Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
రక్షకుని అవమానము

THE SAVIOUR’S SHAME
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము సాయంకాలము, మార్చి 30, 2014
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, March 30, 2014

"ఆయన తన యెదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు" (హేబ్రీయులకు 12:2).


ఈ ప్రసంగము "బోధకుల రాజు" అయిన స్పర్జన్ ప్రసంగములో, మూడు విషయాలలో ఒక విషయము నుండి తీసుకోనబడినది. ఇది మిమ్ములను దీవించును గాక!

నేను ఆశ్చర్యపోతాను ఎందుకు ఆధునిక బోధకులు క్రీస్తు శ్రమలను గూర్చి ఆదివారము నుండి ఈస్టరు వరకు ఎందుకు బొధించరా అని. వాళ్ళ వివరణలతో సహాయపడే మాటలతో ఈస్టరు ఆదివారము వరకు కొనసాగుతారు. అప్పుడు, హటాత్తుగా, ఎక్కడా బయటకు, యేసు మృతులలో నుండి లేవడం చెప్తారు!

డాక్టర్ మైకేల్ హర్టన్ చెప్పాడు చాలా మంది సువార్త కాపరులు ఈస్టర్ దినాన యేసు పునరుత్థానము గూర్చి మాట్లాడరు! ఆయన ఒక స్వతంత్ర వేదాంతి ఒక పెద్ద సువార్త సంఘాన్ని దర్శించడాన్ని గూర్చి చెప్పాడు. అతడు సువార్త వింటాడనుకున్నాడు. దానికి బదులు ఒక బోధ విన్నాడా "మన అడ్డంకులు జయించడానికి యేసు మనకు శక్తి ఎలా ఇస్తాడో అని." తరువాత డాక్టర్ హర్టన్ ఒక స్వతంత్ర మెథడిస్ట్ వేదాంతి గురించి చెప్పాడు వేరే "బైబిలు నమ్మడం" సంఘాన్ని గూర్చి "యేసు తన లోపాలు జయించినట్లు మనం కూడా జయించగలం అని." మెథడిస్ట్ అధ్యాపకుడు అన్నాడు అనుభవం నిర్ధారించింది బైబిలు నమ్మేవారు స్వతంత్రులు మాట్లాడడానికి "పాప్ మనస్తత్వం, రాజకీయాలు, నీతి సువార్తకు బదులు" (Michael Horton, Ph.D., Christless Christianity: The Alternative Gospel of the American Church, Baker Books, 2008, pp. 29, 30).

ఈ రోజుల్లో క్రీస్తు శ్రమ మరణము గూర్చి తక్కువగా బోధింప బడుతుంది. ముఖ్య కారణాలు బోధకుడు అనుకుంటాడు గుడికి వచ్చే ప్రతి ఒక్కడు అప్పటికే క్రైస్తవుడని – కనుక క్రీస్తు శ్రమలను గూర్చి వినే అవసరం లేదని. అదే పొరపాటు తోలి పంతొమ్మిదవ శతాబ్దం సంఘము చేసింది. లూయిస్ ఓ. బ్రాస్టో అన్నాడు జర్మనీలో బోధించడం ఆ సమయంలో ఆ గుడికి హాజరయ్యే ప్రతి వారు రక్షింపబడ్డారని. డాక్టర్ బ్రాస్టో అన్నాడు, "బాప్టిస్టు గుంపు క్రైస్తవు గుంపుగా భావించి బోధించాలి...జర్మన్ బోధ నిస్సారత కనుపరుస్తుంది" (ప్రాతినిధ్య ఆధునిక బోధకులు, మాక్ మిల్లన్, 1904, పేజి 11). చాలా మంది బాప్టిస్టు బోధకులు ఈ రోజుల్లో అనుకుంటారు వాళ్ళ సభ్యులు అప్పటికే క్రైస్తవులని, కనుక క్రీస్తు శ్రమ మరణము గూర్చి బోధించే అవసరము లేదని. ఇదే వచనం వెంబడి వచనం బోధించే బలహీన పద్దతికి దారి తీసింది.

