Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
దేవుని కుమారునితో అగ్ని ద్వారా నడుచుట!

WALKING THROUGH THE FIRE WITH THE SON OF GOD!
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము ఉదయము, డిసెంబర్ 29, 2013
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Morning, December 29, 2013

"అందుకు, రాజు, నేను నలుగురు మనుష్యులు, బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమియు కలుగ లేదు; నాల్గవ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తర మిచ్చెను" (దానియేలు 3:25).


తప్పుడుగా ఈ ప్రసంగాన్ని ప్రారంబిస్తాను. సేమినరీలో మాకు నేర్పించారు, ప్రజల దృష్టిని ఆకర్షించడానికి, ప్రసంగము ప్రారంభంలో రసవత్తర సన్నివేశము చెప్పాలని. కాని నేను ఆ నియమావళిని ఉల్లంఘించి ఒక గుణపాఠము హొమి లేటిక్స్ మరియు హెర్మ్ న్యుటిక్స్ మీకు నేర్పిస్తాను. హొమి లేటిక్స్ మరియు హెర్మ్ న్యుటిక్స్ - మీకు ఈ పదాలు తెలియదు, మీకు విసుగు పుట్టించడానికి, వాటిని నిర్వచిస్తాను. హెర్మ్ న్యుటిక్స్ బైబిలు తర్జుమాకు సంబంధించిన పథనము. ఇది లేఖనాల తయారీ మరియు డెలివరీ అధ్యయనం. హెర్మ్ న్యుటిక్స్ పవిత్ర బైబిల్ లో నియమాలు వివరించడంలో - పత్రాల అర్ధం వివరించే అధ్యయనం. డాక్టర్ యమ్. ఆర్. డిహాన్ (1891-1965) హెర్మ్ న్యుటిక్స్ లో మూడు ఉదాహరణలు చెప్పాడు:

(1) లేఖనాలన్నిటికి ఒక మూల తర్జుమా ఉంటుంది.
(2) లేఖనాలన్నిటికి చాలా క్రియాశీల అన్వయింపులు ఉంటాయి.
(3) చాలా లేఖన భాగాలు ప్రవచానాత్మక ప్రత్యక్షత కలిగి ఉంటాయి.
(M. R. DeHaan, M.D., Daniel the Prophet, Kregel Publications, 1995 reprint, p. 73).

డాక్టర్ డిహన్ యొక్క బైబిలు తర్జుమాకు సంబంధించిన మూడు హెర్మ్ న్యుటిక్స్ నియమాలు ఈ ప్రసంగానికి ముందు ఉపయోగిస్తాను.

I. మొదటిది, లేఖనాలన్నీటికి ఒక మూల తర్జుమా ఉంటుంది.

నెబుకద్నెజరు బబులొను రాజు. ఆరవ శతాబ్దములో క్రీస్తు పుట్టుక ముందు, నెబు కద్నెజరు యేరూష లేమాను చెర పట్టడానికి తన సైన్యాన్ని ఉపయోగించాడు. అతని సైనికులు యూదా రాజును బంధించి వారి స్వస్థలానికి పంపివేశారు. యూదా ఆలయమును దాడి చేసి దేవుని మందిర ఉపకరణాలను తిరిగి బబులోనుకు తీసుకెళ్ళారు. రాజు అతని సైన్యానికి అజ్ఞాపించాడు అనేక మంది యూదులను బందించి బబులోనుకు బానిసకులుగా తెమ్మన్నాడు. కాని నెబుకద్నెజరు తన సేవకుడైన అస్పె నాజూకు సుందరులైన శ్రేష్టు లైన యవ్వనస్థులను తీసుకొని కల్దీయుల భాషనూ బబులోను సామాన్య శాస్త్రమును నేర్పించి, రాజ మందిరములో ప్రత్యేక సేవకులుగా నిలబెట్టాలని ఉపదేశించాడు. ఈ నలుగురు మనుష్యులు దానియేలు, పడ్రకు, మేషకు, అబెద్నగోలు. ప్రత్యేకంగా దేవుడు ఈ నలుగురు యూదా యవ్వనులను దీవించాడు. రాజైన, నెబుకద్నెజరు, వారిని ఇలా ప్రశ్నించాడు,

"వీరు తన రాజ్యమందుండు శకున గాండ్ర కంటెను గారడీ విద్య గల వారి కంటెను పదియంతలు శ్రేష్టులని తెలియబడెను" (దానియేలు 1:20).

