Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




అనేక శ్రమల ద్వారా
రాజ్యములో ప్రవేశించుట

ENTERING THE KINGDOM
THROUGH MUCH TRIBULATION
(Telugu)

డాక్టర్ ఆర్. యల్. హైమర్స్, జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్
నందు ప్రభువు దినము ఉదయము, ఏప్రిల్ 24, 2016
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, April 24, 2016

"వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి, అనేకులను శిష్యులనుగా చేసిన తరువాత, లుస్త్రకును, ఈకొనియకును, అంతియొకయకును, తిరిగి వచ్చి శిష్యుల మనష్యులను ధృడ పరచి, విశ్వాసము నందు నిలకడగా ఉండవలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింప వలెననియు వారిని హెచ్చరించిరి" (అపోస్తలుల కార్యములు 14:21-22).


ఈ మధ్య ఇద్దరు యవనస్తులు అనడం నేను విన్నాను 25 సంవత్సరాల క్రిందట మన సంఘములో చోటు చేసుకున్న చీలికను గూర్చి నేను మాట్లాడడం మానెయ్యాలని. వారన్నారు భవిష్యత్తును గూర్చి బోధించాలని కాని గతంలో మన ప్రజలు వెళ్ళిన భయంకర విషయాలను గూర్చి అపెయ్యాలని. ఇప్పుడు నేను ఎప్పుడు విమర్శనే వింటున్నాను, విమర్శ స్నేహితుల నుండి. ఈ యవనస్తులు నా స్నేహితులు. కాని వారు పూర్తిగా తప్పు! మొత్తం తప్పు! వాస్తవానికి ఆ భయంకర సంఘ చీలికను గూర్చి పూర్తిగా బోధించలేదు. దేవుడు నాకు చూపించాడు నేను దానిని మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ బోధించాలని – ఆ ప్రసంగము మీ హృదయములోనికి చొచ్చి మీ జీవితాలు మార్చే వరకు! ఇంకా ఎక్కువ బోధించాలి! అవును, ఎక్కువ ఎక్కువ ఎక్కువ – మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ!

కథ సామాన్యము. అప్పటిలో మన సంఘములో 500 మంది ఉండేవారు. మన సంఘములో ఒక "నాయకుడు" ఉండేవాడు అతడు నేను చాలా ప్రతికూలంగా ఉన్నానని చెప్పేవాడు. అతనన్నాడు నేను ప్రజల నుండి చాలా ఎక్కువ కోరతానని.

అతడు నన్ను నియంత అన్నాడు ఎందుకంటే క్రీస్తు బోధించేదే నేను బోధించే వాడిని కాబట్టి – "ఎవడైనను తన సిలువను మోసికొని, నన్ను వెంబడింపని యెడల, వాడు నా శిష్యుడు కానేరడు" (లూకా 14:27). కనుక "సులభ" జీవిత కొరకు నాలుగు వందల మంది, గుడి వదిలి వెళ్ళిపోయారు. వారికేమయింది? మంచిది, "మొదటి నాయకుడు" పద్నాలుగు పదిహేను మందిని తన "సులభ" చిన్న ఆదివారం ఉదయం గుడిలో పెట్టుకున్నాడు. మిగిలిన వారు గాలిలో చెదిరి పోయారు. వారిలో ఎవ్వరు కూడ జయించే క్రైస్తవులుగా లేరు, దేవుని కొరకు ఏమి చెయ్యలేదు. వారి ఆత్మీయ జీవితాలు ఎండిపోయి, ఆకులులా ఎగిరిపోయారు. క్రీస్తు చెప్పాడు, "ఎవడును, నాగటి మీద చెయ్యి పెట్టి, వెనుక తట్టు చూచు వాడెవడును, దేవుని రాజ్యమును పాత్రుడు కాదు" (లూకా 9:62).