నేననుకుంటాను క్రీస్తు శ్రమను గూర్చి రక్షింపబడిన వారు వినాలి. అపోస్తలుడైన పేతురు అన్నాడు,

"క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనునట్లు, మీకు మాదిరి యుంచి పోయెను" (I పేతురు 2:21).

మన సంఘాల్లో చాలా మంది శ్రమల నుండి వెళ్ళడానికి ఇష్టపడరు. వారు ఆదివారం సాయంత్రం గాని వరం మద్యలో ప్రార్ధన కూటానికి రారు. వారు క్రీస్తు గొప్ప శ్రమలను గూర్చి గుర్తు చేయబడలేదు – దాని గూర్చి అపోస్తలుడైన పేతురు అన్నాడు "ఉదాహరణకు, ఆయన అడుగు జాడల యందు, నడవడానికి మాదిరి." ఒక వ్యక్తీ నాకు ఫిర్యాదు చేసాడు గుడికి రావడానికి నలబై నిముషాలు నడుపు కొనిరావాలని. అది మంచే చేస్తుందని చెప్పాడు. తరువాత, క్రీస్తు "మన కొరకు శ్రమపడి, మనకు మాదిరి ఉంచడం, ఆయన మార్గములో నడవడానికి." మనం బలమైన శిష్యులుగా మారగలం క్రీస్తు శ్రమల ద్వారా వెళ్ళినప్పుడు, రోమా 5:3-5 లో చెప్పబడినట్టు. ఇది మన పాఠ్యభాగానికి తీసుకెళ్తుంది, క్రీస్తు శ్రమ అవమానమును గూర్చి చెప్తుంది మన రక్షణకు ఆయన చేసింది,

"ఆయన తన యెదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు" (హేబ్రీయులకు 12:2).

ఆ పదాలు ఎత్తి చూపుతున్నాయి, "అవమానాన్ని సహించి" ఈ సాయంకాలము. గ్రీకు పదము అనువదింపబడింది "సహించి" అంటే "లెక్క చేయక" లేక "విలువ కట్టక." ఎల్లి కాట్ చెప్పాడు, "అసలు అర్ధము బలవంతమైనది, సిలువ సహించుట, అవమానము భరించుట; అలాంటి మరణ కారణంగా ఆయనకు కలిగే ఆనందము" (Charles John Ellicott, editor, Ellicott’s Commentary on the Whole Bible, vol. VIII, Zondervan Publishing House, n.d., p. 336; note on Hebrews 12:2).

ఈ సాయంకాలం నా ఉద్దేశము యేసు అవమానంలో ఎలా శ్రమ పడ్డాడో మీకు చూపడం. మనలను రక్షించడానికి ఆయన అవమానం ద్వారా వెళ్లి శ్రమపడే భయంకర స్థితి ద్వారా వెళ్ళాడు! జోసెఫ్ హార్ట్ దానిని అర్ధం చేసుకున్నాడు. ఆయన అన్నాడు,

చూడు ఎంత శాంతంగా యేసు నిలుచున్నాడో,
ఈ భయంకర స్థలములో అవమానింపబడ్డాడు!
పాపులు శక్తి మంతుని చేతులు కట్టేశారు,
సృష్టికర్త ముఖముపై ఉమ్మి వేశారు.
("ఆయన తృష్ట" జోసెఫ్ హార్ట్ చే, 1712-1768;
   పాదరిచే మార్చ బడింది).
(“His Passion” by Joseph Hart, 1712-1768; altered by the Pastor).

మన మంచి కొరకు, మన రక్షణ కొరకు, నాలుగు విధాలుగా యేసు అవమానానికి గురి అయ్యాడు.

