Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
రక్తము - సామాన్యమా లేక ఫ్రశస్తమా?

THE BLOOD – COMMON OR PRECIOUS?
(Telugu)

డాక్టర్ ఆర్.ఎల్.హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

బాప్టిష్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలెస్ నందు బోధింపబడిన ప్రసంగము
ప్రభువు దినము ఉదయము, నవంబరు 17, 2013
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, November 17, 2013


ఈ ఉదయము క్రీస్తు రక్తమును వివరించిన కొత్త నిబంధనలోని రెండు మాటలు మీరు చూడాలని కోరుతున్నాను. హేబ్రీయులకు 10:29 చూడండి. రక్తమును గూర్చిన వివరణ వచనము మధ్యలో ఉంది,

"అపవిత్రమైనది" (హేబ్రీయులకు 10:29).

I పేతురు 1:19 చూడండి. ఇక్కడ రక్తము ఈ విధంగా వివరించబడింది,

"క్రీస్తు ప్రశస్త రక్తము" (I పేతురు 1:19).

దయచేసి మీ బైబిల్లను తెరిచి ఉంచండి.

కొన్ని రాత్రుల క్రిందట ఆ విషయాల గూర్చి నేను ఆలోచిస్తున్నాను. నా ధ్యానములో నాకు తెలిసింది ప్రపంచాన్నంతటిని రెండు గుంపులుగా విభజింపవచ్చు: (1) క్రీస్తు రక్తమును "అపవిత్రమైనది" గా తలంచె వారు, (2) "క్రీస్తు ప్రశస్త రక్తమును" గూర్చి తలంచె వారు. యేసు రక్తమును గూర్చి మీ అభిప్రాయము ఏమిటి?

I. మొదటిది, నీవు యేసు రక్తము "అపవిత్రమైనది" అని తలంచు చున్నవా"?

మీరు హేబ్రీయులకు 10:26-31 లోని పూర్తీ భాగాన్ని చదివితే కొన్ని క్షణాల క్రిందట ప్రొధొమ్ చదివారు, మీరు గమనిస్తారు అది "బుద్ధి పూర్వకంగా పాపం చేసే వారుని" గూర్చి ప్రస్తావిస్తుంది వారు దేవుని తీర్పు పొందుతారు, ఈ ఉదయం మన పాఠ్య భాగం చూస్తున్నప్పుడు, అది రెండు వచనాల తరువాత వస్తుంది, "అపవిత్రమైనది." అనే పదము హేబ్రీయులకు 10:31 చూడండి.

"జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము" (హేబ్రీయులకు 10:31).

మీరు కూర్చోండి.

ఈ వచనాన్ని గూర్చి డాక్టర్ జె. వెర్నోన్ ఇలా అన్నాడు,

...దేవుని తీర్పు [ప్రతి] ఒక్కరికి ఉంది "ఎవరైతే...నిబంధన రక్తాన్ని...అపవిత్రమైనదిగా ఎంచుతారొ..." నా స్నేహితుడా, సిలువపై క్రీస్తు చేసినది నీవు తృనీకరిస్తే, నీ ముందుండేది తీర్పు తప్ప ఏమీ కాదు. నీ కెలాంటి నిరీక్షణ ఉండదు (J. Vernon McGee, Th.D., Thru the Bible, Thomas Nelson Publishers, 1983, Volume V, p. 578; note on Hebrews 10:31).

