Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
ఆఖరి దినాల్లో సాతాను ఉగ్రత

THE WRATH OF SATAN IN THE LAST DAYS
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు,
ప్రభువు దినము ఉదయము డిసెంబర్ 8, 2013.
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, December 8, 2013

"అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని, బహుక్రోధము గలవాడై, మీ యొద్దకు దిగి వచ్చియున్నాడు" (ప్రకటన 12:12).


అవును, సాతాను ఉందని నమ్ముతాను. 12 పేర్లు తనకు భైబిలులో ఇవ్వబడ్డాయి. తాను సాతానని, దెయ్యమని, డ్రేగన్ అని, సర్పమని, బెయెర్జెబూలని, బయలు అని, లూసిఫర్ అని, దుష్టుడని, శోధకుడని, ఈ లోక అధికారి అని, వాయుమండల అధిపతి అని, ఈ ప్రపంచ రాజు అని పిలువబడ్డాడు. దెయ్యాని గూర్చి పరిహసించకూడదు, తేలికగా మాట్లాడకూడదు. తనకు గొప్ప శక్తి ఉంది, దేశాల కంటే, మానవుడు చేసిన ఆయుధాలకంటే. తాను వాయుమండలము, భూ వాతావరణాన్ని ఏలుతాడు. దేవుని పనిని ఆటంకపరచడం వాని ఉద్దేశము, ప్రార్ధనలకు జవాబు అందకుండా ఆపడం, క్రీస్తు రెండవ రాకడను జాప్యము చేయడం, పరిశుద్ధాత్మను ఎదిరించడం, ఉజ్జీవాన్ని ఆపడం, మానవ జీవితాన్ని నాశనం చేయడం, దేవుని సృష్టియైన – మానవాళిని నశింపజేయడం. దెయ్యము భయంకర, దుష్ట, అసహ్య భూతము. తనకు అందమైన, సృష్టిగా మార్చుకుంటాడు. ప్రతివాదిని బలిగోన్నప్పుడు, భయంకర డ్రేగన్ గా మారిపోతాడు.

మన పాఠ్యభాగము ఆఖరి దినాల్లో సమయాన్ని గూర్చి, యోచా మొదటి అధ్యాయము తరువాత, సాతాను దేవుని సన్నిధికి రాలేని స్థితిని గూర్చి మాట్లాడుతుంది. అప్పటివరకు పరలోకంలో దేవుని సన్నిధికి తాను వస్తూపోతూ ఉండేవాడు. కాని దేవుని సన్నిధి నుండి నిరంతరము త్రోసివేయబడినప్పుడు, దాని అంతము దగ్గరయిందని తెలుసుకున్నాడు. జె. ఎ. సీస్, ప్రకటన గ్రంధముపై తానిచ్చిన వ్యాఖ్యానము, ఈ విషయము చెప్తుంది,

మనం ఆలోచిస్తాం పరలోకంలో [గొప్ప] ఓటమి వాని బాగుచేసి, దేవునికి ఆయన ప్రజలకు వ్యతిరేకంగా వాని ప్రయత్నాలు మానిపిస్తుందని. కాని వాడు అనిశ్చయుడై, వాని దెయ్యపు స్వభావాన్ని [అధిగమింప] జేస్తుంది. పూర్తిగా మరులు కోల్పబడడానికి మందు లేదు. పరలోకము నుండి త్రోయబడడం భూమికే పరిమితమవడం తన కోపాగ్ని పెంచి, విద్వంశాన్ని పెంచి, లోకము ఎన్నడూ చవిచూడని భయంకర స్థితిని కలిగించింది (J. A. Seiss, The Apocalypse – Lectures on the Book of Revelation, Zondervan Publishing House, no date, p. 313).

