Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.అనుగ్రహము!

(ప్రసంగము సంఖ్య 11 యెషయా 53)
PROPITIATION!
(SERMON NUMBER 11 ON ISAIAH 53)
(Telugu)

డాక్టరు ఆర్. ఎల్ హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

బాప్టిష్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలెస్ నందు బోధింపబడిన ప్రసంగము
శనివారము, సాయంకాలము, ఏప్రిల్ 13, 2013
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Saturday Evening, April 13, 2013

“అతన్ని నలుగగోట్టుటకు యెహొవకి ఇష్టమాయెను; ఆయన అతనికి వ్యాధి కలుగజేసేను: అతడు తనను తానే అపరాధ పరిహారార్ధ బలిచేయగా అతని సంతాగము చూచును” (యెషయా 53:10).


దేవుని గూర్చి ఈ రాత్రి నేను చెప్పుచున్నది అయిష్టం ఉండవచ్చు, అసహ్య పడవచ్చు, వినే మీలో కొందరికి. ఈ రోజుల్లో దేవునిని గూర్చి ప్రజలు తప్పుడు అభిప్రాయము కలిగియున్నారు. బైబిలులోని దేవుని గూర్చి ఎవరైనా మాట్లాడితే అది ప్రతిరకాల ప్రతి స్పందన కలుగజేస్తుంది, ప్రత్యేకంగా కొంతమంది బోధకులలో.

కొన్ని సంవత్సరాల క్రీతం ఒక సంఘ కాపరి నన్ను అడిగారు నూరు మంది యవనస్తుల సభలో నన్ను సువార్తిక ప్రసంగము చేయమని. అక్కడ మునుపు చాల సార్లు బోదించాను, కాబట్టి సంఘానికి ఏమి అవసరమో నాకు తెలుసు అనుకున్నాను. కాని ఈసారి ఇద్దరు యవ్వన కాపరులు యున్నారు. నేను రక్షణ వర్తమానము బోదించాను, దేవుని తీర్పుని గూర్చి ఒక్కరించి క్రీస్తు సువార్తను అందజేసాను. ఇర్రవై ఏడు మంది యవ్వనస్తులు ఆహ్వానానికి స్పందించారు. వారందరు మొదటి-సారిగా ఒప్పుకున్నవారు, నాలుగవ వంతు మంది కాలేజీ-వయసు గల విద్యార్దులు హాజరు అయ్యారు.

ఒకరు అనుకోని వుండే వారు ఆ ఇద్దరు యవ్వన కాపరులు ఆ గొప్ప స్పందనను ఆనందబరితులైనారని. కాని వారిద్దరి ప్రసంగం తర్వాత కొప్పు మొఖాలు పెట్టుకున్నారు. వారెప్పుడు నాకు కృతజ్ఞత చెప్పలేదు, వారు నాకు కానుక పంపలేదు, అది సహజంగా సంఘపు అలవాటు. వారి ధోరణికి నేను ఆశ్చర్యపోయాను. తరువాత నేను గ్రహించాను వారు నాగురించి ప్రతికూలుడుని అనుకున్నారని, వారిని ఆహ్వానించి ఉండాల్సింది దేవుడి పాపానికి తీర్పు తీరుస్తాడు అనే హెచ్చరిక ఇవ్వకుండా. అప్పటి నుండి నేను కనుగొన్నాను చాల మంది ఆధునిక కాపరులు వారి ఉద్దేశము పంచుకుంటారు. “కేవలము సువార్త చెప్పడము. కేవలం దేవుని ప్రేమ గురించి మాత్రమే చెప్పడం. ప్రజలని హెచ్చరించి వారికి అసౌకర్యము కలిగించకూడదు.” నేను తరచు చూసాను ఆనాటి బోధకులు ఈ రోజుల్లో. ఆలం బావిస్తారు కానీ నేను గుడ్డిగా నమ్ముచున్నాను అలా ఆలోచించడంలో పెద్ద పొరపాటు వుంది, అది అసంపూర్ణము పొరపాటు సువార్తన బోధ విషయంలో.

