Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




పిలాతు మరియు ప్రొక్యులా

PILATE AND PROCULA
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

లాస్ ఏంజలిస్ లోని బాప్టిస్టు టేబర్నేకల్ నందు బోధింపబడిన ప్రసంగము
ప్రభువుదినము సాయంకాలము, ఫిబ్రవరి 28, 2010
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, February 28, 2010

"అతడు న్యాయపీథము మీద కూర్చుండి యున్నప్పుడు, అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితిని: అతని యొద్దకు వర్తమానము పంపెను"
      (మత్తయి 27:19).


ఊహించినట్టుగా, అమెరికా వార్తలు మరియు ప్రపంచ నివేదిక మరియు వారపు వార్తలు రెండు చెప్పాయి బైబిలు తప్పు అని పొంతి పిలాటును చూపించడములో, అతడు రోమా గవర్నరు మరియు క్రీస్తును సిలువవేయడానికి అనుమతించినవాడు. వారపు వార్తలు పత్రిక ఇలా చెప్పింది,

పిలాతు వ్యకి ఆకారము కాదు [మెల్] గిబ్ సన్ [పేషన్ ఆఫ్ క్రైస్ట్] లో చూపించాడు. అలేగ్జెండ్రియా ఫిలో ప్రకారము, అభిప్రాయమేమిటంటే అది "మార్పు లేనిది, మొండిగా ఉండేది, క్రూర స్థితి," న్యాయ విచారణ లేకుండా తొందర చేసేవారిని శిక్షిస్తారు (Newsweek, February 16, 2004, p. 48).

న్యూస్ వీక్ పత్రిక ఇంకా ఏమి చెప్పిందంటే నాలుగు సువార్తల రచయితలు హద్దులు దాటి రోమా గవర్నరు మంచిగా చూపించారు క్రైస్తవ్యాన్ని "ఎక్కువ మంది ప్రేక్షకులకు చాలా ఆకర్షవంతంగా చేయడానికి" (ఐబిఐడి).

అమెరికా వార్తలు మరియు ప్రపంచ నివేదిక ఇలా చెప్తుంది,

పొంతి పిలాతు గిబ్ సన్ కు (లేక సువార్తలకు) అతీతుడు అతడు [వ్యక్తి] రూపములో ఉన్నవాడు, యేసును శిక్షించడం విషయంలో ప్రధాన యాజకుని ఒత్తిడికి దిగ్భ్రాంతి చెందాడు. అతడు, మొదటి శతాభ్దపు చరిత్రకారుడు, జోసఫస్ చెప్పినట్టు, భయంకర ఆవేశపరుడు, తిరుగుబాటుదారులను త్వరగా సిలువ వేస్తాడు (U.S. News and World Report, March 8, 2004, p. 42).

బైబిలు నమ్మే క్రైస్తవులుగా, మనము టైమ్, న్యూస్ వీక్, అమెరికా వార్తలు మరియు ప్రపంచ నివేదికలను నమ్మకూడదని నేర్చుకున్నాము, క్రైస్తవ్యముపై లౌకిక మాధ్యమము వ్యాఖ్యానించినప్పుడు కూడ మనము నమ్మకూడదు. ఉదాహరణకు, న్యూస్ వీక్ పత్రిక చెప్పింది యేసు విషయంలో నాలుగు సువార్తలలో పిలాతు ధోరణి అనుమానాస్పదముగా ఉందని చెప్పింది. కాని యేసుకు పిలాతుకు మధ్య జరిగిన దానికి ఫిలో ప్రత్యక్ష సాక్షియే కాదు. ఫిలో యేరూషలేముకు వందల మైళ్ళ దూరములో ఉన్న, అలేగ్జెండ్రియా, ఐగుప్తులో జన్మించి జీవించాడు. అతడు పిలాతును కాని యేసును కాని ఎన్నడు చూడలేదు! నేరుగా రాని సమాచారము ఆధారంగా అతడు రాసాడు. బ్రిటానికా నిఘంటువు చెప్తుంది ఫిలో "అతడు తన జీవితమంతయు అలేగ్జెండ్రియాతో గడిపాడు" (Encyclopedia Britannica, 1946, volume 17, p. 757).