మీరు అనవచ్చు, "యేసు రక్తము అపవిత్రమైనదని నేను అనుకోవడం లేదు. నేను అందరి రక్తం లాంటిదే అనుకుంటున్నాను. యేసు రక్తమును గూర్చి ఏమీ ప్రత్యేకత లేదు." మంచిది, నీవనుకుంటే నీవు తప్పు చేసావని – ఎందుకంటే గ్రీకు పదము "అపవిత్రమైనది" అనే దానిని "కోయినోస్" దాని అర్ధము, "సామాన్యము" (బలమైనది, నంబరు 2839). జార్జి రిక్కర్ బెర్రీ అన్నారు దాని అర్ధము "సామాన్యము, అది., అనేకులచే పంచబడింది." "అపవిత్రము" అంటే అదే అర్ధము. దాని అర్ధము యేసు రక్తము సామాన్యము – ప్రతి ఒక్కరి రక్తము లాంటిదే, "అనేకులచే పంచబడింది," ఇలా చెప్పారు జార్జి రిక్కర్ బెర్రీ.

నాకనిపిస్తుంది డాక్టర్ జాన్ మెక్ ఆర్డర్ క్రీస్తు రక్తము "సామాన్యమైనది" అని అభిప్రాయపడ్డారు ఆయన అన్నారు, "ఆయన రక్తానికి రక్షించే విలువ లేదు" (MacArthur Study Bible, note on Hebrews 9:7). ఆయన గమనిక "క్రీస్తు రక్తము" పై హేబ్రీయులకు 9:14 లో, డాక్టర్ మెక్ ఆర్డర్ అన్నారు, "రక్తము మరణానికి ప్రత్యామ్నాయ పదముగా వాడబడింది" (ఐబిఐడి., గమనిక హేబ్రీయులకు 9:14). ఆయన వేదాంత పరిశేలనలో (ఐబిఐడి., పేజి 2192) డాక్టర్ మెక్ ఆర్డర్ అన్నారు బైబిలు "ప్రతి మాట ప్రేరేపితమైంది." కాని గ్రీకు పదము హేబ్రీయులకు 9:14లొ "హైమా," అంటే "రక్తము" అని అర్ధము. "రక్తము" మరణానికి ప్రత్యామ్నాయ పదము అంటే "ప్రతీ పదము ప్రేరేపించబడింది" అనే విషయాన్ని వ్యతిరేకించడమే. డాక్టర్ మెక్ ఆర్డర్, "ఆయన రక్తానికి రక్షించే విలువ లేదు" అని అన్నారు, నాకనిపిస్తుంది క్రీస్తు రక్తము "సామాన్య విషయం" అని (హేబ్రీయులకు 10:29). హేబ్రీయులకు 10:29 దానికి వ్యతిరేకంగా గట్టి హెచ్చరిక ఇస్తుంది! అలాంటి బోధలో జీవము లేదు. నేననుకుంటాను అది మృతమైనదని. డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్ జోన్స్ అన్నారు,

     ప్రతి ఉజ్జీవ సమయములో, మినహాయింపు లేకుండా, క్రీస్తు రక్తము అద్భుతంగా నొక్కి వక్కనింప బడింది. ఉజ్జేవ సమయాల్లో పాడ బడే పాటలు, రక్తాన్ని గూర్చిన పాటలే. చాలా భాషలలో నేను వాటిని చెప్పగలను. దీనిని మించిన లక్షణము ఇంకొకటి లేదు. దానిని అపోస్తలులు మన కొరకు 1 వ కొలస్సీయులలో పెట్టడం చూస్తాం – "సమాధానము కలిగియుండుట…" – ఎలా సమాధానము పొందుకున్నాము? "...సిలువ రక్తము ద్వారా" (వచనము 20).
     ఇలాంటిది చెప్పుతున్నప్పుడు నాకు పరిపూర్ణముగా తెలుసు అసామాన్యమైనది అప్రసిద్ధమైనది చెప్పుతున్నానని. క్రైస్తవ బోధకులున్నారు వాళ్ళు తెలివైన వాళ్ళను కుంటారు రక్తమును గూర్చిన వేదాంతాన్ని వ్యంగ్యంగా చెప్పడంలో. తిరస్కారంతో కొట్టి పడేసారు...అందుకే సంఘము ఇలా ఉంది. కాని ఉజ్జేవ సమయాల్లో, అది సిలువలో మహిమ పరచబడుతుంది, రక్తములొ అతిశయిస్తుంది. ఎందుకంటే హేబ్రీయుల గ్రంధ కర్త చెప్తునట్లు, ఒకే మార్గముంది ధైర్యముతో అతి పరిశుద్ద స్థలములో ప్రవేశించ డానికి, అది యేసు రక్తము ద్వారా, హేబ్రీయులకు 10:19 చూడండి (Martyn Lloyd-Jones, M.D., Revival, Crossway Books, 1994 edition, page 48).