డాక్టర్ ఏ.డబ్ల్యు. టోజర్ అన్నారు, “ఎవడును నిజమైన దేవుని కృపను కనుగోలేదు దైవ భయమును గూర్చి తెలుసుకోకుండా" (The Root of Righteousness, Christian Publications, 1955, p. 38). అతడు సరిగ్గా చెప్పాడని నేను నమ్ముచున్నాను, "ఎవడును నిజమైన దేవుని కృపను కనుగోలేదు దైవ భయమును గూర్చి తెలుసుకోకుండా." డాక్టర్ మార్టిన్ ల్లోయడ్-జోన్స్ ఈ విసయంపై డాక్టర్ టోజర్ వలే నమ్మడా. లెయాన్ హెచ్. ముర్రే అన్నాడు, “డాక్టర్ ల్లోయడ్-జోన్స్ దేవుని ముందు మానవుని నేరారోచిత గూర్చి బోధించాడు తెలియపరచడానికి దైవిక ఉగ్రత తప్పని సరి అని…నరకంలో పాపానికి శిక్షగా…ఆయన బోధించడా బైబిలు భోధలో హెచ్చరిక ప్రధాన అంశము. నరకము ఒక ఊహ కాదు...” (Rev. Iain H. Murray, The Life of Martyn Lloyd-Jones, The Banner of Truth Trust, 2013, p. 317).

మళ్లీ డాక్టర్ ల్లోయడ్-జోన్స్ అన్నాడు, “పాపాలలో అతి భయంకరమైనిది దేవుని గూర్చి తప్పుగా ఆలోచించడం తద్వారా సహజ మానవుడు దోషారోపణ కలిగి వుండడం” (ఐబిఐడి., పేజి. 316). (ibid., p. 316). మళ్లీ, మనోవికాసంగా వుంది డాక్టర్ జాన్ అర్.రైస్, పేరు గాంచిన బాప్టిస్టు సువార్తికుడు అన్నాడు, డాక్టర్ టోజర్, డాక్టర్ లాయీడ్ చెప్పినట్టే. డాక్టర్ రైస్ చెప్పారు,

బైబిలు లోని దేవుడు భయంకరుడు, ఉగ్రుడు, పగ తీర్చుకునే వాడు, కనికరము గల దేవుడు (John R. Rice, D.D., The Great and Terrible God, Sword of the Lord Publishers, 1977, p. 12).

డాక్టర్ రైస్ అన్నాడు,

ఈ ఆధునిక బోధ అంత న్యాయ శాస్త్రము లేకుండా, కృప పాశ్చాత్తపము లేని విశ్వాసము, దేవుని ఉగ్రత లేకుండా, దేవుని కృప పరలోకం గురుండే బోధ నరకమును వదిలేసి...ఇది దేవుని సత్యము లోని మీమాప. అది దేవునిని తప్పుగా ప్రవర్తిస్తుంది. అది దేవుని వర్తమనాన్ని యదర్ధత లేకుండా చూపించడం. దేవుడు భయంకరుడు, ఉగ్రుడు, పాపానికి వ్యతిరేకంగా మండిపడే వాడు, దేవుడు పగతిర్చుకోను వాడు, భయపడాల్సిన దేవుడు, దేవుని ముందు పాపులు వణుకుతారు (ఐబిఐడి., పేజి. 13, 14). (ibid., pp. 13, 14).

ఆమెన్! వారి ప్రసంగాలు సంవత్సరాలుగా చదవడం ద్వారా, ఈ విషయంపై నేను డాక్టర్ టోజర్ తో డాక్టర్ లాయీడ్-జోన్స్ తో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. దేవుడు “పాపానికి వ్యతిరేకంగా మండి పడే దేవుడు.”

ఆవిధంగా మనం దేవుణ్ణి చూసినప్పుడు, బైబిలు ప్రదర్శిస్తున్నట్టుగా, మన పాఠ్యబాగము యెషయా 53:10 తో మనకు ఇబ్బంది లేదు. పాఠ్యము తండ్రి దేవుని కేంద్ర బిందువుగా పెట్టుకుంది మన రక్షనార్దము దేవుడు యేసుకు ఏమి చేసాడో,

“అతన్ని నలుగగోట్టుట యోహావాకి ఇష్టమాయెను; ఆయన అతనికి వ్యాధి కలుగజేసేను: అతడు తనను తానే అపరాధ పరిహారార్ధ బలిచేయగా అతని సంతాగము చూచును” (యెషయా 53:10).

