Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
నిరాకరింపబడిన నివేదిక

(ప్రసంగము సంఖ్య 2 యెషయా 53)
THE REJECTED REPORT
(SERMON NUMBER 2 ON ISAIAH 53)
(Telugu)

డాక్టరు ఆర్. ఎల్ హైమర్స్ జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

ప్రసంగము బాప్టిష్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలెస్ నందు బోధింపబడినది
ప్రభువు దినము ఉదయము మార్చి 3, 2013
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, March 3, 2013

"మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను?" (యెషయా 53:1).


యెషయా క్రీస్తు సువార్తను గూర్చి మాట్లాడుచున్నాడు. పోయిన ఆదివారము నేను 52వ అధ్యాయము ఆఖరి మూడు వచనముల మీద బోధించాను, ప్రవక్త క్రీస్తు శ్రమలను గూర్చి ముందే చెప్పాను, ఎవరి ఆకారము "ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటె అతని రూపమును చాల వికారమాయెను" (యెషయా 52:14) ఇది యేసు ముఖ చిత్రము, కొట్టబడి మనుషుల కొరకు సిలువ వేయబడి మృతులలో నుండి లేచి, "హెచ్చింపబడి, ప్రసిద్ధుడై..... మహా ఘనుడాయెను" (యెషయా 52:13). కాని ఇప్పుడు, మన పాఠములో, ప్రవక్త కొద్ది మంది మాత్రమే సువార్త దేశాన్ని నమ్ముతారని భావిస్తున్నాడు.

డాక్టరు ఎడ్వర్డు జె.యాంగ్ పాత నిబంధన తత్వవేత్త, సహ చదువరి మరియు స్నేహితుడు ముందు కాపరి, డాక్టరు తిమోతీ లిన్. ఇలా వ్యాఖ్యానిస్తున్నాడు,

"మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహొవా బాహువు ఎవనికి బయలుపరచబడెను,"

డాక్టరు యాంగ్ అన్నారు "ఇది ప్రశ్న కాదు ప్రశ్నార్దకము. ఇది వ్యతిరేక జవాబును పట్టు పట్టదు, నిర్దిష్టింపబడింది [చిన్న సంఖ్య] పట్ల దృష్టి పెట్టడానికి ప్రపంచంలోని నిజ విశ్వాసులు ..... [ప్రవక్త ఆయన] ప్రజల ప్రతినిధి, మాట్లాడుతూ వ్యక్తపరుస్తూ కొంత మందే నమ్ముతారని" (ఎడ్వర్డ్ జె, యాంగ్ పి.హెచ్.డి., యెషయా గ్రంధము, విలియం బి.ఎర్డ్ మాన్స్ పబ్లిషింగ్ కంపెనీ, 1972, ప్రతి 3, పేజీ 240).

"మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహొవా బాహువు ఎవనికి బయలుపరచబడెను?"

పదము "నివేదిక" అర్ధము "ప్రకటింపబడిన ప్రసంగము." లూథర్ అనువదించాడు ఇలా "మన బోధ" (యాంగ్, ఐబిఐడి.). "మన బోధను ఎవడు నమ్మాడు?" సమతుల్య వ్యక్తీకరణను ఏమంటే ఈభాగములో, "యెహోవా బాహువు ఎవనికి బయలు పరచబడెను?" “యెహొవా బాహువు" ఈ వ్యక్త పరచబడినది ప్రభువు శక్తిని సూచిస్తుంది. మన బోధను ఎవడు నమ్మాడు? మరియు యెహొవా బాహువు ఎవనికి బయలు పర్చబడెను? ఎవరికీ క్రీస్తు రక్షించు శక్తి బయలు పర్చబడెను?

"మేము తెలియ జేసిన సమాచారము ఎవడు నమ్మెను?
యెహొవా బాహువు ఎవనికి బయలు పరచబడెను?" (యెషయా 53:1).