అవును, ఈ భవనాన్ని కాపాడిన "39" మందిని గూర్చి బోధిస్తాను. గుడిని విడిచి లోకము లోనికి వెళ్ళిపోయిన నాలుగు వందల మందిని గూర్చి బోధించబోతున్నాను! అవును, అలా చేస్తాను! కొంతమంది తిరుగుబాటు చేసే సంఘ పిల్లలు వెనుదిరిగిన వారు అంటారు, "ఇతడు కేన్సర్ తో ఉన్న వృద్ధుడు ఎక్కువ చెప్పడు." అలా లెక్క కట్టకండి! నేనింకా చనిపోలేదు! నాకు వ్యతిరేకత బలహీన నూతన సువర్తీకరణ అంటే అసహ్యము నలభై ఏళ్ల క్రితంలానే ఈ ఉదయాన్న కూడ దేనిని అసహ్యించుకుంటాను! అవును, అసహ్యము సరియైన పదము. అది నాకు అసహ్యము! అసహ్యము – అసహ్యము! పరిశుద్ధ అసహ్యత, ఎందుకంటే క్రీస్తు కూడ అసహ్యించు కున్నాడు! బైబిలు చెప్తుంది, "కీడును ద్వేషించి, మేలును ప్రేమించండి" (ఆమోసు 5:15).

బలహీన లవోదికయులకు, సోమరులైన, నూతన సువర్తీకులతో – క్రీస్తు ఇలా అన్నాడు, "నేను నిన్ను నానోట నుండి ఉమ్మి వేయ నుద్దేశించు చున్నాను" (ప్రకటన 3:16). అవును! "నానోట నుండి నిన్ను వాంతి చేస్తాను" (రైరీ, ఎన్ఏఎస్ వి మార్జిన్). "నేను నిన్ను వాంతి చేస్తాను! నేను నిన్ను వాంతి చేస్తాను! నేను నిన్ను వాంతి చేస్తాను, నానోటి నుండి, ఉమ్మి వేస్తాను – నా నోటి నుండి!" డాక్టర్ చార్లెస్ సి. రైరీ ఈ వచనాన్ని గూర్చి అన్నాడు, "నులివెచ్చని మధ్యస్థ లేక రాజీపడే సంఘము...ప్రభువుకు హేమము, ఆయన ఉద్దేశానికి హాని కలిగిస్తుంది" (Ryrie Study Bible; note on Revelation 3:16).

లవోదికయ నులి వెచ్చని స్థితికి విరుగుడు ఏంటి? నూతన సువర్తికుల సోమరితనానికి తిరుగుబాటుకు నయం ఎలా చెయ్యాలి? బాగుచేయడం మన పాఠ్యభాగంలోనే ఉంది:

"మనము అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలి" (అపోస్తలుల కార్యములు 14:22).

అపోస్తలుడైన పౌలు అతని సహాయకుడు బర్నబా లిస్త్రాకు, ఇకోనియముకు మరియు అంతియొకయకు తిరిగి వచ్చారు. అక్కడ ఉన్న నూతన క్రైస్తవులకు బోధించడానికి అక్కడికి వచ్చారు. డాక్టర్ థామస్ హాలే ఈ వ్యాఖ్యానాలు చేసాడు. ఆయనన్నాడు,

      ఒక స్థలంలో ఒకసారే బోధిస్తే సరిపోదు. నూతన విశ్వాసులకు బోధించడం వారి విశ్వాసాన్ని బలపరచడం అవసరం. ఇదే పౌలు బర్నబాలు చేసారు. నూతన [విశ్వాసులను] హెచ్చరించారు దేవుని రాజ్యములో ప్రవేశించడానికి కష్టాలు సాహించాలని. క్రీస్తుతో కూడిన వారసులుగా ఉండాలంటే ఆయన కొరకు శ్రమ పడాలి (Thomas Hale, M.D., The Applied New Testament Commentary, Chariot Victor Publishing, 1997; note on Acts 14:22).

23 వ వచనంపై ఆయన వ్యాఖ్యానంలో, డాక్టర్ హేల్ చెప్పాడు పౌలు బర్నబాలు నూతన క్రైస్తవులకు బోధించాడని. ఆయనన్నాడు "పెద్దలు" కూడ ఈ సంఘాలలో "వారే నూతన విశ్వాసులు" (ఐబిఐడి., వచనము 23). పౌలు బర్నబాలు ఈ నూతన క్రైస్తవులకు ఇలా బోధించారు "మనము అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలి" (అపోస్తలుల కార్యములు 14:22). మేత్యూ హెన్రీ వ్యాఖ్యానించాడు, "వారు మాత్రమే కాదు, మనము కూడ: ఎలా లెక్కించాలంటే పరలోకానికి వెళ్ళే ప్రతి ఒక్కరు తప్పక శ్రమ హింసను ఊహించాలి అనుకోవచ్చు... ఒక దిగ్భ్రాంతి కలిగిందని, వారిని అలసి పోయేలా చేస్తుంది. కాదు...వారిని నిర్ధారించడానికి, క్రీస్తు కొరకు నిర్ణయించడానికి అది సహాయ పడుతుంది... ‘యేసు క్రీస్తు నందు భక్తితో జీవించు వారందరూ [తప్పక] శ్రమలు అనుభవిస్తారు’... క్రీస్తు శిష్యుడు అనబడేవాడు తన సిలువను ఎత్తుకోవాలి" (Matthew Henry’s Commentary on the Whole Bible; note on Acts 14:22).

