Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
ఎందుకు ఈ రోజుల్లో తక్కువ సువార్త ప్రకటింప బడుతుంది?

WHY SO LITTLE GOSPEL PREACHING TODAY?
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము ఉదయము, జనవరి 26, 2014
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, January 26, 2014

"అయ్యా, నేను సువార్తను ప్రకటింపక పోయిన యెడల నాకు శ్రమ!" (I కోరిందీయులకు 9:16).


ఆ మాటలు అపోస్తలుడైన పౌలువి. క్రీస్తు సువార్త ప్రకటించడానికి బలవంతపెట్టబడ్డాడు. ఆయన తన పరిచర్య అంతటిలో సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడు. మత్తయి హెన్రీ అన్నాడు, "పరిచర్య కొరకు తమ్మును తాము ప్రత్యేక పరచుకొన్నవారు సువార్తను ప్రకటించడానికి కారకులవుతారు. అలా చెయ్యకపొతే వారికీ శ్రమ." వివరణ లేకుండా, ప్రసంగంలో నికి వెళ్తాను.

చాలా మంది నాకు పిర్యాదు చేసారు ఈ రోజుల్లో సువార్త తక్కువగా ప్రకటింపబడుతుందని. వాళ్ళు చెప్పారు క్రీస్తు సువార్తను గూర్చి పూర్తి ప్రసంగాలు వారి గుడులలో వినరని. వాళ్ళు నన్నడుగుతారు రక్షణను గూర్చి సిలువపై క్రీస్తు పనిని గూర్చి వాళ్ళెందుకు బోధింప రని. ఆ ప్రశ్నకు నేను చాలా ఆలోచన యిచ్చాను – సువార్తను ప్రకటించు బోధకులు అంత తక్కువగా ఎందుకున్నారని? నేను ఏ స్థానిక చర్చి పాస్టర్ సంవత్సరాల తరబడి సువార్త ప్రకటించడానికి విని ఉండకపోతే! దానికి చాలా కారణాలున్నాయి – రెండు కారణాలు ఈ ప్రసంగంలో యిస్తారు.

I. మొదటిది, బైబిలు ఊహిస్తుంది ఆఖరి దినాలలో చాలా సంఘాల నుండి క్రీస్తు పంపి వేయబడతాడని.

ప్రకటన 3:14-22 లవొదికయ సంఘాన్ని గూర్చి వివరిస్తుంది. చివరి దినాల్లో ఉత్తరాది సంఘాల పటము అది చూపిస్తుంది. జె. ఎ. సీస్ అన్నాడు, "ఎవరైనా పరీక్షించ గలరా, ఈ నాటి ప్రవచించే సంఘముల లవొదికయి తరము చేరలేదని అనగలమా?" (J. A. Seiss, The Apocalypse, Zondervan Publishing House, n.d., p. 85).

డాక్టర్ జాన్ ఎఫ్. వాల్ ఉర్డు అన్నాడు, "ఈ నాటి సంఘము...చాలా విషయాల్లో లవొదికయ సంఘ ఆత్మీయ స్థితిని పోలి ఉంది" (John F. Walvoord, Th.D., The Revelation of Jesus Christ, Moody Press, 1966, p. 95).

డాక్టర్ లెహ్ మాన్ స్ట్రాస్ అన్నాడు, "ఆఖరి దినాల్లొని లవొదికయ సంఘము క్రీస్తును ప్రకటించడం లేదు...క్రీస్తు ఆధిపత్యము మూయబడింది. ఆఖరిదినాల్లొని మానవ సంఘము ఉమ్మి వేయబడిన సంఘము" (Lehman Strauss, D.D., The Book of Revelation, Loizeaux Brothers, 1982 edition, pp. 104, 105).