I. మొదటిది, యేసుపై అవమాన పూరిత నేరాలను గూర్చి ఆలోచించండి.

ఆయన ఏ పాపమూ ఎరుగడు. ఆయన ఏ తప్పిదము చెయ్యలేదు. పిలాతు కూడా, రోమా గవర్నరు కూడా అన్నాడు ఆయనను సిలువ వేసినవాడు, చెప్పారు. నేరారోపణ చేసే వారిపై పిలాతు అన్నాడు, "ఈ మనష్యునిలో నేను ఏ తప్పిదము కనుగొనలేదు" (లూకా 23:4). "ఆయనలో తప్పిదము ఏ మాత్రమూ లేదు" (యోహాను 18:38). అయిన ఘోర పాపాన్ని ఆయనపై మోపారు. దేవదూషణ పాపాన్ని సేన్ హేడ్రిన్ ఆయనకు ఆపాదించాడు. ఆయన దేవదూషణ చేయగలడా? ఆయన ఎరుగెత్తి అరిచాడు ఆయన రక్తము చెమట బిందువులుగా మారినది, "తండ్రి...నా చిత్తము కాదు, నీ చిత్తమే, సిద్ధించును గాక" (లూకా 22:42). లేదు, యేసు ఎప్పుడు దేవదూషణ చెయ్యలేదు, దేవా. అది ఆయన శీలతకు వ్యతిరేకం ఈ నేర అవమానము ఆయన పొందాడు.

తరువాత ఆయనను ద్రోహి అని నిందించాడు. ఆయన ఒక ద్రోహి అన్నాడు, రోమా పరిపాలకుని వ్యతిరేకం. ఆయన రాజునని చెప్పుకున్నారని ఆరోపించాడు. ఆయన నిరాదారహితుడు. రాజుగా ఉండాలని ప్రజలు ఆయనను బలవంత పెట్టినప్పుడు, ఆయన అరణ్యములోనికి వెళ్లి ప్రార్ధించాడు. పిలాతుతో అన్నాడు, "నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు" (యోహాను 18:36). ప్రభుత్వమూపై తిరుగుబాటు చెయ్యలేదు. అయినను వారు ఆయనను నిందించారు.

II. రెండవది, యేసు సహించిన అవమాన పూరిత వెక్కిరింతను గూర్చి ఆలోచించండి.

ఆయన అవమానాస్పద వెక్కిరింత ద్వారా వెళ్ళాడు. సైనికులు ఆయనను దిగంబరుని చేసారు. రెండు మార్లు దిగంబరునిగా చేసారు. చిత్ర కారుడు సిలువపై వస్త్రాన్ని వేసినప్పటికినీ, వాస్తవానికి ఆయన దిగంబరిగా ఉన్నాడు. ఆయన దిగంబర శరీరాన్ని మూర్ఖ జనుల చూచే కళ్ళను వెక్కిరించే నొల్ల నుండి కాపదాలేదు. ఆయన వస్త్రం గురించి చీట్లు వేసుకున్నారు సిలువపై ఆయన దిగంబరత్వాన్ని కప్పడానికి ఏమీ లేనప్పుడు.

దైవ కుమారినిగా ఆయన స్వభావాన్ని వారు అపహసించారు. వాళ్ళు అన్నారు, "నీవు దేవుని కుమారునివైతే, సిలువపై నుండి దిగు" (మత్తయి 27:40). వాళ్ళు ఆయనపై అరిచారు,

"వాడు దేవుని యందు విశ్వాసము ఉంచెను; నేను దేవుని కుమారుడని చెప్పెను, గనుక ఆయన కిష్టుడైతే ఆయన: నేను దేవుని కుమారుడిని, ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను, అలాగే ఆయనను, నిందించిరి" (మత్తయి 27:43:44).

వాళ్ళు అంతగా అవమానించినా ఒక్క మాట కూడా పలక లేదు – ఎందుకంటే "అవమానమున్నప్పటికి, ఆయన సిలువను సహించేను" (హేబ్రీయులకు 12:2).

