Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




ఉజ్జీవము యొక్క దర్శనము

A VISION OF REVIVAL
(Telugu)

డాక్టర్ ఆర్. యల్. హైమర్స్, జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము ఉదయము, జూలై 3, 2016
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Evening, July 3, 2016


నాతో యెషయా 64:1 చూడండి. స్కోఫీల్డ్ పఠన బైబిలులో 768వ పేజీలో ఉంది.

"గగనము చీల్చుకొని, నీవు దిగి వచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక, నీ శత్రులకు నీ నామమును తెలియ చేయుటకై, అగ్ని గచ్చ పొదలను కాల్చు రీతిగాను, అగ్ని నీళ్ళను పొంగ చేయు రీతిగాను, నీవు దిగి వచ్చెదవు గాక! జరుగునని మేమనుకొని భయంకరమైన క్రియలు నీవు చేయగా, అన్య జనులు నీ సన్నిధిని కలవార పడుదురు గాక, నీవు దిగి వచ్చెదవు గాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక. తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప, తన కార్యము సఫలము చేయు, మరి ఏ దేవునిని ఎవడునే కాలమున చూచి యుండలేదు, అట్టి దేవుడు, కలడన్న సమాచారము మనష్యులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి యుండలేదు" (యెషయా 64:1-4).

ఆమెన్. కూర్చోండి.

ఇప్పటికే మార్పు నొంది ఉండిన వారికి సామాన్యంగా ఉజ్జీవము వస్తుంది. కాని వారి జీవితాలలో దేవుని సన్నిధిని గూర్చిన గమనిక వారికి ఉండదు. అలవాటుగా వారు గుడికి వస్తారు, కాని దేవుని సన్నిధితో కూడిన జీవితము వారికి ఉండదు. వారు ప్రార్ధిస్తారు, కాని వారికి పదాలు పలికినట్టు ఉంటుంది. దేవుడు నిజంగా వింటున్నట్టు వారికి అనిపించదు. వారు వారి ప్రార్థనలకు సమాధానమివ్వాలని అని భావిస్తారు. వారు దేవుడు వాటిని వింటూ ఉంటున్నాడని అనిపిస్తుంది. వారు ప్రార్ధిస్తారు. వారు ప్రార్ధన కూటాలలో అద్భుతంగా ప్రార్ధిస్తారు. వారి ప్రార్ధనలు శక్తివంతంగా అనిపిస్తాయి. కాని వారికి దేవునితో అంతరంగిక సంభాషణ ఉండదు. తరుచుగా ఉజ్జీవములో శక్తివంతంగా ప్రార్ధన నడిపించేవారు గ్రహిస్తారు "పాపములు ఆయన ముఖమును మరుగు పరచెను కనుక ఆయన [వారిని] ఆలకింపకున్నాడు" (యెషయా 59:2).

తరుచు ఉజ్జీవము ఎప్పుడు ఆరంభమవుతుందంటే ఒక మంచి క్రైస్తవ నాయకుడికి అనిపించినప్పుడు తన పాపము పరిశుద్ధమైన మృదువైన దేవుని సన్నిధిని కోల్పోయేటట్టు చేసిందని తెలుసుకొనినప్పుడు. గొప్ప ఉజ్జీవమును గూర్చిన విషయాన్ని నేను చదవబోతున్నాను. అది ఎలా ప్రారంభ మవుతుంది? శనివారము రాత్రి ప్రార్ధన కూటాలలో అది ఆరంభమయింది. అవి సామాన్య ప్రార్ధనలు, దేవుని సన్నిధి గమనింపు ఆ కూటములలో లేదు. "అప్పుడు ఒక సంఘ కాపరి చలించి ఏడ్చాడు. ఇది అసాధారణ విషయము." సంఘమంతటి సమక్షంలో ఆయన బాహాటంగా ఒప్పుకున్నాడు "తనకు హృదయ కాఠిన్యము ఉందని." కన్నీటితో ఆయన మాట్లాడుచుండగా, ఒప్పుకోలు "కూటమంతటిలో నిట్టూర్పు, ఏడ్పు, మూలుగు... వ్యాపించింది." వీరంతా మారిన వారే, కాని కాపరి వారివి హృదయాలు చాలా కఠిమైనవిగా చెప్పి వారిని మేల్కొలిపాడు. "ఆ కూటము తెల్లవారు జామున రెండు గంటల వరకు జరిగింది... అప్పుడు పరిశుద్ధాత్మ కూటములో దిగి వచ్చింది."

