Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




సంతృప్తి మరియు సమర్ధన–
క్రీస్తుచే పొందబడినవి

(ప్రసంగము సంఖ్య 13 యెషయా 53)
SATISFACTION AND JUSTIFICATION –
OBTAINED BY CHRIST
(SERMON NUMBER 13 ON ISAIAH 53)
(Telugu)

డాక్టరు ఆర్. ఎల్ హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

బాప్టిష్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలెస్ నందు బోధింపబడిన ప్రసంగము
ప్రభువు దినము సాయంత్రము, ఏప్రిల్ 14, 2013
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, April 14, 2013

"అతడు తనకు కలిగిన వేదనను చూచి, తృప్తి నొందును: నీతిమంతుడైన నాసేవకుడు జనుల దోషములను భరించి; తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును" (యెషయా 53:11).


ఈ పాఠ్య భాగము చాల అర్ధవంతమైనది అందులో ప్రతి మాటను మనం లక్ష్యపెట్టాలి. కాబట్టి పాఠ్యభాగానికి దూరంగా వెళ్లను, ఎక్కువ ఉదాహరణలు కూడా ఇవ్వను. ఒక ప్రసంగములో ఈ సత్యభాగములోని అద్భుత సత్యాలు చూడవచ్చు; పదాలు చాల సామాన్యంగా తేటగా ఉన్నాయి మన ఆలయానికి వచ్చిన ప్రతి దర్శకుడు ఇంటికి వెళ్ళవచ్చు, ఈ పదాల సామాన్యమైన, భావగర్భితమైన అర్ధాన్ని గ్రహించుకొని,

"అతడు తనకు కలిగిన వేదనను చూచి, తృప్తి నొందును: నీతిమంతుడైన నాసేవకుడు జనుల దోషములను భరించి; తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును" (యెషయా 53:11).

దేవుడు మీ హృదయాలను తెరిచి ఈ సత్యాలు అంగీకరించునట్లు చేయునుగాక. మీకు మేము చెప్తున్నాం, ఈ సత్యముపై భోధించేటప్పుడు, “చెవిని సిద్దపరచి, నా యెద్దకురా. విను, నీ ఆత్మ జీవిస్తుంది.”

ఈ వచనము ముందు విషయాలు మాట్లాడుతుంది. మొదటిది, దేవుని న్యాయాన్ని తృప్తి పరచు క్రీస్తు. రెండవది, అనేక మందిని సమర్ధించే క్రీస్తు అనుభవ జ్ఞానము. మూడవది, పాపాన్ని-భరించు క్రీస్తు, ఆయన నమ్ము పాపికి పూర్తి అనుగ్రహం అందించడం.

"అతడు తనకు కలిగిన వేదనను చూచి, తృప్తి నొందును: నీతిమంతుడైన నాసేవకుడు జనుల దోషములను భరించి; తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును" (యెషయా 53:11).

I. మొదటిది, దేవుని న్యాయాన్ని తృప్తిపరచు క్రీస్తు చూచి తృప్తి నొందును.

“అతడు తనకు కలిగిన వేదనను చూచి, తృప్తిని నొందును…” (యెషయా 53:11).

