Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




నిజమైన మార్పు 2010 ప్రతి

REAL CONVERSION – 2010 EDITION
(Telugu)

డాక్టర్ ఆర్ ఎల్ హైమర్స్ జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

ఈ ప్రసంగము లాస్ ఎంజులాస్ లోని బాప్టిస్ట్ టేబర్ నేకల్ అను
సంఘములో బోధింపబడినది
ప్రభువు దినము ప్రాతః కాలము మే నెల 30, 2010
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Morning, May 30, 2010

“మీరు మర్పునోంది బిడ్డల వంటి వారైతే గాని పర లోక రాజ్యములో ప్రవేశించరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను "(మత్తయి18:3).


“యేసు నేరుగా ఏమని చెప్పారంటే మీరు మార్పునొందకపోతే పరలోక రాజ్యమున ప్రవేశింపరు. మీరు తప్పనిసరిగా మారిన అనుధవము కలిగియుండాలని ఆయన ఎంతో తేటతెల్లముగా స్పష్టముగా తెలియచేసారు. మార్పు అనే అనుధవము పొందకపోతే పరలోక రాజ్యములో ప్రవేశింపనేరరని ఆయన అన్నారు.”

ఈ ఉదయ కాలములో మార్పు అనుధవము పొందిన వ్యక్తిలో ఏమి జరుగుతుందో అనే విషయాన్ని మీకు నేను తెలియచేస్తాను. స్పర్జన్ గారు ఏమన్నారంటే "మొదటి చూపులో విశ్వాసం అనే అంశము కనిపించనప్పటికీ, దశల వారిగా విశ్వాసాన్ని చేరుకుంటాం", (సి.హెచ్. స్పర్జన్, క్రూరమైన ద్వారం చుట్టూ, పాసడేనా, టెక్సస్, పిల్ గ్రిమ్ ప్రచురణలు 1992 ప్రతి పేజి నెంబర్ 57). ఈక్రింది దశల ద్వారా చాలా మంది పయనిస్తూ ఉంటారు.

I. మొట్ట మొదటిదిగా మార్పు కొరకు కాకుండా వేరే కారణాల నిమిత్తము మీరు ఆలయానికి వస్తారు.

సామాన్యముగా ప్రతి ఒక్కరు ఇలాగే చేస్తారు. తప్పు కారణం కోసమని కొంత కాలంగా సంఘానికి వస్తూ ఉంటారు. నేను అలాగే చేశాను. కాబట్టి మీరు కూడా.

నేను యుక్త వయస్సులో ఉన్నప్పుడు మా పక్కింటి కుటుంబం ఆహ్వానించింది. కాబట్టి నేను వాళ్ళతో పాటు సంఘానికి వెళ్ళాను. 1954లో నేను ఒంటరిని కాబట్టి పక్కింటి వాళ్ళు మంచిగా ఉన్నారు, కాబట్టి నేను గుడికి వెళ్ళటం ప్రారంభించాను. అదే “సరైన” కారణం కాదు కదా? మొదటి ప్రసంగం ఆఖరిలో వెళ్లి విని బాప్తిస్యం పొందాను. ఆ విధంగా నేను బాప్టిస్టు వాడనయ్యను. కాని నేను మార్పు చెందలేదు. మాపొరుగు వారు మంచిగా ఉన్నారని నేను గుడికి వెళ్ళాను కాని రక్షణ పొందాలనే కారణంతో వెళ్ళలేదు. తద్వారా ఏడు సంవ త్సరములు శ్రమ ననుదవించి చివరకు సెప్టెంబర్ 28, 1961 వతేదీన డాక్టర్ చార్లెస్ జె.ఊడ్ బ్రిడ్జి గారి బోధ ద్వారా మార్పు పొందాను. ఈ ఘటన బయోలా కాలేజీ (ప్రస్తుతం బయోలా యూనివర్సిటీ) నందు సభవించింది.

