Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
కావాలి వాడు, రాత్రిని గూర్చిన విషయమేంటి?

WATCHMAN, WHAT OF THE NIGHT?
(Telugu)

డాక్టర్ ఆర్.ఎల్.హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

బాప్టిష్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలెస్ నందు బోధింపబడిన ప్రసంగము
ప్రభువు దినము ఉదయము, నవంబరు 10, 2013
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, November 10, 2013

"దూమాను గూర్చిన దోవోక్తి. యొకడు, శేయీరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు కావలివాడా, రాత్రి యెంత వేలైనది? కావలివడా, రాత్రి ఎంత వేలైనది అని? కావలివాడు, ఉదయము నగును, రాత్రి అగును: మీరు విచారింపగోరిన యెడల, విచారించుడి: మరల రండి, అనుచున్నాడు" (యెషయా 21:11, 12).


పదము "దూమాను" ఏదోము రూపము. ఏదోము ప్రజలు భయము తోను శ్రమలతోను నిండి యున్నారు. వారు ప్రవక్త యెషయాకు మోర పెట్టుచున్నారు, "కావలివడా, రాత్రి ఎంత వేలైనది? కావలివడా, రాత్రి ఎంత వేలైనది?" డబ్య్లూ.ఇ. వైన్ అన్నాడు "కావలివాడా దేవుని సముఖములో ఉండేవాడు, ఏమి జరుగునో ఆయనకు తెలుసు సంభవము కొరకు కనిపెడతాడు...అయన కనిపెట్టే శిబిరంలో దేవుని సహవాసంలో ఉంటాడు" (యెషయా: ప్రవచనాలు, వాగ్దానాలు, హెచ్చరికలు, పేజి 14).

మన సమస్యలలో ఒకటి ఈ రోజుల్లో కొద్ది మంది "కావలివారు" ఉన్నారు. కొన్ని రాత్రుల క్రిందట ఒక ప్రసిద్ధి గాంచిన "ప్రవచన నిపుణుడు," హాల్ లిండ్ సేను, టెలివిజన్ లో చూసాను. ఆ కార్యక్రమములో ఒక అతిధి అన్నాడు మనం రోమా బదులు ప్రకటన గ్రంధం చదవాలి ఈ నాటి సమస్యలు అర్ధం చేసుకోవడానికి. హాల్ లిండ్ సేన్ అతనితో ఏకీభవించాడు. నాకైతే అది మన సంఘాల్లో, సంస్కృతిలో అసత్య విషయంగా అనిపిస్తుంది. దానికి వ్యతిరేకము సత్యము. ప్రకటన గ్రంధము చాలా ప్రాముఖ్యత పుస్తకము, రోమా బైబిలులో ఈ ఘడియలు ప్రధాన పుస్తకము చెప్పజాలని! వేలు, లక్షల, రక్షింపబడని ప్రజలు మన సంఘాలలో ఉన్నారు – మనం రోమాపై దృష్టి పెట్టాలి, లేకపోతె నిజ రక్షణను వారు కనుగొనడంలో నివిషయం మనం అర్ధం చేసుకోలేము! చాలా మంది "ప్రవచన నిపుణులు" వారు అనర్హులయ్యారు "కావలివాడుగా" ఉండడానికి – అనర్హులు ఎందుకంటే వారికి నాశనం చేసే సాతాను సిద్ధాంతాలు "నిర్నయత్వత" మన సంఘాలలో వారికి తెలియదు.

కాని ఏదోము నాయకులు ఈ నాటి చాలా మంది క్రైస్తవుల కంటే తెలివైన వారు. వారు పాపపు బరువుచే "భారమయ్యారు". తీర్పు పడబోతుందని వారికనిపించింది. కనుక నిజ ప్రవక్త, కావలివాడు. యెషయాకు వారు ఇలా మోర పెట్టుచున్నారు,

"కావలివాడా, రాత్రి ఎంత వేలైనది? కావలివాడా, రాత్రి ఎంత వేలైనది? (యెషయా 21:11).

గాయపడిన రోగియైన వ్యక్తుల్లా వారు మోర పెట్టుచున్నారు. దీర్ఘ రాత్రిలో, శ్రమపడు రోగి అరుస్తున్నాడు, "రాత్రి ఎంత మిగిలింది? రాత్రి ఎంత మిగిలింది?" (ఎన్ ఐవి). ప్రవక్త కావలివాడు జవబిస్తున్నాడు, "ఉదయము నగును, రాత్రి యగును."

