Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




పడగొట్టువాడు

THE BREAKER
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము ఉదయము, జనవరి 5, 2013.
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Morning, January 5, 2014

"ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును: వారు గుమ్మమును, పడగొట్టే దాని ద్వారా, దాటి పోవుదురు: వారి రాజు వారికీ ముందుగా నడుచును, యోహావా వారికీ నాయకుడుగా ఉండును" (మికా 2:13).


ప్రవక్తయైన మీకు యూదులను సమకూర్చడం గూర్చి మూడు ప్రవచనాలు ఇచ్చాడు. మన పాఠ్యభాగములో వాగ్ధాన దేశానికి ఇశ్రాయేలీయులు తిరిగి సమకూర్చబడడంను గూర్చిన మొదటి ప్రవచనము కనిపిస్తుంది.

మనము మన కళ్ళతో చూచినా ప్రాముఖ్య ప్రవచనం తిరిగి సమకూర్చబడడానికి ఆరభము. ఇశ్రాయేలు దేశము మే 14, 1948లొ తిరిగి జన్మించింది. డేవిడ్ బెన్-గురియాన్ యూదా రాజ్య స్థాపన తేది ప్రకటించాడు, ఇశ్రాయేలు రాజ్యముగా. అప్పటి నుండి, లక్షలాది మంది తమ స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇశ్రాయేలీయులు తిరిగి రావడం దానికి అది ఆరంభము. మికా 2:12 చెప్తుంది,

"యాకోబు, సంతతి, తప్పక నేను మిమ్ము నందరిని పోగు చేయుదును; ఇశ్రాయేలీయులు శేషించిన వారిని తప్పక సమకూర్చును..." (మికా 2:12).

గొప్ప మెస్సియా యుదా తత్వవేత్త డాక్టర్ చార్లెస్ లీ సియాన్ బర్గ్ అన్నాడు, "బబులోను పునరుద్ధరణ సైరస్ ద్వారా వాగ్దానాన్ని ముగించదు, ఎందుకంటే అది పార్శ్వము [మికా] 'అన్నియు' తిరిగి సమకూర్చబడిన దేశము. ఒక స్థలానికి తీసుకొని రాబడుతుంది [ఇశ్రాయేలు]... వచనము 12 లో ఉన్న వాగ్ధానము నిజంగా ప్రభంజనం, కాని ఊహించే దానిలో శ్రేష్ట మైనది రావలసి ఉంది. దేవుని ప్రజలు తిరిగి గొర్రెల వలే కూడుకుంటారు... పడగొట్టువాడు, మార్గము సరళము చేయువాడు, వారికీ ముందుగా వెళ్ళును. ఇది ఎవరో కారు ఇశ్రాయేలు మెస్సయ్యా ప్రతి అవరోధాన్ని పడ గోడతాడు ప్రజల మార్గములో...ఎప్పుడైతే మెస్సయ్యా మార్గము సరళము చేస్తాడో, శత్రువుల పట్టణాలను పడగోడతారు అక్కడ వారు బందీలయ్యారు వారు గుమ్మముల ద్వారా వెళ్తారు. వారి పునరుద్ధరణను ఎవరు [ఆపలేరు], వారి వాగ్ధాన మెస్సయా పని వారి పక్షంగా ఫలభరితమై, ఆశీర్వాద ప్రభువు క్రీస్తు[చే]" (Charles L. Feinberg, Th.D., Ph.D., The Minor Prophets, Moody Press, 1982 edition, p. 162).

డాక్టర్ ఫియాన్ బర్గ్ "పడగొట్టువాడు" ఎవరో మనకు చెప్పాడు. ఆయన క్రీస్తు – అన్ని అవాంతరాలను అడ్డంకులను పడగొడతాడు, ఇశ్రాయే లీయులందరిని వారి స్వస్థలానికి నడిపిస్తాడు! ఔను, యేసు ఆ గొప్ప దినాన "పడగొట్టువానిగా" ఉంటాడు! యూదులందరికి ఆయన మార్గము సరళము చేసి, ప్రపంచ నలుమూలల నుండి, క్రీస్తు మిల్లె నియాల్ రాజ్యము లోనికి సమకూర్చుతాడు.