యేసు, నేను సిలువ నెత్తుకున్నాను, అంతా విడిచి నిన్ను వెంబడించడానికి;
   నిరాశ్రయుడను, తృనీకరింపబడిన వాడను, విడిచి పెట్టబడిన వాడను, కనుక, ఇక నుండి, నీవే నా సమస్తము:
ప్రతి దురాశను నశింప చేయి, నేను ఆశించినది, నిరీక్షించినది, ఎరిగినది;
   అయినను నా స్థితి ఎంత గొప్పది, దేవుడు పరలోకము నా స్వంతము!
("యేసు, నేను సిలువ నెత్తుకున్నాను" హెన్రీ ఎఫ్. లైట్ చే, 1793-1847).
      (“Jesus, I My Cross Have Taken” by Henry F. Lyte, 1793-1847).

"మనము గొప్ప శ్రమలను భవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలి" (అపోస్తలుల కార్యములు 14:22).

I. మొదటిది, మార్పు యొక్క శ్రమ.

పాఠ్యభాగము దాని చెప్తుంది, "అనేక శ్రమలననుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలి." "శ్రమకు" గ్రీకు అనువాదము "త్లిప్ సిస్." అనగా "ఒత్తిడి, మత్సరము, భారము, కలవరము" (స్ట్రాంగ్). బైబిలులోని గొప్ప సంభాషణలు ఆలోచించండి. యాకోబు సంభాషణ ఒకటి.

"యాకోబు ఒక్కడు మిగిలి పోయెను; ఒకనరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను… తానూ అతని గెలువ కుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను, అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తోడ గూడు వలసెను" (ఆదికాండము 32:24, 25).

యాకోబుతో పోరాడిన "వ్యక్తి" దైవ కుమారుడు, యాకోబు అన్నాడు, "నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినది. అతడు పెను యేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయ మాయెను, అప్పుడతడు [తొడకుంటుచూ నడిచెను, ఎన్ఏఎస్ వి] కుంటుచూ నడిచెను" (ఆదికాండము 32:30, 31). యాకోబు తన జీవిత కాలమంతా కుంటుతూనే నడిచాడు ఎందుకంటే అతడు మార్పు నొందిన రాత్రి గాయ పర్చబడ్డాడు, అతని పేరు యాకోబు నుండి ఇశ్రాయేలుగా మార్చబడినది "అనగా ‘అతడు దేవునితో పోరాడిన వాడు’" (రైరీ పఠన బైబిలు). మీ స్వంత మార్పును గూర్చి ఆలోచించండి. మీరు దేవునితో పోరాడలేదా? మీరు క్రీస్తు నందు విశ్వాస ముంచే ముందు మీకు శ్రమ కలగలేదా?

పౌలు మార్పును గూర్చి ఆలోచించండి. అతడు క్రీస్తును సంధించాడు ఆయనన్నాడు, "నీవు హింసించుట కష్టతరము" (అపోస్తలుల కార్యములు 9:5). డాక్టర్ హెన్రీ యం. మోరిస్ అన్నాడు "అతడు మొండిగా ఉండే జంతువులుగా చేస్తున్నాడు, కఠినత్వముతో హింసతో తిరుగుబాటు చేస్తున్నాడు" (The Defender’s Study Bible). "అతడు వణుకుతూ ఆశ్చర్యముతో, ప్రభువా, నేనేమి చేయవలెను?" (అపోస్తలుల కార్యములు 9:6). అప్పుడు పౌలు మూడు దినములు గుడ్డితనములో ఉండి ఉపవాసముండి మార్పు చెందాడు (అపోస్తలుల కార్యములు 9:17).