రాజు వారి తీర్పును నమ్మి ఉపదేషకులుగా వారిపై ఆధారపడెను. నిజానికి, రాజు దానియెలును, బబులోను దేశమంతటిపై, తన తరువాత రెండవ పరిపాలకునిగా నియమించెను. రాజు షడ్రకు, మేషకు, అబెద్నిగోలకు ప్రభుత్వములో ఉన్నత పదవులను, దానియేలు అధికారములో ఇచ్చెను.

తరువాత రాజు తొంబై అడుగుల ఎత్తైన బంగారు ప్రతిమను చేయించి, ప్రజలు మ్రొక్కె విధంగా ఏర్పాటు చేసాడు. ఒక దినాన బబులోను నాయకులందరూ అక్కడకు వచ్చారు. రాజు అధిపతి బిగ్గరగా ప్రకటించాడు ఎవరైతే బంగారు ప్రతిమకు సాగిలపడి ఆరాదించరో వారు "మండుచుండు అగ్ని గుండములో పడ ప్రోయబడుదురు" (దానియేలు 3:11). షడ్రకు, మేషకు, అబెద్నెగోలు ఇశ్రాయేలు దేవుడైన, యోహావాను, ఆరాధించారు. అందుకు వారు రాజు ప్రతిమకు సాగిల పడలేదు.

కల్దీయ ఖగోళవేత్తలు అప్పటికే యూదుల పట్ల అసూయ కలిగియున్నారు. వాళ్ళు రాజుకు ఇలా విన్నవించారు,

"ఈ మనస్యులు, తమరి, ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు: తమరి దేవతలను పూజించుట లేదు, తమరు నిలువ బెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనిరి" (దానియేలు 3:12).

రాజైన నెబుకద్నెజరు ఆగ్రహుదయ్యాడు. తానూ ఆగ్రహంతో షడ్రకు, మేషకు, అబెద్నగోలను పిలిచాడు. వారు తన ప్రతిమకు మొక్కకపోతే మండుచున్న అగ్ని గుండములో పడేస్తానని చెప్పాడు. వారి జవాబు రాజుకు చక్కనిది. మన పరిచారకుడు మెన్సియాకు తెలుసు వారి జవాబు నాకు ఎంత ఇష్టమో, ఆ మాటలు చెక్కల మీద వ్రాసి, చాలా సంవత్సరాలు గుడిలో నా బల్లపై ఉంచారు. వాళ్ళన్నారు,

"మేము సెవించుచున్న, దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్ధుడు, మరియు నీ వశమున పడకుండా, ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ, ఆయన రక్షింపకపోయినాను, రాజా, నీ దేవతలను పూజింపమనియు, నీవు నిలువ బెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసికొనుము" (దానియేలు 3:17,18).

మా దేవుడు మమ్ములను విడిపిస్తాడు, విడిపించనప్పటికిని నీ దేవతలను పూజింపము!

అలా జవాబిచ్చినందుకు రాజు వారిపై ఆగ్రహుడయ్యాడు. తన సేవకులచే అగ్ని గుండము మరింత వేడిమి చేయించాడు. తన సైనికులకు ముగ్గురు యూదులను అగ్ని గుండములో పడవేయమని ఆజ్ఞాపించాడు. చివరకు రాజు అగ్ని గుండములో చూసాడు. చూసిన దానికి ఆశ్చర్య చకితుడయ్యాడు! ఇలా అన్నాడు,

"ఇదిగో, నేను నలుగురు మనస్యులు, బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమియు కలుగ లేదు; నాల్గవ వారి రూపము దేవతలా రూపమును బోలినది" (దానియేలు 3:25).

రాజు వారిని గుండము వెలుపలికి తీయించాడు. ఆయన వారి దేవుని, ఇశ్రాయేలు దేవుని ఆశీర్వదించాడు. తానూ అన్నాడు "ఆయన దూత, తనను నమ్మకోనిన సేవకులను విడిపించెను" (దానియేలు 3:28). ఇంకా, నెబుకద్నెజరు ఈ ముగ్గురి ఉద్యోగాలు పునరుద్ధరించాడు. ఆయన శాసనము చేసాడు ఇశ్రాయేలు దేవునికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదు, ఇంకా అన్నాడు, "ఇలా విడిపించు దేవుడు వేరొకడు లేడు" (దానియేలు 3:29).

