Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




మత భ్రష్టత్వానికి విరుగుడు

THE ANTIDOTE FOR APOSTASY
(Telugu)

by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము సాయంకాలము, మార్చి 23, 2014
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, March 23, 2014

"క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా, రక్షణార్ధమైన జ్ఞానము నీకు కలిగించుటకు; శక్తిగా పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు కనుక, నీవు నేర్చుకొని రూడియని తెలిసికొన్నవి ఎవని వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలిసికొని వాటియందు నిలకడగా ఉండుము" (II తిమోతి 3:14-15).


నేను ఈ శీర్షికను, "మత భ్రష్టత్వానికి విరుగుడు," డాక్టర్ జె. వెర్నాన్ మెక్ గీ నుండి తెచ్చుకున్నాను. డాక్టర్ మెక్ గీ చాలా సంవత్సరాలు నాకు బైబిలు బోధకుడు. 19 సంవత్సరాల వయస్సులో జనవరి, 1961, న లాస్ ఎంజిలాస్ లో చైనీస్ బాప్టిస్టు సంఘములో నేను చేరాను. నాకు ఇద్దరు గొప్ప బైబిలు భోధకులు ఉండేవారు, డాక్టర్ తిమోతి లిన్, పాత నిబంధన తత్వవేత్త – బాబ్ జోన్స్ విశ్వ విద్యాలయ పట్టబద్ర పాఠశాలలో, టూల్ చోట వేదాంత సేమినరీలో, డీర్ ఫీల్డ్, ఇల్లి నాయిస్, ట్రినిటి సువార్తిక సెమినరీలో బోధించారు. నాకు చాలా సంవత్సరాలు కాపరిగా ఉన్న, డాక్టర్ లిన్ నుండి ఎంతో నేర్చుకున్నాను. ఇంకొక బోధకుడు డాక్టర్ జె.వెర్నాన్ మెక్ గీ, ఆయన డౌన్ టౌన్ లాస్ ఎంజిలాస్ లో, 550 దక్షిణ నిరీక్షణ వీధిలో ఉన్న తెరిచినా ద్వారమనే గొప్ప సంఘములో కాపరిగా ఉన్నారు, నేను సభ్యునిగా ఉన్న చైనీయ సంఘము అక్కడికి దగ్గర.

మూడు సంవత్సరాలు డాక్టర్ మెక్ గీ రోజు రెండు సార్లు బైబిలు బోధించడం విన్నాను – "బైబిలు ద్వారా" రేడియో కార్యక్రమము ద్వారా, మరియు "హైనూన్" ప్రసారము ద్వారా, "బైబిలు ద్వారా" వేరే లేఖన భాగాల నుండి. "బైబిలు ద్వారా" ప్రతి రోజు ఏడూ సంవత్సరాలు విన్నాను. ఆ ఇద్దరు మేధావుల నుండి పరిశుద్ద లేఖనములలోని బైబిలు పదాలపై, పూర్తీ నమ్మకం కుదరడం నేర్చుకున్నాను.

డాక్టర్ లిన్ మరియు డాక్టర్ మెక్ గీ బైబిలు ప్రవచనాలు బోదించడంలో సమయము ఎక్కువగా వెచ్చించారు. నా బోధలో ఎక్కువగా "సోటేరియాలజీ" (రక్షణ) పై దృష్టి సారించినా బైబిలు ప్రవచనాలు వెలుగులో చేసాను, ప్రత్యేకించి చివరి దినాలలో మత భ్రష్ట త్వమును గూర్చి. డాక్టర్ మెక్ గీ సరిగ్గా అన్నారు II తిమోతి మూడవ అధ్యాయములో "సంఘము ఎత్తబడే ముందు ఆఖరి దినాల చిత్ర పటము. ఈలాంటి దినాలలో దేవుని బిడ్డ ఏమి చేస్తాడు? మత భ్రష్టత్వ ప్రపంచానికి దేవుని వాక్యము ఒక్కటే విరుగుడు" (J. Vernon McGee, Th.D., Thru the Bible, Thomas Nelson Publishers, 1983, p. 472; note on II Timothy 3:14-15).