తరువాత క్రైస్తవ చరిత్రలో జరిగిన గొప్ప మార్పులను గూర్చి చదవండి – ఆగస్టీను, లూథర్, బన్యను, వైట్ ఫీల్డ్, వెస్లీ, స్పర్జన్. వారందరూ శ్రమ, ఒత్తిడి, మత్సరము, పాపభారము కలవరముల ద్వారా వెళ్ళారు – వారు రక్షకుని నమ్మకముందు. కనీసం కొంత ఒత్తిడి మత్సరము పాపభారము లేకుండా, మీరు నిజంగా మారగలమని అనుకుంటున్నారా? మీరు తప్పుడు నిర్ణయము తీసుకోవచ్చు. పాపపు ఒప్పుకోలు లేకుండా ఏ వ్యక్తి నిజమైన మార్పును పొందలేరు. కన్నీరు కారిస్తే బలహీనులవుతారు అని సాతాను కొంతమందికి చెప్తూ ఉంటుంది. కాబట్టి వారు "బలవంతంగా" ఒప్పుకోలు ఆపేస్తారు. అది మగతనము కాదు! అది మొండి అవివేకి పని – దేవుని ఆత్మను ఆపివేయడం! తనను రక్షించడానికి సిలువపై మరణించిన క్రీస్తును నిరాకరించడం. అతడు ముస్లీము కంటే శ్రేష్టుడు కాదు, అతడను కుంటాడు చిన్న పిల్లలను కాల్చేసినప్పుడు, స్త్రీలను మానభంగము చేసినప్పుడు, కత్తితో యవనస్తుల తలలు నరికినప్పుడు తనకు మగతనం ఉందనుకుంటాడు. వారు ఎప్పుడైనా మీ పాపాల కొరకు కన్నీరు కార్చారా? "మీరు నన్ను అలా చేయించలేరు," అతనంటాడు. "నన్ను బలహీనునిగా చేయలేరు. నేను చంటి బిడ్డను కాదు!" అలా అతడు పొగుడుకుంటాడు. మీరు దెయ్యము కంటే మంచివారు కాదు – అతడు శక్తి గల దేవునికి తల బగ్గడానికి నిరాకరించాడు! తన పాపాల నిమిత్తము కన్నీరు కార్చడానికి భయపడే వాడు హృదయములో పిరికివాడు. అతడు "మగాడు కాదు." అతడు "గొప్పవాడు కాదు." శక్తిగల దేవుని ముందు తన పాపాలను ఒప్పుకోవడానికి భయపడే పిరికివాడు!

"మనము అనేక శ్రమలను అనుభవించి [హృదయములలో కలవరపడి] దేవుని రాజ్యములో ప్రవేశింపవలెను" (అపోస్తలుల కార్యములు 14:22).

II. రెండవది, పరిశుద్దీకరణ యొక్క శ్రమ.

మార్పిడి సమయంలో శ్రమ ఉండడము మాత్రమే కాక – ఒక పరిపక్వ క్రైస్తవునిగా మారడానికి కూడ శ్రమ అవసరము. అపోస్తలుడైన పౌలు అన్నాడు,

"అంతే కాదు శ్రమ ఓర్పును; ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగ జేయునని యెరిగి; అనుభవము, నిరీక్షణ వలన అతిశయ పడుదము: ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గు పరచదు; మనకు అనుగ్రహింప బడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో క్రుమ్మరింప బడియున్నది" (రోమా 5:3-5).

క్రీస్తు రక్తము విషయంలో జాన్ మెక్ ఆర్డర్ తో నేను ఏకీభవించను. ఆ ప్రాముఖ్యమైన అంశము విషయంలో అతడు చాలా తప్పు! కాని రోమా 5:3-5 పై అతని వ్యాఖ్యానాలు చాలా సరియైనవి. అతనన్నాడు, "శ్రమ, ఒత్తిడికి వాడే పదము, ఒలీవ ద్రాక్షల నుండి రసము పిండుచున్నట్టుగా. ఇక్కడ సామాన్య జీవిత ఒత్తుడులు కావు, కాని క్రీస్తు అనుచరులకు వచ్చే తప్పించు కోలేని శ్రమలు...అలాంటి కష్టాలు గొప్ప ఆత్మీయ ప్రయోజనాలను ఇస్తాయి...ఓర్పు, ఇదే దీర్ఘ శాంతము, లోను కాకుండా భయంకరమైన ఒత్తిడిలో కూడ నిబ్బరంగా ఉండే శక్తి...క్రైస్తవులు శ్రమలలో కూడ మహిమ పరుస్తారు ఆ శ్రమలు ఉత్పన్నము చేసిన వాటిని బట్టి" (The MacArthur Study Bible).