మీ సంగతేంటి? మీరు ఒంటరిగా ఉన్న కారణాన గుడికి వచ్చారా? లేక చిన్న వయస్సులో మీ తల్లి దండ్రులు తీసుకు వస్తే వచ్చారా? ఈఉదయ సమయంలో ఒక అలవాటుగా లేక చిన్నపిల్లవానిగా ఈ సంఘములో ఎదుగుతున్నంత మాత్రాన నీవు మార్పు నొందిన వాడవుకావు, లేక మీరు కూడా నాలాగే ఒంటరిగా ఉన్నానని లేదా ఎవరో ఆహ్వానించారని, లేక వారు మీతో మంచిగా ఉన్నారని వచ్చారా? అదే నిజమైతే మీరు మార్పు పొందిన వారు కాదని అర్ధము. నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. మీరు ఇక్కడ ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను. అలవాటుగానో, చిన్నపిల్లవాని గానో, ఒంటరితనం వల్లనో నేను పదమూడు సంవత్సరాల వయస్సులో చేసినట్లు, అవి అర్ధం చేసుకోదగ్గ కారణాలే కాని, అవి మిమ్మలను రక్షింప నేరవు. మీరు రక్షింప బడడానికి నిజమైన మార్పు నొందాలి. రక్షింపబడాలనే తపన మీకు ఉండాలి. అది “సరియైన” కారణము .

ఏదో అలవాటుగానో, ఒంటరి తనము వలననో ఇక్కడ ఉండడం అనేది పొరపాటే కదా! గుడికి రావడంవలన మంచిగా అనిపిస్తుంది అనే కారణం కాదు కానీ మీరు మార్పు నొంద డానికి మీరు యింకా ఎక్కువ కోరుకోవాలి.

II. రెండవదిగా, నిజంగా దేవుడు ఉన్నాడు అనే విషయంలో మీరు తెలుసుకోవడం ప్రారంభిస్తారు.

మీరు గుడికి రాక ముందే దేవుడు ఉనికిలో ఉన్నాడన్న సంగతి మీరు గ్రహించి ఉండాలి. చాల మంది సువార్తతో భేటి కాక ముందు స్పష్టత లేని నమ్ముకున్న దేవునిని కలిగి యుంటారు. ఎవరో ముమ్మలను ఇక్కడకు తీసుకువస్తే మీ స్థితి కూడా బహుశా యిదే.

మీరు గుడిలో ఎదుగుతున్నప్పుడు లేఖనాల గురుండి చాలా విషయాలు మీకు ఇప్పటికే తెలిసిఉంటాయి. సులభంగా బైబిలులోని సరియైన స్థానాన్ని మీరు కనుగొనవచ్చు. రక్షణ ప్రణాళిక మీకు తెలుసు, చాలా బైబిలు వచనాలు, పాటలు మీకు తెలుసు, అయినప్పటికీ దేవుడు మీకు యింకా నిజం కానీ వాడిగా అస్పష్టంగా ఉంటాడు.

అప్పుడు మీరు కొత్త వ్యక్తీ అయినప్పటికీ గుడిలో పిల్లవాని వయస్సు అయినప్పటికీ, ఏదో జరుగబోతుంది, కేవలం దేవుని గూర్చి మాట్లాడు కుంటూ, నిజంగా దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించడం ప్రారంభిస్తారు. దేవుడు మీకు నిజమైన వ్యక్తిగా మారి పోతాడు. 15 సంవత్సరాల ప్రాయంలో దేవుని నిజత్వాన్ని నేను గ్రహించాను. మా అమ్మ గారిని సమాధి చేయు సమయంలో చెట్టు కింద సెమెట్రీలో నేను నేల మీద ఒరిగిపోయాను. అప్పుడు దేవుడు నిజంగా జీవించే వ్యక్తీ అని నేను తెలుసుకున్నాను. కానీ నేను ఇంకా మార్పు చెందలేదు.