"ప్రాకారములు పడగొట్టువాడు వారికీ ముందుగా పోవును: వారు గుమ్మమును పడగొట్టి, దాని ద్వారా, దాటి పోవును: వారి రాజు వారికీ ముందుగా నడుచును, యోహావా వారికీ నాయకుడిగా ఉండును" (మికా 2:13).

మార్గము చేయువాడు మిల్లె నియాల్ రాజ్యములోనికి దారి కలుగ చేసి – ఆయన పేరు ప్రభువైన యేసు క్రీస్తు! ఆమెన్! అపోస్తలుడైన యోహాను దర్శనములో యేసుని చూసి, "పడగొట్టువానిగా" చూసాడు ఆ దినమున,

"మరియు పరలోకము తెరవ బడి యుండుట చూచితిని, అప్పడిదిగో తెల్లని గుర్ర మొకటి కనబడెను; దాని మీద కూర్చుండి యున్నవాడు నమ్మకమైన వాడును సత్య వంతుడును అను నామము గలవాడు, ఆయన నీటిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించువాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను; వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని, మరి ఎవరికిని తెలియదు. రక్తములొ ముంచబడిన వస్త్రము ఆయన ధరించు కొనియుండెను: మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్ట బడియున్నది. పరలోకమందున్న పేనాలు, శుబ్రమైన తెల్లని నార బట్టలు ధరించుకొని, తెల్లని గుఱ్ఱము ఎక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి, వాడి గల ఖడ్గము బయలు వెడలుచున్నది: ఆయన ఇనుప దండముతో వారిని ఎలును: ఆయనే సర్వాధికారి వారు దేవుని తీక్షమైన ఉగ్రత అను మధ్యపు తొట్టి త్రోక్కును. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును, అను నామము ఆయన వస్త్రము మీదను, తోడ మీదను వ్రాయబడి యున్నది" (ప్రకటన 19:11-16).

ఆ దినాన్ని గూర్చి మాట్లాడుతూ, డాక్టర్ జాన్ ఆర్. రైస్ అన్నాడు,

రాజ్యము పడగోట్టబడును, సాతాను పరిపాలన
   కన్నీటితో నిండినది ముగియును.
నీతి భూమిని ఎలును, సమాధానము
   వెయ్యి ఏళ్ళ పరిపాలన ఉండును!
విచారము నిట్టూర్పు పారిపోవును!
   పారిపోవును ఆ మహిమ దినాన్న!
ఏ దేను వనము ఆ దినమున పునరుద్దరింపబడును!
   యేసు పరిపాలించుటకు వచ్చినప్పుడు.
("యేసు పరిపాలనకు వచ్చినప్పుడు"
      డాక్టర్ జాన్ ఆర్. రైస్ చే,1895-1980).

యేసు, పడగోట్టువాడు, దెయ్యాన్ని పడగోడతాడు! ప్రతి దెయ్యాన్ని, ఇశ్రాయేలు ప్రతి శత్రువును, క్రైస్తవ్యమునకు ప్రతి శత్రువును ఆయన పడగొడతాడు! హల్లెలూయ!

విచారము నిట్టూర్పు పారిపోవును!
   పారిపోవును ఆ మహిమ దినాన్న!
ఏదేను వనము ఆ దినమున పునరుద్దరింపబడును!
   యేసు పరిపాలించుటకు వచ్చినప్పుడు.

వాస్తవానికి యేసు "పడగోట్టువాడు" ఇప్పుడు కూడా! కొన్ని క్షణాలు నాతో రండి ఈవిషయం ఆలోచిస్తుండగా, ఎందుకు క్రీస్తు "పడగోట్టువాడుగా" పిలువబడ్డాడో.