డాక్టర్ జె. వెర్నాన్ మెక్ గీ అన్నాడు, "లవొదికయ సంఘపు దినాలలో ఉన్నాము...ఇది చాలా ప్రాధమిక నిర్దిష్ట సంఘాల స్థితి...నా అభిప్రాయము ఒకవేళ [క్రీస్తు] ఈనాడు చాలా సంఘాలలో మాట్లాడితే, ఆయన అనవచ్చు, ‘మీరు కడుపులో అస్వస్తత కలిగిస్తున్నారు...నన్ను ప్రేమిస్తున్ననంటూడు. అంటారు, గాని నిజానికి ఉండరు...నా స్నేహితుడా, మనం లవొదికయ దినాలలో జీవిస్తున్నాము’...స్టాన్లీహె ఈ సంఘాన్ని గూర్చి ఇలా అన్నాడు:

     నేను పాపినని చెప్పడంలో సంఘం విఫలమైంది. యేసు క్రీస్తు ద్వారా రక్షణను ఇవ్వడం లో సంఘము విఫలమైంది. పాపపు భయంకర పరిణామాల గూర్చి, నరక వాస్తవతను గూర్చి, యేసు క్రీస్తు మాత్రమే రక్షించగలడనే సత్యాన్ని గూర్చి సంఘం చెప్పడంలో విఫలమైంది" (J. Vernon McGee, Th.D., Thru the Bible, 1983, Thomas Nelson Publishers, volume V, pp. 922, 923, 925, 924; notes on Revelation 3:14-19; Stanley H. High was a senior editor of The Reader’s Digest and a Christian author. The above statement by Mr. High appeared in August, 1947 in Time Magazine).

మన రోజుల్లో లవొదికయ సంఘాలలో క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? అది ప్రకటన 3:20 లో వివరింపబడింది,

"ఇదిగో, నేను తలుపు నొద్ద నిలుచుండి, తట్టుచున్నాను: ఎవడైనను నా స్వరము విని, తలుపు తీసిన యెడల, నేను అతని యొద్దకు వచ్చి, అతనితో నేనును, నాతొ కూడా అతడును భోజనం చెయుదుము." (ప్రకటన 3:20).

ఈ లవొదికయ సంఘాల నుండి క్రీస్తు వెళ్ళగొట్టబడ్డాడు. ఆయన బయట నిలువబడి, సంఘపు తలుపుతడుతున్నాడు, ఎందుకంటే ఆయన బయట ఉన్నారు కాబట్టి! డాక్టర్ చార్లెస్ సి. రైస్ అన్నాడు, "తన స్వంత గుడి నుండి క్రీస్తు బహిష్కరించబడడం ఎంత దయనీయము!" (Charles C. Ryrie, Th.D., Ph.D., The Ryrie Study Bible, Moody Press, 1978 edition, p. 1900; note on Revelation 3:20).

ప్రకటన 3:20 క్రీస్తు మానవ హృదయంలో ప్రవేశించడాన్ని గూర్చి మాట్లాడడం లేదు. డాక్టర్ రైస్ గమనించినట్టు, ఆయన తన సంఘము బయట ఉన్నాడు, మనవ హృదయము వెలుపల కాదు. అది ప్రకటన 3:20 చెప్తుంది. ఈ సందర్భానికి అది తేట తెల్లము, ఇలా ముగుస్తుంది, "సంఘములతో ఆత్మా చెప్పుచున్న మాట, చెవి గలవాడు వినును గాక."

కనుక ఆఖరి దినాల్లో క్రీస్తు సువార్త చాలా తక్కువగా ప్రకటింప బడడం బట్టి మనము ఆశ్చర్యపడనవసరం లేదు, ఈ లవొదికయ తరములో! డాక్టర్ మైకల్ హర్తన్ ఒక చేదించే పుస్తకము, క్రీస్తు లేని క్రైస్తావ్యము వ్రాసాడు. ఆయన అన్నాడు చాలా సంఘాలు "స్వంత సహాయ" ప్రసంగాలు చేస్తున్నాయి, క్రీస్తు సువార్త బదులు. బాప్టిస్టు సంఘ ప్రసంగ శీర్షిక ఆయన చెప్పాడు:

"నీ గురుంచి మంచి అనుభూతి పొందడం ఎలా"
"నిస్పృహను ఎలా ఎదుర్కోవడం"
"సంపూర్ణ జయవంత జీవితం ఎలా కలిగి యుండాలి"
"ధనమును వాడడం నేర్చుకోవడం అది మనలను వాడకుండా"
"జయవంత కుటుంబ జీవితానికి రహస్యాలు"
"ఒత్తిడి ఎలా అధిగమించాలి," మొదలైనవి.
(మైకేల్ హర్తన్, పిహెచ్ డి., క్రీస్తు లేని క్రైస్తవ్యం; అమెరికా సంఘ సువార్తకు ప్రత్యామ్నాయం, బెకర్ బుక్స్, 2008, పేజి 49).