II తిమోతి మూడవ అధ్యాయము ఆఖరి దినాలలో మత భ్రష్టత్వాన్ని గూర్చిన భయంకర భయపెట్టే చిత్ర పటాన్ని ఇస్తుంది. ప్రతి సూచన చెప్తుంది మనం మత భ్రష్టత భయంకర దినాల మద్య ఉన్నామని! పదము "మత భ్రష్టత్వము" అనగా "లోప భూ ఇష్టము లేదా తిరుగుబాటు; మతము నుండి ఒకడు పడిపోవుట లేక వెలివేయబడుట" (వెబ్ స్టర్స్ డిక్షనరీ, ఆన్ ఎ బ్రిడ్జేడ్, కోలిన్స్ వర్డ్, 1975). అయినా మన పాఠ్యభాగము విరుగుడు, మార్గము ఇస్తుంది, మత భ్రష్టత్వానికి,

"క్రీస్తు యేసు నందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్ధమైన జ్ఞానము, నీకు కలిగించుటకు శక్తిగా; పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు కనుక, నీవు నేర్చుకొని రూడియని తెలిసికొన్నవి ఎవని వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలిసికొని వాటియందు నిలకడగా ఉండుము" (II తిమోతి 3:14-15).

ఈ పాఠ్య భాగము ఇంకా దగ్గరగా చూద్దాం చాలా విషయాలు తెలుసుకుందాం.

I. మొదటిది, "కాని" అనే పదము పై దృష్టి సారించుట.

"కాని నీవు నేర్చుకొనిన వాటియందు నిలకడగా ఉండుము..." (II తిమోతి 3:14).

దీనిని అనువదింపవచ్చు "అయినను" అని. దుష్టులు దిగజారిపోయి, ఇతరులను మోసగించి మోసపోతారు, "కాని [అయినను] నేర్చుకున్న వాటిలో నిలకడగా ఉండుము..." అవి ఎంత చెడ్డవైనప్పటికి, నేర్చుకున్న వాటిలో కొనసాగుతావు. అదే అపోస్తలుడైన పౌలు యవ్వన తిమోతికి చెప్తున్నాడు – మనకు కూడా.

ఈ పాఠ్య భాగము ఆఖరి దినాలలో సంఘాన్ని గూర్చి చెప్తుంది. మనకు అది తెలుసు ఎందుకంటే మనకు చెప్పబడింది "దైవత్వ రూపము" ఉంటుందని (వచనము 5) మరియు "నేర్చుకుంటూనే [కాని] విశ్వాసమును గూర్చిన విషయము" (వచనాలు 7, 8). డాక్టర్ మెక్ గీ అన్నాడు, “‘అంత్య దినాలలో’ ఈ పదము కొత్త నిబంధనలో చాలా చోట్ల వాడబడింది; సంఘము అంత్య దినాలను గూర్చి" (ఐబిఐడి., పేజి 469). ఆయన సరి అని నేను నమ్ముతాను. "అపాయకర కాలములు వచ్చును." అంటే భయంకర, నిస్పృహ సమయాలు. గ్రీకు పదము "అపాయకరమైన" అంటే "చాలేపోస్." అది ఒక్కసారే గ్రీకు నూతన నిబంధనలో కనిపిస్తుంది. మత్తయి 8:28 "మిగుల ఉగ్రులైన" గదరేనీయుల దయ్యము పట్టిన వారి ప్రస్తావనలో. కనుక, మనకు చెప్పబడింది, అంత్య దినాలలో ఉగ్రదయ్యల కాలము సంఘాలలో వస్తుందని. అపోస్తాలుడు అంత్య దినాలలో సంఘస్తులలో ఉండే పంతొమ్మిది వివిధ వివరణలు అపోస్తాలుడు ఇచ్చాడు. మళ్ళీ, డాక్టర్ మెక్ గీ అన్నాడు, "మీరు సంఘ చరిత్ర చూస్తె, తప్పనిసరిగా ఈ విషయాలు రుజువుతో చూస్తారు, ఈ రోజుల్లో ఉన్నంతగా మునుపెన్నడూ ఈ స్థితి లేదు. ఇలాంటి ‘భయంకర’ దినాలలో మనమున్నామని నేను నమ్ముతాను అది వివరింపబడ్డాయి" (ఐబిఐడి.). ఆ పంతొమ్మిది వివరాలు ఈ రోజుల్లో సంఘస్తుల్లో కనిపిస్తున్నాయి,

