Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




క్రీస్తు పునరుత్థానమును గూర్చిన మూడు ఋజువులు

THREE PROOFS OF CHRIST’S RESURRECTION
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

లాస్ ఏంజలిస్ లోని బాప్టిస్టు టేబర్నేకల్ నందు బోధింపబడిన ప్రసంగము
ప్రభువు దినము సాయంకాలము, ఏప్రిల్ 1, 2018
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, April 1, 2018

"రాజు ఈ సంగతులు ఎరుగును, గనుక అతని యెదుట నేను ధైర్యముగా మాటలాడుచున్నాను: వాటిలో ఒకటియు అతనికి మరుగై యుండలేదని రూడిగా నమ్ముచున్నాను; ఇది ఒక మూలను జరిగిన కార్యము కాదు" (అపోస్తలుల కార్యములు 26:26).


అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయములో లూకా పౌలు మార్పును గూర్చిన సాక్ష్యము మూడుసార్లు లిఖించాడు. లూకా మూడు సార్లు వ్రాయడాన్ని మనము సులభంగా అర్ధం చేసుకోవచ్చు. క్రీస్తు మరణము పునరుత్థానము తరువాత, క్రైస్తవ్యము చరిత్రలో అపోస్తలుడైన పౌలు మార్పిడిని గూర్చిన అంశమును మించినది ఇంకొకటి లేదు.

పౌలు ఇలా బోధించాడు కాబట్టి బంధింపబడ్డాడు,

"...చనిపోయిన యేసు, అను ఒకని గూర్చి, ఆ యేసు బ్రతికి యున్నాడని పౌలు చెప్పెను" (అపోస్తలుల కార్యములు 25:19).

ఇప్పుడు పౌలు, తన చేతులు బంధింపబడి, అగ్రిప్పరాజు ముందు విలువ బడ్డాడు. అగ్రిప్ప యూదుడు. కనుక క్రీస్తు పునరుత్థానమును గూర్చి పాత నిబంధన ప్రవచనాల ఆదరంగా పౌలు తాను బోధించిన దానిని సమర్ధించుకున్నాడు. రాజు అగ్రిప్పకు క్రీస్తు సిలువ వేయబడడం పునరుత్థానము గూర్చి ముందే తెలుసని చెప్పి పౌలు తనను సమర్ధించుకున్నాడు. సుమారు ముప్ఫై సంవత్సరాల ముందు సిలువ వేయబడడం పునరుత్థానము చోటు చేసుకున్నాయి. ప్రతి యూదునికి అది తెలుసు, అగ్రిప్ప రాజుకు కూడ. అందుకు పౌలు చెప్పాడు,

"...రాజు ఈ సంగతులు ఎరుగును, గనుక అతని యెదుట నేను ధైర్యముగా మాటలాడుచున్నాను: వాటిలో ఒకటియు అతనికి మరుగై యుండలేదని రూడిగా నమ్ముచున్నాను; ఇది ఒక మూలను జరిగిన కార్యము కాదు" (అపోస్తలుల కార్యములు 26:26).

"ఇది ఒక మూలను జరిగిన కార్యము కాదు." అది మామూలుగా గ్రీకులో ఇలా వ్యక్తము చేయబడును. డాక్టర్ గయోబెలిన్ వ్యాఖ్యానము ఇలా చెప్తుంది,

పాలస్తీనా ప్రాంతములో యేసు పరిచర్య బాగా సుపరిచితము, అగ్రిప్ప అది వినే ఉంటాడు. యేసు మరణ పునరుత్థానములు ముద్రింప బడ్డాయి, క్రైస్తవ సువార్త మూడు దశాబ్దాలుగా ప్రకటింపబడుతుంది. తప్పకుండా ఈ విషయాలు రాజుకు తెలుసు, "ఎందుకంటే ఇది ఒక మూలను జరిగిన కార్యము కాదు" (The Expositor’s Bible Commentary, Frank E. Gaebelein, D.D., General Editor, Zondervan Publishing House, 1981, volume 9, p. 554; note on Acts 26:25-27).