నేను ఉజ్జీవము గూర్చి చెప్తున్నప్పుడు మీలో కొంతమంది చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నారు దాని గూర్చి వినాలనుకోరు. ఎందుకంటే మీరెన్నడూ ఉజ్జీవము చూడలేదు మనము కోల్పోయేది మీకు తెలియడం లేదు. జాన్ కాగన్ నాతో చెప్పాడు నాకు ఉజ్జీవము కావాలి ఎందుకంటే దానిని "రుచి చూడగలను." ఒక ఉజ్జీవాన్ని చూసాను దాని "రుచి" నచ్చింది నాకు మళ్ళీ కావాలి. మీరెప్పుడు రుచి చూడలేదు కాబట్టి మీరనుకుంటారు, "కాపరి దేనిని గూర్చి మాట్లాడుతున్నాడు? ఉజ్జీవమును గూర్చి ఎందుకు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు?" మీరు దాని రుచి చూస్తే, మీరు కూడ కోరుకుంటారు. దానిని గూర్చి వేచి ఉంటారు కూడ. మన మధ్యకు దేవుని సన్నిధి రావాలని ఎదురు చూస్తుంటారు.

ఈ ఉదయము "నూతన బాప్టిస్టు గుడారము"పై బోధించాను. కొన్ని మార్పులు చేయడం ద్వారా, సంఘ "యంత్రాంగాన్ని" దిద్దడం ద్వారా కొత్త సంఘాన్ని సృష్టించ లేము. మనకు కొత్త జీవితము ఉండాలి! కొత్త జీవితము దేవుని నుండే వస్తుంది. డాక్టర్ ఏ. డబ్ల్యూ. టోజర్ అన్నాడు, "దేవుడు జీవితాన్ని ఇస్తాడు, పాత జీవితానికి మెరుగు పెట్టికాదు. ఆయన మరణము నుండి జీవితాన్ని ఇస్తాడు... జీవితమంతా మనము పూర్తిగా దేవునిపైనే ఆధారపడతాము, ఎందుకంటే ఆయన జీవ ప్రవాహానికి మూలము." మనము మన హృదయాలు మారి పరిశుద్ధాత్మ దేవునిచే "నూతన" పరచబడి, పునరుద్దరింపబడితేనే తప్ప, మనము కొత్త బాప్టిస్టు గుడారము కలిగి యుండలేము. దానిని వివరించే ఒక పదము ఉంది. ఆ పదము ఉజ్జీవము! మన పాఠ్యభాగములో యెషయా ఉజ్జీవమును గూర్చి ప్రార్దిస్తున్నాడు,

"గగనము చీల్చుకొని, నీవు దిగి వచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక, నీ శత్రులకు నీ నామమును తెలియ చేయుటకై, అగ్ని గచ్చ పొదలను కాల్చు రీతిగాను, అగ్ని నీళ్ళను పొంగ చేయు రీతిగాను, నీవు దిగి వచ్చెదవు గాక! జరుగునని మేమనుకొని భయంకరమైన క్రియలు నీవు చేయగా, అన్య జనులు నీ సన్నిధిని కలవార పడుదురు గాక, నీవు దిగి వచ్చెదవు గాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక. తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప, తన కార్యము సఫలము చేయు, మరి ఏ దేవునిని ఎవడునే కాలమున చూచి యుండలేదు, అట్టి దేవుడు, కలడన్న సమాచారము మనష్యులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి యుండలేదు" (యెషయా 64:1-4).

నేను పాడకుండా ఉండలేను "నాదర్శనమంతటిని నింపు." నేను పార్కులో నడుస్తూ ప్రార్దిస్తున్నప్పుడు, అది పాడాను. ప్రసంగానికి సిద్ధ పడుతున్నప్పుడు, పాడాను. రోజంతా ఆలాపిస్తూనే ఉంటాను. రాత్రి పడకకు వెళ్ళేముందు ఆఖరిగా ఆ పాట పాడుకుంటాను.

