Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




ఒబామా కాలములో ప్రార్ధన మరియు ఉపవాసము

PRAYER AND FASTING IN THE AGE OF OBAMA
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము సాయంత్రము, జూలై 12, 2015
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Evening, July 12, 2015

"ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత, ఆయన శిష్యులు మేమెందుకు, ఆ దెయ్యము వెళ్ళగొట్ట లేక పోతిమని ఏకాంతమున ఆయన నడిగిరి? అందుకాయన, ప్రార్ధన వలననే గాని మరి దేనివలననైనను, ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను" (మార్కు 9:28, 29).


కథ సామాన్యము. యేసు కొండమీదికి వెళ్ళాడు. ఆయన క్రిందికి దిగివచ్చినప్పుడు శిష్యుల చుట్టూ గొప్ప సమూహము గుమికూడుట చూసాడు. ఏమి జరుగుతుందని యేసు వారిని అడిగాడు. జనులలో నుండి ఒకడు వచ్చి తన కుమారునికి దయ్యము పట్టిందని యేసుతో చెప్పాడు. అతని కుమారునికి మూర్చవచ్చేటట్టు దెయ్యము చేసింది. దయ్యమును వెళ్ళగొట్టమని శిష్యులనడిగితే, వారి చేత కాలేదని చెప్పెను. తన కుమారుని తెమ్మని యేసు అతనికి చెప్పాడు. యేసు దయ్యమును గద్దిస్తూ అన్నాడు, "అతనిలో నుండి బయటకురా, ఇకను వానిలో ప్రవేశింపవద్దు." దయ్యము కేకవేసి బాలునిలోనుండి బయటకు వచ్చెను. యేసు బాలుని చెయ్యి పట్టుకొని లేవనెత్తగా, వాడు స్వస్థత పొందెను. కొన్ని నిమిషాల తరువాత యేసు ఒక ఇంటిలోనికి వెళ్ళాడు. శిష్యులు ఆయన వద్దకు వచ్చి అడిగారు, "మేమెందుకు వెళ్ళగొట్టలేకపోతిమి?" (మార్కు 9:28).

డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు, "వారు శాయశక్తులా ప్రయత్నించారు, కాని విఫలులైనారు. వారు ఎన్నో విషయాలలో విజయులయ్యారు. ఇక్కడ మూకుమ్మడిగా విఫలులైనారు. ఒక క్షణంలో సునాయాసంగా ప్రభువు [యేసు క్రీస్తు] ఒక మాట పలికాడు బాలుడు స్వస్త పడ్డాడు. ‘మేమెందుకు వెళ్ళగొట్ట లేకపోతిమి?’ అని అడిగారు, [క్రీస్తు] జవాబిచ్చాడు, ‘ప్రార్ధన ఉపవాసము ద్వారానే ఇలాంటిది సంభవిస్తుంది’" (Martyn Lloyd-Jones, M.D., Revival, Crossway Books, 1994 edition, p. 9; comment on Mark 9:28, 29).

శిష్యులచే వెళ్ళగొట్టబడలేని దయ్యము విషయము చాల ప్రాముఖ్యము. ఇది చాల ప్రాముఖ్యము పరిశుద్ధాత్మచే కొత్త నిబంధనలో మూడు సార్లు వ్రాయబడింది – మత్తయి, మార్కు, మరియు లుకాలో. డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు ఈ రోజులలో అది చాలా ప్రాముఖ్యము అని. నేను తనతో పూర్తిగా ఏకీభవిస్తాను. ఈ కథను మన సంఘానికి అన్వయించే ముందు, బైబిలు విమర్శకులు ఎవరైతే పదాలు "మరియు ఉపవాసము" ను అన్ని ఆధునిక తర్జుమాలో తొలగించాలో వారిని గూర్చి ప్రస్తావిస్తాను.

కనుక, ప్రసంగానికి వెళ్లేముందు, 29 వ వచనంలో ఉన్న – "మరియు ఉపవాసమును" గూర్చి మీతో మాట్లాడ ఇష్టపడుచున్నాను. స్కోఫీల్ద్ కేంద్రము "యు"ని గూర్చి అంటుంది, "రెండు శ్రేష్ట యంయస్ యస్ [ప్రసంగ ప్రతులు] ‘మరియు ఉపవాసమును’ వదిలేస్తాయి." దాని అర్ధము సమగ్ర స్కోఫీల్ద్ పఠన బైబిలు కూడా 19 వ శతాబ్దపు పతన బైబిలు విమర్శచే ప్రభావితము చేయబడింది. ఉపవాసాన్ని వదిలిన రెండు పాత ప్రసంగ ప్రతులు "శ్రేష్ట ప్రసంగ ప్రతులు" ఎలా అవుతాయి? ముఖ్య ప్రసంగ ప్రతి సినాయిటికాస్ ప్రసంగ ప్రతిని విమర్శకులు వాడారు. విమర్శకుల అభిమతము పాతది శ్రేష్టమైనదని. ఈ వాదము కచ్చితమని ఎలా అనగలము?