అలంటి అనుభవమే మీరు కలిగి ఉన్నారా? మీ జీవితంలో దేవుడు ఒక నిజమైన వ్యక్తీయేనా? అది చాలా విశిష్టమైనది. బైబిలు ఏమి చెప్పుచున్నదంటే,

"విశ్వాసం లేకుండా దేవునికి ఇస్టుడైయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు తన్ను వెదుకు వారికీ ఫలము దయ చేయువాడనియు నమ్మవలెను గదా" (హెబ్రియులకు 11:6)

దేవుని యందు నమ్మికయున్చుటకు కొంత విశ్వాసము కలిగియుండుట అవసరముగాని అది రక్షించే విశ్వాసం కాదు. అది మార్పు కూడా కాదు. "నేను ఎల్లప్పుడూ దేవుని యందు నమ్మిక ఉంచుతాను" అని నా తల్లిదండ్రులు అనేవారు. ఆమె బాల్యము నుండి దేవుని యందు నమ్మిక కలిగి ఉండేది. కాని 80 సంవత్సరాల వయస్సు వరకు ఆమె మారలేదు. ఆమె దేవుని యందు విశ్వాస ముంచడం అవసరమే కాని నిజంగా మార్పు నొందడానికి దాని కంటే ఎక్కువ జరుగవలసియుంది.

నేను తెలియజేసేదేమిటంటే ఉదయ కాలమున మీరు దేవుని నిజత్వము తెలుసు కోకుండా గుడికి వచ్చియుండవచ్చు. కనుక నెమ్మదిగా, త్వరితంగా దేవుడు నిజంగా ఉన్నాడు అనే విషయాన్ని మీరు చూస్తారు. ఇది రెండవ దశ కానీ ఇది యింకా మార్పు కాదు.

III. మూడవదిగా, మీ పాపముల ద్వారా మీరు దేవుణ్ణి అభ్యంతర పెట్టారని కోపం పుట్టిండా రానే విషయం మీద గ్రహిస్తారు.

"కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోష పరచ నేరరు" (రోమం 8:8) మారని వ్యక్తిగా దేవుడిని సంతోష పరచడానికి మీరు ఏమి చెయ్యలేరు అనే విషయాన్ని మీరు గ్రహిస్తారు. నిజానికి నీవు పాపివనే సంగతి నీవు తెలుసుకుంటావు "మార్పు నొందని హృదయం వలన నీకు నీవే ఉగ్రతను సమకూర్చు కొందువు" (రోమం 2:5) బైబిలు ఏమి చెబుతుందంటే

"ఆయన ప్రతి దినం కోపపడదు దేవుడు"(కీర్తనలు 7:11)

దేవుడు నిజంగా ఉన్నారనే సంగతి మీరు గ్రహిస్తే పాపం చేయడం ద్వారా దేవుని మీరు గాయపరుస్తారు, అనే విషయాన్ని మీరు గ్రహించుకుంటారు. ఆయనను ప్రేమించకుండా మీరు ఆయనను బాధ పెట్టారు. దేవునికి ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా మీరు పాపాలు చేసియున్నారు. ఇప్పుడు మీకు తేటుగా ఉంది మరియు ఇది వాస్తవము. దేవుని పట్ల ప్రేమ కలిగి యుండకపోవడం ఒక గొప్ప పాపమని మీరు గమనిస్తారు. మీ స్వభావమే పాడ భూమిష్టమైనదని మీలో ఏ మతితనము లేదని.

మీ హృదయం పాపపూరితమైనదని మీరు తెలుసుకుంటారు. మేల్కొలిపే దశగా ఈదశను పూరిటన్లు అభివర్ణించారు. పూర్తిస్థాయి నోచ్చుకోలు పాపపు తీవ్రత గ్రహింపు లేకుండా మేల్కొలుపు సంభవింపదు. జాన్ న్యూటన్ వలే మీరు కూడా అనుభూతి పొందుతారు.