శ్రమల వలన ఒత్తుడుల వలన, పరీక్షలు హృదయ విదారకతల వలన మనము బలమైన క్రైస్తవులుగా తయారు అవుతారు. చీలికను గూర్చి నేను మాట్లాడకూడదని ఆ ఇద్దరు యవనస్తులు మాట్లాడుకోవడం విన్నప్పుడు, నాకు తెలుసు అది సాతాను స్వరము వారి తలంపులలో ఉంచింది. వారు చాలా తప్పు అని నాకు తెలుసు. అది నన్ను ఇంకా కృత నిశ్చయునిగా చేసింది మన సంఘాన్ని కాపాడడానికి మన నమ్మకస్తులైన వారు ఎంత భయంకర పరీక్షల ద్వారా వెళ్ళారో బోధించడానికి. అలాంటి పరీక్షల ద్వారా నీవు వెళ్ళడానికి తిరస్కరిస్తే నీవు బలమైన క్రైస్తవుడవు కాగలవని ఎలా అనుకుంటావు? మన సంఘాన్ని కాపాడిన వారిని "39 మంది" అని పిలుస్తాం. 39 మంది శ్రమ పడ్డారు కాబట్టి ఈ చక్కని సంఘ భవనము మీరు కలిగియున్నారు. మీ కొరకు వారి జీవితాలు త్యాగం చేసారు. వారి గురించి మాట్లాడవద్దని చెప్పడానికి మీకు ఎంత ధైర్యము? ఎంత ధైర్యము మీకు? మీరు దేవుని కొరకు ఏమి త్యాగము చెయ్యలేదు! అందుకే దేవుడు మీకు వాస్తవము అనిపించదు! నిన్ను గూర్చి నీవు చెడ్డ వాడవను కుంటావు, నీ ఉత్సాహము విశ్వాసము పోగొట్టుకున్నావు! మీరు "39 మంది" వలే మంచి క్రైస్తవులవాలనుకుంటే శ్రమల ద్వారా వెళ్ళాలి. ఏ శ్రమ ద్వారా మీరు వెళ్ళారు? ఒక్కటి కూడ లేదు! అన్ని మీకు సమకూరుతున్నాయి! మీరు పరీక్షల ద్వారా వెళ్ళడానికి నిరాకరిస్తే సిలువ మోయడం త్యాగాలను వద్దనుకుంటే, మీరు ఎన్నడూ, సాలాజార్, కార్లా బెబౌట్, డాక్టర్ కాగన్, బెన్ గ్రిఫిత్, ఏబెల్ ప్రుదోం, సాంగ్, శ్రీమతి హైమర్స్ ల వలే బలమైన క్రైస్తవులు కానేరరు. యేసు క్రీస్తు కొరకు మీ జీవితాన్ని త్యాగం చేయడం మీరు నిరాకరిస్తే మీరు ఎన్నడూ మంచి క్రైస్తవుడవు కానేరదు!

మొన్నటి రాత్రి డాక్టర్ కాగన్ నా జీవితాన్ని గూర్చి చెప్పిన ప్రసంగము మీలో కొంతమందికి నచ్చలేదు. అది చాలా వ్యతిరేకంగా ఉందని కొందరనుకున్నారు. "అదంతా మాకు ఎందుకు?" అని మీరనుకున్నారు. మంచిది, నేను మీకు చెప్తాను, అది అంతటి ద్వారా నేను వెళ్ళకపోతే ఇక్కడ ఈ ఉదయము ఈ సంఘ భవనము ఉండేది కాదు! నేను దాని అంతటి ద్వారా వెళ్లి ఉండకపోతే మీరు ఇక్కడ ఉండి ఉండేవారు కాదు! మీ "సంఘ పిల్లలు" ఉండేవారు కాదు! నేను అది అంతా చవిచూడక పోతే మీ ఉనికి ఉండేది కాదు! మీ తల్లిదండ్రులను నేను క్రీస్తు నొద్దకు నడిపించాను. వారి వివాహాలు చేసాను. సంఘ చీలిక సమయంలో వారిని కాచాను. ఈ నొప్పి శ్రమ ద్వారా వెళ్లి ఉండకపోతే పిల్లలైన మీరు బ్రతికి ఉండే వారు కాదు!