“దేవుడు తన ఓరిమి వలన తన నీతిని కనపరిచెను” (రోమా 3:25).

డాక్టర్ డబ్ల్యూ.ఏ. క్రిస్ వెల్ అన్నాడు “అనుగ్రహము సిలువపై క్రీస్తు పని ద్వారా ఆయన రెండు క్రియలు చేసాడు పాపానికి వ్యతిరేకంగా దేవుని నీతిని ఎదుర్కున్నాడు, దేవుని నీతిని తృప్తి పరిచి మానవుని దోషారోపణను కొట్టివేసాడు” (W. A. Criswell, Ph.D., The Criswell Study Bible, Thomas Nelson Publishers, 1979, p. 1327, note on Romans 3:25).

“దేవుడు తన ఓరిమి వలన తన నీతిని కనపరిచెను” (రోమా 3:25).

ద రిఫార్మేషన్ స్టడీ బైబిల్ చెబుతుంది, “క్రీస్తు అనుగ్రహపు బలిగా చనిపోయాడు పాపులకు వ్యతిరేకంగా దైవిక తీర్పు తృప్తి పరిచాడు, పాప క్షమాపణ న్యాయము చేకుర్చాడు. కానీ పాలూ జాగ్రత్త పడ్డాడు చెప్పడంలో త్యాగము [దైవకూమారుని] జరిపించాయి. తండ్రి దేవుడు మనలని ప్రేమించేటట్టు ఏదైతే వ్యతిరేకమో అది నిజం- దేవుని ప్రేమ ఆయన కూమారుని మనకు అనుగ్రహించింది” (The Reformation Study Bible, Ligonier Ministries, 2005, p. 1618, note on Romans 3:25).

“తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక. మన అందరి కొరకు ఆయనను అప్పగించెను” (రోమీయులకు 8:32).

మన పాఠ్యభాగము చెబుతున్నట్టు,

“అతన్ని నలుగగోట్టుటకు యెహొవకి ఇష్టమాయెను; ఆయన అతనికి వ్యాధి కలుగజేసేను: అతడు తనను తానే అపరాధ పరిహారార్ధ బలిచేయగా అతని సంతాగము చూచును” (యెషయా 53:10).

ఈ పాఠ్యభాగములో మనం చూస్తాం క్రీస్తు శ్రమలకు నిజమైన కర్త దేవుడు. క్రీస్తు శ్రమపడి చనిపోయారు “దేవుడు నిశ్చయించిన [సంకల్పమును] ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి” (అపోస్తలుల కార్యములు 2:23). లేఖనాల ప్రకారము గొప్ప భయంకరుడైన దేవుడు క్రీస్తు శ్రమలు మరణమునకు మూలకారకుడు. యెహోను 3:16 చెబుతుంది "అద్వితీయ కుమారుని అనుగ్రహించెను” (యెహోను 3:16) రోమా 8:32 చెబుతుంది, “ఆయన...సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయ లేదు, అతనిని మన కొరకు అప్పగించెను” (రోమా 8:32). దేవుని ఉగ్రత తప్పింపబడుతుంది ఎందుకంటే అది ఆయన కుమారునిపై పడింది. మన పాఠ్యభాగము చెబుతుంది,

“అతన్ని నలుగగోట్టుటకు యెహొవకి ఇష్టమాయెను; ఆయన అతనికి వ్యాధి కలుగజేసేను: అతడు తనను తానే అపరాధ పరిహారార్ధ బలిచేయగా అతని సంతాగము చూచును” (యెషయా 53:10).

ఇక్కడ యెషయా “తెర వెనుకకు” మనలను తీసుకెల్తునాడు చెప్పడానికి తండ్రి దేవుడు తన కుమారుని పంపి సిలువ వేయించి దేవునికి అనుగ్రహము కలిగింపజేసి, తద్వారా ఆయన ఉగ్రత పాపికి బదులు యేసుపై పడింది. మన పాటములో మనము చూస్తాం (1) దేవుడు ఆయనను నలుగగోట్టాడు; (2) దేవుడు ఆయనను చింత క్రాంతున్ని చేసాడు; (3) దేవుడు అపరాధ పరిహారార్ధ బలిగా చేసాడు.