అమెరికా వార్తలు మరియు ప్రపంచ నివేదిక చరిత్రకారుడు జోసేఫస్ ను గూర్చి ప్రస్తావించాడు. జోసేఫస్ 37 ఏ.డి. వరకు జన్మించలేదు, యేసు సిలువ వేయబడిన తరువాత నాలుగు సంవత్సరాల తరువాత (Encyclopedia Britannica, volume 13, p. 153). ఫిలో ఐగుప్తులో జీవించాడు. అతడు ఎన్నడు యేరూషలేములో లేడు. జోసెఫస్ అప్పటికి ఇంకా జన్మించలేదు. నాలుగు సువార్తలలో అపోస్తలులు ఇచ్చిన ప్రత్యక్ష కథనాలకు వ్యతిరేకంగా మాట్లాడడం సబబు కాదు. మత్తయి ఉన్నాడు. జరిగినది చూసాడు. మార్కు ఉన్నాడు. జరిగినది చూసాడు. యోహాను ఉన్నాడు. జరిగినది చూసాడు. జరిగినది చూచినా పేతురు ఇతరుల ప్రత్యక్ష సాక్ష్యుల విషయాలను లూకా తన సువార్తలో వ్రాసాడు. వారు నిజానికి అక్కడ ఉన్నారు. వారు ప్రత్యక్ష సాక్ష్యులు. ఫిలో మైళ్ళ దూరములో ఆఫ్రికాలో జీవించాడు మరియు జోసెఫస్ అప్పటికి జన్మించలేదు!

న్యూస్ వీక్ మరియు అమెరికా వార్తలు మరియు ప్రపంచ నివేదిక అపోస్తలుల ప్రత్యక్ష సాక్ష్యులను తిరస్కరిస్తున్నాయి, అప్పటికి ఇంకా పుట్టని వ్యక్తి నివేదికను ప్రోత్సహించారు, మరియు వారు వందల మైళ్ళ దూరములో ఉత్తర అమెరికాలో ఉన్న, వ్యక్తి చెప్పినవి నమ్ముతున్నాయి! అది పక్షపాతముగా విషయాలు చెప్పడం అనిపిస్తుంది! కాని లౌకిక వార్తా మాధ్యమాలలో కూడ – క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా పక్షపాతము ఉందని మనము నేర్చుకున్నాము. వారు వేరే పెద్ద మతానికి అలా చెయ్యరు, కాని వారు క్రైస్తవ్యమునకు బైబిలుకు వ్యతిరేకముగా మాట్లాడడానికి ప్రతి అవకాశము తీసుకుంటారు. అది వారి నుండి ఊహిస్తాము. డేవిడ్ లిం బాగ్ ఇలా అన్నాడు,

క్రిస్మస్ ఈస్టరు సమయాలలో ప్రసిద్ధ పత్రికలలో బైబిలు పర క్రైస్తవ్యానికి వ్యతిరేకముగా వచ్చు కథలను గూర్చి మీరు విన్నారా? రచయిత డాన్ పెడర్ గమనించాడు 1996 లో పరిశుద్ధ వారములో, న్యూస్ వీక్ మరియు అమెరికా న్యూస్ మరియు ప్రపంచ నివేదికలు క్రైస్తవ్యాన్ని కించపరుస్తూ కథలు వ్రాసారు (David Limbaugh, Persecution: How Liberals Are Waging War Against Christianity, Regnery Publishing, 2003, p. 271).

చాలామంది క్రమబద్ద రచయితలు గమనించారు ఎలా స్వతంత్ర వార్తలు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా పక్షపాతము చూపిస్తున్నాయో.

కొత్త నిబంధన గ్రంథము పొంతి పిలాతును తగ్గించి చూపడము లేదు. పిలాతు కఠిన రోమా గవర్నరు అని చెప్పడానికి మనకు ఫిలో గాని జోసెఫస్ గాని అవసరము లేదు. లూకా 13:1-2 చెప్తున్నాయి పిలాతు గలిలియలో చాలామంది యూదులను చంపించాడు అని. బైబిలు నిఘంటువు చెప్తుంది