వారు యెషయా దగ్గరకు ఎందుకు వచ్చారు? జాతకం చెప్పువారు, సోదేగాండ్రు ఏదోములో లేదా? వారు వేదన మేరతో ఎరుష లేముకు ఎందుకు వచ్చారు? ప్రజలు అంతా భాగున్నప్పుడు జాతకాలు చెప్పే వారిని సమీపిస్తారు. కాని వేదన మరణము వచ్చినప్పుడు, ఎవరికీ కావాలి జాతకం చెప్పేవారు, సోదేగాండ్రు? మరణపు చాయలో, లోక జ్ఞానము మనకు వద్దు. దేవుడు చెప్పేది మనం తెలుసుకోవాలనుకుంటాం! జాతకం చెప్పేవారు ఆశక్తికర విషయము చెప్పవచ్చు అంతా భాగున్నప్పుడు. కాని భయము వేదన ఉన్నప్పుడు, దైవ జనుని గూర్చి ప్రజలు చూస్తారు. వారు మేర లిడుతారు,

"కావలివాడా, రాత్రి ఎంత వేలైనది? కావలివాడా, రాత్రి ఎంత వేలైనది? (యెషయా 21:11).

ఈ ఉదయాన్న అది ఎలా మాట్లాడుతుందో ఆలోచించండి!

I. మొదటిది, ఈ పాఠ్య భాగము దేశాలకు వర్తిస్తుంది.

1914 లో, మొదటి ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు, లార్డ్ ఎడ్వర్డు గ్రే రాత్రి జరిగే కేబినేట్ కూటము నుండి బయటకు వచ్చాడు. గ్రేట్ బ్రిటన్ కు అతడు విదేశాంగ మంత్రి. తెల్లవారు జామున, లార్డ్ ఎడ్వర్డు మరియొక కేబినేట్ సభ్యునితో కలిసి కూటములో నుండి బయటకు వచ్చేసాడు. రాత్రంతా యుద్దాన్ని గూర్చి చర్చించారు. అప్పుడు కరెంటు దీపాలు లేవు, గ్యాస్ దీపాలే ఉన్నాయి. లార్డ్ ఎడ్వర్డ్ భవనంలో నుండి బయటకు నడుస్తున్నప్పుడు లైటు వెలిగించే వారు ఒక్కొక్క వీది దీపాన్ని ఆర్పుకుంటూ వస్తున్నాడు. లార్డ్ ఎడ్వర్డ్ గ్రే తన స్నేహితుని వైపు తిరిగి అన్నాడు, "యూరపు అంతా దీపాలు ఆరిపోతున్నాయి. మన జీవితంలో అవి వెలిగింపబడడం మళ్ళీ చూడం." అతడు సరిగ్గా చెప్పాడు! రాబోవు సంవత్సరాల్లో రష్యా కమ్యునిస్టు అవుతుంది, జర్మని దిగజారి హిట్లర్ చేతుల్లో పడింది, ఇటలీ ముస్సోలినీలో చేతుల్లో పడింది, ప్రాన్స్ ఇంగ్లాండ్ లు రెండవ ప్రపంచ యుద్ద కారణంగా బలహీనమయ్యాయి, తిరిగి వారి పూర్వపు మహిమను పొందుకోలేవు. పాత యూరపు ప్రపంచం చనిపోతుంది, తిరిగి పూర్వపు వైభవం పొందుకొబోదు.

దీపాలు పూర్తిగా అర్పబడ్డాయి ముస్లీములు అధిరోహిస్తున్నారు. అమెరికా కూడా, మృతమవుతుంది. వైట్ హౌస్ లో ఉన్న దుష్టుడు పూర్తిగా దిశా కోల్పోయాడు. రిపబ్లికన్లూ అంతే. నా భార్య నేను గతవారం ఎన్ కౌల్టార్ నిక్సన్ గ్రంధాలయంలో మాట్లాడు విన్నాం. అక్కడ గుంపు ఆమెను నిక్సన్ "మౌన మెజారిటీలా" కాకుండా ఉడ్ స్టాక్ హిప్పి వెటరన్ లా చూసారు. నా భార్యతో అన్నాను, "వీళ్ళు సమగ్ర వాదులైతె, దేవుడు మనకు సహాయం చేస్తాడు!"