ఈ వచనము ఏమి చూపిస్తుందంటే, ముందు నీవు సువార్త బోధను నమ్మాలి, తరువాత దేవుని యందు క్రీస్తు శక్తితో మార్చబడాలి. అయినను ప్రవక్త యొక్క ప్రశ్న చూపిస్తుంది కొద్ది మంది మాత్రమే నమ్మి మార్చబడుతారు.

"మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహొవా బాహువు ఎవనికి బయలు పరచబడెను?" (యెషయా 53:1).

I. మొదటగా, కొద్ది మంది నమ్మి మార్చబడ్డారు క్రీస్తు ఇహలోక పరిచర్యలో.

యేసు లాజరు సమాధి దగ్గరకు వచ్చాడు, తను నాలుగు రోజుల క్రితమే చనిపోయాడు. యేసు వారితో అన్నాడు, "రాయి తీసి వేయుడని చెప్పెను" (యోహాను 11:39). లాజరు సోదరి ఆయనను ఆపాలనుకుంది, ఆమె అన్నది, "ప్రభువా, ఈపాటికి తను వాసన కొట్టును: ఎందుకంటే చనిపోయి నాలుగు దినాలయింది" (ఐబిఐడి.). కాని వారు యేసుకు లోబడి రాతిని తొలగించి సమాధి తెరిచారు. అప్పుడు యేసు "లాజరూ, బయటకి రమ్మని బిగ్గరగా చెప్పెను. చనిపోయిన వాడు, కాళ్ళు, చేతులు ప్రేత హస్త్రములతొ కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి యుండెను: అంతట యేసు, మీరు అతని కట్లు విప్పి, పోనియ్యుడని వారితో చెప్పెను." (యోహాను 11:43-44).

"కాబట్టి ప్రధాన యాటకులను పరిసయ్యులను మహా సభను సమకూర్చి, మనమేమి చేయుచున్నాము? [మనమేమి చేయవలెను?] ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే" (యోహాను 11:47).

వాళ్ళు చూసారు ఆయన అధ్బుతాలు చేశాడో, సామాన్యులు దారి బదులు ఆయనను వెంబడిస్తారని భయపడ్డారు.

"కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంప నాలోచించు చుండిరి." (యెహాను 11:53)

ప్రధాన యాజషులు పరిశయ్యలు సమావేశాలు ఏర్పాటు చేసి యేసును ఎట్లూ వదిలించుకోవాలా అని ఆలోచించారు "ఆయనను సంహరించాలని" అపోస్తలుడైన యెహాను ఇలా అన్నాడు,

"యేసు ఈ మాటలు చెప్పి వెళ్లి, వారికీ కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి యెదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారాయన [యెషయా] యందు విశ్వాస ముంచరైరి: ప్రభువా, మా వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభువు యొక్క భాహువు ఎవనికి బయలు పరచబడెను? అని ప్రవక్తయైన యెషయా చెప్పిన వాక్యము నెరవేరినట్లు ఇది జరిగెను." (యెషయా 12:32-78)

వారు ఆయన అధ్బుత రీతిగా ఐదు వేల మందికి ఆహారము పెట్టడం చూసారు. వారు ఆయన కుష్టు రోగులను స్వస్తత పరిచి గ్రుడ్డి వారి కన్నులు తెరవటం చూసారు. వారు ఆయన దెయ్యాలను వెళ్ళ గొట్టటం, పక్ష వాయువు గలవారిని బాగు చేయడం చూసారు. వారు ఆయన విధవరాలి కుమారుని మృత్యువు నుండి లేపడం చూసారు. వారు నీళ్ళను ద్రాక్ష రసంగా మార్చడం మాత్రమే కాక, ఆయనను వినేటట్టుగా చేసాడు.

"యేసు వారి సమాజ మందిరంలో భోదించుచు రాజ్య సువార్త ప్రకటించెను, ప్రతి విధమైన రోగములను ప్రతి విధమైన వ్యాధులను స్వస్థ పరుచుచు, సమస్త పట్టణములయందును, గ్రామాలయందును సంచారము చేసెను" (మత్తయి 9:35).