నేను మీకు సత్యము చెప్పాలి. యేసు రక్తము మీకు ప్రాముఖ్యము అనిపించక పొతే, నీవు తప్పిపోయిన వ్యక్తివే, నిత్య శ్రమాలలో ప్రవేశిస్తావు. ఏవిధంగా నీవు నిజ క్రైస్తవుడవు కాదు.

ఇరవై సంవత్సరాల యవనస్తురాల సాక్షము ఇది ఆమె మన సంఘానికి హాజరవుతారు. ఆమె చెప్పింది,

నేను (గతంలో) నిరాశ నిస్పృహలో ఉన్నాను. నేను పాపినని మానసికంగా నాకు తెలుసు, కాని నేను నా పాప విషయము స్వజాలిలో కట్టుబడి పోయాను. క్రమేనా నాగత పాపాల విషయములో పరిశుద్ధాత్మ నన్ను ఇప్పించింది. అది నన్ను తరిమాయి తప్పించుకోలేక పోయాను. నేను ఆశ్చర్య పడడం మొదలు పెట్టాను, "నేను ఆ పాపాలు ఎలా చేయగలిగాను? పాపములో అలా ఎలా ముగిని పోయాను?" పరిశుద్ధాత్మ నాకు బయలు పరిచింది ఈ పాపాలు నా దుష్టత్వము నుండి, భయంకర హృదయాల నుండి, నా చెడు స్వభావము నుండి వచ్చాయని. నేను పూర్తిగా వివరించలేను నీ అంధత్వము గూర్చి హృదయ కాథిన్యము గూర్చి. దేవుడు చూసాడని తెలుసుకొని పరితపించాను అవమాన పడ్డాను. అన్ని చూచే దేవుని ముందు చిన్న సృష్టిగా భావించుకున్నాను; దేవునికి నా తలంపులు ఉద్దేశాలు తెలుసు; నేను చేసినవన్నీ దేవునికి తెలుసు, సంఘములో పని కూడా, స్వార్ధ పూరిత పాపముతో నిండుకొంది. నేను ఎప్పుడు గుడికి వెళ్ళినా శుద్ధ క్రైస్తవుల మధ్య కుష్టు రోగిగా భావించే దాన్ని. అయినాను క్రీస్తును విశ్వసించ లేదు. "యేసు" ఒక పదము మాత్రమే, ఒక సిద్ధాంతము, ఉనికిలో ఉన్న వ్యక్తీ కాని దూరస్తుడు. క్రీస్తు పట్ల దాచబడిన అయిష్టత ఉండేది. [నాకు క్రీస్తు వద్దు] క్రీస్తును [కనుగొనడానికి బదులు], రక్షణ అనుభూతి కొరకు చూసాడు, ఒక రకమైన "అనుభవము" కొరకు నా విశ్వాసానికి [రుజువు]గా.

ఆ యవన స్త్రీ భయంకరము. అంతా అందంగా దాచింది. చాలా మందికి ఆమె అంతరంగములో ఎంత పోరాటము ఉందొ తెలియదు. అంతరంగములో ఆమెకు ఆవేదన ఉంది, జాన్ బన్యన్ వలే.