చాల సంవత్సరాల క్రితం నా భార్య నేను సీనాయి పర్వతము అంచున ఉన్న, సెయింట్ కేథరిన్ మోనాస్టేరిలో ఉన్నాం. ప్రసంగ ప్రతి లభ్యమైన స్థలాన్ని చూసాం – ప్రాచీన ఆశ్రమములోని రాళ్ళ కుప్ప. ఆశ్రమము ద్వారము దగ్గర పెద్ద మానవ పుర్రెల కుప్ప ఉంటుంది. ఇవి శతాబ్దాలుగా జీవించిన సన్యాసుల పుర్రెలు. లోపల నేనెప్పుడు చూడని అంధకార సాతాను భూయిష్ట గుడి ఆవరణము చూసాను. పదుల సంఖ్యలో ఉష్ణ పక్షి గుడ్లుపై కప్పు నుండి వేలాడుతుంటాయి. ఆ స్థలంలో చిటికిన క్రొవ్వత్తుల వెలుగు ఉంటుంది. "రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్" లోని స్థలములా ఉంటుంది"! ఆ భయంకర స్థలంలో ఈ రాత్రి గడపాలనుకోవడం లేదు! ఈ అంధకార మసగ స్థలంలో టిస్ చెందోర్ప్ పాత సువార్త ప్రసంగ ప్రతులు కనుగొన్నాడు. తరువాత నా భార్య నేను వాస్తవిక ప్రసంగ ప్రతులను లండన్ లో బ్రిటిష్ వస్తు ప్రదర్శన శాలలో చూసాము.

ఆ ఆశ్రమంలో ఉన్న ప్రాచీన సన్యాసులు యోగాశాస్త్రముచే ప్రభావితం చేయబడ్డారని నేను ఒప్పింపబడ్డాను. యోగాలు ఉపవాసమును ఉద్ఘాటించారు. అందుకే యోగా ప్రభావిత సన్యాసులు "ఉపవాసము" పదాన్ని వదిలేసారు చేతితో మార్కు సువార్తను చూచి రాసేటప్పుడు.

ఇంకొక కారణము నేననుకుంటాను "ఉపవాసము" పదాన్ని మార్కు వ్రాయడానికి. చూడండి, "ఉపవాసము" అనే పదాన్ని తొలగించడంలో అర్ధము లేదు. ఎన్ఐవి (NIV), ఇతర ఆధునిక తర్జుమాలలో వలే, అది కూడా, "ప్రార్ధన ద్వారానే వదిలిపోవును" అని రాయబడింది. బుర్ర ఉపయోగించండి. శిష్యులు ప్రార్ధించినట్లు మీకు తెలియదా? వారు ప్రార్ధించారు! కాని "ఈవిధమైనది" ప్రార్ధన కంటే ఎక్కువ అవసరం. అంతే కదా? సి. ఎస్. లూయిస్ చెప్పినట్టు ఆయన వ్యాసంలో, ఈబైబిలు విమర్శకులు ఆంగ్ల సాహిత్యాన్ని చదివి ఉండాల్సింది. వారు వివరణ చదివి ఉంటే ఏదో తప్పింది అని వారు గ్రహించి ఉండేవారు. "ఈవిధమైనది ప్రార్ధనతో వదిలిపోతుందా"? అర్ధం లేదు! వారు ప్రార్ధించారు. ఆ వాక్యములో అర్ధము లేదు ఇలా చెప్పకపోతే, "ప్రార్ధన మరియు ఉపవాసము ద్వారానే ఈ విధమైనది వదిలిపోవును."