పిలాతు యూదులతో ప్రసిద్ధి చెందలేదు. వారి మతపర ఒప్పందాలకు అతడు ప్రతికూలముగా ఉన్నాడు అతని సిద్ధాంతాలలో మొండిగా ఉన్నాడు. కాని యూదులు అతని పరిపాలనను ఆగ్రహముతో వ్యతిరేకించినప్పుడు, తరచూ అతడు తగ్గి, తన బలహీనతను పదార్శించాడు... పిలాతు సూత్రాలు లేని సాధించే వానికి తన స్వార్ధపు ఆశయాల సాధనలో మంచిని త్యాగము చేసే వ్యక్తిగా ఒక ఉదాహరణ పిలాతు. యేసు నిర్దోషితత్వాన్ని గుర్తించిన న్యాయము జరిగించడానికి అధికారము ఉన్నా యేసుని విడిచిపెట్టే హక్కు ఉన్నా, గుంపు మాటలకు లొంగి తన వ్యక్తిగత వ్యత్తి కాపాడుకోదలిచాడు పిలాతు (Herbert Lockyer, Sr., editor, Illustrated Dictionary of the Bible, Thomas Nelson, 1986, p. 842).

ఎందుకు, తరువాత, పొంతి పిలాతు యేసును సిలువ వేయడానికి వెనకాడడు? దానికి మూడు కారణాలున్నాయని అనుకుంటున్నాను: రాజకీయ పరిస్థితి, తన భార్య హెచ్చరిక, మరియు అతని బలహీన పరిస్థితి. ఒక వారము ముందే జన సమూహము యేసును యేరూషలేమునకు ఆహ్వానించారు అనే విషయము పిలాతుకు తెలియాలి. వారు ఇలా అరిచారు,

"జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చు చుండిన వారును: దావీదు కుమారునికి జయము; ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యేరూషలేములోనికి వచ్చినప్పుడు, పట్టణమంతయు, ఈయన ఎవరో అని, కలవర పడెను? జన సమూహము, ఈయన గలిలియలోని నజరేతువాడగు ప్రవక్తయైన యేసు అని చెప్పిరి" (మత్తయి 21:9-11).

ఇది తప్పక గవర్నరు దృష్టికి వెళ్ళింది. అతడు అప్పటికే యేసును గూర్చి ఆలోచిస్తున్నాడు. అప్పుడు యేసు దేవాలయమును శుద్ధి చేసాడు.

"యేసు దేవాలయములో ప్రవేశించి, క్రయ విక్రయములు చేయువారినందరిని వెళ్ళగొట్టి, రూకలు మార్చు వారి బల్లలను, గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి, నా మందిరము, ప్రార్ధన మందిరము అనబడును అని, వ్రాయ బడియున్నది; అయితే మీరు దానిని దొంగల గుహగా చేసెడివారనెను. గ్రుడ్డివారును కుంటి వారును దేవాలయములో ఆయన యొద్దకు వచ్చిరి; మరియు ఆయన వారిని స్వస్థ పరిచెను" (మత్తయి 21:12-14).

పిలాతుకు ఇదంతా తెలుసు, కూడ.

యేరూషలేములోనికి జయోత్సాహ ప్రవేశము, దేవాలయమును శుద్ధి చేయుట, అసాధారణ స్వస్థతలు – గవర్నరుగా పిలాతు, ఈ విషయాలన్నీ విన్నాడు. అప్పుడు వారు యేసును అతని దగ్గరకు తెచ్చారు. అతడు యేసును ఇలా ప్రశ్నించాడు,

"అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తర మియ్యలేదు; గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను" (మత్తయి 27:14).

రెండవదిగా, అతని భార్య తనకు ఒక వర్తమానము పంపింది. మనము లేచి నిలబడి గట్టిగా మత్తయి 27:19 చదువుదాం,

"అతడు న్యాయ పీఠం మీద కూర్చుండి యున్నప్పుడు, అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికిపోవద్దు, అని చెప్పెను: ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితిని అతని యొద్దకు వర్తమానము పంపెను" (మత్తయి 27:19).

కూర్చోండి.

ప్రాచీన సంప్రదాయ ప్రకారము అతని భార్య యూదా మతమునకు మారినది. పిలాతు ఒక ఆధునిక వ్యక్తి కాదు. రోమీయునిగా, అతడు చాలా దేవుళ్ళను నమ్మాడు, ఆత్మలను కూడ – మంచివి చెండవి, కళలు దర్శనములు. లేఖనాలు తరచి చూస్తే, పిలాతు తన భార్యతో సన్నిహితంగా ఉండేవాడు. ఆమె పేరు క్లాదియా ప్రొక్యులా. ఒక ప్రాముఖ్యమైన వాదన మధ్యలో ఆమె అతనికి ఒక సందేశము పంపడం, వారు సన్నిహితాన్ని చూపిస్తుంది.

