Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
యేసు గాయ పర్చబడి, నలుగగొట్టబడి, కొట్టబడెను

(ప్రసంగము సంఖ్య 6 యెషయా 53)
JESUS WOUNDED, BRUISED AND BEATEN
(SERMON NUMBER 6 ON ISAIAH 53)
(Telugu)

డాక్టరు ఆర్. ఎల్ హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

బాప్టిష్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలెస్ నందు బోధింపబడిన ప్రసంగము
శనివారము, సాయంత్రము, మార్చి 23, 2013
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, March 23, 2013

“మన అతి క్రమములను, క్రియలను బట్టి అతడు గాయబరచబడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను: మన సమాధానార్ధమైన శిక్ష అతని మీదపడెను; అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది” (యెషయా 53:5).


రెండు గ్రీకు పదాలు రోమా అధ్యాయము నుండి వాడవచ్చు తేడా చూపడానికి ఒక దానిని గూర్చి తెలియడం, దానిని గూర్చి పూర్తి గ్రహింపు కలిగియుండుట. రోమా 1:21 లో మనకు చెప్పబడింది, ప్రాచీనులు "దేవునిని ఎరుగుదురు." గ్రీకు పదము "ఎరుగుట." దాని అర్ధము "గ్రహింపు". దేవుని గూర్చి వారు ఎరుగుదురు. కాని రోమా 1:28 చెబుతుంది వారు "దేవుని గుర్తించలేదు. పదము "గుర్తించుట" "పూర్ణ అవగాహన". అది (ఎరుగుట) పదాన్ని బలపర్చి చూపిస్తుంది. పూర్తి గ్రహింపును వ్యక్త పరుస్తుంది. శక్తివంతమైన ప్రభావముతో (see W. E. Vine, An Expository Dictionary of New Testament Words, Revell, 1966, volume II, p. 301). పూర్వీకులు దేవునిని గూర్చి, [గ్రహింపు] కలిగిన వారైనప్పటికీ, వారికీ వ్యక్తిగత గ్రహింపు ఆయనను గూర్చి [పూర్తి గ్రహింపు] లేదు. వారు దేవుని వ్యక్తిగతముగా ఎరిగి యుండలేదు.

మనము ప్రభు రాత్రి భోజనము ఏర్పాటును గమనిస్తే, నేననుకుంటాను, ఆ రెండు గ్రీకు పదాలు రోమా మొదటి అధ్యాయములోనివి వివరిస్తున్నాయి. మీలో కొందరు చూస్తారు మేము రొట్టె, ద్రాక్ష రసము తీసుకోవడం, కానీ మీరు పాలు పంపులు పొందలేరు, ఎందుకంటే మీరు రక్షింపబడలేదు, కాబట్టి, మీకు తెలుసు బాహ్యముగా మానసికంగా ప్రభు రాత్రి భోజనము అంటే ఏమిటో, కాని మీకు తెలియదు అనుభవము ద్వారా దానిని కనుపర్చిన క్రీస్తును, మీకు “జ్ఞానము” ఉంది. దానిని గూర్చి (వానిని గూర్చి “గ్రహింపు”), కానీ నీకు పూర్తి అవగాహన (పూర్తి గ్రహింపు) క్రీస్తును గూర్చిలేదు. నీకు యేసు క్రీస్తు గురించే తెలియదు.

మన పాఠ్య భాగ విషయములో కూడా అంతే, మీకు తెలిసి ఉండవచ్చు బాహ్యంగా పదాలు వారి అర్ధము, కాని మీరు “అంతరార్ధము” ఇముడ్చుకోలేదు, దానిని గూర్చిన సంపూర్ణ అవగాహన నిన్ను "శక్తి వంతముగా ప్రభావితము" చేసేటట్టుగా (ఐబిఐడి.). కాబట్టి, నా ఉద్దేశ్యము మీ దృష్టిని పాఠ్య భాగపు లోతైన అర్ధము లోనికి నడిపించడం, ఏ నిరీక్షణతో అంటే ఆ పదాల మీ మానసిక అవగాహన యేసు క్రీస్తును గూర్చిన వ్యక్తిగత అనుభవము లోనికి నడిపించే విధముగా.

"మన అతి క్రమ క్రియలను బట్టి అతడు గాయ పరచబడెను, మన దోషమును బట్టి నలుగగొట్ట బడెను: మన సమాధానార్ధమైన శిక్ష అతని మీద పడెను; అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది" (యెషయా 53:5).