ఇది ఈ వచన మూల తర్జుమా. ఇంకా ఉంది!

II. రెండవది, లేఖనాలన్నిటికి చాలా క్రియాశీల అన్వయింపులు ఉంటాయి.

"ఒక తర్జుమా కాని, చాలా అన్వయింపులు" – అది హెర్మ్ న్యుటిక్స్ లో నియమావళి – బైబిలును వివరించే శాస్త్రము. దీని ప్రాముఖ్య అన్వయింపులు నేను చూస్తున్నాను.

మొదటి అన్వయింపు, బహుశా, బబులోనుకు పంపివేయబడిన ఇతర యూదులకు. వారు శోధింపబడ్డారు, వారి చుట్టూ ఉన్న సంస్కృతీ వైపు, దేవుని ప్రజల స్థితి కోల్పోయారు. దానియేలు సింహపు బోనుల వేయబడుట, ముగ్గురు హేబ్రీయులు అగ్ని గుండములో ఉండుట, ముందుగా ఇవ్వబడ్డాయి నేర్పించడానికి బబులోను బందీలైన యూదులు వారి స్వస్థములను విశ్వాసమును కోల్పోకూడదని.

ఈ విషయము క్రైస్తవులకు కూడా అన్వయింపబడుతుంది. మన సువార్తిక సంఘాలలో అపోస్టసీ విస్తరిస్తున్న దినాలలో మనం జీవిస్తున్నాం. నేను చూసాను, నా జీవిత కాలంలో, మన గుడివారము మద్య ప్రార్ధన కూటములు వదిలేయడం, సాయంత్రపు కరటాలు మూత పడడం. నేను సువార్తిక బోధ చూసాను, నిజానికి నిజ బోధ, అన్ని సంఘాలలో అదృశ్యమయింది. మనస్యులు చిన్న మెత్తని బైబిలు పథనాలు ఇస్తారు, ప్రసంగాలు బోధించే బదులు, మన ప్రాధమిక సంఘాలలో కూడా. నేను చూసాను సంఘాలు పాటల పుస్తకాలు పారవేసాయి, గొప్ప విశ్వాసపు పుస్తకాలను. వాళ్ళు కొన్ని నిస్సార కోర్సులు ఆత్మకు వడ్డింపలేనిది తేవడం నేను చూసాను. సంఘ కాపరులు వారి బయలు పడవేసి, ప్రసంగ వేదికపై ఆతల చొక్కాలు ధరించడం, వారి మొదటి పేరుతో పిలిపించుకోవడం నేను చూసాను. ప్రసంగ వేదిక శక్తి హొదా గతానికి సంబంధించినదయిపోయింది. యవనులు గుడులలో యిటు అటు తిరుగడం, అబ్బాయిలు టి-షర్టులు, అమ్మాయిలు చిన్న స్కర్టులు వేసుకోవడం వాళ్ళు అనుమతిస్తున్నారు. మన సంఘాల్లో యవనస్థులు వ్యభిచారుల్లా, మత్తు పదార్దాలకు అలవాటు అయిపోయిన వారిలా ఉన్నారు, ప్రాధమిక బాప్టిస్టుల కంటే! మనము హీనపర్చబడుతున్నాము. లోకముచే మ్రింగబడుచున్నాము. లోకస్థుల వలె అయిపొతున్నాము సువార్తికులకు సామాన్యులకు మధ్య తేడా చెప్పా లేకపోతున్నాము! అవును, అంత చెడ్డగా ఉంది! దానియేలు గ్రంధములో ముగ్గురు హేబ్రీయులు మనకు చెప్తున్నారు, "మేము హేయ పర్చబడం. ప్రపంచంతో పని చేస్తాం, ప్రపంచంతో పాఠశాలకు వెళ్తాం, కాని లోకం పట్ల మర్యాదగా ఉంటాం. అక్కడి వరకే వెళ్తాం – ఇంకా ముందుకు కాదు – ఎంత ఖరీదైనా!"

"మేము సేవించుచున్న దేవుడు మమ్ములను విడిపించగలడు...ఒకవేళ, రక్షింపకపోయినను, రాజా, నీ దేవతలను పూజింపమనియు, నీవు నిలువ బెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసికొనుము" (దానియేలు 3:17,18).