ఈనాడు చాలామంది అనుకుంటారు క్రీస్తు పునరుత్థానము ఒక తేలికగా అర్ధము కాని సంఘటన అని అది కేవలము కొంతమంది జాలరులకు మాత్రమే తెలుసని. కాని సత్యమునకు ఏదీ దూరము కాదు! క్రీస్తు పునరుత్థానము ఇశ్రాయేలులో ఉన్న ప్రతి యూదునికి తెలుసు, ముప్ఫై సంవత్సరాలుగా రోమా ప్రపంచమంతటా ఈ విషయము చర్చించబడింది! క్రీస్తు పునరుత్థానము రహస్యంగా ఉంచబడలేదు!

"ఇది ఒక మూలను జరిగిన కార్యము కాదు" (అపోస్తలుల కార్యములు 26:26).

డాక్టర్ లెన్ స్కీ అన్నాడు,

యేసును గూర్చి చెప్పబడినది దేశ రాజధానిలో చోటు చేసుకుంది, [రోమా గవర్నరు] అసెంబ్లీ సమక్షంలో పిలాతు కూడ జోక్యము చేసుకున్నాడు, యేసు దేశమంతా తెలిసిన వ్యక్తి, పరిసర ప్రాంతాలకు కూడ ఆయన ప్రఖ్యాతి వ్యాపించింది. "ఒక మూల జరిగినది కాదు"... ఒక అర్ధము కాని చిన్న విషయము కాదు ఎవరికీ తెలియక పోవడానికి, అది గొప్ప ప్రాధాన్య విషయము, బాహాటంగా జరిగింది వ్యాపించింది, [రాజు] అగ్రిప్ప పూర్తి ఏకాగ్రతతో విన్నాడు (R. C. H. Lenski, D.D., The Interpretation of the Acts of the Apostles, Augsburg Publishing House, 1961 edition, p. 1053; note on Acts 26:26).

"ఇది ఒక మూలను జరిగిన కార్యము కాదు" (అపోస్తలుల కార్యములు 26:26).

క్రీస్తు విరోధులు ఆయన మృతులలో నుండి లేవలేదని చెప్పడానికి మూడు దశాబ్దాలు ప్రయత్నించారు. అయినను వారు విఫలులయ్యారు. ఎంత గట్టిగా ప్రయత్నించినా, శత్రువులు ఆయన చనిపోయే ఉన్నాడు అని నిరూపించలేకపోయారు. అగ్రిప్పరాజుతో పౌలు మాట్లాడే సమయానికి, వేలకొలదీ యూదులు, పదివేల మంది అన్య జనులు, ప్రకటిస్తున్నారు, "క్రీస్తు మృతులలో నుండి లేచి యున్నాడని."

క్రైస్తవ్యానికి పునాది క్రీస్తు పునరుత్థానము. క్రీస్తు శరీరము సమాధి నుండి లేచి ఉండకపోతే, క్రైస్తవ విశ్వాసమునకు ఆధారము ఉండదు. అపోస్తలుడైన పౌలు అన్నాడు,

"మరియు క్రీస్తు లేపబడి ఉండని యెడల, మేము చేయు ప్రకటన వ్యర్ధమే, మీ విశ్వాసమును [వ్యర్ధమే]" (I కొరింధీయులకు 15:14).

ఆయన పునరుత్థానము లేదని నిరూపించడానికి క్రీస్తు విరోధులు చాలా కష్ట పడ్డారు! అయినను వారంతా విఫలమయ్యారు. గ్రెగ్ లారీతో చాలా విషయాలలో అంగీకరించను, కాని క్రీస్తు పునరుత్థానము విషయంలో ఏకీభవిస్తాను. క్రీస్తు విరోధులు ఎందుకు విఫలులయ్యారో చెప్పడానికి గ్రెగ్ లారీ మూడు కారణాలు చెప్పాడు – మృతులలో నుండి యేసు క్రీస్తు పునరుత్థానమునకు మూడు సాక్ష్యాలు (Greg Laurie, Why the Resurrection? Tyndale House Publishers, 2004, pp. 13-24). I am going to paraphrase them.

