Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
నాకు కావలసింది యేసే

ALL I NEED IS JESUS
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము సాయంకాలము, మే 3, 2014
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Saturday Evening, May 3, 2014

"అయితే ఆయన మూలముగా, మీరు క్రీస్తు యేసు నందున్నారు, అతిశయించు వాడు, ప్రభువునందే, అతిశయింప వలెను: అది, వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా, ఆయన మనకు జ్ఞానమును, నీతియు పరిశుద్ధతయు విమోచనమును ఆయెను" (I కొరింధీయులకు 1:30, 31).


మన పాఠ్య భాగము I కొరింధీయులకు మొదటి అధ్యాయము నుండి వచ్చినది, కొన్ని నిమిషాల క్రితం ప్రుథోమ్ గారు చదివారు. అపోస్తలుడు అన్నాడు ప్రపంచ జ్ఞానులు, బలాడ్యులు (పలుకుబడి) గల వారు, (గొప్ప) వారు రక్షింపబడ లేరు. దేవుడు అవసరమని అనుకోరు. ఈ లోక విషయాలు పట్టించుకుంటారు. కోల్పోవుట వాళ్ళకు ఇష్టముండదు, తమ్మును తాము ఉపేక్షించుకొని సిలువను ఎత్తికొని క్రీస్తును వెంబదించడం ఇష్టముండదు.

అపోస్తలుడు గుర్తు చేసాడు కొరింధీయులకు గుడిలో గొప్ప వారు ప్రఖ్యాతి గాంచిన వారు లేరు. దేవునిచే ఎన్నిక చేయబడిన వారున్నారు, నమ్మని లోకం బుద్దిహీనులని, బలహీనులని, నిరాకరింపబడిన వారు, గమనింపు లేని వారు ఉన్నారు. దేవుడు అలాంటి వారిని ఎన్నుకున్నాడు "గమనింపుకు" గొప్ప తెలివైనవారు. అదే జరిగింది. ప్రపంచం వీరిని ప్రాముఖ్యత లేని వారిగా చూసింది. కాని వారు తప్ప. అలాంటి ఎన్నిక లేని క్రైస్తవులు రోమా సామ్రాజ్యమంతా, ప్రపంచమంతా ప్రబలి ఉన్నారు. తక్కువ క్రైస్తవులను దేవుడు ఎన్నుకున్నాడు గొప్ప రోమా ప్రభుత్వానికి పేరు రాకుండా. నేను భావిస్తాను దేవుడు మళ్ళీ అదే చేస్తున్నాడు కమ్యునిష్టు చైనాలో. ఒక పాటలో చెప్పినట్టు, "విశ్వాసము విజయము, ప్రపంచాన్ని జయిస్తుంది." అమెరికా వాడిపోయినా, క్రైస్తవులు ఇంకా ఉంటారు.

విశ్వాసము విజయము, విశ్వాసము విజయము!
ఓ, మహిమాయుక్త విజయము ప్రపంచాన్ని జయించేది.
("విశ్వాసము విజయము" జాన్ ఎచ్. ఎట్స్, 1837-1900).
(“Faith is the Victory” by John H. Yates, 1837-1900).

దేవుడు మనలాంటి బలహీనులను ఎన్నుకున్నాడు ఎవ్వరు అతిశయించకుండా, "ఆయన సన్నిధిలో ఏశరీరియు మహిమ పొందకుండ" (I కొరింధీయులకు 1:29). డాక్టర్ జె. వెర్నోన్ మెక్ గీ అన్నాడు చాలా మంది సువార్తికులు "ప్రముఖులకు ప్రాధాన్యత యిస్తారు [విశ్వాసమును ప్రకటించిన వారికి] – వినోదకులు, పరిశ్రమ నాయకులు, ప్రభుత్వములో ప్రముఖులు. కాని దేవుడు సామాన్యులను లెక్కిస్తాడు. నీ లాంటి నా లాంటి సామాన్యులను ఆయన పిలుస్తున్నారు" (J. Vernon McGee, Th.D., Thru the Bible, Thomas Nelson Publishers, 1983, volume V, p. 12).