ఎదుర్కొనబడినప్పుడు మనము లేచి బైబిలును సమర్దిస్తాం. మనము కాలేజి ప్రొఫెసర్లకు జవాబిస్తాం నాస్తికత్వాన్ని మన గొంతుల దగ్గరకు తెచ్చే వారిని. రోస్ పెరేడ్ కు హాజరు కాము, 5 నిముషాలు కూడా చూడం క్రైస్తవ వ్యతిరేక ప్రచారము చేస్తారు. రోస్ పెరేడ్ ను ఎప్పుడు చూడం వాళ్ళు బైబిలు ఆధారిత విశ్వాసాన్ని ప్రశ్నించినంత కాలము! అది మనకు శ్రమ కల్గిస్తే –అంతే!

"ఒకవేళ, రక్షింపకపోయినను, రాజా, నీ దేవతలను పూజింపమనియు, నీవు నిలువ బెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసికొనుము!" (దానియేలు 3:17,18).

మనం నశించు లోకానికి చెప్తాం, "మేము పాఠశాలలో మీ డాన్సులకు హాజరుకాము! మేము పొగ త్రాగము, న్యాయ సమ్మతమయినప్పటికి! మీ అశ్లీల చిత్రాలు చూడం! గర్భాలు తీయించుకోవడం మేము గైకొను! పార్టీలకు వెళ్ళడానికి గుడి ఎగగొట్టడం! ఎన్నడు! ఎన్నడు! ఎన్నడు! ఈ పనులేన్నటికి చెయ్యం!"

"మేము సేవించుచున్న దేవుడు మమ్ములను విడిపించగలడు...ఒకవేళ, రక్షింపకపోయినను, రాజా, నీ దేవతలను పూజింపము, [మీ] బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసికొనుము!"

ఎన్నడు! ఎన్నడు! ఎన్నడు! ఎన్నడు! ఎన్నడు! ఎన్నడు!

మా తండ్రుల విశ్వాసము! ఇంకా జీవిస్తుంది
గొయ్యి అగ్ని, ఖడ్గము ఉన్నప్పటికీ:
ఓ మన హృదయాలు ఆనందంతో గంతులేస్తున్నాయి
ఎప్పుడు ఆ మహిమాయుక్త పదం మనం విన్నా!
మా తండ్రుల విశ్వాసం, పరిశుద్ద విశ్వాసం!
మరణ పర్యంతం మేము సత్యవంతులుగా ఉంటాం!
("మా తండ్రుల విశ్వాసం" ప్రేడరిక్ డబ్ల్యూ. ఫేబర్, 1814-1863).
      (“Faith of Our Fathers” by Frederick W. Faber, 1814-1863).

దేవుని కుమారునితో అగ్ని గుండములో నడుస్తాం! ఒకవేళ దేవుడు కాలిపో జేసినా సరే ఆ అగ్ని ద్వారా నడుస్తాం! మీ లైంగిక దేవుళ్ళకు, అశ్లీలతకు, మత్తు పదార్ధాలకు వస్తువులకు మేము తలవంచము. దేవుని కుమారునితో అగ్ని గుండములో నడుస్తాం!

మా తండ్రుల విశ్వాసం, పరిశుద్ధ విశ్వాసం!
మరణ పర్యంతం మేము సత్యవంతులుగా ఉంటాం!

తరువాత, భయంకర పరీక్షల ద్వారా, వెళ్తున్న క్రైస్తవులకు ఒక అన్వయింపు ఉంది. నిజ క్రైస్తవుని జీవితమూ సులభమని ఎవ్వరు మీకు చెప్పనివ్వవద్దు. క్రీస్తు మనకు చెప్పాడు,

"ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్ను తానూ ఉపేక్షించుకొని, తన సిలువను ఎత్తుకొని, నన్ను వెంబడింపవలెను" (మత్తయి 16:24).

అపోస్తలుడైన పౌలు అన్నాడు, "గొప్ప శ్రమల ద్వారా దేవుని రాజ్యములో ప్రవేశించునట్లు" (అపోస్తలుల కార్యములు 14:22). నీవు క్రీస్తు నిజ శిష్యుడవైతే, మీరు చాలా శ్రమల ద్వారా వెళ్తారు. కాని యేసు అన్నాడు,

"నా నిమిత్తము, జనులు మిమ్మును నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్ల పలుకునప్పుడు, మీరు ధన్యులు. సంతోషించి ఆనంధించుడి, పరలోక మాయ: మీ ఫలము అధికమగును: ఇలా వారు మీకు పూర్వ మందుండిన ప్రవక్తలను హింసించిరి" (మత్తయి 5:11-12).