"ఇది ఒక మూలను జరిగిన కార్యము కాదు" (అపోస్తలుల కార్యములు 26:26).

I. మొదటిది, కాళీ సమాధి.

యేసు పునరుత్థానమునకు మొదటి ఋజువు కాలి సమాధి. యేసు సమాధి మూడు రోజుల తరువాత కాలి అయింది అనేది ఆయన పునరుత్థానమునకు గొప్ప ఋజువు. ఆయన చనిపోయిన తరువాత మూడవ దినమున సమాధి కాలి అయింది అనే విషయముపై నాలుగు సువార్తల గ్రంథకర్తలు పూర్తిగా ఏకీభవించారు. కాలి సమాధి వాస్తవమును వేరే సాక్ష్యాలు కూడ దృవీకరించాయి.

క్రీస్తు పునరుత్థానమునకు వ్యతిరేకంగా చేయబడిన దాడి ఎవరో యేసు దేహమును దొంగిలించారని. ప్రధాన యాజకులు

"...కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి, ఆలోచన చేసి, ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి, మేము నిద్రపోవుచుండగా, అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకొనిపోయిరి మీరు చెప్పుడి... అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని, తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి: ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైయున్నది" (మత్తయి 28:12-15).

కాని ఈ వాదన చాలామందిని ఒప్పించలేదు. శిష్యులు ఆయన దేహమును దొంగిలించి ఆయన పునరుత్థానుడయ్యాడని వారు నటించడం జరగలేదని ఇట్టే అర్ధమవుతుంది. మూడు రోజులు ముందు శిష్యులు క్రీస్తు బంధింపబడి సిలువ వేయబడిన తరువాత పారిపోయారు. ఈ పిరికి మనష్యులు ధైర్యముతో యేసు దేహమును దొంగిలించడం వీలు కాని పని – వారు తెగించి ఆయన మృతులలో నుండి లేచాడని ధైర్యంగా బోధించడం – అది వారి జీవితాలకు ప్రమాదం! కాదు, అది వితండ వాదన! సత్యము జత అవడం లేదు. "యూదుల భయము వలన" శిష్యులు తలుపు వేసుకొని గదిలో దాగుకొన్నారు (యోహాను 20:19). వారు దిగ్బ్రాంతి చెందారు. ఆయన లేస్తాడని వారు నమ్మలేదు. క్రీస్తు అనుచరులెవారికి రోమా ప్రభుత్వాన్ని సవాలు చేసి యేసు దేహమును దొంగిలించేంత ధైర్యములేదు. అది మానసిక విషయము దానిని తీసిపడేయ్యలేము.

వేరే అనుమానితులు, క్రీస్తు దేహాన్ని దొంగిలించగలవారు, ఆయన శత్రువులు. ఈ సిద్ధాంతపు సమస్య క్రీస్తు విరోధులకు ఆయన సమాధిని దొంగిలించే ఉద్దేశము లేదు. ప్రధాన యాజకులు ఇతర మత నాయకులు క్రీస్తును చంపారు ఎందుకంటే ఆయన వారి మత వ్యవస్తను జీవిత విధానాన్ని భయపెట్టాడు. వీరు కోరుకున్న చివరి విషయము క్రీస్తు తిరిగి జీవించాడు అని ప్రజలు అనుకునేటట్టు చేయడం! అందుకే ఈ మత నాయకులు ఆయన పునరుత్థానమును గూర్చిన విషయాలు నిర్మూలించారు. మత్తయి సువార్త చెప్తుంది వారు రోమా గవర్నరు, పొంతిపిలాతు దగ్గరకు వెళ్లి ఇలా అన్నారు,

