Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
యేసు కార్చిన కన్నీళ్లు

THE TEARS OF JESUS
(Telugu)

డాక్టర్ ఆర్. యల్. హైమెర్స్ జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బాప్తిష్టు పెబెర్నేకల్ ఆఫ్ లాస్ ఎంజలాస్ లో బొదించబడిన ప్రసంగము
ప్రభువుదినము సాయంత్రము మార్చి 11, 2012.
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles Lord’s Day Evening, March 11, 2012

"కరీరదారియైయున్న దినములలో మహా ధనమును కన్నీళ్ళతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్ధనలను యాభానలకు సమర్పించి, భయభక్తులు కలిగియున్నందున ఆయన అంగీకరిపబడెను." ( హెబ్రూస్ 5:7)


ఈ సాయంత్రమునా అంశము "యేసు కన్నీళ్లు" ఆయన భూమిమీద ఉన్నప్పుడు యేసు మహా రోదనమును కన్నీళ్లను కార్చెనని వాక్యము తెలియపర్చుచున్నది, "అయన శరీరదరియైయున్నప్పుడు," "వ్యసనాక్రంతుడు దుఃఖముతో నిలబడినవాడు "(విషయం 53:3) లో యెషయా ప్రవక్త చెప్పాడు. ఈవివరణ ద్వార ఈభూమిలో సేవలో యేసు చాలాసార్లు విలపించినట్లు అగపడుచున్నది.

"దుఃఖక్రాంతుడు" యేమినామము
దైవకుమారుడు దిగి వచ్చెను
నశించిన పాపులను తిరిగి పొందుటకు
హల్లెలూయ! ఏమి రక్షకుడు!"
   (“Hallelujah, What a Saviour!” by Philip P. Bliss, 1838-1876).

దుఃఖ క్రాంతుడైన యేసు చాలాసార్లు విలపించాడు, అలాంటి మూడు సందర్భాలు, కనికరముతో కూడిన ఆయన ప్రేమ హృదయము బిబిల్లో లిఖితములైనవి,

I. మొదటిది, లాజరు సమాది దగ్గర యేసు కన్నీళ్ళు విడిచెను,

యేసు భేతనియకు వచ్చినప్పుడు ఆయన స్నేహితుడు లాజరు అప్పటికే మరణించెను, సమాధి చేయబడి నాలుగుదినములాయెను, ఆవ్యక్తి సహోదరి యేసును కలవడానికి వెళ్ళెను. "ఆమె ఏడ్చుటయూ ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయూ యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు - అతనినెక్కడ నుంచితరని అడుగగా వారు వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్ళు విడిచెను. కాబట్టి యూదులు అతనిని ఏ లాగు ప్రేమించేనో చుడుడని చెప్పుకొనిరి "(యెహోను 11:33-36).

మృతులలోనుండి లాజరును లేపగలడని యేసుడు ముందే తెలుసు అయినను ఏడ్చెను, మరియ ఇతరులతో పాటు. డాక్టర్ జాన్.ఆర్. రైస్ ఇలా చెప్పాడు,

యేసు ఎందుకు ఏడ్చాడు? కొద్ది నిమిషాలలో సంధిలో నుండి జరును బయటికి పిలుస్తాడని ఆయనకు తెలుసు. మరియ మార్త ఇతరులకొఱకు ఆయన ఏడ్చాడు. ప్రపంచంలో పగిలిన హృదయముతో అయన విలపించాడు. చనిపోయిన బిడ్డ కోసం ఏడ్చే తల్లి కొఱకు, భార్య నిమిత్తము అండగా నిలబడే ప్రతి భర్త కొఱకు అయన విలపిస్తున్నాడు, తప్పిపోయిన కుమారుడు కుమార్తెల కొఱకు విలపించే తల్లిదండ్రుల కొఱకు అయన దుఃఖిస్తున్నాడు. ఆకన్నీళ్ళు నీ కొఱకు నాకొఱకు మరియల శ్రమలు దుఃఖము ఉండే ప్రపంచము లోని వారి అందరి కొఱకు. మన శ్రమలను బట్టి ఆయన కలత చెందాడు. ప్రతి శ్రమలో ఆయన పాలి భాగస్తుడు అవుతాడు. (జాన్ ఆర్. రైస్. డిడి. దైవకుమారుడు, ప్రభువు ఖడ్గము 1976 పేజీ. 233)