కనుక, పస్కా వారములో ఈ ప్రాధాన్య కార్యక్రమము సన్నివేశము ఉంది. క్రీస్తు జయోత్సాహ ప్రవేశము ఉంది, జన సమూహపు ఆనంద ద్వనుల మధ్య. తరువాత దేవాలయము శుద్ధి చేయబడింది. మెల్ గిబ్ సన్ సరిగ్గా చెప్పాడు పిలాతు ఇలా చెప్పినప్పుడు, "ఈ ప్రవక్తను మీరు పట్టణములోనికి ఆహ్వానించలేదా? ఈ పిచ్చితనము మీరు నాకు వివరిస్తారా?" (cf. Newsweek, February 16, 2004, p. 49). అదే సరి అనిపిస్తుంది. అలాంటి తలంపులను పిలాతు కలిగియున్నాడు.

తరువాత, యేసును గూర్చిన హెచ్చరిక సమాచారము అతని భార్య తనకు పంపించింది – విచారణ సమయములో. ఆ సమాచారములోని శక్తి మూఢచార రోమీయుని కలవరపరచి ఉంటుంది.

మూడవది, పిలాతు చాలా బలహీన పరిస్థితిలో ఉన్నాడు. లీ స్ట్రాబెల్ ఇలా చెప్పాడు

     కొంతమంది...విమర్శకుల సువార్తల కచ్చితత్వాన్ని ప్రశ్నించారు రోమా నాయకుని ప్రదర్శించిన విషయములో. నూతన నిబంధన గ్రంథము అతనిని యేసును శిక్షించే విషయములో, ఒత్తిడి చేస్తున్న యూదా జనంగానికి లొంగిపోయినట్లు చూపిస్తుంటే ఇతర చరిత్రలు అతనిని కఠినాత్మునిగా చూపిస్తున్నాయి.
     [కాని డాక్టర్ ఎడ్విన్ యమాచీ, ప్రసిద్ధ ఖగోళ శాస్త్రవేత్త మరియు బైబిలు పండితుడు ఇలా చెప్పాడు, తన 1968 పుస్తకములో, పొంతిపిలాతును గూర్చి ఇలా అన్నాడు]" ...[పిలాతు] సంరక్షకుడు సెజనాస్ ఏ.డి. 31 క్రీస్తు తరువాత అధికారము కోల్పోయాడు ఎందుకంటే అతడు అధిపటికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నాడు... అందుకు అది పిలాతు స్థానాన్ని బలహీన పరచింది ఏ.డి. 33 లో... యేసు సిలువ వేయబడే సమయములో. కాబట్టి అర్ధం అవుతున్న విషయము ఏమిటంటే పిలాతు సందిగ్ధములో ఉన్నాడు...దాని అర్ధము బైబిలు వివరణము...సరియే" (Lee Strobel, The Case For Christ, Zondervan, 1998, p. 85).

ఆ మూడు కారణాలను బట్టి యేసును సిలువ వేయడం విషయములో పిలాతు ముభావముగా ఉండడములో ఏమి ఆశ్చర్యము లేదు. పిలాతు మనసు నిస్సందేహంగా యేసు అసాధారణ శక్తి కలిగియున్నాడని గ్రహించింది. బైబిలు చెప్తుంది అతడు "అత్యధికంగా ఆశ్చర్యపోయాడు" [అత్యంత ఆశ్చర్యపోయాడు] అతని ప్రశ్నలకు యేసు చాలా తక్కువ జవాబులు చెప్పినందుకు. మరియు, అందుకు, అతను కూడ విసిగిపోయాడు. తన భార్య వింత కళను గూర్చి ఆలోచించాడు. యేసు తనతో ఇలా చెప్పడం విన్నాడు,

"పై నుండి నీకు ఇయ్యబడియుంటేనే తప్ప, నా మీద నీకు ఏ అధికారము ఉండదు..." (యోహాను 19:11).

మొత్తంమీద, అతని మూడాచార, అన్య హృదయములో, పిలాతుకు తెలుసు తను అసాధారణ దేవునితో – సంధిస్తున్నాడని. తన భార్య మాటలు తన మనసులో మెదిలాయి,

"నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు: ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధ పడితినని అతని యొద్దకు వర్తమానము పంపెను" (మత్తయి 27:19).