దెయ్యాన్ని గూర్చి నేను ఎక్కువ నేర్చుకున్నాను యవ్వనస్తునిగా బైబిలు పండితుడు వేదాంతి అయిన, డాక్టర్ తిమోతీ లిన్ నుండి. డాక్టర్ లిన్ ఫెయిత్ వేదాంత సేమినరీ నుండి రెండు మాస్టర్ డిగ్రీలు కలిగినవాడు. ఆయన పాత నిబంధనలో పి.హెచ్.డి. హెబ్రీ భాష తాలూకూ సమాచారము డ్రాప్స్ సీ విశ్వవిద్యాలయము నుండి కలిగినవాడు. తరువాత ఆయన బాబ్ జోన్స్ విశ్వవిద్యాలయములో, తాల్ బోట్ వేదాంత సెమినరీలో, డోర్ ఫీల్డ్ ఇల్లీనియస్ లోని ట్రినిటీ సువార్త సెమినెరీలో, భోధకులుగా ఉన్నారు. నూతన అమెరికన్ స్టాండర్డ్ బైబిలుకు అనువాదకులుగా, 1980 నుండి 1990 వరకూ తాయివాన్ లో చైనా సువార్తిక సెమినరీలో అధ్యక్షులుగా ఉన్నారు – డాక్టర్ జేమ్స్ హాడ్ సన్ టేలర్ III తరువాత. ఆయన నాకు 23 సంవత్సరాలుగా కాపరి భోధకుడు, నేను లాస్ ఏంజలిస్ లో మొదటి చైనీ బాప్టిష్టు సంఘములో సభ్యునిగా ఉన్నప్పుడు. నాకు ఆయన నాకు బాప్తిస్మమిచ్చి, జూలై 2 న, 1972 అభిషేక కమిటీకి అధ్యక్షులుగా ఉన్నారు.

కాని డాక్టర్ లిన్ పట్టున్న వేదాంత అధ్యాపకులు. ఆయన పాఠాలు ప్రసంగాలు శక్తి గల జీవ వేదాంతముతో నిండి ఉన్నాయి. ఉదాహరణకు, డాక్టర్ లిన్ ధృడంగా నమ్మాడు మనం ఆఖరి దినాల్లో ఉన్నామని – ప్రపంచ అంతములో. దానిని తెలుసుకోడానికి ఎక్కువ చదవనక్కరలేదు. ఉదాహరణకు, సంఘాభివృద్ధిపై ఆయన పుస్తకంలో, తరుచూ పదాలు వాడాడు "ఆఖరి రోజుల్లో సంఘాలకు అపోహలుంటాయి…" (పేజీ 6); "ఆఖరి రోజుల్లో ప్రసంగవేదిక" (పేజీ 11), "ఆఖరి దినాల్లో చాల క్రైస్తవులు...నులివెచ్చగా, భయస్తులుగా, దేవుని వాక్యంలో విశ్వాసం లేనివారుగా ఉంటారు" (పేజీ 17); "ఆఖరిదినాల్లో సంఘ దుస్థితికి కాపరుల లేమి కారణం కాదు..." (పేజీ 21); "ఆఖరి దిన సంఘాలు ఈ విషయం ముమ్మారు ఆలోచించాలి" (పేజీ 29); "ఆఖరి దినాల్లో కొన్ని సంఘాలకు లెక్కలేరు...డబ్బు వస్తున్నంతకాలమూ" (పేజీలు 48, 49); "ఆఖరి దిన సంఘాలు తప్పు ఒప్పుల తారతమ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంది" (పేజీ 50); "దానికి రెండు కారణాలున్నాయి ఆ స్థితిని కలిగి ఉండడానికి" (పేజీ 95). (All quotations are from Timothy Lin, Ph.D., The Secret of Church Growth, FCBC, 1992).

డాక్టర్ లిన్ చెప్తూనే ఉన్నారు, మనం క్రైస్తవతర అంతంలో ఉన్నామని. మరొక విషయం డాక్టర్ లిన్ చెప్పేది సాతాను అతని దెయ్యాల ఉనికిని గూర్చిన వాస్తవము. ఈ విషయాలు ఆయన ప్రసంగాలలో బైబిలు పఠనంలో నొక్కి వక్కానింపబడ్డాయి – మనం ఆఖరి దినాల్లో ఉన్నాం, సాతాను తన అనుచరులు మనలను ఎదుర్కొంటున్నాయని. మీరనుకోవచ్చు ఈ వ్యతిరేక విషయాలు సంఘాన్ని నిరుత్సాహ పరుస్తాయని. దానికి వ్యతిరేకం నిజం! అతని సంఘం ఉజ్జీవాన్ని చవిచూసింది. తక్కువ వ్యవధిలో 2000 లకు పైగా సంఘంలో చేర్చబడ్డారు.

డాక్టర్ లిన్ మన పాఠ్యాన్ని తన భోధలో ప్రసంగంలో చెప్పాడు,

"అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని, బహుక్రోధము గలవాడై, మీ యొద్దకు దిగి వచ్చియున్నాడు" (ప్రకటన 12:12).