డాక్టర్ జర్జన్ మోల్ట్ మాన్ (1926-) జర్మనుడు బ్రిటిష్ జైలులో రెండవ ప్రపంచ యుద్ధానంతరము మూడు సంవత్సారాలు యుద్ద బంధీ అయ్యాడు. ఆయన జైలులో ఉన్నప్పుడు బైబిలు చదవడం ప్రారంభించాడు. జైలు శిక్ష బైబిల్ చదవడం అనుభవాలనుండి, ఆయన వ్రాసాడు హిస్టరీ అండ్ ద ట్రియూన్ గాడ్: కంట్రీ బ్యూషన్స్ టు ట్రినిటేరియన్ ధీమలాజీ (క్రాస్ రోడ్, 1992). డాక్టర్ మోల్ట్ మాన్ స్వతంత్ర వేదాంతి, ఆయన వ్రాసిన దాని అంతటితో నేను ఏఖిభవించను. కానీ, ఆయన కొన్ని తలంపులు కలిగియున్నారు. ఉదాహరణకు, మోల్ట్ మాన్ సిలువను ఒక సంఘటనగా చూసాడు దానిలో “దేవుని వదలిన” మానవాళితో దేవుడు ఉదారత ప్రకటిస్తాడు. దేవుడు పాపుల పట్ల ఆయన ప్రేమను సిలువపై ప్రత్యక్ష పరుస్తాడు, మరియు కుమార దేవుడు తండ్రి నుండి, ఎడబాటు అనుభవిస్తాడు “లోపల బయట ఉండే.” నొప్పిని శ్రమను దేవుడు తెలుసుకొనేలా చేయడానికి మోల్ట్ మాన్ అంతా సరిగ్గా చూపలేదు, కానీ, ఆయన త్రిత్వములో ఉన్న వ్యక్తుల శ్రమలను సిలువపై అభివర్ణించాడు. నేననుకుంటాను, అది ఒక ప్రాముఖ్య విషయము నా ఉద్దేశంలో ఆలోచింపదగిన విషయము – అది త్రిత్వములొ ఉన్న వ్యక్తుల శ్రమలు సిలువపై.

"అతడు తనకు కలిగిన వేదనను చూచి, తృప్తి నొందును" (యెషయా 53:11).

స్పర్జన్ అన్నాడు,

ఈ మాటల్లో మనం చూస్తాం తండ్రి దేవుడు కుమారుని గూర్చి, మాట్లాడడం ప్రకటించడం, ఎందుకంటే వేదనను భరించాడు, తృప్తి ద్వార బహుమానము ఆయన హామీ ఇస్తున్నాడు. ఎంత ఆనందదాయకం చూడ్డానికి పవిత్ర త్రిత్వములో ఉన్న ముగ్గురు రక్షణ కోసం కలసి పనిచేయడం! (C. H. Spurgeon, The Metropolitan Tabernacle Pulpit, Pilgrim Publications, 1980 reprint, volume 61, p. 301).

"ఆయన," అంటే, తండ్రి దేవుడు, "తనకు కలిగిన వేదనను చూచును," అంటే, కుమారుడికి కలిగిన వేదనను చూచి; "తృప్తిని నొందును." స్పర్జన్ చెప్పినట్టు, "ఈ మాటలలో తండ్రి దేవుడు కుమారుని గూర్చి మాట్లాడుట."

"అతడు తనకు కలిగిన వేదనను చూచి, తృప్తి నొందును" (యెషయా 53:11).

"తనకు కలిగిన వేదన" క్రీస్తు యెక్క అంతర్గతబాధ వేదనను తెలుపుతుంది, అది అనుభవించాడు ఆయన శ్రమనొందినప్పుడు మన పాపాల కొరకు. మనం క్రీస్తు శారీరక శ్రమను తక్కువ అంచనా వేయకూడదు. మనం ఎన్నడూ చులకనగా ఆలోచించకూడదు పొంతి పిలాతు ద్వార మరణానికి అప్పగింపబడడం. మనం ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు క్రీస్తు ఉమ్మివేయబడడం ముల్లుతో కిరీటం పెట్టబడడం. ప్రాముఖ్యతను మనం తక్కువగా లెక్కకట్టకూడదు ప్రాముఖ్యతను ఆయన కాళ్లు, చేతులకు మేకులు కొట్టడం సిలువపై ఆయన అనుభవించిన శ్రమదాహం మనకోసం. “కాని,” స్పర్జన్ అన్నాడు, “అతడు పొందిన వేదన ప్రధానము, దాని గురుండే పాఠ్యము మాట్లాడుతుంది...యేసు క్రీస్తు [ఎక్కువగా] శ్రమపడ్డాడు, ఆయన శ్రమలను నేను తట్టుకోలేను వాటిని ఎలాంటి మాటలలోను మీకు చెప్పలేను" (స్పర్జన్, ఐబిఐడి., పేజి 302-303). ఏమి చెప్పబడిందంటే "క్రీస్తు ఆత్మ-వేదనలు ఆయన వేదనల ఆత్మ" (ఐబిఐడి., పేజి 302), ఆయన శ్రమలలోని హృదయం, ఆయన వేదనలో ప్రధమ భాగము.

