Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




ప్రాయశ్చిత్తం విషదీకరణ

(ప్రసంగము సంఖ్య 9 యెషయా 53)
A DESCRIPTION OF THE ATONEMENT
(SERMON NUMBER 9 ON ISAIAH 53)
(Telugu)

డాక్టరు ఆర్. ఎల్ హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

బాప్టిష్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలెస్ నందు బోధింపబడిన ప్రసంగము
ఆదివారము, ఉదయము, ఏప్రిల్ 7, 2013
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, April 7, 2013

"అన్యాయపు తీర్పు నోందినవాడై అతడు కొనిపోబడెను: అయినను అతని తరము వారిలో తన సంగతి ఆలోచించిన వారెవరు? అతడు నాజనుల యతి క్రమమును బట్టి మెత్తబడెను గదా: సజీవుల భూమిలో నుండి అతడు కొట్టి వేయబడెను" (యెషయా 53:8).


మునుపటి వచనములో యెషయా క్రీస్తు మౌనమును గూర్చి చెప్పాడు,

“వధకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని యెదుట మౌనముగా నుండునట్లు [మౌనముగా], అతడు నోరు తెరువలేదు" (యెషయా 53:7).

డాక్టర్ ఎడ్వర్డ్ జె. యాంగ్ అన్నాడు, "శ్రమలో క్రీస్తు యొక్క మౌనపు ఓర్పును నొక్కి, వక్కాణించడం ద్వారా ప్రవక్త ఇప్పుడు ఆ శ్రమల యొక్క పూర్తి వివరణ ఇస్తున్నాడు" (Edward J. Young, Ph.D., The Book of Isaiah, Eerdmans, 1972, volume 3, p. 351).

"అన్యాయపు తీర్పు నోందినవాడై అతడు కొనిపోబడెను: అయినను అతని తరము వారిలో తన సంగతి ఆలోచించిన వారెవరు? అతడు నాజనుల యతి క్రమమును బట్టి మెత్తబడెను గదా: సజీవుల భూమిలో నుండి అతడు కొట్టి వేయబడెను" (యెషయా 53:8).

ఈ వచనము సహజంగా మూడు విషయాలుగా విభజింపబడింది (1)క్రీస్తు శ్రమలు, (2) క్రీస్తు తరము, మరియు (3) మన పాపాలు కోసం క్రీస్తు యొక్క ప్రత్యామ్నాయము ప్రాయశ్చిత్తం.

I. మొదటిది, పాఠ్య భాగము క్రీస్తు శ్రమల వివరణ ఇస్తుంది.

“అన్యాయపు తీర్పు నోందిన వాడై అతడు కొని పోబడెను...సజీవుల భూమిలో నుండి అతడు కొట్టి వేయబడెను” (యెషయా 53:8).

క్రీస్తు గెత్సమనే వనములో బంధింపబడ్డాడు. ఆయన ఆలయ భటులచే ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోబడ్డాడు. వారు ఆయనను ప్రధాన యాజుకుడైన కయప ముందు ఉంచారు, తరువాత యూదా ఉన్నత న్యాయస్థానమైన, సన్ హెడ్రెన్ ముందుంచారు. ఈ న్యాయ స్థానములో ఆయన అబద్ధ సాక్షులతో ఖండింపబడ్డాడు. యేసు అన్నారు,

"ఇది మొదలు కొని మనుష్య కుమారుడా సర్వ శక్తుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘారూడడై వచ్చుటయూ మీరు చూతురు" మత్తయి (26:64).

తరువాత ప్రధాన యాజకుడు అన్నాడు,

"మీకేమి తోచుచున్నదని అడిగెను? అందుకు వారు [సన్ హెడ్రిన్] వీడు మరణమునకు పాత్రుడనిరీ. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసి, ఆయనను గుద్దిరి [కొట్టుట]; ఇతరులు వారి అరచేతులుతో అతనిని కొట్టిరి" (మత్తయి 26:66-67).

"ఉదయమైనప్పుడు, ప్రధాన యాజకులును, ప్రజల పెద్దలందరును యేసును చంపించ వలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి" (మత్తయి 27:11).

