Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
దైవ సేవకుని శ్రమలు విజయము!

(యెషయా 53 పై ఒకటవ ప్రసంగము)
THE SUFFERING AND TRIUMPH OF GOD’S SERVANT!
(SERMON NUMBER 1 ON ISAIAH 53)
(Telugu)

డాక్టర్ అర్.ఎల్. హైమర్స్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

లాస్ ఎంజిలిస్ బాపిస్టు టేబర్నేకల్ లో ప్రభువు ది నాన్న భోదింపబడిన ప్రసంగము, ఫిబ్రవరి 24, 2013
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, February 24, 2013

"ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి, ప్రసిద్దుడై మహా ఘనుడుగా యంచబడును. నిన్ను చూచి యే మనిషి రూపము కంటే అతని ముఖమును, నర రూపము కంటే అతని రూపమును, చాల వికారమని చాలా మంది యేలాగు విస్మయమొందిరో! అలాగే అతడు అనేక జనములను చిలకరించును, రాజులు అతని చూచి నోరు మూసి కొనెదరు, తమకు తెలియజేయబడని సంగతులు వారు చూచెదరు. తాము వినని దానిని గ్రహింతురు" (యెషయా 52:13-15).


దయచేసి మీ బైబిలు తెరిచే ఉంచండి. 52 వ అధ్యాయము బదులు 53వ అధ్యాయములో ఈ వచనాలు తీసుకోబడాలి, డాక్టరు జాన్ గిల్ ప్రకారము ఆధునిక వ్యాఖ్యాతలు ప్రకారము (ఫ్రేంక్ ఇ. గయిబలేన్, డి.డి., ద ఎక్ష్ పోజిటర్ బైబిలు కామెంటరి, రీజన్సీ రిఫరెన్స్ లైబ్రరి, 1986, ప్రతి 6, పేజీ. 300). (Frank E. Gaebelein, D.D., The Expositor’s Bible Commentary, Regency Reference Library, 1986, volume 6, p. 300).

ఆ భాగమంతా 13వ వచనము నుండి, 53 అధ్యాయము 12 వరకు, “దేవుని శ్రమపడు సేవకుని” గూర్చి వ్రాయబడినది, మేథ్యూ హేన్సీ ఇలా అన్నారు,

ఈప్రవచనము ఇక్కడ ప్రారంబింపబడి, తరువాత అధ్యాయము ఆఖరు వరకు కొనసాగినది, యేసు క్రీస్తును చూపించుచున్నది, ఆదిమ యూదులు మేస్సీయాను అర్ధం చేసుకున్నారు, ఆధునిక రబ్బీలు [రబ్బీలు] తప్పు దారి మల్లించారు. కాని ఫిలిప్పు నపుంసకునికి క్రీస్తును ప్రకటించినతడు [ఈప్రవచనము] ఎవని గూర్చి చెప్పబడెనో “అతడే ప్రవక్త” అ.కా. 8:34, 35 (బైబిలు అంతటిపై మేథ్యూ హెన్రీ వ్యాఖ్యానము, హేన్రిక్షన్ పబ్లిషర్స్,1996 తిరుగుప్రతి, వాల్యూమ్ 4, పేజీ 235). (Matthew Henry’s Commentary on the Whole Bible, Hendrickson Publishers, 1996 reprint, volume 4, p. 235).

ప్రాచీన యూధుడు తర్గమ్ ఏమన్నాడంటే, మేస్సీయాను గూర్చి ప్రస్తావింపబడిందని, రబ్బీలు చెప్పినట్లే, అబెన్ ఎజ్రా మరియు ఆల్ షేక్ (జాన్ గిల్, డి.డి., పాత నిబంధన వివరణ, ద బాప్టిష్టు స్టాండర్డ్ బేరర్, 1989 రీప్రింటు, ప్రతి I, పేజీ 309). (John Gill, D.D., An Exposition of the Old Testament, The Baptist Standard Bearer, 1989 reprint, volume I, p. 309).