పదము "వేదన" దుఃఖాన్ని చూపిస్తుంది, క్రీస్తు అనుభవించిన శ్రమను భాదను చూపిస్తుంది "ఆయన ఆత్మలో" ఎప్పుడైతే శ్రమను భాదను, పాపభారము, తగరి దేవుని తీర్పు, ఆయనపై వచ్చినప్పుడు. దీనిని తేటగా క్రీస్తు గేత్సమనే వనములో అనుభవించాడు, ఆయన బంధింపబడకమునుపు, అప్పగింపబడి, సిలువ వేయబడకమునుపు. అందులో ఆయన సిలువపై అనుభవించిన దుఃఖము నిట్టూర్పు కూడ ఇమిడి ఉన్నాయి. డాక్టర్ గిల్ అన్నాడు,

అతనికి కలిగిన వేదన ఆయన సహించిన శ్రమ కష్టము, ఆయన ప్రజల రక్షణార్ధం; ఆయన విధేయత మరణము, ఆయన విషాదము శ్రమలు; ప్రత్యేకంగా ఆయన ఆత్మ-నిట్టూర్పులు, వైవిక ఉగ్రత గుర్తింపు, ఈ పోనీక శ్రమలో నొప్పిలో ఉన్న స్త్రీ [బిడ్డకు జన్మ నివ్వడంలో ఉన్న వేదన]; మరియు అన్ని ఆవేదనలు నొప్పులు మరణమునకు సంబందించినవి వాటన్నింటి ద్వారా ఆయన వెళ్లాడు (John Gill, D.D., An Exposition of the Old Testament, The Baptist Standard Bearer, 1989 reprint, volume 5, p. 315).

“అతడు తనకు కలిగిన వేదనను చూచి, తృప్తి నొందును... " (యెషయా 53:11).

“అతడు తృప్తి చెందినాడును” దేవుని ఉగ్రతను గూర్చి మాట్లాడుతుంది. తండ్రి దేవుడు "తృప్తి చెందాడు," లేక, మనం చెప్పొచ్చు, అనుగ్రహించాడు,

"ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమేరుగని ఆయనను, మన కోసము పాపముగా చేసెను" (II కోరిందియులకు 5:21).

"ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు" (I యెహొను 2:2).

"పూర్వము చేయబడిన పాపములను దేవుడు ఉపేక్షించెను" (రోమ 3:25).

డాక్టర్ జాన్ మేక్ ఆర్డర్, క్రీస్తు రక్తమును గూర్చి తప్పు చెప్పిన, సరిగా చెప్పాడు,

పదము [అనుగ్రహము] అర్ధము "శాంతికరము" లేక "సంతృప్తి." సిలువపై యేసు త్యాగము దేవుని పరిశుద్దతను తృప్తి పరచింది పాప శిక్ష... కనుక యేసు అనుగ్రహించాడు లేక దేవుని తృప్తి పరిచాడు (John MacArthur, D.D., The MacArthur Study Bible, Word Publishing, 1997, note on I John 2:2).

నన్ను ఆశ్చర్య పరిచింది రక్తమును గూర్చి ఆయన తప్పు చెప్పారు, కాని అనుగ్రహమును గూర్చి సరిగా చెప్పారు! ఇట్లు, మనం అనుగ్రహాన్ని చూస్తాం, దేవుని తృప్తి పాపానికి వ్యతిరేకంగా ఉగ్రత, అనుభవింపబడింది యేసుచే వేదనతో. యేసు శ్రమ “తృప్తి పరచింది” దేవుని న్యాయాన్ని, పాప వ్యతిరేక, ఉగ్రతను, శాంతింపజేయడంలో.

"ఎందుకనగా మనమాయన [తండ్రీ దేవుడు] యందు దేవుని [దేవుని కుమారుడు] నీతి అగునట్లు పాపమేరుగని ఆయనను, మన కోసము పాపముగా చేసెను" (II కోరిందియులకు 5:21).