బైబిలు చెబుతుంది "సంతోషించువారితో సంతోసించుడి ఏడ్చువారితో ఏడ్వడి. "(రీమా 12:15) డాక్టర్ రైస్ ఏమన్నారంటే "మనకు ఆజ్ఞాపింపబడిన వాటికంటే తక్కువ చేస్తామని యేసు భావిస్తాడని మనము భావింపరాదు. మన దుఃఖాల్లో ఆయన కూడ దుఃఖిస్తాడు అనేది అద్బుతమైన సత్యము యేసు పాపుల నిమిత్తము చాలాసార్లు ఏడ్చి ఉంటాడు మరియు యేసు కనికరముతో నింపబడ్డాడని "లేఖనాల్లో చెప్పబడింది, పవిత్రమైన ఆయన కన్నుల్లొని కన్నీటి బొట్టు ఆయన హృదయంలోని విచారాన్ని దుఃఖాన్ని మనం హించుకోవచ్చు.

నా పదిహేను సంవత్సరముల ప్రాయములో నాప్రియ మామ్మ చనిపోయింది. నేను ఎంతగానో ఆమెను ప్రేమించాను! ఆమె మరణించినప్పుడు వంటగదిలో తనదైన వస్తువును నేను తీసుకున్నాను, ఆవస్తువును 56 సంవత్సరాలు నాతోపాటు ఉంచుకున్నాను, నేను ఎక్కడికి వెళ్ళినా దానిని నాతో పాటు తీసుకొని వెళ్ళేవాడిని. నా చదువుకునే గదిలో అది ఉంది, ఈ ప్రసంగము రాస్తున్నప్పుడూ నేను దానిని చూస్తున్నాను, నేను బ్రతికినంతకాలము దానిని నాతో ఉంచుకుంటానని జ్ఞపకార్దంగా అని నా “తల్లితో” వాగ్దానము చేసాను.

చాల రాత్రులు నిద్రరానప్పుడు చిన్న బాలునిగా ఆమె పదకగదికి వెళ్లి ఆమె చాతిమీద నా తల ఉంచి ఆమె గుండె చప్పుడు వినేవాన్ని, ఆమెను ఎంతగానో ప్రేమించాను!

ఆమె సమాధి దగ్గర నిలబడి విలపించాను. నేను అదుపు చేసుకోలేకపోయాను. కొండపైకి పరుగెత్తాను. సమాధుల దొడ్డిలో పరుగులెత్తాను. నేల మీద పడి ఏడ్చి మూల్గాను అరణ్యంలో యాకుబు దగ్గరకు వచ్చినట్లు దేవుడు నా దగ్గరకు దిగి వచ్చాడు. నేను ఆయనతో ఇలా అని ఉండేవాడిని "నిజముగా ప్రభువు ఈ స్తలములో ఉన్నాడు, అది నేను గ్రహించలేదు" (ఆది కాండము 28:16).

ఓయవ్వనస్తుడా! లాజరు సమాదిదగ్గర యేసు ఏడ్చాడు.ఈ రాత్రి నీ కొఱకు ఆయన దుఃఖిస్తున్నాడు. నీ విచారములు భయములు ఆయనకు తెలుసు. నేను నిన్ను బ్రతిమాలుకోనుచున్నాను- అర్దిస్తున్నాను - నిత్య ప్రేమతో ప్రేమించే ఆయన దగ్గరకు నువ్వురా!

నిన్ను దీర్ఘంగా ప్రేమిస్తున్నాడు, మంచిగా ప్రేమిస్తున్నాడు,
ఉచ్ఛరింప నశక్యము గా నిన్ను ప్రేమిస్తున్నారు, నిన్ను
దీర్ఘంగా ప్రేమిస్తున్నాడు, మంచిగా ప్రేమిస్తున్నాడు, నరకము
నుండి నీ ఆత్మను రక్షించడానికి ఆయన మరణించాడు.
   (“He Loves You Still” by Dr. John R. Rice, 1895-1980).

డాక్టర్ హెన్రీ ఎమ్ మొర్రిస్ ఏమన్నారంటే!