ఈ వచనంపై, డాక్టర్ లిన్ ఇలా వ్యాఖ్యానించాడు,

సాతాను తన చెడు జీవితాన్ని కొనసాగించడానికి క్రీస్తు రెండవ రాకడను ఆలస్యం చేయడమే మార్గము...అందుకే, తన దుష్ట ప్రణాలికలు వేసి ప్రజలు యేసును నమ్మకుండా చేస్తుంది – తద్వారా దేవుని రాజ్య సంబందుల తయారిని ఆపి...సాతాను తన రెండో మెట్టు అయిన క్రైస్తవుల ప్రార్ధన పట్ల, సమయము, ప్రయత్నం చేయకుండా చేసి ఉక్కిరి బిక్కిరికి గురి చేస్తుంది...తద్వారా, ప్రభువు రెండవ రాకడను దూరము చేస్తూ, సాతాను ప్రార్ధనకు వ్యతిరేకంగా ఒత్తిడి తెస్తుంది! (లిన్. ఐబిఐడి., పేజీలు 95, 96).

చాల భోధకులు క్రీస్తు రెండవ రాకడ "సూచనలు" చూడరు గ్రహించారు. కాని దెయ్యము వారికంటే తెలివైంది. ఇశ్రాయేలు దేశము తిరిగి కట్టబడడం చూసింది. సంఘ వేషదారత చూసింది. నోవహు రోజులు తిరిగి రావడం చూసింది. "తక్కువ సమయముందని" తెలుసుకుంది భూమిపై దేవుని పనిని వ్యతిరేకించడానికి అడ్డుకోవడానికి!

"అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని, బహుక్రోధము గలవాడై, మీ యొద్దకు దిగి వచ్చియున్నాడు" (ప్రకటన 12:12).

దెయ్యానికున్న పేర్లలో ఒకటి "సాతాను." దాని అర్ధం "అనర్ధం" లేక "వ్యతిరేకించువాడు." అలా, సాతాను దేవుని పనిని వ్యతిరేకిస్తాడు. ఆఖరి రోజుల్లో, మనం జీవిస్తున్న ఈ రోజుల్లో, సాతాను రక్షింపబడిన వారిని నశించువారిని వ్యతిరేకిస్తుంది.

I. మొదటిది, సాతాను రక్షింపబడిన వారి ప్రార్ధనలు అడ్డుకుంటుంది.

సాతాను ముఖ్య పని క్రైస్తవులు ప్రార్ధించకుండా చేసి దేవుని పనిని అడ్డుకోవడం. డాక్టర్ లిన్ అన్నాడు, "సాతానుకు తెలుసు (క్రైస్తవులకు తెలియకపోయినా) దేవుని ఐశ్వర్యం పొందుకోడానికి ప్రార్ధన ఒక విధమని...క్రైస్తవులు ఐశ్వర్యం అందుకోకపోతే, ఆత్మీయంగా అలసిపోయి బలహీనులవుతారు...కనుక, ప్రభువు రెండవ రాకడ సమీపించే కొలదీ, ప్రార్ధనకు వ్యతిరేకంగా సాతాను ఒత్తిడి తెస్తుంది" (లిన్. ఐబిఐడి., పేజీ 96).

తరుచూ క్రైస్తవులు ఉదయం లేచేటప్పుడు ప్రార్ధించడం మరుస్తారు. ప్రభువు ప్రార్ధన చేసి ఆ రోజుకు దేవుని సహాయం కోసం ప్రార్ధించడానికి ఎక్కువ సమయం పట్టదు. దేవుని సహాయం లేకుండా మంచి చెయ్యలేము. సాతానుకు అది తెలుసు. కనుక నీ ఉదయకాల ప్రార్ధన వ్యతిరేకిస్తాడు. ఆ రోజు నీవు ఎంత శక్తిహీనుడవవుతావో చూసి ఆనందిస్తాడు!

