Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
నోవాహు దినములు లోతు దినములు

(ఆదికాండముపై 877 వ ప్రసంగము)
THE DAYS OF NOAH AND THE DAYS OF LOT
(SERMON #77 ON THE BOOK OF GENESIS)
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము ఉదయము, మే 18, 2014
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, May 18, 2014

"నోవహు దినములలో జరిగినట్టు, మనష్యుకుమారుని దినములలోను జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు, జనులు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికియ్యబడుచునుండిరి, అంతలో జల ప్రళయము వచ్చి, వారందరిని నాశనము చేసెను. లోతు దినములలో జరిగినట్టును జరుగును; జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, వారు నాటుచు, ఇండ్లు కట్టుచు నుండిరి; అయితే లోతు సోదొమ విడచిపోయిన దినమున, ఆకాశము నుండి అగ్ని కంధకములు కురిసి వారందరిని నాశనము చేసెను. ఆ ప్రకారమే మనష్యు కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును" (లూకా 17:26-30).


ఈ పాఠ్యభాగమును గూర్చి మూడు విషయాలు మీరు గమనించాలి. మొదటిది, యేసు చెప్పిన రెండు గొప్ప దృష్టాంతాలు గమనించండి – నోవాహు దినములలో జల ప్రళయము, సొదొమ పట్టణముపై ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసిన విషయము. రెండవది, 27 వ వచనములోని ఆఖరి నాలుగు మాటలు చూడండి, "వారందరిని నాశనము చేసెను." ఇప్పుడు 29 వ వచనము చూడండి, "ఆ ప్రకారమే వారందరిని నాశనము చేసెను." ఇప్పుడు 30వ వచనము చూడండి, "మనష్యు కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును." తీర్పులో క్రీస్తు రెండవ రాకడను ఇది సూచిస్తుంది నమ్మని లోకములో.

నోవహు దినములలో ప్రజలు సిద్ధంగా లేరు – అందుకే అందరు నాశనమయ్యారు లోతు దినములలో ప్రజలు సిద్ధంగా లేరు – అందుకే అందరు నశించిపోయారు. తినుట త్రాగుచు పెండ్లాడుట తప్పు కాదు, కాని ప్రజలు వాటిని గూర్చే శ్రద్ధ కలిగియున్నారు! వారు నోవహు మాటగాని లోతు మాట గాని వినలేదు, వాళ్ళంతా నాశనమయ్యారు.

ఇప్పుడు రెండు గుంపుల ప్రజలను చూద్దాం ఎందుకు వారు తీర్పుకు సిద్ధంగా లేరో. కానీ మొదటి నేను బైబిల్ దేవుని ఆగ్రహం తీర్పు ఒక దేవుని బోధిస్తోంది అని చెబుతాను. నాకు తెలుసు ప్రజలు ఏది నమ్ముతున్నారు. వారు తరచుగా, "నాకు దేవుని తీర్పు పట్ల నమ్మకం లేదు." కానీ వాళ్ళు నమ్మేది ప్రాముఖ్యం కాదు. దేవుని మీ ఊహ కేవలం ఒక కట్టుకథ కాదు. దేవుడు ఉనికి గలవాడు. మీరు ఆయనను నమ్మినా లేకున్నా ఆయన ఉనికిలో ఉన్నాడు. కనుక విషయము కాదు "తీర్పు తీర్చే దేవుని నమ్మను అంటే." నీవు నమ్మే దానిపై దేవుని ఉనికి ఆధారపడదు, నీవనుకున్నది దేనిని మార్చదు! ఒకవేళ నీవు, "నేను శాన్ ప్రాన్సిస్కొను నమ్మను." అంటే అది శాన్ ప్రాన్సిస్కొను మాయం చేస్తుందా? కాదు! ఒకవేళ, "శాన్ ప్రాన్సిస్కొలో ట్రాలీ కార్లు ఉన్నాయంటే నేను నమ్మను అనవచ్చు." అంత మాత్రాన పట్టణములో ట్రాలీ కార్లు లేకుండా అవుతుందా? కానే కాదు! దేవుని విషయము అంతే. నీవు అనవచ్చు, "నాకు దేవుని తీర్పు పట్ల నమ్మకం లేదు," అది దేనిని మార్చలేదు. మీరు నమ్మిన నమ్మకున్న, మీ మెదడు బయట దేవుడు ఉనికిలో ఉన్నాడు – ఆయన తీర్పు తీర్చు దేవుడు పాపానికి వ్యతిరేకంగా ఉగ్రత పంపువాడు – మీరు నమ్మినా లేకున్నా.