అమెరికా జీవించి వృద్ధి పొందుతుందని మీరు అనుకుంటున్నారా? 2012లో డెమోక్రిటిక్ నేషనల్ కన్వెన్షన్ లో నేను చూసాక, మనకు ఎలాంటి నిరీక్షణ నేను చూడ్డం లేదు! బిల్లీ గ్రేహం తికమక పెట్టె నిస్సారమైన ప్రసంగము నేను చూసాక, "నానిరీక్షణ" అంశముపై గతవారము ప్రసారమైన, నాడు ఎలాంటి నిరీక్షణ కనపడడం లేదు. అతడు ముసలివాడని కాదు. కాని అతని ప్రసంగం చనిపోతున్న దేశాని ఆత్మీయ తికమక నుండి తేవడానికి ఎక్కువగా మనస్కరించింది. చాలా సంవత్సరాల క్రితం అతని ప్రసంగాలలో గురి ఉండేది. గ్రేహం అన్నారు, "దేవుడు అమెరికాను తీర్పు తీర్చకుంటే గోమోరకు క్షమాపణ చెప్పాలి." బైబిలు చెబుతుంది,

"దుష్టులను దేవుని మార్చు జనులందరును, పాతాళమునకు దిగి పోవుదురు" (కీర్తనలు 9:17).

ఒక వ్యక్తీ కాన్సాస్ నుండి గతవారం నాకు ఫోన్ చేసాడు ఒక పుస్తకము కోసం, చనిపోవు దేశానికి బోధ. అతడు అన్నాడు, "మీరు సరియే. మన దేశం చనిపోతుంది." తను చెప్పాడు 250 మంది ఉండే చిన్న కాన్సాస్ పట్టణంలో తను ఉంటాడని. వాళ్ళకు పోలిస్ సిబ్బంది లేదు, చాలా చిన్నది. కాని అన్నాడు గత పది సంవత్సరాల వరకు సమీప పట్టణం నుండి సంవత్సరానికి 2 లేక 3 సార్లు వచ్చారని. "ఇప్పుడు," తానన్నడు, "వాళ్ళు 2 లేక 3 సార్లు రోజులో వస్తున్నారని!" తానూ ఇంకా అన్నాడు చాలా మంది సంఘస్తులు తాగుతూ మత్తు పదార్ధాలు తీసుకుంటున్నారని. తానూ చెప్పాడు ఒకతనికి రక్షింపబడాలని చెప్పాడని. ఇతని వైపు చూచి, "నేను రక్షింపబడ్డాను" అని చెప్పాడట! అది ఎలా ఉందంటే సువార్తిక సంఘ సభ్యుడు మత్తు పదార్ధాలు సేవించే వ్యక్తి కళ్ళల్లో నుండి దెయ్యం చూస్తున్నట్టుగా అనిపించిందని! కోస్తా నుండి కోస్తా వరకు మన సంఘాలు సువార్తికులతో నిండి పోతూ ఉంటె, అమెరికా దినాలు లెక్కింప బడుతున్నాయి! అవి దానియేలు దినముల వలే ఉంటాయి,

"దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి, దాని ముగించెను. ఆయన నిన్ను త్రాసులో చూచాగా, నీవు తక్కువగా కనబడితివి" (దానియేలు 5:26, 27).

దేవుని ఉగ్రతతో తీర్పు తీర్చబడే దేశంలో నివసిస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఇలా అనిపిస్తుంది! ఇలా అనిపిస్తుంది ముంచబడే దేశంలో నివసిస్తుంటే! ఎలా అంటే టైటానిక్ లో అది ఐస్ గడ్డను తాకే ముందు - ప్రజలు త్రాగుచూ, నాట్యమాడుచున్నటనిపిస్తుంది! అలానే అనిపిస్తుంది హేయమైన ఒబామా-రాజ్యంలో!

ఆదివారం గుడికి ఎవరికీ సమయం లేదు. పాప పశ్చాత్తాపం లేదు. మన స్పూర్తిగా ఎవరూ క్రీస్తును వెతకడం లేదు. ఎవరూ దేవునికి భయపడ్డం లేదు. బైబిలు చెబుతుంది, "వారి కనుల ఎదుట దేవుని భయము లేదు" (రోమా 3:18). బైబిలు చెబుతుంది, "దేవుని వెదుకు వాడెవడునూ లేదు" (రోమా 3:11).