మీరు గమనించారు గొప్ప వాళ్ళను ప్రముఖులను మనం సువార్తీకరించమని? ఎందుకు అని ఆశ్చర్యపోయారా? సరే, ఈ బైబిలు పాఠ్య భాగము ఎందుకో చెప్తుంది,

"సహొదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోక రీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్పరంగము వారైనను, అనేకులు పిలువ బడలేదు: గాని ఏ శరీరియు దేవుని యెదుట అతిశయ పడకుండునట్లు; జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచు కొనియున్నాడు; లోకములో నుండు, ఎన్నికైన వారిని, వ్యర్ధము చేయుటకు, అవును, లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని ఏర్పరచుకొనియున్నాడు: దేవుడు ఏర్పరచు కొనియున్నాడు" (I కొరింధీయులకు 1:26-29).

చూడండి, చాలా సంవత్సరాల అనుభవము ద్వారా నేర్చుకున్నాం గొప్ప పేరున్న వాళ్ళ కాలేం గుడికి వచ్చి సువార్త విని, రక్షింపబడకుండ. మన సంఘం ఎదుగుతుంది కాలేజి స్కూళ్ళలో యవనస్థులను సువార్తతో చేరుతున్నాం కనుక. లోకం అనుకుంటుంది యవనస్థులు అవివేకులు బలహీనులు అని. మీలో కొందరిని దేవుడు పిలుస్తున్నాడు, గొప్పగా ప్రసిద్దిగా చెయ్యడానికి! ఆయనకు తెలుసుకొని కొంత మంది క్రీస్తు శిష్యులవుతారని! వారు సంతృప్తులు, బాహ్యకులు నిజ క్రైస్తవులు కాలేక పోతున్నారు. అందుకే దేవుడు హక్కు తీసుకుంటున్నాడు. వాళ్ళను సామాన్య పిలుపుతో పిలవడు. యవనస్థులను ప్రత్యేకంగా పిలుస్తాడు. మీలో కొందరు ఆయన ద్వారా రక్షింపబడి క్రీస్తు నొద్దకు వచ్చారు. మన పాఠ్యభాగము చెప్తుంది దేవునిచే పిలువబడడం ఎంత ఆదిక్యత, ఆయన కుమారుడైన యేసు ద్వారా రక్షింపబడడం!

"అయితే ఆయన మూలముగా, మీరు క్రీస్తు యేసు నందున్నారు, అతిశయించు వాడు, ప్రభువునందే, అతిశయింపవలెను: అని, వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా, ఆయన మనకు జ్ఞానమును, నీతియు పరిశుద్ధతయు విమోచనమును ఆయెను" (I కొరింధీయులకు 1:30, 31).

ఈ పాఠ్య భాగము నుండి మూడు పాఠాలు నేర్చుకుంటాం.

I. మొదటిది, క్రీస్తు యేసు నొద్దకు చేర్చబడే ఆధిక్యత.

పాఠ్యభాగం చెప్తుంది, "ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసు నందున్నారు..." (I కొరింధీయులకు 1:30). "ఆయన మూలముగా" – అంటే, "దేవుని మూలముగా." ఇలా అనువదింపవచ్చు, "ఆయన పనిని బట్టి మీరు క్రీస్తు యేసునందున్నారు." అది తేటగా చెప్తుంది దేవుడు ఒక నశించు ఆత్మను క్రీస్తుతో సమాధాన పరుస్తాడు. ప్రవక్త హొషేయా ద్వారా దేవుడు అన్నాడు, "నేను స్నేహ బంధముతో, వారిని బంధించితిని" (హొషేయ 11:4). యేసు అన్నారు, "నా ద్వారానే తప్ప, ఎవడును తండ్రి యొద్దకు రాదు" (యోహాను 6:44). ఆధునిక "నిర్ణయతత" చెప్తుంది ప్రజలు ఎప్పుడైనా క్రీస్తు నొద్దకు రావచ్చు! కాని బైబిలు చెప్తుంది దేవుడు మాత్రమే నశించు పాపులను క్రీస్తుతో ఐక్య పరుస్తాడు. "ఆయన ద్వారా మీరు క్రీస్తు యేసు నందున్నారు." "కాని ఆయన వలన మీరు క్రీస్తు యేసు నందున్నారు." స్పర్జన్ వివరించారు, "దేవుని మూలమున మనం క్రీస్తు యేసు నందున్నాము."