1.  స్వార్ధ ప్రియులు (స్వార్ధ గలవారు)
2.  ధనాపేక్షులు (డబ్బు ప్రేమికులు, వస్తు అభిలాషకులు).
3.  బింకము లాడువారు
4.  అహంకారులు
5.  దూషకులు (దూషించువారు)
6.  తల్లిదండ్రులకు అవిదేయులు (తరమంతా ఇలా పెంచబడింది
      సమాజమంతా అదే స్థితి).
7.  కృతజ్ఞత లేనివారు
8.  అపవిత్రులు (మంచి తలంపులు లేని స్థితి)
9.  అనురాగ రహితులు (ప్రేమించని హృదయం లేని స్థితి)
10.  అతి ద్వేషులు (క్షమింపరు క్షమింపబడరు).
11. అపవాదకులు (అల్లర చిల్లర మాటలు).
12. అజితేంద్రియులు (నిగ్రహము లేనివారు).
13. క్రూరులు (క్రూరత్వము)
14. సజ్జన ద్వేషులు (మంచి క్రైస్తవులను అసహ్యించు కొనువారు)
15. ద్రోహులు (నమ్మక ద్రోహం)
16. మూర్ఖులు (నిర్లక్ష్యత ఆవేశం)
17. గర్వాందులు (అహంకారము)
18. దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు
19. పైకి భక్తీ గల వారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని
      వారు.

అపోస్తేట్ సంఘాల్లో సెమినరీలలో అబద్ద క్రైస్తవులున్నారు. భాహ్యనికి దైవ సేవకులుగా అనిపిస్తారు, వాస్తవానికి వారు సాతాను సేవకులు.

వారు "నేర్చుకుంటూనే ఉంటారు, సత్య జ్ఞానములోనికి రారు" (వచనము 7). ఇలాంటి వారు ఇప్పుడు మన సంఘములో ఉన్నారు. నేను ఎదుర్కొన్న చేదు అనుభవాలు సంఘస్తుల నుండే ఎదురయ్యాయి – అతి భయంకర మైనవి సంఘస్తులు కాని వారి దగ్గర నుండి రాలేదు.

నేను బాప్టిస్టులను చూసాను ఒకరినొకరు జుట్టు పీక్కోవడం, దుర్భాషలతో శపించుకోవడం, ఒకరిపై ఒకరు పాటల పుస్తకాలు విసురు కోవడం – ఉదయం 11 గంటలకు ఆదివారం ఉదయం ఆరాధనలో. నేను చూసాను ఒక సంగీత బృంద నాయకుడ్ని కిందపడేసి, ముఖంలో రక్తం వచ్చే వరకు కొట్టి, జేబులు చింపి గుడికి తాళాలు తేవడం. దీనిని సంఘ "పరిచారకులు" చేసారు. ఇది 1950లో జరిగింది ఒకరిపై ఒకరు అభియోగాలు వేసుకొకముందు. అది కాలిపోర్నియాలో, హంటింగ్ టన్ పార్క్ బాప్టిస్టు సంఘములో జరింగింది.