ఓ ప్రభువా నేను దుష్టుడను, అపరి శుద్దుడను, అపవిత్రుడను!
ఇంత ఘోర పాపపు భారంతో నేనెట్లు సాహసించగలను?
ఈచెడు హృదయం నీకు నిమిస స్థలము? ప్రతీ భాగంలో
నేను చెడు తనమునే వీక్షిస్తున్నాను.
   (“చె ప్రభువా నేనెంత దుష్టుడను” జాన్ న్యూటన్ 1725-1807)

నీ పాప దూలయిష్టమైన మనసు హృదయం గురించి నీవు లోతుగా ఆలోచించడం ప్రారంభిస్తారు. "నాహృదయం పాపముతో నిండుకొనియున్నది, దేవునికి దూరముగా ఉన్నది అని ఆలోచిస్తావు. ఆతలంపు నిన్ను తొందర పెడుతుంది. నీ పాపపు తలంపుల వలన దేవుని పట్ల నీకు ప్రేమ లేక పోవడం వలన నీవు ఎంతగానో కదిలింపబడుతావు. దేవుని పట్ల నీ హృదయ నిర్జీవత నిన్ను నేరుగా తొందరపెడుతుంది. పాప హృదయం కలిగిన నీలాంటి వ్యక్తికీ నిరీక్షణ ఉండదు అనే విషయాన్ని గ్రహించడం ప్రారంభిస్తావు. నీవు నరక పాత్రుడవని, దేవుడు నిన్ను నరకానికి పంపించడం సరియైనదని అవసరమని నీవు చూస్తావు. ఈ విధంగా నీవు ఆలోచించి నీ పాపముల ద్వారా నీవు దేవుని బాధపరిచావని ఆయన కోపాగ్నిని రేపావని నీవు మేల్కొలుపు కలిగి ఉంటావు. ఈ మేల్కొలుపు దశ ప్రాముఖ్యమైన దశ కానీ యింకా మార్పు పొందినట్లు కాదు. ఒక వ్యక్తీ తాను ఎంత ఘోర పాపియో అనే మేల్కొలుపు పొందుకుంటుందా కాని యింకా మార్పు నొందినవాడవు కావు. పాపపు ఒప్పుకోలు తదుపరి మార్పు ప్రాప్తిస్తుంది.

నీవు దేవుని అసంతృప్తి పరిచావని, నీవు దేవుని అభ్యంతర పరిచావని అనే సంపూర్ణ అవగాహన నీవు అకస్మాత్తుగా తెలుసుకుంటావు. నీవు పాపివని, అపరిశుద్దుడవని గ్రహించే ఆ మేల్కొలుపు నిన్ను మార్పులోని నాలుగవ “దశ” పట్ల నడిపిస్తుంది.

చార్లెస్ స్పర్జన్ తన 15వయేట ఈగ్రహింపును పొందుకున్నాడు. ఆయన తండ్రితాతలు ఇద్దరు బోధకులు. అధునాతన నిర్ణయత్వము మార్పు పట్ల అస్పష్టత కలిగించింది అని తలంచే దినాలలో వారు జీవించారు. కాబట్టి ఆయన తండ్రితాతలు క్రీస్తును గురించి నిర్ణయ విషయాలలో తనను బలవంతపెట్టలేదు. దానికి బదులు దేవుడే ఆయనలో పూర్తి స్థాయి మార్పు తెచ్చేటట్లుగా వారు కనుగొన్నారు. వారు సరియే అని నేను అనుకోనుచున్నాను.

15 సంవత్సరముల వయసులో లోతైన పాపపు ఒప్పుకోలును స్పర్జన్ పొందుకున్నాడు. పాపపు మేల్కొలుపు విషయములో స్పర్జన్ ఈ క్రింది విదంగా వివరించాడు.