దీనిని బట్టి క్రీస్తు నొద్దకు రావడం నేర్చుకోవచ్చు అనడం అవివేకం. దేవుడు మిమ్ములను క్రీస్తు నొద్దకు తేవాలి. దేవుడే "క్రీస్తు యేసు నందు, మనలను ఆయనతో కూడలేపి" (ఎఫెస్సీయులకు 2:6). ఇప్పటికే రక్షింప బడితే ఈ గొప్ప సత్యము తెలుసు కోవడం మంచిది. నిన్ను నీవు మార్చుకోలేవు. దేవుడే మార్చాడు. క్రీస్తు నొద్దకు రావడం "ఆయనలో" ఉండడం మీరు చెయ్యలేదు. కాదు! కాదు! "ఆయన ద్వారా మీరు క్రీస్తు యేసు నందున్నారు." దేవుని చేర్చుకొనే శక్తిని బట్టి క్రీస్తు శరీరంలో భాగమై ఉన్నారు, ఆయనతో ఐక్యమై ఉన్నారు. నశించిపోవడం అంటే తెలుసుకోవాలి. యేసు నొద్దకు రాడానికి ఎంత కష్టపడ్డారో గుర్తుంచు కోవాలి. ప్రతి నిజ క్రైస్తవుడు గుర్తుంచుకోవాలి ఎలా ఓడిపోయాడో, ఓడిపోయి, మళ్ళీ ఓడిపోయాడో, చివరకు, దేవుని ద్వారా, క్రీస్తు యేసు నొద్దకు రాబట్టబడ్డావు! అందుకే ఆశ్చర్యముతో నిజ క్రైస్తవుడు ఇలా పాడతాడు,

ఆశ్చర్య కృప! ఎంత మాధుర్యము వినసంపు,
నాలాంటి దుర్మార్గుడిని రక్షించింది!
ఒకప్పుడు తప్పిపోయాను, ఇప్పుడు కనుగొనబడ్డాను,
ఒకప్పుడు అంధుడ్ని, ఇప్పుడు చూస్తున్నాను.
      ("ఆశ్చర్య కృప" జాన్ న్యూటన్ చే, 1725-1807).
      (“Amazing Grace” by John Newton, 1725-1807).

ఓ! అది ఒక ఆశ్చర్య విషయము, దేవుడు తన కృప ద్వారా, క్రీస్తు యేసుతో ఐక్య పరిచాడు!

మిమ్ముల్ని అడగాలి, "మీరు క్రీస్తు యేసు నందున్నారా?" అపోస్తలుడు మీతో చెప్పగలడు, "దేవుని ద్వారా మీరు క్రీస్తు యేసు నందున్నారు?"

మీరు నిజంగా అయన దగ్గరకు రావాలనుకుంటే యేసు క్రీస్తు చేర్చుకోడానికి సిద్దంగా ఉన్నాడు. ఎంతకాలం ద్వారం తెరిచి ఉంటుందో చెప్పలేము. పితరుడు నోవహు ఓడలో ప్రవేశించి రక్షింపబడ్డాడు. ఓడ క్రీస్తు లాంటిది. నోవహు కుటుంబం మాత్రమే ఓడలో ప్రవేశించింది ఎందుకు? ఈ ప్రసంగము రాస్తున్నప్పుడు చాలా కారణాలు ఆలోచించాను. మీరు వేరేవి ఆలోచించి ఉండవచ్చు, నేను మూడు కారణాలు ఆలోచించాను.

1. ఒకటి, తీర్పు వారి మీదికి వస్తుందని ఆలోచించలేదు – వారికి పాపపు ఒప్పుకోలు లేదు.

2. రెండు, నోవహు బోధించినది వారు నమ్మలేదు. ఆయన "నీతి బోధకుడు" (II పేతురు 2:5). వారు ఆయనబోధను నమ్మలేదు.

3. మూడు, గర్వముతో తగ్గించుకోలేదు రక్షణకు ఓడపై ఆధార పడలేదు.


క్రీస్తు నొద్దకు రాకుండా ఏదో ఒకటి మిమ్ములను ఆపేస్తుంది. మూడు మళ్ళీ చెప్తాను. ఆలోచించండి ఏ కారణము (లేక ఎక్కువ) మిమ్ములను యేసు నొద్దకు రాకుండా ఆపేస్తుంది.


1. ఒకటి, తీర్పు నీ మీదికి వస్తుందని ఆలోచించలేదు – వారికి పాపపు ఒప్పుకోలు లేదు.

2. రెండు, బోధింపబడేది నీవు నమ్మలేదు.

3. మూడు, తగ్గించుకోలేకపోతున్నావు గర్వము వలన రక్షణకు క్రీస్తుపై ఆధారపడ లేక పోతున్నావు.