నిజానికి నోవహు దినములలో ప్రజలు మీ లాగే తలంచారు. దేవుడంటే ఒక అభిప్రాయము ఉండేది – కాని, మీలాగే, దేవుడు తీర్పు తీర్చు వాడని వారు అనుకోలేదు! మరియు, మీలాగే, వారు తప్పు – పూర్తిగా పొరబడ్డారు! అందుకే దేవుడు గొప్ప జళ ప్రళయం పంపాడు, "వారందరిని నాశనము చేసాడు" (లూకా 17:27).

సొదొమొలో కూడా అలాగే జరిగింది. సొదొమొ ప్రజలనుకున్నారు దేవుడు వారిని తీర్పు తీర్చడని. నోవహు దినములలో ప్రజలు ఆయన బోధ పట్టించుకోలేదు. లోతు హెచ్చరికలు సొదొమొ ప్రజలు వినలేదు. ఆయన అల్లుళ్లు అనుకున్నారు లోతు "పరిహాసము చేస్తున్నాడని" తీర్పు వస్తుందని ఆయన హెచ్చరించేటప్పుడు. వాళ్ళది తప్పు. తీర్పు పైన పడి "వారందరిని నాశనము చేసింది" (లూకా 17:29).

యేసు ముప్పై వచనాన్ని, ఇలా ముగించాడు,

"ఆ ప్రకారమే మనష్యు కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును" (లూకా 17:30).

అలాంటి దినాలలో మనం ఉన్నామని నేను నమ్ముతాను. ఈ పాపపు తరముపై ఏరోజు ఏ గడియ దేవుని తీర్పు వస్తుందో ఎవరికీ తెలియదు. ప్రతి సూచన చెప్తుంది యుగ అంతములో మనం ఉన్నామని. బైబిలు చెప్తుంది, "మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి" (ఆమోసు 4:12). డాక్టర్ ఈద్ హిండ్సన్ లిబర్టీ యూనివర్శిటి ఇలా అన్నారు,

         క్రైస్తవ తలంపు ఆదిపత్యములో ఉండే పాశ్చాత్య సంస్కృతి చెదిరి పోయింది. మనం ఇప్పటికే సామాజికత, పోల్చుట మిధ్యతకు సమీపంగా ఉన్నాం...
         అంత్యదినాలలో సూచనలకు వేదిక సిద్ధమయింది. మార్పులు అభివృద్ధులు త్వరితంగా సంభవిస్తున్నాయి మునుపెన్నడూ లేని గొప్ప క్లిష్టత ద్వారా వెళ్తున్నాం. ప్రతి ఘట్టము గుర్తు చేస్తుంది "గొప్ప విషయము" దగ్గరగా (Ed Hindson, Ph.D., Final Signs, Harvest House Publishers, 1996, pp. 65, 7).

దేవుని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నావా? యుగాంతానికి క్రీస్తు రాకడకు సిద్ధంగా ఉన్నావా? శిష్యులు యేసునడిగారు, "ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి?" (మత్తయి 24:3). యేసు వారిని గద్దించలేదు. బదులుగా ఆయన చాలా సూచన లిచ్చారు భూమిపై జీవన విధానం గూర్చి. సమయ సమీపతను గూర్చి ఆ రోజుల్లో – ఇప్పుడు మనం ఉన్నామని నేను నమ్ముతున్నాను. యేసు అన్నారు అది నోవహు దినముల వలె, గొప్ప జళ ప్రళయము ముందు – లోతు దినముల వలె, దేవుడు భయంకర తీర్పు వారిపై క్రుమ్మరించే ముందు. డాక్టర్ యమ్. ఆర్. డిహాన్ అన్నాడు,