అకస్మాత్తుగా దేవుని దర్మశాస్రమును మోసికొని వచ్చుచున్న మూషేను నేను కలిసాను. అగ్నినేత్రములతో ఆయన నన్ను చూసి పరిశోధించాడు. ఆయన ‘దేవుని పది ఆజ్ఞలను’ చదవమని నాకు చెప్పాడు. నేను వాటిని చదువుచుండగా అవన్నియు కలిసికట్టుగా పరిశుద్ద దేవుని దృష్టిలో నాపై నేరారోపణ చేస్తూ ఖండిస్తున్నట్లుగా నేను చూసాను.

ఆఅనుభవముతో దేవుని దృషిలో పాపినని ఆయన గమనిచిండు “మతము” కాని “మంచితనము” కాని రక్షింపలేవని గ్రహించాడు. యవనుడైన స్పర్జన్ ఎంతో నిరుత్సహా పరిస్థితి ద్వార వెళ్ళాడు. దేవునితో సమాధానపడాలని ఎన్నో స్వంత ప్రయత్నాలు చేసాడు, కాని దేవునితో సమాధానపడే ప్రక్రియలో ఆయన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.
-అప్పుడే ఆయన మార్పులోని నాల్గవ దశకు సంసిద్దమయ్యాడు

IV. దేవుని కుమారుడైన యేసుక్రిస్తూను నీవు సమీపిస్తావు.

పాపపు మేల్కొలుపు పొందిన తరువాత యేసునందు విశ్వసముంచడం ద్వారా రక్షింపబడతాడని స్పర్జన్ నమ్మలేదు. ఆయన ఇలా అన్నాడు.

క్రిస్తునోద్దకు రాకముందు నాలో నేనుయిలా అనుకున్నాను. "ఉన్న పాటున యేసును నమ్మితే నేను రక్షింపబడుదును అనేది అసత్యమా? నేను ఒక అనుభూతిని పొందాలి ఏదో చేయాలి".

కాని వాస్తవానికి ఏ “అనుభూతి” పొందలేదు ఏమి చెయ్యలేదు! ఆయన దుస్థితిలో ఉన్నాడు. మంచిదయింది! ఆస్తితే ఒక వ్యక్తిని దేవుని కుమారుడైన యసువైపు నడిపిస్తుంది!

స్పర్జన్ ఆచిన్న సంఘములో తుఫనుగుండా వెళ్ళాడు. కొంతమంది ప్రజలు అక్కడ ఉన్నారు. సంఘకాపరి కూడా తుపానునుండి దురపర్చబడ్డాడు. ఒక చిన్న వ్యక్తి భోదించడానికి నిలబడ్డాడు. ఆ వ్యక్తి అన్నాడు "క్రీస్తువైపుచూడు" చివరకు ఈ సంఘర్షణ మనోవేదన పొందిన తరువాత స్పర్జన్ మొట్టమొదటి సారిగా తన జీవితములో విశ్వసముద్వారా యేసుక్రీస్తు వైపు చూసాడు. స్పర్జన్ అన్నాడు "రక్తము ద్వారా రక్షింపబడ్డాను. గంతులువేసుకుంటూ ఇంటిముఖంపడతాను". స్పర్జన్ యేసువైపు చూసాడు. అయన యేసునోద్దకు ఇది సమన్యమేకాని ఒక మానవుడు పొందవలసిన అతి ప్రగాఢమైన అనుభవము. ఇది నిజమైన మార్పు నాస్నేహితుడా!

ముగింపు

నిజమైన మార్పు కొరకు క్రీస్తును గూర్చిన అన్వేషణ విషయములో ఏదియు నన్ను ఆపలేదు. యేసు ఏమి చెప్పాడో గుర్తుంచుకో.

"మీరు మార్పునోంది బిడ్డలవంటివారైతే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" (మత్తయి 18:3).