I.  మొదటిది, దేవుడు యేసుని నలుగగోట్టాడు.

“అతన్ని నలుగగోట్టుటకు యెహొవకి ఇష్టమాయెను” (యెషయా 53:10).

పదము "నలుగ గోట్టబడుట" అర్దము "నలిపివేయుట". "అతనిని నలుగగొట్టుట ఆయనకు ఇష్టమాయెను." డాక్టర్ ఎడ్వర్డ్ జె.యాంగ్ అన్నాడు, “అమాయకత్వముతో నిమిత్తము లేకుండా [క్రీస్తు], దేవుడు ఆయనను [నలపడంలో] సంతోషించాడు. ఆయన మరణము భక్తీ హీనుల చేతుల్లో లేదు కానీ ప్రభువు చేతుల్లో వుంది. అయనను చంపినవారు బాద్యత నుండి తప్పించులేరు, కానీ పరిస్థితి వారి అదుపులో లేదు. ప్రభువు అనుమతించిందే వారు చేస్తున్నారు” (Edward J. Young, The Book of Isaiah, William B. Eerdmans Publishing Company, 1972, volume 3, pp. 353-354).

నేను చెప్పినట్టుగా, ఇది రోమా 3:25 లో విశదికరించబడింది, క్రిస్తుని గూర్చి,

“పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించి తన నీతిని కనపరిచెను” (రోమా 3:25),

మరియు యోహాను 3:16 లో, అది,

“దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన అద్వితీయ కుమారుని అనుగ్రహించెను“ (యెహోవ 3:16)

పాపం వ్యతిరేకంగా అతని కోపం అనుగ్రహం, మరియు పాపాత్మకమైన మనిషి సాధ్యం మోక్షానికి చేయడానికి.

"అతనిని [నలుగ గొట్టుట] యోహావకు ఇష్ట మాయెను" (యెషయా 53:10).

గెత్సమనే వనములో ప్రారంబించి, తండ్రి దేవుడు తన కుమారుని నలుగ గొట్టి మరియు మెత్తబడ్డాడు. మత్తయి చెప్పాడు, గెత్సమనే వనములో, దేవుడు చెప్పాడు, “గొర్రెల కాపరిని కొట్టుదును” (మత్తయి 26:31). మార్కు సువార్త కూడా చెబుతుంది, గెత్సమనే వనములో, “గొర్రెల కాపరిని కొట్టుదును” (మార్కు 14:27). అలా దేవుని యేసుని చెదరగొట్టి, నలుగగొట్టి, మొత్తి మన పాపల నిమిత్తం గెత్సమనే అండ కారములొ హింసించాడు. స్పర్జన్ దానిని గూర్చిచెబుతూ ఇలా అన్నాడు,

ఇప్పుడు ప్రభువు ఒక గిన్నెను తండ్రి చేతిలో నుండి తీసుకోనవలసివచింది క్రీస్తు నుండి కాదు, యూదుల నుండి కాదు, యూద నుండి కాదు, నిద్రిస్తున్న శిష్యుల నుండి కాదు, దెయ్యము నుండి కాదు (గేస్తామనేలో), కానీ తనను ఎరిగిన తండ్రి నుండే ఆనింపబడిన గిన్నెను తీసుకోనవలసివచింది...ఆ గిన్నె ఆయన ప్రాణాన్ని ఆశ్చర్య పరిచింది అంతరంగ హృదయాన్ని కలవరపరిచింది. ఆయన [వెనుక] వచ్చి నిర్ధారించుకున్నాడు, అది [ఆగిన్నె] శారీరక శ్రమ కంటే ఘోరమైనదని, అతనిని [నలుగ గొట్టుట] యోహావకు ఇష్ట మాయెను…అది అతి దారుణమైనది, అతి భయంకరము, [ఆయనకు] తండ్రీ దేవుని హస్తాల మీదుగా వచ్చింది. అది ఏంటి అనే అనుమానాలు పోతాయి మనం చదివితే, "అతనిని మొత్తుటకు ఆయనకు ఇష్టమాయెను…" ప్రభువు [మోపెను] మన అతి క్రమములు ఆయనపై. ఆయన పాపామును ఎరుగనప్పటికినీ నీ మన కొరకు పాపమాయెను. ఇది, రక్షకునికి అసాధారణ నిస్పృహ కలిగించింది…ఆయన పాపుల [స్థానములో] శ్రమ పడ్డాడు. ఇది రహస్యము ఆ వేదనలకు [గెత్సమనేలో] సాధ్యం కాదు [పూర్తిగా వివరించడానికి] మీముందు, అది అంట సత్యము -

         ‘అది          దేవుడే, దేవునికి మాత్రమె,
దుఃఖము పూర్తిగా తెలుసు.’