గత యాబై సంవత్సరాలుగా పాఠశాల కాలేజి యవసస్తులను కౌన్సెల్ చేస్తున్నాను. నేను కనుగొన్నాను చాలా మంది – చాలా మంది – ఆందోళన భయాలు తికమక కలిగియున్నారు – ఆ యవన స్త్రీ వలే. చాలా మంది మత్తు పదార్ధాలకు మద్యానికి లోనయ్యారు భాద తగ్గించుకోవడానికి. ఇతరులు అంతులేని వీడియో ఆటలు ఆడారు వారి తలలు కాలి చేసుకోవడానికి. కొంత మంది అశ్లీల చిత్రాలకు భానిసలయ్యారు. వాళ్ళ తలలు లైంగిక తలంపులతో నిండి ఉంటె, ఎంత భయంకర స్థితిలో ఉన్నారో ఆలోచింపలేరు. ఇటీవల చదివాను ఆత్మహత్యలు కాలేజి విద్యార్ధులలో రెండు నుండి మొదటి స్థానానికి వచ్చాయి. వాళ్ళు లోతుగా తోట్రిల్లరు, అసంతోషులయ్యారు, వాళ్ళను వాళ్ళు చంపుకుంటున్నారు. ఒక యవసస్తుడు ఆత్మహత్య గమనిక యిలా వ్రాసాడు, "నా మనసు తిప్పుకోవడానికి మర్చిపోడానికి నాకు వేరే మార్గము లేదు."

నేను కనుగొన్నాను 15 నుండి 25 సంవత్సరాల వారికీ అతి కష్ట సంవత్సరాలు ఈ రోజు ప్రపంచంలో. స్నేహితులు తొలగి పోతారు. ఆడ మగ స్నేహితులు ఒంటరిగా వదిలేస్తారు. పాఠశాల పని కష్టంగా ఉంటుంది, ఏకాగ్రత కష్టము. వేరే మార్గమేమీ కనిపించదు!

నీ పాపాల విడుదలకు దేవుడు ఒకదారి ఏర్పాటు చేసాడు – నీకు అది తలకెక్కదు. దేవుడు తన అద్వితీయ కుమారుని పంపాడు సిలువపై మరణించడానికి రక్తము కార్చి నీ పాపాలు కడగడానికి. అది నీకు పనిచెయ్యదు. మీలో కొందరు అనుకుంటారు, "2000 సంవత్సరాల క్రితం వ్యక్తీ రక్తం ఈ రోజు నా పాపాన్ని ఎలా తీసేస్తుంది అని?" కనుక భాదలోనే ఉంది, ఇప్పుడు చదివిన యవన స్త్రీ లా భాద అనుభవిస్తారు.

మన సంఘములో ఒక యవన స్త్రీ నాలుగు కాలేజి కోర్సులు బోధిస్తుంది. ఆమె తన తండ్రితో చెప్పింది తన తరగతి యవనస్తులకు ఒకటి తప్పని తెలిసింది. ఆమె అనింది వారికి తెలుసు రాజకీయ నాయకులు విషయాలు నిర్ణయించ లేరని. వారికీ తెలుసు ప్రపంచమంతా గందర గోలమయ మయిందని – నిజానికి ఎలాంటి నిరీక్షణ లేదు. కాని వారికీ ఏమి తెలుసు? వారు వీడియో ఆటలలో వాళ్ళ తలలు పెడతారు, లేక వారి బుర్రలను మత్తు పదార్ధాలతో పని చేయకుండా చేసుకుంటారు. కొంత మంది శ్రమించే వారవుతారు, వారి సమస్యలు మర్చిపోడానికి నిరవధిక గంటలు పనిచేస్తారు. వారిలో చాలా మంది ఆత్మహత్య చేసుకుంటారు. ఎంత భయంకర వృధా! అది పాపమని వారిని నశింప చేస్తుందని చూస్తే తప్ప! వారు నమ్మగలిగితే "తన కుమారుడైన యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపమూ నుండి మనలను పవిత్రులనుగా చేయును" (I యోహాను 1:7). కాని ఈ పాప ప్రపంచములో అనేకుల వలే, వాల్లనుకుంటారు యేసు రక్తము సమాన్యమైనదని – ఆలోచింపడానికి కూడా ప్రాముఖ్యత లేనిదని. అది మనలను రెండవ అంశానికి నడిపిస్తుంది.