అయినను, ఆయన లాజరును మృతులలో నుండి లేపినప్పుడు, "కాగా ఆ దినము నుండి వారి ఆయనను చంపనాలోచించుచుండిరి" (యెహను 11:53).

"యేసు ఈ మాటలు చెప్పి వెళ్లి, వారికీ కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి యెదుట ఇన్ని సూచిక క్రియలు చేసినను వారు ఆయన [యెషయా] యందు విశ్వాస ముంచరైరి: ప్రభువా మా వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభువు యొక్క అంతరము ఎవరికి బయటపరచబడెను? అని ప్రవక్తయైన యెషయా చెప్పిన వాక్యము నేర వేరునట్లు ఇది జరిగెను" (యెషయా 12:37-38)

అవును, కొద్ది మంది ప్రజలు మాత్రమే నమ్మి మార్చబడ్డారు. భూమి మీద క్రీస్తు పరిచర్య కాలములో.

II. రెండవది, కొంత మంది నమ్మి మార్చబడ్డారు, అపోస్తలుల కాలములో.

దయచేసి రోము 10:11-16 వరకు చూడండి. మన మందరము లేచి నిలబడి ఈ వాక్య భాగాన్ని చదువుదాము.

"ఏమనగా ఆయన యందు విస్వసముంచు వాడెవడును సిగ్గు పడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్తుడని భేదము లేదు: ఒక్క ప్రభువే అందరికి ప్రభువై యుండి, తనకు ప్రార్ధన చేయు వారందరి యెడల కృప చూపుటకు ఐశ్వర్య వంతుడైయున్నాడు. ఎందుకనగా, ప్రభువు నామములను బట్టి ప్రార్ధన చేయు వాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింప వారని ఎట్లు ప్రార్ధన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించు వాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించు వారు పంపబడని యెడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడియున్నవి! అయినను అందరు సువార్తకు లోబడలేదు. [యెషయా] ప్రభువా మేము తెలియచేసిన సమాచార మెవడునమ్మెను” (రోమా 10:11-16).

మీరు కూర్చోండి.

గమనించండి, ఈ లేఖన భాగము 12 వ వచనములో ఇలా అంటుంది,

"యూదుడని గ్రీసు దేశస్తుడని భేదము లేదు: ఒక్క ప్రభువే అందరికి ప్రభువై యుండి, తనకు ప్రార్ధన చేయు వారందరి యెడల కృప చూపుటకు ఐశ్వర్య వంతుడైయున్నాడు” (రోమా 10:12).

ఇది వ్రాయబడింది. అపోస్తలుడైన పౌలు చేత యేసు ఆరోహణ మైన ముప్పై సంవత్సరాల తరువాత. ఆ విధంగా, పౌలు రోమా పత్రికను అపోస్తలుల కార్యముల తరువాత భాగంగా వ్రాసాడు. ఆయన యూదుల తోనూ, అన్యుల తోనూ మాట్లాడుచున్నాడు. కానీ యేసు కేవలము యూదులతోనే మాట్లాడాడు. పౌలు అన్నాడు, "యూదులకు గ్రీసు దేశస్థులకు భేదము లేదు.” అందరికి క్రీస్తు కావలెను!

అయినను, యూదులు కానీ ప్రజలకు పౌలు యేసు చెప్పిందే చెప్పాడు. యెషయా 3:1 ఆధారంగా, కొంత మంది అన్యులు మాత్రమేనమ్మారు - యెషయా 53:1 ప్రస్తావిస్తూ, ప్రవక్త చెప్పాడు. యూదుల కంటే అన్యులే సువార్తకు ఎక్కువగా స్పందించెను. పౌలు యెషయా చెప్పిననేవమే చూపిస్తూ,

"మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెషయా బాహువు ఎవనికి బయలుపరచబడెను?" (యెషయా 53:1).