(C. H. Spurgeon, “The Agony in Gethsemane,” The Metropolitan Tabernacle Pulpit, Pilgrim Publications, 1971 reprint, volume XX, pp. 592-593).

"అతనిని నలుగ గొట్టుటకు ఆయనకు ఇష్ట మాయెను" (యెషయా 53:10).

మానవాళి పాప భారమంతా, గెత్సమనేలో ఆయనపై మోపబడింది, క్రీస్తు నలుగగోట్టబడ్డాడు, నీ పాప భారము వలన ఆయన నలుగ గొట్ట బడ్డాడు, కాబట్టి

"ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్ధన చేయగా: ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బించువుల వలే ఆయెను" (లూకా 22:44).

ఏ మానవ హస్తము ఆయనను తాకలేదు. ఆయన బాధింపబడలేదు, ఇంకా కొట్టబడలేదు, దెబ్బలు కొట్టబడలేదు, సిలువ వేయబడలేదు. కాదు, తండ్రీ దేవుడే ఆయనను గెత్సమనేలో మెత్తబడి, నలుగగొట్టబడ్డాడు. తండ్రీ దేవుడే అన్నాడు, "నేను గొర్రెల కాపరిని చెదర గోట్టుదును" (మత్తయి 26:31). ఈ విషయం యెషయా ద్వారా దేవుడు ప్రవచింప చేసాడు,

"అతనిని నలుగ గొట్టుటకు ఆయనకు ఇష్ట మాయెను" (యెషయా 53:10).

ఏ నాలుక చెప్పలేదు ఆయన పొందిన ఉగ్రతను గూర్చి,
   నాకు చెందిన ఆ ఉగ్రత:
పాప భారమంతా; అంతా ఆయనే భరించాడు,
   పాపులను విమోచించడానికి!
(“The Cup of Wrath” by Albert Midlane, 1825-1909;
     to the tune of “O Set Ye Open Unto Me”).

II.  రెండవది, దేవుడు యేసును దుఃఖింప చేసాడు.

"అతనిని నలుగ గొట్టుటకు ఆయనకు ఇష్ట మాయెను; అతనికి ఆయన వ్యాధి కలుగ చేసెను…" (యెషయా 53:10).

మళ్ళీ, దేవుడే ఆయన అద్వితీయ కుమారుడు ఆయన శ్రమలు మరణము సమయములో దుఃఖము ద్వారా వెళ్ళే అనుభవములో నడిపించాడు. డాక్టర్ జాన్ గిల్ అన్నారు,

ఆయన తనను దుఃఖా క్రాంతున్ని చేసాడు [అతనికి వ్యాధి, కలుగ చేసెను]…ఆయన అతనిని వదలక, భక్తీ హీనుల చేతికి ఆయన ఆప్పగించి, మరణానికి తావిచ్చాడు: వనములో నిట్టూర్చేలా చేసాడు, ఆయన ఆత్మ అత్యంత విచారంగా ఉంది; మరియు సిలువపై, ఆయన మేకులతో కొట్టబడినప్పుడు, [మరియు] మనుష్యుల పాప భారమంతా, ఆయనపై మోపబడింది; మరియు ఆయన తండ్రీ ఉగ్రత, మరియు ఆయన తన ముఖానిని చాటు చేసుకున్నాడు, అందుకు ఆయన కేక వేసాడు, "నా దేవా, నా దేవా నీవెలా నా చెయ్యి విదిచిటివి?... [అనుమతించావు] ఆయనను శారీరకంగా, మానసికంగా శ్రమింపచేసాడు (John Gill, D.D., An Exposition of the Old Testament, The Baptist Standard Bearer, 1989 reprint, vol. V, page 315).