II. రెండవది, నీవనుకుంటూన్నావా యేసు రక్తము "ప్రశస్తమైనదని"?

అపోస్తలుడైన పేతురు అలా అనుకున్నారు. తానూ అన్నాడు, "క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు...గాని అమూల్యమైన క్రీస్తు రక్తము చేతనే" (I పేతురు 1:18, 19). పాపికి అది ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. స్నేహితులను పోగొట్టుకునే వారికి అది ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. ఒంటరిగా తొందర పెట్టు మనస్సాక్షితో వారికి ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. దేవునిలో విశ్వాసము కోల్పోయిన వారికీ ఎలా ఉంటుందో తనకు తెలుసు. ప్రాణ స్నేహితుని అప్పగించే వానికి, అంధకారములో ఒంటరి వానికి, తనకు తానూ నిలువ లేని వారికి ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. పాపి అనుభూతిని పొందే వారినికి ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు!

అందుకే నీవు విమోచింపబడగలవు, పాప క్షోభ నుండి రక్షింప బడగలవు – "ప్రశస్తమైన క్రీస్తు రక్తము ద్వారా" (I పేతురు 1:19). "ప్రశస్తము" అంటే గొప్ప విలువైన! "ప్రశస్తము" అంటే వెండి బంగారు కంటే విలువైనది! ఒక పాట ఉంది ఇలా,

ఎకరాల ముత్యాలు, బంగారు పర్వతాలు,
   వెండి నదులు, చెప్పలేనన్ని వజ్రాలు;
ఇవన్నీ నన్ను గాని నిన్ను గాని కొనలేవు
   నిద్రా సమయంలో ఉన్న శాంతి నిర్మల మనస్సాక్షి.
సంతుష్టి హృదయము, సంతృప్తి మనసు,
   ఈ నిధులు ధనము కొనలేదు.
నీతో యేసు ఉంటె, నీ ఆత్మలో ఎక్కువ ఆస్తి ఉంటుంది
   ఎకరాల ముత్యాలు బంగారు పర్వతాల కంటే.
("ఎకరాల ముత్యాలు" ఆర్ధర్ స్మిత్ చే, 1959).
(“Acres of Diamonds” by Arthur Smith, 1959).

లేక, కొంత సేపటి క్రితం గ్రిఫిత్ పాడినట్టు,

రండి పాపులారా, నశించి నిరీక్షణ లేనివారలారా,
   యేసు రక్తము మిమ్ములను స్వతంత్రులను గా చేస్తుంది;
ఆయన మీలో అతి అసహ్యులను రక్షించాడు,
   నాలాంటి దౌర్భాగ్యుణ్ణి ఆయన రక్షించినప్పుడు.

నాకు తెలుసు, అవును, నాకు తెలుసు,
   యేసు రక్తము భయంకర పాపిని శుద్ధి చేస్తుంది.
నాకు తెలుసు, అవును, నాకు తెలుసు,
   యేసు రక్తము భయంకర పాపిని శుద్ధి చేస్తుంది.

నాకు తెలుసు, అవును, నాకు తెలుసు,
   యేసు రక్తము భయంకర పాపిని శుద్ధి చేస్తుంది.
నాకు తెలుసు, అవును, నాకు తెలుసు,
   యేసు రక్తము భయంకర పాపిని శుద్ధి చేస్తుంది.
("అవును, నాకు తెలుసు!" అన్నా డబ్ల్యూ. వాటర్ మెన్ చే, 1920).