ఒక బాలుడు మాత్రము నా 75 వ పుట్టిన రోజుకు కార్డు పంపించాడు! "39 మంది" కార్డులు వందన సూచికలు పంపించారు. కాని ఒక్క బాలుడు కార్డు పంపాడు. ఆ బాలుడు మన సంఘములో పుట్టి రక్షింపబడ్డాడు, అందరిలో ఆ ఒక్కడే, సంఘపు పిల్లలలో, నాకు పుట్టిన రోజు కార్డు పంపించాడు. అతడు ఈ మాటలు నా హృదయ ఉల్లాసానికి రాసాడు,

ప్రియ డాక్టర్ హైమర్స్ గారు,

      75 వ పుట్టినరోజు శుభాకాంక్షలు. యేసు కొరకు మీరు చేసిన నమ్మకమైన సేవ పరిచర్యను బట్టి దేవుడు మిమ్ము దీవించును గాక. మీలాంటి సంఘ కాపరిని బట్టి దేవునికి వందనస్థుడను! యేసు కొరకు జీవిస్తున్నందుకు వందనాలు. మీ జీవితము యేసు నిమిత్తము అద్భుత సాక్ష్యము! నమ్మకమైన క్రైస్తవ మాదిరిని బట్టి మీకు వందనాలు. యేసును బట్టి మీ జీవితము అద్భుత జీవితము ఎందుకంటే మీ జీవితము ఎంతో మందిని తాకుతుంది. "స్థిరంగా, నిశ్చలంగా ఉండండి, ఎల్లప్పుడూ ప్రభువు పనిలో ఉండండి." డాక్టర్ హైమర్స్, ఆ వచనము నాకు గుర్తు వస్తుంది, నా ప్రార్ధన ఈ సంఘము ముందుకు సాగి ఈగుడి కొరకు మీ దర్శనాన్ని కొనసాగిస్తూ యేసు కొరకు మండుచుండాలి! దేవుడు మిమ్మును దీవించి కాపాడును గాక, యేసు నామములో, (సంతకము చేసాడు) అతని పేరు క్రింద I యోహాను 2:17 వచనము ఉంచాడు,

"లోకమును దాని ఆశయము, గతించి పోవుచున్నవి: గాని దేవుని చిత్తమును జరిగించు వాడు నిరంతరము నిలుచును."

మిగిలిన వారి మీద నాకు కోపము లేదు. అస్సలు లేదు. మీ ఆత్మల నిమిత్తము భయపడుతున్నాను. మీ కొరకు ప్రార్ధిస్తున్నాను, కొన్నిసార్లు రాత్రంతా. నేను మీ నిమిత్తము భయపడుచున్నాను ఎందుకంటే,

"మనము అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశింప వలెను" (అపోస్తలుల కార్యములు 14:22).

నాకు తెలుసు మీరు "39 మంది" వలే ఫలింపక పోతే – వారిని ప్రేమించకుండా వారి త్యాగపూరిత ఉదాహరణను వెంబడింపకపోతే – మీరు నా కళలు నా దర్శనములు యొక్క గొప్ప సంఘములో పాలి భాగస్తులుగా ఉండలేరు. ఎవరైనా మెడగట్టి చేసికొని, "నేను అలా చెయ్యను," అంటే అలాంటి వ్యక్తి పరలోక రాజ్యములో ప్రవేశింప లేని ప్రమాదం ఉంది. బైబిలు చెప్తుంది, "అతడు, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు, మరి తిరుగు లేకుండా, హాఠత్తుగా నాశనమగును" (సామెతలు 29:11). యేసు చెప్పాడు,

"నీవు ఏ స్థితిలో నుండి పడితివో, అది జ్ఞాపకము చేసుకొని, మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలు చేయుము; అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేనియడల నేను నీ యొద్దకు వచ్చి, నీ దీవ స్థంభమును దాని చోటు నుండి తీసివేతును" (ప్రకటన 2:5).