నా దర్శనమంతటిని నింపు, దైవికా రక్షకా,
   నీ మహిమతో నా ఆత్మ ప్రకాశించే వరకు.
నా దర్శనమంతటిని నింపు, అందరు చూచేటట్టు.
   నీ పరిశుద్ధ ప్రతిరూపం నాలో ప్రతిబింబింప నిమ్ము.
("నా దర్శనమంతటిని నింపు" ఆవిస్ బర్గ్ సన్ క్రిస్టియాన్ సేన్, 1895-1985).
      (“Fill All My Vision” by Avis Burgeson Christiansen, 1895-1985).

లేచి నిలబడి ఆ పాట నాతో పాడండి.

నా దర్శనమంతటిని నింపు, దైవికా రక్షకా,
   నీ మహిమతో నా ఆత్మ ప్రకాశించే వరకు.
నా దర్శనమంతటిని నింపు, అందరు చూచేటట్టు.
   నీ పరిశుద్ధ ప్రతిరూపం నాలో ప్రతిబింబింప నిమ్ము.

కూర్చోండి.

యెషయా ప్రార్ధించాడు, "స్వర్గమును చీల్చుకొని, [గగనము చీల్చుకొని] నీవు దిగి వచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక" (యెషయా 64:1). డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ దానిని "ఉజ్జీవము [కొరకు] అసలైన ప్రార్ధన" (Martyn Lloyd-Jones, M.D., Revival, Crossway Books, 1992 edition, page 305).

లాస్ ఎంజిలాస్ లోని చైనీయ బాప్టిస్టు సంఘమైన నా సంఘమునకు ఉజ్జీవము వచ్చిన పత్రాన్ని ఉంచనందుకు, నేను ఎంతగానో చింతిస్తూ ఉంటాను. ఎలా ప్రార్దించాలో అది మీకు తెలియ చేసి ఉండేది. కాని, అయ్యో, దాని వ్రాత పత్రము నేను ఉంచలేదు. నేను చేయగలిగింది ఏంటంటే ఇంకొక ఉజ్జీవమునకు సంబంధించిన వివిరణ ఇస్తాను, ఇది కూడ 1960 లో చైనీయ సంఘములో వచ్చిన గొప్ప ఉజ్జీవము వంటిదే. ఈ వివరణ 1989 లో రెవ డేవిడ్ డేవిస్ చే ఇవ్వబడింది. దాని నుండి కొన్ని వివరాలు మీకు ఇస్తాను. రెవ డేవిస్ అన్నాడు,

         ...ఇది సువార్తిక ప్రచారము కాదు, లేక కొరడాతో కొట్టబడినది కాదు. ఉజ్జీవము అంటే దేవుడు తన సన్నిధితో క్రిందకి దిగి వచ్చుట.