ఈరాత్రి ఆస్థితిలో ఉన్నావా? గొప్ప సువార్తికుడు జార్జి వైట్ ఫీల్డ్ తో చెప్పాలి (1714-1770), "ప్రజలు [క్రీస్తు]ను అంగీకరించరు, వారికి ఆదరణ ఇవ్వలేదు, పాపముతో విసిగి పోయేవరకు, యేసును కౌగిలించుకోవడానికి ఇష్టపడే వరకు" (జార్జి వైట్ ఫీల్డ్, "సువార్త సేవకుని విధి").

నీకు విరుద్దంగా ఉంది కదా? స్వంతంగా యేసు నొద్దకు రాలేవు – రావాలి లేక నశించిపోవాలి. పాత కాలపు బోధకులు అన్నారు "సువార్త చొప్పున." నీవు నొక్కబడ్డావు. ఒక వైపు చెప్తుంది యేసు నొద్దకు రావాలని. ఇంకో వైపు చెప్తుంది నీకు నీవు గా రాలేవని. ఏమి చెయ్యాలి? మంచిది, ఈ గుడి వదిలి నీ మార్గములో వెళ్ళు, కష్టమని చెప్తూ. నోవహు దినములలో చెయ్యనిది నీవు చెయ్యవచ్చు,

"వ్యాకుల పడుడి, దుఃఖ పడుడి, ఏడువుడి: మీనవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడాయన మిమ్మును హెచ్చించును" (యాకోబు 4:9-10).

డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు,

         ఏవో ఒక "నిర్ణయము" తీసికోనేటట్టు మనం ప్రజలను తొందర పెడతాం. శ్రమను భరించిన తరువాత ఉపశమనాన్ని మెచ్చుకుంటాం. మరణ ద్వారానికి దగ్గర ఉన్నవాడు స్వస్థత నొందినప్పుడు ఎక్కువ కృతజ్ఞుడుగా ఉంటాడు. నరకానికి సమీపంగా ఉన్న వాడే ఆకాశ మహిమలను ప్రశంసిస్తాడు (Martyn Lloyd-Jones, M.D., The Assurance of Our Salvation, Crossway Books, 2000, p. 305).

క్రీస్తే నిన్ను రక్షిస్తాడు. చాలా సార్లు చెప్పను. కాని నమ్మరా మీ కనిపిస్తే తప్ప. దేవునికది తెలుసు

తని చిత్తానికి వ్యతిరేకంగా నమ్మిన వానికి
అదే అభిప్రాయము ఇంకా కలిగి ఉంటాడు.

కనుక, నీకు నచ్చ చెప్పడానికి, నిరాశ స్థితికి దేవుడు మిమ్ములను తేవాలి. క్రీస్తు కొరకు తప్పని సరి అవసరత కల్పింపబడాలి. నీలో నిరీక్షణ లేదని అనిపించాలి. ఇలా ఆలోచించాలి, "ఇలా ఇక ఉండలేను! యేసుచే నా పాపాలు క్షమింపబడాలి!" డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు, "నిస్పృహకు చేరే వరకు ఎవరు క్రీస్తు నొద్దకు రాలేరు" (Martyn Lloyd-Jones, M.D., God’s Way Not Ours, The Banner of Truth Trust, 2003, p. 71). నీ అవసరతలో దేవుడు నిన్ను మేల్కొల్పాలి, దేవుడు మిమ్ములను యేసు నొద్దకు చేర్చాలి. నీకు నీవుగా ఇవి చెయ్యలేవు. చాలా మంది ఇవి అనుభవించలేదు. వాళ్ళ నిస్సహాయత స్థితి గమనించి, యేసు దగ్గరకు రాలేదు. అందుకే అంటాను యేసు నొద్దకు రావడం ఆధిక్యత, "యేసు క్రీస్తు నందుండడం." బైబిలు చెప్తుంది, "పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే" (మత్తయి 22:14).

II. రెండవది, యేసు క్రీస్తు నందున్న వారికి అందుబాటులో ఉన్న విషయాలు.

క్రీస్తు నొద్దకు రావడం విషయం ఎక్కువ సమయం వెచ్చించాను. కాని అది చాలా అవసరం. క్రీస్తు నొద్దకు రాకుండా ఆ విషయాలు పొందుకోలేవు. క్రీస్తుకు చెందిన వారికే ఇవ్వబడతాయి, "క్రీస్తు యేసు నందున్న వారు. " పాఠ్య భాగం చెప్తుంది,

"దేవుని మూలముగా, ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్దతయు, విమోచనము నాయెను" (I కొరింధీయులకు 1:30).

