Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
గొర్రె పిల్ల యొక్క మౌనము

(ప్రసంగము సంఖ్య 8 యెషయా 53)
THE SILENCE OF THE LAMB
(SERMON NUMBER 8 ON ISAIAH 53)
(Telugu)

డాక్టరు ఆర్. ఎల్ హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

బాప్టిష్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలెస్ నందు బోధింపబడిన ప్రసంగము
శనివారము, సాయంత్రము, మార్చి 24, 2013
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, March 24, 2013

"అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు: వధకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని యెదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు, అతడు నోరు తెరువలేదు" (యెషయా 53:7).


క్రెస్తవ హత సాక్షులు పలికిన ఆఖరి మాటలు వినడం ఎప్పుడూ ప్రేరేపితంగా ఉంటుంది. వారు చనిపోయేటప్పుడు పలికే మాటలు మన హృదయాలను లేవనెత్తుతాయి. రెండవ శతాబ్ద ఆరంభంలో పోలీకార్ప్ ఒక ప్రసంగీకుడు. ఆంగ్లములో అతని పేరు పోలీకార్ప్, లేటిన్ లో పోలీకార్పస్. పోలీకార్ప్ అపోస్తలుడైన యోహానుకు విద్యార్ధి. సంవత్సరాల తరువాత అతడు న్యాయమూర్తి ముందు నిలిచాడు, అన్నాడు, "నీవు వ్రుద్ధుడవు. నీవు చనిపోవనవసరము లేదు...ప్రమాణము చెయ్యి నేను విడుదల చేస్తాను. ‘కైసరు ప్రభూ,’ అని ధూపము చేస్తే ప్రమాదమేంటి? క్రైసర్ పై ప్రమాణం చేస్తే నేను సంతోషంగా నిన్ను విడుదల చేస్తాను. క్రీస్తును కాదంటే నీవు బ్రతుకుతావు."

పోలికార్పస్ జవాబిచ్చాడు, "ఎనుబది ఆరు సంవత్సరాలు నేను [క్రీస్తు]ను సేవించాను, ఆయన నాకు ఏ తప్పు చెయ్యలేదు. నన్ను రక్షించిన రాజును నేనెట్లు దేవ దూషణ చెయ్యగలను?" న్యాయమూర్తి అన్నారు, "నేను నిన్ను అగ్నిలో దహించి వేస్తాను." పోలీకార్పస్ జవాబిచ్చాడు, "నీవు భయ పెట్టుచున్న అగ్ని ఒక గంట కాలి అయిపోతుంది. రాబోవు తీర్పు యొక్క అగ్ని [నశించు] వారికుండు నిత్య శిక్షను గూర్చి నీకు తెలుసా? వచ్చి, నీవేమి చేస్తావో చెయ్యి."

దానికి న్యాయమూర్తి తన వారిని గట్టిగా ప్రజలకు చెప్పడానికి, "పోలీకార్ప్ తానూ క్రెస్తవుడనని ఒప్పుకున్నాడు!" "సజీవంగా దహించండి!" అక్కడి గుంపు అరిచారు. అగ్ని సిద్ధపర్చబడింది. చంపువాడు పోలీకార్ప్ ను సమీపించి కట్టెకు కొట్టాడు. పోలీకార్ప్ నెమ్మదిగా అన్నాడు, "ఉన్న పాటున నన్ను వదలండి. అగ్నిని సహించడానికి అనుమతి ఇచ్చిన వాడు నిశ్చలంగా అందులో ఉండడానికి శక్తి నిస్తాడు, మీ మేకుల సంకెళ్ళ నుండి."

అప్పుడు పోలీకార్ప్ ప్రదనలో స్వరము పెంచి, దేవుని స్తుతించాడు "చనిపోడానికి తగుదునని." అగ్ని వెలిగింపబడింది, మంట ఆయన చుట్టూముట్టింది. అతని శరీరం మంటలలో కాలనందుకు, శిక్షించువాడు బల్లెముతో పొడిచాడు. ఆవిధంగా పోలీకార్పస్ జీవితము ముగిసింది, ఆయన స్మిర్ధ్న సంఘ కాపరి, అపోస్తలుడైన యోహాను శిష్యుడు (see James C. Hefley, Heroes of the Faith, Moody Press, 1963, pp. 12-14).