యేసుకు చాలా కిరీటాలున్నాయి – చాలా నామాలున్నాయి, చాలా బిరుదులున్నాయి. మన పాఠ్యభాగములో నామము బహుశా అపరిచితం – "పడగోట్టువాడు." తరుచూ మనం యేసుని గూర్చి అనుకుంటాం దేవుని "గొర్రె పిల్ల" అని. కొన్నిసార్లు మనం ఆయనను మన "ప్రధాన యాజకునిగా" తలుస్తాం. తరుచూ "ప్రవక్తగా" ఆయన పిలువబడ్డాడు, ఇంకా తరచుగా "రాజుగా". ఎవరైనా క్రీస్తును "పడగొట్టువాడు" అని అనడం చాలా అరుదుగా విన్నాం. అయినను ప్రతి అణువులో ఆయన "పడగోట్టువాడు" ఈ ఉదయాన్న, ఇశ్రాయేలు ప్రజలను [వారందరినీ] నడిపించడానికి ఆయన తిరిగి వచ్చినప్పుడు – తిరిగి స్వస్థలానికి అది భేషరతుగా దేవునిచే వారికి ఇవ్వబడినది అబ్రహాము దినములలో వలే (ఆదికాండము 12:1, ఆదికాండము 15:18; మొదలగునవి.). యేసు ప్రతి గొలుసును విరుగగొట్టి వారిని బంధించినవి; వారిని అడ్డగించే ప్రతి రాజ్యాన్ని ఆయన పగులకొడతాడు; మరియు, అవును, ఆయన నిత్యత్వంలో యుదా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న సాతాను ఉద్దేశాన్ని పడగొడతాడు!

కాని యేసు "పడగోట్టువాడు" ఇప్పుడే – కనుక ఆయన "పడగోట్టువాడు" అని పిలవడం సరియే ఆయనను "రక్షకుడు" అని పిలిచేలా! ఆమెన్! అవును ఆమెన్! మనం అన్ని వేళలా ఇలా ఆలోచిద్దాం యేసు "పడగోట్టువాడు" అని ఇప్పుడే – ఈ ప్రస్తుత సమయంలో.

I. మొదటిది, యేసు సాతాను శక్తిని పడగొట్టాడు.

గతంలో సాతాను శక్తి గల దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది దివి నుండి భూమికి త్రోయబడింది. సర్ప రూపంలో వచ్చి మన ఆది తల్లిని, తరువాత తన ద్వారా ఆదామును శోధించింది, నిషేధింపబడిన ఫలము తిన్నాడు. తన భయంకర శక్తితో సాతాను మానవాళిని అణగ దొక్కింది. విడుదలకు నిరీక్షణ లేదు. మానవాళికి దేవుడు ఒక వాగ్దానాన్ని యిచ్చాడు పాత సర్పముతో పోట్లాడుతున్నప్పుడు, "నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసెదను; అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమే మీద కొట్టుదువని చెప్పెను" (ఆదికాండము 3:15).

కాలాలు దొర్లాయి, తరువాత, చివరకు, బెత్లెహములొ స్త్రీ విత్తనము మరియలో ఉద్భవించింది, యేసు దయ్యంతో వైరానికి దిగాడు. నేరుగా రాజైన హేరోదు, సాతానుచే ప్రేరేపించబడి, ఆయనను చంప ప్రయత్నించాడు! తరువాత, అరణ్యంలో, దెయ్యము రక్షకుని ముమ్మారు పడగోట్టాలనుకుంది. కాని ముమ్మారు యేసు అపవాదిని, ఎదిరించాడు, "వ్రాయబడియున్నది అని చెప్పి" – "వ్రాయబడియున్నది అని చెప్పి" – "వ్రాయబడియున్నది." అది కష్టతర పోరాటం – చివరకు యేసు, పడగోట్టువాడు, యుద్ధం గెలిచాడు. "అంతటా అపవాది ఆయనను విడిచి పోగా, ఇదిగో, దేవ దూతలు వచ్చి, ఆయనకు పరిచర్య చేసిరి" (మత్తయి 4:11).