"అయ్యా, ఆ వంచకుడు సజీవుడై, యుండినప్పుడు, మూడు దినములైన తరువాత, నేను లేచేదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి మూడవ దినము వరకు, సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించుము, వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి, ఆయన మృతులలో నుండి లేచెనని, ప్రజలతో చెప్పుదురేమో: అప్పుడు మొదటి వంచనకంటే కడపటి వంచన మరి చెడ్డదై యుండునని చెప్పిరి" (మత్తయి 27:63-64).

అందుకు పిలాతు కావలి వారిని తీసుకొని వెళ్లి "మీ చేతనైనంతమట్టుకు" –సమాధిని భద్రము చేయుడని చెప్పెను (మత్తయి 27:65). వారు వెళ్లి కావలివారిని కూడ ఉంచుకొని రాతికి ముద్రవేసి సమాధిని భద్రము చేసిరి (మత్తయి 27:66). విచిత్రంగా, ఈ ప్రధాన యాజకులు మత నాయకులకు క్రీస్తు పునరుత్థానము విషయంలో ఆయన శిష్యుల కంటే ఎక్కువ నమ్మకము ఉంది!

నిజమేమిటంటే మత నాయకులు క్రీస్తు దేహము దొంగిలించ బడకుండా చాలా చర్యలు తీసుకున్నారు. మృతులలో నుండి లేవడం అబద్ధమని నిరూపిద్దామనుకున్నారు. క్రీస్తు మృతులలో నుండి లేచాడు అనే విషయము పూర్తిగా రూపు మాపాలని మత నాయకులు విశ్వ ప్రయత్నము చేసారు. దేహమును దొంగిలించడం శత్రువులు చేయగలిగే ఆఖరి పని. వారు దేహమును దొంగిలించి ఉంటే, శిష్యులు ఆయన పునరుత్థానమును గూర్చి బోధించేటప్పుడు తప్పక చూపించి ఉండేవారు. కాని క్రీస్తు విరోధులు ఎన్నడు ఆయన దేహమును చూపించలేదు. ఎందుకు? ఎందుకంటే చూపించడానికి దేహము లేదు కాబట్టి! సమాధి కాళీగా ఉంది! క్రీస్తు మృతులలో నుండి లేచాడు!

"ఇది ఒక మూలను జరిగిన కార్యము కాదు" (అపోస్తలుల కార్యములు 26:26).

క్రీస్తు పునరుత్థానమునకు మొదటి ఋజువు కాళీ సమాధి, కాని ఇంకా చాలా ఉన్నాయి!

II. రెండవది, ప్రత్యక్ష సాక్షి కధనము.

యేసు సిలువ వేయబడినప్పుడు, ఆయన శిష్యులు నిస్సహాయులుగా ఉన్నారు. వారి విశ్వాసము నాశనమయ్యింది. ఆయనను సజీవునిగా చూస్తామనే నిరీక్షణ లేదు. అప్పుడు యేసు వచ్చాడు,

"యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగును గాక, అని వారితో చెప్పెను" (యోహాను 20:19).

శిష్యులు ఆయనను సజీవునిగా మళ్ళీ మళ్ళీ చూసారు.

"ఆయన శ్రమపడిన తరువాత నలబది దినముల వరకు వారికి అగపడుచు అనేక ప్రయానములు చూపి వారికి, తన్నుతాను సజీవునిగా కనుపరచుకొనెను" (అపోస్తలుల కార్యములు 1:3).

అపోస్తలుడైన పౌలు తిరిగి లేచిన క్రీస్తును గూర్చి ఇలా చెప్పాడు,

"ఆయన [కేఫా]కును, తరువాత పన్నెండు గురికి కనబడెను: అటు పిమ్మట, ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను... తరువాత, ఆయన యాకోబునకు; అటు తరువాత అపోస్తలుల కందరికీ కనబడెను. మరియు చివరగా నాతో సహా అందరికి కనబడెను" (I కొరింధీయులకు 15:5-8).