పిలాతు భార్య తనకు పంపిన వర్తమానమును మనము సన్నిహితముగా చూద్దాము.

I. మొదటిగా, అది పాపమునకు వ్యతిరేకముగా హెచ్చరిక.

ఇది అర్ధపూరిత కల. పాత నిబంధన గ్రంథములో దేవుడు తరచూ కలల ద్వారా మాట్లాడాడు. ఫరోతో దేవుడు ఐగుప్తులో కలద్వారా మాట్లాడాడు. నెబుకద్నేజరుతో దేవుడు కల ద్వారా మాట్లాడాడు. రాజైన హేరోదు నుండి తప్పించుకోవడానికి, యేసును ఐగుప్టునకు తీసుకెళ్ళమని దేవుడు యేసేపుతో కలలో మాట్లాడాడు. ప్రోకులా కల మానసిక వేదనతో నిండి ఉంది. ఆమె ఇలా చెప్పింది, "నేను చాలా బాధపడ్డాను... కలలో ఆయనను గూర్చి" (మత్తయి 27:19). గ్రీకు పదము "శ్రమపడుట" "పాస్కో" నుండి వచ్చినది. అది "తపనగా" అనువదింపబడినది అపోస్తలుల కార్యములు 1:3 లో, క్రీస్తు తపనను గూర్చి, క్రీస్తు శ్రమను గూర్చి. పిలాతు భార్య, ప్రోకులా, తన కలలో క్రీస్తు భయంకర శ్రమలను చూసింది. ఆమె తన భర్త యొక్క భయంకర కర్మను కూడ చూసి ఉంటుంది.

తప్పకుండా ఆమె కల పాపమునకు వ్యతిరేకముగా ఒక హెచ్చరిక. అది పిలాతు మనస్సాక్షితో మాట్లాడింది. ప్రొకులా చెప్పింది యేసు "సాధారణ వ్యక్తి" మాత్రమే కాదు, నీతిమంతుడు అని. పిలాతు స్వంత మనస్సాక్షి ఆమెతో ఏకీభవించింది. తన చేతులు కడుగుకొనిన తరువాత, అతడు యేసును "యితడు కేవలం వ్యక్తి మాత్రమే కాదు," ఈ నీతిమంతుడు అన్నాడు క్రీస్తును గూర్చిన వివరణ విషయంలో భార్యతో ఏకీభవించాడు (మత్తయి 27:24). తన భార్య మాటలతో ప్రభావితుడైన, అతడు ఇటు అటు ఊగిసలాడాడు. ఒక వైపు తన స్వంత మనస్సాక్షితో, ఇంకొక వైపు భయముతో ఉన్నాడు.

అప్పుడు జన సమూహము ఇలా కేకలు వేసింది,

"నీవు ఇతని విడుదల చేసితివా, క్రైస్తవునకు స్నేహితుడవు కాదు: తాను రాజునని చెప్పుకొను ప్రతివాడును కైసరునకు విరోధముగా మాటలాడుచున్నవాడే అని కేకలు వేసిరి" (యోహాను 19:12).

అది అతడిని గీత వెంబడి తోయబడింది. డాక్టర్ రైరీ ఇలా అన్నాడు,

రోమాకు ఇంకొక నివేదిక వెళ్ళాలను అతడు కోరుకోలేదు యూదా సంప్రదాయాలను అభ్యంతర పరిచాడని పరిస్థితిని అదుపు చేయలేకపోయాడని – [అధిపతి] కి చెయ్యబడిన నేరములు (Charles C. Ryrie, Ph.D., The Ryrie Study Bible, note on Mark 15:1).

ఆ...అధికారాలు యేసుపై ఉన్న నేరాలకు స్పందించి, గవర్నరుకు ముప్పు వాటిల్లేటట్టు చేసారు [పిలాతులాంటి వారు] అతడు అధిపతి [తైబెరియన్] ఇష్టాన్ని బట్టి పరిపాలించాడు. యూదులు ఇప్పటికే రోమ పిలాతు చేష్టలను వ్యతిరేకిస్తున్నారు ఇతర విషయాలలో అందులో అతడు వారి సంప్రదాయాలకు భిన్నంగా ఉన్నాడు (ibid., note on John 19:12).