యేసు నవ్వినట్లుగా బైబిల్ లో చెప్పబడలేదు, గాని ఆయన తరుచూ దుఃఖించారు. ఈ సందర్భములో మరియ మార్తల దుఃఖాన్ని ఆయన పంచుకున్నాడు ఆయన లాజరును కూడ ప్రేమించాడు. "ఆయన ఆత్మలో కలవరపడి ముల్గెను" (యేహను 11:33) మరణ పాపముల ఉనికి విషయము (Henry M. Morris, Ph.D., The Defender’s Study Bible, World Publishers, 1995 edition, p. 1154; note on John 11:35).

నిన్ను దీర్ఘంగా ప్రేమిస్తున్నాడు, మంచిగా ప్రేమిస్తున్నాడు,
   ఉచ్ఛరింప నశక్యము గా నిన్ను ప్రేమిస్తున్నారు, నిన్ను
   దీర్ఘంగా ప్రేమిస్తున్నాడు, మంచిగా ప్రేమిస్తున్నాడు, నరకము
నుండి నీ ఆత్మను రక్షించడానికి ఆయన మరణించాడు,

II. రెండవదిగా యేసు యెరూషరేము పట్టణమును గూర్చి కన్నీళ్లు విడిచెను.

డాక్టర్ జె.వెర్ నోన్ మెక్ గీ ఇలా అన్నారు "ఆయన యెరూషమేము పట్టణమును గూర్చి ఏడ్చాడు యెరూషలేమును గూర్చి ఏడ్చాడు, కనుక ఆయా పట్టణాలలో ఉండే నీ కొఱకు నా కొఱకు ఆయన ఏడ్చాడు. (J. Vernon McGee, Th.D., Thru the Bible, Thomas Nelson Publishers, 1983, volume V, p. 540, note on Hebrews 5:7).

"ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై యేడ్చి నీవు ఈ దినమందైనను సమాధాన బంధమయిన సంగతులను తెలిసికోనిన యెడల నీకెంతో మేలు గాని! ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి యున్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎగిరియుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టే ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టే నీలోనున్న నీ పిల్లలతో కూడ నిన్ను వేలకలిపి నీలో రాతి మీద రాయి నిలిచియుండనియ్యని దినములు వచునని చెప్పెను"(లూకా 19:41-44)

70 ఏ డి లో యెయాషముగా పట్టణమును చదును చేసి కాపురస్తులను నరికివేస్తాడు., యేరుషమేములోని సుందర దేవాలయము నాశనము చేయబడునని యెరిగి యేసు ఏడ్చాడు. ఆలయ సమీపములోని చిన్నగోడ తప్ప ఏదియును వదిలిపెట్టబడదు, ఆ గోడదగ్గర నిలబడి ముట్టుకున్నాడు. అక్కడ నేనుకూడా యెసులానె విలపించాను, దేవుని ప్రజలైన యూదులు శతాబ్దాలుగా భయంకర శ్రమల విషయాన్నీ తలంచి ఏడ్చాను.

ఈ రాత్రి యేసు రక్షింపబడుదని లక్షలాది ప్రజలతో నింపబడిన పట్టణాల గురించి ఎలా ఏడుస్తున్నాడు, వాషింగ్టన్ టన్, లండన్, పారిస్, బెర్లిన్, కలకత్తా, బీజింగ్ , గ్లాస్ గో , సిడ్నీ , మెక్సికో , సైగాన్, వియన్ టియాగ్, రంగూన్, జకార్తా, మాస్కో, ప్రపంచపు అన్ని పట్టణాలు పెద్దవి, చిన్నవి గురించి యేసు విలపిస్తున్నాడు. దేవుని గుండెను పగులగోట్టే విషయములను గూర్చి మన హృదయాలు పగుల గొట్టబడనివ్వండి !

ప్రతి సృష్టికి సువార్త ప్రకటించడానికి యేసు కన్నీళ్ళు మనలను నడిపిస్తాయి. ఆయనకు కన్నీళ్లు మనలను భాషనుండి భాషకు వెబ్ సైట్ కు సువార్త లో వీలైనంత మంది దగ్గరకు నడిపిస్తాయి. మనము మన “సంస్కృతిలో” సమాజ సమూహంగా రాము పగిలిన హృదయాలు కలిగిన యేసును వెంబడించు వారిగా మనము వస్తాము. అయన ప్రేమను పంచుతూ పాప మరణ నరకముల నుండి విముక్తి ఈ ప్రసంగము వినుచున్న చదువుచున్న వెబ్ సైట్ లో చూస్తున్న వారితో ఇలా అంటాం.