జ్ఞానము, నీతి, పరిశుద్దత, విమోచనము – "క్రీస్తు యేసు నందు" ఉన్న వారికి ఈ నాలుగు దొరుకుతాయని పాఠ్య భాగము వాగ్ధానము చేస్తుంది. మొదటిది, మనకు "జ్ఞానము" ఇవ్వబడును. నేను రక్షింపబడ్డాక నన్ను బలపరచడానికి సహాయము చెయ్యడానికి ఎవరు లేవు. నా తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు, నాకు ఆదాయము లేదు. నేను ఏ తప్పులు చెయ్యవద్దనుకున్నాను. ఒక్క తప్ప మిషనరీగా అవనివ్వదు. అందుకే జ్ఞానం ఇవ్వమని దేవుని ప్రత్యేకంగా అడిగాను. ఆయన జ్ఞానాన్ని ఇచ్చాడు! నాకు భయముండేది కాలు జారుతుందేమోనని క్రీస్తు నన్ను పట్టుకోకపోతే. ఆయన నన్ను పట్టుకున్నాడు! ఆయన జ్ఞానం ఇచ్చాడు! ఒక వృద్దురాలు కాలేజిలో చదువుతున్నప్పుడు నాతో చెప్పింది, "నీవు చాలా కోపిష్ట యువకుడవు." యేసే నన్ను అలా మార్చాడు. యేసు నాకు జ్ఞానము ఇచ్చాడు. బైబిలు చెప్తుంది, "యోహావా యందు భయభక్తులు కలిగి యుండుట జ్ఞానమునకు మూలము" (సామెతలు 1:7).

రెండవది, "నీతి వాగ్దానము చేయబడింది." క్రీస్తే "మనలను నీతి మంతులుగా చేస్తాడు… నీతిగా అయ్యాడు." నీతివస్త్రాలు ధరించుకున్నాము – యేసే! పాత పాట చెప్పినట్టు, "నీతి వస్త్రములు ధరించుకొని, సింహాసనము ముందు నిరపరాదిగా నిలబడతాను" ("బలమైన బండ"). చాలా సార్లు దెయ్యము వచ్చి నాతో చెప్పింది, "నీవు ఎలా బోధిస్తావు? నీవు ఎలా నిలబడతావు?" ఓ, ఎఫెస్సీయులకు, ఒకటవ అధ్యాయములోని, ఆ మాటలు ఎంత మధురం! ఇలా చెప్తుంది, "ప్రేమ చేత మనలను ఏర్పరుచు కొనెను. ఆయన రక్తము ద్వారా మనకు విమోచనము" (ఎఫెస్సీయులకు 1:6, 7). "ప్రియుడు" యేసు. యేసు నందు అంగీకరింపబడ్డాను. నా నీతి ఆయన నుండి వచ్చింది! "నీతి వస్త్రములు దరించి, సింహాసనం ముందు నిందారహితులముగా ఉంటాము." నేను సరిగా బోధించలేనని దెయ్యం చెప్పినప్పుడు, యవనునిగా, ఆ మాటలు చెప్పను, "ఆయన ప్రియుని ద్వారా [నన్ను] అంగీకరించాడు" (ఎఫెస్సీయులకు 1:6). ఏమి ఆశీర్వాదము! సాతాను ఎదిరించేటప్పుడు ఎంత ఆదరణ. అలా శ్రమల దినాలలో పరిశుద్దులు సాతానును జయించారు! "గొర్రె పిల్ల రక్తము ద్వారా వారు జయించారు" (ప్రకటన 12:11). గొప్ప సేమినరీ కౌంట్ నికొలాస్ జింజెన్ డార్ప్ అన్నాడు,

ఆ గొప్ప దినాన్న దైర్యంగా నిలబడతాను,
నాపై నిందలు మోపే వానికి వ్యతిరేకంగా?
మీ రక్తము ద్వారా కడగబడ్డాను
పాపపు శాపము అవమానము నుండి.
("యేసు, మీ రక్తము నీతి" కౌంట్ నికొలాస్ జింజెన్ డార్ప్, 1700-1760; జాన్ వెస్లీచే అనుబదింపబడింది, 1703-1791).
(“Jesus, Thy Blood and Righteousness” by Count Nicolaus Zinzendorf,
      1700-1760; translated by John Wesley, 1703-1791).