కాని వారికి రోమా చట్టము ప్రకారము అలా చేయడానికి, న్యాయ అధికారము లేదు,

"ఆయనను బాధించి, తీసి కొనిపోయి, అధిపతియైన పొంతి పిలాతుకు [రోమా] గవర్నరుకు అప్పగించిరి" (మత్తయి 27:2).

పిలాతు యేసును ప్రశ్నించాడు,

"అప్పుడతడు వారు కోరినట్టు, యేసును కొరడాలతో కొట్టించి శిలువ వేయనప్పగించెను" (మత్తయి 27:26).

ఆ విధంగా, మన పాఠ్య భాగము నెరవేరింది,

"అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొని పోబడెను [ప్రధాన యాజకుని తీర్పు ద్వారా, పిలాతు యెదుట]....సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను [శిలువపై ఆయనను మరణము ద్వారా]" (యెషయా 53:8).

యూదా సన్ హెడ్రిన్ మరియు పిలాతు ద్వారా యేసు బంధీ అవుట ఈ మాటలలో నెరవేరింది, “చెరసాల నుండి కొనిపోబడెను.” కయప ముందు విచారణ, పిలాతు ముందు, ఈ పదాన్ని నెరవెర్చింది, "తీర్పు నుండి." ఆయన చెరసాల నుండి తీర్పు నుండి కొనిపోబడ్డాడు, కల్వరి కొండకు, సిలువ వేయబడి మరణించడానికి, ఈ విధంగా ఈ పదము నెరవేరుతుంది, "సజీవుల భూమిలో నుండి అతడు కొట్టి వేయబడెను."

డాక్టర్ జాన్ గిల్ (1697-1771) ఇలా అన్నాడు,

ఆయన నిస్పృహతో తీర్పుతో కొనిపోబడ్డాడు; అనగా, ఆయన జీవితము క్రూర పద్దతిలో కొనిపోబడింది, న్యాయం చేస్తామనే నటనతో; కాని [నిజానికి] [నీచమైన] అన్యాయము జరిగింది; అన్యాయపు తీర్పు అతనిపై మోపబడింది, తప్పుడు సాక్షులు [తప్పుడు ప్రమాణానికై లంచము ఇచ్చి, అలా ఆయనపై నేరారోపణ మోపారు], మరియు ఆయన జీవితం క్రూరుల చేతులతో తీసుకోబడింది [ఇవ్వబడినట్లు] అపోస్తలుల కార్యములు 8:32, [“ఆయన వధకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని [మౌనముగా] యెదుట మౌనముగా నుండునట్లు, అతడు నోరు తెరువలేదు"]. ఆయన నిర్వీర్య స్థితిలో ఆయన తీర్పు కొనిపోబడింది: ఆయన [తీసుకోలేదు] న్యాయాన్ని (John Gill, D.D., An Exposition of the Old Testament, The Baptist Standard Bearer, 1989 reprint, volume V, p. 314).

మన పాఠ్య భాగము చెబుతున్నట్లు,

“అన్యాయపు తీర్పు నోందిన వాడై అతడు కొని పోబడెను…సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను…” (యెషయా 53:8).

II. రెండవది, పాఠ్య భాగము క్రీస్తు తరమును గూర్చిన వివరణ ఇస్తుంది.

పాఠ్య భాగము మధ్యలో ఒక విషయం ఉంది అది వివరణకు కష్టతరము,

"అన్యాయపు తీర్పు నోందిన వాడై అతడు కొని పోబడెను: అతని తరము వారిలో తన సంగతి ఆలోచించిన వారెవరు? సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను…" (యెషయా 53:8).

"ఈ తరాన్ని గూర్చి ఎవరు ప్రకటింపగలరు?" డాక్టర్ గిల్ అన్నాడు ఈ భాగము చెబుతుంది "తరము [లేక ఆయన జీవించిన తరము], ఆయన రోజుల్లో బ్రతికి ఉన్న ప్రజలు, ఆయన పట్ల వారి క్రూరత్వము, వారి భయంకరత్వము, అవి ఎంత భయంకరమంటే, [పూర్తిగా] నోటితో ప్రకటింపబడలేవు, లేక [పూర్తిగా] మానవ కలముతో వివరింపబడలేవు" (గిల్, ఐబిఐడి.). (Gill, ibid.). అది మన హృదయాలకు కన్నీళ్ళు తెస్తాయి, మనం చదివేటప్పుడు హాని చేయని దైవ కుమారుని పట్ల వారు చూపిన క్రూరత్వము, అన్యాయమును గూర్చి! జోషప్ హార్ట్ (1712-1768) దానికి విషాద గీతంలో చూపించాడు,

చూడు ఎంత శాంతంగా యేసు నిలుచున్నాడో,
   పరాభవింపబడ్డాడు [హీన స్థానములో]!
పాపులు సర్వ శక్తుని చేతులు కట్టేశారు,
   వారి సృష్టి కర్త మోముపై ఉమ్మి వేశారు.