అన్యులు యూదుల కంటే సువార్తకు ఎక్కువ బాహాటంగా ఉన్నారు. అయిననూ, సంఖ్యలో కొద్ది మంది అన్యజనులు మాత్రమే యేసును నమ్మారు. పౌలు ఇతర అపో స్తలుల కాలములో, గొప్ప ఉజ్జీవాలు అపోస్తలుల కాలములో ఉన్నాయి, అపోస్తలుల కార్యముల గ్రంధములో చూచినట్లు, అయినను ఆ గొప్ప ఉజ్జీవాలు కొంత మంది అన్య జనులనే క్రీస్తు రక్షణలోనికి నడిపించాయి. సువార్తీకరణ చాల కష్టము, రోమీయులు మద్య కూడా!

క్రీస్తు అపోస్తలులు కొంత మందే మారినట్లు చూసారు. అట్లు, మొదటి శతాబ్దపు క్రైస్తవులు తక్కువ సంఖ్యాకులు, మరియు హింసింపబడినవారు! కనుక, యోహాను పౌలు మన వాక్యభాగాన్నే చూపించారు, సువార్తకు ప్రజలు వ్యతిరేకత చూపడానికి, వివరించడానికి ఎందుకు చాల మందివారి బోధ వినకుండా మారకుండా ఉండిపోయారని.

"మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను? యోహావా బాహువు ఎవనికి బయలు పరచబడెను?" (యెషయా 53:1).

ఇది వాస్తవము క్రైస్తవ చరిత్ర కాలాలలో, ఎల్లప్పుడూ, అన్ని సమయములలో, కొద్ది సంఖ్య మంది మాత్రమే సువార్తను నమ్మారు, నిజంగా మారారు. నేటి ప్రపంచములో కూడా ఇది వాస్తవమే. ఏమీ మారలేదు. ఏది మన ఆఖరి విషయానికి తీసుకుని వస్తుంది.

III. మూడవది, కొంత మంది ఈ రోజుల్లో నమ్మి మార్చ బడుచున్నారు.

మన రోజుల్లో యెషయా విలాప వాస్తవికతకు మనము అనంగీకారము చూపుతాము, ఈ విషాద ప్రశ్న,

"మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను? యోహావా బాహువు ఎవనికి బయలు పరచబడెను?" (యెషయా 53:1).

విచారముగా, మనం చెప్పాలి, ఈరోజుల్లో కొంత మంది సువార్త బోధను నమ్ముతున్నారు, కొంత మంది క్రీస్తు శక్తి ద్వారా రక్షింపబడుచున్నారు. మన స్వంత బంధువులు క్రీస్తును తిరస్కరిస్తారు. మీలో చాలమందికి తెలుసు బోధ వినడానికి మనం గుడికి తీసుకొచ్చే కొద్ది మంది కూడా ఎప్పుడూ మార్చబడరు. నేను ముందు వ్యాఖ్యానాలు చేస్తాను:

(1)  మొదటిది, బైబిలు ఎక్కడ చెబుతుంది ఎక్కువ మంది రక్షింపబడతారని? కానే కాదు, నిజానికి, యేసు దానికి వ్యతిరేఖంగా చెప్పాడు. ఆయన అన్నాడు,

"తమరు ద్వారమున ప్రవేశించుడి: నాశనముకు పోవు ద్వారము వెడల్పును, ఆదారి విశాలమునైయుంది. దానిద్వారా ప్రవేశించు వారు అనేకులు: జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునైయున్నది, దాని కనుగొను వారు కొందరే." (మత్తయి 7:13-14)

దాని కనుగొను వారు కొందరే! మనం ఎప్పుడు దానిని మనసులో పెట్టు కోవాలి. మన సువార్తక ప్రయత్నాలు ఆశించిన దానికంటే కొద్ది మంది మాత్రమే మార్చబడుతారు.

తరువాత, నేను చెప్పే రెండవ మాట ఇది.