యేసు ఇష్ట పూర్వకంగా మొత్తడాన్ని బాధను అనుభవించాడు, యాగము సిలువ మరణము అనుభవించాడు, ఐచ్చికంగా మన పాపాల నిమిత్తము, ఆయన అన్నాడు,

"నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు, పరలోకము నుండి దిగి వచ్చితిని" (యోహాను 6:38).

"ఆయన, నిశ్చయించిన సంకల్పమను దేవుడు భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగించెను" (అపోస్తలుల కార్యములు 2:23).

"క్రీస్తు మన కోసము శాపమాయెను" (గలతీయులకు 3:13).

"ఆయనే మన పాపములకు శాంతి కరమైయున్నాడు" (I యోహాను 2:2).

"పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరిచెను" (రోమా 3:25).

ఏ నాలుక చెప్పలేదు ఆయన పొందిన ఉగ్రతను గూర్చి,
   నాకు చెందిన ఆ ఉగ్రత;
పాప భారమంతా; అంతా ఆయనే భరించాడు,
   పాపులను విమోచించడానికి!
(“The Cup of Wrath” by Albert Midlane, 1825-1909).

"అతనిని నలుగ గొట్టుటకు ఆయనకు ఇష్ట మాయెను; అతనికి ఆయన వ్యాధి కలుగ చేసెను…" (యెషయా 53:10).

III.  మూడవది, దేవుడు యేసు ప్రాణాన్ని పాపానికి అర్పణగా చేసాడు.

అందరమూ లేచి గట్టిగా పాఠము చదువుదాం, "పాపానికి అర్పణ."

"అయినను అతనిని నలుగ గొట్టుటకు ఆయనకు ఇష్ట మాయెను; అతనికి ఆయన వ్యాధి కలుగ చేసెను: నీవు అతని ఆత్మ పాపం సమర్పణ కోసం అపరాధ పరిహారార్ధ చిలిగా చేసాడు" (యెషయా 53:10).

మీరు కూర్చోండి.

పదము "అయినను" గమనించండి పాఠములో. తొమ్మిదవ వచనములో, "నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. అయినను…" (యెషయా 53:9-10ఎ). యేసు ఎన్నడూ పాపము చెయ్యనప్పటికి, "అయినను అతనిని నలుగ గొట్టుటకు ఆయనకు ఇష్ట మాయెను; అతనికి ఆయన వ్యాధి కలుగ చేసెను…" డాక్టర్ గాయెబ్ లేటిన్ వ్యాఖ్యానము ఏమంటుందంటే, "వచనము 10ఎ దిగ్బ్రాంతి కలిగిస్తుంది [క్రీస్తు] వ్యక్తిగత నీతికి వ్యతిరేక విషయ ప్రదర్శన కనిపిస్తుంది, కానీ చదవరి గుర్తు చేసుకుంటాడు, ఈ శ్రమల ప్రత్యామ్నాయ స్థితి…ఒకసారి దేవుడు కఠినంగా కనబడదు గాని ఆశ్చర్యకరంగా కృపతో కనిపిస్తాడు" (Frank E. Gaebelein, D.D., General Editor, The Expositor’s Bible Commentary, Zondervan, 1986, volume 6, p. 304).

"అయినను అతనిని నలుగ గొట్టుటకు ఆయనకు ఇష్ట మాయెను; అతనికి ఆయన వ్యాధి కలుగ చేసెను: అతడు తన్ను తానే అపరాధ పరిహారార్ధ బలిగా ఆయెను" (యెషయా 53:10).

"ఆయన…తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక, మన అందరి కొరకు అయాను అప్పగించెను" (రోమా 8:32).

"ఆయన తానే తన శరీరమయ మన పాపములను మ్రాను మీద మోసికొనేను... ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి" (I పేతురు 2:24).

"అతను మాకు చేసిన పాపం కోసం, ఎవరికీ ఏ పాపం తెలుసు; మేము అతనిని ధర్మానికి దేవుణ్ణి చేసి ఉండవచ్చు" (II కోరిందీయులకు 5:21).

"అతడు తన్ను తానే అపరాధ పరిహారార్ధ బలిగా ఆయెను" (యెషయా 53:10).

ఏ నాలుక చెప్పలేదు ఆయన పొందిన ఉగ్రతను గూర్చి,
   నాకు చెందిన ఆ ఉగ్రత;
పాప భారమంతా; అంతా ఆయనే భరించాడు,
   పాపులను విమోచించడానికి!
(“The Cup of Wrath” by Albert Midlane, 1825-1909).