నేను ముగిస్తాను క్రీస్తు పనిపై తక్కువగా బోధింప బడడానికి మొదటి కారణం – సిలువపై ఆయన మరణము, ఆయన రక్త ప్రోక్షణ, ఆయన పునరుత్తనము, ఆయన రెండవ రాకడ, మొదలైనవి. – ఆఖరి దినాల్లో లవొదికయ రోజుల్లో జీవిస్తున్నాం, బైబిలు ప్రవచనము చెప్పబడింది. డాక్టర్ మెక్ గీ అన్నాడు,

     లవొదికయ సంఘంలో ప్రభువైన యేసు అన్నాడు, "మీరు నులి వెచ్చగా ఉన్నారు గనుక, చల్లగానైనను వెచ్చగా నైనను ఉండక, నేను నా నోట నుండి ఉమ్మివెయ ఉద్దేశించుచున్నాను" (వి 16). ఇది అపోస్తేట సంఘము నిజత్వము లేకుండా క్రైస్తవుడనిపించుకొంటుంది. (మెక్ గీ, ఐబిఐడి., పేజి 926).

ప్రవచానాత్మక ప్రసంగంలో II తిమోతి నాలుగవ అధ్యాయములో అపోస్తలుడైన పౌలు అన్నాడు,

"ఒక సమయం వస్తుంది మంచి సిద్దాంతం సహించరు; వాళ్ళ స్వంత దూరాషలలో దురద చెవులు గలవారై, బోధకుల వైపు మరులుతారు; సత్యము నుండి వారి చెవులు తిప్పుకుంటారు, మాయలో పడి పోయారు. అయితే నీవు అన్ని విషయాలలో మితముగా ఉండుము, శ్రమ పడుము, సువార్తకుని పని చేయుము నీ పరిచర్యను, సంపూర్ణంగా జరిగించుము" (II తిమోతి 4:3-5).

తరువాత, "సత్యము నుండి వారి చెవులు త్రిప్పుకొందురు," ఆయన అన్నాడు, "సువార్తకుని పని చేయుము." బలమైన, తెలివైన సువార్తిక బోధనలను, మించిన గొప్పది ఏమిలేదు 19 వ శతాబ్దంలో స్పర్జన్ బోదించినట్టు! ఓ, ఈ తరానికి ఈ నిరాశ గడియలో అలాంటి బోధ ఎంత అవసరం! ప్రతీ బోధకుడు అమెరికాలో వచనం వెంట వచనం పాఠాలు క్రైస్తవులకు ఇచ్చినా నేను లెక్క చెయ్యను! వారు ఏమి చేస్తారో నాకనవసరం, నా ప్రభువైన యేసు క్రీస్తు బోధ నేను కొనసాగిస్తాను!

"సువార్త ప్రకటించని యెడల, నాకు శ్రమ!" (I కోరిందీయులకు 9:16).

కనిపించని పై వాటిని చెప్పడం నాకు ప్రియం,
   యేసును గూర్చి ఆయన మహిమను గూర్చి, యేసును గూర్చి ఆయన ప్రేమను గూర్చి.
   ఆ కథ నాకు ప్రియం, ఎందుకంటే అది సత్యమని నాకు తెలుసు;
ఏదీ తీర్చనంతగా అది నా త్రుష్టను తీరుస్తుంది.
   ఆ కథ నాకు ప్రియం, ‘మహిమలో అది నా అంశము
పాత యేసుని గూర్చి, ఆయన ప్రేమను గూర్చిన కథనం చెప్పడం.
   ("ఆ కథ చెప్పడం నాకు ప్రియం" ఎ. కేథరీన్ హెంకిచె, 1834-1911).
      (“I Love to Tell the Story” by A. Catherine Hankey, 1834-1911).

"సువార్త ప్రకటించని యెడల నాకు శ్రమ!" (I కోరిందీయులకు 9:16).