(2)  మన సువర్తీకరణ ఎంత మంది మారుతారు అనే దానిపై ఆధారపడి ఉండదు. స్పందన పెద్దదైన, చిన్నదైన, ఎంత మంది మారుతున్నారు అనే దాని పై మన కనుదృష్టి నిలుపరాదు. మన ఉద్దేశము దేవునికి లోబడుట మీద ఆధారపడి ఉంది. మన కనుదృష్టి దేవుని పై మాత్రమే ఉంచాలి, ఆయన పట్ల మన విధేయత మనము సువార్త పని మీద వెళ్ళినప్పుడు: మన కళ్ళు ఎల్లప్పుడూ దేవునిపైనే నిలిపి ఉంచాలి, మరియు ఆయన పట్ల మన విధేయత మనము సువార్త ప్రకటిస్తున్నప్పుడు! క్రీస్తు మనకు చెప్పాడు,

"మరియు మీరు సర్వ లోకమునకు వెళ్లి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి" (మార్కు 16:15)

అదే క్రీస్తు మనకు చెయ్యమని చెప్పాడు, అది మనం చెయ్యాలి ప్రజలు వినిన, వినక పోయిన: మారినా, మారక పోయిన, మనం సువార్తీకరణ చెయ్యాలి ఎందుకంటే క్రీస్తు చెయ్యమని చెప్పాడు కాబట్టి! మన విజయము ప్రజల స్పందన మీద ఆధారపడి ఉంటుంది! కాదు! మన విజయము మనము క్రీస్తుకు విధేయులవడం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనము సువార్తీకరణకు వెళ్ళాము, వారు సువార్తను నమ్మిన, నమ్మక పోయిన!

తరువాత, ఇందులో నుండి మూడవ విషయం వెలువడుతుంది.

(3)  క్రీస్తును నీవు నమ్ముచున్నవా? క్రీస్తు కొరకు నీవు మార్చబడ్డవా? నీవు విశ్వాసము ద్వారా క్రీస్తు యొద్దకు వస్తావా? నీ కుటుంబములో ఏ ఒక్కరు కూడా, నీ స్నేహితులలో ఒక్కరు కూడా మార్చబడలేదు, నీవు క్రీస్తును వెదుకుతావా? ఆయన యొద్దకు నీవు వస్తావా? క్రీస్తు చెప్పినది జ్ఞాపకముంచుకో,

"నమ్మి బాప్తిస్యము పొందిన వాడు రక్షింపబడును. నమ్మని వానికి శిక్ష విధింపబడును" (మార్కు16:16).

నీవు యేసు నోద్దకు వచ్చి, మారి బాప్తిస్యము పొందుతావా? లేక అనేక మందిలో నీవు ఒకడివిగా ఉండి, రక్షకుని తిరస్కరించి, నరకములో నిత్య అగ్నిలో నశించిపోతావా?

"నమ్మిన వాడు నశింపడు" (మార్కు 16:16).

నా ప్రార్ధన ఏమంటే నరకములో నశించే అనేక మందిలో నువ్వు ఒకడివి కాకూడదు, మీరు ఈ స్థానిక సంఘములో మాతో పాటే కలవాలి. లోకంలో నుండి బయటకి రండి! విశ్వాసము ద్వారా యేసు నోద్దకు రండి! ఈ స్థానిక సంఘానికి రండి. నిత్యత్వములొ రక్షింపబడండి యేసు రక్తము, ద్వారా నీటి ద్వారా.

"మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను? యోహావా బాహువు ఎవనికి బయలు పరచబడెను?" (యెషయా 53:1).

నమ్మి పరాశిన దారిలో మీరు ఒకరిగా ఉండండి! బోధింపబడినప్పుడు సువార్తను నమ్మిన కొంత మందిలో మీరు ఒకరిగా ఉండండి. నీవు చెప్పాలి, "అవును, నా పాపాల నిమిత్తము ఏమి చెల్లించడానికి యేసు చనిపోయాడు, అవును, ఆయన మృతులలో నుండి లేచాడు. అవును, విశ్వాసము ద్వారా ఆయన దగ్గరకు నేను వస్తాను.” యోహవా బాహువు బయలు పరచబడిన కొందరిలో నీవు ఒకడవు కావాలి, యేసును నమ్ముట ద్వారా రక్షణ అనుభవించాలి, "ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల" (యోహాను 1:29). యేసు నోద్దకు వచ్చిన వారిలో నీవు ఒకడవు కావాలి, ఆయన ప్రశస్త రక్తము ద్వారా మీ పాపాలను కడిగేసాడు. దేవుడు మీకు కృపను అనుగ్రహించును గాక, మా నివేదిక నమ్మడానికి ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా పాపము నుండి రక్షింపబడే అనుధవము పొందడానికి! ఆమెన్!

