లేకుండా చేసి అతని తల డాలస్, టెక్సాస్ లో కాల్చి వేయబడింది. అప్పటి నుండి అమెరికా హింసచే బాధింపబడి వేధింప బడుతుంది! ప్రతి అధ్యక్షుడు అప్పటి నుండి తీర్పు తీర్చ బడుతున్నాడు. రోనాల్డ్ రీగన్, మినహా, ప్రతి అధ్యక్షుడు అవమానముతో పరాజయముతో తప్పుకున్నాడు.

ప్రతి ఒక్కరికి తెలుసు మన దేశము ఉండవలసిన దానికి విరుద్ధంగా ఉందని. మన సంఘాలు కూడ వేరు. కాని చాలా మందికి తెలియదు ఈ తేడాకు మూలము సాతాను అని. డాక్టర్ మెరిల్ ఎఫ్. ఉంగర్, డాలస్ వేదాంత కళాశాలలో ప్రొఫెసర్, ఇలా అన్నాడు,

ఇరవై శతాబ్దపు బోధించు సంఘము చాలా వరకు తిరస్కరిస్తుంది చెడు దుష్ట శక్తుల ఉనికిని. ఈ అవిశ్వాస స్థితి వారి అధమ ఆత్మీయ జీవితాన్ని గుడిలో ఉన్న తక్కువ శక్తిని చూపిస్తుంది...[సాతాను] చే అందులై ఆకాశ మందలి దుష్ట సమూహాలు లేఖనములలో ఇవ్వబడినట్టు (Merrill F. Unger, Th.D., Ph.D., Biblical Demonology, Kregel Publications, 1994, p. 201).

డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్ ఇంగ్లాండ్ లోని లండన్ వెస్ట్ మినిష్టర్ చాపెలో చాలా సంవత్సరాలు, కాపరిగా ఉన్నారు. ఇరవై శతాబ్దపు చక్కని సువార్త బోధకునిగా అతడు గుర్తింపబడ్డాడు. డాక్టర్ ల్లాయిడ్ -జోన్స్ అన్నాడు,

సాతాను చేష్టలు పెరుగుతూ ఉన్నాయి. కారణమేంటి? దానికి కారణము, అధమ ఆధ్యాత్మికత, దేశములో దేవుడు లేని స్థితి...దేవుడు లేని స్థితి పెరుగుతూ ఉంటే, ప్రజల మనసులో దేవుని గూర్చిన గమనిక తగ్గుతుంది, దుష్ట శక్తుల ప్రత్యక్షత పెరుగుతూ ఉంటుంది (D. Martyn Lloyd-Jones, M.D., Healing and the Scriptures, Oliver-Belson Books, 1988, pp. 159-160).

డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు, "సాతాను చాలా తెలివిగా వ్యవహరిస్తాడు దెయ్యము లేదని చెప్పే ప్రజల విషయంలో. [అలా] సంఘము లాగబడి నీరు గారిపోతుంది; నిద్రబోతుంది, ఘర్షణ గూర్చి ఏమాత్రము తెలియకుండా" (Lloyd-Jones, The Christian Warfare, The Banner of Truth Trust, 1976, p. 106).

కాని మనం సాతానుచే "మత్తు మాయలో" పడకూడదు. లూథర్, చెప్పింది, తెలిసుండాలి

...ఈ లోకము, దెయ్యాలతో నింపబడినప్పటికినీ,
   మనలను భయపెట్టినప్పటికినీ,
మనం భయపడం, దేవుని చిత్తము
   ఆయన సత్యము మన ద్వారా బయలు వెళ్ళాలని.
("ఆశ్రయ దుర్గము మన దేవుడు" మార్టిన్ లూథర్ చే, 1483-1546).
(“A Mighty Fortress Is Our God” by Martin Luther, 1483-1546).

మనము సాతాను, తన దుష్ట శక్తులతో, యుద్ధము కలిగియున్నాము.