మళ్ళీ, ఆయన అపహసించి అవమానంగా నవ్వారు ఇశ్రాయేలు రాజు అంటూ. ఆయన వారి రాజు, కాని వారు ఆయనను తృనీకరించారు, నవ్వారు, అవమానించారు. ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు. ఆయన వేలకొలది దేవా దూతల సమూహాన్ని రప్పించి నాశనము చేయగలడు. ఆయన కేక వేసి భూమిని తెరిపించగలడు, "సజీవంగా ఆ గోతిలో" మింగి వేయింపగలడు కోరహుతో పాటు, మోషేకు వ్యతిరేకంగా మాట్లాడాడు, క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడాడు (సంఖ్యాకాండము 16:33). ఆకాశము నుండి అగ్నిని రప్పించి సజీవ దహనము చేయించగలడు, ఎలియా ఆహా బురాజు సైనికులకు చేసినట్టు (II రాజులూ 1:9-10). "అయినను ఆయన నోరు తెరువలేదు" ఆయనను సమర్ధించుకుంటూ (యెషయా 53:7).

ప్రవక్త అంటూ ఆయనను అపహసించారు. ఆయన కళ్ళు మూశారు. పిడికిలితో గుడ్డుతూ, అన్నరు, "నీవు క్రీస్తు, అతను నిన్ను కొట్టినవాడెవడో ఎవరు, నిన్ను గుద్దిన వాడెవడో ప్రవచింపుము అనిరి?" (మత్తయి 26:68). మనం ప్రవక్తలను ప్రేమిస్తాం. క్రీస్తును గూర్చిన ప్రవచనాలతో యెషయా మనలను ఉత్తేజ పరిచాడు, మన ఆత్మల రక్షణను గూర్చిన దృష్టితో. ఎంత విశాదలగా ఆలోచించాలి యేసును ప్రవక్తగా, కళ్ళు మూయబడి కొట్టబడి, అపహసించబడి అవమానింపబడి ప్రధాన యాజనికి గృహములో!

మన యాజకునిగా ఆయన శ్రమపడ్డాడు. యేసు మన యాజకునిగా ఉండడానికి త్యాగం చెయ్యడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన యాజకత్వాన్ని కూడా అపహసించారు. యాజకుల చేతిలో రక్షణ అంతా ఉండేది. ఇప్పుడు ఆయనతో అంటున్నారు, "నీవు క్రీస్తు వైతే, నిన్ను నీవు రక్షించుకొని మమ్ములను రక్షించుము." ఆయన గొప్ప ప్రధాన యాజకుడు. ఆయన గొర్రె పిల్ల. లోక పాపములను మోసికొని పోవు దేవుని గొర్రె పిల్ల. నిర్దయ అపహస్యాన్ని ఆయన సహించడం ఎంత భయంకరం! అయినను సిలువ సహించాడు, "అవమానమును భరిస్తూ" (హేబ్రీయులకు 12:2).

III. మూడవది, అవమానకరంగా మెత్తబడడం ఆయన సహించిన సిలువ మరణం గూర్చి ఆలోచించాలి.

ఆయన మెత్తబడుతూ అపహసించబడ్డాడు. ప్రారంభపు సంఘ తండ్రులు క్రీస్తును గూర్చిన భయంకర మెత్తబడటాన్ని వివరించారు. అది వాస్తవమా మనం చెప్పలేం. కాని ఆయన మెత్తబడడం అమానుషం, ఎందుకంటే ప్రవక్త అన్నాడు,

"మన అతిక్రమములను బట్టి అతడు గాయ పరచబడెను, మన దోషములను బట్టి నలుగ గొట్టబడెను: మన సమాధానార్ధమైన శిక్ష అతని మీదపడెను; అతడు పొందిన దెబ్బలు చేత మనకు స్వస్థత కలుగుచున్నది" (యెషయా 53:5).