అప్పటి నుండి నేను చూసాను సంఘ నాయకులు చిన్న పిల్లలతో జారత్వము జరిగించడం, గుడిలో డబ్బు దొంగిలించడం; పాదరి తల లాగడం, ఇంకొకరు అతని కడుపులో గుద్దడం, అంతర్జాలములో అబద్దలాడుకోవడం, కొన్ని చెప్పలేని అరాచకాలు. నాకు సబ్భాతు బడిలో బోధించిన అతడు తుపాకి చూపించి బేంకు దొంగతనం చేసాడు. నా సెమినరీలో బాప్టిస్టు బోధకులు చెప్పారు యేసు శరీరమును కుక్కలు తిన్నాయని, క్రీస్తు రెండవ రాకడలేదని, బైబిలులో అన్ని పుస్తకాలు తప్పుడువని, మోషే అనే వ్యక్తీ లేదని, ఐగుప్తు నుండి విడుదల జరగలేదని, ఇంకా ఇలాంటి తప్పుడు సిద్ధాంతాలు. నా బోధకులలో ఒకడు తుపాకితో తలలో కాల్చుకుని, ఆత్మహత్య చేసుకున్నాడు.

వీళ్ళంతా దక్షిణ బాప్టిస్టు సంఘాల వారు. వాళ్ళంతా "ముందుకు వచ్చి" "పాపి ప్రార్ధన" చెప్పారు బాప్మిస్మమునకు ముందు. చాలా కాలం నేను తికమకలో ఉన్నాను, క్రైస్తవులు వాటిని నమ్మి ఎందుకిలా చేస్తారని ఆశ్చర్యపోతూ. వీటికి వ్యతిరేకంగా వీటికి మాట్లాడితే, "సమస్య కారకునిగా" ముద్ర వేస్తారని హెచ్చరించారు దక్షిణ బాప్టిస్టు సంఘనిగా కాపరిగా పిలవమన్నారు. తరువాత అబద్ద బోధలను గూర్చి పుస్తకము వ్రాసాను. దాని పేరు "దక్షిణ బాప్టిస్టు సదస్సు లోపలి విషయాలు."

దక్షణ బాప్టిస్టు సెమినరీలో పట్టబద్రుడనైన తరువాత డాక్టరేట్ కొరకు ప్రేస్బిటేరియన్ సెమినరీకి మార్చబడ్డాను. ఆ ప్రేస్బిటేరియన్ సేమినరీ ఇంకా ఘోరము! ఒక బోధకుడు నాస్తికుడు, దాని గూర్చి చెప్పేవాడు! నేను గ్రహించాను ఈ బోధకులు రెండు సేమినరీలలో తిరిగి జన్మించలేదు, నిజ మార్పు అనుభవము లేదు, క్రైస్తవులే కాదు. ఇది వింటూ మీలో కొందరు నేను ఎక్కువగా చేసి చెప్తున్నానని, గాని నేను హామీ ఇస్తున్నాను దేవుని దృష్టిలో ఒక్క మాట కూడా అతిగా గాని హెచ్చించి కాని చెప్పలేదు.

నా కళ్ళతో చూసాను అంత్య దినాలలో తప్పిపోయిన సంఘస్తులలో ఆ పంతొమ్మిది వివరణలు ఉన్నాయి. "అంత్య దినాల" మత భ్రష్టత్వన్ని అది వివరిస్తుంది. ఇవి ప్రతి తెగలో సహవాసములో ప్రపంచమంతటా చోటు చేసుకుంటున్నాయి. నాకు తెలుసు చాలా మంది యవనస్తులు ఊడ్చబడి పరాజయం పొందారు క్రైస్తవత్వ మత భ్రష్టత్వములో ఉన్న శరీర కార్యాలు చూసి. నాకు గుర్తింది ఒక యవన మంచి బోధకుడు సువార్తీకరణలో ఉత్సాహమున్న వాడు దక్షిణ బాప్టిస్టు సెమినారీకి వచ్చాడు. ఒక సెమిస్టర్ తరువాత పరిచర్య వదిలేసాడు. వెళ్ళే ముందు నాతో చెప్పాడు, "ఉండడం వలన ఉపయోగం ఏంటి? మా బోధకులకు అదీ వాళ్ళు బోదిస్తున్నారు. వాళ్ళు ఏదీ నమ్మరు."