తరువాత, కూడా, క్రీస్తు యేసు మనలను పరిశుద్దులనుగా చేసెను. పరిశుద్ధాత్మ మనలను శుద్ధి చేస్తుంది క్రీస్తు నందు మనము ఐక్యము చెయ్యబడ్డాం కనుక. ఎవరైనా క్రీస్తు నందుంటే పాత సృష్టి కాదు కొన్ని మార్పులతో. కాదు! కాదు! "ఎవడైనను క్రీస్తు నందు ఉన్న యెడల, అతడు నూతన సృష్టి: పాతవి గతించెను; ఇదిగో, సమస్తమును కొత్త దాయెను" (II కొరింధీయులకు 5:17). పాత స్వభావము స్వస్థత కొరకు ఆసుపత్రికి పంపబడదు. అది సిలువ వేయబడిన సిలువ వద్దకు పంపబడుతుంది. అది మార్చబడి మెరుగు చేయబడదు, చంపబడి పాతి పెట్ట బడుతుంది. ఆశ్చర్యంగా, ప్రజలనుకుంటారు వారు క్షమాపణకు న్యాయానికి క్రీస్తు నొద్దకు రావచ్చని; పరిశుద్ధంగా ఉండడానికి మోషే నొద్దకు రావచ్చని! అది పని చెయ్యదు! రక్షింపబడినట్టే ఎక్కువ పరిశుద్ధంగా అవుతావు – క్రీస్తును నమ్మడం ద్వారా ఎక్కువ పరిశుద్దునిగా అవుతావు. నీ రక్షణ సిలువపై ఉన్న క్రీస్తు మూలము. కృపలో నీ ఎదుగుదలకు సిలువపై ఉన్న క్రీస్తు మూలము! యేసు మన పాపాలను రక్షించాడు, "పరిశుద్దతకు" దేవుడయ్యాడు. ఈ గొప్ప మాటలు గుర్తుంచుకొండి,

అగాధ జలములలో నుండి వెళ్తున్నప్పుడు,
విషాద ప్రవాహాలు నా పై నుండి ప్రవహింపవు;
నీతో నుండి నిన్నాశీర్వదిస్తాను,
లోతైన నిస్పృహలో నిన్ను శుద్దీకరిస్తావు.
("ఎంత స్థిరమైన పునాది" జార్జి కీత్ చే, 1638-1716).
(“How Firm a Foundation” by George Keith, 1638-1716).

ఇప్పుడు, ఆఖరి విషయం క్రీస్తు మనకు "విమోచన." ఒకరు అన్నారు, "మనకివ్వబడిన వాటిలో ఇది మొదటిది కాదా?" అవును, ఆఖరిది కూడా. నీవు క్రైస్తవుడవైతే, పాపము నుండి కొంత విడుదల పొందావు, ఆయన శక్తితో పూర్తిగా విమోచింపబడలేదు. చనిపోయాక కూడా పూర్తి విమోచన లేదు. నీవు "దత్తత కొరకు, ఎదురు చూస్తున్నావు, మన శరీర విడుదల కొరకు" (రోమా 8:23). క్రీస్తులో మన విమోచన సంపూర్ణ మవుతుంది యేసు మేఘా రూడవై వచ్చినప్పుడు!

"ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బూరతోను, పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును: క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేతురు: ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు, ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము: కాగా మనం సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము" (I దెస్సలొనీకయులకు 4:16-17).

నా ముడత శరీరము మృత్యుంజయుడైన రక్షకుని శరీరము వలే అగును. నిత్వ విమోచనములో మృతులలో నుండి లేస్తాము – నిత్య ఆనందంలో జీవిస్తాం, ఎందుకంటే క్రీస్తు యేసు నందున్నాము కనుక, మన రక్షణకు ఆది అంతము. ఆఖరి విషయము.

III. మూడు, స్తుతి క్రీస్తు యేసుకు చెల్లించాలి మనలను రక్షించి నందుకు అనుగ్రహిస్తున్నందుకు.

కొన్ని మాటలు చెప్తాను.