భయంకరంగా ఆయన వీపు దున్నబడింది – ఎందుకంటే ప్రవక్త అన్నాడు "గాయ పరచబడ్డాడు," "మెత్తబడ్డాడు," "బాదింపబడ్డాడు," "దెబ్బలు తిన్నాడు." గట్టిగా ఆయన వీపుపై బాదినప్పుడల్లా, కొట్టేవారు వెకిలి నవ్వు నవ్వేవాడు. ప్రతిసారి గాయాల నుండి రక్తం కారేది, ఎముకలలో నుండి మాంసపు ముక్కలు వచ్చాయి, అవమానకర పరిహాసము జరిగేది ఆయన భాదను ఇంకా పెంచడానికి. అయినను మన మంచికోసం, మన రక్షణ కోసం, అవమానాన్ని తృనీకరించెను!

తరువాత ఆయన సిలువను చేరాడు. ఆయనను మేకులతో కొట్టారు. సాతాను రోశములో ఆయన శ్రమ పడుతున్నప్పుడు నవ్వి అపహసించారు! ప్రధాన యాజకులు శాస్త్రులు కూర్చొని ఆయన సిలువ వేయబడడం చూసారు. నేను ఊహించగలను, "జన సమూహములలో ఇక ఎన్నడు ఆయన వెళ్ళాడు!" "హ, హ, హ, కుష్టు రోగులను ముట్టి స్వస్థత పరచిన ఆ హస్తాలు, చనిపోయిన వారిని లేపినవి, మళ్ళీ అలా చేయ్యనేరవు!" వాళ్ళు ఆయనను అపహసించారు. చివరగా, ఆయన అన్నాడు, "నేను దప్ప్తి గోనుచున్నాను," వారు చిరకను ముంచి ఇచ్చారు – ఆయన తడి ఆరిన నోటిని మ్రింగి వేయబడిన నాలుకను అపహసిస్తూ!

చూడు ఎంత ఓపికతో యేసు నిలుచున్నాడో,
   అవమానింపబడ్డారు ఆ భయంకర స్థలములో!
పాపులు సర్వ శక్తుని చేతులు బంధించారు,
   వారి సృష్టికర్త ముఖముపై ఉమ్మి వేసారు.

ముళ్ళతో ఆయన దేహము చిత్ర వధ చేయబడింది,
   ప్రతి భాగము నుండి రక్తము ప్రవహించింది;
భారీ శాపాలు తనను తిరిగి కుదిపేసింది,
   ఇంకా పదునుగా ఆయన హృదయము చీల్చబడింది.

సిలువ! సిలువ! ఈనాడు ఆ పదాలు మనం వింటే అవమానపు తలంపులు మనకు రావు. కాని క్రీస్తు కాలంలో సిలువ భయంకరంగా చూడబడింది శిక్షలన్నింటిలో అది దుర్భరం. ఈ భయంకర సిలువ మరణ పద్దతి, భయంకర దొంగలకు ఉంచబడింది – యజమానుని చంపిన భానిసకు, అప్పగించిన వానికి, బందిపోటు దొంగలకు. సిలువ మరణాన్ని భయంకరమైనదిగా భాధాకరమైనదిగా చేసింది. సిలువ మరణము దుష్టులకు – హంతకునికి, దుష్టునికి, వేదించువానికి. అది దీర్ఘమైన భాదతో, కూడిన మార్గం చనిపోవడానికి. రోమా ప్రపంచంలో పద్దతులన్నింటిలో, సిలువ మరణమంత క్రూరమైనది, ఇంకొకటి లేదు. మనకు పూర్తిగా అర్ధం కావడం లేదు సిలువపై మరణించడం ఎంత అవమానకరమో. కాని యూదులు రోమీయులు ఎరుగుదురు. క్రీస్తుకు తెలుసు దిగంబరిగా సిలువకు మేకులు కొట్టబడడం ఎంత అమానుషమో. క్రీస్తు సిలువ మరణం ఇతరుల దాని కంటే దయానీయం. తన స్వంత సిలువను వీధుల ద్వారా మోసాడు. ఇద్దరు దొంగల మద్య సిలువ వేయబడ్డాడు, బందిపోటు అంత చెడ్డవానిగా పరిగణింపబడ్డాడు. ఇది ఆయన చావూ ఇంకా అవమానకరం చేసింది. కాని ఆయన అవమానం త్యజించి సిలువను సహించాడు – మన రక్షణ కొరకు, మనకు మాదిరిగా!