దయచేసి నిలబడి పాటల కాగితంలో 3 వ పాట పాడండి.

అంతా యేసుకే, అంతా యేసుకే! నా ఉనికి నాశక్తి అంతా:
   నా తలంపులు మాటలు క్రియలు అన్ని, నా రోజులు నా గంటలన్నీ.
అంతా యేసుకే! అంతా యేసుకే! నా రోజులు నా గంటలన్నీ;
   అంతా యేసుకే! అంతా యేసుకే! నా రోజులు నా గంటలన్నీ.

నా చేతులు ఆయన కార్యములు చెయ్యాలి, ఆయన మార్గాలలో నా పదములు పరుగెత్తాలి;
   నా కళ్ళు యేసునే చూడాలి, నా పెదవులు ఆయన స్థితిని పలకాలి.
అంతా యేసుకే! అంతా యేసుకే! నా పెదవులు ఆయన స్థితిని పలకాలి;
   అంతా యేసుకే! అంతా యేసుకే! నా పెదవులు ఆయన స్థితిని పలకాలి.

నా కళ్ళు యేసుపైనే లగ్నమయ్యాయి కాబట్టి, నా చుట్టు ప్రక్కల ఏమి కనిపించడం లేదు;
   నా ఆత్మ దర్శనములో లీనమై, సిలువ వేయబడిన వానిని చూస్తున్నాను.
అంతా యేసుకే! అంతా యేసుకే! సిలువ వేయబడిన వానిని చూస్తున్నాను;
   అంతా యేసుకే! అంతా యేసుకే! సిలువ వేయబడిన వానిని చూస్తున్నాను.
      ("అంతా యేసుకే" మేరి డి. జేమ్స్ చే, 1810-1883)
      (“All For Jesus” by Mary D. James, 1810-1883).

క్రీస్తు మీ పాప ప్రాయశ్చిత్తార్ధం సిలువపై మరణించాడు. మీ పాపమంతటిని కడగడానికి ఆయన తన రక్తము కార్చాడు. నిత్య జీవము ఇవ్వడానికి మృతులలో నుండి లేచాడు. ఆయన పరలోకములో దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. మీరు పాపము నుండి తొలగి యేసును విస్వసిస్తే, వెంటనే ఆయన మిమ్ములను రక్షిస్తాడు. యేసుచే రక్షింపబడాలని కోరి మాతో మాట్లాడాలనుకుంటే దయచేసి డాక్టర్ కాగన్ తో పాటు ఆవరణము వెనుకకు వెళ్ళండి. ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఎబెల్ ప్రుదోమ్: అపోస్తలుల కార్యములు 14:19-23.
ప్రసంగము ముందు పాట బెంజమెన్ కినీకెయిడ్ గ్రిఫిత్ గారు:
"యేసు కొరకు జీవించుట" (ధామస్ ఓ.చిషోమ్ చే, 1866-1960).
“Living For Jesus” (by Thomas O. Chisholm, 1866-1960).


సంక్షిప్తంగా

అనేక శ్రమల ద్వారా
రాజ్యములో ప్రవేశించుట

ENTERING THE KINGDOM
THROUGH MUCH TRIBULATION

డాక్టర్ ఆర్. యల్. హైమర్స్, జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

"వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి, అనేకులను శిష్యులనుగా చేసిన తరువాత, లుస్త్రకును, ఈకొనియకును, అంతియొకయకును, తిరిగి వచ్చి శిష్యుల మనష్యులను ధృడ పరచి, విశ్వాసము నందు నిలకడగా ఉండవలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింప వలెననియు వారిని హెచ్చరించిరి" (అపోస్తలుల కార్యములు 14:21-22).

(లూకా 14:27; 9:62; ఆమోసు 5:15; ప్రకటన 3:16)

I.   మొదటిది, మార్పు యొక్క శ్రమ, ఆదికాండము 32:24, 25, 30, 31;
అపోస్తలుల కార్యములు 9:5, 6, 17.

II.  రెండవది, పరిశుద్దీకరణ యొక్క శ్రమ, రోమా 5:3-5; I యోహాను 2:17;
సామెతలు 29:1; ప్రకటన 2:5.