"ప్రార్ధిస్తూ ఉండడం" సాతాను వ్యతిరేకిస్తాడు – అంటే, పొందుకునేంత వరకూ ప్రార్ధించడం. విధవరాలి ఉపమానం నేర్పిస్తుంది "ప్రార్ధిస్తూ ఉండడం" పొందుకునేంత వరకూ. లూకా 18:1 లో యేసు ఉపమానము ఉద్దేశం చెప్పాడు, "విసుగక, నిత్యము ప్రార్ధన చేయునట్లు" – లేక యిలా అనువదించవచ్చు, "...ప్రార్దిస్తూనే ఉంటారు వదిలిపెట్టరు." ఉపమానం భోధిస్తుంది నీకు కావలసిన దానిని పొందుకునేంతవరకూ దేవునికి ప్రార్దిస్తూనే ఉండాలి. ఉపమానం సామాన్యం. ఒక విధవరాలు న్యాయాదిపతిని న్యాయం తీర్చమంటుంది. న్యాయాధిపతి ఏమీ చెయ్యడు. చివరకు ఆమె అడిగింది ఇస్తాడు ఆమె తొందర పెట్టడం వలన ఆయన అలసి పోయాడు. ఉపమానము ముగింపు దేవుడు "తాను ఏర్పరచుకోనువారు, దినం రాత్రులు తనకు మొర్రపెట్టగా, వారికి న్యాయము తీర్చడా?" (లూకా 18:7). ఆ ఉపమానములో ఆఖరి వచనం చెప్తుంది,

"ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. అయినను మనుష్యకుమారుడు వచ్చునప్పుడు, ఆయన భూమి మీద విశ్వాసము కనుగోనునా?" (లూకా 18:8).

క్రీస్తు వచ్చునప్పుడు ఏమీ విశ్వాసము ఉండదని కాదు. దీని అర్ధము చాల మంది క్రైస్తవులు ప్రార్ధించుట వదిలిపెట్టేస్తారు. అడిగేది పొందుకోనే వరకు ప్రార్ధనల శ్రమపడరు! "ప్రార్ధిస్తూ ఉండడం" విశ్వాసంలో ఆఖరి దినాల్లో తక్కువై పోతుంది. సమయం ఆసన్నమవుతుంటే ప్రార్ధన చెయ్య నియ్యకుండా సాతాను ఒత్తిడి తెస్తుంది. నాడు తద్వారా సంఘాలను బలహీనపరిచి ఎన్నుకోనబడినవారు రక్షింపబడకుండా ఆపుతుంది. అలా, సాతాను భూమిపై తన దుష్ట జీవితం కొనసాగించి విసుకగా ప్రార్ధించే ప్రార్ధనలను వ్యతిరేకిస్తుంది!

సాతాను మన ప్రార్ధనలను, అడ్డగించి, ప్రార్ధించకుండా చేసి, "ప్రార్ధన అంత ప్రాముఖ్యం కాదని చెప్తుంది. కాపరి ప్రార్ధించు, ప్రార్ధించు, ప్రార్ధించు అని చెప్తాడు – కాని సమయం వ్యర్ధం చేసుకుంటున్నావు. నీ ప్రార్ధనలు ఏమీ చెయ్యలేవు. వదిలెయ్యి! ప్రార్ధించు సమయము వ్యర్ధపరచవద్దు." అలా నీకు అనిపించిందా? ప్రార్ధన ఏమీ చెయ్యవని నీవనుకున్నావా – సమయము వ్యర్ధమని? అలాంటి తలంపు వస్తే, ఖచ్చితంగా దెయ్యం నీ మనసులో ఆ తలంపుపెట్టింది. సాతాను అన్ని కుయుక్తులు పన్ని అవసరానికి ప్రార్ధించకుండా చేస్తుంది. సాతాను ఎక్కువ సమయము వెచ్చించి నిన్ను ప్రార్ధించకుండా మోసగిస్తుంది. వాడు కష్టపడి నీకు కావలసింది దేవుని నుండి పొందుకోకుండా ఆపేస్తాడు! ఇంకొక సందర్భంలో, అపోస్తలుడైన పౌలు ఇలా అన్నాడు –

"సాతాను మనలను మోస పరచకుండునట్లు: సాతాను కుతంత్రములను మనము ఎరుగని వారము కాదు" (II కొరిందీయులకు 2:11).

సాతాను తప్పకుండా "అదును తీసుకుంటుంది" నీ పై నీవు చాల జాగ్రత్తగా లేకపోతే నీ ప్రార్ధనావసరత పొండుకునేవరకూ ప్రార్ధించకుండా చేస్తుంది. అపోస్తలుడైన యూరా అన్నాడు,

"మీరడగనందున, మీకేమియు దొరకదు" (యాకోబు 4:2).