మూడవ కారణము ఉంది. దీర్ఘ క్రైస్తవ చరిత్ర అంతటిలో ఉపవసించి ప్రార్ధించే అవసరత ఉందని క్రైస్తవులు నమ్మారు, దేవుని పనిని కొన్ని సాతాను శక్తులు ఆపినప్పుడు. గత ఉజ్జీవాల్లోని గొప్ప బోధకులంతా ఎరుగుదురు వారు ఉపవసించే సమయాలున్నాయని. ఈనాడు ఉపవాసము నుండి వైదొలుగుతున్నారు, "ప్రార్ధన మరియు ఉపవాసము" పదాలు లేకపోవడం వలన. మీకు తెలుసు జాన్ వెస్లీ వారానికి రెండు మూడు సార్లు మొదటి గొప్ప మేల్కొలుపు సమయంలో ఉపవాసం ఉన్నాడని? మీకు తెలుసా జోనావాన్ ఎడ్వర్డ్స్ మూడు రోజులు "ఆగ్రహ దేవుని చేతిలో పాపులపై" బోధించేటప్పుడు మూడు రోజులు ఉపవాసము ఉన్నాడని? ఈ ప్రసంగము అతని సంఘములో ప్రశంశనీయ ఉజ్జీవానికి దారి తీసింది, నూతన ఇంగ్లాండ్ కు – తరువాత ఇంగ్లాండ్ కు వ్యాపించింది. ఎడ్వర్డ్స్ ఉపవాసము లేకుండా ప్రార్ధిస్తే ఆ ఉజ్జీవము వచ్చేదా? ఇది కచ్చితము – దేవుడు ఉజ్జీవాన్ని పంపించాడు అతడు ఉపవాసము ఉండి ప్రార్ధించినప్పుడు! ఈనాడు మన సంఘంలో ఉజ్జీవము లేకపోవడానికి ఉపవాసము లేకపోవడం ఒక కారణం కాదా? ఇది కచ్చితం – ఈరోజు బహు కొద్ది ఉజ్జీవం ఉందంటే, బహుకొద్ది ఉపవాసము ఉంది కనుక! అది కచ్చితము!

తరువాత నాల్గవ కారణమూ ఉంది "మరియు ఉపవాసము" అనే పదాలు పెట్టడానికి. లూథర్ లేఖన "సారుప్యత"ను గూర్చి మాట్లాడాడు. అతని ఉద్దేశము మనము ఇతర అలాంటి లేఖనాలు చూడాలి వారు చెప్పేది చూడడానికి, ఒక భాగాన్ని తర్జుమా చేసేటప్పుడు. ఉపవసమును గూర్చి బైబిలులో సుపరిచిత పాఠ్య భాగము ఏమి? ఒక బైబిలు విద్యార్ధి తప్పక ఎరిగి ఉండాలి అది యెషయా 58:6.

"దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు? కాడిమాను [గొలుసులు] మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుట, ప్రతికాడిని విరుగ గొట్టుటయు, నేర్పరచుకొనిన ...ఉపవాసము గదా?" (యెషయా 58:6)

యేసుకు యెషయా బాగా తెలుసు. నజరేతు సమాజము మందిరంలో యెషయా 61:1,2 నుండి ఆయన బోధించాడు. తప్పకుండా యేసు యెషయా 58:6 ను గూర్చి అదృశ్యభావము కలిగి అన్నాడు, "ఈ విధమైనది, ప్రార్ధన ఉపవాసము ద్వారానే వదిలిపోవును" (మార్కు 9:29).

"దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు? కాడిమాను [గొలుసులు] మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుట, ప్రతికాడిని విరుగ గొట్టుటయు, నేర్పరచుకొనిన ...ఉపవాసము గదా?" (యెషయా 58:6)

యెషయా వలే, యేసు శిష్యులతో చెప్తున్నాడు ప్రార్ధన ఉపవాసము "బాధింప బడిన వారిని విడిపించును" – సాతాను కాడిని విరుగగొట్టును! అది లేఖన "భావన"! మన పాఠ్యభాగముపై బైబిలు శ్రేష్ట వ్యాఖ్యాత. లూథర్ నాతో ఏకీభవిస్తాడని నా అభిమతము.

ఐదవ కారణము "మరియు ఉపవాసము" ను అంగీకరించడానికి దెయ్యాలు వెళ్ళగొట్టిన వారు బోధించారు ఉపవాసము కొన్ని విషయాలలో సహాయకరమని. జాన్ వెస్లీ, మత్తయి 17:21 సమాంతర భాగముపై మాట్లాడుతూ, అన్నాడు, "ఈవిధమైన దయ్యాలు ప్రార్ధన ఉపవాసము ద్వారానే పోతాయి – ఎంతమంచి సాక్ష్యము ఉపవాస ఉదృతను గూర్చి, అది పట్టుదల ప్రార్ధనతో కలుపబడినప్పుడు. అపోస్తలులు వెళ్ళగొట్టిన కొన్ని రకాల దయ్యాలు ఉపవాసము లేకుండా" కాని ఈ విధమైన దయ్యాలు ప్రార్ధన ఉపవాసము ద్వారానే పోతాయి (John Wesley, M.A., Wesley’s Notes on the New Testament, Baker Book House, 1983, volume I; note on Matthew 17:21).