ఆఖరిగా యేసు యేరూష లేము వచ్చినప్పుడు, సాతాను రక్షకునికి వ్యతిరేకంగా అన్ని శక్తులు ఉపయోగించింది. ప్రధాన యాజకుడు శాస్త్రులు ఆయనను చంపాలని కుట్రపన్నారు, "అప్పుడు సాతాను యూదాలో ప్రవేశించింది" అప్పుడు తన ప్రధాన యాజకుల దగ్గరకు రక్షకుని ఎలా అప్పగిస్తాడో చర్చించడానికి వెళ్ళాడు. తరువాత ఆ రాత్రి, యేసు గెత్సమనే వనానికి వెళ్ళాడు.

నేనకుకునేవాడిని ఆ వనములో సాతాను యేసుని చంపడానికి ప్రయత్నించిందని. అయినా నేను ఆశ్చర్యపడ్డాను యూదాలో ప్రవేశించాక మళ్ళీ వాని ప్రస్తావన రాలేదు. మళ్ళీ నాలుగు సువార్తలలో తన గూర్చి వినబడలేదు. అదే కారణం అనుకుంటాను: లోక పాపాల్ని దేవుడు యేసు శరీరంలో పెట్టినప్పుడు, రక్షకుడు చమటోర్చాడు "ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలే ఆయెను" (లూకా 22:44). క్రీస్తు రక్తాన్ని సాతాను చూచి తట్టుకోలేక పోయింది, ఆయనను ఒంటరిగా వదిలేసింది, "పరలోకము నుండి దేవదూత ఆయనకు కనబడి, ఆయనను బలపరిచెను" (లూకా 22:43). సాతానుచే ఎదుర్కొబడినప్పుడు, ప్రకటన గ్రంధములో, శ్రమలో వారు "గొర్రె పిల్ల రక్తం ద్వారా జయించాడు" (ప్రకటన 12:11). నేననుకుంటాను గెత్సమనే వనానికి ఇదే కారణము. సాతాను యేసును చంపడానికి, భయంకర కృషి చేసింది. కార్చబడిన యేసు రక్తము చూసాక, అంధకారం లోనికి వెళ్ళిపోయింది. గుర్తుంచు కొండి మీరు ఎక్కువగా శోధింపబడినప్పుడు. రక్తాన్ని ప్రోక్షించుకొండి! రక్తాన్ని ప్రోక్షించుకొండి! యేసు క్రీస్తు రక్తాన్ని ప్రోక్షించుకొండి!

వనములో క్లిష్టత తొలగింది. దైర్యముతో దీమాతో యేసు సిలువకు వెళ్ళాడు. క్రీస్తు పదాలను సాతాను నలుగగొట్టింది, కాని యిప్పుడు క్రీస్తు సాతాను తలను చితుకగొట్టాడు. సిలువపై, రక్షకుడు తలవంచి అరిచాడు, "సమాప్తమైనది" (యోహాను 19:30). సాతాను తల నలుగగోట్టబడింది. వాడు ఓడింపబడిన శత్రువు. భూమిపై చెడుచేస్తాడు, కాని ఎన్నిటికి క్రీస్తును ఓడించలేదు. ఆయన రక్తము కార్చుట ద్వారా, ఆయన పునరుత్ధానము ద్వారా, సాతాను శక్తిని నలుగగొట్టాడు. ఆయన ప్రశస్త రక్తాన్ని సిలువపై కార్చి లేచినప్పుడు, తల నుండి, మాంసము ఎముకలు, సాతాను తలను చితుకగొట్టాడు, విజయోత్సాహముతో సాతాను శక్తిని విరుగగొట్టాడు, నరకము, పాపమూ, సమాధిపై! సాతాను శక్తితో నీవు శోదింప బడుచున్నప్పుడు, నిరుత్సాహ పడవద్దు, నా క్రైస్తవ స్నేహితుడా, నీ శత్రువు నలిగినా శత్రువు, తికమకలో ఒడబడిన స్థితిలో ఉంది!

యేసు ప్రతి బంధకాన్ని విరుగగోడతాడు,
   యేసు ప్రతి బంధకాన్ని విరుగగోడతాడు,
యేసు ప్రతి బంధకాన్ని విరుగగోడతాడు,
   ఆయన నిన్ను విడుదల చేస్తాడు!
("యేసు ప్రతి బంధకాన్ని విరుగ గోడతాడు"
      జెన్ని వెస్ట్ మెట్జ్ గర్ గారిచే, 1927).