మీరు మారాలనిపిస్తే ఈ వచనము మీ హృదయాన్ని పట్టుకోవాలి. నా ప్రార్ధన ఈ విషయము మీ మానసిక జ్ఞానము నుండి యేసు క్రీస్తును నిజముగా నమ్మడం వైపు కొనసాగాలని – ఆయన మీ పాపాలకు జరిమానా చెల్లించడానికి సిలువ మీద మరణించాడు. ఈ పాఠ్య భాగములో మూడు ప్రాముఖ్య విషయాలు ఉన్నాయి.

I.  మన అతి క్రమములను, క్రియలను బట్టి అతడు గాయబరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను.

“మన అతి క్రమములను, క్రియలను బట్టి అతడు గాయబరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను…” (యెషయా 53:5).

మొదటి మాట "కానీ" చూపిస్తుంది తారతమ్యాన్ని నాలుగవ వచన అంతములో వివరించబడిన తప్పుడు అభిప్రాయాన్ని, క్రీస్తు చనిపోయాడు, ఆయన పాపము నిమిత్తము అపదాధముల నిమిత్తము, మరియు నిజ సత్యము ఆయన మన పాప పరిహారార్ధము మరణించాడు. డాక్టర్ ఎడ్వర్డ్ జె. యాంగ్ పాత నిబంధన తత్వవేత్త. ఆయన వ్యక్తిగత స్నేహితుడు నా చైనీ కాపరియైన, డాక్టర్ తిమేటీ లిన్ గారికి, ఆయన కూడా గొప్ప పాత నిబంధన తత్వవేత్త. డాక్టర్ యాంగ్ అన్నారు, "మరియొక్క వక్కానింపు కనుగొనబడింది, ఆ మాటలో ఆయన రెండు మొదట ఉంచబడ్డాడు, చూపడానికి తారతమ్యాన్ని ఎవరికీ శిక్ష సమంజసమో, ఆయన పాపదిరోపణను భరించాడు." (Edward J. Young, Ph.D., The Book of Isaiah, William B. Eerdmans Publishing Company, 1972, volume 3, p. 347).

“మన అతి క్రమములను, క్రియలను బట్టి అతడు గాయబరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను…“ (యెషయా 53:5).

పదము "గాయపరచబడెను" చాలా ప్రాముఖ్యమైనది. డాక్టర్ యాంగ్ అన్నారు హెబ్రీ పదము అర్ధము "చొచ్చుకొనిపోవుట, అక్కడ ఈ తలంపు ఉంటుంది, మరణము వరకు చొచ్చుకొనిపోవుట" (యాంగ్, ఐబిఐడి.). ఆ హెబ్రీ పదము అర్ధము "చొచ్చుకొనిపోవుట," "చేదింపబడుట" (ఐబిఐడి.). ఆ పదము జకర్యా 12:10 లో కనిపిస్తుంది,

"వారు తాము పొడిచిన నా మీద దృష్టి యుంచి" (జకర్యా 12:10).

ఇది క్రీస్తు యొక్క తేట తెల్లమైన ప్రవచనము, ఎవని తలమీద ముండ్ల కిరీటము ఉంచబడిందో, ఎవరి కాళ్ళు, చేతులు సిలువకు మేకులతో కొట్టబడ్డాయో, రోమా యుని బల్లెపు పోటుకు గురియైన క్రీస్తు. అపోస్తలుడైన యోహాను ఇలా అన్నాడు,

"సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును, నీళ్ళును కారెను... లేఖనము నెరవేరునట్లు... [ఏది] చెప్పెను, తాము పొడిచిన వాని తట్టు చూతురు" (యోహాను 19:34, 36, 37).

తరువాత, పాఠ్యభాగము చెబుతుంది, "మన దోషములను నలుగగొట్టబడెను" (యెషయా 53:5). హెబ్రీ పదము "నలుగగొట్టబడెను" అర్ధము "నుజ్జవుట" (యాంగ్, ఐబిఐడి). చితుకకొట్టబడుట, నలుగగొట్టబడుట క్రీస్తుకు గెత్సమనె వనములో ఆరభమైంది, ఆయన సిలువ వేయబడుటకు ముందు రాత్రి, యేసు ఆస్థితిలో

"ఆయన వేదనపడి… మరింత ఆతురముగా ప్రార్ధన చేయగా ఆయన చెమట, నేలపడుచున్న గొప్ప రక్త బిందువులవలె ఆయెను" (లూకా 22:44).