ఆయనన్నాడు,

         మన ప్రాంతంలో చాలా సంఘాలకు నేను నాయకుడను. చాలా కార్యకలాపాలతో ఈ సంఘాలు నిమగ్నమవుతూ ఉంటాయి. చాలా కూటాలు ఉంటాయి... కాని ప్రజలు నిమ్మళంగా ఉంటారు; మునుపు ఉన్నట్టు ప్రార్ధన కూటాలకు అంత ఆసక్తిగా రారు. రక్షణ ఉంది సందేహము లేదు ప్రజలు మార్పు నొందారు, కాని ఏదో మాయమయ్యింది. ఒక బోధకుడు నాతో అన్నాడు, "బయట వాళ్లకు మనము మంచిగా కనిపిస్తాం." [నా వ్యాఖ్యానము: మన ఆరాధనలలో ఏదో కోల్పోతున్నట్టు కొన్ని సార్లు మనకు అనిపించడం లేదా?]
         నెలలో ఒకరోజు పూర్తిగా నాయకులు ప్రార్ధనలో గడపాలని ఎవరో బలవంత పెట్టారు. అలా చేసాము. మాలో చాలామందికి తెలిసింది మేము దేవుని కొరకు అగ్ని కలిగి ఉండలేడని. అప్పుడు సంబంధాలు ఉన్నాయి, ఒకరితో ఒకరు సరిదిద్దుకోవాలని మేము గ్రహించాము.
         వాస్తవానికి శనివారము రాత్రి బైబిలు పఠనములో ఉజ్జీవము ప్రారంభమయింది. కొంతసేపు అపోస్తలుల కార్యములపై పఠనము జరిగింది, ఆదిమ సంఘములో దేవునిని ఆరాధనను గూర్చి. బోధకులు గమనించారు ప్రార్ధనలో స్వతంత్రత లేదని, కూటాలు చల్లారిపోయాయని. అప్పుడు ఒక కాపరి కన్నీళ్లు కార్చాడు. ఇది అసాధారణ విషయం. ఆయన వివరించాడు తనకు హృదయ కాఠిన్యత ఉందని, ఆయన మాట్లాడుచుండగా, ఒప్పుకోలు వ్యాపించింది – కూటమంతటితో నిట్టూర్పు, వేదన, మూలుగులు, సంఘం అంతటా కనిపించాయి. ప్రజలు ఏడుస్తూ ప్రార్ధిస్తున్నారు. నాకు గుర్తొచ్చింది ఒకసారి స్పర్జన్ ఇలా ప్రార్ధించాడు, "ప్రభువా, మహిమతో కూడిన అవసరతను పంపుము." నాయకులు అంతా ప్రశాంతం అయ్యేవరకు నిశ్శబ్దంగా ఉన్నారు, కాని వారు విఫలమయ్యారు, మరియు ఆ సంఘము మరుసటి రోజు ఉదయము రెండు గంటల వరకు జరిగింది.
         నా సహోదరుడు ఉజ్జీవమును గూర్చి విని దానిని వ్యతిరేకించాడు ఎందుకంటే అది అతిభావోద్రేకము అనిపించింది. అతడు ఉజ్జీవము కొరకు ప్రార్ధిస్తూ ఉన్నాడు, తను కోరుకున్నది అది కాదని దేవునితో చెప్పాడు. అప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడు అగ్నితో కూడిన ఉజ్జీవము తనరాతి హృదయాన్ని బట్టి అపనమ్మకాన్ని బట్టి చల్లారిపోయిందని. ఆ సమయంలో కూటములో ఆత్మ కుమ్మరింప బడింది. [నా వ్యాఖ్యానము: అప్పుడు దేవుడు చీల్చుకొని వస్తాడు, దానినే స్పర్జన్ "మహిమతో కూడిన అవకతవక అన్నాడు."]