డాక్టర్ జాన్ ఆర్. రైస్ అన్నాడు,

ఆయన పునరుత్థానము తరువాత యేసును వందలాది మంది చూడడం ఎంత ఆనందదాయకము, కొంతమంది ఆయనను నలభై రోజులలో మళ్ళీ మళ్ళీ చూసారు’! [అపోస్తలుల కార్యములు 1:3]. బైబిలు నియమావళి "ఇద్దరు ముగ్గురు సాక్ష్యుల నోట నిర్ధారించబడాలి." ఇక్కడ వందల మంది సాక్ష్యులు ఉన్నారు. ఒకరు ఇద్దరు సాక్ష్యుల సాక్షముతో చాలామందికి మరణ శిక్ష విధింపబడింది.
     ఒక విచారణను ముగించడానికి పన్నెండు మంది అంగీకరించాలి. యేసు మృతులలో నుండి లేచాడని ఇక్కడ వందలమంది ప్రత్యక్ష సాక్ష్యులు ఉన్నారు. ఆయన మృత దేహమును మూడు రోజుల తరువాత చూసామని కనీసము ఒక్కరు కూడ చెప్పలేదు, ఋజువు చూపలేదు.
     ఈ ప్రత్యక్ష సాక్షులు సాక్ష్యము – ప్రత్యక్ష సాక్షులు, వారు రక్షకుని ముట్టుకున్నారు, తాకారు, ఆయన కాళ్ళలోని, చేతులలోని గాయాల ముద్రలను చూసారు, నలభై రోజులు ఆయనతో భోజనం చేసిన సహవాసము చేసారు – ఈ సాక్ష్యము బలమైన ఋజువు అమెరికా దేశపు ప్రధాన న్యాయస్థానము ముందు కాని ప్రపంచంలో ఏ న్యాయ స్థానము ముందైనా కాని... ఈ ఋజువు చాలా నిర్దిష్టమైనది నమ్మని వారు మాత్రము దానిని తిరస్కరిస్తారు. బైబిలు ప్రకటిస్తుంది యేసు "అనేక ప్రమాణములను చూపి వారికి తన్నువారు సజీవునిగా కనుపరచుకొనెను," అపోస్తలుల కార్యములు 1:3 (John R. Rice, D.D., The Resurrection of Jesus Christ, Sword of the Lord Publishers, 1953, pp. 49-50).

"ఇది ఒక మూలను జరిగిన కార్యము కాదు" (అపోస్తలుల కార్యములు 26:26).

కాళీ సమాధి, వందలమంది ప్రత్యక్ష సాక్ష్యులు, మృతులలో నుండి క్రీస్తు పునరుత్థానమునకు బలమైన ఋజువులు. కాని ఇంకా ఉన్నాయి.

III. మూడవది, అపోస్తలులు హత సాక్ష్యులవడము.

పునరుత్థానము అబద్ధమైతే ఎందుకు అపోస్తలులు అందరు అది ప్రకటించడానికి ఎందుకు అంత శ్రమ పడాలి? అపోస్తలులు క్రీస్తు పునరుత్థానము బోధించడం కొనసాగించడం మాత్రమే కాక, దానిని కాదనే బదులు వారు చనిపోయారు కూడ! సంఘ చరిత్ర చదివితే ప్రతి అపోస్తలుడు [యోహాను తప్ప – అతడు హింసింపబడి వెలి వేయబడ్డాడు] భయంకర మరణాలు పొందారు ఎందుకంటే వారు క్రీస్తు మృతులలో నుండి లేచాడని బోధించారు కాబట్టి. డాక్టర్ డి. జేమ్స్ కెన్నడీ అన్నాడు,

     ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యము. మనస్తత్వ శాస్త్ర చరిత్రలో అబద్ధము నకు ప్రాణము పెట్టిన పురుషుడు కాని స్త్రీ కాని లేదు. నేను ఆశ్చర్య పోయేవాడిని ఎందుకు దేవుడు అపోస్తలులను ఆది క్రైస్తవులను ఈ కష్టాల ద్వారా ఎందుకు నడిపించాడో, అంత దారుణ నమ్మశక్యము కాని, చిత్ర హింసలు...మనము ఈ ప్రత్యక్ష సాక్షులు నమ్మకత్వము, గునశీలత, శ్రమలు, వారి మరణము ఎరుగుదుము, వారిలో చాలామంది వారి రక్తముతో వారి సాక్ష్యానికి ముద్రవేశారు... పాల్ లిటిర్ అన్నాడు, "వారు నమ్మినది నిజమనుకున్నప్పుడు మనష్యులు చనిపోతారు... అబద్ధం అనుకుంటే, దాని కొరకు, చనిపోరు" (D. James Kennedy, Ph.D., Why I Believe, Thomas Nelson Publishers, 2005 edition, p. 47).

మృతులలో నుండి క్రీస్తు పునరుత్థానము చూసామని చెప్పినందుకు ఈ మనష్యులు మరణించారు:

పేతురు – భయంకరంగా కొరడాలతో కొట్టబడి తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడు.
  ఆంద్రియ – X రూపంలో ఉన్న సిలువపై సిలువ వేయబడ్డాడు.
     యాకోబు జేబెదాయి కుమారుడు – శిరచ్చేదనము చేయబడ్డాడు.
        యోహాను – మరుగుచున్న నూనెలో వేయబడి, తరువాతబహిష్కరింపబడి పత్మాసు
        ద్వీపమునకు పంపబడ్డాడు.
          ఫిలిప్ప – కొరడాలతో కొట్టబడి సిలువ వేయబడ్డాడు.
            బర్తిలోమయి – సజీవంగా [శరీరమంతా కోయబడి] తరువాత సిలువ వేయబడ్డాడు.
               మత్తయి – శిరచ్చేదనము చేయబడ్డాడు.
                  యాకోబు, ప్రభువు సహోదరుడు – దేవాలయముపై నుండి క్రిందికి తోయబడ్డారు,
                  తరువాత కొట్టబడి చంపబడ్డారు.
                    తద్డయి – బానములచే చంపబడ్డాడు.
                      మార్కు – ఈడ్చబడి చంపబడ్డాడు.
                        పౌలు – శిరచ్చేదనము చేయబడ్డాడు.
                           లూకా – ఒళీవ చెట్టుకు వ్రేలాడ దీయబడ్డాడు.
                              తోమా – ఈటెలతో వెంటాడబడి, తరువాతఅగ్ని గంధకములో త్రోసి వేయబడ్డాడు.

(The New Foxe’s Book of Martyrs, Bridge-Logos Publishers,
   1997, pp. 5-10; Greg Laurie, Why the Resurrection?
   Tyndale House Publishers, 2004, pp. 19-20).

ఈ మనష్యులు భయంకర శ్రమల ద్వారా వెళ్ళారు, భయంకర చావు పొందారు, ఎందుకంటే వారు క్రీస్తు మృతులలో నుండి లేచాడని చెప్పారని. మనష్యులు చూడని దానికొరకు అంత ధైర్యము చెయ్యరు! క్రీస్తు సమాధిలో నుండి లేచిన తరువాత ఈ మనష్యులు ఆయనను చూసారు! అందుకే చిత్ర హింసలు మరణము వారిని ప్రకటించడం నుండి ఆపలేకపోయాయి, "క్రీస్తు మృతులలో నుండి లేచి యున్నాడు అని!"