నిన్ను దీర్ఘంగా ప్రేమిస్తున్నాడు, మంచిగా ప్రేమిస్తున్నాడు,
   ఉచ్ఛరింప నశక్యము గా నిన్ను ప్రేమిస్తున్నారు, నిన్ను
   దీర్ఘంగా ప్రేమిస్తున్నాడు, మంచిగా ప్రేమిస్తున్నాడు, నరకము
నుండి నీ ఆత్మను రక్షించడానికి ఆయన మరణించాడు,

ప్రభువు కన్నీళ్ళు లాస్ ఏంజలస్ ను సువార్తికరించడానికి మనలను నడిపిస్తాయి! ఆయనలా అన్నాడు.

"అందుకు యజమానుడు నా యిల్లు నిండునట్లు నీవు రాజమార్గాములలోనికిని కంచెలలొనికిని వెళ్లి లోపలికివచ్చుటకు అక్కడి వారని బలవంతము చేయుము" (లూకా 14:23)

III. మూడవదిగా యేసు గెత్సమనే వనములో విలపించెను.

ఆయన విలాపమును గూర్చి ఇది మూడవ లిఖితము. ఆ వనములో గాడాంధకారములో ఆయన కన్నీళ్ళు కార్చాడు! యేసును గూర్చి మన వాక్యభాగము ఇలా చెబుతుంది,

"శరీరధారియై యున్న దినములలో మహా రోదనము తోను కన్నీళ్ళ తోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్ధనలను యాతనలను సమర్పించి, భయభక్తులు కలిగియున్నందున ఆయన అంగీకరీంపబడెను" (హేబ్రీయులకు 5:7)

గెత్సమనే వనములో, సిలువకు మేకులతో కొట్టబడక ముందు రాత్రి, యేసు ఒంటరిగా ప్రార్ధించాడు, చీకటి గెత్సమనే రక్షకుడు దేవునికి ప్రార్ధనలో తన ఆత్మను క్రుమ్మరించాడు. తన్ను మరణం నుండి రక్షింప గల వారికీ ప్రార్ధనలు సమర్పించి రోదనముతో కన్నీళ్లు తో ప్రార్ధించాడు. (హెబ్రీయులకు 5:7) దేనికి ఆయన భయపడ్డాడు? నేను నమ్ముతున్నాను, గెత్సమనే లోనే యేసు మరణిస్తాడేమోనని, సిలువకు వెళ్లక ముందే మన పాప విమోచనకు అని ఆయన భయపడ్డాడు. డాక్టర్ జాన్ ఆర్. రైస్. ఏమన్నారంటే "ఆ రాత్రి మరణపు పాత్ర తొలగింపబడి మరుదినము సిలువ మీద మరణించడానికి" యేసు ప్రార్ధించాడు. (రైస్ ఐబిఐడి పేజీ 441), డాక్టర్ జె. ఆలివర్ బస్ వెల్, ప్రఖ్యాత వేదాంతి అదే విషయాన్ని చెప్పారు. ఆయన ఏమన్నారంటే సిలువ మీద ఆయన చిత్తము నెర వేర్పు కొరకు, వనములో మరణం నుండి విడుదల కొరకు ప్రార్ధించాడు. ఈ తర్జుమా హెబ్రీయులకు 5:7 తో ఏకీభవిస్తుంది.” (J. Oliver Buswell, Ph.D., A Systematic Theology of the Christian Religion, Zondervan Publishing House, 1971, part III, p. 62).

డాక్టర్ బస్ వెల్ మరియు డాక్టర్ రైస్ లు డాక్టర్ మెక్ గీ తో ఏకీభవిస్తున్నారు. "నా స్నేహితుడా, ఆయన ఆలకింప బడుతున్నాడు. గెత్సమనే వనములో ఆయన మరణించలేదు." (ఐబిఐడి).

"శరీర ధారియై యున్న దినములో మహా రోదనముతోను, కన్నీళ్ల తోను, తన్ను మరణం నుండి రక్షింప గల వానికి ప్రార్ధనలను, యాచనలను సమర్పించి, భయభక్తులు కలిగిఉన్నందున ఆయన అంగీకరింపబడెను." (హేబ్రీయులకు 5:7).

ప్రపంచ పాపములు గెత్సమనే వనములో యేసు పై మోపబడెను.