"కావలివాడా, రాత్రి ఎంత వేలైనది? కావలివాడా, రాత్రి ఎంత వేలైనది? (యెషయా 21:11).

"నెమ్మదిగా ఉన్నది, భయమేమియు లేదు అని చెప్పుకోనుచుండగా; ఆకస్మికంగా నాశనము తటస్థించును…వారెంత మాత్రమును తప్పించు కోనలేరు" (I దెస్సలొనీకయులకు 5:3).

అమెరికా మునిగింది, ఈ ఉదయము మీలో చాలా మంది అది పూర్తిగా నాశనం అవడం చూస్తారు! కవి జేమ్స్ రస్సెల్ లోవెల్ (1819-1891) అన్నాడు,

ప్రతి వ్యక్తికి దేశానికి
   నిర్ణయించు కొనే సమయం వస్తుంది,
నిజం అసత్య సమ్మేలనలో
   మంచి చెడుల మధ్య ఎన్నిక.
("ప్రతి వ్యక్తికి దేశానికి" జేమ్స్ రస్సెల్ లోవెల్, 1819-1891).
(“Once to Every Man and Nation” by James Russell Lowell, 1819-1891).

అమెరికా గతంలో చెడును ఆశ్రయించి పాఠశాలలో ప్రార్ధన బహిష్కరించింది. చెడును ఎన్నుకొని అమెరికా పాఠశాలలో బైబిలును నిషేదించింది. చెడును ఎన్నుకొని అమెరికా మన సినిమా హాళ్ళలో ఎక్స్ రేపేడ్ ఫిల్మ్లులు అనుమతించింది. చెడు వైపు మొగ్గి అమెరికా లక్షలాది లెక్కలేనంత మంది చంటి పిల్లలను తొమ్మిదవ నెల గర్భములో వేడి ఉప్పు నీళ్ళలో చంపడానికి అనుమతించింది. ఒకటి రెండు సంవత్సరాలలో ఆపబడవచ్చు – కాని అమెరికా చంపడాన్ని కొనసాగించింది. ఇప్పుడు ఈ దేశము రక్తములొ నానుతుంది – చంటి బిడ్డలా రక్తములొ నానుతుంది. రక్త పిశాచాలతో మృత దేహాలతో టివి నిండి పోవడం చూసి ఎప్పుడైనా ఆశ్చర్య పోయారా? సామూహిక చావులు కొనసాగడం మీకు ఆశ్చర్యం కలిగిస్తుందా? తుపాకీలు చంపడం లేదు! కాదు! ప్రజలు – అమెరికా వాసులు – మత్తులో త్రాగుడులో మునిగి, విడియో ఆటలలో మైమరిచి, అసబ్య సినిమాలలో నిండుతున్నారు. అందుకే వారు జగతిని పూజించి గుడి మానుకుంటున్నారు! ప్రెంచి వేదాంతి బ్లెయిన్ పాస్కల్ అన్నాడు, "విశ్వ మౌనము నన్ను భయపెడుతుంది." ఇంకా ఎంత ఎక్కువగా మనం భయబడాలి దేవుడు దేశానికి, ప్రజలకు ఆయన ముఖము చాటేసుకున్నప్పుడు?

"కావలివాడా, రాత్రి ఎంత వేలైనది? కావలివాడా, రాత్రి ఎంత వేలైనది? (యెషయా 21:11).

II. రెండవది, మన పాఠ్య భాగము మరణానికి నరకానికి వర్తిస్తుంది - నశించు ఆత్మల నిత్వత్వ రాత్రి.

మరణము నరకముల రాత్రి వచ్చేస్తుంది. బైబిలు చెబుతుంది, "మోసపోకుడి; దేవుడు వెక్కిరింపబడడు: మనష్యుడు ఏమి విత్తునో, ఆ పంటనేకోయును" (గలతీయులకు 6:7). బైబిలు చెప్తుంది, "జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్నియైయున్నాడు" (హేబ్రీయులకు 10:31; 12:29).