II. రెండవది, "పాపి ప్రార్ధన" క్రీస్తు సువార్త ప్రకటనను పాతదిగా, అనవసరంగా చేసిందని – "ఆధునిక" బోధకులు అంటున్నారు!

"పాపి ప్రార్ధన" చెప్తే సరిపోతుందంటే సువార్త ప్రకటన అనవసరము. "పాపి ప్రార్దన" అనే "ఆధునిక పద్ధతి" క్రీస్తు సువార్త బోధకు బదులైంది! అది అతి అని మీరనుకుంటే, 1993 లో జేక్ హెయిల్స్ ఏమి రాసాడో వినండి,

      అపోస్తలుల కార్యముల గ్రంథములోని క్రొత్త నిబంధన సంఘము ఆత్మలను సంపాదించే సంఘము. సంవత్సరాలుగా ఆత్మల సంపాదనను సువార్తకు బదిలీ చేసాము, కొన్ని శతాబ్దాలుగా, సువార్త సంఘ ఆధిక్యత కనిపిస్తుంది,
     ఇప్పుడు ఆత్మల సంపాదన సంఘానికి సువార్త సంఘానికి తేడా ఏమిటి? సువార్త సంఘములో కాపరి ప్రసంగ వేదిక వెనుక నిలబడి గుడికి వచ్చిన రక్షింపబడనివారికి సువార్త ప్రకటిస్తాడు. ఆత్మల సంపాదన గుడిలో, ప్రజలు గుడి వదిలి ప్రధాన మార్గాలకు వెళ్లి, క్రీస్తు కొరకు వారిని జయించి, సంఘానికి నడిపించి బహిరంగ రక్షణ ఒప్పుకోలు చేయిస్తారు. మన తరములో, మంచి సంఘాలు సువార్తిక గుడుల నుండి ఆత్మలను సంపాదించే గుడులుగా మారుతున్నాయి...అది దైవ జనునికి ప్రభువు దినాన, క్రైస్తవులకు సువార్త బొదించదానికి సహాయపడుతుంది వాళ్ళు బయటకు వెళ్లి...క్రీస్థువొద్దకు మందలను నడిపిస్తారని (Jack Hyles, D.D. Enemies of Soul Winning, Hyles-Anderson Publishers, 1993, pp. 140, 141).

ఆయన చెప్తుంది తేటగా ఉంది, కదా? ఆయన అన్నాడు "మంచి సంఘాలు" సువార్త బొధకారి యుండడం లేరు. ప్రజలు బయటికి వెళ్లి నశించిన వారిని నడిపించి "పాపి ప్రార్ధన" చెప్పించి వారిని గుడికి "నడిపిస్తారు." ఆయన యింకా అన్నాడు కొత్త నిబంధన సంఘాలు యిలా చేసామని (ఐబిఐడి., పేజీ 140). అపోస్తలుల కార్యముల గ్రంధము ద్వారా ఎవరైనా రుజువు చేస్తారని చూస్తాను! ప్రతి ప్రసంగము ఒకటి తప్ప అపోస్తలుల కార్యములో సువార్తిక ప్రసంగాలే! అది సరియే, ఒకటి తప్ప అన్ని ప్రసంగాలు సువార్తిక ప్రసంగాలే! అపోస్తలుల కార్యములు 20: 18-35 తప్ప! ఆ ఒక్క ప్రసంగము పౌలుచే ''పెద్దలకు'' ఇవ్వబడింది. అది, విఫెమ సంగము, ఆ ఒక్క ప్రసంగములో కూడా నశించుచున్న వారికి, "సువార్త ప్రసంగాన్ని ఇచ్చాడు, యూదులకు, గ్రీకులకు సాక్ష్యమిస్తు దేవుని పట్ల పశ్చాత్తాపము, ప్రభువైన యేసు క్రీస్తు పట్ల విశ్వాసము" (అపోస్తలుల కార్యములు 20:21). ప్రతి ఇతర ప్రసంగము అపోస్తలులలో కార్యముతో సువార్త ప్రసంగమే – పెంతేకోస్తుకు పేతురు చెప్పింది కూడా (అపోస్తలుల కార్యములు 2:14-40); సన్ హెడ్రేన్ ముందు పేతురు ప్రసంగము (అపోస్తలుల కార్యములు 4:5-12); స్తేసను ప్రసంగము (అపోస్తలుల కార్యములు 7:1-53); ఫిలిప్ప ప్రసంగము సమయంలో (అపోస్తలుల కార్యములు 8:5); మార్పు తరువాత పాలు ప్రసంగము (అపోస్తలుల కార్యములు 9:20-22); అన్యులకు పేతురు ప్రసంగము (అపోస్తలుల కార్యములు 10:34-43); సిసిదియలోని అందియోకయకు పాలు ప్రసంగము (అపోస్తలుల కార్యములు 13:14-41); ఎథెన్స్ పాలు ప్రసంగము (అపోస్తలుల కార్యములు 17:22-31); మొదలగునవి., మొదలగునవి. మనం చదివాం పాలు బహిరంగంగా ఇంటింటా బోధించాడని (అపోస్తలుల కార్యములు 20:20-21). అపోస్తలుల కార్యముల గ్రంథము మనకు తెలుపుతుంది అపోస్తలులు దేవాలయములోను వివిధ గృహాలలోను సువార్త బొధించారని మనకు చెప్పబడింది. "యేసు క్రీస్తును గూర్చి బోధించుట మానలేరు" (అపోస్తలుల కార్యములు 5:42). జేక్ హేయిల్స్ పూర్తిగా తప్పు "అపోస్తలుల కార్యములలోని నూతన నిబంధన గ్రంథం" సువార్త ప్రసంగంపై కట్టబడింది అనడం (హెయిల్స్, ఐబిఐడి., పేజీ 140). జేక్ హెయిల్స్ పూర్తిగా తప్పు కాపరులు "మంచి సంఘంలో" సువార్త బోధ నుండి మారిపోయి "ప్రభువు దినాన క్రైస్తవులకు బోధిస్తున్నారనడం" (హెయిల్స్, ఐబిఐడి., పేజీ 141).