"అయినను అతనిని నలుగ గొట్టుటకు ఆయనకు ఇష్ట మాయెను; అతనికి ఆయన వ్యాధి కలుగ చేసెను: అతడు తన్ను తానే అపరాధ పరిహారార్ధ బలిగా ఆయెను" (యెషయా 53:10).

క్రీస్తు పాపము కొరకు దేవుని అర్పణ. క్రీస్తు నీ స్థానములో చనిపోయాడు. నీకు ప్రతిగా, క్రీస్తు నీ కొరకు భయంకరంగా శ్రమపడ్డాడు, ఒక అర్పణముగా నీ పాపములకు వెలచెల్లించడానికి, దేవుని ఉగ్రత నీ నుండి తప్పించడానికి అదంతా ఆయనపై వేసుకున్నాడు. ఆయన కాళ్ళు చేతులలో వెళ్లిన మేకులు గూర్చి నీవు ఆలోచిస్తే నీ కొరకే అది చేయబడింది. ఆయన నీతియై అనీతిమంతులకై చనిపోయాడు, దేవునితో నిన్ను సమాధాన స్థితిలో తీసుకొనిరావడానికి, స్పర్జన్ అన్నారు,

మానవుడు పాపాన్ని బట్టి నిత్య అగ్నికి ఆహుతి చేయబడ్డాడు; దేవుడు క్రీస్తును నీ ప్రత్యామ్నాయంగా తీసుకున్నప్పుడు, క్రీస్తును ఆ నరకాగ్నికి పంపలేదు, కాని ఆయనపై దుఃఖము నిస్పృహ మోపి, నిత్యాగ్నికి మనిషి వెళ్ళకుండా వెల చెల్లింపు చేసాడు…ఆ ఘడియలో క్రీస్తు మన అందరి పాపాలు, గతం, ప్రస్తుతం, రాబోవునవి, వాటి అన్నింటికీ ఆయన శిక్షింపబడి, మనకు పడే శిక్ష తప్పించాడు, మనం ఇక శిక్షింపబడకుండా చూసాడు, ఎందుకంటే మన [స్థానములో] ఆయన శ్రమ పడ్డాడు. చూసారా, తండ్రీ దేవుడు ఏ విధంగా ఆయనను నలుగ గొట్టాడో? ఆయన అలా చెయ్యకపోతే, క్రీస్తు [అర్హత] ఆవేదన [నరకములో] మన శ్రమలను బట్టి అయి ఉండేది కాదు (C. H. Spurgeon, “The Death of Christ,” The New Park Street Pulpit, Pilgrim Publications, 1981 reprint, volume IV, pp. 69-70).

అయినను క్రీస్తు మరణము అందరిని నరకము నుండి రక్షించదు. ఎవరైతే క్రీస్తును నమ్ముతారో వారే రక్షింపబడతారు. ఆయన పాపులకై మరణించాడు, కేవలము పాపుల కొరకు; ఆయన ఎవరి కోసం మరణించారంటే, పాపులమని మదిలో ఎవరు ఒప్పుకుంటారో, క్షమించమని క్రీస్తు నడిగితే ఆయన క్షమిస్తారు.

పాపాన్ని గూర్చి నీ గ్రహింపు యేసు అవసరత ఈ లక్షణాలు చూపిస్తున్నాయి. ఆయన మరణము నీ పాపాలను స్వస్థత పరుస్తుందని. ఎవరైతే కాసేపు ఆగి ఆయన మరణము తలంచి, వెంటనే దానిని మర్చిపోతే, అలాంటి వారు వారి పాపాలను బట్టి నిత్య శిక్షకు గురి అవుతారు, ఎందుకంటే వారు క్రీస్తు సిలువపై చేసిన క్రయ ధనాన్ని తిరస్కరిస్తారు కాబట్టి.

దానిని గూర్చి ఎక్కువగా ఆలోచించండి. దీర్ఘంగా ఆలోచించండి టోప్లాడిస్ గొప్ప కీర్తన "అనుగ్రహము" లోని పదాలను గూర్చి.