యంత్రికుని ప్రయానములను పుస్తకములోని ప్రముఖ వ్యక్తి వలె నీవు క్రిస్తునిగూర్చి ఒక అర్దరహిత నిర్దయానికి కట్టుబడి ఉండిపోవచ్చు, ఏ మాత్రము వద్దు నీ మార్పు వాస్తముగా ఉండేటట్లు నిర్ధారించుకో! ఎందుకంటే నీవు నిజముగా మార్పు పొందనిచో! “నీవు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరవు” (మత్తయి 18:3)

నిజమైన వాస్తవమైన మార్పు నొందడానికి

1.  ఒక దేవుడు నిజదేవుడు పాపులను నరకములో పడవేయగల, రక్షింపబడిన వారిని పరలోకానికి తీసుకొనివెళ్లగల ఒక దేవుడు నిజదేవుడు ఉన్నాడన్న వాస్తవాన్ని నీవు నమ్మాలి.

2.  నీవు పాపివని, లోతుగా దేవుని బాదపరిచావని నీ అంతరంగము నీవు గ్రహించగలగాలి. ఈ విధంగా నీవు చాల కాలయాపన చేసావని తెలుసుతోవాలి. మన పరిచారకుడైన డాక్టర్ కాగన్ గారు ఇలా అన్నారు "దేవుడా నా జీవితములో నిజమైనప్పుడు చాల నెలలు నేను నిద్రలేని రాత్రులు గడిపాను”. “మానసిక వేదనలో రెండు సంవత్సరాలు కాలము గడిపాను”. (సి.ఎల్ కాగన్. పి.హెచ్.డి. డార్విన్ నుండి డిజైన్ వరకు వైటేకర్ హౌస్ 2006 పేజి 41)

3.  ఏ దేవునికి అయితే నేవు కోపంరప్పించావో, బాధపరిచావో ఆ దేవునితో సమాధాన పడడానికి నీవు ఏ మంచిపని చేయలేవని నీవు తప్పనిసరిగా తెలుసుకోవాలి. నీవు చెప్పేదే, నేర్చుకున్నదీ చేసిందీ నీకు సహాయము చెయ్యలేవు. ఈవిషయం నీ మనసులోనీ హృదయములో తేటతెల్లమవ్వాలి.

4.  నీవు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నోద్దకు రావాలి. ఆయన రక్తంద్వారా నీ పాపాలు కడుగబడాలి. డాక్టర్ కాగన్ ఇలా అన్నారు. "నేను యేసును నమ్మిన ఆ రెండు క్షణాలు నాకు గుర్తున్నాయి. నేను వెంటనే యేసును ఎదుర్కొంటున్నట్లుగా అనిపించింది. యేసుక్రీస్తు సన్నిధిలో ఉన్నాను. ఆయన నాకు అందుబాటులో ఉన్నాడు. చాల సంవత్సరములు ఆయన నాకొరకు ఉన్నప్పటికీ, ప్రేమతో రక్షణ అందిస్తున్నప్పటికినీ నేను ఆయనను త్రోసిపుచ్చాను. ఆ రాత్రే నేను ఆయనయందు నమ్మకము ఉంచు సమయం ఆసన్నమైందని తెలుసుకున్నాను. ఆయన వద్దకు రావాలి లేకుంటే దూరంగా వెళ్లిపోవాలి అనే విషయం గ్రహించాను. ఆసమయంలో కొన్ని కొన్ని క్షణాల్లో నేను యేసునోద్దకు వచ్చాను. అప్పటి నుండి నేను నన్ను నేనే నమ్ముకునే అవిశ్వాసిని కాదు. నేను యేసుక్రీస్తు నందు నమ్మిక ఉంచాను. ఆయనయందు విశ్వాసముంచాను. ఇత అంత సామన్యమైనది. ఆ తక్కువ వ్యవధిలో ఆనమ్మికద్వారా నేను మార్పు అనే ఘట్టము ద్వారా యేసుక్రీస్తు చెంతకు చేరాను, జీవితకాలమంతా ఉండిపోతున్నాను. కాని ఆ రాత్రి నేను తిరిగి నేరుగా వెనువెంటనే యేసుక్రీస్తు నోద్దకు వచ్చాను. (సి.ఎల్ కాగన్ ఇ.డి. పేజీ19). ఇది నిజమైన మార్పు యేస్తుక్రిస్తు నందు ఈ మార్పును నీవు కచ్చితంగా అనుభవించాలి.