“వారి యొద్ద నుండి రాతివేత చరారము వెళ్ళి మొకాళ్లుని, తండ్రీ నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము. అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్దించును గాక అని ప్రార్ధించెను. అప్పుడు పరలోకమునుండి యొక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. అయన వేదన పడిమరింత ఆతురముగా ప్రార్ధన చేయగా ఆయన చెమట, నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె అయ్యెను.” (లూకా 22:41-44).

దేవునిచే మన పాపములు ఆయనపై మోపబడి నప్పుడు యేసు గొప్ప వేదనతో ఉండెను. "వేదనలో మరింత పట్టుదలగా ప్రార్ధించెను", ఆయన చెమట రక్త బిందువుల వలే అయ్యెను. (లూకా 22:44). డాక్టర్ మెక్ గీ ఇలా అన్నారు. "సిలువను సమీపిస్తున్నప్పుడు ప్రభువు మరణమునకు సమీపముగా ఉన్నాడు. మరణ విముక్తి కొరకు ప్రార్ధించాడు. సిలువకు చేరువయ్యేందుకు మనకు చెప్పబడింది. భయంతో ఆయన మొర వినబడింది." (ఐబిఐడి) "కన్నీటి తోనూ మూలుగుతోను "యేసు చేసిన ప్రార్ధన దేవుడు విన్నాడు. గెత్సమనే అందకారాములో, మన పాప ప్రాయశ్చిత్తము సిలువపై చెల్లించుటకు దూత వచ్చి ఆయనను బలపరచింది. జోషఫ్ హార్ట్ యేసు ప్రార్ధనను గూర్చి ఆయన ఒక పాటలో ఇలా అన్నారు.

దైవకుమారుని శ్రమను చూడు,
శ్రమతో మూల్గుచున్న చెమటే రక్తముగా!
అంతరము లేని దైవిక కృప లోతులు!
యేసూ, ఎలాంటిది మీప్రేమ!
   (“Thine Unknown Sufferings” by Joseph Hart, 1712-1768).

యేసు నిన్ను ఎలా ప్రేమిస్తున్నాడో చూడు! నీ విచారమును బట్టి ఆయన కన్నీరు చూడు. పట్టములోని పాపులను గూర్చి ఆయన ప్రలాపము చూడు. గెత్సమనె లో ఆయన కన్నీటి మూలుగు చూడు. బ్రతకాలని దేవునితో మొర, తద్వారా మరు దినం సిలువ వేయబాడడానికి, మన పాపాలకు వెల చెల్లించడానికి, ఈ విషయం మిమ్మల్ని కదిలించడం లేదా? యేసు కన్నీళ్లు మిమ్మల్ని కదిలించకపోతే మరేమీ కదిలిస్తాయి? అయన ప్రేమను అనుభవించకుండా పాపముతో అంత కఠినులై పోయారా? డాక్టర్ వాడ్ పాట నాకు గుర్తోస్తుంది . "విచిత్ర సిల్వ జూదనా ". ఈ పాట నన్ను అప్పుడు కదిలించింది ,ఇప్పుడు కదలిస్తుంది .

విచిత్ర సిల్వ జూదనా,
   మహాత్ముడైన నా ప్రభూ,
యాస్తిన్ నష్టంబుగా నెంచి,
   గర్వం బణీంగ ద్రోక్కుదున్.

శిరంబు పాద హస్తమున్,
   సూచించు దుఃఖ ప్రేమలు,
మరెన్నడైన గూదెనా,
   విశాద ప్రేమ లీగతిన్.

లోకంబు నేనర్పించిన,
   నయోగ్యమైన యీవియౌ,
వింతైన యేసు ప్రేమకై,
   నా యావజ్జీవ మిత్తును,
(“When I Survey the Wondrous Cross” by Dr. Isaac Watts, 1674-1748).

ఈ సాయంకాలము మిమ్మల్ని బతిమాలుచున్నాను . యేసు నందు నమ్మండి, ఆయన యెద్దకురండి! ఆయన ముందు సాగిలపడండి. సమస్తముతో ఆయన యందు నమ్మిక ఉంచండి! డా. వాడ్స్ తో చెప్పండి. "వింతైన యేసు ప్రేమకై నా యావజ్జీవ మిత్తును", బెంజమిన్ బెద్దొమ్ 18 వ శతాబ్దములో ఒక చిన్న భాప్క్షిష్టు బోధకుడు. ఈ రోజు ఆయన వ్రాసిన పాటను బట్టి ఆయనను గూర్చి మనం తెలుసుకుంటున్నాం. "క్రీస్తు పాపుల కన్నీరు తుడిచాడా?"