నీవు క్రైస్తవుడవైతే, సాతానుకు భయపడనక్కరలేదు. వాడు నలుగ గొట్టబడినవాడు, త్రొక్కబడిన శత్రువు! నిన్ను చింతింప చెయ్యెచ్చు, లాలించవచ్చు, కాని నిన్ను నశింప చెయ్యలేడు! క్రీస్తు, పడగొట్టువాడు, నీకు ముందుగా వెళ్ళాడు. ఓడిపోయిన శత్రువుతో నీవు యుద్ధము చెయ్యాలి. అది క్రైస్తవులకు. మిగిలినది నశించిన వారికి.

II. యేసు పాపుల హృదయాలను పడగొట్టాడు.

నశించు పాపుల హృదయాలు కఠినంగా ఉంటాయి. పాపమూ, నరకము, ఆఖరి తీర్పులపై నేను ప్రసంగిస్తాను. పాపి ఒక క్షణం వణుకుతాడు – గుడి భవనము వదలక ముందే వారి కన్నీళ్లు తుడువబడతాయి. నవ్వు సంతోషము పార్కింగ్ దగ్గరకు వచ్చే సరికి, ఒకటి రెండు గంటల తరువాత కొత్త పాపాలు చెయ్యడానికి వేగిరపడతారు! న్యాయ శాస్త్రము నరక భయము వాని హృదయాన్ని కఠిన పరుస్తాయి.

ఇంకోసారి దేవుని ప్రేమపై, క్షమాపణపై రక్షకుని ప్రాయశ్చిత్తముపై ప్రసంగిస్తాను. నా కళ్ళు కన్నీళ్లుతో నిండేటప్పుడు ప్రసంగిస్తాను. సిలువపై యేసు శ్రమలను గూర్చి, పరలోకము ప్రశస్త రక్తమును గూర్చి భోదిస్తాను. తరువాత, మీ హృదయము కదులుతుంది. త్వరలో కదల్చబడదు, కాని సంతోష పాట పాడి, స్నేహితులతో నవ్వుతావు, గుడిలో నుండి వెళ్తున్నప్పుడు!

మీలో కొంత మంది తల్లులు ప్రార్ధిస్తూ ఏడ్చారు, కాని నీ హృదయం కదిలింపబడలేదు. కొంత మంది తండ్రులు గద్దించారు, అయినా హృదయము మారలేదు. సహాయక కాపరి, డాక్టర్ కాగన్, ముందు కూర్చున్నారు. ఆయన మిమ్ముల్ని నీలపు కళ్ళతో చూచి అర్ధించాడు యేసును నమ్మమని. కాని నీవు తిరస్కరించావు. నీవు లేచి వెళ్లి పోయావు ఆయనను పట్టించుకోకుండా! ఆయన రెండు పిహెచ్ డిలు, ఒకటి లెక్కలలో ఇంకొకటి అపోలోజెటిక్స్ మతములో. ఆయనకు తాల్ బొడ్ వేదాంత కళాశాల నుండి డిగ్రీ ఉంది! నశించు పాపులను బలపరచడంలో 40 సంవత్సరాల అనుభవం ఉంది. అయినా మీరు అనుకుంటారు అతడు ప్రముఖుడు కాడని! నీవు లేచి సమాచార గదిని వెంటనే వదిలేస్తావు – ఆయన చెప్పిందంతా మర్చిపోతావు!

నేను ప్రసంగానికి లేచినప్పుడు, నాకు తెలుసు నవ్వేవారు ఎగతాళి చేసేవారు ఉన్నారని – నేను పెద్దవాడను. నేను యవ్వనస్తుడుగా ఉన్నప్పుడు నన్ను ఎగతాళి చేసి, నవ్వారు. ఇంకా కొందరున్నారు కళ్ళల్లో కొత్తదనంతో వస్తారు, అనుకుంటారు, "ఈయన ఎవరు? నన్ను శోధించడానికి ఎంత దైర్యం?" నేను చెప్పేది నిజమని అనుకుంటారు, కాని సత్యము దారిని మార్చునట్లుగా తగ్గించుకోరు, యేసు చెంతకు రారు.