అదే రీతిగా, క్రైస్తవ వ్యాఖ్యానికులు చరిత్రలో ఈ పాట్యభాగము ప్రభువైన యేసు క్రీస్తును గూర్చినదే అని అన్నారు. స్పర్జన్ ఇలా అన్నారు,

వాళ్ళు ఇంకోలా ఎలా చేస్తారు? ఏ ప్రవక్త గురించి ప్రస్తావింపబడి ఉంటుంది? నజరేయుడు దైవ కుమారుడు, ఈమూడు వచనాలలో కనబడకపోతే, వాళ్ళు అర్ధరాత్రి అంధకారంలో ఉన్నట్లే. మనం సందేహించం ప్రతి మాట మన ప్రభువైన యేసు క్రీస్తుకు అన్వయించడానికి (సి.హెచ్. స్పర్జన్, “ద సూర్ ట్రయంఫ్ ఆఫ్ ద క్రూసిఫైద్ వన్,” ద మెట్రో పోలిటన్ టెబెర్నేకల్ ఫుల్ పిట్, పిల్ గ్రిమ్ పబ్లికేషన్స్, 1971 రీప్రింట్, వాల్యూం XXI, పేజీ 241). (C. H. Spurgeon, “The Sure Triumph of the Crucified One,” The Metropolitan Tabernacle Pulpit, Pilgrim Publications, 1971 reprint, volume XXI, p. 241).

మేథ్యూ హెన్రీ గారిచే ఇది వరకే చెప్పబదినట్లుగా, సువార్తకుడు ఫిలిప్పు ఈ వాక్య భాగము క్రీస్తు శ్రమను గూర్చి సూచిస్తుందని చెప్పాడు.

"అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవని గూర్చి ఇలాగు చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా, వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పునడిగెను. అందుకు ఫిలిప్పు నోరు తెరచి, ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను." (అపోస్తలుల కార్యములు 8:34-35).

ప్రాచీన టర్గుమ్ కంటే, రబ్బీల కంటే, సువార్తకు ఫిలిప్పు కంటే, క్రైస్తవ వ్యాఖ్యాతల కంటే మనము మంచిగా చేయలేము. మన పాఠ్యములో ఉన్న ప్రతీ మాట ప్రభువైన యేసు క్రీస్తు అయిన మేస్సీయాను గూర్చిన ప్రవచనమే.

I.  మొదటిగా, దేవుని క్రీస్తు సేవను చూస్తాము.

తండ్రియైన దేవుడు 13వ వచన మాటలు చెప్పుచున్నాడు,

"ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహా ఘనుడుగా ఎంచబడును" (యెషయా 52:13).

దేవుడు మనకు చెప్తున్నాడు. ఆయన "సేవకుని"చూడమని. యేసు ఈ లోకములోనికి వచ్చినప్పుడు,

"మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను" (ఫిలిప్పీయులకు 2:7).

భూమి మీద దేవుని సేవకునిగా, క్రీస్తు వివేకముగా ప్రవర్తించాడు. యేసు చెప్పినదీ, చేసినదీ, భూమి మీద ఆయన పరిచర్యలో, జ్ఞాన యుక్తముగా చేసాడు. దేవాలయములో చిన్న బాలుడిగా, భోధకులు ఆయన జ్ఞానానికి ఆశ్చర్యపడ్డారు. తరువాత, పరిశయ్యులు సద్దూకయ్యులు ఆయన ప్రత్యుత్తరము ఇవ్వలేకపోయారు, పిలాతు నోరు, రోమా గవర్నరు నోరు, ఆయన మాట్లాడితే మూయబడ్డాయి.

మన పాఠ్యభాగము చెబుతుంది, దేవుని సేవకుని గూర్చి,

"అతడు హెచ్చింపబడి, ప్రసిద్ధుడై మహా ఘనుడుగా ఎంచబడును" (యెషయా 52:13).