ఎలాంటి శ్రమలు హింసలు ద్వారా నీవు వెళ్తున్నప్పటికి, యేసు అన్నాడు, "నేను నిన్ను, ఎన్నడునూ విడువను నిన్ను యెడబాయను" (హేబ్రీయులకు 13:5). జ్ఞాపకముంచుకొండి అగ్ని గుండంలో ఆ ముగ్గురు హేబ్రీయులతో పాటు నాల్గవ వ్యక్తీ ఉన్నాడు, "నాల్గవ వ్యక్తీ దైవ కుమారుని వలే ఉన్నాడు" (దానియేలు 3:25). యేసు, దైవ కుమారుడు, అగ్ని గుండములో వారితో ఉన్నాడు! యేసు, శరీరదారిగా, వారికి హాని కలుగకుండా అగ్నిలో నడిపించాడు. ఆయనను నమ్మండి, ఆయన మిమ్ములను సురక్షితంగా ఆ అగ్ని గుండా శ్రమల ద్వారా తీసుకెళతాడు. గొప్ప విశ్వాసపు పాట యేసు నోటిలో ఈ మాటలుంచాయి, నిజంగా!

అగ్ని శ్రమల మార్గంలో మీరు వెళ్తున్నప్పుడు,
నా చాలిన కృప మీకు సమకూర్పు;
అగ్ని మిమ్ములను ధహించదు, నేను నిర్మించాను
మీ కల్మషం కాల్చి వేయడానికి, మీ బంగారం మెరుగవడానికి.
("ఎంత గట్టి పునాది" తెలియని రచయిత).
(“How Firm a Foundation” by an unknown author).

కాని డాక్టర్ డిహాన్ మనకు మరొక హెర్మెనెటికల్ విషయం ఇచ్చాడు.

III. మూడవది, చాలా లేఖన భాగాలు ప్రవచానాత్మక ప్రత్యక్షత కలిగి ఉంటాయి.

డాక్టర్ డిహాన్ సరిగా చెప్పాడు "ఆ ముగ్గురు హెబ్రీ యువకులు అన్యులలొ ఇశ్రాయేలీయులకు చూచిక. శ్రమల హింసల అగ్ని గుండములో వేయబడినప్పటికి, అద్భుతంగా వారు సంరక్షించబడ్డారు, అగ్ని గుండములో తెగ అసహ్యత [ఏంటి సెమిటిస్మ్] హింస, ఎందుకంటే వారు దేవుని నిబంధన జనాంగం కాని చివరకు ఆశ్చర్య రీతిలో విడిపింపబడి దేశాలలో పైకెత్తబడ్డారు" (డిహాన్, ఐబిఐడి., పేజీలు 73-74).

ప్రతీ అన్యదేశము ఏదో ఒక సమయంలో యూదులను హింసించింది. ఈజిప్టు, బబులోను, గ్రీస్, రోమా, స్పెయిన్, ప్రాన్స్, రష్యా, మరియు జెర్మనీ – ప్రతి దేశము యూదులను హింసించింది, వారిని బహిష్కరింప ప్రయత్నించింది. వాళ్ళంతా విపలమైనారు ఎందుకంటే ఇశ్రాయేల్ దేవుని నిరంతర రాజ్యము! ఇప్పుడు ఇరాన్ అనుకుంటుంది ఇశ్రాయేల్ ద్వంసం చెయ్యగలనని! వారు మళ్ళీ మళ్ళీ చెప్పారు. నేను వారికీ చెప్తాను, "మీకంటే బలమైన దేశాలు యూదులను బహిష్కరింప ప్రయత్నించింది. వాళ్ళంతా విపలమైనారు – నీవు కూడా అంతే!" దేవుడు ఎల్లప్పుడూ ఇశ్రాయేలుతో ఉన్నాడు, శ్రమల గుండములో దేవుడు వారిని విఫలపరచడు! చాసారా, దేవుడు అబ్రహముతొ నిబంధన చేసాడు అది తెగిపోదు. దేవుడు పితరులతో చెప్పాడు కనాను దేశము యూదులకు నిరంతరమూ ఇవ్వబడుతుందని!