         క్రీస్తు రాకడను గూర్చిన సూచనల విషయంలో. ఐదు అధ్యాయాలు చదువుతాం యేసు ముప్పై నిమిషాలలో "నోవహు దినములను లోతు దినములను" గూర్చి చెప్పడం. నోవహు లోతు దినాలలో ఒకే విషయం ఉంది. సమృద్ధి దినాలది. యేసు అన్నారు వారి తినుచు త్రాగుచున్నారు...అంటే తిండి బోతు తనము తాగుబోతు తనము. ఆస్థితే ఈ తరములో కూడ సంభవించింది, ఈ తరములో కూడ సంభవించింది; నోవహు, లోతు దినాల నుండి, ఇప్పుడే మళ్ళీ "తిండిపోతు తాగుబోతు" దినాలుగా మళ్ళీ వచ్చాయి.
         నోవహు లోతు దినాలను గూర్చి యేసు చెప్పిన మరొక విషయం... లైంగిక జీవితము...ఈ ఆధునిక దినాలు అలానే ఉన్నాయి పోల్చి చూస్తే. ఒక తరములో పవిత్ర సంస్థ గా ఉండే కుటుంబము చరిత్రలో అన్ని శతాబ్దాల కంటే దిగజారి పోయింది…అవినీతి పెరిగింది, విడాకుల సంఖ్య రెండింత లయ్యింది, మూడంతలు నాలుగంతలయ్యింది ఈ తరములో...అవినీతి పాపముపై [సొదొమొ] దేవుని తీర్పుకు కారణము...జళ ప్రళయము ముందు దైవకుమారుల మానవ కుమార్తెల మధ్య అక్రమ సంబంధము (M. R. DeHaan, M.D., The Days of Noah, Zondervan Publishing House, 1963, pp. 80-82).

యేసు చెప్పిన విషయాలు మీకు గుర్తు చేస్తాను,

"నోవహు దినములలో జరిగినట్టు...మనష్యు కుమారుని దినములలోను జరుగును లోతు దినములలో జరిగినట్టును జరుగును.... ఆ ప్రకారమే మనష్యు కుమారుడు ప్రత్యక్ష మగు దినమున జరుగును" (లూకా 17, 26, 28,30).

క్రీస్తు ఊహిస్తున్నాడు భయంకర తీర్పులు క్రీస్తును-నిరాకరించే, దేవుడు లేని తరము పై వస్తుందని. క్రీస్తు అన్నాడు,

"ఈ సమయం ప్రపంచ ప్రారంభం నుంచి కాదు, గొప్ప ప్రతిక్రియ ఉండాలి, కాదు, కానీ ఎప్పుడూ ఉండాలి. ఆ దినములు తక్కువ చేయబడక పోయిన యెడల, ఏ శరీరియు తప్పించుకొనడు..."(మత్తయి 24:21, 22).

బైబిలు మాట్లాడుతుంది దేవుడు ఏడు ఉగ్రత (పాత్రలు) శ్రమల కాలంలో లోకముపై క్రుమ్మరిస్తాడు. ప్రకటన పదహారవ అధ్యాయములో ఇది ఊహించబడింది. (ఎన్ఎఎస్ వి),

మొదటి తీర్పు పాత్ర భాదాకరమైన చెడ్డ పుండు పుట్టించెను (వచనము 2).

రెండవ తీర్పు పాత్ర సముద్రమును పీనుగ రక్తము వంటిదిగా మార్చెను (వచనము 3).

మూడవ తీర్పు పాత్ర నదులను జలధారలను రక్తముగా మార్చెను (వచనము 4).

నాలుగవ పాత్ర తీర్పు సూర్యుని మీద క్రుమ్మరింపగా, మనష్యులను అగ్నితో కాల్చుటకు, సూర్యునికి అధికార మివ్వబడెను (వచనములు 8, 9).

ఐదవ తీర్పు పాత్ర అంధ కారము పుట్టించి మనష్యులు నాలుకలు కరచు కొనేటట్టు చేసింది (వచనము 10).

ఆరవ తీర్పు పాత్ర యూప్రటీసు నది, నీటిని ఎండి పోజేసెను (వచనము 12).

ఏడవ తీర్పు పాత్ర పోయబడగా గొప్ప భూకంపము చాలా భూభాగాన్ని నాశనము చేసింది, ప్రపంచ నివాసులపై గొప్ప రాళ్ళు పడ్డాయి (వచనములు 19, 21).