ఆధునాతన ఆంగ్లములోని మాటలు "హెచ్చింపబదుట", "ఎత్తబడుట", "అత్యధికముగా హెచ్చింపబడుట." డాక్టరు ఎడ్వర్డ్ జె.యాంగ్ ఏమన్నారంటే, “ఈ పదాలు చదవడం అసాధ్యం క్రీస్తు హెచ్చింపబడటం అంశం ప్రస్తావించకుండా, ఫిలిప్పీయులకు 2-9-11, అపోస్తలుల కార్యములు 2-33” (ఎడ్వర్డ్ జె.యాంగ్, పి.హెచ్.డి., ద బుక్ ఆఫ్ ఐసయ్యా, ఏర్దమాన్స్, 1972, ప్రతి 3, పేజీ 336). (Edward J. Young, Ph.D., The Book of Isaiah, Eerdmans, 1972, volume 3, p. 336).

"అందుచేతను పరలోకమందున్న దారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, ప్రతి నామము కంటే పై నామము ఆయనకు అనుగ్రహింపబడెను" (ఫిలిప్పీయులకు 2:9).

"ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హేచింపబడి…. పరిశుద్దాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు, వినుచునున్న దీనిని కుమ్మరించియున్నాడు” (అ.కా, 2:32-33).

"ఆలకించుడి, నాసేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి, ప్రసిద్దుడై మహా ఘనుడుగా వంచబడును". (యెషయా 52:13).

ఎత్తబడుట - "ఎక్కింపబడుట." హెచ్చింపబడుట - "పైకెత్తబడుట." చాల ఎత్తుగా - "అధికముగా హెచ్చింపబడుట." ఈ పదాలు క్రీస్తు పురోగ వృద్దిని ప్రతిబింబిస్తున్నాయీ. ఆయన మృతులలో నుండి లేచాడు! ఆరోహణుడై ఆకాశమునకు ఎత్తబడెను! దేవుని కుడి పార్శ్యమున ఆసీనుడైయున్నాడు! ఎత్తబడుట - "ఎక్కింపబడుట." హెచ్చింపబడుట - "పైకెత్తబడుట." చాల ఎత్తుగా - "అధికముగా హెచ్చింపబడుట." చాలఎత్తుగా – ఆకాశమందున్న దేవుని కుడి పార్శ్యమునకు! ఆమెన్!

చనిపోవుటకు పైకెత్తబడెను,
   "సమాప్తమైనది" ఆయనకేక;
ఇప్పుడు పరలోకములో పైకెత్తబడి;
   హల్లెలూయా! ఏమి రక్షకుడు!
("హల్లెలూయా ఏమిరక్షకుడు!” ఫిలిప్ పి.బ్లిస్ చే, 1838-1876).

"ఆలకించుడి, నాసేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హేచ్చింపబడి, ప్రసిద్దుడై మహాఘనుడుగా ఎంచబడును" (యెషయా 52:13)

యేసు తండ్రి, దేవునికి సేవకుడు-కుమారుడైన దేవుడు-మృతులలోనుండి లేపబడి, ఆకాశమునకు ఆరోహాణమై దేవునికి పార్శ్యమున ఆశీనుడాయెను! హల్లెలూయ! ఎంతటి రక్షకుడు!

II.  రెండవది, పాపముకొఱకు క్రీస్తు త్యాగము చూస్తాము.

దయచేసి 14వ వచనము బిగ్గరగా చదవండి.

"నిన్నుచూచి యేమనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటె అతని రూపమును చాల వికారమని చాలామంది యేలాగు విస్మయమొందిరో [ఆశ్చర్యం]" (యెషయా 52:14)

డాక్టర్. యంగ్ ఏమన్నాడంటే, "సేవకుని భయంకర కరరూపము విశ్శయము [బహుశ], అతని కరరూపము అతీతము మానవరూపము లేదు…… మానవుని పోలిలేనంత కరరూపము [బహుశ]. ఇది అతీతంగా చెప్పడం ఆయన ఎంత శ్రమ పడ్డాడోనని" (ఐబిఐడి., పేజీలు 337-338).

యేసు శ్రమ పడేటప్పుడు భయంకరంగా కురూపి అయ్యాడు. సిలువ వేయబడకమునుపు రాత్రి ఆయన “దు:ఖాక్రాంతుడైనాడు,”

"ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్దన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువులవలె ఆయన" (లూకా 22:44).