I. మొదటిది, పరిశుద్ధులకు విడుదల చేయబడిన విశ్వాసముతో పోరాటము!

అపోస్తలుడైన యూదా అన్నాడు,

...పరిశుద్దులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెను" (యూదా 3).

పదము "గట్టిగా చెప్పడం" నకు అర్ధము "శ్రమ పడడం," తీవ్రంగా పోరాడుట (బలమైన 1864). లేఖనాలలో ఇవ్వబడిన క్రైస్తవ విశ్వాసమును గూర్చిన సూత్రాలను ప్రకటించడానికి భద్ర పరచడానికి మనం పిలువబడ్డాం. డాక్టర్ డబ్ల్యూ. ఏ. క్రిస్ వెల్ అన్నాడు, "పదము [గట్టిగా చెప్పడం] క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన [వాటి] పునాదులకు వ్యతిరేక పోరాటంతో ముడిపడి ఉంది..." (The Criswell Study Bible, note on Jude 3).

డాక్టర్ క్రీస్ వెల్ బైబిలు కచ్చితత్వము విషయంలో కష్టపడి పోరాడాడు. ఆయన ప్రముఖ పుస్తకము, బైబిలు తేటగా సత్యమని నేనెందుకు బోధిస్తాను: ప్రత్యేక పిలుపు ప్రతి క్రైస్తవుడా లేఖనాలను దేవుని ఊపిరితో కూడిన పరలోక సత్యంగా అంగీకరించాలి (W. A. Criswell, Ph.D., Broadman Press, 1969). "బైబిలు కొరకు పోరాటంలో" నాకు చిన్న భాగముంది 1970 మరియు 1980 లలో. మా సంఘము ప్రతి నెల 600 డాలర్లు (ఆ రోజుల్లో చిన్న మొత్తము కాదు) డాక్టర్ పోవెల్ కు ఇస్తాము, "దక్షిణ బాప్టిస్టు జర్నల్" ప్రచురించడానికి ఇచ్చేది – అది ఆరవ బాప్టిస్టు సెమినరీలో తప్పుడు బోధలను బయలు పెట్టింది, అది అమెరికాలోని దక్షిణ బాప్టిస్టు సంఘ కాపరులందరికి మెయిల్ చేయబడింది. నేను నా భార్య దక్షిణ బాప్టిస్టు కన్వెంక్షన్ జాతీయ సమావేశాలకు డాక్టర్ పోవెల్ జర్నల్ కు మద్దతు ఇవ్వడానికి హాజరయ్యాము. స్వాతంత్ర్య ప్రతి నిధులు పిట్స్ బర్గ్ సమావేశంలో జర్నల్ చుట్టేసి నా భార్య ముఖముపై విసిరారు, ఆమెపై ఉమ్మివేసారు, ఆమె గర్భవతిగా ఉండినప్పటికిని, ఎక్కువ పిల్లలతో ఉన్నపటికీ! విశ్వాసము కొరకు గట్టిగా ఇలా ఉండేవాళ్ళము.

అప్పటి నుండి, మేము సాతాను సిద్దాంతాలకు, దెయ్యము సినిమా "క్రీస్తు ఆఖరి శోధన" లకు వ్యతిరేకంగా గట్టి నిర్ణయం తీసుకున్నాం. మన సంఘము, మనమే, మూడు గర్భస్రావ ఆసుపత్రులను లాస్ ఎంజిలాస్ ప్రాంతములో మూసాము.

నేను ఇప్పుడు 73 సంవత్సరాల వాడిని. కాని ప్రభువు నన్ను ఆఖరి పోరాటము కొరకు పిలిచాడు "నిర్ణయత్వత" కు వ్యతిరేకంగా పోరాటము – నిజ మార్పు కొరకు – ఎందుకంటే మన సంఘాలు లక్షలాది మారని ప్రజలతో నింపబడ్డాయి. మనం పోరాడుతున్నం క్రీస్తు నిత్య రక్తమును గూర్చి అవసరత తిరిగి రావాలని, అదొక్కటే దారి పరిశుద్ధ దేవుని దృష్టిలో మన పాపాలు కడగబడడానికి!