తరుచూ, "మీకు లేదు" ఎందుకంటే సాతాను కుయుక్తుల కారణంగా. నిరాశ నిస్పృహలకు గురి చేస్తుంది. ప్రార్ధన మానే వరకు శోదిస్తుంది, ప్రార్ధనలను బలహీన పరుస్తుంది. గుర్తుంచుకోండి, క్రైస్తవ – ప్రార్ధన సాతానుతో యుద్దములో గెలవడానికి ప్రాముఖ్యము. గుర్తుంచుకోండి – ప్రార్దనే యుద్ధము! పాత సువార్త పాట ఇలా అంటుంది,

జవాబు వచ్చే వరకు ప్రార్ధించావా?
   నీ అంతకు అడిగే నిజ వాగ్దానము ఉంది;
ప్రార్ధనా సమయంలో యేసు నీ కోసం ఎదురు చూస్తాడు.
   ప్రార్ధనా స్థలములో కలిశావా, అంతటా ప్రార్ధించావా,
జవాబు వచ్చే వరకు ప్రార్ధించావా?
   రక్షకుని నామములో మోర పెట్టావా!
ప్రార్ధనలో పోరాదావా [లోతుగా రాత్రిలో],
   జవాబు వచ్చే వరకు ప్రార్ధించావా?
("ప్రార్ధన చేసావా?" డబ్ల్యూ. సి. పూలే, 1875-1949; పాష్టరుచే సవరించబడింది)
(“Have You Prayed It Through?” by W. C. Poole, 1875-1949;
      altered by the Pastor).

మన సంఘాల్లో ఆ పాట విన్నారా? నేను వినలేదు! క్రైస్తవులు ఒకప్పుడు పాడేవారు, ఇప్పుడు పాత బడిపోయింది. "అయినను మనష్య కుమారుడు వచ్చునప్పుడు, ఆయన భూమి మీద విశ్వాసము కనుగోనునా?" (లూకా 18:8).

ఇది చూడండి! దానియేలు పదవ అధ్యాయములో మనం చదువుతాం దేవుడు దానియేలు ప్రార్ధనను మొదటి సారే విన్నాడు (దానియేలు 10:12). కాని "ఇరవై రోజులు" జవాబు రాలేదు ఎందుకంటే సాతాను యొక్క దయ్యము ప్రార్ధనను వ్యతిరేకించింది (దానియేలు 10:13). మనం వందనస్తులం దానియేలు అడిగినది పొందుకునే వరకు సాతానుకు ఆపే అవకాశము ఇవ్వలేదు! ప్రార్ధనపై గొప్ప పుస్తకములో డాక్టర్ జాన్ ఆర్. రైస్ పాట ఇచ్చాడు,

ప్రార్ధిస్తూ ఉండు,
   పొందుకునే వరకు,
ప్రార్ధిస్తూ ఉండు,
   పొందుకునే వరకు.
దేవుని గొప్ప వాగ్దానాలు
   ఎప్పుడు సత్యమే,
ప్రార్ధిస్తూ ఉండు
   పొందుకునే వరకు.

II. రెండవది, నశించు వారి రక్షణను సాతాను వ్యతిరేఖిస్తుంది.

"అపవాది తనకు సమయము కొంచమేనని తెలుసుకొని, బహు క్రోధము గలవాడై, మీ యొద్దకు దిగి వచ్చి యున్నాడు" (ప్రకటన 12:12).

రక్షింపబడాలనుకుంటే సాతాను వ్యతిరేఖిస్తుంది. నీవు క్రైస్తవుడవడం తనకు యిష్టము లేదు. నీవు రక్షించబడకుండా ఉండడానికి తన శక్తిని మొత్తం ఉపయోగిస్తుంది. ఎందుకలా చెయ్యాలి! ఒక కారణము తన హంతకుడు కాబట్టి. యేసు చెప్పాడు సాతాను "మొదటి నుండి హంతకుడు" అని (యోహాను 8:44). చంపడం వాని స్వభావం. ఏదేను వనములో మన ఆది తల్లి దండ్రులను వాడు చంపేసాడు, నిషేదింపబడిన ఫలము తినేలా శోదించడం ద్వారా. వాడు ఆత్మల హంతకుడు - నిన్ను కూడా హత్య చేయాలనుకుంటున్నాడు. నీవు చనిపోయి నరకానికి వెళ్ళాలను కుంటున్నాడు.