నా కొరకై ఇవ్వబడింది నిష్క పాతమైన గొర్రెపిల్ల
   ఆయన తండ్రీ ఉగ్రత భరించడానికి;
నేను రక్తము కారుచున్న ఆయన గాయాలు చూసి తెలుసుకున్నాను
   నాపేరు అచట వ్రాయబడినదని.

ప్రభువు నుండి రక్త ప్రవాహం,
   ధూమ్ర వర్ణ రంగులో;
ప్రతిగాయం గట్టిగా ప్రకటిస్తుంది
   ఆయన ఆశ్చర్య ప్రేమ మానవుని పట్ల.

నా కొరకు, రక్షకుని రక్తము లభ్యము,
   సర్వ శక్తి మంతుడు ప్రాయశ్చిత్తానికి;
ఆయన హస్తాల నిచ్చాడు చొచ్చుకు పోయే మేకులకు
   ఆయన సింహసనానిని నన్ను నడిపిస్తాడు.
(“Propitation” by Augustus Toplady, 1740-1778;
     to the tune of “At the Cross”).

ఇప్పుడు, అప్పుడు, నీవు యేసును ఎందుకు నమ్మడం లేదు? ఆయన నమ్మకుండా ఏది నిన్ను ఆపేస్తుంది? ఏ రహస్య పాపాన్ని నీవు దాస్తున్నావు అయినను నమ్మకుండా ఆపుతుంది? ఏ అబద్దపు అవివేక కోరిక రక్షకుని నుండి నిన్ను ఆపుతుంది? ఏదో కోల్పుతానను భయం అది ప్రముఖ్యమని తలంచి భయపడుతున్నావ? ఏ రహస్య కారణం క్రీస్తును నమ్మకుండా ఆపుతుంది ఆయన తీర్పు నుండి తప్పించడానికి దేవుని భయంకర ఉగ్రతను భరించాడు? ఆ ఆలోచనలనన్నింటినీ వెనకపెట్టి - "దేవుని గొర్రె పిల్ల, యందు నమ్మిక ఉంచు ఆయన లోక పాపాన్ని తీసువేస్తాడు" (యోహాను 1:29). ఆయననీ కొరకు కనిపెట్టుచున్నాడు. ఆలస్యం చెయ్యవద్దు. ఇప్పుడే ఈరాత్రే ఆయనను నమ్ము. సమాధనాలిచ్చు స్థలం సిద్ధంగా ఉంది ఆయనను వెదికే వారికీ, నమ్మేవారికీ, రక్షింపబడేవారి కొరకు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసగాలు ప్రతీవారము”
అంతర్జాలములో www.realconversion.com ద్వారా చదువవచ్చు.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ప్రసంగమునకు ముందు పాట బెంజమన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్ గారిచే:
"ప్రోఫిషియేషన్" (ఆగస్టస్ టాప్ లేడి, 1740-1778;
స్వరము “ఎట్ ద క్రాస్”).

ద అవుట్ లైన్ ఆఫ్

అనుగ్రహము!

(ప్రసంగము సంఖ్య 11 యెషయా 53)
PROPITIATION!
(SERMON NUMBER 11 ON ISAIAH 53)

డాక్టరు ఆర్. ఎల్ హైమర్స్, జూనియర్ గారిచే.

“అతన్ని నలుగగోట్టుటకు యెహొవకి ఇష్టమాయెను; ఆయన అతనికి వ్యాధి కలుగజేసేను: అతడు తనను తానే అపరాధ పరిహారార్ధ బలిచేయగా అతని సంతాగము చూచును” (యెషయా 53:10).

(లూకా 16:23; రోమా 3:25; 8:32;
అపోస్తలుల కార్యములు 2:23; యోహాను 3:16)

I.   మొదటిది, దేవుడు యేసుని నలుగగోట్టాడు, యెషయా 53:10ఎ; మత్తయి 26:31; మార్కు 14:27; లూకా 22:44.

II.  రెండవది, దేవుడు యేసును దుఃఖింపచేసాడు, యెషయా 53:10బి; యోహాను 6:38.

III. మూడవది, దేవుడు యేసు ప్రాణాన్ని పాపానికి అర్పణగా చేసాడు, యెషయా 53:10సి; యెషయా 53:9-10ఎ; రోమా 8:32; I పేతురు 2:24; II కోరిందీయులకు 5:21;
యోహాను 1:29.