మనకు తెలుసు ఈ అబద్ద సిద్ధాంతాలకు మూలము సాతాను, మన పాఠ్య భాగం చెప్తుంది,

"అయితే కడవరి దినములలో కొందరు, అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు, ఆత్మల యందును దయ్యముల బోధ యందును, లక్ష్యముంచి; విశ్వాస భ్రష్టులగుదురని; ఆత్మ తేటగా చెప్పచున్నాడు" (I తిమోతి 4:1-2).

నేను ఈ ఉదయం ప్రతి పురుషుని అడుగుతున్నాను "చెరిచే ఆత్మలకు" వ్యతిరేకంగా పోరాటం చేయడానికి మాతో కలవమని – అది దెయ్యాలే – అవి క్రైస్తవ విశ్వాసపు సిద్దాంతాల హృదయాన్ని చింపడానికి శాయ శక్తులా ప్రయత్నిస్తున్నాయి! పురుషులారా – వచ్చి సహాయ పడండి!

క్రైస్తవ సైనికులారా, యుద్ధానికి సాగండి,
   యేసు సిలువ మీ యందు వెళ్ళుచుండగా:
క్రీస్తు ఠీవియైన యజమాని శత్రువుకు వ్యతిరేకంగా నడిపిస్తాడు;
   యుద్ధానికి కదలండి, ఆయనపతాకము వెళ్ళుచుండగా.
ముందు, క్రైస్తవ సైనికులారా, యుద్దానికి సాగండి,
యేసు సిలువ మీ ముందు వెళ్ళుచుండగా.
("ముందు, క్రైస్తవ సైనికులారా" సబినే బారింగ్ గౌల్డ్, 1834-1924).
(“Onward, Christian Soldiers” by Sabine Baring-Gould, 1834-1924).

II. రెండవది, అది ఆత్మీయ పోరాటము – ప్రార్ధనలోనే పోరాడాలి!

దయచేసి ఎఫెస్సీయులకు 6:10-12. గట్టిగా చదవండి,

"తుదకు, ప్రభువు యొక్క మహా శక్తిని బట్టి, ఆయన యందు బలవంతులై, ఉండుడి. మీరు అపవాడి తంత్రములను ఎదిరించుటకు శక్తి మంతులగునట్టు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించు కొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానుల తోను, అధికారుల తోను, ప్రస్తుత అంధకార సంభందులగు లోక నాధుల తోను, ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహముల తోను పోరాడుచున్నాము" (ఎఫెస్సీయులకు 6:10-12).

ఇది లేఖనాలలో గొప్ప భాగము. అది మనకు బోధిస్తుంది మనము పోరాడునది "శరీరులతో కాదు." మన పోరాటము "సాతానుకు" వ్యతిరేకంగా. డాక్టర్ జె. వెర్నోన్ మెక్ గీ అన్నాడు,

గుర్తింపబడిన శత్రువు మనకున్నాడు. దుష్ట శక్తులకు సాతాను అధిపతి. ఎక్కడ పోరాటం ఉందో మనం గుర్తించాలి. నేననుకుంటాను సంఘము ఆత్మీయ పోరాట దృష్టిని కోల్పోయింది (J. Vernon McGee, Th.D., Thru the Bible, Thomas Nelson Publishers, 1983, vol. V, pp. 279-280; note on Ephesians 6:12).