ఇంకొక కారణము ఉంది. రోమా 11:25 లో ఇలా ఉంది,

"...అన్య జనుల ప్రదేశము సంపూర్ణ మగు వరకు, ఇశ్రాయేలు నాకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను" (రోమా 11:25).

"సంపూర్ణతకు" గ్రీకు పదము "ప్లెరోమా." అంటే "సంపూర్ణ సంఖ్య." సాతాను ఇశ్రాయేలీలను అసహ్యించుకుంటుంది, దానికి తెలుసు వారి ఆత్మీయ గుడ్డి తనము పోదు "పరిపూర్ణ సంఖ్యలో" అన్యులు రక్షింపబడేవరకు. ఇశ్రాయేలీయుల రక్షణ సాతానుకు ఇష్టములేదు. ఆ కారణాన నీ రక్షణ కూడా వానికి యిష్టం లేదు.

అన్యులలో భాధ మంది రక్షింపబడాలి ఇశ్రాయేలీయుల గ్రుడ్డి తనము తొలగింప బడకముందు. నీవు అన్యుడవు. యుగాంతములో ఉన్నారు. సాతానుకు తెలుసు వాడు దేవునిచే తీర్పు దీర్చబడతాడని "వేయి సంవత్సరాలు" బందీగా ఉంటాడని క్రీస్తు వచ్చునప్పుడు (ప్రకటన 10:2). అందుకే,

"అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని, బహుక్రోధము గలవాడై, మీ యొద్దకు దిగి వచ్చియున్నాడు" (ప్రకటన 12:12).

సాతాను ఉగ్రరూపము దాలుస్తుంది తన సమయము తక్కువని. ఎప్పుడూ లేనంతగా, అన్ని విధాలా ప్రయత్నిస్తుంది అన్యులలో "సంపూర్ణ సంఖ్య" రక్షింపబడకుండా. నేను నమ్ముతాను ఇందుకే ప్రజలు రక్షింపబడడం కష్టతరమైంది. సాతాను తన శక్తి అంతటితో నీవు యేసుని నమ్మి నిజక్రైస్తవుడవు కాకుండా చేస్తుంది. అలా ఇశ్రాయేలీయులను అందత్వములో ఉంచుతుంది.

నీవు రక్షింపబడకుండా సాతాను నీ హృదయములో నుండి దేవుని వాక్యమును ఎత్తికోనిపోతుంది. విత్తుదాని ఉపమానములో, యేసు అన్నాడు,

"...త్రోవ ప్రక్క నుండు వారు, వారురినువారు గాని నమ్మి రక్షణ పొంధకుండునట్లు అపవాది వచ్చి, వాని హృదయములో నుండి వాక్యమెత్తికొని పోవును" (లూకా 8:12).

గత వారము ఇద్దరు యవన చైనీయులు మన గుడికి వచ్చారు. వారిద్దరిపై దెయ్యము ఆధిపత్యము కలిగియుంది. వారిలో ఒకడు సాతాను ఆధీనములోనికి బుద్ధ విగ్రహాల పూజ ద్వారా వచ్చాడు. రెండవ వాడు ఎలా దెయ్యము పట్టిన వాడయాడో తెలియదు. నాతో తను అన్నాడు సాతాను తనను వేధించడం తేటగా చూపాడని.

వారిలో ఒకడు గత ఆదివారము రక్షింపబడ్డాడు, వేరే వాడు కాడు. ఇది వ్యత్యాసము – రక్షింపబడిన యవనస్తుడా గుడికి వస్తూ నేను భోధించే దేవుని వాక్యము వింటున్నాడు. గుడిని వదలాలని చాల శోధింపబడ్డాడు. దేవుని కృప చేత ఉన్నాడు, దేవుని సువార్త వినడానికి ప్రతి ఆదివారము ఉదయం సాయంత్రము వస్తున్నాడు. చివరకు, డాక్టర్ చాన్ గత ఆదివారం భోదిస్తున్నప్పుడు, మొదటి అబ్బాయి యేసును నమ్మి రక్షింపబడ్డాడు!