దయచేసి లేచి నిలువబడి "నేను వచ్చుచున్నాను ప్రభువా," పాటల కాగితములో ఏడవ పాట.

ఆహ్వానించు నీ స్వరం నేను విన్నాను, అది నన్ను పిలుస్తుంది, ప్రభువా, నీ దగ్గరకు
   నీ ప్రశస్త రక్తములొ కడగడానికి కలువరిపై ప్రవహించిన.
నేను వస్తున్నాను ప్రభువా! ఇప్పుడే నీ దగ్గరకు!
   కడుగు, రక్తములొ కడుగు కలువరిపై ప్రవహించిన.

బలహీనునిగా వస్తున్నప్పటికీ, నాకు శక్తి నిచ్చు వాడవు నీవే;
   నీవే నా మరకలు పూర్తిగా కడిగేస్తావు, మచ్చలేని పవిత్రమైనదిగా.
నేను వస్తున్నాను ప్రభువా! ఇప్పుడే నీ దగ్గరకు!
   కడుగు, రక్తములొ కడుగు కలువరిపై ప్రవహించిన.
("నేను వస్తున్నాను, ప్రభువా" లూయిస్ హార్ట్ షా, గారిచే 1828-1919).
     (“I Am Coming, Lord” by Lewis Hartsough, 1828-1919).

మీరు మాతో మాట్లాడాలనుకుంటే యేసు ద్వారా మీ పాపములు కడుగబడడానికి, ఈ ఆవరణము వెనుక భాగమునకు దయచేసి రండి, డాక్టర్ కాగన్ ప్రశాంత ప్రదేశానికి తీసుకొని వెళ్లి మీతో మాట్లాడుతారు. డాక్టర్ చాన్, దయచేసి వచ్చి స్పందించిన వారి కొరకు ప్రార్ధించండి.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసగాలు ప్రతీవారము”
అంతర్జాలములో www.realconversion.com ద్వారా చదువవచ్చు.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.


ప్రసంగం ముందు బైబిలు పఠనము ఏబెల్ ప్రుదోమే గారిచే యెషయా 52:13-53:1
ప్రసంగం ముందు పాట పాడినవారు బెంజమిన్ కీన్ కెయిడ్ గ్రిఫిత్:
"ఏ క్రౌన్ ఆఫ్ తోరేన్స్" (ఇరా ఎఫ్, స్టాన్ ఫిల్ గారిచే, 1914-1993).

ద అవుట్ లైన్ ఆఫ్

నిరాకరింపబడిన నివేదిక

(ప్రసంగము సంఖ్య 2 యెషయా 53)

డాక్టరు ఆర్. ఎల్ హైమర్స్ జూనియర్, గారిచే,

"మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను? యోహావా బాహువు ఎవనికి బయలు పరచబడెను?" (యెషయా 53:1).

(యెషయా 52:14, 13)

I.   మొదటిది, కొద్ది మంది నమ్మి మార్చబడ్డారు క్రీస్తు ఈలోక
పరిచర్యలో, యోహాను 11:39, 43-44, 47, 53; 12:37-38; మత్తయి 9:35.

II.  రెండవది, కొంత మంది నమ్మి మార్చబడ్డారు అపోస్తలుల కాలములో,
రోమా 10:11-16.

III. మూడవది, కొంత మంది ఈ రోజుల్లో నమ్మి మార్చబడుచున్నారు.
మత్తయి 7:13-14; మార్కు 16:15, 16; యోహాను 1:29.