జాన్ వెస్లీ (1703-1791) కు దెయ్యాల విడుదలను గూర్చి బాగా తెలుసు ఆయన సుదీర్ఘ పరిచర్యలో వెస్లీయన్ మెథడిజం వ్యవస్తాపకునిగా.

డాక్టర్ థామస్ హేల్ థాయ్ ల్యాండ్ వైద్య పరిచారకుడు. పరిచర్యలో చాలాసార్లు దయ్యాలను ఎదుర్కొని, డాక్టర్ హేల్, అతని వ్యాఖ్యానంలో, ఉపవసమును సిఫారసు చేసాడు. డాక్టర్ హేల్ మార్కు 9:29 పై వ్యాఖ్యానిస్తూ, అన్నాడు, "కొన్ని పరిస్థితులలో మన మానవులు దేవుని నుండి పొందుకోవడానికి ఉపవాసము అవసరము...ఉపవాసము ద్వారా, దేవునికి మనము చూపిస్తాం, మన తీవ్రంగా ఉన్నామని...ఆయన అమన ప్రార్ధనలకు జవాబిచ్చి మనకు గొప్ప పరిమాణ శక్తి, జ్ఞానము ఆత్మీయ ఆశీర్వాదము ఇస్తాడు." పరిచర్యలో దయ్యాన్ని ఎదుర్కొన్నప్పుడు, డాక్టర్ హేల్ అన్నాడు మనం తప్పకుండా పాఠ్యభాగంలో "మరియు ఉపవాసము" కలపాలి. (Thomas Hale, M.D., The Applied New Testament Commentary, Kingsway Publications, 1997, p. 265; note on Mark 9:29).

ఇప్పుడు నేను ఆరవ ఆఖరి కారణమూ ఇస్తాను "మరియు ఉపవాసము" ను ఉంచడానికి. రెండు ప్రతులు దానిని వదిలాయి, కాని వాస్తవంగా వందల ప్రతులలో, బాగా ప్రాచీన ప్రతులలో, అది ఉంది. విమర్శకులు వదిలిపెట్టిన రెండింటిని పట్టుకొని దానిని కలిగియున్న వందల చాల ప్రాచీన ప్రతులను మర్చిపోయారు. దేవుడు మనకు సహాయము చేయును గాక! మనకు ఉజ్జీవము వస్తుంది అనుకోవడం లేదు ప్రార్ధనతో ఉపవాసము కలుపకుండా!

అక్కడ, నేను ఈ వచనమపై ఆధునిక అనువాదాలను తిరస్కరించడానికి ఆరు కారణాలు ఇచ్చాను! వాటి నుండి నేను బోధించాను. నేను వాటిని నమ్మను. అందుకే నేను కింగ్ జేమ్స్ బైబిలు నుండి బోధిస్తాను. అందుకే మీరు కింగ్ జేమ్స్ బైబిలు వచనాలు కంటత పట్టాలంటాను, మీరు రోజు ధ్యానములు కింగ్ జేమ్స్ నుండి చెయ్యండి. అది మిమ్మును ఆశీర్వదిస్తుంది మీరు దానిని నమ్మవచ్చు!

"ఈ విధమైనది, ప్రార్ధన మరియు ఉపవాసము ద్వారా మాత్రమే వదిలిపోవును" (మార్కు 9:29).

ఇప్పుడు, మిగిలిన ప్రసంగానికి రెండు ప్రశ్నలకు జవాబిస్తాను:


(1) "ఈ విధమైనది" అంటే ఏమిటి?

(2) మనం ఎలా "ఈ విధమైనది" దానిని అధిగమించగలము?


దెయ్యాలు సాతాను ఉన్నాయని నిరూపించడానికి సమయం వ్యర్ధము చేయను. మీరు ఆత్మల సంపాదకులైతే, అనుభవము ద్వారా, దెయ్యాల నిజత్వము ఇప్పటికే తెలుసు. కనుక ముందుకు వెళతాను వాటి ఉనికిని గూర్చి చెప్ప ప్రయత్నించకుండా.