గెత్సమనే వనములో, క్రీస్తు చితుకకొట్టబడ్డాడు, మన పాప భారముతో, అక్కడ ఆయన మీద మోపబడి ఉన్నది.

కొన్ని గంటల తరువాత, క్రీస్తు నలుగగొట్టబడి, దెబ్బలచే గాయపరచబడిన, తరవాత నేరుగా సిలువవేయబడ్డాడు, తరువాత బల్లెముతో పొడవబడ్డాడు. కాని చితుకగొట్టబడడం యొక్క లోతైన ఆర్ధము ఆయన మీద మోపబడిన మన పాప భారము అపోస్తలుడైన పేతురు ఇలా అన్నారు,

"ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను…" (I పేతురు 2:24).

"మన అతి క్రమములను బట్టి అతడు గాయ పరచబడెను, మన దోషములను బట్టి నలుగ గొట్ట బడెను..." (యెషయా 53:5).

డాక్టర్ ఐషాక్ వాడ్స్ దానిని తేటపరిచాడు తన పాటలో,

అది నేను చేసిన నేరాల నిమిత్తమా
   ఆయన మ్రానుపై మూల్గుడు?
అద్భుత కనికరము! తెలియని కృప!
   ఊహా తీతమైన ప్రేమ!

సూర్యుడు అంధకారములో దాగుకోవచ్చు,
   మహిమను కప్పిపుచ్చవచ్చు,
ఎప్పుడు క్రీస్తు, బలాడ్యుడైన కర్త, చనిపోగా
   మానవుడు సృష్టి లోని పాపి.
(“Alas! And Did My Saviour Bleed?” by Isaac Watts, D.D., 1674-1748).

II.  రెండవది, క్రీస్తు మన స్థానములో శిక్షింపబడ్డాడు.

మన పాఠ్య భాగములోని మూడవ అంశము గమనించండి,

"మన అతి క్రమ క్రియలను బట్టి అతడు గాయ పరచబడెను, మన దోషమును బట్టి నలుగగొట్ట బడెను: మన సమాధానార్ధమైన శిక్ష అతని మీద పడెను..." (యెషయా 53:5).

నేను ఆ వచనాన్ని అర్ధము గ్రహించకుండా చాలా సంవత్సరాలు చదివాను. డాక్టర్ డెలీట్ జేస్క్ దానిని అనువదించారు, "చిత్ర వధ మన సమాధానానికి నడిపించింది" (C. F. Keil and F. Delitzsch, Commentary on the Old Testament, Eerdmans Publishing Company, 1973 reprint, volume VII, p. 319). "మన సమాదానము... మన శ్రేయస్సు, మన ఆశీర్వాద స్థితి, ఈ శ్రమలు... తీసుకువస్తాయి" (ఐబిఐడి). పదము "కొట్టబడుట" అనగా “శిక్షింపబడుట”. డాక్టర్ యాంగ్ అన్నారు, "ఒకరు ఈ వాక్య భాగము చదవడం లేదు ఇలా అనుకుంటే (శిక్ష) పడింది (క్రీస్తు)పై ప్రాయశ్చిత్తము కొరకు" (యాంగ్, ఐబిఐడి., పేజీ, 349). దేవుని న్యాయము క్రీస్తుపై పడింది-పాపానికి వ్యతిరేఖంగావచ్చు దైవ ఉగ్రతను తప్పించడానికి. డాక్టర్ జాన్ గిల్ అక్కడకు వెళ్ళాడు. చాలా మంది ఆధునిక వ్యాఖ్యాతలు వెనకాడతారు, సరిగ్గా చేసాడు, ఇలా అన్నాడు,

మన సమాధానార్ధమైన శక్తి ఆయన మీద పడెను; అనగా, మన పాపాల శిక్ష ఆయన మీద మోపబడింది, తద్వారా మన సమాధానము సంధి దేవునితో చేయబడింది... తద్వారా దైవిక ఉగ్రత తప్పించబడింది, న్యాయము చేయబడింది, సమాధాన పర్చబడెను (John Gill, D.D., An Exposition of the Old Testament, The Baptist Standard Bearer, 1989 reprint, vol. I, p. 312).

అపోస్తలుడైన పౌలు క్రీస్తు ను గూర్చి చెప్పాడు, "ప్రాయశ్చిత్తము" దేవుని ఉగ్రతను ఆయన వ్రాసేటప్పుడు,

"కాబట్టి నమ్ము వారు ఆయన కృప చేతనే: క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతి మంతులగా తీర్చబడుచున్నారు" (రోమా 3:24-25).