ముళ్లతో ఆయన దేహము నలుగ గొట్టబడింది,
   రక్త ప్రవాహము ప్రతీ భాగానికి ప్రవహించింది,
ఆయన వీపు కొరదాలతో కొట్టబడింది,
కాని పదునైన కొరడా దెబ్బలు ఆయన హృదయాన్ని చీల్చేసాయి.

దిగంబరిగా మ్రానుకు వ్రేలాడదీయబడ్డాడు,
భువికి పై దివికి ప్రదర్శింపబడ్డాడు,
గాయాల రక్తము యొక్క దృశ్యము,
దెబ్బ తిన్న ప్రేమ స్థితి!
(“His Passion” by Joseph Hart, 1712-1768; altered by the Pastor;
     to the tune of “‘Tis Midnight, and on Olive’s Brow”).

జాన్ ట్రేప్ (1601-1669) అన్నాడు, “ఎవరు అతని తరాన్ని వివరించగలరు? [ఎవరు వర్ణింపగలరు] మనుష్యుల క్రూరత్వము ఆయన రోజులలో జీవించిన వారు?” (John Trapp, A Commentary on the Old and New Testaments, Transki Publications, 1997 reprint, volume 3, p. 410).

వివరణ కష్టం, మానవ పదాలలో, ఎందుకు ఆ యూద నాయకులు యేసును సిలువ వేయమన్నారో, ఎందుకు రోమా సైనికులు, " రెల్లుతో ఆయన తల మీద కొట్టి, మరియు ఆయన మీద ఉమ్మివేసి...ఆయనను సిలువ వేయుటకు తీసుకొనిపోయిరి" (మార్కు 15:19-20).

"ఆయన యందు మరణమునకు తగిన హేతుమేమియు కనబడక పోయినను, ఆయనను చంపించవలెనని వారు పిలాతును వేడుకొనిరి" (అపోస్తలుల కార్యములు 13:28).

జాన్ ట్రేప్ ఇలా అన్నాడు, "ఎవరు అతని తరమును వివరించగలరు?... ఆయన జీవించిన దినాలలోని ప్రజల దుష్టత్వాన్ని."

“అన్యాయపు తీర్పు నోందిన వాడై అతడు కొనిపోబడెను: ఎవరు అతని తరమును వివరించగలరు? సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను…” (యెషయా 53:8).

డాక్టర్ యాంగ్ అన్నాడు, "క్రియ [ప్రకటించుట] అనగా ధ్యానించుట లేక ఒక విషయాన్ని తీవ్రంగా ఆలోచించుట...వారు ఆలోచించాల్సింది [ఆయనను రోములోని అర్ధము], కానీ వారు అలా చెయ్యలేదు" (యాంగ్, ఐబిఐడి., పేజీ 352). (Young, ibid., p. 352).

ఈ రోజుల్లో, అది ఎలా వేరుగా ఉంది? మిలియనుల ప్రజలు యేసు మరణాన్ని గూర్చి విన్నారు సిలువపై గాని తీవ్రంగా ఆలోచించలేదు. "వారు ఆలోచించాల్సింది, కానీ వారు అలా చెయ్యలేదు." ఎవరు క్రీస్తు సిలువ వేయబడుటను గూర్చి లోతుగా ఆలోచిస్తారు? నువ్వు చేస్తావా? యేసు మరణాన్ని గూర్చి దాన్ని అర్ధం తెలుసుకోడానికి కొంత సమయాన్ని వెచ్చిస్తావా?