ప్రజలు పశ్చాత్తాప పడతారా? లేదు! చాలా ఆలస్యమైంది పశ్చాత్తాప పడడానికి! "మనష్యులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించారు" (ప్రకటన 16:21). బైబిలు చెప్తుంది,

"రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియు లేదని చెప్పుకోనుచుండగా; గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లు, వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును; గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు" (I ధెస్సలొనీకయులకు 5:2-3).

నిజ క్రైస్తవులు మాత్రమే, నిజ మార్పును అనుభవించిన వారు, ఈ భయంకర సంఘటనలు జరుగక ముందు పైకి ఎత్త బడతారు. కాని "క్రైస్తవులు" అనబడే చాలా మంది విడిచిపెట్టబడతారు. క్రీస్తు వాళ్లతో అంటాడు, "నేను మిమ్ములను ఎరుగను" (మత్తయి 25:12).

మనం తరచూ మీ విషయాలపై బోధ వింటుంటాం. కాని, వింతగా, ఈ మధ్య సంవత్సరాలలో ఈ విషయాలపై మౌనము పాటింపబడుతుంది. 1969 లో బెల్లీ గ్రేహం అన్నాడు,

బైబిలు బోధిస్తుంది యుగాంతమున, యుద్ధము, నాశనము, అవినీతి, అనైతిక, ఎక్కువై దేవుడు జోక్యం చేసుకుంటాడు...న్యూజీలాండ్ లో మానవ సమాజము మా కూటాలు ఆపారు, కొన్ని ఆనవాళ్ళు చూపారు, "బిల్లీ గ్రేహం మిమ్ములను భయ పెట్ట నివ్వవద్దు" (Billy Graham, “The Day to Come,” The Challenge: Sermons from Madison Square Garden, Doubleday and Company, 1969, p. 164).

చనిపోయే ముందు ఒక సువార్త నాయకుడు నా కుటుంబంతో చెప్పాడు నాతో కూడ బిల్లీ గ్రేహం బోధ "ఉత్తేజ పరిచేది." ఔను, కాని అలాంటి బోధకులు ఈ రోజుల్లో ఎక్కడున్నారు? చాల బోధకులు మెత్తగా ఉన్నారు ప్రజలను గద్దించకుండా రాబోవు తీర్పును గూర్చి అగ్ని గుండమును గూర్చి! ఒక వ్యక్తి నాతో అన్నాడు నేను పాతకాలం మనిషినని, డైనోసార్ నని, జోయిల్ ఓస్టీన్ లా, మెత్తని చిన్న ప్రసంగాలు ఇవ్వాలని చాలా మంది వలె, ప్రాధమికత బోధకుల వలె. అతనికి జవాబిచ్చాను II తిమోతి 4:2-4 ను గూర్చి ప్రస్తావిస్తూ,

"వాక్యమును ప్రకటించుము; సమయ మందును, ఆసమయ మందును; ప్రయాసపడుము, సంపూర్ణమైన, దీర్ఘ శాంతముతో ఉపదేశించుచు ఖండించము గద్ధించుము బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హిత బోధను సహింపక; దురద చెవులు గలవారై తమ స్వీకీయ దురాశాలకు అనుకూలమైన బోధకులను, తమ కొరకు పోగు చేసుకొని; సత్యమునకు చెవి నియ్యక కల్పనా కథల వైపునకు, తిరుగు కాలము వచ్చును" (II తిమోతి 4:2-4).

ఆశ్చర్యం లేదు మన సంఘాలు నశించు వారితో నింపబడ్డాయి! కాపరులు పాతకాలపు మతాన్ని బోధించడానికి భయబడుతున్నారు పాత బోధకులు చేసినట్టు!

నాకు దేవుడిచ్చిన పని వచనము వెంబడి వచనము బైబిలు బోధించడం కాదు. నా పని "వాక్యము బోధించుట." తీసుకోండి లేక విడిచి పెట్టండి! బైబిలు చెప్పేదే నేను మీకు యిచ్చాను!

"నోవహు దినముల వలె...లోతు దినముల వలె...ఆ ప్రకారమే మనష్యు కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును" (లూకా 17, 26, 28, 30).