మనం బరాక్ ఒబామాతో గాని, నాశనము తెచ్చే "తేనీరు విందు" రిపబ్లికన్లతో గాని పోరాడడం లేదు. మనం సైనిక స్వలింగ సంపర్కులతో గాని ముస్లిము సైనికులతో గాని పోరాటం చెయ్యడం లేదు. అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ. బుష్ అనుకున్నాడు మన సమూహాలను పంపి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పి ఇరాక్ ను విడుదల చెయ్యాలనుకున్నాడు. అది పని చెయ్యదని నాకు తెలుసు. ఇప్పుడు సైనిక ఇస్లాము అక్కడకు వస్తుంది. చూసారా, బుష్ గాని ఒబామా గాని అర్ధం చేసుకోలేదు మన సైనికులు యుద్ధము జయించరని. అది, అదే, ఆత్మీయ పోరాటము. ఆ స్థలాలలో వేల మంది క్రీస్తు వైపు తిరుగుతున్నారు. దుష్ట శక్తులకు వ్యతిరేకంగా ప్రార్ధనతో మనం పోరాడాలి! అమెరికా సైన్యాలు జయింప లేనివి ప్రార్ధన ద్వారా జయించవచ్చు! దయచేసి ఎఫెస్సీయులకు 6:18. గట్టిగా చదవండి,

"ఆత్మ వలన ప్రతి సమయము నందును ప్రతి విధమైన ప్రార్ధనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్దుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి" (ఎఫెస్సీయులకు 6:18).

చూసారా, 11 మరియు 12 వచనాలలో నిజ శత్రువును గుర్తించాం. సర్వాంగ కవచము ధరించు కోవలసిన అవసరత ఉంది వచనాలు 13-17. సాతాను తన అనుచరులతో మన యుద్ధము కొనసాగుతుంది వచనము 18. ప్రార్ధన యుద్ధము!!!

ఈ ఉదయం ప్రతి పురుషుడు ప్రార్ధన పిరికివారికి కాదు అని అభిప్రాయానికి రావాలని నాఆశ! అపోస్తలుడైన పౌలు ప్రార్ధనంటే పోరాటము అన్నాడు – సాతాను అతని సైన్యముతో! "మోర పెడుతూ ప్రార్ధించడు" బలహీనులకు కాదు! బలహీన, నిస్సహాయ, మెత్తని, మనుష్యులు వణుకుతారు, భయపడతారు, ప్రతివారం మన గుడిలో జరిగే ప్రార్ధనా కూటానికి హాజరు అయితే. పాత పురిటాన్ ఉదాహరణ మనం గైకొంటాం – పురుషులే ప్రార్ధనలో నడిపించాలి! స్త్రీలు "ఆమెన్" తో మద్దతు పలకాలి. పురుషులు ప్రార్ధించాలి – ఉత్తర ఐర్లాండ్ లో డాక్టర్ పెయిస్ లీస్ గుడిలో పురుషులు ప్రార్ధించినట్లు. వారికి తెలుసు కృపా సింహాసనం దగ్గరకు ఎలా దైర్యంగా రావాలో! ఆ ఉదాహరణ మనం ఆచరిస్తాం. ప్రార్ధనా కూటాల్లో పరలోక ద్వారాలను ఎదుర్కొంటాం. వచ్చి మాతో కలవండి దేవుడిచ్చిన దైర్యము మీకుంటే ప్రార్ధన ద్వారా సాతానుతో పోరాడడానికి! ఆమెన్! బుధవారం సాయంత్రం 7 గంటలకు ప్రార్దిస్తాం. గురువారం సాయంత్రం 7 గంటలకు ప్రార్దిస్తాం. శనివారం సాయంత్రం 6 గంటలకు. ఎందుకు అంత ప్రార్ధన? డౌన్ టౌన్ లాస్ ఎంజిలాస్ లో మన సంఘము రెండు నెలలు కూడ ఉండక పోయేది పురుష ప్రార్ధనా యోధులు లేకపోతే! వచ్చి మాతో కలవండి!

దేవుని సంఘాన్ని గొప్ప సైన్యము కదుల్చునట్లు;
   సహోదరులారా, పరిశుద్దుల మార్గములో మనం పయనిస్తున్నాం;
మనం విడిపోలేదు, ఒక శరీరం,
   ఒక నిరీక్షణ ఒక సిద్దంతము, ఒక సేవా దృక్పథం.
కదలుదాం, క్రైస్తవ సైనికులారా, యుద్దానికి కదులుదాం,
      యేసు సిలువ మనముందు నడువగా.