I. రెండవది, పదునాల్గవ వచనము మిగతా భాగముపై దృష్టి సారించుట.

"నీవు నేర్చుకొని రూడియని తెలుసుకొన్నవి ఎవని వలన నేర్చుకుంటివో, ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము" (II తిమోతి 3:14).

మత భ్రష్టత్వముతో నిండిన ఈ అంత్యదినాల్లో క్రైస్తవుడు ఏమి చేయగలడు? మత భ్రష్టత్వమునకి విరుగుడు బైబిలు, సజీవుడైన దేవుని వాక్యము. అపోస్తలుడైన పేతురు బైబిలును అన్నాడు, "చీకటి గల చోటు వెలుగిచ్చు దీపమైయున్నది" (II పేతురు 1:19).

సెమినరీ వదిలెయ్యడానికి, సేవను విడిచి పెట్టడానికి నన్ను ఆపిన విషయము, "[నేను] నేర్చుకోనినవి [రూడి] యని తెలుసుకొన్నవి, ఎవని వలన నేర్చుకుంటినో [నేను] నిలకడగా ఉన్నాను" (II తిమోతి 3:14). యవన తిమోతి లేఖనాలు అమ్మమ్మ దగ్గర, తల్లి దగ్గర, పౌలు దగ్గర నేర్చుకున్నాడు (చూడండి II తిమోతి 1:2, 5). నేను బైబిలు, బ్రష్టత్వాన్ని గూర్చిన ప్రవచనాలు, డాక్టర్ మెక్ గీ డాక్టర్ లిన్ దగ్గర నేర్చుకున్నాను. వాస్తవానికి, నేను మారిన రోజు చిన్న ప్రసంగము డాక్టర్ చార్లెస్ జె. ఉడ్ బ్రిడ్జి నుండి, ఆయన స్వతంత్రతకు వ్యతిరేకంగా పుల్లర్ వేదాంత సేమినరీలో మాట్లాడారు, రెండేళ్ళ తరువాత దానిని బట్టి రాజీనామా చేసారు. డాక్టర్ ఉడ్ బ్రిడ్జి "భ్రష్టులను" గూర్చి "అంత్య దినాలలో" ఉన్న మాట్లాడారు II పేతురు మూడవ అధ్యాయము నుండి ఆ రోజే రక్షింపబడ్డాను (చూడండి II పేతురు 3:3). స్వాతంత్ర్య సేమినరీకి వెళ్ళాక ముందే మత భ్రష్టత గూర్చి నాకు తెలుసు. బైబిలుపై పూర్తిగా ఆధారపడడం నేర్చుకున్నాను, మారని బోధకుల అభిప్రాయము నమ్మే బదులు. నేను డాక్టర్ ఉడ్ బ్రిడ్జి, డాక్టర్ లిన్, డాక్టర్ మెక్ గీ నుండి నేర్చుకున్నాను దేవుని వాక్యాన్ని నమ్మే విషయము. అపోస్టేట్ సేమినరీలో నా పాఠ్య భాగము కీర్తనలు 119:99,

"నేను శాసనములను [బైబిలు] ధ్యానించు చున్నాను: కావున నా భోధకులందరి కంటే నాకు విశేష జ్ఞానము కలదు" (కీర్తనలు 119:99).