రెవ. డేవిడ్ అన్నాడు,

         ఇప్పడు సందేహించడానికి నా సమయము వచ్చింది. జరుగుతున్న దానిని వివరించడానికి నా సహోదరుడు వాడిన పరుష పదజాలమును బట్టి నేను కలత చెందాను. కాని, ఉజ్జీవము, ఎప్పుడు భిన్నంగా ఉంటుంది ఎందుకంటే అది మానవునిచే ఏర్పాటు చేయబడినది కాదు. ఉజ్జీవము అగ్ని పొద వలే వందల మైళ్ళు ప్రయాణిస్తుంది, ఇతర సంఘాలు దానితో తాకబడతాయి.
         ఒక యవన బోధకుడు శక్తివంతమైన ప్రసంగము చేసాడు, కాని ఏమి సంభవింప లేదు. కనుక నేను ఆఖరి పాట పాడి ప్రార్ధనతో కూటము ముగించాను. సమూహము వెళ్తుండగా, ఒక యవన బోధకుడు వచ్చి ముందు కూర్చున్నాడు. అతడు అదుపు లేకుండా వణికి పోతూ ఉన్నాడు విలపిస్తున్నాడు. ఒక యవ్వన బాలిక అరవడం ప్రారంభించింది, "నేనేమి చెయ్యాలి? నేనేమి చెయ్యాలి? నేను నరకానికి పోతున్నాను!" జనములు గుడిలోనికి పరుగెత్తుకుంటూ వచ్చారు. ఆ అమ్మాయి మంచి క్రైస్తవురాలు. కాని మోసగించే పాపమును గూర్చి ఒప్పుకోలు తనకు కలిగింది. యవనస్థుడు అసూయను బట్టి ఒప్పింపబడ్డాడు, చాలా మందికి చిన్న విషయమే, కాని అది అతనిని భయపెట్టింది.
         నేను సహాయము కొరకు అరుస్తున్న వారిని ధైర్య పరుస్తున్నప్పుడు ఎవరో చెప్పాడు ఇంటిలో నా భార్యకు నేను వెంటనే అవసరమని. ఒక మంచి క్రైస్తవుడు నేల మీద పడి వేదనతో, మళ్ళీ మళ్ళీ, "నేనేమి చెయ్యాలి? నేనేమి చెయ్యాలి?" అని అరుస్తుండడం నేను చూసాను కొంత సేపయ్యాక తన పాపాలు బాహాటంగా ఒప్పుకొని సంతోషంతో అన్నాడు, "యేసు రక్తము ద్వారా నా హృదయము శుద్ధి అయింది." మేమంతా తిరిగి ఇంకొక కూటానికి గుడికి వచ్చాము. మరుసటి రోజు బాహాటపు ఒప్పుకోలు దినము, ఒకరితో ఒకరు సరి చేసుకునే సమయము. అకస్మాత్తుగా దేవుడు క్రిందికి దిగి వచ్చాడు అది పరలోకపు దర్శనము.
         మేము అదుపులో లేము. దేవుడు ఆధీనంలో ఉన్నాడు, అంతా పరిపూర్ణ క్రమంలో ఉంది. నేను గమనించాను మొదటి రోజు సంఘ నాయకులు తాకబడ్డారు. రెండవ రోజు పనివారు ఒప్పుకోలు పొందుకున్నారు. మూడవ రోజు, స్త్రీలు, నాల్గవ రోజు పాఠశాల బాలురు, ఐదవ రోజు పాఠశాల అమ్మాయిలూ. బోధకులమైన మేము ప్రేక్షకులుగా, దేవుని పనీ చూసాము.
         ఈసారి మారిన వారి మధ్య ఉజ్జీవము వచ్చింది. కొద్దిమంది అవిశ్వాసులు మొదటి రెండు మూడు నెలలలో రక్షింపబడ్డారు. దేవుడు సంఘాన్ని మొదటిగా శుద్ధి చేసాడు. హృదయాలు పరిశోదింపబడ్డాయి. కొంతమంది సంవత్సరాలుగా పాపాలను దాచి పెట్టుకున్నారు; ఈ పాపాలు పరవాలేదు అనుకున్నారు. దేవుడు వ్యక్తిగతంగా బాధలను భరించాడు. ఒక పెద్ద, శక్తివంతమైన బోధకుడు చేతులు ముడుచు కుంటూ, కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఈయన చాలా మందిని క్రీస్తు నొద్దకు నడిపించాడు. కాని ఒప్పుకొని పాపముంది, అతడు నిలబడి సంఘమంతటి ముందు ఒప్పుకునే వరకు అతనికి సమాధానము లేదు. అతని మాటలు విద్యుత్తు దెబ్బలా ఉన్నాయి ప్రజలు పశ్చాత్తాపముతో నేలపై పడ్డారు. ఈపాటికి పట్టణమంతా దేవుని గూర్చి మాట్లాడుకుంటుంది. [నా వ్యాఖ్యానము: క్రైస్తవులు బాహాటంగా ఒకరితో ఒకరు సరి చేసుకుంటే నశించు వారు ప్రభావితులవుతారు.]
         కొన్నిసార్లు ఒప్పుకోలు భయంకరమైన విషయము, బాహాటంగా వారి పాపాలు ఒప్పుకునే వారు ఎక్కువగా శ్రమ పడతారు. ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు. ఒక స్త్రీ తన పాపాలను అందరి ముందు ఒప్పుకోకపోతే పిచ్చిదయిపోతుంది అని పించింది. దేవుని కాదని, పాపాన్ని దాచుకునే వారికి ఇది ఒక శిక్ష. పద్దతి వెళ్ళిపోయింది, కాని ఉజ్జీవపు ఫలము పరిశుద్ధత, సాత్వికము, బైబిలు ప్రార్ధనల పట్ల ప్రేమ, క్రీస్తును ఆయన పనిని పైకేత్తుట. [నా వ్యాఖ్యానము: ఎప్పుడైతే క్రైస్తవులు వారి వేషము మార్చి ఒకరితో ఒకరు వాస్తవంగా ఉంటారో అది సంఘములో సాత్వికమును ప్రేమను పుట్టిస్తుంది. పాత అసూయలు, భయాలు అపోహాలు నిజమైన కనికరము ప్రేమగా మారిపోతాయి.]
         ప్రతి ఒక్కరు కూటాలకు వచ్చారు, చాలాసేపు జరిగింది. కూటము ఉదయము 6:30 కి ఆరంభమై మధ్యాహ్నము వరకు వెళ్ళడం అసామాన్యము. ప్రజలు గుసగుసలాడారు దేవుడు దగ్గరగా ఉన్నట్టు వారికి అనిపించింది. ఒకతనన్నాడు, "మేము దేవుని సన్నిధితో చుట్టబడినట్లు అనిపించింది." నేను కూటాల్లో ఉన్నాను దేవుడు నిజంగా ఉన్నాడు కుర్చీలో కూర్చోడానికి ధైర్యము చాలలేదు. నాకు యోబు 42:5 గుర్తు వచ్చింది, "వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను."
         మునుపెన్నడూ లేనంతగా ప్రజలు ప్రార్ధించారు. ఒకేసారి ప్రార్ధించడం ఉజ్జీవంలో మామూలు విషయము, కాని అది క్రమంగా జరిగింది. ప్రజలకు సువర్తీకరణపై తపన ఉంది. వందల వేల మంది రక్షింపబడ్డారు. [నా వ్యాఖ్యానము: రెండు ఉజ్జీవాలలో ఇది జరగడం నేను చూసాను.]