III. మూడవది, ఈ పోరాటంలో చేరడానికి మీరు మార్చబడాలి!

రెండవ ప్రపంచ యుద్ధ ప్రారంభంలో చర్చిల్ ప్రధాన మంత్రి. రేడియోలో బ్రిటన్ ప్రజలకు చెప్పాడు, "రక్తం తప్ప యివ్వడానికి ఏమీ లేదు, శ్రమ, కన్నీళ్లు చెమట." వారు ఆయనను వెంబడించి, హిట్లర్ నాజిస్ లను ఎదురాడారు!

ఈ ఉదయాన్న నేను చెప్పగలను యివ్వడానికి నాకేమి లేదు, దుష్ట శక్తులతో పోరాటము తప్పు. అది సులభం కాదు. వెలకట్టాలి. హృదయం జీవితం పరీక్షించి పాపాలు ఒప్పుకోవాలి. యేసు పాదాలపై పడాలి, హృదయమంతటితో ఆయనను నమ్మాలి. ప్రతిసారి గుడికి వచ్చి, ఇక్కడ ఉండాలి. క్రీస్తుకు మీ జీవితం సమర్పించాలి, ఆయన పరిశుద్ధ నిత్య రక్తములో పాపాల నిమిత్తం కడగబడాలి! బైబిలు చెప్తుంది:

"క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలే, నాతో కూడ శ్రమ అనుభవించుము" (II తిమోతి 2:3).

లేవండి, తరువాత! సిలువ ఎత్తుకొని క్రీస్తును వెంబడించండి! ఈ దుష్ట పట్టణములో సాతానుతో యుద్ధము చెయ్యడానికి మాకు సహాయ పడండి!

కదలండి, ప్రజలారా, సంతోష సమూహముతో చేరండి,
   విజయోత్సాహ పాటలో మీ స్వరాలు మా స్వరాలతో కలపండి;
ఘనత, మహిమ ప్రభావము రాజైన క్రీస్తుకే;
   లెక్కింప లేని తరాలకు మానవులు దేవదూతలు కలిసి పాడతారు.
క్రైస్తవ సైనికులారా, యుద్ధానికి కదలండి,
   యేసు సిలువ మనముందు వెళ్ళుచుండగా.

లేచినాతో పాడండి! ఆ పాట పాడండి!

యేసుచే పాపము నుండి రక్షింపబడాలి ఈ యుద్ధములో చేరడానికి. ఆయన రక్తముచే కడగబడాలి. యేసుచే పాపాల నుండి రక్షింపబడాలనే ఆశ ఉంటే, ఆవరణము వెనుకకు నడవండి. డాక్టర్ కాగన్ వేరే గదిలో మాతో మాట్లాడుతాడు. త్వరగా వెళ్ళండి. దేవా, కొందరు యేసును నమ్మి రక్షింపబడాలని ప్రార్ధిస్తున్నాను. ఆయన నామములో, ఆమెన్.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ఫ్రుథోమ్: II తిమోతి 4:1-5.


ద అవుట్ లైన్ ఆఫ్

కావాలి – పోరాడు పురుషులు

(తండ్రుల దినోత్సవ ప్రసంగము)
NEEDED – FIGHTING MEN!
(A FATHER’S DAY SERMON)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"అయితే కడవరి దినములలో కొందరు, అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు, ఆత్మలయందును దయ్యముల బోధ యందును, లక్ష్యముంచి; విశ్వాస భ్రష్టులగుదురని; ఆత్మ తేటగా చెప్పచున్నాడు" (I తిమోతి 4:1-2).

(I తిమోతి 6:12; II తిమోతి 3:1)

I. మొదటిది, పరిశుద్ధులకు విడుదల చేయబడిన విశ్వాసముతో పోరాటము! యూదా 3.

II. రెండవది, అది ఆత్మీయ పోరాటము – ప్రార్ధనలోనే పోరాడాలి! ఎఫెస్సీయులకు 6:10-12, 18.

III. మూడవది, ఈ పోరాటంలో చేరడానికి మీరు మార్చబడాలి! II తిమోతి 2:3.