యవనస్తులారా, మీ కళాశాలల్లో వారు ఏమి బోధిస్తారో నాకు తెలుసు. లాస్ ఎంజిలాస్ సిటి కళాశాల నుండి లాస్ ఎంజిలాస్ లోని కాలిపోర్నియా స్టేట్ యూనివర్శిటి నుండి నేను పట్టభద్రుడయ్యాను (బి.ఎ., 1970). వాళ్ళు క్రైస్తవత్వాన్ని ఎలా ఎదిరిస్తారో నాకు తెలుసు. నాకు తెలుసు వాళ్ళు క్రైస్తవులను తులనాడతారని యేసును దూశిస్తారని. నాకు తెలుసు నేను కళాశాలలో ఉన్నప్పటి కంటే ఇప్పుడు దేవుని కొరకు నిశ్చలంగా నిలబడడం చాలా కష్టమని. నాకు తెలుసు ఈ భ్రష్టత్వపు చెడు దినాలలో ప్రతిదీ యవనస్తునికి వ్యతిరేకమేనని. అధ్యక్షుడు కూడా మనకు వ్యతిరేకే. నాకు తెలుసు బైబిలు నమ్మేవారు కీర్తన కారునితో పాటు చెప్పగలరు,

"నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును; అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును" (కీర్తనలు 119:130);

మరియు,

"నీ వాక్యము నా పాదములకు, దీపము నా త్రోవకు వెలుగునైయున్నది" (కీర్తనలు 119:105).

"నీ ఉపదేశములన్నియు యదార్ధములని నేను వాటిని మన్నించు చున్నాను; అబద్ద మార్గములన్నియు నా కసహ్యములు" (కీర్తనలు 119:128).

గ్రఫిత్ గారు పడిన పాటలో మాటలు మళ్ళీ వినండి,

‘అనుమానం అపనమ్మకం తుఫాను మద్య, మనం భయపడతాం,
నిత్య జీవ గ్రంధాన్ని [మనం తప్పక] పట్టుకోవాలి;
అవిశ్రాంత’ తరాలలో అది అలానే నిలుస్తుంది,
‘అది దైవ గ్రంధం, దాని పేరు బైబిలు!
పాత గ్రంధం పాత విశ్వాసం అనే బండపై నేను నిలుస్తాను!
పాత గ్రంధం పాత విశ్వాసం భూభాగానికి తలమానికం!
తుఫాను’ ఒత్తిడిలో పరీక్షకు నిలుస్తాయి,
ప్రతి స్థితిలో జాతి దీవించబడుతుంది;
పాత గ్రంధం పాత విశ్వాసం
అవి నిరీక్షణ ప్రతి భూభాగానికి!
   ("పాత గ్రంధం పాత విశ్వాసం" జార్జి హెచ్. కార్ర్ చే, 1914).
      (“The Old Book and the Old Faith” by George H. Carr, 1914).

II. మూడవది, వచనము పదిహేనుపై దృష్టి సారించుట.

"...క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసము ద్వారా రాక్షనార్ధమైన జ్ఞానము, నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములు" (II తిమోతి 3:15).

డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు, "దేవుని గూర్చి నాకు తెలియదు బైబిలు చెప్పుతున్నది తప్ప" (బైబిలు గూర్చిన గొప్ప సిద్ధాంతాలు (1), పేజి 36). ఆయన అన్నాడు, "వేరే పుస్తకము లేదు దేవుని స్వరము గూర్చినది" (సువార్తిక ప్రసంగాలు, పేజి 25).

"క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసము ద్వారా, రాక్షనార్ధమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములు" (II తిమోతి 3:15).

బైబిలు మనకు క్రీస్తును చూపిస్తుంది. ఒక వ్యక్తీ బైబిలు విన్నప్పుడు, దేవుడు చెప్పింది నిజంగా నమ్మితే, క్రీస్తును తెలుసుకోవాలను కుంటాడు. బైబిలుపై ఉన్న నమ్మిక నిన్ను రక్షించదు. దేవుని నిజ వాక్యము నీకు క్రీస్తును కనుపరుస్తుంది. రక్షణ ఎలా పొందవచ్చు? క్రీస్తు యేసు నందలి విశ్వాసము ద్వారా పొందు కోవచ్చు! బి.బి. మెక్ కిన్నీ, పాత కాలపు దక్షిణ బాప్టిస్టు, ఇలా వ్రాసాడు,

నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు బైబిలు సత్యమని;
దైవికంగా పూర్తిగా ప్రేరేపించ బడినది,
నాకు తెలుసు బైబిలు సత్యమని.
    ("నాకు తెలుసు బైబిలు సత్యమని" డాక్టర్ బి.బి. మెక్ కిన్నీచే, 1886-1952).
      (“I Know the Bible is True” by Dr. B. B. McKinney, 1886-1952).