స్పర్జన్ చెప్పాడు "జాన్ బౌచిర్, మన ఘనమైన బాప్టిస్టు హత సాక్షిని గూర్చి...ఆమె క్రేమర్ అండ్ రిడ్లీ ముందుకు తేబడినప్పుడు," చర్చ ఆప్ ఇంగ్లాండ్ ఇద్దరు బిషప్ లు, వారు ఆ బాప్టిష్టురాలు కాల్చబడడానికి అప్పగించి, కాల్చబడటం సులభమైన చావని ఆమెతో అన్నారు. ఆమె వారితో అన్నారు, "నేను మీలాగునే క్రీస్తు సేవకురాలను; మీరు మీసేవ సహొదరుని చంపితే, [జాగ్రత్త] దేవుడు రోమా ఎలుగు బంటిలను మీపై పంపిస్తాడు, మీరు కూడా దేవుని కోరకు శ్రమపడాలి." ఆమె సరిగ్గా అన్నారు, ఎందుకంటే తరువాత వీరిరువురు కూడా హత సాక్షులయ్యారు! (see C. H. Spurgeon, “All-Sufficiency Magnified,” The New Park Street Pulpit, volume VI, pp. 481-482).

వారు వేరు వేరు శతాబ్దాలకు చెందినప్పటికీ, పోలీకార్ప్ మరియు జాన్ బౌచిర్ శక్తివంతమైన ప్రకటనలు చేసారు. విశ్వాసమును గూర్చి వారు అగ్నికి ఆహుతి అవకముందు, అయినను యేసు క్రీస్తు ప్రభువు ఆలాగు చేయలేరు శ్రమతో మరణముతో బాదింపబడినప్పుడు! అవును, ఆయన ప్రధాన యూజునితో మాట్లాడాడు. అవును, రోమా గవర్నరు పొంతి పిలాతుతో మాట్లాడాడు. కాని మరణానికి అప్పగింపబడే సమయము వచ్చినప్పుడు, సిలువ వేయబడవలసినప్పుడు ప్రవక్తయైన యెషయా మాటలలో వివరించాడు ఆశ్చర్యకర సత్యము ఆయన మౌనముగా ఉన్నాడని!

"అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు: వధకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని యెదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు, అతడు నోరు తెరువలేదు" (యెషయా 53:7).

వారు ఆయనను కొట్టుచున్నప్పుడు ఒక్క మాట కూడ పలుకలేదు! వారు ఆయనను సిలువవేయుచున్నప్పుడు ఒక్క మాట కూడ అనలేదు! మన పాఠ్యభాగానికి వచ్చి లోతుగా చేరుదాం మూడు ప్రశ్నలు అడుగుకొని సమాధానాలు చెప్పుట ద్వారా.

I.  మొదటిది, యేసు అను ఈ వ్యక్తి ఎవరు?

ప్రవక్త క్రింది విధముగా పలికిన, ఆ వ్యక్తి ఎవరు,

"అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు…"? (యెషయా 53:7).

బైబిలు చెప్తుంది ఆయన మహిమాయుక్త ప్రభువని, త్రిత్వములొ రెండవ వ్యక్తి, మానవ శరీరములో దైవ కుమారుడు! తెగ చెబుతున్నట్టుగా, "దేవ దేవుడు." యేసుని గూర్చి మనము కేవలము సామాన్య ఉపదేశకుని గాని, సాదారణ ప్రవక్తగా గాని ఎప్పుడూ అనుకోకూడదు! ఈ విధంగా తలంచడానికి ఆయన మనకు అవకాశము ఇవ్వలేదు, ఆయన ఏమన్నారంటే,

"నేనును తండ్రియును యేకమై ఉన్నాము" (యెహాను 10:30).

మరల, అతడు చెప్పెను ,

“అందుకు, యేసు పునరుత్ధానమును జీమును నేనే: నాయందు విశ్వసముంచు వాడు, చనిపోయినను, బ్రతుకును" (యోహాను 11:25).

ఏ ఇతర వ్యక్తి అయిన ఆ విషయాలు చెప్పి ఉంటే, మనము అతనిని దయ్యము పట్టిన వానిగాను, బ్రమలో ఉన్న వానిగాను, మరలు కోల్పబడిన వానిగాను, మతి బ్రమణము చెందిన వానిగాను తలస్తాము! కాని యేసు తానూ, తండ్రీ దేవుడు ఒకటని చెప్పినప్పుడు, ఆయన అన్నాడు, "నేను పునరుత్ధానమును, జీవమును," అలాంటి పదాలు, మనం ఆగుతాం, మనలో అతి చెడ్డవారు కూడ, ఆశ్చర్యపడతాం ఆయన చెప్పేది సత్యము కాకపొతే!