"ఈవిధమైనది" మనలను ఆపుతున్న దెయ్యాలను సూచిస్తుంది, మామూలు పద్దతుల ద్వారా వాటిని జయించలేము. బైబిలు బోధిస్తుంది దెయ్యాలు అవిశ్వాసులైన వారికి గుడ్డితనం కలిగిస్తాయి "వారి మనస్సులో ఉన్న వాటిని నమ్మరు" (II కొరిందీయులకు 4:4). మారక మునుపు లోకంలో ప్రతి వ్యక్తికీ అది వాస్తవము. మనం చాల కాలంగా "దాని" తో బేటి అవుతున్నాం. తరుచు చూస్తాం "అది" మన ప్రార్ధనలకు క్రీస్తు జవాబును బట్టి అధిగమించడం.

మనకు ఇంకా తెలుసు "అది" అవిశ్వాసి హృదయములో వ్యాక్యాన్ని పెరికి వేస్తుంది – "దయ్యము వచ్చి, వారి హృదయాల నుండి వాక్యము ఎత్తికొనిపోవును" (లూకా 8:12). మనం తరుచు చూస్తాం "అది" మన ప్రార్ధనలకు క్రీస్తు జవాబును బట్టి అధిగమించడం.

ఆది నుండి ఈ రెండు పనులు చెయ్యడానికి సాతాను దెయ్యాలను పంపింది. ఏదేను వనములో ఆదాము హవ్వల కళ్ళకు అంధత్వము కలిగించింది. ఆ పురాతన సమయంలోనే వారి హృదయాల నుండి వాక్యాన్ని ఎత్తుకొని పోయింది.

మనం సుమారుగా చెప్పవచ్చు ఆధునిక సమయాల వరకు అమెరికా మరియు పాశ్చాత్య దేశాల ప్రజలను ఆ రెండు మార్గాల ద్వారా దెయ్యము బానిసలుగా చేస్తుంది. ఆధునిక సమయం వరకు సాధారణంగా ప్రజలు దేవుడిని నమ్మరు. బైబిలు దేవుని వాక్యమని ప్రజలు సామాన్యంగా నమ్మరు. వారి హృదయాలు అంధత్వము పాలయ్యాయి. వారి హృదయాల నుండి వాక్యము పెరికివేయబడింది. అయినను, సాధారణంగా, వారు దేవుని బైబిలును నమ్మరు. వారిని "ఆధునిక" స్త్రీ పురుషులుగా చెప్పవచ్చు. అనాధునికులుగా క్లిష్ట మనసుతో వారు క్రైస్తవ్యములోనికి రాలేదు. వారు క్రీస్తును నమ్మకపోవచ్చు – కాని వారు విమర్శించలేదు "దేవుడు లేడు," లేక "దేవుడు చనిపోయాడు" అని చెప్తూ – అలాంటివి. కనుక అనాధునికులు సువార్తను బోధించేలా వారి కొరకు ప్రార్ధించాలి. అది పోలిస్తే సులువు.

తరువాత మనం "ఆధునిక" కాలములోనికి వచ్చాం. ఈ కాలము సాంకేతికంగా మేల్కొలుపుగా చెప్పవచ్చు, ఇది 17 వ శతాబ్దపు అంతటిలో ఆరంభమై వోల్టేర్ (1694-1778) వరకు కొనసాగింది. ఈ కాలంలో మనష్యులు భూసంబందికులై దేవుడు బైబిలును గూర్చి విమర్శనాత్మకంగా అయ్యారు. కాని 19 వ శతాబ్దము వరకు ఆ క్లిష్ట మానసిక తీరు సామాన్యానికి చేరలేదు. "ఆధునిక మనస్థితి" "శాస్త్రీయ పద్దతుల" ద్వారా "నిరూపించబడాలి." ఆత్మీయత విషయంలో అది విమర్శనాత్మకము. యోహాను 3:16 పై ఆయన ప్రసంగములో ప్రముఖ సువార్తికుడు బిల్లీ గ్రేహం అన్నాడు, "నీవు దేవుని పరీక్షా నాళికలో పెట్టలేవు." "ఆధునిక" మానవునికి అతడు బోధిస్తున్నాడు. కాని అంగీకరింపబడిన విషయం "ఆధునిక" కాలము హిప్పీ తరము వలన చనిపోయింది.