"ఎవరు…ఆయన తరాన్ని వివరించగలరు?...ఆయన రోజుల్లో ప్రజల క్రూరత్వాన్ని గూర్చి," జాన్ ట్రేప్ అన్నాడు. యేసును సిలువ వేసిన వారు ఈ రోజుల్లో మార్పు చెందని ప్రజలతో సమానము. ఈ రోజుల్లో ప్రజలు క్రీస్తు మరణ ప్రాముఖ్యతను గూర్చి తీవ్రంగా ఆలోచించడానికి ఇష్టపడడం లేదు. ఎప్పుడైతే "ద ఫేషన్ ఆఫ్ ద క్రైష్ట్" మన హళ్లలో వచ్చిందో చాలా క్రొత్త వ్యాఖ్యాతలు అన్నారు, ఆసినిమా చూసిన వారిపై ప్రగాఢ ప్రభావితం ఉంటుందని. వారు అన్నారు అది సువార్త పై ఆసక్తిని ఉజ్జీవింప చేస్తుంది. కొంత మంది అన్నారు అది ఎక్కువ సంఖ్యలో యువకులు సంఘాలకు రావడానికి దోహదపడుతుందని.

ఆ సినిమా 2004 లో వచ్చింది. అది తొమ్మిది సంవత్సరాల క్రితం. మనకు చాలా సమయముంది చూడడానికి ఆ వ్యాఖ్యాతలు సరియో కాదో. క్రీస్తు శ్రమల భయంకర నిజత్వము ఆ సినిమాలో చూపించబడింది. అది చూసిన వారి మనసుపై ఎంతో ప్రభావం కలిగించింది. వారు తమ స్వంత కేంద్రీకృత మరియు పాపాత్మకమైన జీవితాలను హక్కు తిరిగి వెళ్ళింది.

మనం చూడవచ్చు, దానిని చూసిన వారిపై చెరగని ముద్ర వేయలేదు. వారు తిరిగి తమ స్వార్ధ పూరిత పాప జీవితాలకు తిరిగి పోయారు. కానీ, ఉత్తమ వద్ద, ఇది మాత్రమే స్వల్ప పశ్చాత్తాపం ఉంటుంది. చూసారా, అదే పాపము సారాంశము. మారని ప్రజలు క్రీస్తు శ్రమలను గూర్చి కొద్ది విచారాన్ని మాత్రమే అనుభవిస్తారు. కానీ మహా అయితే, అది చాలా స్వల్పము. వారు తిరిగి గంటల తరబడి "అంతర్జాలము" పై ఉండి, ధనాపేక్ష, వారి దేవుడు లేని జీవితాలు, అంతం లేని వీడియో ఆటలు, ఆదివారం గుడికి రాకపోవడం, వారి సృష్టి కర్త దేవుని గూర్చి బహు కొద్దిగా ఆలోచించడం, వారి రక్షణార్ధం సిలువపై శ్రమబడిన క్రీస్తును పట్టించుకోకపోవడం. “ఎవరు ఆయన తరాన్ని వర్ణింపగలరు?” ఎందుకు, సిలువ వేయబడిన యేసు రోజుల ఉన్న తరము మీ తరము ఒకటే! వారు స్వలాభాపేక్షకులు, దేవుడు లేని వారు, కేవలం పాప భోగాల కొరకే బ్రతికారు. అదే పరిస్థితి మీ తరములో కూడా ఉంది కదా? మరియు, నీవు నిజంగా నిజాయితీ పరుడవైతే, అది నీకు తగిన వివరణే కదా? దేవుని గూర్చి ఆలోచించడానికి ఎంత సమయం వెచ్చిస్తావు? ప్రార్ధనలో ప్రతీ రోజు ఎంత సమయము గడుపుతావు? నీ అను దిన జీవితము ఎంత వరకు క్రీస్తు సిలువ మరణము ద్వారా ప్రభావితమవుతుంది? నీవు నిజాయితీగా ఉంటే నీవు చెప్పగలగాలి, నీవు వేరుగా లేవు ఎవరితో అంటే క్రీస్తును తిరస్కరించి, సిలువవేసి, స్వలాభ జీవితాలను జీవించని వారు. అదే పాప సారాంశము. అది పాప స్వభావము. అది నిరూపిస్తుంది నీవు పాపివని, క్రీస్తు కాలపు వారివలె నువ్వు దోషారోపణ కలిగి ఉన్నవాని. నీవు ప్రతి ఆదివారము గుడికి వచ్చినప్పటికీ, నీకు "దేవత్వ ఆకారము" ఉంది (II తిమోతి 3:5). అది నీ విషయంలో నిజము కాదా? నిజం కాదా "నీవు పాపము చేసి, దేవుడనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నావు"? (రోమా 3:23). అవన్నీ నీ విషయంలో నిజం కాబట్టి, నీవు ఎట్లు ఉగ్రత నుండి తీర్పు నుండి తప్పించుకుంటావు? రెవ. ఆయన్ హెచ్.ముర్రే, అతని ఇటీవలి పుస్తకంలో డాక్టర్ మార్టిన్ ల్లోయిడ్-జోన్స్ గూర్చి ఇలా అన్నాడు,