మరణము నరకము రాత్రి దేవుని నుండి, సంఘము నుండి, రక్షకుని నుండి తిరిగిపోయే ప్రతి పురుషుని కొరకు స్త్రీ కొరకు కనిపెడుతూ ఉంది! రక్షకుడైన యేసు క్రీస్తు లేకపోతె నీ పాపములో నీవు నశిస్తావు, ఆయన నీతో అంటాడు, "నా యొద్ద నుండి పొండి...నేను మిమ్మును ఎన్నడును ఎరుగను" (మత్తయి 7:23). మరియు వారు "వెలుపట చీకటిలోనికి త్రోయబడుదురు" (మత్తయి 8:12; 22:13; 25:30).

భారమైన హృదయముతో ఇది మీతో చెప్తున్నాను. మీరు రక్షింపబడాలని ప్రార్ధిస్తాను. కాని నాకు తెలుసు మీరు పశ్చాత్తాపపడక పొతే, హృదయ పూర్వకంగా యేసు క్రీస్తు వైపు మరలకపొతే, మీకు నిరీక్షణ లేదు – వెలుపల నిత్వత్వ నరకపు చీకటిలో పడవేయబడుతారు. మీరు అనవచ్చు, "పాస్టరు గారు, దేవుడు నన్ను ప్రేమించడా?" అవును, నిన్ను ప్రేమిస్తాడు. కాని ఆయన నీకు ఎలా సహాయము చేస్తాడు, నీ పాపాన్ని ఎలా క్షమిస్తాడు, నీ ఆత్మను ఎలా రక్షిస్తాడు – నువ్వున్నట్టు గానే నీవుంటే – పశ్చాత్తాప పడకుండా, క్రీస్తు కృప వైపు మరలకుండా? బైబిలు చెప్తుంది,

"దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారినిగా పుట్టిన, వానియందు విస్వాసముంచు ప్రతి వాడును, నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను" (యోహాను 3:16).

అది జవాబు! హృదయ మంతటితో ఆయనను నమ్ము! ద్వారం తెరిచే ప్రతిసారి గుడిలోనికిరా!

ఆయన కృపపై ఆనుకొ! నీలో ఉన్న అంతటితో క్రీస్తు వైపు మరలు! అదే రక్షణ మార్గము – అది మాత్రమె మార్గము! పాఠ్యము గురుంది ఆఖరిగా ఆలోచించు. ఆఖరి రెండు మాటలు, "తిరిగి, రమ్మను" గూర్చి ఆలోచించు.

"దూమాను గూర్చిన దోవోక్తి. శేయీరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు, కావలివాడా, రాత్రి యెంత వేలైనది? కావలివడా, రాత్రి ఎంత వేలైనది అని? కావలివాడు, ఉదయము నగును, రాత్రి అగును: మీరు విచారింపగోరిన యెడల, విచారించుడి: మరల, రండి" (యెషయా 21:11, 12).

పాఠ్య భాగము రెండు పదాలతో, "తిరిగి, రమ్ము" (యెషయా 21:12). క్రీస్తు నోద్దకు తిరుగు! క్రీస్తు నోద్దకురా! సిలువపై కార్చబడిన రక్తములొ కడుగబడు! పాత పాట చెప్తున్నట్టు,

నా పాపాన్ని ఏది కడుగుతుంది?
   యేసు రక్తము మాత్రమే.
నన్ను ఏది శుద్దునిగా చేయగలదు?
   యేసు రక్తము మాత్రమే.
ఓ! ప్రశస్త ప్రవాహము
   అది హిమము కంటే నన్ను తెల్లగా చేస్తుంది;
వేరే ప్రవాహము నాకు తెలియదు,
   యేసు రక్తము మాత్రమె.
("యేసు రక్తము మాత్రమె" రాబర్ట్ లౌరిచే, 1826-1899).
(“Nothing But the Blood” by Robert Lowry, 1826-1899).

ఒక విషయం చెప్పకుండా ప్రసంగము ముగించలేను ప్రసిద్ధ కాపరి, డాక్టర్. డబ్ల్యూ. ఎ. క్రీస వెల్ చెప్పిన విషయము. (W. A. Criswell, Ph.D., Isaiah: An Exposition, Zondervan Publishing House, 1977, pp. 129-134).