కాని రెండవ చైనీ యువకుడు వినలేదు. నేనే స్వయంగా గత ఆదివారం ఉదయం తనతో మాట్లాడాను. నేను తనకు మొరపెట్టాను గుడిలో ఉండి దేవుని వాక్య భోదను వినమని. కాని మొండిగా తిరస్కరించాడు. కోపంగా బైబిలు తనకు తానే చదువుకోగలను అన్నాడు. చాల మొండికేసాడు చివరకు మేము యింటి దగ్గర వదిలిపెట్టాము. తను వెళ్ళిపోయినందుకు నేను చింతించాను.

ఇది నీకు కూడా వర్తిస్తుంది, నీవు రక్షణ పొందకపోతే. నిన్ను నీవు తగ్గించుకో. ఏమి చెయ్యాలో, ఏమి ఆలోచించాలో, ఏ అనుభూతి పొందాలో నీకు తెలుసు అనుకుంటే – నీ హృదయములో నుండి వాక్యము ఎత్తుకొని పోవడం సాతానికి సులువు! బైబిలు చెప్తుంది,

"ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించు కోనుడు,అప్పుడాయన మిమ్మును హెచ్చించును" (యాకోబు 4:10)

మీలో కొందఱు రక్షణలేని స్థితిలోనే కొనసాగుతారు. ఏమి చెయ్యాలో తెలుసు అని గర్వపడుతూ ఉంటారు. నీవు తెలివైనవాడవు కావు! ఏమి చెయ్యాలో నీకు తెలియదు. అందుకే నీవు యింకా సాతాను ఆధీనములో ఉన్నావు. ఈ ప్రాత: కాల సమయములో నేను మిమ్ములను బతిమాలుచున్నాను,

"ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించు కోనుడు,అప్పుడాయన మిమ్మును హెచ్చించును" (యూదా 4:10).

పాత పాట ఇలా ఉంటుంది,

"నన్ను పరిత్యజించుకుంటూ, నాకు తెలిసిందంతా,
   నన్ను కడుగు హిమము కంటే తెల్లగా."
("హిమము కంటే తెల్లగా" జేమ్స్ ని కొల్సన్ చే, 1828-1896).
    (“Whiter Than Snow” by James Nicholson, 1828-1896).

యేసు నీ పాపాల కొరకు సిలువపై మరణించాడు. నీకు జీవాన్ని ఇవ్వడానికి మృతులలో నుండి లేచాడు. ఇప్పుడు – ప్రభువు దృష్టిలో తగ్గించుకో, ఆయన నిన్ను హెచ్చిస్తాడు! ఇప్పుడు – పరిత్యజించుకో, నీకు తెలిసిందంతా – యేసు నీ పాపాలన్నీ తన రక్తము ద్వారా కడిగేస్తాడు ఆయనలో విశ్వాసము ఉంచుట ద్వారా!

నిజ క్రైస్తవుడవడానికి మాతో మాట్లాడాలనుకుంటే, నీ స్థలము విడిచి ఆవరణము వెనుకకు రండి. డాక్టర్ కాగన్ వేరే గదికి తీసుకెళ్ళి మాట్లాడి ప్రార్దిస్తారు. ఇప్పుడే వెళ్ళండి. డాక్టర్ చాన్, యేసును నమ్మునట్లు ప్రార్ధించండి. ఆమెన్.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసగాలు ప్రతీవారము”
అంతర్జాలములో www.realconversion.com ద్వారా చదువవచ్చు.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రదోమేచే: ప్రకటన 12:7-12.
ప్రసంగమునకు ముందు పాట బెంజమన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్ గారిచే:
"యేసు వచ్చాడు" (హొమర్ రోడ్ హీవర్, 1880-1955).
“Then Jesus Came” (by Homer Rodeheaver, 1880-1955).


ద అవుట్ లైన్ ఆఫ్

ఆఖరి దినాల్లో సాతాను ఉగ్రత

THE WRATH OF SATAN IN THE LAST DAYS

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని, బహుక్రోధము గలవాడై, మీ యొద్దకు దిగి వచ్చియున్నాడు" (ప్రకటన 12:12).

I.   మొదటిది, సాతాను రక్షింపబడిన వారి ప్రార్ధనలు అడ్డుకుంటుంది, లూకా 18:1, 7, 8; II కోరిందీయులకు 2:11; యాకోబు 4:2; దానియేలు 10:12, 13.

II.  రెండవది, నశించు వారి రక్షణను సాతాను వ్యతిరేఖిస్తుంది, యోహాను 8:44; రోమా 11:25; ప్రకటన 20:2; లూకా 8:12; యాకోబు 4:10.