నేను సి,ఎస్. లెవిస్ అన్ని సార్లు ఏకీభవించనప్పటికినీ, యేసు క్రీస్తుని గూర్చి ఆయన ఇచ్చిన ఈ క్రిందటి పరిచిత విషయంతో మనం ఎట్లు ఏకీభవించకుండా ఉండగలం? సి.ఎస్. లివిస్ అన్నాడు,

నేను ప్రయత్నిస్తున్నాను ఆయనను గూర్చి ప్రజలు అవివేకముగా మాట్లాడడం ఆపడానికి: "నేను యేసును ఒక గొప్ప బోధకునిగా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాను, కాని తానే దేవుడనని చెప్పుకోవడం అంగీకరించను." ఆ విషయాన్ని మనము చెప్పనేకూడదు. ఒక సామాన్య వక్త యేసు చెప్పిన విషయాలు చెబితే అతడు ఒక నైతిక బోధకుడు కాలేడు. అతడు ఒక నపుంసకుడైనా కావాలి - ఆ వ్యక్తి ఏమంటాడంటే తానె పొదగబడుచున్న గుడ్డునని - లేక నరకములోని సాతానని. మీ ఎన్నిక మీరు చేసుకోవాలి. ఈ మనుష్యుడు దైవ కుమారుడై ఉండాలి: లేక ఒక పిచ్చివాడు, లేక అంతకంటే హీనము. ఒక అవివేకి కొరకు అతని నోరు మూయించవచ్చు. అతనిపై ఉమ్మి వేసి చంపవచ్చు ఒక దయ్యములా; లేక ఆయన పాదముపై బడి ఆయనను ప్రభువా, దేవుడా అనవచ్చు. కాని మనము ఆయనను గూర్చి భక్తితో కూడిన అవివేకానికి రావద్దు ఆయన గొప్ప మానవ బోధకునిగా. అది ఆయన మనకు తెరిచి ఉంచలేదు. ఆ అభిప్రాయం కూడా లేదు (C. S. Lewis, Ph.D., Mere Christianity, Harper Collins, 2001, p. 52).

"నీవు ఆయనపై ఉమ్మి వేయవచ్చు, దయ్యము వలే చంపవచ్చు; లేక నీవు ఆయన పాదములపై పడి తండ్రీ, దేవా అని పిలువవచ్చు...నీ ఎన్నిక నీవే చేసుకోవాలి," యేసు ఏమన్నారంటే,

"నేనే మార్గమును, సత్యమును, జీవమునై యున్నను: నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు" (యోహాను 14:6).

ఇక్కడ ఒక విషయం ఉంది! నీవు యేసును బుద్దమతముతో కాని, హిందూ మతముతో కాని, ఇస్లాముతో కాని కలుపకూడదు, ఎందుకంటే యేసు "ఆయన మనకు అది తెరిచి యుంచలేదు. ఆయనకు ఉద్దేశము లేదు." క్రీస్తు మనకు వేరే మార్గాలు ఇవ్వలేదు. ఆయన అన్నాడు, "నా ద్వారానే తప్ప, ఎవడును తండ్రి యొద్దకురాడు." సి. ఎస్. లూయిస్ చెప్పినట్లు, "నీవు ఆయనపై ఉమ్మి వేయవచ్చు, చంపవచ్చు...లేక ఆయన కాళ్ళపై బడి ఆయనను తండ్రి, దేవా అని పిలువవచ్చు...నీ ఎన్నిక నీవే చేసుకోవాలి." ఇది గాని అది కాని. ఏ ఒక్కరు దీనిపై తటస్థంగా ఉండలేరు! వారు నటించవచ్చు, కాని వారు తటస్థంగా ఉండలేరు. "అది ఆయన మనకు తెరిచి ఉంచలేదు."

II.  రెండవది, ఎందుకు యేసు సమర్ధించుకోలేదు వారు హింసించి చంపే ముందు?

ఎందుకలా

"అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు"? (యెషయా 53:7).