రెవ. డేవిస్ అన్నాడు,

         ఎయిడ్ అలా ఉందా? పద్దెనిమిది నెలలు డైరీ ఉంచాను, తరువాత కూడ దేవుని శక్తి ఇంకా నిలిచి ఉంది. ముప్ఫై సంవత్సరాల తరువాత సంఘ నాయకులు ఆ ఉజ్జీవంతో ఆశీర్వదింపబడినవారే. కాని కొత్త తరానికి ఉజ్జీవము కావాలి – ఎందుకంటే, "వారి తరువాత యెహోవానైనను, ఆయన ఇశ్రాయెలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టెను" (న్యాయాధిపతులు 2:10). కాని మీరు సంఘానికి ఉజ్జీవము రావాలని ప్రార్ధించ లేరు వ్యక్తిగతంగా – మీకు రావాలని కోరుకునే వరకు "[మన] పొరపాట్లు ఒకరితో ఒకరు ఒప్పుకోకుండా, ఒకరి నొకరు ప్రార్ధించ కుండా" (యాకోబు 5:16).

ఈ సమాచారము రెవ. డేవిడ్ డేవిస్ ఇచ్చినది. నేను దానిని క్రమంలో పెట్టాను, సులభంగా అర్ధం అవడానికి కొన్ని పదాలు వదిలేసాను, బ్రెయిన్ హెచ్. ఎడ్వర్డ్స్ చెప్పినవి, ఉజ్జీవము! దేవునితో విసిగిన ప్రజలు, సువార్తిక ప్రెస్, 1991 ప్రతి, పేజీలు 258-262.

రెవ. డేవిస్ అన్నాడు, "ఉజ్జీవ శక్తితో దేవుడు వచ్చినప్పుడు మీరు ఊహించిన దానికీ అది వేరుగా ఉంటుంది... ఉజ్జీవము అంటే దేవుడు ఆయన సన్నిధితో దిగి వచ్చుట. అది ఒక సంఘ నాయకుడు ఏడ్చినప్పుడు ప్రారంభమవుతుంది. అతడు వివరించాడు తనకు హృదయ కాఠిన్యము ఉందని, అప్పటికే మారిన వారిలో ఒప్పుకోలు వ్యాపించినదని వారు ఆక్రోశించే వరకు, నిట్టూర్చే వరకు. ప్రజలు ఏడుస్తూ ప్రార్ధిస్తున్నారు, ఆ సంఘ సమావేశము ఉదయం రెండు గంటల వరకు జరిగింది."