ఈనాడు మనం వేదాంతము చెప్పే "ఆధునికత తరువాత" కాలంలో ఉన్నాం – ఆధునికత తరువాత కాలము. ఆధునికత తరువాత యువకుల మనసు ఈనాడు నీతిభాహ్యంగా ఉంది. నీతిలేదు. కొన్ని "రాజకీయ సరియైన" అభిప్రాయాలున్నాయి, కాని నిజ నీతితత్వం లేదు. "అది మీకు సరియే, నాకు కాదు." మంచి చెడులకు నీతి ప్రమాణకత లేదు. "సరి అని భావిస్తే సరి" ఇది అధునాతన తరవాతి ధ్యేయము. "దేవుడు లేడు" అని చెప్పే బదులు ఆధునికులు చెప్పేటట్టు – వారు అంటారు "దేవుడు నీకు నిజము అయితే, సరే – కాని నా స్వంత దేవుళ్ళు నాకుండనివ్వండి." ఇంకొక మాటలలో, ప్రమాణము లేదు. నీకు ఏది బాగా పనిచేస్తే అది మంచిది – నీ కొరకు.

అది "ఈవిధమైనది" – అలా ఈనాడు యవనస్తులు ఆలోచిస్తున్నారు – స్పష్టత లేని, మారుతున్న, కచ్చితము కాని, "నీకేది సరి" అనే ఆలోచనలతో. అది "ఈవిధమైనది." ఆదెయ్యాలకు వ్యతిరేకంగా మనం పోరాడుతున్నాము! ముసలి వాళ్లనడం నేను వింటాను, నిజమే అది, ఒబామా నుండి అంధకారము వచ్చింది. ప్రతిదీ వేరుగా ఉంది. ఏదీ కచ్చితంగా లేదు నిలకడగా లేదు. అవును, మీరనవచ్చు "ఒబామా" ఆత్మ, ఆధునికత తరువాతి దెయ్యము పాతదానినంతటిని తుడిచేస్తుంది – దాని స్థలంలో దేనిని ఇవ్వడం లేదు. అది మన సంఘాలను ప్రభావితం చేస్తుందా? ఓ, అవును! దక్షిణ బాప్టిస్టులు గత సంవత్సరం 2,000 సంఘాలు కోల్పోయాయి! ఎప్పుడు వినలేదు! అలాంటిది ఎప్పడు లేదు! డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు, "మనం గ్రహించాలి మన జీవితాల కొరకు పోరాడుతున్నం అద్భుత శక్తికి వ్యతిరేకంగా. శక్తివంత ప్రతికూలతకు మనం వ్యతిరేకులం" (Studies in the Sermon on the Mount, part 2, p. 148).

"ఈవిధమైనది" మనకు చాల బలమైనది. ప్రార్ధన ద్వారా అది జయింపబడనేరదు. లేదు – మనకు "ప్రార్ధన మరియు ఉపవాసము" కావాలి లేకపోతె మన సువార్తిక ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. కాబట్టి వచ్చే శని వారము మీరు ఉపవసించి ప్రార్ధించాలని అడుగుతున్నాము. వైద్య సమస్యలుంటే ఉపవాసము ఉండవచ్చు. వైద్యపర సందేహాలు వైద్యుని దగ్గర తీర్చుకోండి. మాతో ఉపవాసము ఉండాలంటే, ఎక్కువ నీళ్ళు తాగాలని, ప్రతి గంటకు ఒక గ్లాసుడు. మనం శనివారము సాయంత్రము 5:30 కు ఉపవాసము ముగిస్తాము. "ఈవిధమైనది, ప్రార్ధన మరియు ఉపవాసము ద్వారా మాత్రమే వదిలిపోతుంది." గమనించండి శనివారము దేవునికి చాలా సార్లు ప్రార్దిస్తాం నశించు వారిని తీసుకు రావడానికి వారిని ఇక్కడ ఉంచడానికి, ఆయన రక్తము నీతిద్వారా వారిని రక్షణ నిమిత్తము క్రీస్తు నొద్దకు తీసుకురావడానికి. పరలోకపు తండ్రి, అలా జరగనివ్వండి. యేసు నామములో అడుగుచున్నాము, ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి. దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రుదోం: మార్కు 9:14-29.
ప్రసంగము ముందు పాట బెంజమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్ గారిచే:
         "ఓ పాడడానికి వేయి నాలుకలు" (చార్లెస్ వెస్లీచే, 1707-1788;
        స్వరము "ఓ చక్కదిద్దు నా కొరకు తెరువుము).
        “O For a Thousand Tongues to Sing” (by Charles Wesley, 1707-1788;
        to the tune of “O Set Ye Open Unto Me).