కోపంగా ఉన్నదేవునితో నిన్ను సమాధాన పరచుకొని నీ పాపాలు కడిగి వేయడానికి క్రీస్తు సిలువ మీద మరణించాడు. క్రీస్తు మ్రుతులలోనుండి శరీరంలో లేచి పరలోకమునకు ఆరోహణమయ్యాడు. నీవు రక్షింపబడాలని దేవునికుడి పార్శ్వమందు కూర్చొని నీ కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు.

"మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్యమందు కూర్చుండియున్నాడు. పైనున్న వాటిమీదనే కాని భూసంబందమైన వాటి మీద మనస్సు పెట్టి కొనకుడి”. (కొలస్సయులు 3:1-2)

క్రీస్తు వైపు చూడు! దేవుని కుమారుని వైపు చూడు! ఆయన రక్తంద్వారా నీ పాపములను కడుగుకో! జోషఫ్.ఆ హార్ట్ ఇలం అన్నారు.

ఒకపాపి విశ్వసమొందిన క్షణమే సిలువ వేయబడిన దేవునియందు
నమ్మిక యుంచిన వెంటనే, వెనువెంటనే క్షమాపణ పొందుకుంటాడు.
ఆయన రక్తము ద్వారా సంపూర్ణ విమోచన అందుకుంటాడు.
   ("పాపి నమ్మిక ఉంచిన క్షణమే" జోషఫ్ హార్ట్ చే1712-1768).

ఇదే స్పర్జన్ కు సంబవించింది, ఇదే డాక్టర్ కాగన్ కు జరిగింది. ఇదే నీకు కుడా జరగాలి. సజీవుడైన క్రీస్తుతో నీవు భేటి అవ్వాలి. ఆయన పవిత్ర రక్తం ద్వారా నీ పాపములు కడుగుకొనబడాలి.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసగాలు ప్రతీవారము”
అంతర్జాలములో www.realconversion.com ద్వారా చదువవచ్చు.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ప్రసంగము ముందు ప్రార్దన - “డాక్టర్ క్రిగాన్ ఎల్. చాన్”
ప్రసంగము ముందు పాడిన వారు “బెంజమిన్ కిన్ కెయిన్ గ్రిఫిత్”
"అమేజింగ్ గ్రేస్” (జాన్ న్యూటన్ చే 1725-1807).


ద అవుట్ లైన్ ఆఫ్

నిజమైన మార్ప-2010 ప్రతి

డాక్టర్ అర్.ఎల్ హైమర్స్ జూనియర్

“మీరు మార్పునోంది బిడ్డలవంటి వారితెనేగాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" (మత్తయీ 18:3).

I.   మొదటిగా, మార్పుకొరకు కాకుండా వేరే కారణాల నుమిత్తం మీరు గుడికి వస్తారు.

II.  రెండవదిగా నిజంగా దేవుడున్నాడు అనే వాస్తవాన్ని నీవు తెలుసుకుంటావు, హెబ్రీయులకు 11:6.

III. మూడవదిగా, నీ పాపముల ద్వారా నీవు దేవునికి కోపము
రేపావని, ఆయనను బాధ పెట్టావని నీవు గ్రహిస్తావు.
రోమీయులకు 8:8 రోమేయులకు 2:5, కీర్తనలు 7:11.

IV. నాలుగవదిగా, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వోద్దకు నీవు
వస్తావు కోలోస్సయులకు: 3:1-2.