ఇది నేను 1960 లో చైనీయ బాప్టిస్టు సంఘములో చూచినా ఉజ్జీవములా ఉంది. ఉజ్జీవము యొక్క ముఖ్య లక్షణాలు కన్నీళ్లు, ప్రార్ధనలు, సంఘమంతటి ముందు బాహాటపు పాపపు ఒప్పుకోలు. ఇది ఆకర్షణీయ పెంతేకోస్తు కూటమునకు బిన్నంగా ఉంటుంది. "భాషలు" లేక స్వస్థత, లేక ప్రత్యేక సంగీతము లేదు. "ఆరాధన" లేదు. అది బాహాటపు పాపాల ఒప్పుకోలు, ఏడ్చుట, ఒకరినొకరు క్షమించుకొనుట. చాలా వారముల తరువాత గుడికి రాని చాలామంది వచ్చి రక్షింపబడ్డారు. జాన్ కాగన్ నన్ను అడిగారు నశించు వారు అక్కడకు ఎలా వచ్చారని. జవాబివ్వడం కష్టము. ప్రజలు వారితోపాటు వారి స్నేహితులను కుటుంబ సభ్యులను తీసుకువస్తారు. ప్రయత్నాలు జరగలేదు. అలా జరిగిపోయింది. చివరిలో 2,000 మందిని చైనీయ గుడికి వచ్చి రక్షింపబడ్డారు, బాప్మిస్మము పొందారు గట్టి సంఘ సభ్యులుగా మారారు. వందల మందికి ఈనాటికి కూడా ఉన్నారు! పరిశుద్ధాత్మ క్రుమ్మరింపు వలన నాకు కొత్త సంఘాలు వచ్చాయి.

"గగనము చీల్చుకొని, నీవు దిగి వచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక, నీ శత్రులకు నీ నామమును తెలియ చేయుటకై, అగ్ని గచ్చ పొదలను కాల్చు రీతిగాను, అగ్ని నీళ్ళను పొంగ చేయు రీతిగాను, నీవు దిగి వచ్చెదవు గాక! జరుగునని మేమనుకొని భయంకరమైన క్రియలు [అద్భుతమైన] నీవు చేయగా, నీవు దిగి వచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక" (యెషయా 64:1-3).

దయచేసి నిలబడి ఎనిమిదవ పాట పాడండి.

నా దర్శనా న్నంతటిని నింపు, రక్షకా, నేను ప్రార్ధిస్తున్నాను,
   ఈరోజు యేసును మాత్రమే చూడనిమ్ము;
లోయద్వారా నీవు నిన్ను నడిపించినప్పటికినీ,
   నీ అంతరించని మహిమ నన్ను ఆవరిస్తుంది.
నా దర్శనమంతటినీ నింపు, దైవిక రక్షకా,
   నీ మహిమతో నా ఆత్మ ప్రకాశించే వరకు.
నా దర్శన మంతటినీ నింపు, అందరు చూచేటట్టు
   నీ పరిశుద్ధ ప్రతిరూపం నాలో ప్రతి బింబింప నిమ్ము.

నా దర్శనమంతటినీ నింపు, ప్రతీ కోరిక
   నీ మహిమ నిమిత్తము ఉంచు; నా ఆత్మ ప్రేరేపించబడేటట్టు,
మీ పరిపూర్ణతతో, మీ పరిశుద్ధ ప్రేమతో,
   పై నుండి వచ్చు వెలుగుతో నా మార్గము నింపు.
నా దర్శనమంతటినీ నింపు, దైవిక రక్షకా,
   నీ మహిమతో నా ఆత్మ ప్రకాశించే వరకు.
నా దర్శన మంతటినీ నింపు, అందరు చూచేటట్టు
   నీ పరిశుద్ధ ప్రతిరూపం నాలో ప్రతి బింబింప నిమ్ము.