అది మీరు "ఉత్తేజితంగా" ఉంటే, దేవుడు మీకు సహాయము చేయును గాక! తీర్పు పడునప్పుడు మీరు పెద్ద శ్రమలో ఉంటారు!

ఇప్పుడు, దేవుని తీర్పును తప్పించు కోవాలంటే మీరు ఏమి చెయ్యాలి? లోతు నోవహు ఏమి చేసారో అదే చెయ్యాలి!

సొదొమొ నుండి వెళ్లి పొమ్మని దేవుడు లోతుకు చెప్పాడు. దేవుడన్నాడు, "నీ ప్రాణమును దక్కించు కొనునట్లు; పారిపోమ్ము నశించి పోకుండా...వెనుకకు చూడకుము" (ఆదికాండము 19:17). రక్షింపబడాలని నిరీక్షణ ఉంటే, మీరు కూడ అలాగే చెయ్యాలి. దేవుడు లేని జీవిత విధానము నుండి బయటకు రావాలి. దేవుడన్నాడు, "వారి నుండి బయటకు రా, వేరుగా ఉండు...నేను నిన్ను స్వీకరిస్తాను" (II కొరింధీయులకు 6:17). గుడికి వెళ్ళని వారి నుండి వేరు అవండి. పాపములో జీవిస్తూ దేవుని గూర్చిన ఆలోచన లేని వారి నుండి వేరు అవండి. అదే లోతు చేసాడు, అదే నీవు కూడ చెయ్యాలి. పాపము లోకము నుండి బయటకి రండి, ద్వారము తెరిచి ఉండగా గుడిలోనికి రండి! గుడిలో కొత్త స్నేహితులను చేసుకోండి!

అది సరిపోదు! నోవహు చేసినట్లు కూడ చెయ్యాలి. దేవుడు నోవహుతో అన్నాడు,

"ఓడలోనికి...రమ్ము" (ఆదికాండము 7:1).

"దేవుడు నోవహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి యున్నది; గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి యున్నది; ఇదిగో, వారిని, భూమితో కూడ నాశనము చేయుదును" (ఆదికాండము 6:13).

"ఓడలోనికి...రమ్ము" (ఆదికాండము 7:1).

ఓడ, క్రీస్తు పటమును, చూపిస్తుంది. క్రీస్తు దగ్గరకు రండి. క్రీస్తు అన్నాడు, "నా యొద్దకు రమ్ము" (మత్తయి 11:28). నోవహు వచ్చాడు – తీర్పు నుండి రక్షింపబడ్డాడు. మీరు కూడ తప్పక రావాలి – క్రీస్తు నోద్దకు. క్రీస్తు ఆయన రక్తము ద్వారా మీ పాపాలన్నీ కడిగేస్తాడు, సిలువపై కార్చిన రక్తము ద్వారా. విశ్వాసము ద్వారా క్రీస్తు నోద్దకు రండి! ఆయన మృతులలో నుండి లేచాడు. ఆయన మీకు నిత్య జీవము అనుగ్రహిస్తాడు – రాబోవు ఉగ్రత నుండి రక్షిస్తాడు.

లోతు చేసినట్టు, పాపాన్ని వదిలి పెట్టు. క్రీస్తు నోద్దకు రమ్ము, నోవహు చేసినట్టు. దేవుడు మిమ్ములను మేల్కొలిపి అలా చేయడానికి సహాయము చేయును గాక!

దీనిని గూర్చి మీరు మాతో మాట్లాడాలనుకుంటే, మీ కుర్చీ విడిచి ఆవరణము వెనుక భాగానికి రండి. డాక్టర్ కాగన్ వేరే గదికి తీసుకెళ్ళి మీతో మాట్లాడతాడు. డాక్టర్ చాన్, ఈ ఉదయాన్న కొందరు యేసును నమ్మునట్లు ప్రార్ధించండి! ఆమెన్.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ఫ్రుథోమ్: పేతురు 2:4-9.
ప్రసంగమునకు ముందు పాట బెంజమన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్ గారిచే:
"ఈలాంటి సమయాలలో" (రూత్ కాయె జోన్స్, 1902-1972).
“In Times Like These” (by Ruth Caye Jones, 1902-1972).