IV. నాల్గవది, మనం యేసు సిలువకు అతి సమీపంగా వద్దాం, అందులో ఉన్న అవమానాన్ని ఇంకా ఎక్కువగా చూద్దాం.

సిలువ! సిలువ! ఆ తలంపే మన హృదయాలను విషాదంతో నింపేస్తుంది! ఆ మానునేలపై ఉంచబడింది. క్రీస్తు త్రోయబడ్డాడు. నలుగురు సైనికులు ఆయన చేతులు లాగి కళ్ళకు చేతులకు మేకులు కొట్టారు. రక్తం ప్రవహించింది. గాలిలోకి లేపబడ్డాడు. త్రవ్వి ఉంచబడిన గోతిలో సిలువ ఉంచబడింది. చేతులు స్థానభ్రంశంయ్యాయి. విపరీత భాదింప బాలన ఎముకలు వాటి స్థలాలు మారాయి. దిగంబరిగా వేలాడాడు, సమూహం చూస్తున్నారు. మండుచున్న సూర్యుడు ఆయన శరీరంపై పడుచున్నాడు. ఆయన శరీరంలో వేడి ఉద్భవిస్తుంది. నాలుక ఎండిపోయి అంగడికి అంటుకుంటుంది. ఆ భాద భరింపరానిదిగా ఉంది.

అంతకంటే మించి, హత సాక్షులకివ్వబడే శక్తి కోల్పోయాడు. దేవుని సన్నిదిని కోల్పోయాడు. మన పాపాలకు పరిహారంగా తండ్రి ఆయనను చేసాడు. ఇప్పుడు తండ్రి "తృప్తి చెందాడు...నలుగగొట్టడానికి; బాదింపడానికి: [ఆయన చేసాడు] పాప పరిహరార్ధంగా ఆయన ఆత్మను చేసాడు" (యెషయా 53:10). చూడండి యేసును – దేవునిచే విడువబడి స్నేహితులచే త్యజించబడ్డాడు!

దిగంబరిగా మానుపై మేకులతో కొట్టబడ్డాడు,
   భూమికి పై ఆకాశమునకు బహిర్గతమయ్యాడు,
గాయాల రక్తం దృశ్యం,
   గాయపడిన ప్రేమ ప్రదర్శన.

జాగ్రత్తగా విను! ఆయన భయంకర కేకల సాదృశ్యం
   దూతలను కదిలించాయి, వీక్షిస్తుండగా;
రాత్రి తన స్నేహితులు పరిత్యజించారు,
      ఇప్పుడాయన దేవుడు కూడా ఆయనను వదిలి పెట్టేసాడు!

ఇక్కడ యేసు వంటరిగా ఉన్నాడు. భయముతో శిష్యులు పారిపోయారు. దేవుడు ఆయన శిక్షించి తిప్పేసుకున్నాడు. యేసు ఒంటరిగా ఉంది, ఆయన రక్తములొ తెలియాడుతున్నాడు! మన మంచి కొరకు మన రక్షణ కొరకు, ఆయన మెత్తబడి, నలుగగొట్టబడి, నశింపబడి, మరణము ఆగునంతగా ఆయన ఆత్మ విశదమైంది.