గొప్ప శాస్ర్తవేత్త ఆల్ బర్ట్ ఐన్ స్టీన్ క్రెస్తవుడు కానప్పటికీ, ఇలా అన్నాడు,

ఏ ఒక్కరు [నాలుగు] సువార్తలు యేసు సన్నిధిని అనుభవించకుండా చదవలేరు. ప్రతి మాటలో ఆయన వ్యక్తిత్వం ప్రస్పుటిస్తుంది. అలాంటి జీవితంలో ఏ మాయ నింపబడలేదు. (Albert Einstein, Ph.D., The Saturday Evening Post, October 26, 1929).

అయినను అపహసింపబడి సిలువ వేయబడినప్పుడు యేసు ఏమీ పలుక లేదు! ఎందుకు క్రీస్తు రక్షించుకోలేదు ఆయనను కొట్టి చంపినా వారి నుండి? ప్రాన్స్ వేదాంతి రూషియా, ఎతీష్టు అయినప్పటికినీ, ఆశ్చర్యకరంగా ప్రశ్నకు సమాధానము యిచ్చాడు, ఇలా అన్నాడు,

సోక్రటీస్ వేదాంతి వలే బ్రతికి, చనిపోయినప్పుడు, యేసు దేవునిలా బ్రతికి, చనిపోయాడు. (జీన్. జాక్యూస్ రూస్సియా, ప్రెంచ్ వేదాంతి, 1712-1778).

యేసు ఆయనను సమర్ధించుకోలేదు, ఎందుకంటే భూమి మీదకు రావడంలో ఆయన ఉద్దేశము శ్రమపడి సిలువపై మరణించడం. సిలువ వేయబడుటకు ఒక సంవత్సరము ముందు యేసు అది తేట పరిచాడు.

"అప్పటి నుండి తానూ యేరూష లేమునకు వెళ్లి పెద్దల చేతను, ప్రధాన యూజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు నొంది, చంపబడి, మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేసెను" (మత్తియి 16:21).

ద అప్లైడ్ న్యూ టెస్టమెంట్ కామెంటరీ ఏమంటుందంటే,

పేతురు యేసు క్రీస్తు అని, మెష్టియా అని, సజీవుడైన దేవుని కుమారుడని [మార్కు 8:29] ఒప్పుకున్నాడు. కాని [పేతురు] ఇంకా అర్ధం చేసుకోలేదు క్రీస్తు ఏమి చెయ్యడానికి భూమి మీదికి వచ్చాడో అని. ఇతర యూదుల లాగే ఆయన అనుకున్నాడు, క్రీస్తు భూరాజుగా ఉండడానికి వచ్చాడని. కాబట్టి, యేసు ఎప్పుడైతే [తాను] శ్రమ పడాలని... చంపబడాలని, పేతురు అంగీకరించ లేకపోయాడు. అలా అన్నందుకు యేసును గద్దించాడు. యేసు అన్నాడు మూడు రోజుల తరువాత [తాను] తిరిగి లేస్తానని. యేసుకు తెలుసు, తానూ చనిపోతానని, మూడవ దినాన మృతులలో నుండి లేస్తాడని. శిష్యులు ఈ విషయాన్ని ఏ మాత్రము అర్ధము చేసుకోలేదు (Thomas Hale, The Applied New Testament Commentary, Kingsway Publications, 1996, pp. 260-261).

కాని మనం ఇది అర్ధం చేసుకోవాలి. బైబిలు ఇలా అంటుంది,

"పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకము లోనికి వచ్చెను" (I తిమోతీ 1:15)

మన పాపాల కొరకు సిలువపై ఆయన మరణము ద్వారా, ఆయన పునరుత్ధానము ద్వారా, మనం జీవం పొందుకున్నాం. యేసు మాట్లాడలేదు, సమర్ధించుకోలేదు ఆయన అపసహింపబడి సిలువ వేయబడినప్పుడు ఎందుకంటే, ఆయన గవర్నరు పిలాతుతో అన్నాడు, "ఇందుకే పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని" (యోహాను 18:37).

III.  మూడవది, పాఠ్యభాగము ఏమి చెబుతుంది యేసు యొక్క మౌన శ్రమలను గూర్చి?

దయ చేసి లేచి యెషయా 53:7 మరియొక సారి గట్టిగా చదువుదాం.

"అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు: వధకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని యెదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు [మౌనముగా], అతడు నోరు తెరువలేదు" (యెషయా 53:7).

మీరు కూర్చోండి.