ఆల్ బెర్ట్ మిడ్ లేన్ వివరించాడు, అపోస్తాలుడు చెప్పిన "ప్రాయశ్చిత్తము" ను గూర్చి ఆయన పాటలో ప్రసంగము ముందు గ్రిఫిత్ గారు పాడారు,

ఏ నాలుక చెప్పలేదు ఆయన భరించిన ఉగ్రత,
   ఆ ఉగ్రత నాకు చెందినది;
ఏ కాగి చేసే పాపాలన్నీ; ఆయన భరించాడు,
   పాపులను విడుదల చేయడానికి.

ఇప్పుడు ఒక్క బొట్టు కూడా మిగలలేదు;
   "సమాప్తమైనది," ఆయన కేక;
ఘాటైన నిస్సారతను, ఆయన త్రాగాడు
   ఎండిన ఉగ్రతతో కూడిన పాత్ర.
(“The Cup of Wrath” by Albert Midlane, 1825-1909).

క్రీస్తు చిత్ర వధ చేయబడి, శిక్షింపబడ్డాడు నీ స్థానములో, తద్వారా నీ పాపానికి తగు దేవుని న్యాయ ఉగ్రతను తప్పించాడు.

“మన సమాధానార్ధమైన శిక్ష అతని మీదపడెను" (యెషయా 53:5).

III.  మూడవది, క్రీస్తు ఆయన దెబ్బల చేత మన పాపాన్ని స్వస్థ పరుస్తాడు.

దయచేసి లేచి నిలబడి వాక్య భాగము గట్టిగా చదువుదాం, ఆఖరి భాగముపై దృష్టి సారించి, "ఆయన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది."

"మన అతి క్రమ క్రియలను బట్టి అతడు గాయ పరచబడెను. మన దోషమును బట్టి నలుగగొట్ట బడెను: మన సమాధానార్ధమైన శిక్ష అతని మీద పడెను; ఆయన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది" (యెషయా 53:5).

మీరు కూర్చోండి.

“ఆయన పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది.” పదము "దెబ్బలు" హెబ్రీలో అర్ధము “గాయములు” (బలమైనవి). అపోస్తలుడైన పేతురు I పేతురు 2:24 ఈ వచనాన్ని ప్రస్తావించాడు. గ్రీకు పదము పేతురుచే వాడబడినది, అనువదింపబడింది "గాయములు." దానిని అర్ధము “గాయపు మచ్చలు” (బలమైనవి). నేను నమ్ముతాను ఈ పదాలు, "ఈ దెబ్బలతో స్వస్థత," యెషయా 53:5 మరియు I పేతురు 2:24 యేసు గాయాలను ప్రస్తాయిస్తున్నాయి. నేను నిర్ధారించుకున్నాను ఈ పదాలు క్రీస్తు శ్రమలను గూర్చినవి, సైనికులచే కలుగచేయబడినవి, రోమా, యూదా గవర్నరు అయిన పిలాతు ఆజ్ఞతో, క్రీస్తు సిలువ వేయబడకమునుపు. బైబిలు చెబుతుంది,

"అప్పుడు పిలాతు యేసును పట్టుకొని, ఆయనను కొరడాలతో కొట్టించెను" (యెహాను 19:1).

"అప్పుడతడు వారు కోరినట్లు వారికీ విడుదల చేసి: యేసును కొరడాలతో కొట్టించి, సిలువ వేయనప్పగించెను" (మత్తయి 27:26).

వ్యాఖ్యానము గ్రీకు పదము అనువాదము "కొట్టబడుట," డబ్ల్యూ.ఇ.వైన్ అన్నారు అది చెబుతుంది, "ఆ కొట్టబడుట, క్రీస్తు సహించాడు పిలాతు ఆజ్ఞ ప్రకారము జరిగింది. కొట్టబడుట, రోమా పద్దతి ప్రకారము వ్యక్తి దిగంబరిగా చేయబడి, వంగే భంగిమలో స్తంభమునకు కట్టబడి... [కొరడా] తోలుతో చేయబడి, పదునైన బరువైన ఇనుప ముక్కలు గుచ్చబడి, అది శరీరపు వెనుక భాగము, చాతి భాగముపై ఉన్న శరీరమును ముక్కలుగా చేస్తుంది, యేసు బియాస్ (దిన వృత్తాంతములు) నమోదు చేసాయి. ఇలాంటి పద్దతిలో చనిపోయిన హత సాక్షుల శ్రమలను కళ్ళారా చూసారు" (W. E. Vine, An Expository Dictionary of New Testament Words, Fleming H. Revell Company, 1966 reprint, volume III, pp. 327, 328). పదము "కొట్టబడుట" యేసు కూడా ఆయన ప్రవచనములొ ఉపయోగించెను, ఆయన రాబోవు శ్రమలను గూర్చి ఆయన ఇలా అన్నాడు,