చాలా ఆసక్తికర విషయము ఏంటంటే జాక్ హెయిల్స్ మాటలో చాల తేటగా చూపిస్తుంది "పాపి ప్రార్ధన" సువార్త బోధకు బదులు అని! తిరుగులాడి ప్రజలను "పాపి ప్రార్ధన"కు రప్పించడం అనేది సువార్త బోధన, పాతదిగా, అనవసరంగా తీరుస్తుంది. జాక్ హెయిల్స్ అన్నట్ట్టు, "సంవత్సరాలుగా ఆత్మల సంపాదనను [‘పాపి ప్రార్ధనకు’ ప్రజలను తేవడం] సువార్తకు" (హెయిల్స్, ఐబిఐడి., పేజీ 140) – ఇది తప్పని హెయిల్స్ అన్నాడు!

హెయిల్స్ ఒక్కడే అలా ఆలోచింపలేదు. "చేతులెత్తించడం" సులభం – "పాపి ప్రార్ధన" చెప్పడం కూడా! క్రీస్తును గూర్చి మొత్తం ప్రసంగం చేయనవసరమేమి? "ప్రభువు దినాన క్రైస్తవులకు" చెప్తే సరిపోతుంది కదా – జాక్ హెయిల్స్ అన్నట్టు? ఇప్పుడు ప్రతి ఒక్కరూ జాన్ మెక్ ఆర్ధర్ మొదలు జోయిల్ ఆస్టీన్ వరకు "ప్రభువు దినాన క్రైస్తవులకు బోధిస్తున్నారు." ఇది, "పాపి ప్రార్ధన" గుడులలో సువార్త బోధను నాశనము చేస్తుంది. కానీ నేను అపోస్తలుడైన పాలుతో అంటాను,

"సువార్త ప్రకటించని యెడల, నాకు శ్రమ!" (I కొరిందీయులకు 9:16).

ఆలోచన పురికొల్పే ఒక విషయం చదివాను. థామస్ విలియమ్స్ అన్నమాట,

     నేను ఏదో కోల్పోతున్నాను, నూతన నిబంధనలో క్రైస్తవుడు రక్షింపబడని వ్యక్తికి నా తరువాత "ఈ ప్రార్ధన చెప్పండి, గట్టిగా ప్రార్ధించడం ఇబ్బందీకరంగా ఉంటే తలవంచి మౌనంగా నా వెనుక చెప్పండి, అప్పుడు రక్షింపబడతాం, అలాంటిది ఎక్కడా చూడం" (Thomas Williamson, “Northern Landmark Missionary Baptist,” December, 2013, page 2).