డాక్టర్ ల్లోయిడ్-జోన్స్ దేవుని ముందు మానవుని నేరారోపణ గూర్చి భోదించాడు, దైవిక ఉగ్రతను కూడా గ్రహించాలని, ఉగ్రత ఇప్పటికే మారని వారిపై ఉంది మరియు నరకములో పాపానికి శిక్షగా వస్తుంది...ఆ స్థలములో 'అగ్ని ఆరదు పురుగు చావదు'
(Iain H. Murray, The Life of Martyn Lloyd-Jones, The Banner of Truth Trust, 2013, p. 317).

III. మూడవది, పాఠ్య భాగము క్రీస్తు శ్రమలను గూర్చిన లోతైన అర్ధాన్ని వివరిస్తుంది.

దయచేసి లేచి నిలబడి యేషయా 53:8 గట్టిగా, చదువుదాం, ఆఖరి భాగంపై శ్రద్ధ పెట్టి, "అతడు నా జనుల యతి క్రమమును బట్టి మెత్త బడెను."

"అన్యాయపు తీర్పు నోందిన వాడై అతడు కొని పోబడెను: అతని తరము సంగతి ఆలోచించిన వారెవరు? సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను: అతడు నాజనుల యతి క్రమమును బట్టి మెత్తబడెను" (యెషయా 53:8).

మీరు కూర్చోండి.

డాక్టర్ మెర్రిల్ ఎఫ్. అంగర్ అన్నారు,

పది హేడు శతాబ్ధాలుగా [యేషయా 53 మెస్సీయా అనువాదము] కేవలం క్రైస్తవుల [మరియు] యూదా అధికారులు మద్య మాత్రమే. [తరువాత యూదులు] కావాలని ఆ అభిప్రాయాన్ని బహిస్కరించారు ఆ అధ్యాయము లోని క్రీస్తు అద్భుత నెరవేర్పు. (అంగర్, ఐబిఐడి., పేజీ 1293). (Unger, ibid., p. 1293).

ఈ రోజుల్లో చాలా మంది యూదుల వేత్తలు అంటారు యేషయా 53 వ అధ్యాయము అంత యూదుల శ్రమల గూర్చి ప్రస్తావిస్తుంది కానీ, క్రీస్తుని గూర్చి కాదు. యూదులు అబద్ధ క్రైస్తవుల చేతులలో దారుణంగా హింసించ బడినప్పటికినీ, ఇది మన పాఠ్య భాగము నిజ అర్ధము కాదు, ఎందుకంటే అది చెబుతుంది, "అతి క్రమము [పాపము] ప్రజలది ఆయనపై మోపబడెను" (యెసయా 53:8). ఇందులో "మన అతి క్రమములు ఆయనపై మోపబడెను" డాక్టర్ హెన్రీ ఎమ్. మోరిస్ అన్నాడు, "ఆయన ‘నా ప్రజల’ - కొరకు మరణించాడు" అంటే, ఇజ్రాయేలు - చూపించబడుతున్న [క్రీస్తు] ఈ భాగములో ఇజ్రాయేలు కాదు, చాలామంది భావించినట్లు" (Henry M. Morris, Ph.D., The Defender’s Study Bible, Word Publishing, 1995, p. 767). ఈ విధంగా, నిజమైన అర్ధం. యూదా ప్రజలు కాదు గాని, క్రీస్తు వారి స్థానములో శ్రమ పడ్డాడు, వారి పాపాల కొరకు, పాప పరిహారం చెల్లించాడానికి, మన కొరకు, ఆయన సిలువ వేయబడ్డాడు, మన పాప పరిహరార్ధ నిమిత్తము!