"ఇదిగో యెరూష దేశమునకు వెళ్ళుచున్నాము; అక్కడ మనుష్యకుమారుడు [క్రీస్తు] ప్రధాన యాజకులకును, శాస్త్రులకును అప్పగింప బడును; వారయనకు మరణ శిక్ష విధించి, ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగించెను..." (మత్తయి 20:18-19).

స్పర్జన్ ఈ వ్యాఖ్యానాలు చేసారు క్రీస్తు కొట్టబడుట పై:

నిశ్చలంగా, చూడు, [యేసు] గట్టిగా బంధింపబడి [కట్టబడి] [ఒక] రోమా స్తంభమునకు, క్రూరముగా కొట్టబడ్డాడు. వినండి భయంకర శభ్దాలు [కొరడాలవి], చూడండి కారుచున్న గాయాలు, గమనించండి ఎలా ఆయన విపరీత నొప్పికి గురియైనాడు ఆయన ఆశీర్వదపు దేహములో. అప్పుడు చూడండి ఎలా ఆయన ఆత్మ కూడా శోకించిందో [కొట్టబడిందో]. చూడండి ఎలా కొరడాలు ఆయన ఆత్మపై పడ్డాయో, ఆయన హృదయంత రంగము గాయపడే వరకు శ్రమలతో, భరింపరానివి, వాటిని మన కొరకు ఆయన భరిస్తున్నాడు... ధ్యానించండి ఈ అపురూప విషయాన్ని ఏమాత్రము సంచరించే తలంపు లేకుండా, మరియు నా ప్రార్ధన నీవు నేను కలిసి ఆలోచన చేయగలగాలి ఈ పోల్చలేని [యేసు] శ్రమలను గూర్చి మన స్వహృదయాలు కరిగేంత వరకు మనలో ఆయన పట్ల కృతజ్ఞతాప్రేమతో (C. H. Spurgeon, “Christopathy,” The Metropolitan Tabernacle Pulpit, Pilgrim Publications, 1976 reprint, volume XLIII, p. 13).

మళ్ళీ, స్పర్జన్ అన్నాడు మన పాపముల నిమిత్తము ఆయన కొరడా దెబ్బలను శిలువ మరణములను అనుభవించాడు. ఇది నీ కొరకు నా కొరకు యేసు ఆ గాయాలను తీసుకున్నాడు. ఆయన కోట్టబడినప్పుడు, మరియు సిలువపై వ్రేలాడదీయబడినప్పుడు. స్పర్జన్ అన్నాడు,

మనకు ఖచ్చితంగా ఆయన బాధలలో భాగముంది. ఓ, మనము సమానంగా స్పష్టులము "ఆయన దెబ్బలచేత మనకు స్వస్థత". నీవు బాదించవు [ఆయనను కొట్టావు], ప్రియ స్నేహితుడా, నీవు ఆయనను గాయ పరిచావు; కాబట్టి, విశ్రాంతి పొందవచ్చు నీవు చెప్పేంత వరకు, "ఆయన పొందిన గాయముల చేత నాకు స్వస్థత." మనము వ్యక్తిగత [పరిజ్ఞానం] కలిగి ఉండాలి ఈ శ్రమ పడు [యేసు] గూర్చి మీరు స్వస్థత పొందాలంటే [పాపం నుండి] ఆయన దెబ్బల చేత. మనకు... మన హస్తాలచే ఈ గొప్ప త్యాగముపై ఉంచాలి, దానిని అంగీకరించాలి [మనకు జరిగినట్లు]; అది ఒక క్రూర [భయంకరమైన] విషయము తెలుసుకోవడం క్రీస్తు [కొట్టబడ్డడని], కానీ తెలుసుకోవాలి కూడా "ఆయన దెబ్బల చేత మనము స్వస్థత కలుగుచున్నది"... అవసరత లేదు పాప స్వస్థతను గూర్చి మాట్లాడడానికి అది దేవునిచే రోగముగా పరిగణించబడలేదు (ఐబిఐడి., పేజీ 14)..."ఆయన దెబ్బల చేత మనకు స్వస్థత" ఇది ఒక తాత్కాలిక పరిష్కారము కాదు; ఇది ఒక మందు అది [తెస్తుంది] ఆరోగ్యాన్ని అది చేస్తుంది [నీ] ప్రాణమును పరిపూర్ణముగా [బాగుగా], తద్వారా, పరిశుద్దలలో దేవుని సింహాసనం ముందు [పరలోకములో], ఆ మనుష్యులు పాటలు పాడుతారు [మిగిలిన చాలా మందితో ] "ఆయన దేబ్బల్చే మనకు స్వస్థత." ఘనత రక్తము కార్చు క్రీస్తుకు! ఘనత, మహిమ, ప్రభావము, స్తుతి ఆయనకే నిరంతరము. అందరూ [పాపము నుండి స్వస్థత పడ్డ] వారు చెప్పండి, "ఆమెన్ మరియు ఆమెన్" (ibid., p. 21).