“క్రీస్తు శ్రమలు దేవుని న్యాయాన్ని తృప్తి పరచి, మనం రక్షింపబడడానికి వీలు కలిగిస్తుంది...” (యెషయా 53:11).

క్రీస్తు శ్రమలు దేవుని సంతృప్తి పరచి, మనలను రక్షించడానికి వీలు కలిగిస్తుంది.

II. రెండవది, అనుభవ జ్ఞానము చాలామందికి న్యాయసమర్ధన తెస్తుంది.

మనం లేచి నిలబడి పాఠ్యభాగం గట్టిగా చదువుదాం, ఆఖరి మాట, "అనేకులకు న్యాయము."

"అతడు తనకు కలిగిన వేదనను చూచి, తృప్తి నొందును: తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. .." (యెషయా 53:11).

మీరు కూర్చోండి.

ప్రవక్త యెషయా క్రీస్తును దేవుని "సేవకునిగా" పరిగణించాడు యెషయా 52:13 లో. ఇక్కడ, ఈ పాఠ్యములో, క్రీస్తు "నీతిమంతుడైన సేవకునిగా" పిలువబడ్డాడు. క్రీస్తు నీతిమంతుడు ఎందుకనగా ఆయన “పాపములను ఎరుగడు” (II కోరిందియులకు 5;21). ఆయన పాపములేని తండ్రి దేవుని, "నీతిమంతుడైన సేవకుడు" దైవకుమారుడు.

క్రీస్తు అనేకులకు "న్యాయము చేస్తాడు" (వ. 11). ఇది సువార్త హృదయము మనము సమర్ధించుకోలేము. దేవుని న్యాయ శాస్త్రానికి లోబడి, ఎందుకంటే

"ఏలయనగా ధర్మ శాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడును" (రోమ 3:20).

మనలను మనలను మనం సమర్ధించుకోలేము ఎందుకంటే మనం సహజంగా పాపులం కాబట్టి. మనం నీతిమంతులుగా లెక్కింపబడుతున్నాం. మన పట్ల క్రీస్తు నీతిని బట్టి "నాద" ఒక న్యాయ పదము. మనం న్యాయంగా లెక్కింపబడతాం న్యాయవంతులరుని మన పట్ల క్రీస్తు న్యాయ మత్వము చేత. దేవుని "నీతి మత్వసేవకుడు [తప్పకుండా] చాల మందిని సమర్ధిస్తాడు" (యెషయా 53:11) ఆయన న్యాయమును వారికి అందించుట ద్వారా!

“అతడు తనకు కలిగిన వేదనను చూచి, తృప్తి నొందును: తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును...” (యెషయా 53:11).

జాన్ ట్రాప్ గుర్తుచేసాడు కార్డినల్ కంటేరెనాస్ ఇంకొక కేధిలిక్ కార్డినల్, పైగియస్ చే ఉరితీయబడ్డాడు. ఎందుకంటే కంటేరెనాస్ ఈ వచనాన్ని ఉన్నట్టుగా నమ్మాడు, ఆయన “ప్రోటేస్టెంటు” ఆయన విశ్వాసాన్ని బట్టి ఉరితీయబడ్డాడు “మానవునికి” సమర్ధింపు [ఇప్పుడు] దేవుని ఉచిత కృప చేత మరియు క్రీస్తు గుణ గణ్యతను బట్టి” (John Trapp, A Commentary on the Old and New Testaments, 1997 reprint, volume III, pp. 410-411, note on Isaiah 53:11). కానీ కార్డినల్ కంటేరెనాస్ సరియే! మిగిలిన కర్దినల్స్ అందరు తప్పు!

"నా నీతిమంతుడైన సేవకుడు [తప్పక] చాల మందిని సమర్ధిస్తాడు." ఈ మాటలు మన కొరకు చనిపోవడానికి తగినవి కాదా? నిజంగా, అవును! అదే మన బాప్టిష్టు పెంతెకోస్తు విశ్వసాలికం హృదయం! మనలను మనం సమర్ధించుకోలేము, కేధలిక్కులు ఫిన్నీ, అనుచరులు బోధిస్తున్నట్టు! ఓ, కాదు!