పాత దినాల్లో స్త్రీ పురుషులు ఏడ్చేవారు యేసును గూర్చిన వివరణ చూసి. కొన్ని సార్లు ఆరాధనలో బిగ్గరగా ఏడ్చేవారు. కాని ఇప్పుడు అది చరిత్ర పుస్తకాలలో చదువుతున్నం. మీ తరము, టెలివిజన్ వేలకొలది హత్యలు చూసి, ఒక కన్నీరు కూడా కార్చారు. మీ తరము, యాబై అయిదు మిలియన్లు గర్భ స్రావాలు చూసి, కొద్దిగా కూడా దుఃఖానికి తావివ్వరు, మీ తరముల సహజ ఆప్యాయతకు తావివ్వరు! మీది మామూలు తరమైతే, మీకు గొప్ప వేదన మీ హృదయాల్లో ఉంది ఉండేది మీ ఆత్మల రక్షణార్ధం యేసు దీని ద్వారా వెళ్ళాడని.

దయచేసి ఆలోచించండి, నా స్నేహితులారా, యేసు ఈ బాధ ద్వారా వెళ్ళాడు ఈ అవమానాన్ని భరించాడు, మీ రక్షణ కొరకు మీకు మాదిరిగా. సిలువను సహించాడు, అవమానాన్ని భరించాడు నీ కోసం.

"మన మింకను పాపులమై యుండగా, క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి, ఆయన రక్తము వలన, ఇప్పడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము" (రోమా 5:8-9).

దయచేసి నిలబడి పాటల కాగితంలో ఆఖరి పాట పాడదాం.

మహాత్ముడైన నా ప్రభు,
   విచిత్ర సిల్వా చూడనా,
యాస్తిన్ నస్టంబునా నెంచి,
   గర్వం బడంగ ద్రొక్కదున్.

నీ సిలువ కాగ మొదేవా, ప్రభువా, నేను ప్రగల్భాలు పలకాలి,
   క్రీస్తు మరణంలో నన్ను రక్షించు, నా ప్రభువా;
నన్నా హరించు సర్వమాన్,
   నీ సిలువకై త్యజింతును.

చూడుము, శిరంబు, పాద, హస్తముల్,
   సూచించు దుఃఖ ప్రేమలు;
మరెన్నడైన గూడినా,
   విషాద ప్రేమ లీ గతిన్?

లోకంబు నేనర్పించిన,
   నయోగ్యమైన యీవియౌ;
వింతైన, యేసు ప్రేమకై,
   నా ఆత్మ, నా జీవితం, నా అన్ని ఇస్తాను.
("మహాత్ముడైన నా ప్రభూ" డాక్టర్ ఐజాక్ వాట్స్, 1674-1748).

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రదోమేచే: మత్తయి 26:59-68.
ప్రసంగమునకు ముందు పాట బెంజమన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్ గారిచే:
"ఆయన తృష్ట" (జోసెఫ్ హార్ట్ చే, 1712-1768).
“His Passion” (by Joseph Hart, 1712-1768).


ద అవుట్ లైన్ ఆఫ్

రక్షకుని అవమానము

THE SAVIOUR’S SHAME

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"ఆయన తన యెదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు" (హేబ్రీయులకు 12:2).

(I పేతురు 2:21)

I. మొదటిది, యేసుపై అవమాన పూరిత నేరాలను గూర్చఆలోచించండి, లూకా 23:4; యోహాను 18:38;
లూకా 22:42; యోహాను 18:36.

II. రెండవది, యేసు సహించిన అవమాన పూరిత వెక్కిరింతను గూర్చి ఆలోచించండి, మత్తయి 27:40, 43-44; సంఖ్యా కాండం 16:33; II రాజులు 1:9-10; యెషయా 53:7;
మత్తయి 26:68.

III. మూడవది, అవమానకరంగా మెత్తబడడం ఆయన సహించిన సిలువ మరణం గూర్చి ఆలోచించాలి, యెషయా 53:5.

IV. నాల్గవది, మనం యేసు సిలువకు అతి సమీపంగా వద్దాం, అందులో ఉన్న అవమానాన్ని ఇంకా ఎక్కువగా చూద్దాం, యెషయా 53:10; రోమా 5:8-9.