డాక్టర్ జాన్ గిల్ అన్నాడు "నా జనుల అతి క్రమము అతనిపై పడెను," ఇది యూదులకు ఎన్నికైన క్రైస్తవులకు వర్తిస్తుంది - క్రీస్తు శ్రమ పడ్డాడు ఇజ్రాయేలీయుల పాపాలకు "ఆయన ప్రజల" పాపాల కొరకు, వారు క్రైస్తవులు. (గిల్, ఐబిఐడి., పేజీ 314). నేను అనుకుంటాను డాక్టర్ గిల్ ఈ మాటల అసలు అర్ధాన్ని తీసుకొచ్చాడు,

"అతడు నా జనుల అతి క్రమములను బట్టి మెత్తబడెను" (యెషయా 53:8).

క్రీస్తు సిలువపై “కొట్టబడ్డాడు” అతని ప్రజల పాపాల కొరకు, వారు యూదులైన, ఆన్యులైనా. ఆయన మరణము ప్రత్యామ్నాయం, క్రీస్తు మన పాపాల కోసం చనిపోవడం. అది అర్ధవంతం, పాపినుండి దేవుని కోపాన్ని మరల్చడం.

కానీ ఒక షరతు ఉంది. క్రీస్తు నీ పాపాల కొరకు వెల చెల్లించాలంటే, నీవు విశ్వాసంతో ఆయనను నమ్మాలి. సిలువపై క్రీస్తు వెల - చెల్లింపు ఆయనను నమ్మని వారిని రక్షింప లేదు. నీవు ఎప్పుడైతే యేసుకు సమర్పించుకుంటావో అప్పుడే నీవు రక్షకుని రక్తము ద్వారా శుద్ది చేయబడుతావు.

ఈ వచనంలో ఈ సత్యాలన్నీ చూస్తావు అయిన తప్పిపోవచ్చు. ఈ విషయాలన్నీ దెయ్యాలకు భాగా తెలుసు, కానీ అది రక్షింపబడవు. అపోస్తలుడైన యాకోబు అన్నాడు, "దయ్యాలు [దయ్యాలు] నమ్ముతాయి, వణుకుతాయి" (యాకోబు 2:19). దయ్యాలకు క్రీస్తు మరణాన్ని గూర్చి కేవలం "తల జ్ణానము" ఉంది. నీవు మారాలనుకుంటే ఇంకా ముందుకు వెళ్ళాలి. నీవు నిజానికి క్రీస్తుకు అప్పగించుకొని ఆయనను నమ్మాలి. దేవుని కృప ద్వారా నీవు మారాలి, లేకపోతే నరకానికి పోతావు ఆయన సిలువను గూర్చిన కంఠతపెట్టిన తలంపులతో.

వినండి డాక్టర్ ఎ. డబ్ల్యూ. టోజరు ఏమన్నాడో "నిర్ణయత్వత" ను గూర్చి, మరియు నిజ మార్పు గూర్చి డాక్టర్ టోజరు అన్నాడు,

మతమార్పిడి వ్యవహారమంతా ఒక యాంత్రిక ఆత్మ లేనిది అయిపోయింది. ఇప్పుడు విశ్వాసమనేది నీతి పర జీవితానికి ఆధార రహితంగా వ్యక్తమవుతుంది, అహంభావ భావనా అవమానము లేకుండా. క్రీస్తును “స్వీకరించవచ్చు” ఎలాంటి ప్రత్యేక ప్రేమ ఆయన పట్ల లేకుండా (A. W. Tozer, D.D., The Best of A. W. Tozer, Baker Book House, 1979, page 14).