ఇది ఆయన బందింపబడకమునుపు, గేత్సమనే అంధకారములో, నీపాపము నిమిత్తము తీర్పు క్రిస్తుమీద పడెను. సైనికులు ఆయనను బంధించకముందే ఆయన చెమట రక్తముగా కారెను.

వారు ఆయనకు తీసుకెల్లి ముఖముపై కొట్టారు. ఇంకొక చోట, యెషయా ప్రవక్త శ్రమపడుచున్న సేవకుడు ఏమన్నాడో చెప్పాడు,

"కొట్టు వారికి నా వీపును అప్పగించమని, వెంట్రుకలు పెరికివేయువారికి నా చెంపలను అప్పగించితిని: ఉమ్మి వేయల వారికిని అవమాన పరుచు వారికిని నా ముఖమును దాచుకోనలేదు" (యెషయా 50:6).

లూకా అన్నాడు. "నిన్ను కొట్టినవాడేవడు ప్రవచించుమని ఆయనను అడిగిరి" (లూకా 22:64). మార్కు అన్నాడు పిలాతు "అతనిని అప్పగించెను" (మార్కు 15:15) యెహను అన్నాడు,

"అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను, [కొరడా దెబ్బలు కొట్టడం], సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి [కెరటములు], ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రములను తొడిగించి, ఆయన యొద్దకు వచ్చి యూదుల రాజా! శుభమని చెప్పి ఆయనను అరచేతులలో కొట్టిరి[కొట్టడం]" (యోహాను 19:1-3).

అప్పుడు అయన కాళ్ల చేతులను సిలువకు మేకులతో కొట్టారు. డా.యంగ్ పుట్ ఏమన్నారంటే, "ఆయన ఎంత కురూపియైనాడు అంటే మానవ పోలిక లేనివాడయ్యాడు” (ఐబిఐడి., ఫేజీ. 338).

“నిన్నుచూచి యే మనషి రూపముకంటే అతని ముఖమును, నగ రూపము కంటే అతని రూపమును, [అతని స్వరూపం], చాల వికారమని చాలామంది యెలాగు విస్మయ మొందిరో” (యెషయా 52:14).

ఆధునిక చిత్రపటాలు మెల్ గిబ్సన్ "ద పేషన్ ఆఫ్ ద క్రైస్ట్" అంత కచ్చితం కావు, ఆయనను అప్పగించినప్పుడు, కొట్టినప్పుడు సిలువవేసినప్పుడు.

ద స్కోఫిల్డ్ స్టడీ బైబిలు ఈ వచనము గూర్చి ఏమంటుందంటే, "అప్పగించడం అతి భయంకరం: ‘మానవరూపము కొల్పోయి, మానవ కుమారుని ఆకారము పోగొట్టుకొని’ - అమానపుడు-మత్తయి 26…..లో వివరించబడిన అతి భయంకర స్దితి”. జోషఫ్ హార్ట్ చే ఆలపింపబడిన గీతము వినండి (1712-1768),

ముళ్ళతో అయన ఆలయం చెదిరింది,
రక్తప్రవాహము ప్రతిభాగము నుండి;
ఆయన వెనుక భయంకర గాయాలు,
కాని తీవ్ర గాయాలు ఆయన గుండెను చోలిచాయి.

దిగంబరిగా చెక్కకు మేకులతో కొట్టబడ్డాడు,
భూమికి ఆకాశానికి పైగా ప్రదర్శింపబడ్డాడు,
గాయాల దెబ్బల మయము,
విశాద ప్రదర్శన గాయ మైనప్రేమ!
   ("హిస్ వేషన్" జోసఫ్ హార్ట్ చే 1712-1868;
     గీతాలాపన "ఇది “అర్దరాత్రి, ఒలీల కొండపై”).

ఎందుకు? ప్రియ రక్షకా, నాకు చెప్ప ఎందుకు
రక్తము కార్చు శ్రమ భరించి?
ఏ గోప్ప ఉద్దేశము నీవు కలిగి?
ఉద్దేశప్రణాళిక – ‘ప్రేమ కొఱకు!
   (“గెత్సమనె, ద ఓలివ్-ప్రెస్!" జోసఫ్ హార్ట్ చే, 1712-1768;
     గీతాలాపన- "ఇది అర్దరాత్రి, ఒలీలకొండపై”).