"మనుష్యుడు యేసు క్రీస్తు నందలి విశ్వాసము వలననే, గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడ్డాడు" (గలతీయులకు 2:16).

"మనము విశ్వాస మూలమున నీతి మంతుల మని తీర్చబడునట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు, ధర్మ శాస్త్రము బాల శిక్షకుడాయెను" (గలతీయులకు 3:24).

క్రీస్తు, దేవుని "నీతిమంతుడైన సేవకుడు," చాల మందిని సమర్ధిస్తున్నాడు!

అది ఎలా జరుగుతుంది? ఎలా క్రీస్తు చాలామందిని సమర్ధిస్తాడు "నీతిమంతుడైన సేవకుడని"? ఏదో ఒక పాపాన్ని వదిలేసే పనిని బట్టి ఆయన మనుష్యులను సమర్దిస్తాడా? కాదు! అతి కేధవిజం నిర్ణయత్వం! ఆయన వారిని సమర్దిస్తాడా "పాపి ప్రార్ధన" చేస్తే, లేక "ముందుకు వస్తే" ప్రసంగము తరువాత? కాదు! అది కేధవిజం నిర్ణయత్వం! ఆయన వారిని సమర్దిస్తాడా "రక్షణ ప్రణాళిక" ను నేర్చుకున్నందుడు యెహాను 3:16, ను కంతట పట్టేనందుకు "పాపి ప్రార్ధన" చేసినందుకు? కాదు! అది, కూడా, కేధవిజం నిర్ణయత్వం!

ఎలా, మరి, నీవు నీతిమంతుడుగా తీర్చబడతావు? ఎలా నీవు దేవుని దృష్టిలో నిందారహితుడుగాను నీతిమంతుడవుగాను అవుతావు? అది నిత్యత్వ ప్రశ్న! అది యోబు గ్రంథములోని బిల్దారు యొక్క గొప్ప ప్రశ్న! అతడు అన్నాడు,

"నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్దుడు కాగలడు?" (యోబు 25:4).

దానికి జవాబు మన పాఠ్యభాగములో కనిపిస్తుంది,

"తనకున్న అనుభవ జ్ఞానముచేత అనేకులకు నిర్దోషులనుగా చేయును" (యెషయా 53:11).

లేక, స్పర్జన్ అనువదించినట్లు, "ఆయన అనుభవము ద్వారా నా నీతిమత్వ సేవకుడు అనేకులను నీతిమంతులుగా చేయును" (C. H. Spurgeon, The Metropolitan Tabernacle Pulpit, Pilgrim Publications, 1980 reprint, volume 63, p. 117). స్పర్జన్ అన్నాడు,

క్రీస్తు త్యాగ ఫలితము పొందు కోవడం తెలుసుకోవడం ద్వారా నమ్మడం ద్వారా – చేయడం ద్వారా కాదు... "ధర్మశాస్త్ర క్రియలను బట్టి ఎవడును సమర్ధింపబడడు." "ధర్మ శాస్త్రము ద్వారా పాపమును ఎరుగుదుము." "కృప సమాధానములు యేసు క్రీస్తు ద్వారా కలుగును," వారు మన దగ్గరకు వస్తారు నమ్మడం ద్వారా తెలుసుకోవడం ద్వారా – ఆయనను ఎరుగుట ద్వారా...ఆయన ద్వారా...మనము నీతి మంతులముగా తీర్చబడుచున్నాము" (ఐబిఐడి.).

"పనిచేయక, భక్తిహీనుని నీతిమంతునిగా దాని యందు విశ్వాసముంచు వానికి, వారి విశ్వాసము నీతిగా పంచబడుతున్నది" (రోమ 4:5).

"ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీయింటివారును రక్షణ పొందుదురు" (అపోస్తలులకార్యములు 16:31).

"తనకున్న అనుభవ జ్ఞానములచేత అనేకులను నిర్దోషులనుగా చేయును" (యెషయా 53:11).

క్రీస్తు యొక్క బాధ దేవుని న్యాయం సంతృప్తి. క్రీస్తు తనను తాను తెలుసుకోవడం చాలా సమర్థన తెస్తుంది. మరియు –

III. మూడవది, క్రీస్తు పాప-భరింపు పాపులకు పూర్తి పరిహారము ఇస్తుంది.

దయచేసి లేచి పాఠ్యము మళ్లీ చదువుదాం, ఆఖరి ఆరు పదాల మీద ద్యాస ఉంచి.