“మతమార్పిడి వ్యవహారం యాంత్రికము ఆత్మ లేనిది” - మరియు, నేను కలుపుతాను తరుచూ అది క్రీస్తు లేనిదిగా ఉంది! "నిర్ణయకులు" మీరు త్వరగా ప్రార్ధించాలని, బాప్టిస్త్యము పొందాలని అనుకుంటారు. అది అక్కడితో ఆగిపోతుంది. తరుచూ క్రీస్తు మరణము పునరుత్ధానము ప్రకటింపబడవు. తరుచూ పూర్తిగా వాటిని విస్మరిస్తారు! బైబిలు బోధించేది ఇది కాదు. బైబిలు బోధిస్తుంది నీవు నీ పాపపు ఆరోపణను గ్రహించాలి, పాపము నుండి తప్పించుకోడానికి వేరే మార్గము లేదని, క్రీస్తు దగ్గరకు రాకుండా, నిస్సహాయంగా ఆయన ముందు నువ్వు క్రుమ్మరించుకోవాలి, మనస్పూర్తిగా ఆయన యందు నమ్మిక ఉంచాలి. అప్పుడు మాత్రమే, అనుభవ పూర్వకంగా తెలుసుకుంటావు, ప్రవక్త యెషయా చెప్పిన మాటల భావము,

"అతడు నా జనుల అతి క్రమమును బట్టి మెత్తబడెను" (యెషయా 53:8).

నీవు క్రీస్తును విశ్వాసము ద్వారా నమ్మితే, ఆయన రక్తము నీ పాపాలన్నింటిని కడిగివేస్తుందని నీవు నమ్మితే, నువ్వు మారతావు - అలా అవకముందు జరగదు. లేదు, అలా ఎప్పుడూ జరగదు! నీవు తప్పకుండా యేసు క్రీస్తును నమ్మాలి నీవు రక్షింప బడాలంటే!

లేచి నిలబడదాం. యేసును నమ్మడాన్ని గూర్చి మీరు మాతో మాట్లాడగొరితే, ఇప్పుడే మీ కుర్చీలు వదిలి ఆవరణ వెనుక భాగానికి రండి. డాక్టర్ కాగన్ నిశ్శబ్ధ గదికి మిమ్మిల్ని తీసుకొని వెళ్ళి అక్కడ క్రీస్తును సమర్పణను గూర్చి ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా కడుగబడడాన్ని గూర్చి మీతో మాట్లాడతాడు! లీ గారు, స్పందించిన వారి కొరకు ప్రార్ధించండి. ఆమెన్.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసగాలు ప్రతీవారము”
అంతర్జాలములో www.realconversion.com ద్వారా చదువవచ్చు.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము డాక్టర్ క్రీగ్ టాన్ ఎల్.చాన్:యెషయా 53:1-8.
ప్రసంగమునకు ముందు పాట బెంజమన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్ గారిచే:
"బ్లెస్సెడ్ రిడీమరి" (అవిస్ బి. క్రిష్టియాన్ సెన్ గారిచే, 1895-1985).


ద అవుట్ లైన్ ఆఫ్

ప్రాయశ్చిత్తం విషదీకరణ

(ప్రసంగము సంఖ్య 9 యెషయా 53)
A DESCRIPTION OF THE ATONEMENT
(SERMON NUMBER 9 ON ISAIAH 53)

డాక్టరు ఆర్. ఎల్ హైమర్స్, జూనియర్ గారిచే.

"అన్యాయపు తీర్పు నోందినవాడై అతడు కొనిపోబడెను: అయినను అతని తరము వారిలో తన సంగతి ఆలోచించిన వారెవరు? అతడు నాజనుల యతి క్రమమును బట్టి మెత్తబడెను గదా: సజీవుల భూమిలో నుండి అతడు కొట్టి వేయబడెను" (యెషయా 53:8).

(యెషయా 53:7)

I.   మొదటిది, పాఠ్య భాగము క్రీస్తు శ్రమల వివరణ ఇస్తుంది,
యెషయా 53:8ఎ; మత్తయి 26:64, 66-67; 27:1-2, 26;
అపోస్తలుల కార్యములు 8:32.

II.  రెండవది, పాఠ్య భాగము క్రీస్తు తరమును గూర్చి వివరణ
ఇస్తుంది, యెషయా 53:8బి; మార్కు 15:19-20;
అపోస్తలుల కార్యములు 13:28; II తిమోతీ 3:5; రోమా 3:23.

III. మూడవది, పాఠ్య భాగము క్రీస్తు శ్రమలను గూర్చిన లోతైన
అర్ధాన్ని వివరిస్తుంది, యెషయా 53:8 సి; యాకోబు 2:19.