ఎందుకు ప్రియ రక్షకా? నాకు చెప్పు ఎందుకు నీ ప్రత్యక్షము "ఏ నరుని కంటే హీనముగా, మానవ కుమారులను మించి"? జవాబు 12వ వచనము 53వ అధ్యాయము ఆఖరిలో ఉంది, "ఆయన అనేకుల పాపములను భరించెను" (యెషయా 53:12). ఇది క్రీస్తు త్యాగము నీపాపముల కొఱకు, అతీత త్యాగము - యెసుశ్రమపడి నీ పాపముల కొఱకు చనిపోవుట, నీ స్థానములో - సిలువపై! ఈవిధంగా, మనము దేవునికి క్రీస్తు సేవ చూస్తాము, ఇట్లు మనము చూస్తాము క్రీస్తు త్యాగము నీ పాపముల నిమిత్తము రుసుము చెల్లించుట.

III.  మూడవది, మనం చూస్తాం క్రీస్తు రక్షణ వర్తింపు.

దయచేసి లేచి నిలువబడి యెషయా 52:15 గట్టిగా చదవండి.

"అలాగే అతడు అనేక జనములను చిలకరించును; రాజులు అతని చూచి నోరు మూసికొనెదరు; తమకు తెలియచేయబడని సంగతులు మీరు చూచెదరు; తాము వినని దానిని గ్రహింతురు" (యెషయా 52:15).

మీరు కూర్చోండి, డాక్టర్ యాంగ్ ఇలా అన్నారు. ఈ వచనంలో క్రీస్తు త్యాగము శ్రమ 14వ వచనంలో వివరింపబడి అన్వయింప బడ్డాయి,

ప్రవక్త వివరించాడు ఎంధుకు క్రీస్తు కురూపియైనాడని. ఈ కురూపి స్థితిలో "చాలా ధేశాలను ఆయన [క్రీస్తు] చిలకరిస్తాడు." కురూపియైన వ్యక్తి, సేవకుడు ఇతరుల కొరకు ఎధో చేస్తాడు, ధానిలో పవిత్ర పరిచే ప్రక్రియ చేస్తాడు. ఆయన కురూపత్వము [అలా భాదపడుతూ] ఆయన శ్రమలో, ఆ పరిస్థితితో ఆయనే ధేశాలకు కడుగుట తెచ్చాడు, క్రియ "ఆయన చిలకరిస్తాడు". [నిజాయితిగా] నీటి చిలకరింపు లేక రక్తములో కడుగుట (ప్రధానయా జాకుడైన క్రీస్తు) పని, ఈ పని ఉద్దేశం ఇతరులకు పవిత్రత శుభ్రత తెచ్చుట. ఆయనే నీళ్లను రక్తాన్ని ప్రొక్షీంచి చాలా రాజ్యాలను పవిత్ర పరుస్తాడు. ఆయన శ్రమపడు వానిగా చేస్తాడు. ఆయన శ్రమలు పవిత్రత కొఱకు ప్రగాఢ మార్పు తేవడానికి ప్రజల వైఖరిలో ఆయనను అప్పగించినవారు (ఐబిఐడి., పేజీ 338-339).