విలియం సన్ నాకు తెలియదు, ఏమి నమ్ముతాడో. తాను చెప్పింది ఆలోచింపతగ్గది, క్రొత్త నిబంధనలో. ఎవరూ ఏ నశించు వ్యక్తిని "పాపి ప్రార్ధనకు" నడిపించలేరు! ఇది కొత్త పద్ధతి – బైబిలులో లేదు! అది భయంకర పద్ధతి ఎందుకంటే సువార్త బోధన అనవసరం చేస్తుంది – ఈ రోజు చాల సంఘాలలో ఇది చూస్తున్నాం!

సహాయకుడు, డాక్టర్ క్రిష్టాఫర్ కాగన్, నేను మొన్న సాయంత్రము కంప్యూటర్ లో జోయల్ ఆస్టీన్ ను చూసాము. ఆయన ఆనందంగా ఉండడానికి సహాయపడే సంక్షిప్త మాటలు చెప్పాడు. బైబిలు నుండి ఒకటి రెండు వచనాలు చెప్పాడు, కాని క్రీస్తు సువార్త చెప్పలేదు – సిలువపై క్రీస్తు మరణము గూర్చి ఒక్క మాట కూడా చెప్పలేదు – పాపాన్ని కడిగే క్రీస్తు రక్తమును గూర్చి ఒక్క మాట కూడా చెప్పలేదు – క్రీస్తు పునరుత్థానమును గూర్చి కూడా – సువార్త ప్రస్తావనే లేదు. కాని, చివరిలో – ఆయన చెప్పింది నేను రాసుకున్నాను – జోయిల్ ఓస్టీన్ అన్నాడు,

యేసును మీ జీవితాలకు ప్రభువుగా చేసుకొనే అవకాశం యివ్వకుండా మా ప్రసారము ముగించము. మీరు నాతో ప్రార్దిస్తారా? చెప్పండి, "యేసు ప్రభూ, నా పాపాలు ఒప్పుకుంటున్నాను. నా హృదయములోనికి రమ్ము, నా ప్రభువుగా రక్షకునిగా చేసుకుంటున్నాను." స్నేహితులారా, ఆ సామాన్య ప్రార్ధన చేస్తే, మీరు తిరిగి జన్మిస్తారని నమ్ముచున్నాము.

ఆయన నమ్మవచ్చు వాళ్ళు "తిరిగి జన్మించారని," కాని నేను నమ్మను! ఆ ప్రార్ధన ద్వారా "తిరిగి జన్మించరు" – ఒక్కరు కూడా! ఎట్లా? ఆ ప్రార్ధనలో సువార్త లేదు – లేనే లేదు! తన ప్రసంగములో సువార్త లేదు కాబట్టి, ఓస్టీన్ గారు క్రీస్తు లేని బోధ యిచ్చి "పాపి ప్రార్ధన" చెప్పించాడు సువార్త లేకుండా! పాప పరిహారార్ధం యేసు సిలువపై మరణించడం చెప్పలేదు – అది సువార్తకు హృదయం. పాపాన్ని కడిగే క్రీస్తు రక్తం గూర్చి చెప్పలేదు. మృతుల పునరుత్థానము ప్రస్తావించలేదు. ఇంకొక మాటలో, సువార్త ప్రమేయమే లేదు (I కోరిందీయులకు 15: 1-4). ఇది త్వరిత ప్రార్ధనలో అబద్ధపు సువార్త – క్రీస్తు సువార్త కాదు! ఇలా, ఓస్టీన్ బోధిస్తాడు అపోస్తలుడైన పాలు అన్నాడు, "యింకొక సువార్త," క్రీస్తు సువార్త కాదు (గలతీయులకు 1:6, 7). నేను ఇంకా చెప్తాను,

"సువార్త ప్రకటించని యెడల, నాకు శ్రమ!" (I కొరిందీయులకు 9:16).