కనుక మనిషి పట్ల భయము ప్రోకుల హెచ్చరికను త్రోసి పుచ్చేదిగా పిలాతును చేసింది, తన మనస్సాక్షికి భిన్నంగా వెళ్ళాడు, పాపము చేసాడు. బైబిలు చెప్తుంది,

"భయపడుట వలన మనష్యులకు ఉరివచ్చును" (సామెతలు 29:25).

యేసును గూర్చి ఆలోచించే వారు ఈ సాయంకాలము ఇక్కడ ఉన్నారు. పిలాతు వలే, మీరు కూడ ఆయనను గూర్చి హెచ్చరింపబడియున్నారు. పాపము నుండి తిరిగి క్రీస్తును విశ్వసించాలని మీకు చెప్పబడింది. అది మీరు చేయగలరా? "చేతులు కడుగుకోడానికి" బలమైన శోధన ఉండవచ్చు పిలాతు వలే, యేసు నుండి వెళ్లిపోవచ్చు. "పిచ్చివాడవు" కావద్దని ప్రజలు మీకు చెప్తారు. క్రీస్తు నుండి మిమ్ములను లాగుతారు. మీరు ఏ మార్గములో వెళ్తారు? క్రీస్తు నొద్దకు వచ్చి రక్షింపబడతారా? క్రీస్తు వ్యతిరేకుల వైపు మీరు మరలుతారా? పిలాతునకు వలే మీకు అలాంటి ఎన్నికే ఉంది. పిలాతు భార్య హెచ్చరించింది, కాని అతడు సందేహించాడు – చాలా దూరముగా!

II. రెండవది, ఆ హెచ్చరిక తిరస్కరింపబడినది.

ఇక్కడ తప్పు చెయ్యకూడదు. పిలాతు తన భార్య హెచ్చరిక తిరస్కరించాడు. ఆమె దైవిక సలహా వినకుండా అతడు జన సమూహాన్ని వెంబడించారు. జాన్ ట్రేప్ ఇలా అన్నాడు, "అది [పిరికితనము] కాదా మరియు పిలాతు యొక్క ప్రజాదరణ పోయిందా, మరియు అతడు ఆదిపత్యం చూపిస్తున్నాడు, అతడు జన సమూహాన్ని ఎదుర్కొన లేకపోయాడు?" (John Trapp, A Commentary on the Old and New Testaments, Transki Publications, 1997 reprint, volume V, p. 271).

అతని భార్య మాట ఎందుకు వినలేదు? ఎందుకంటే స్వంత ఆసక్తి మరియు పిరికితనమును బట్టి. ఆమె మాట వింటే గవర్నరుగా తన పదవి పోతుందని భయపడ్డాడు.

క్రీస్తును విశ్వసిస్తే ఏదో కోల్పోతారని మీరు భయపడుతున్నారా? నాలుగుసార్లు సువార్తలలో వ్రాయబడింది యేసు ఇలా చెప్పాడు,

"తన ప్రాణమును రక్షించు కొనగోరువాడు దాని పోగొట్టుకొనును" (మత్తయి 16:25; మార్కు 8:35, లూకా 9:24; లూకా 17:33).

మత్తయి 16:25-26 బైబిలులో చూడండి. లేచి నిలబడి రెండు వచనాలు గట్టిగా చదువుదాం. యేసు చెప్పాడు,

"తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును: నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని దక్కించుకొనును. ఒక మనష్యుడు లోకమంతయు సంపాదించుకొని, తన ప్రాణమును పోగొట్టుకుంటే, అతనికేమి ప్రయోజనము? ఒక మనష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు?" (మత్తయి 16:25-26).

కూర్చోండి.

మీ ప్రాణమును దక్కించుకోవాలనుకుంటే, దానిని పోగొట్టుకుంటారని యేసు చెప్పాడు. ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే తనకేమి ప్రయోజనము? పిలాతు తప్పుడు ఎన్నిక చేసాడు. మరో మూడు సంవత్సరాలకు – గవర్నరు ఉన్నాడు – కాని తన ప్రాణమును పోగొట్టుకున్నాడు.