ఈప్రవచన నెరవేర్పులో, క్రీస్తు సువార్త ప్రభోధము యుధామత పరిధితెంచుకొని అంతర్జాతీయ మతమైంధీ. మొధటి శతాబ్ధము నుండి “చాలా ధేశాలు” సువార్తీకరింపబడ్డాయి. ప్రపంచంలో ప్రజలంతా ఏసు రక్తము చేత పవిత్ర పర్చబడి ఏసు క్రీస్తు నంధు రక్షణలోకి వచ్చారు. డాక్టర్ యాంగ్ అనినట్లు, "ప్రగాఢ మార్పు ఆయను అప్పగించిన వారి వైఖరిలో" ప్రపంచ ధేశాల రాజులు అందరు మారకపోయినా క్రైస్తవత్వము ప్రపంచమంతా వ్యాపించింధీ. "నోళ్ళు మూసుకున్నారు" నామ కార్ధ క్రైస్తలై ఆయనకు వ్యతిరేఖముగా మాట్లాడలేదు. ఈనాటికి, ఎలిజబెత్ రాణి II, “ఆయనను బట్టి”, నోరు మూసుకొని భక్తితో తల వంచి వెస్ట్ మిన్ స్టర్ ఎబ్బేలో క్రైస్తవ ఆరాధనలో మౌనము వహించారు. చాలా మంధీ నియంతలు పశ్చిమ ప్రపంచ భాగంలో, తూర్పులో, బాహు టేపు భక్తి చూపిస్తారు, విక్టోరియా రాణి లాంటి వారు, బాహాటపు గౌరవము కంటే ఎక్కువ భక్తి చూపుతారు. నిజంగా, కాన్ స్టెన్టీన్ చక్రవర్తి క్రైస్తవత్వపు తొలి సంవత్సరాల్లో మరియు ఇతరులు ఇలానే చేసారు.

"తమకు తెలియజెయబడని సంగతులు వారు చూచెధరు; తాము వినని ధానిని గ్రహింతురు" (యెషయా 52;15).

ప్రవక్త ముంధుగా చెప్పినట్లుగా, క్రీస్తు సువార్త ప్రపంచ ధేశాలకు విస్తరించింధీ.

"అలాగే ఆయన అనేక జనములను చిలకరించును" (యెషయా 52:15).

అమెరికా ధేశపు రాష్ట్రపతి కూడా, క్రైస్తవుని పేరు, గుడిలో తలవంచి ఆయన పట్ల "[ఆయన పట్ల] నోరు మూసుకొని ఉంటాడు."

అయితే నేను చెప్పాలి, ఆ అధ్బుత ఊహ ఐరోపా, యునైటెడ్ కింగ్ డమ్, అమెరికాలో ఎక్కువ లేదు. పాశ్చాత్య సంఘాలలో తికమక, శ్రమ ఉన్నాయి. బైబిలుపై ప్రతి ఘటన వలన, సంఘాలు బలహీన పడటం ఫిన్నీ చెప్పిన తప్పుడు సువార్త వలన, అధునాతన అనుచరులు అతని తప్పుడు పధ్ధతుల “నిశ్చయతతకు” మొగ్గారు. అయినను, విశాల మూడవ ప్రపంచంలో, మెల్కొలుపులు, ఉజ్జీవాలు, అపోస్తళత్వములో కనబడ్డాయి. పాశ్చాత్య సంఘాలను బలహీన పరిచి, యింకా పాలిస్తున్నాయి. మన హృదయాలు సంతోషిస్తాయి. మనం చదివేటప్పుడు చైనా, సౌత్ ఈస్ట్ ఏషియా, ఇండియా, ఇతర ప్రపంచ ప్రాంతాలు, సువార్త ప్రబోధ సంఘాలలోనికి ధూసుకొని వస్తున్నాయి! అవును వారు తరచూ హింసింపబడ్డారు, కానీ టెర్టుల్లియన్ అన్నట్లు, రెండవ శతాబ్దములో, "హంత సాక్షుల రక్తము సంఘమునకు విత్తనము." ఇది ఈరోజు నిజము. మూడవ ప్రపంచ దేశాల అంతటా, అమెరికా ఇతర పాశ్చాత్య దేశాలు క్రైస్తవ గతము నుండి పడిపోతున్నప్పుడు, మానవ నైతిక ఆధ్యాత్మిక తికమకలో ఉన్నప్పుడు, స్పర్జన్ ఊహించినట్లుగా,

ఏసు చిలకరిస్తాడు……., యూదులనే కాదు, అన్య దేశాలను ప్రతి చోట....అన్ని భూతలాలు నిన్ను గూర్చి వింటాయి, నీవు వస్తావని గడ్డి మీద మంచు వలె, వ్యాపించిన తెగలు నివసించు ప్రజలు సూర్యుడస్తమించు భూమి మీద నీ సిధ్ధాంతము విని, ఆస్వాదించి..... నీవు చిలకరిస్తావు అనేక దేశాలను నీ దయ గల మాటతో (ఐబిఐడి. పేజీ. 248).