"ఆ దినమందే యోహావా, ఈజిప్టు నది మొదలుకొని, గొప్ప నదియైన యూఫ్రటీసు నది వరకు, నీ సంతానమునకు ఇచ్చి యున్నానని, అబ్రహముతొ నిబంధన చేసెను" (ఆది కాండము 15:18).

"నీకును, నీ తరువాత నీ సంతతికిని, నీవు పరదేశిమైయున్న దేశమును, అనగా కనానను దేశ మంతటిని, నిత్య స్వస్థ్యముగా ఇచ్చి; వారికీ దేవుడనై యుందునని అతనితో చెప్పెను" (ఆదికాండము 17:8).

తరతరాలుగా, యూదులు హింసింపబడుచున్నారు – తరుచూ అబద్ధపు క్రైస్తవులచే, ఎందుకంటే నిజ క్రైస్తవుడు దేవుని నిబంధన ప్రజలకు హాని చెయ్యదు! కాని యెషయా (యేసు) ఎప్పుడు గుండములో నాల్గవ వ్యక్తిగా ఉన్నాడు, యూదులతో శ్రమ పడుతూ – చివరకు అన్యులపై ఘన విజయమిచ్చాడు! చివరిలో, అపోస్తలుడైన పౌలు ప్రవచనము నిజంగా నిజమైంది. తానూ అన్నాడు, "ఇశ్రాయేలీయులందరు రక్షింపబడుదురు: వ్రాయబడినట్టుగా, సీయోనులో నుండి విమోచకుడు వస్తాడు, యాకోబు నుండి భక్తీ హీనులను తొలగిస్తాడు" (రోమా 11:26).

ముగింపులో, మన ముగ్గురు హెబ్రీ స్నేహితులతో పాటు ఉన్న నాల్గవ వ్యక్తీ గూర్చి ఆలోచిద్దాం. నెబుకద్నెజరు అన్నాడు ఆయన "ఒక దూత" (దానియేలు 3:28). "దూత" అంటే "పంపబడినవాడు." "ప్రభువుచే పంపబడినవాడు" పాత నిబంధనలో తరుచూ శరీర దారి యేసు ప్రత్యక్షత. ఉదాహరణకు, "ప్రభువు దూత" సంపోను తండ్రియైన, మనోహాకు ప్రత్యక్షమై. బైబిలు చెప్తుంది,

"ఆయన యోహావా దూత అని మానోహా తెలిసికొని. మనము దేవుని చూచితిమి గనుక, మనము నిశ్చయముగా చనిపోదూమని, తన భార్యతో అనెను"(న్యాయాధిపతులు 13:21, 22).

దేవుని, దూత దేవుడే, యేసు త్రిత్వములొ రెండవ వ్యక్తీ, పాత నిబంధనలో మరియు గర్భములో ఉధ్బవించక ముందే ప్రత్యక్షమయ్యారు.

దానియేలు 3:25 లో, కూడా, రాజు అగ్ని గుండములో చూచినప్పుడు అన్నాడు, "నాల్గవ వారి రూపము దైవ కుమారుని వలే ఉన్నది." డాక్టర్ జె. వెర్నాన్ మెక్ గీ అన్నాడు, "నేను నమ్ముతాను నాల్గవ వ్యక్తీ దైవకుమారుడు, క్రీస్తు శరీర దారి" (J. Vernon McGee, Th.D., Thru the Bible, Thomas Nelson Publishers, 1982, volume III, p,. 547; note on Daniel 3:25).

యేసు లక్షణం ఆయన దిగి వచ్చి ఎన్నిక చేయబడిన ప్రజల శ్రమల తిరస్కరణలో పాలు పంపులు పొందాడు – చివరకి వారిని తప్పించాడు! ఆయన దివి నుండి దిగి, కన్య మరియా గర్భంలో ఉద్బవించాడు. ఆయన "ప్రభువులకు ప్రభువుగా రాజులకు రాజుగా" "రాలేదు" ఆయన మొదటి క్రిస్మస్ లో బెత్లెహములొ జన్మించినప్పుడు. భవిష్యత్తులో రాజులకు రాజుగా వస్తాడు – రెండవ రాకడలో. కాని ఆయన మనలను రక్షించడానికి మరియా గర్భంలోని వచ్చాడు – అగ్ని గుండంలోనికి వచ్చినట్టుగా యూదా వీరులను అగ్ని గుండములో నుండి రక్షించడానికి!