జోసెఫస్ చెప్పాడు సమరయులతో జరిగిన దాడి సమయములో, పిలాతుపై అధికారి, విటేల్లియస్ కు, సిరియా గవర్నరుకు ఫిర్యాదు చేసారు. విటేల్లియస్ రోమాలో అధిపతి ముందు నిలబడి సంజాయిషీ చెప్పమన్నాడు... ఎసూబియాస్ చెప్పాడు...అతడు (ఫ్రాన్స్) లోని గాల్ కు బహిష్కరింపబడ్డాడు అక్కడ అతడు ఆత్మహత్య చేసుకున్నాడు (Illustrated Dictionary of the Bible, ibid.).

తన భార్య ద్వారా దేవుడిచ్చిన హెచ్చరికను పిలాతు తిరస్కరించాడు. పిలాతు అంతా కోల్పోయాడు – తన ప్రాణమును కూడ. పిలాతు అంటే ఒకటే విషయము జ్ఞాపకానికి వస్తుంది యేసు క్రీస్తు విచారణకు అతడు అధ్యక్షత వహించాడు! పిలాతు భార్య అతనిని హెచ్చరించింది – కాని తన హెచ్చరికను అతడు తిరస్కరించాడు.

III. మూడవది, ఆ హెచ్చరికకు భయంకరమైన పర్యవసానాలు ఉన్నాయి.

వ్యాఖ్యాత జాన్ ట్రేప్, ఇలా చెప్పాడు, "ఓపన్ ప్రోవిటెంట్ డీ; నాన్ ఎట్ సాల్వ రేటర్ క్రైస్టస్, సేడ్ ఎట్ సేర్వరేటార్ ఉక్సోర్," – "దేవుని నిర్ణేత కార్యము, యేసు క్రీస్తును రక్షించడానికి కాదు, కాని తన భర్తను సేవించడానికి" (John Trapp, A Commentary on the Old and New Testaments, Transki Publications, 1997 reprint, volume V, p. 271). థిమోఫిలాక్ట్ నిపుణ జ్ఞానయుక్త ఇరవైవ శతాబ్దపు గ్రీకు బైబిలు వ్యాఖ్యాన కర్త. అతడు చెప్తాడు ప్రోకులా హెచ్చరిక యేసును రక్షించడానికి ఇవ్వబడలేదు, కాని తన భర్తను సేవించడానికి. "ఆ నీతిమంతుని జోలికి పోవద్దు" (మత్తయి 27:19). దేవుడు తన భర్తను ఆ కలతో బాగానే సేవించాడు, కాని అతడు తన భార్య హెచ్చరికను తిరస్కరించాడు. దయచేసి అపోస్తలుల కార్యములు 13:28-31 చూడండి. మనము నిలబడి ఈ నాలుగు వచనాలు గట్టిగా చదువుదాం.

"ఆయన యందు మరణమునకు తగిన హేతువేదియు కనబడకపోయినను, ఆయనను చంపింపవలెనని వారు పిలాతును వేడుకొనిరి. వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నియు, నెరవేర్చిన తరువాత ఆయనను మ్రాను [సిలువ] మీద నుండి దింపి, సమాధిలో పెట్టిరి. కాని దేవుడు మృతులలో నుండి లేపాడు: మరియు అతడు గెలిలియ నుండి యేరూషలేము వస్తున్న వారందరిని చాలా రోజులుగా ఎదురుచూశారు, ఆయనకు సాక్ష్యులకు ప్రజల కొరకు ఎదురు చూసారు" (అపోస్తలుల కార్యములు 13:28-31).

యేసు సజీవుడు. ఆయన మృతులలో నుండి లేచాడు. పిలాతు చనిపోయాడు. తన భార్య దైవిక హెచ్చరికలను అతడు పెడచెవిన పెట్టాడు. తన ఆత్మను పోగొట్టుకున్నాడు - నిత్య నరకములో.

స్పర్జన్ అన్నాడు ప్రోకులా నిలబడి తన భర్త, పిలాతును, ఆఖరి తీర్పులో ఖండిస్తుంది. స్పర్జన్ మనసులో మత్తయి 12:42 ఉంది,

"విమర్శ దినమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి, వారి మీద నేర స్థాపన చేయును..." (మత్తయి 12:42).