ఇంకొక ప్రసంగములో, డాక్టర్ క్రిస్ వెల్ ఇలా అన్నాడు:

డాక్టర్ జార్జి డబ్ల్యూ. ట్రుయిట్, మొదటి బాప్టిస్టు చర్చి, డాల్లాస్ లో నా ముందరి కాపరి, ఆయన మారడాన్ని గూర్చి తన ప్రసంగాలలో ఇలా [చెప్పాడు]: "ఒకరాత్రి జనాల మధ్య కూర్చిని ప్రసంగీకుడు చెప్పేది విన్నాను ఆయన అన్నాడు క్రీస్తు ఆయన విధానంగ్లో ఒక ఆత్మను రక్షించుకుంటాడు. నేనన్నాను, ‘యేసు ప్రభువా, అంతా చీకటి మాయం; నా కర్ధమవడం లేదు, కాని చీకటైన వెలుగైనా, బ్రతికినా చనిపోయినా, ఏది సంభవించినా, నేను యిప్పుడు నీకు సమర్పించుకుంటున్నాను.’ [మరియు డాక్టర్ ట్రుయిట్ అన్నాడు] ఆయన అప్పుడు నన్ను రక్షించాడు." (క్రిస్ వెల్, ఐబిఐడి., పేజి 217).

అలా ప్రఖ్యాతి గాంచిన బోధకుడు డాక్టర్ ట్రుయిట్ రక్షింపబడ్డాడు. అదే విధంగా నీవు కూడా రక్షింపబడాలి. నీవు యేసు నోద్దకు వచ్చి నీ హృదయంలో చెప్పాలి, "చీకటైన వెలుగైనా, బ్రతికినా చనిపోయినా, ఏది సంభవించినా, నేను యిప్పుడు నీకు సమర్పించుకుంటున్నాను." నీ పాపమూ ఒప్పుకొని యేసు కృప వైపు మరలు. కల్వరి సిలువపై ఆయన కార్చిన పరిశుద్ధ రక్తము ద్వారా నీ పాపాలను కడుగేసుకో!

నా పాపాన్ని ఏది కడుగుతుంది?
   యేసు రక్తము మాత్రమే.
నన్ను ఏది శుద్దునిగా చేయగలదు?
   యేసు రక్తము మాత్రమే.

నీవు మాతో మాట్లాడాలనుకుంటే యేసు రక్తము ద్వారా పాపాలు కడుగబడడాన్ని గూర్చి, నీ స్థలము వదిలి ఆవరణము వెనుక భాగానికి రమ్ము. డాక్టర్ కాగన్ వేరే గదికి తీసుకెళ్ళి మాట్లాడి ప్రార్ధిస్తారు. ఇప్పుడే వెళ్ళు. డాక్టర్ చాన్, యేసును నమ్ము వారి కొరకు దయచేసి ప్రార్ధించండి. ఆమెన్.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసగాలు ప్రతీవారము”
అంతర్జాలములో www.realconversion.com ద్వారా చదువవచ్చు.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రదోమేచే: యెషయా 21:11-12.
ప్రసంగమునకు ముందు పాట బెంజమన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్ గారిచే:
"యేసు, యేసు ఒక్కడే" (డాక్టర్ జాన్ ఆర్. రైస్ చే, 1895-1980).
“Jesus, Only Jesus” (by Dr. John R. Rice, 1895-1980).


ద అవుట్ లైన్ ఆఫ్

కావాలి వాడు, రాత్రిని గూర్చిన విషయమేంటి?

WATCHMAN, WHAT OF THE NIGHT?

డాక్టర్ ఆర్.ఎల్.హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"దూమాను గూర్చిన దోవోక్తి. యొకడు, శేయీరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు, కావలివాడా, రాత్రి యెంత వేలైనది? కావలివడా, రాత్రి ఎంత వేలైనది అని? కావలివాడు, ఉదయము నగును, రాత్రి అగును: మీరు విచారింపగోరిన యెడల, విచారించుడి: మరల రండి, అనుచున్నాడు" (యెషయా 21:11, 12).

I.   మొదటిది, ఈ పాఠ్య భాగము దేశాలకు వర్తిస్తుంది, కీర్తనలు 9:17; దానియేలు 5:26, 27; రోమా 3:18, 11; I దేస్సలోనీకయులకు 5:3.

II.  రెండవది, మన పాఠ్య భాగము మరణానికి నరకానికి వర్తిస్తుంది - నశించు ఆత్మల నిత్వత్వ రాత్రి, గలతీయులకు 6:7; హేబ్రీయులకు 10:31; హేబ్రీయులకు 12:29; మత్తయి 7:23; 8:12; 22:13; 25:30; యోహాను 3:16.