క్రీస్తు పాపుల కన్నీరు తుడిచాడా,
   మగ చేక్కిల్లు నున్నగా ఉన్నాయా?
తీవ్ర వేదన ప్రవాహాలు
   ప్రతి కంటె నుండి తొలగింవబడును.

దైవ కుమారుడు కన్నీళ్ళు కార్చాడు
   దూతలు ఆశ్చర్య చకితులయారు!
నా ప్రాణమా ,నీకు ఆశ్చర్యమేనా,
   నీ కొఱకు ఆయన కన్నీరు కార్చాడు.

మన ఏడ్పు కొఱకు ఆయన ఏడ్చాడు;
   ప్రతి పాపానికి ఒక కన్నీటి బొట్టు;
పరలోకములోనే పాపము కానరాదు
   అక్కడ ఏడ్పు ఉండదు.
(“Did Christ O’er Sinners Weep?” by Benjamin Beddome, 1717-1795).

నేను రెండు ఉజ్జీవాలు రెండు దేవుని అసాదారణ కదలికలు చూసాను. రెండు సార్లూ ప్రజలు కన్నీరు కార్చి పాప ఒప్పుకోలుకు వచ్చారు. చైనాలో ఇది ఈ రోజు చూస్తాం. నిజ ఉజ్జివములో ఇది నిజము. "మన ఏడ్పుకేటికు ఆయన ఏడ్చాడు; ప్రతి పాపానికి ఒక కన్నీటి బొట్టు;" ఈ రాత్రి మీరూ పాపపు ఒప్పుకోలు పొందాలి, విలపించు రక్షకుని దగ్గరకు నువ్వు రావాలి. ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన నిన్ను రక్షిస్తాడు. ఇప్పుడే ఆయన నిన్ను రక్షిస్తాడు.!

గెత్సేమనే వనము నుండి విలపిస్తూ, రక్తం కార్చుకుంటూ ఆయన రావడాన్ని నువ్వు చూస్తే ఆయనను నువ్వు నమ్ముతావా? ఇప్పుడే ఆయనను నమ్ము. ఆనాటే క్రీస్తే, ఈ రాత్రి క్రీస్తు కూడ! చూడు ఆయన ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడో! ప్రేమ హస్తాలతో ఆయన నీ దగ్గరకు వస్తున్నాడు. ఆయన యందు నమ్మిక యంద, నమ్ము రక్షణమే రక్షింపబడతావు. ఆయన నీ పాపములను క్షమించి నీకు నిత్య జీవము అనుగ్రహిస్తాడు!.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసగాలు ప్రతీవారము”
అంతర్జాలములో www.realconversion.com ద్వారా చదువవచ్చు.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ప్రసంగమునకు ముందు బైబిలు పఠనము డాక్టర్ క్రీగ్టోన్ ఎల్ .చాన్ .లుకా: 22:39-45.
ప్రసంగమునకు ముందు పాటపాడినవారు బెంజమిన్ కియ్ కెయిడ్ గ్రిఫిత్.
“He Loves You Still” (by Dr. John R. Rice, 1895-1980).


ద అవుట్ లైన్ ఆఫ్

యేసు కార్చిన కన్నీళ్ళు

డాక్టర్ ఆర్ ఎల్ హీమర్స్ జూనియర్ గారిచే

"శరీరధారియైయున్న దినములలో మహారోదనముతోను, కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్ధనలను యంచనలను సమర్పించి భయ భక్తులు కలిగియున్న ఆయన అంగీకరింపబడెను" (హేబ్రియులకు 5:7)

(యేసయా53:3)

I.   మొదటగా, యేసు లాజరు సమాధి యొద్ద యేడ్చేను. యోహాను
11:33-36 రోమా 12:15 ఆదికాండము 28:16.

II.  రెండవదిగా , యేసు యొరూషలేము పట్టణము గూర్చి ఏడ్చెను లూకా 19:41-44 ;14:23.

III. మూడవదిగా, యేసు గెత్సే మనే వనములో ఏడ్చెను
హేబ్రియలకు 5:7; లూకా 22:41-44.