“అతడు తనకు కలిగిన వేదనను చూచి, తృప్తి నొందును: నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి; తనకున్న అనుభవ జ్ఞానములచేత అనేకులను నిర్దోషులనుగా చేయును” (యెషయా 53:11).

మీరు కూర్చోండి.

క్రీస్తు అనేకులను "నీతిమంతులుగా తీరుస్తాడు, వారి అతి క్రమములను ఆయననే వహిస్తాడు." అంటే, వారి పాపాలను ఆయన భరిస్తాడు. మన నీతి మత్వమునకు పునాది, మన ప్రాయశ్చిత్తానికి రక్షణకు పునాది, ఈ మాలులో బయట పర్చబడింది, "ఆయన మన అతి క్రమములను వహిస్తాడు." యెషయా 53:5 ఇలా చెబుతుంది,

"మన అతి క్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగోట్టబడెను: మన సమాధానార్ధమైన శిక్ష అతని మీదపడెను; అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది" (యెషయా 53:5).

యెషయా 53:6 చెబుతుంది,

"యెహొవా మన అందరి దోషములను ఆయన మీద మోపెను" (యెషయా 53:6).

యెషయా 53:8 చెబుతుంది,

"అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను" (యెషయా 53:8).

మరియు పేతురు 2:24 ఇలా చెబుతుంది,

"ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసికొనెను" (I పేతురు 2:24).

స్పర్జన్ అనువదించినట్లు మన పాఠ్యాన్ని, "...అతని అనుభవ జ్ఞానాన్ని బట్టి నా నీటి మత్వ సేవకుడు అనేకులను సమర్ధించగలడు."

క్రీస్తు సువార్త లో మొదటి అంశము ఇక్కడ ఉంది – తేట తెల్లముగా. క్రీస్తు శ్రమలు దేవుని నీతిని తృప్తి పరుస్తున్నాయి. క్రీస్తును ఎరుగుట నీతి మత్వాన్ని తీసికొని వస్తుంది. క్రీస్తు పాప–భరింపు పాపులకు పూర్తి రక్షణ తెలుస్తుంది. విశ్వాసం ద్వారా క్రీస్తును ఎరుగుట ద్వారా! అద్భుత విమోచన! అలాంటిది ముందు గాని తరవాత గాని సంభవించలేదు, చరిత్ర అంతటిలో!

"అతడు తనకు కలిగిన వేదనను చూచి, తృప్తి నొందును: తనకున్న అనుభవ జ్ఞానములచేత అనేకులను నిర్దోషులనుగా చేయును; అతను వారి భాదలను భరించుట కోసం" (యెషయా 53:11).

మొన్నటి రాత్రి వెస్లీ నేను నటుడు జాన్ కేరేడెన్ గురుండి అంతర్జాలంలో చదివాం. అతడు 300 సినిమాల్లో కనిపించాడు, అందరికంటే ఎక్కువగా. తను మిలన్, ఇటలిలో చనిపోయినప్పుడు, అతని మృతదేహాన్ని పెట్టెలో పెట్టి అతని కొడుకులలో ఒకరి యింటికి పంపారు. అతడు ఎక్కువగా తాగుతున్నాడు. అతడు పెట్టె తెరిచి మద్యాన్ని తన చనిపోయిన తండ్రీ నోటిలో పోసాడు.