యవనస్తురాలు ముందు నేను చెప్పిన స్త్రీ ఇలా చెప్పింది,

     నా పాపమూ లోతు తెలియని సముద్రము వలే సాగింది. నేను దానిని భరించ లేక పోయాను. నాకు క్రీస్తు కావలసి వచ్చింది! ఆయన రక్తము నాకు కావలసి వచ్చింది! మొకాల్లని,....యేసును, ఆయననే విస్వశించాను. [నేను] నా అనుభూతి నుండి, మనో వ్యాధి నుండి, విడుదలై, నిశ్చయత ఆశించాను...నేను వాటిని రక్షకునిలొ ద్వంసం చేసాను...ఆయన ప్రశస్త రక్తములొ నా పాపాలు కదిగాడు; నా పాప భారాన్ని తీసేసాడు!...ముద్రింపబడింది "నిర్మల మనస్సాక్షి" ఆయన స్వరక్తముతో!...నేను పూర్తిగా విశదీకరించ లేను ఆ తృప్తిని శాంతిని పాప క్షమాపణ ద్వారా మరియు తొలగింప బడిన దేవుని ఉగ్రత. నాలా భాద పడిన వారందరూ, యేసు నుండి క్షమా అనుభవము పొందాలని, నా ఆశ! ఆయన నా పాపపు నింద అంగీకరించాడు. ధర పూర్తిగా చెల్లించాడు! సువార్త, "మంచి వార్తా," మునుపు నిర్జీవంగా ఉండేది, ఉత్సాహ భరితమై నా హృదయము ఆనందముతో కృతజ్ఞతతో నిండుకుంది యేసు వర్తమానాలు వినేటప్పుడు.

ఇంకేమి చెప్పాలి? నీవు యేసు నోద్దకు వస్తే, ఆయన రక్తము "సామాన్యము" అని తలంచవు. ఓ, కాదు! అప్పుడు నీవు సంతోషంగా ఉత్సాహంగా పలుకుతావు "క్రీస్తు ప్రశస్త రక్తము" అని (I పేతురు 1:19).

యేసు రక్తము ద్వారా కడగబడడం గూర్చి మాతో మాట్లాడాలనుకుంటే, మీరు సీటు వదిలి ఆవరణ వెనుకకు ఇప్పుడే వెళ్ళండి. డాక్టర్ కాగన్ వేరే గదికి తీసుకెళ్ళి మాట్లాడి ప్రార్ధిస్తారు. ఇప్పుడే ఆవరణ వెనుకకు వెళ్ళండి. డాక్టర్ చాన్, ఈ ఉదయము కొందరు యేసును నమ్మునట్లు ప్రార్ధించండి. ఆమెన్.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసగాలు ప్రతీవారము”
అంతర్జాలములో www.realconversion.com ద్వారా చదువవచ్చు.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రదోమేచే: హేబ్రీయులకు 10:26-31.
ప్రసంగమునకు ముందు పాట బెంజమన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్ గారిచే:
"అవును, నాకు తెలుసు!" అన్నా డబ్ల్యూ. వాటర్ మెన్ చే, 1920).
“Yes, I Know!” (by Anna W. Waterman, 1920).


సంక్షిప్తంగా 

రక్తము - సామాన్యమా లేక ఫ్రశస్తమా?

THE BLOOD – COMMON OR PRECIOUS?

డాక్టర్ ఆర్.ఎల్.హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"అపవిత్రమైనది" (హేబ్రీయులకు: 10:29).

"క్రీస్తు ప్రశస్త రక్తము" (I పేతురు 1:19).

I.   మొదటిది, నీవు యేసు రక్తము "అపవిత్రమైనది" అని తలంచు చున్నవా"? హేబ్రీయులకు 10:31; I యోహాను 1:7.

II.  రెండవది, నీవనుకుంటూన్నావా యేసు రక్తము "ప్రశస్తమైనదని"? I పేతురు 1:18, 19.