"అతడు అణగగొట్టబడి, బంధింపబడ్డాడు." డాక్టర్ యాంగ్ అన్నాడు దీనిని తర్జుమా చెయ్యవచ్చు, "ఆయన [అనుమతించాడు] బాధింప బడడానికి." "బాధింపబడడంలో శ్రమ కలిసి ఉంది...అతని నోటితో వద్దన లేదు, కాదన లేదు. ఒకరు [ఈ ప్రవచనాన్ని] చదవలేదు, నెరవేర్పును గూర్చి ఆలోచించకుండా పిలాతు న్యాయస్థానము ఎదుట నిజ సేవకుడు ఒక్క మాటైనా పలుకలేదు. ‘బాధింపబడినప్పుడు, తిరగబడలేదు’ [ఆయన శ్రమ పడినప్పుడు భయపడలేదు]" (Edward J. Young, Ph.D., The Book of Isaiah, Eerdmans, 1972, volume 3, pp. 348-349).

"కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా? అని ఆయనను అడిగెను. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తర మియ్యలేదు; గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను" (మత్తయి 27:13-14).

"ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా: ఒక మాటకైనను అతనికి ఉత్తర మియ్యలేదు. పిలాతు ఆయనను చూచి మరల నీవు ఉత్తర మేమియు చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుమనెను. అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు; గనుక పిలాతు ఆశ్చర్య పడెను" (మార్కు 15:3-5).

"అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు: వధకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని యెదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు [మౌనముగా], అతడు నోరు తెరువ లేదు" (యెషయా 53:7).

యెషయా 53:7 లో క్రీస్తు గొర్రె పిల్లతో పోల్చబడ్డాడు. పాత నిబంధన గ్రంధములో, మనుష్యులు గొర్రెలను దేవునికి అర్పించడానికి తెచ్చేవారు. గొర్రెను అర్పనకు సిద్దపరచడానికి, దానిని చీల్చి, ఉన్నిని తొలగించే వారు. గొర్రె పిల్ల చీల్చునప్పుడు మౌనంగా నిలబడింది. వధకు తేబడు గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు వాని యెదుట గొర్రె మౌనముగా ఉండునట్లు, "అతడు నోరు తెరువలేదు" (యెషయా 53:7).

బాప్తిష్మమిచ్చు యోహాను కూడ యేసును అర్పింపబడు గొర్రె పిల్లకు పోల్చాడు, ఆయన అన్నాడు,

"ఇదిగో లోక పాపమును మోసికోనిపోవు, దేవుని గొర్రె పిల్ల" (యోహాను 1:29).

నీవు ఎప్పుడైతే విశ్వాసం ద్వారా యేసును నమ్ముతావో, సిలువపై ఆయన చేసిన త్యాగము నీ పాపాల గురుండి, నేరారోపణ లేకుండా దేవుని యెదుట నిలబడడానికి. నీ నేరారోపణ ఆయన మరణము ద్వారా సిలువపై కొట్టివేయబడుతుంది. ఆయన కార్చిన రక్తము ద్వారా మీ పాపాలు కడగబడ్డాయి.

డేవిడ్ బ్రెయినార్డ్, అమెరికా భారతీయులకు ప్రసిద్ద మిషనరీ, ఈ సత్యాన్ని, ఆయన సేవ అంతటిలో ప్రకటించాడు. అమెరికా భారతీయులకు ఆయన బోధిస్తున్నప్పుడు, అన్నాడు, "నేనెప్పుడూ సిలువ వేయబడిన యేసు నుండి పోలేదు. నేను కనుగొన్నాను ఒకసారి క్రీస్తు త్యాగాన్ని గూర్చి…ప్రజలు పూర్తిగా గ్రహించినప్పుడు, నేను వారికి ఎక్కువ సూచనలు ఇవ్వనవసరము లేదు వారి వైఖరిని మార్చడంలో" (Paul Lee Tan, Th.D., Encyclopedia of 7,700 Illustrations, Assurance Publishers, 1979, p. 238).

నాకు తెలుసు ఈ రోజు అది నిజమే. ఒకసారి అది చూడండి

"లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను" (I కోరిందీయులకు 15:3),

ఒక సారి నీవు సిలువ వేయబడి తిరిగి లేచిన రక్షకునికి నీవు సమర్పించుకుంటే, నీవు క్రెస్తవుడవు. మిగిలినది వివరించడానికి అర్ధము చేసుకోడాలని సులభము. విశ్వాసము ద్వారా నిజమైన క్రీస్తు నీవు రక్షింపబడ్డావు!