"మన అతి క్రమ క్రియలను బట్టి అతడు గాయ పరచబడెను, మన దోషమును బట్టి నలుగ గొట్ట బడెను: మన సమాధానార్ధమైన శిక్ష అతని మీద పడెను; ఆయన దెబ్బల చేత, మనకు స్వస్థత కలుగుచున్నది" (యెషయా 53:5).

కానీ కేవలం ఈ నిజాలు తెలుసుకుంటే మీరు రక్షింపబడరు! క్రీస్తు శ్రమలను గూర్చిన సత్యము నీ హృదయాన్ని తాకకపోతే నీవు మార్చ బడలేవు! ఈ వాక్య భాగము నీ హృదయాన్ని పట్టుకొనివ్వు. ఈ పదాలు మీ ఆత్మ తరలించడానికి క్రీస్తు నిమిత్తము.

"మన అతి క్రమ క్రియలను బట్టి అతడు గాయ పరచబడెను, మన దోషమును బట్టి నలుగ గొట్ట బడెను: మన సమాధానార్ధమైన శిక్ష అతని మీద పడెను; ఆయన దెబ్బల చేత, మనకు స్వస్థత కలుగుచున్నది" (యెషయా 53:5).

ఈ మాటలు క్రీస్తును నమ్మడానికి మిమ్మల్ని కదిలించు కాక, ప్రతి పాపము నుండి స్వస్థత పొందడానికి, తద్వారా నీవు చెప్పవచ్చు, "ఆయన పొందిన దెబ్బలచేత బాధించు పాపము నుండి స్వస్థత పొందుకుంటాను, ఇప్పుడు, ఎల్లప్పుడూ." ఆమెన్.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసగాలు ప్రతీవారము”
అంతర్జాలములో www.realconversion.com ద్వారా చదువవచ్చు.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.


ప్రసంగమునకు ముందు బైబిలు పఠనము కాపరిచే; యెషయా 52:13-53:5.
ప్రసంగమునకు ముందు పాట బెంజమన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్ గారిచే:
"ద కప్ ఆఫ్ రాత్" (ఆల్ బెల్ట్ మిడ్ లేన్, 1825-1909).

ద అవుట్ లైన్ ఆఫ్

యేసు గాయ పర్చబడి, నలుగగొట్టబడి, కొట్టబడెను

(ప్రసంగము సంఖ్య 6 యెషయా 53)
JESUS WOUNDED, BRUISED AND BEATEN
(SERMON NUMBER 6 ON ISAIAH 53)

డాక్టరు ఆర్. ఎల్ హైమర్స్, జూనియర్ గారిచే.

“మన అతి క్రమములను, క్రియలను బట్టి అతడు గాయబరచబడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను: మన సమాధానార్ధమైన శిక్ష అతని మీదపడెను; అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది” (యెషయా 53:5).

(రోమీయులకు 1:21, 28)

I.   మొదటిదిగా, క్రీస్తు మన అతి క్రమములను, క్రియలను బట్టి గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, యెషయా 53:5ఎ; జెకర్యా 12:10; యోహాను 19:34, 36, 37; లూకా 22:44; I పేతురు 2:24.

II.  రెండవది, క్రీస్తు మన స్థానములో శిక్షింపబడ్డాడు, యెషయా 53:5బి; రోమీయులకు 3:24-25.

III. క్రీస్తు ఆయన దెబ్బలచేత మనకు స్వస్థత పరుస్తాడు, యెషయా 53:5సి; యోహాను 19:1; మత్తయి 27:26;
20:18-19.