స్పర్జన్ యొక్క “ప్రవచనాత్మక” సందేశము, ఈ రోజు నిజము వంద సంవత్సరాల క్రిందట చెప్పిన దాని కంటే, అందుకు మనము సంతోషిస్తున్నాము! ఆమెన్!

ఈవాగ్ధానము ఇంకను పూర్తిగా నెరవేరలేదు. కానీ జరుగును-ప్రభువు నోట వచ్చింది కాబట్టి - ప్రవక్త యైన యెషయా చెప్పినట్లు,

"జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు" (యెషయా 60:3).

"జనములు ఐశ్వర్యము నీ యొధ్ధకు వచ్చును" (యెషయా 60:5).

"చూడుడి, వీరు దూరము నుండి వచ్చుచున్నారు, వీరు ఉత్తర దిక్కు నుండియు పడమట దిక్కు నుండియు వచ్చుచున్నారు, వీరు సీనీయుల దేశమునుండి వచ్చుచున్నారు" (యెషయా 49:12).

జేమ్స్ హాక్ సన్ టేలర్, చైనా మిషనరీ, ఇలా అన్నారు, "సినిమ్" చైనాకు చెందిన భూమి, ద స్కొఫీల్డ్ స్టడీ బైబిలు, యెషయా 49:12 లో ఉన్నట్లు, ఎలా మనం అంగీకరించకుండా ఉంటాం? టేలర్ తోనూ స్కొఫీల్డ్ గమనికతోనూ మన కళ్లముందే చైనాలో జరుగుచున్నప్పుడు! తప్పక ఇది నిజము. ప్రతి గంటా చైనాలో, మరియు ఇతర దూర ప్రాంతాలలో, అన్వాయింపులో వేల మంది క్రీస్తు లోనికి మారుతున్నారు, అందుకు మనము ఉల్లాసిస్తున్నాం!

అమెరికా ప్రతి రోజూ గర్భ స్రావము ద్వారా మూడు వేల నిస్సహాయ పిల్లలను ఛంపుతున్నప్పుడు, వేలలో సంఘాలు మూతబడుచున్నప్పుడు, అయినను దూర ప్రాంతాలలో క్రీస్తు పని అభివృద్ది పొందుతూ ఉంది! దేవుడు వారికి ఇంకా ఎక్కువ మత మార్పిడిలు ఇస్తున్నాడు! దేవుడు ఇస్తున్నాడు! క్రీస్తును ఎరిగిన ప్రజలు ఆయన కొరకు ఇష్టపూర్వకంగా శ్రమ పడుతున్నారు. ఆయన రెండవ రాకడ లో రాజ్యాలలో రాణిస్తారు!

కాని, ఈ ఉదయాన్న నేను నిన్ను అడుగుతాను, "నీవు క్రీస్తును ఎరుగుదువా? ‘విశ్వాసము ద్వారా ఆయనను చూసావా? భయంకరంగా బంధింపబడిన ఆయనను నీ పాపముల కొరకు పరిహారము చెల్లించిన ఆయనను - అవును నీ కొరకు! ఆయన నీ పాపముపై రక్తము ప్రొక్షీంచాడా? పరలోకములో దైవ గ్రంధములో లిఖితమైందా? నీవు దేవుని గొర్రె పిల్ల రక్తము ద్వారా కడగబడి లోక పాపాన్ని తీసివేసావా? అలా కాక పోతే, ఆయన సన్నిధిలో "నోరు మూసుకుంటావా?" ఏసుకు తల ఒగ్గుతావా, మరియు ఆయనను ప్రభువుగా రక్షకునిగా స్వీకరిస్తావా? ఇప్పుడు నీవు అలా చేస్తావా?”

దయచేసి లేచి నిలువబడి పాటల పుస్తకములో ఏడవ నంబరు పాట పాడదామా.