అయినాను బైబిలు నిజమని నమ్మి నశించిపొవచ్చు! రక్షింప బడడానికి, బైబిలుకు విదేయుడనై క్రీస్తు యేసును నమ్మాలి. బైబిలు చెప్తుంది మన పాపాల నిమిత్తము క్రీస్తు చనిపోయాడని. బైబిలు చెప్తుంది మన పాపాలకు ప్రాయశ్చిత్తం "ఆయన రక్తములొ నమ్మిక" (రోమా 3:25). బైబిలు చెప్తుంది, "ప్రభువైన యేసు క్రీస్తు నందు విశ్వాసముంచుము, నీవు రక్షింపబడుదువు" (అపోస్తలుల కార్యములు 16:31). కాని నీవు "క్రీస్తు యేసు నందలి విశ్వాసము ద్వారా రక్షణ పొందుతావు" (II తిమోతి 3:15). డాక్టర్ ఎ. డబ్ల్యూ. టోజర్ అన్నారు,

విశ్వాసము దేవుని బహుమానము ఆత్మ కొరకు ఇంద్రియాలతో దాని సంపాదించ గల సమాచారముతో కాని సంబంధము లేదు. విశ్వాసము అద్భుతము; తన కుమారుని నమ్మడానికి దేవుడను గ్రహించు సమర్ధత (A. W. Tozer, D.D., Man: The Dwelling Place of God, Christian Publications, 1966, p. 33).

మీ పాపము విషయములో విసిగి పోయినప్పుడు, వదిలించు కోవాలనుకున్నప్పుడు, (దానికి ముందు కాదు) దేవుడు యేసు క్రీస్తును నమ్మునట్లు విశ్వాసాన్నిస్తాడు.

దాని విషయం మీరు మాతో మాట్లాడాలనుకుంటే, దయచేసి మీ స్థలము వదిలి ఆవరణము వెనుకకు రండి. డాక్టర్ కాగన్ మిమ్ములను వేరే గదికి తీసుకెళ్ళి ప్రార్ధించి మాట్లాడుతారు. డాక్టర్ చాన్, ఈ రాత్రి కొందరు యేసును నమ్మునట్టు ప్రార్ధించండి. ఆమెన్.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రదోమేచే: II తిమోతి 3:1-7, 12-15.
ప్రసంగమునకు ముందు పాట బెంజమన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్ గారిచే:
"పాత గ్రంధం పాత విశ్వాసం" (జార్జి హెచ్. కార్ర్ చే, 1914).
“The Old Book and the Old Faith” (by George H. Carr, 1914).


ద అవుట్ లైన్ ఆఫ్

మత భ్రష్టత్వానికి విరుగుడు

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.

"క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా, రక్షణార్ధమైన జ్ఞానము నీకు కలిగించుటకు; శక్తిగా పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు కనుక, నీవు నేర్చుకొని రూడియని తెలిసికొన్నవి ఎవని వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలిసికొని వాటియందు నిలకడగా ఉండుము" (II తిమోతి 3:14-15).

I.   మొదటిది, "కాని" అనే పదముపై దృష్టి సారించుట, II తిమోతి 3:14ఎ, 5, 7, 8.

II.  రెండవది, పదునాల్గవ వచనము మిగతా భాగముపై దృష్టి సారించుట,
II తిమోతి 3:14బి; II పేతురు 1:19; 3:3; కీర్తనలు 119:99, 130, 105, 128.

III. మూడవది, వచనము పదిహేనుపై దృష్టి సారించుట, II తిమోతి 3:15;
రోమా 3:25; అపోస్తలుల కార్యములు 16:31.