ఆ కథ చెప్పడం నాకు ప్రియం, ‘తిరిగి చెప్పడం ఆహ్లాదం
   చెప్పే ప్రతీసారి, యింకా అతి మధురం.
ఆ కథ చెప్పడం నాకు ప్రియం, ఎన్నడూ వినని వారికి
   రక్షణ సందేశం దేవుని పరిశుద్ధ వాక్యము నుండి.
ఆ కథ చెప్పడం నాకు ప్రియం, ‘మహిమలో అది నా గీతం
   పాత, యేసు పాత కథ ఆయన ప్రేమ.

మానవాళి పాపపు బంధకాలలో, సాతాను ఆధీనములో ఉంది, "వాయుమండల సంబంధమైన అధిపతి" (ఎథెన్సీయులకు 2:2). ప్రతి ఒక్కరు పాపపు శక్తి అందున్నారు, "నిరీక్షణ లేకుండా, లోకములో దేవుడు లేకుండా" (ఎథెన్సీయులకు 2:12).

కాని "క్రీస్తు యేసు పాపులను రక్షించడానికి ఈ లోకములోనికి వచ్చాడు" (I తిమోతీ 1:15). యేసు పరలోకము నుండి దిగి వచ్చి పాప రహితునిగా మన మధ్య నివసించెను, పరిపూర్ణ పరిశుద్ధ దైవ కుమారుడు – దేవుని అద్వితీయ కుమారుడు. కాని ఆయన సిలువవేయబడే ముందు రాత్రి, గెత్సేమనే వనము అంధకారములో, దేవుడా తన ప్రజల పాపాన్ని "తన శరీరములో" ఉంచాడు (I పేతురు 2:24). యేసు నీ పాప భారము క్రింద శ్రమించాడు "ఆయన చెమట రక్త బిందువులై నేలపై కార్చబడెను" (లూకా 22:44). దేవాలయ అధికారులు వచ్చి ఆయనను తప్పుడుగా బంధించారు. ప్రధాన యాజనికి యొద్దకు లాక్కెళ్ళారు. వారు ఆయనను బంధించి ముఖముపై గుద్ది, కొందరు ఆయన గడ్డాన్ని పీకారు. రోమా గవర్నరు, పొంతి పిలాత నొద్దకు తీసుకెళ్తారు. సైనికులుచే అతడు యేసు వీపు పై కొట్టించారు, సగ మరణము వరకూ, ఆయన రక్తము నేలపై కారి పడింది. ముఖముపై ఉమ్మి వేసి కర్రతో ఆయన తలపై కొట్టారు. వీధులలో సిలువ మోయాలని బలవంత పెట్టారు, జనులంతా ఆయనపై గట్టిగా అరిచారు. సిలువ వేసే స్థలానికి తీసుకొచ్చి, ఆయన చేతులకు కాళ్ళకు సిలువపై మేకులు కొట్టారు. దిగంబరిగా పడవేసి, సిలువపై వేలాడ దీసి, జనులు గేలి చేసారు. ఆరు గంటలు సిలువపై శ్రమ పడ్డాక, "సమాప్తమైనది" అని బిగ్గరగా అరిచాడు (యోహాను 19:30), తల వంచి ఆత్మను అప్పగించుకొనెను – ఆయన మరణించాడు. "కాని సైనికులతో ఒకడు ఈటెతో ప్రక్కలో పొడవగా, రక్తము నీళ్ళు కారెను" (యోహాను 19:34). అరిమతయి యోసేపు యేసు దేహమును తీసికొని, ఊదా రంగు వస్త్రములతొ చుట్టి, ఒక సమాధిలో ఉంచాడు. సమాధిపై ఒక పెద్ద రాయి ఉంచి, మూసివేసారు, రోమా సైనికులు కాపలా ఉన్నారు. కాని ఈస్తర్ ఆదివారం ఉదయమే, ప్రభువైన యేసు క్రీస్తు శరీరముతో లేచి, శరీరము, ఎముకలతో మరణం నుండి లేచాడు!

నా స్నేహితుడా, యేసు అదంతా నీ కొరకు చేసాడు. నీ పాప పరిహారార్ధం ఆయన సిలువపై మరణించాడు. నీ పాపానికి నీవు శిక్షింప బడేవాడివి – కాని యేసు నీకు ప్రతిగా శ్రమ పడి చని పోయాడు. బైబిలు బోదిస్తుంది నీవు రక్షింపబడగలవు నీ పాపమూ నుండి నీ స్థానంలో యేసు మరణము ద్వారా. నీ పాపాన్ని కడగడానికి ఆయన రక్తము చిందించాడు. నీకు నిత్య జీవితం ఇవ్వడానికి ఆయన దేహముతో లేచాడు! యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక ఈ శ్రమ ద్వారా వెళ్ళాడు! యేసు నొద్దకు రా. నిన్ను ఎంతగానో ప్రేమించాడు కనుక నిన్ను రక్షిస్తాడు – ఇప్పుడే!