మానవాళి నెరారోపణ బరువు రక్షకునిపై మోపబడినది;
ఒడంబడికతో వస్త్రము వలె ఆయన పాపుల కొరకు నలుగగొట్టబడ్డాడు,
పాపుల కొరకు నలుగగొట్టబడ్డాడు.

భయంకర మరణ ఛాయలలో ఆయన ఏడ్చెను, నా కొరకు ప్రార్ధించాడు;
ప్రేమించి కౌగలించుకున్నాడు నా నేరారోపణ ఆత్మను చెట్టుకు వ్రేలాడబడినప్పుడు,
చెట్టుకు వ్రేలాడబడినప్పుడు.

ఓ ప్రేమ ఆశ్చర్యం! ప్రేమ మానవ నాలుకకు అతీతమైన ప్రేమ;
      ప్రేమ నిత్యమైన పాట కథా వస్తువు.
నిత్యమైన పాట.
("లవ్ ఇన్ ఏగొనీ" విలియం విలియమ్స్ చే, 1759;
      ఆలాపన "మెజేస్టిక్ స్వీట్ నెస్ సిట్స్ ఎంత్రోనెడ్").

మీరు మాతో మాట్లాడాలనుకుంటే ఏసును నమ్ముట, క్రైస్తవుడవుట విషయాలలో ఆవరణ వెనుక భాగానికి వెళ్లండి. డాక్టరు కాగన్ నిశ్శబ్ధ ప్రాంతానికి మిమ్ములను తీసుకొని వెళ్ళి మాట్లాడతాడు. ఇప్పుడే వెళ్లండి. డాక్టర్ చాన్ స్పందించినడా రిక్కకు ప్రార్ధించండి. ఆమెన్.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసగాలు ప్రతీవారము”
అంతర్జాలములో www.realconversion.com ద్వారా చదువవచ్చు.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.


ప్రసంగం ముందు వాక్య పఠనము ఎబెల్ ప్రధొమె గారిచే మత్తయి 27:26-36.
ప్రసంగం ముందు పాట పాడినవారు బెంజమిన్ కీన్ కెయిడ్ గ్రిఫిత్:
"లవ్ ఇన్ ఏగనీ" (విలియం విలియమ్స్ చే 1759;
స్వరకల్పన "మెజేస్టిక్ స్వీట్ నెస్ సిట్స్ ఎంత్రోనెడ్").


ద అవుట్ లైన్ ఆఫ్

దైవ సేవకుని శ్రమలు విజయము!

(యెషయా 53 పై ఒకటవ ప్రసంగము)

డాక్టర్ అర్.ఎల్. హైమర్స్ గారిచే.

"ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి, ప్రసిద్దుడై మహా ఘనుడుగా యంచబడును. నిన్ను చూచి యే మనిషి రూపము కంటే అతని ముఖమును, నర రూపము కంటే అతని రూపమును, చాల వికారమని చాలా మంది యేలాగు విస్మయమొందిరో! అలాగే అతడు అనేక జనములను చిలకరించును, రాజులు అతని చూచి నోరు మూసి కొనెదరు, తమకు తెలియజేయబడని సంగతులు వారు చూచెదరు. తాము వినని దానిని గ్రహింతురు" (యెషయా 52:13-15).

( అపోస్తలుల కార్యములు 8:34-35 )

I.   మొదటగా, దేవుని పట్ల క్రీస్తు సేవను చూస్తాము, యెషయా 52:13,
ఫిలిప్పీయులకు 2:7 ఫిలిప్పీయులకు 2:9;
అపోస్తలుల కార్యములు 2:32-33.

II.  రెండవది, క్రీస్తు త్యాగము పాపము కొరకు మనం చూస్తాము, యెషయా
52:14 లూకా 22:44; యెషయా 50:6; లూకా 22:64; మార్కు 15:15;
యోహాను 19:1-3; యెషయా 53:12.

III. మూడవదిగా, క్రీస్తు రక్షణ వర్తింపు మనం చూస్తాం, యెషయా 52:15;
60:3, 5; 49:12.