యేసు దివి నుండి దిగి వచ్చి లోకంలో శ్రమపడి, నరకమనే అగ్ని గుండము నుండి ఆయన ప్రజలను రక్షించాడు! మనమంతా నిత్యత్వాన్ని "ఆరని అగ్నిలో" గడపవలసిన వారము. కాని యేసు శ్రమ పడడానికి దిగి వచ్చాడు సిలువపై మరణించి మన అతి క్రమములకు పరిహారము చెల్లించాడు. దేవుడు మన అందరి పాపములను "మ్రానుపై తన శరీరములో" ఉంచాడు – సిలువపై (Iవ పేతురు 2:24). కనుక, యేసు ఆయన ప్రజందరి పాపాల కోసం అర్పింపబడ్డాడు.

ఆయన మరణించి, మూడు రోజులు, సమాధిలో ఉన్నాడు. కాని, తోలి ఈస్టర్ ఆదివారము వేకువనే, యేసు శరీరంతో లేచి – శరీరము ఎముకలతో – మృతులలో నుండి. తిరిగి పరలోకానికి ఆరోహణమయ్యాడు, నీ కొరకు ప్రార్ధిస్తూ, తండ్రి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు.

ఎప్పుడైతే నీవు హృదయంలో యేసును నమ్ముతావో, ఆయన నీ పాపములను క్షమించి ఆయన రక్తములొ కడుగుతాడు. నీ హృదయములో ఆయనను విస్వసిస్తె, ఆయన నీ పాపముల నుండి రక్షించి నశించిన, నిరీక్షణ లేని జీవితాన్ని లేవనేత్తుతాడు – అగ్ని గుండము నుండి ముగ్గురు హేబ్రీయులను విడిపించినట్టు! ఆమెన్!

రక్షింపబడడానికి మాతో మాట్లాడాలనుకుంటే నిజ క్రైస్తవుడవాలంటే, దయచేసి మీ స్థలము వదిలి ఆవరణము వెనుకకు వెళ్ళండి. డాక్టర్ కాగన్ వేరే గదికి తీసుకొని వెళ్లి మీతో ప్రార్ధించి మాట్లాడతారు. డాక్టర్ చాన్, ఈ ఉదయ కాలమున యేసును నమ్మునట్లు ప్రార్ధించండి! ఆమెన్.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసగాలు ప్రతీవారము”
అంతర్జాలములో www.realconversion.com ద్వారా చదువవచ్చు.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రదోమేచే: దానియేలు 3:16-25.
ప్రసంగమునకు ముందు పాట బెంజమన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్ గారిచే:
"మా తండ్రుల విశ్వాసం" (ప్రేడరిక్ డబ్ల్యూ. ఫేబర్, 1814-1863).
“Faith of Our Fathers” (by Frederick W. Faber, 1814-1863).


ద అవుట్ లైన్ ఆఫ్

దేవుని కుమారునితో అగ్ని ద్వారా నడుచుట!

WALKING THROUGH THE FIRE WITH THE SON OF GOD!

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"అందుకు, రాజు, నేను నలుగురు మనుష్యులు, బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమియు కలుగ లేదు; నాల్గవ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తర మిచ్చెను" (దానియేలు 3:25).

I.   మొదటిది, లేఖనాలన్నీటికి ఒక మూల తర్జుమా ఉంటుంది, దానియేలు 1:20; దానియేలు 3:11, 12, 17, 18, 25, 28, 29.

II.  రెండవది, లేఖనాలన్నిటికి చాలా క్రియాశీల అన్వయింపులు ఉంటాయి, దానియేలు 3:17, 18; మత్తయి 16:24; Acts 14:22; మత్తయి 5:11-12; హేబ్రీయులకు 13:5.

III. మూడవది, చాలా లేఖన భాగాలు ప్రవచానాత్మక ప్రత్యక్షత కలిగి ఉంటాయి, ఆదికాండము 15:18; 17:8; రోమా 11:26; దానియేలు 3:28; న్యాయాధిపతులు 13:21, 22; I పేతురు 2:24.