ఆయన చనిపోతుండగా, స్పర్జన్ అన్నాడు, "నా వేదాంతము నాలుగు చిన్న పదాలలో ఉంది – ‘యేసు నాకై మరణించాడు.’ అదే నేను బోధిస్తాను అని నేను అనను నేను లేవబడాలంటే, చనిపోవడం ఎక్కువ అవసరం. యేసు నాకై మరణించాడు" (టేన్. ఐబిఐడి.) (Tan, ibid.). నీవు అది చెప్పగలవా? చెప్పగలదా? "యేసు నాకై మరణించాడు"? లేకపోతే, తిరిగి లేచిన రక్షకునికి ఈ రాత్రి నీవు సమర్పించుకుంటావా? చెప్తావా, "యేసు నాకై మరణించాడు, నేను సమర్పించుకుంటాను పూర్తీ రక్షణ కొరకు నమ్ముతాను ఆయన రక్తము ద్వారా నీటి ద్వారా"? దేవుడు అలాంటి విశ్వాసము మీకిచ్చును గాక. ఆమెన్.

దయచేసి లేచి నిలబడి పాటల కాగితములో ఆరవ పాట పాడుకుందాం, "వీలవుతుందా?" చార్లెస్ వెస్లీ చే.

నేను పొందుకొనేది అదే కావచ్చు
   ఆ శక్తి రక్షకుని రక్తములో?
నాకై మరణించి, నొప్పికి కారకులెవరు?
   నాకై, ఆయనకై వెదకే చావు?
ఆశ్చర్య ప్రేమ! ఏ విధంగా,
   నా దేవుడు, నాకై మరణించే?
ఆశ్చర్య ప్రేమ! ఏ విధంగా,
   నా దేవుడు, నాకై మరణించే?
      (“And Can It Be?” by Charles Wesley, 1707-1788).

యేసు నీ పాపాన్ని క్షమించి నీ ఆత్మను రక్షిస్తాడని నీవు నిర్ధారించుకుంటే, క్రెస్తవునిగా అవడం విషయంలో మేము మీతో మాట్లాడాలనుకుంటున్నాము. దయ చేసి మీ పాద రక్షలు విడిచి, గది వెనుక బాగానికి రండి. డాక్టర్ కాగన్ ఒక ప్రశాంత గదికి మిమ్ములను తీసుకొని వెళ్లి మీతో మాట్లాడుతారు. ఇప్పుడే ఆవరణ వెనుక భాగానికి వెళ్ళండి. లీ గారు, దయచేసి వచ్చి స్పందించిన వారి నిమిత్తము ప్రార్ధించండి. ఆమెన్.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసగాలు ప్రతీవారము”
అంతర్జాలములో www.realconversion.com ద్వారా చదువవచ్చు.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము డాక్టర్ క్రీగ్ టాన్ ఎల్.చాన్; యెషయా 52:13-53:7.
ప్రసంగమునకు ముందు పాట బెంజమన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్ గారిచే:
"ముళ్ళ కిరీటం" (ఇరా ఎఫ్. స్టాన్ ఫిల్ చే, 1914-1993).

ద అవుట్ లైన్ ఆఫ్

గొర్రె పిల్ల యొక్క మౌనము

(ప్రసంగము సంఖ్య 8 యెషయా 53)
THE SILENCE OF THE LAMB
(SERMON NUMBER 8 ON ISAIAH 53)

డాక్టరు ఆర్. ఎల్ హైమర్స్, జూనియర్ గారిచే.

"అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు: వధకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని యెదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు, అతడు నోరు తెరువలేదు" (యెషయా 53:7).

I.   మొదటిది, యేసు అను ఈ వ్యక్తి ఎవరు? యోహాను 10:30; 11:25; యోహాను 14:6.

II.  రెండవది, ఎందుకు యేసు సమర్ధించుకోలేదు వారు హింసించి చంపే ముందు? మత్తయి 16:21;
I తిమోతీ 1:15; యోహాను 18:37.

III. మూడవది, పాఠ్యభాగము ఏమి చెబుతుంది యేసు యొక్క మౌన శ్రమలను గూర్చి? మత్తయి 27:13-14;
మార్కు 15:3-5; యోహాను 1:29; I కోరిందీయులకు 15:3.