నీవు చెయ్యడానికి ఏమి మిగిలింది? దేవుడు అడిగేది నీవు క్షమాపణ అడిగి ఆయన కుమారుడైన యేసును నమ్మాలి. ఎప్పుడు నీవు పశ్చాత్తాప బడి యేసును నమ్ముతావో నీ పాపం నుండి రక్షించబడతావు, సమాధి నుండి, నరకము నుండి కూడా! ఇప్పుడే యేసును నమ్ము ఆయన నీ పాపాన్ని కడుగుతాడు తన ప్రశస్త రక్తము ద్వారా!

కథ చెప్పడం నాకు ప్రియం, బాగా తెలిసిన వారికి
   ఆకలితో తృస్టతో వినాలనుకున్న వారికీ.
మహిమా, సన్నివేశాలలో, నేను నూతన, నూతన పాట పాడతాను,
   ‘అది పాత, పాతదైన కదా నేను దీర్ఘంగా ప్రేమించేది.
కథ చెప్పడం నాకు ప్రియం, ‘మహిమాలో అది నా గీతికా
   అది పాత, పాతదైన కథ యేసు ఆయన ప్రేమను గూర్చి.

"సువార్త ప్రకటింప ని యెడల, నాకు శ్రమ" (I కోరిందీయులకు 9:16).

రక్షింపబడటానికి మాతో మాట్లాడాలనుకుంటే యేసు ద్వారా పాపమూ నుండి రక్షింపబడాలనుకుంటే, నీ స్థలము వదిలి ఆవరణము వెనుకకు వెళ్ళండి. జాన్ శామ్యూల్ కాగన్ గారు వేరే గదికి తీసుకెళ్ళి ప్రార్ధించి మాట్లాడుతారు. నీవు క్రైస్తవుడవాలని ఆసక్తి ఉంటె, గది వెనుకకు ఇప్పుడే వెళ్ళండి. డాక్టర్ చాన్, కొందరు యేసును నమ్మునట్లు ప్రార్ధించండి. ఆమెన్.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రదోమేచే: ప్రకటన 3:14-22.
ప్రసంగమునకు ముందు పాట బెంజమన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్ గారిచే:
"నేను కథ చెప్పడాన్ని ప్రేమిస్తాను" (ఎ. కాథరిన్ హన్కె చే, 1834-1911)
“I Love to Tell the Story” (by A. Catherine Hankey, 1834-1911).


ద అవుట్ లైన్ ఆఫ్

ఎందుకు ఈ రోజుల్లో తక్కువ సువార్త ప్రకటింప బడుతుంది?

WHY SO LITTLE GOSPEL PREACHING TODAY?

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"అయ్యా, నేను సువార్తను ప్రకటింపక పోయిన యెడల నాకు శ్రమ!" (I కోరిందీయులకు 9:16).

I. మొదటిది, బైబిలు ఊహిస్తుంది ఆఖరి దినాలలో చాలా సంఘాల నుండి క్రీస్తు పంపి వేయబడతాడని, ప్రకటన 3:20; II తిమోతి 4:3-5.

II. రెండవది, "పాపి ప్రార్ధన" క్రీస్తు సువార్త ప్రకటనను పాతదిగా, అనవసరంగా చేసిందని – "ఆధునిక" బోధకులు అంటున్నారు! అపోస్తలుల కార్యములు 20:21; 2:14-40; 4:5-12; 7:1-53; 8:5; అపోస్తలుల కార్యములు 9:20-22; 10:34-43; 13:14-41; 17:22-31; 20:20-21; 5:42; I కోరిందీయులకు 15:1-4; గలతీయులకు 1:6, 7; అఫేసీయులకు 2: 2, 12; I తిమోతి 1:15; I పేతురు 2:24; లూకా 22:44; యోహాను 19:30, 34.