నా జీవితంలో మూడు వంతులు క్రైస్తవ్యాన్ని గూర్చి మార్పిడిని గూర్చి చదవడంలో వెచ్చించాను. నాకు మూడు డాక్టర్ డిగ్రీలు ఉన్నాయి, మార్పిడిపై చాలా పుస్తకాలు రాసాను, కాని మీరు నన్ను చూచి అనుకుంటారు, "ఈయనకు ఏమి తెలుసు?"

యేసు "పడగొట్టువాడు" నీ దగ్గరకు వచ్చి, డాక్టర్ కాగన్ దగ్గరకు నా దగ్గరకు వచ్చినప్పుడు, పాపి హృదయాన్ని విరగగొట్టడం సులభం! వారి హృదయాలను మేము విరుగగొట్టలేకపోయాం, కాని యేసే వారిని విరిచాడు! ఒక అందమైన అమ్మాయిని గూర్చి ఆలోచిస్తున్నాను తానూ అసహ్య, హృదయ కాఠిన్యతతో సమాచార గదికి వస్తుంది. కాని ఒక రాత్రి, మృదవైన చూపుతో, వచ్చింది. యేసు, కఠిన హృదయాలను పగుల గొట్టేవాడు, ఆమె దగ్గర కొచ్చాడు. ఒకటి, రెండు క్షణాలు పట్టింది, ఆమెను రక్షకుని దగ్గరకు నడిపించడానికి! యేసు, "పగల కొట్టువాడు," కఠిన హృదయాన్ని సౌమ్య పరిచాడు ఆ సాయంత్రము ఆమెతో మాట్లాడే ముందు!

యేసు ప్రతి బంధకాన్ని విరుగగొట్టుతాడు,
   యేసు ప్రతి బంధకాన్ని విరుగగొట్టుతాడు,
యేసు ప్రతి బంధకాన్ని విరుగగొట్టుతాడు,
   ఆయన నిన్ను విడుదల చేస్తాడు.

III. మూడవది, యేసు పాప బంధకాలను పడగొడతాడు.

గుడిలో కూర్చున్న ఒకరు బంధ కాళ్ళలో ఉన్నారు. అది తనకు తెలియదు. స్వతంత్రుడనుకుంటున్నాడు. కాని ఆయన బందీ. ఇష్ట మొచ్చినా దగ్గరకు వెల్లొచ్చనుకుంటున్నాడు. ఖడింపబడిన జైలు తప్ప స్వాతంత్యము లేదు. తన కర్మాగారములోనే ఇటు అటు తిరగగలడు, కిటికీ ఊసల ద్వారా చూస్తాడు. కావున, ఈ ఉదయము ఇక్కడ కూర్చున కొందరు ఇప్పటికే నిషేదింపబడినవారు, క్రీస్తును తిరస్కరించారు కాబట్టి.

సుదీర్ఘ అనుభవములో, బోధకుడు అశ్లీలతలో బంధింపబడిన వారిని గూర్చి చెప్తాడు. వారు భ్రష్ట దృష్టి కలిగి, అశ్లీలత బంధకాల్లో ఉంటారు. తరుచూ బోధకుడు చెప్తాడు మధ్యపానము, మత్తు పదార్ధాలు బానిసత్వమును గూర్చి. గర్విష్టులను గూర్చి చెప్పవచ్చు, మెడ వంగని వారిని గూర్చి. తరుచూ, సుదీర్ఘ అనుభవములో, నిరాశ బంధకాల్లో ఉన్నవారిని గూర్చి బోధకుడు చెప్పవచ్చు. అడగనవసరము లేదు. ఆయనకు తెలుసు – వృద్ధ వైద్యుని వలే, రోగిలో లోపమెంతో చూసే చెప్పస్తాడు.