నా దర్శనమంతటినీ నింపు, పాపము ఉండకూడదు
   నీడ వెలుతురూ నాలో ప్రకాశింప నిమ్ము.
మీ ఆశీర్వదపు ముఖాన్ని నన్ని చూడనిమ్ము,
   మీ అనంత కృపాలో నాఆత్మ ఉల్లసింప నిమ్ము.
నా దర్శనమంతటినీ నింపు, దైవిక రక్షకా,
   నీ మహిమతో నా ఆత్మ ప్రకాశించే వరకు.
నా దర్శన మంతటినీ నింపు, అందరు చూచేటట్టు
   నీ పరిశుద్ధ ప్రతిరూపం నాలో ప్రతి బింబింప నిమ్ము.
("నా దర్శనమంతటినీ నింపు" ఆవిస్ బర్గ్ సన్ క్రిస్టియాన్ సేన్ చే, 1895-1985).
(“Fill All My Vision” by Avis Burgeson Christiansen, 1895-1985).

ఉజ్జీవము పంపమని దేవునికి ప్రార్ధించడం ఆపకండి. గగనము చీల్చుకొని దేవుడు మన మధ్యకు దిగి రావాలని ప్రార్ధించడం ఆపకండి! దేవునికి ప్రార్ధించడం ఆపకండి ఇలా "[మీ] పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకరు ప్రార్ధన చేయుడి, అవి [మన] పాపాలను దూరంచేస్తుంది" (యాకోబు 5:16). చైనాలోనూ మూడవ లోకపు ఇతర ప్రాంతాలలోను ఇప్పుడు వచ్చే ఉజ్జీవాలకు ఇది లక్షణము. దేవునికి ప్రార్ధించడం మానవద్దు ఆయన దిగి వచ్చి మన హృదయాలను స్వస్థ పరిచేటట్టు మనకు నూతన మరియు ఎక్కువ ప్రేమించే ఎక్కువ శక్తివంతమైన బాప్టిస్టు గుడారము కొరకు! దేవుడు మన మధ్యకు దిగి వచ్చునట్లు యూరన్ యాన్సీ మరియు జాన్ కాగన్ లు ప్రార్ధించాలని కోరుతున్నాను. ముందు యూరన్, తరువాత జాన్. ఇంకా ఎవరైనా ఉన్నారా? దయచేసి నిలబడి ప్రార్ధించండి!

యేసు క్రీస్తు భూమికి దిగి వచ్చి శ్రమపడి పాపుల స్థానంలో సిలువపై మరణించాడు. మీరు ఇంకా రక్షింపబడకపోతే, మీరు మీ పాపపు స్వార్ధ పూరిత జీవిత విధానం నుండి తిరగాలి. మీరు పశ్చాత్తాప పడి యేసును, దేవుని ఏకైక కుమారుని విశ్వసించాలి. ఆయన మాత్రమే తన రక్తముతో మీ పాపాలన్నింటిని కడిగి వేయగలడు. ఆయన మాత్రమే నరకపు మంటల నుండి మిమ్ములను రక్షింపగలడు. మీ పాపముల నుండి యేసు మాత్రమే మిమ్ములను రక్షింపగలడు. మీరు మాట్లాడాలనుకుంటే, లక్ష్మీ వారము రాత్రి డాక్టర్ కాగన్ ను కలుసుకోడానికి ముందుగా అనుమతి తీసుకోవాలి. మీరు ఆయనకు ఫోన్ చేయవచ్చు అనుమతి కొరకు లేక ఆరాధన అయిన తరువాత ఆయనతో మాట్లాడవచ్చు. ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఎబెల్ ప్రుదోమ్: యెషయా 64:1-3.
ప్రసంగము ముందు పాట బెంజమెన్ కినీకెయిడ్ గ్రిఫిత్ గారు:
"నా దర్శనమంతటినీ నింపు" (ఆవిస్ బర్గ్ సన్ క్రిస్టియాన్ సేన్ చే, 1895-1985).
“Fill All My Vision” (by Avis Burgeson Christiansen, 1895-1985).