"కానీ ఆయన ద్వారా మీరు క్రీస్తు యేసు నందున్నారు, దేవుని జ్ఞానం, నీతిని, పరిశుద్దతయు, మరియు విమోచనమును ఆయెను: అది, వ్రాసిన ప్రకారము, అతిశయించువాడు, ప్రభువు నందే అతిశయింప వలెను" (I కొరింధీయులకు 1:30, 31).

చూడండి, సహొదరి సహొదరులారా, క్రైస్తవులముగా మన ఉనికి క్రీస్తు యేసుపైననే ఆధారపడి ఉంది. క్రీస్తును నిజంగా ఎరిగిన వారు ఆయనలో మహిమ కోరుకుంటారు – వారి జీవితాలలో చేసినదానిని బట్టి క్రీస్తును పొగడాలనుకుంటారు.

"సాక్ష్యాలు" కొన్ని నేనసహ్యించుకుంటాను ప్రజలు వాళ్ళ గురుంచే మాట్లాడుతూ ఉండి, మీరు ఎలాంటి పాపులో, వాళ్ళచెడు, తిరుగుబాటు, వేర్పాటు గూర్చి వివరంగా చెప్తుంటారు. వారు ఇలా ముగిస్తారు – "అప్పుడు యేసును నమ్మాను." యేసు తరవాత వానిగా చెప్తారు. ఐదు నిముషాలు వాళ్ళను పొగుడుకుంటారు, వాళ్ళ స్వంత జీవితం గూర్చి – క్రీస్తుకు ఒకటి రెండు సెకండ్లె ఘనత చెల్లిస్తారు! ఈ సాక్ష్యాలు నన్ను భాదిస్తాయి! దేవునిని కూడ!

"అతిశయించు వాడు, ప్రభువు నందే అతిశయింప వలెను" (I కొరింధీయులకు 1:31).

మీరు ఎక్కువగా సాక్ష్యాలు చెప్పాలి మహిమ గల రక్షకుని గూర్చి! క్రీస్తు యేసు నందు మీకున్న జ్ఞానము, నీతి, పరిశుద్దత విమోచనము గూర్చి మాట్లాడాలి! ప్రభువైన రక్షకుని యొక్క మహిమలను గూర్చి మాట్లాడ గలగాలి.

రక్షింపబడని వారిని గూర్చి కొన్ని మాటలు. యేసు నొద్దకు వచ్చి ఆశీర్వాదాలు పొందుకుంటారా? యేసును నమ్మిన క్షణాన ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన రక్తము అన్ని పాపాలను కడిగేస్తుంది. ఆయన దగ్గరకు వస్తారా? తిరస్కరిస్తూ ఆత్మీయ పేదరికములో ఉండి అగ్ని గుండములో పడతారా? మీ జవాబు ఏమిటి?

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము పాస్టరుచే: I కొరింధీయులకు 1:26-31.
ప్రసంగమునకు ముందు పాట బెంజమన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్ గారిచే:
"నాకు నాకవలసింది" (రచయిత తెలియదు).
“All I Need” (author unknown).


ద అవుట్ లైన్ ఆఫ్

నాకు కావలసింది యేసే

ALL I NEED IS JESUS

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"కానీ ఆయన ద్వారా మీరు క్రీస్తు యేసు నందున్నారు, దేవుని జ్ఞానం, నీతిని, పరిశుద్దతయు, మరియు విమోచనమును ఆయెను: అది, వ్రాసిన ప్రకారము, అతిశయించువాడు, ప్రభువు నందే అతిశయింప వలెను" (I కొరింధీయులకు 1:30, 31).

(I కొరింధీయులకు 1:26-29)

I. మొదటిది, క్రీస్తు యేసు నొద్దకు చేర్చబడే ఆధిక్యత, హొషేయ 11:4; యోహాను 6:44; ఎఫెస్సీయులకు 2:6; II పేతురు 2:5; యాకోబు 4:9-10; మత్తయి 22:14.

II. రెండవది, యేసు క్రీస్తు నందున్న వారికి అందుబాటులో ఉన్న విషయాలు, సామెతలు 1:7; ఎఫెస్సీయులకు 1:6, 7; ప్రకటన 12:11; II కొరింధీయులకు 5:17; రోమా 8:23;
I దెస్సలొనీకయులకు 4:16-17;

III. మూడు, స్తుతి క్రీస్తు యేసుకు చెల్లించాలి మనలను రక్షించినందుకు అనుగ్రహిస్తున్నందుకు,
I కొరింధీయులకు 1:31.