స్పర్జన్ చెప్పాడు,

     ఇది కేవలము ఊహ కాదు ఆఖరి దినమున, యేసు తీర్పు సింహాసనముపై కూర్చున్నప్పుడు, పిలాతు శరీరములో ఉన్నప్పుడు చేసిన క్రియలను గూర్చి తీర్పు తీర్చబడడానికి నిలబడినప్పుడు, అతని భార్య అతని ఖండించడానికి సాక్షిగా ఉంటుంది. నేను ఊహించగలను ఆఖరి దినాన అలాంటివి చాలా సన్నివేశాలుంటాయి, మనలను ఎక్కువగా ప్రేమించిన వారు, మనకు వ్యతిరేకముగా బలమైన సాక్ష్యాలు ఇస్తారు. నాకు తెలుసు నేను చిన్నగా ఉన్నప్పుడు నా తల్లి చెప్పినది నన్ను ప్రభావితం చేసింది, రక్షణకు మార్గము తన కుమారుల ముందు ఉంచి, ఆమె మాతో చెప్పింది, "మీరు క్రీస్తును తిరస్కరించి నశిస్తే, నేను మీ పక్షాన వాదించలేను మీరు అమాయకులని. లేదు, నేను మీ శిక్షకు అవును అని చెప్పాలి." నేను దానిని భరించలేను! నా తల్లి నా శిక్షను "అవును" అని చెప్తుందా? అయినను, పిలాతు భార్య, ఇంకోలా ఏమి చేయగలదు? అందరు నిజము చెప్పవలసివచ్చినప్పుడు, ఆమె ఎలా చెప్పగలదు తన భర్తను నచ్చచెప్పిన హెచ్చరించినా రక్షకుని శత్రువులకు అప్పగించాడు అని?
     ఓ, నా దేవుడు లేని విను వారలారా, నా ఆత్మ మీ వెంట వెళ్తుంది. "మీరు తిరగండి, మీరు తిరగండి, మీరెందుకు చనిపోతారు?" రక్షకునికి వ్యతిరేకంగా మీరెందుకు పాపము చేస్తారు? మీ స్వంత రక్షణను తిరస్కరించకుండా, క్రీస్తు వైపు తిరిగి ఆయనలో నిత్య విమోచన పొందుకోండి. "నాయందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు" (C. H. Spurgeon, “The Dream of Pilate’s Wife,” The Metropolitan Tabernacle Pulpit, Pilgrim Publications, 1973 reprint, volume 28, p. 132).

యేసు పిలాతు ఆవరానములో నిలబడ్డాడు -
   స్నేహితులు లేరు, విడువబడ్డాడు, అందరిచే అప్పగించబడ్డాడు:
అయ్యో! అకస్మాత్తు పిలుపుకు అర్ధమేమి!
   యేసుతో మీరు ఏమి చేస్తారు?
యేసుతో మీరు ఏమి చేస్తారు?
   మధ్యస్థంగా మీరు ఉండలేరు;
ఒకరోజు మీ హృదయము అడుగుతుంది,
   "ఆయన నాతో ఏమి చేస్తాడు?"
("ఆయన యేసుతో ఏమి చేస్తాడు?" ఆల్ బెర్ట్ బి. సింప్ సన్ చే, 1843-1919).
(“What Will You Do With Jesus?” by Albert B. Simpson, 1843-1919).

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు బైబిలు పఠనము: మత్తయి 27:15-24
ప్రసంగమునకు ముందు పాట:
"ఆయన యేసుతో ఏమి చేస్తాడు?" (ఆల్ బెర్ట్ బి. సింప్ సన్ చే, 1843-1919).
“What Will You Do With Jesus?” (by Albert B. Simpson, 1843-1919).



ద అవుట్ లైన్ ఆఫ్

పిలాతు మరియు ప్రొక్యులా

PILATE AND PROCULA

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

"అతడు న్యాయపీథము మీద కూర్చుండి యున్నప్పుడు, అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితిని: అతని యొద్దకు వర్తమానము పంపెను" (మత్తయి 27:19).

(మత్తయి 21:9-11, 12-14; 27:14; యోహాను 19:11)

I.    మొదటిగా, అది పాపమునకు వ్యతిరేకముగా హెచ్చరిక, యోహాను 19:12;
మత్తయి 27:24; సామెతలు 29:25.

II.   రెండవది, ఆ హెచ్చరిక తిరస్కరింపబడినది, మత్తయి 16:25-26;
మార్కు 8:35; లూకా 9:24; 17:33.

III.  మూడవది, ఆ హెచ్చరికకు భయంకరమైన పర్యవసానాలు ఉన్నాయి,
అపోస్తలుల కార్యములు 13:28-31; మత్తయి 12:42.