ఇప్పుడు, చెప్పండి, మద్యాన్ని చనిపోయిన వ్యక్తి రుచి చూస్తాడా? చెయ్యడు! నేను మీతో మనలను రక్షించడానికి క్రీస్తు చేసిన అద్భుత కార్యాలు గురుండి మాట్లాడుతున్నప్పుడు, మీరు అది రుచి చూడలేరు. ఎందుకు చూడలేరు? ఎందుకంటే మీరు ఆత్మీయంగా మృతి చెందారు కాబట్టి. బైబిలు చెపుతున్నట్లుగా, "పాపములలొ చచ్చినవారై యున్నారు" (ఎఫేషియులకు 2:5). అది పాప స్వభావము. క్రీస్తు విషయాలలో మీరు చచ్చినవారు. మీరు రుచి చూడలేరు. అనుభూతి కలుగదు. దేవుని విషయాలకొస్తే, మీరు కూడ సమాధి పెట్టెలో ఉన్న జాన్ కేరడైన్ మృతదేహము వంటినారే. క్రీస్తు మీకు జీవాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నారు లేకపోతే నిత్య నాశనం అయిపోతారు! మీరు ఎలుగెత్తి మొర్రపెట్టాలి, "అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును?" (రోమా 7:24).

ఎప్పుడైతే పురుషుడు గాని స్త్రీ గాని అలా మొర్రపెడతారో, హృదయంత రంగములో నుండి, వారు రక్షింపబడడానికి సమీపంగా ఉన్నారు. అలా మీరు మొరపేట్టారా? దేవుని పట్ల నీవు మృతుడవని నీకు అనిపించిందా, క్రీస్తు ఒక్కడే నిన్ను రక్షించగలడని? మీరు క్రీస్తు కోవకు మార్చబడ్డరా? లేకపోతే, క్రీస్తు వైపు చూస్తావా, లోక పాపములను మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల? ఆయనవైపు చూస్తావా, ఆయనను ఇప్పుడు నమ్ముతావా? ఇంకొకసారి మాటలు గ్రిషిత్ పాడిన పాటలోనిది.

నీవు పాపములనుండి విడుదల కోరుకుంటున్నావా,
   దేవుని గొర్రెపిల్ల వైపు చూడు;
ఆయన నిన్ను విమోచించడానికి, కల్వరిపై మణించాడు,
   దేవుని గొర్రెపిల్ల వైపు చూడు.
దేవుని గొర్రెపిల్ల వైపు చూడు, దేవుని గొర్రెపిల్ల వైపు చూడు,
   ఆయన మాత్రమే నిన్ను రక్షింప సమర్ధుడు,
దేవుని గొర్రెపిల్ల వైపు చూడు.
(“Look to the Lamb of God” by H. G. Jackson, 1838-1914).

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసగాలు ప్రతీవారము”
అంతర్జాలములో www.realconversion.com ద్వారా చదువవచ్చు.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము డాక్టర్ క్రీగ్ టాన్ ఎల్.చాన్: యెషయా 53:1-11.
ప్రసంగమునకు ముందు పాట బెంజమన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్ గారిచే:
“Look to the Lamb of God” (by H. G. Jackson, 1838-1914).


ద అవుట్ లైన్ ఆఫ్

సంతృప్తి మరియు సమర్ధన–
క్రీస్తుచే పొందబడినవి

(ప్రసంగము సంఖ్య 13 యెషయా 53)

డాక్టరు ఆర్. ఎల్ హైమర్స్, జూనియర్ గారిచే.

"అతడు తనకు కలిగిన వేదనను చూచి, తృప్తి నొందును: నీతిమంతుడైన నాసేవకుడు జనుల దోషములను భరించి; తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును" (యెషయా 53:11).

I.    మొదటిది, దేవుని న్యాయాన్ని తృప్తిపరచు క్రీస్తు చూచి తృప్తి నొందును, యెషయా 53:11ఎ; II కోరిందియులకు 5:21; I యోహాను 2:2; రోమా 3:25.

II.   రెండవది, అనుభవ జ్ఞానము చాలామందికి న్యాయసమర్ధన తెస్తుంది, యెషయా 53:11బి; 52:13; II కోరిందియులకు 5:21; రోమా 3:20; గలతీయులకు 2:16; 3:24; యోబు 25:4; రోమా 4:5; అపోస్తలుల కార్యములు 16:31.

III. మూడవది, క్రీస్తు పాప-భరింపు పాపులకు పూర్తి పరిహారము ఇస్తుంది, యెషయా 53:11సి; యెషయా 53:5, 6, 8; I పేతురు 2:24; అఫేషీయులకు 2:5; రోమా 7:24.