కాని యేసు "పడగొట్టువాడు." చార్లెస్ వెస్లీ అన్నాడు,

ఆయన పాపపు శక్తిని విరిచాడు,
   ఆయన బందీని విడుదల చేసాడు;
ఆయన రక్తము అపరాదిని శుద్ధి చేస్తుంది;
   ఆయన రక్తము నాకై అందుబాటులో ఉంది!
("ఓ వెయ్యి నాలుకలకు" చార్లెస్ వేస్లీచే, 1707-1788).

బానిసలూ! బానిసలూ! బానిసలూ! క్రీస్తు నాకు చెప్పమని చెప్పాడు ఆయన నిన్ను విడుదల చేస్తాడు! ఆయన వస్తాడు, ఆయన వస్తాడు, గొలుసులను పగుల గొట్టేవాడు పాపుల నోద్దకు వస్తాడు! నీ పాపమూ నుండి ఆయన విడుదల చేస్తాడు. నీ బానిసపు అలవాటు నుండి విడుదల చేస్తాడు! నిన్ను బంధించిన అనుమానాలు భయాల నుండి ఆయన నిన్ను విడుదల చేస్తాడు!

కొంత కాలం క్రిందట ఒక వృద్ధ స్త్రీ చెప్పింది, "ప్రతి ఆదివారం గుడికి రెండు సార్లు వచ్చేలా చెయ్యలేవు!" కాని త్వరలో యేసు, పడగొట్టువాడు, ఆ బండ సంకెళ్ళ నుండి విడుదల చేసాడు, ఆమె ఇప్పుడు గుడిలో ఉంది, ప్రతి ఆదివారం రెండుసార్లు, చాలా శనివారాలు కూడా. ఆమె భద్రపర్చబడింది, అప్పటికే రక్షింపబడింది. త్వరలో యేసు, పడగొట్టువాడు, సాతాను బంధకాల నుండి తన మనస్సును విడిపించాడు. మేము చూసాం ఆమె సులభంగా త్వరితంగా ఆమె యేసు నోద్దకు వచ్చి రక్షింపబడింది.

ఆయన రక్తము, సిలువపై కార్చబడింది, నీ పాపములన్నింటి నుండి నిన్ను శుద్ధి చేస్తుంది. నీకు నిత్య జీవము యివ్వడానికి ఆయన మృతులలో నుండి లేచాడు. ఇప్పుడే ఆయన దగ్గరకు రా! నీవు మాతో మాట్లాడాలనుకుంటే ఎలా రక్షింపబడాలో, నీ స్థలము వదిలి సమాచార గదికి వెళ్లి. డాక్టర్ చాన్, ఈ ఉదయ సమయాన కొందరు రక్షింపబడునట్లు ప్రార్ధంచండి! ఆమెన్.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసగాలు ప్రతీవారము”
అంతర్జాలములో www.realconversion.com ద్వారా చదువవచ్చు.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రదోమేచే: మికా 2:12-13.
ప్రసంగమునకు ముందు పాట బెంజమన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్ గారిచే:
"ఓ వెయ్యి నాలుకలకు" (చార్లెస్ వేస్లీచే, 1707-1788)/
"యేసు ప్రతి బంధకాన్ని విరుగగోడతాడు" (జెన్ని వెస్ట్ మెట్జ్ గర్ గారిచే, 1927).
“O For a Thousand Tongues” (by Charles Wesley, 1707-1788)/
“Jesus Breaks Every Fetter” (by Janie West Metzgar, 1927).


ద అవుట్ లైన్ ఆఫ్

పడగొట్టువాడు

THE BREAKER

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును: వారు గుమ్మమును, పడగొట్టే దాని ద్వారా, దాటి పోవుదురు: వారి రాజు వారికీ ముందుగా నడుచును, యోహావా వారికీ నాయకుడుగా ఉండును" (మికా 2:13).

(మికా 2:12; ప్రకటన 19:11-16)

I.   మొదటిది, యేసు సాతాను శక్తిని పడగొట్టాడు, ఆదికాండము 3:15; మత్తయి 4:11; లూకా 22:44, 43; ప్రకటన 12:11; యోహాను 19:30.

II.  యేసు పాపుల హృదయాలను పడగొట్టాడు.

III. మూడవది, యేసు పాప బంధకాలను పడగొడతాడు.