పేతురు సముద్ర తీరాన్న ఆయనను చూసాడు,
సముద్ర ప్రాంతాన్న ఆయనతో భోజనము చేసాడు;
యేసు అడుగుచున్నాడు, చనిపోయిన వ్యక్తి పెదవులతో,
"పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నవా?"
చనిపోయిన వాడు తిరిగి జీవించాడు!
చనిపోయిన వాడు తిరిగి జీవించాడు!
మరణపు బలమైన బంధకాలను విరుగగొట్టాడు –
చనిపోయిన వారు తిరిగి జీవించాడు!
("తిరిగి జీవించాడు" పౌలు రాడార్ చే, 1878-1938).
   (“Alive Again” by Paul Rader, 1878-1938).

ఈ మనష్యులు నమ్మని పిరికివారుగా ఉండి భయములేని హత సాక్ష్యులుగా అయ్యారు – ఎందుకంటే వారు సమాధిలో నుండి లేచిన క్రీస్తును చూసారు!

తోమా గదిలో ఆయనను చూసాడు,
ఆయనను తన యజమానిగా ప్రభువుగా పిలిచాడు,
గాయములలో తన వెళ్ళాను పెట్టాడు
అవి మేకులతో కత్తితో చేయబడ్డాయి.
చనిపోయిన వాడు తిరిగి లేచాడు!
చనిపోయిన వాడు తిరిగి లేచాడు!
బలమైన మరణపు బంధకాలను విరుగగొట్టాడు –
చనిపోయిన వాడు తిరిగి లేచాడు!
(పాల్ రాడార్, ఐబిఐడి.).
   (Paul Rader, ibid.).

పాల్ రాడార్ చే రచించబడిన ఆ గొప్ప పాటను మన సంఘాలు నేర్చుకొని పాడాలని నా ఆశ! మీరు నాకు వ్రాసి మనవి చేస్తే మీకు సంగీతము పంపిస్తాను. వ్రాయండి డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్., పి.ఓ. బాక్సు 15308, లాస్ ఎంజిలాస్, సిఎ 90015 – మనవి చేయండి పాల్ రాడార్ పాట సంగీతము కొరకు "తిరిగి జీవించాడు."

మేము క్రీస్తు పునరుత్థానము గూర్చి ఇంకా ఎన్నో ఋజువులు మీకు చూపించగలం, కాని అవి మిమ్మును ఒప్పింపలేవు. కొంతమంది చనిపోయి మృతులలో నుండి లేచిన క్రీస్తును చూచి కూడ "సందేహించారు" (మత్తయి 28:17). మీరు విశ్వాసము ద్వారా క్రీస్తు నొద్దకు రావాలి. నరావతారియైన క్రీస్తు అన్నాడు,

"మీరు నన్ను వెదకిన యెడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల, మీరు నన్ను కనుగొందురు" (యిర్మియా 29:13).

"ఏలయనగా నీతి కలుగునట్లు మనష్యుడు హృదయములో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును" (రోమా 10:10).

నేను తిరిగి లేచిన క్రీస్తును ఉదయం 10:30 గంటలకు, సెప్టెంబర్ 28, 1961న బయోలా కళాశాల (ఇప్పుడు విశ్వ విద్యాలయములో) ఎదుర్కొన్నాను డాక్టర్ చార్లెస్ జే. ఉడ్ బ్రిడ్జి ప్రసంగము వినిన తరువాత, ఆయన 1957 లో పుల్లర్ వేదాంత కళాశాలను స్వతంత్ర కారణంగా విడిచిపెట్టాడు (see Harold Lindsell, Ph.D., The Battle for the Bible, Zondervan Publishing House, 1978 edition, p. 111). తిరిగి లేచిన క్రీస్తును మీరు కూడ తెలుసుకోవచ్చు – మీరు ఆయనను గూర్చి ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటే "ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి" (లూకా 13:24). మీరు క్రీస్తు నొద్దకు వచ్చినప్పుడు మీ పాపములు క్షమించబడి ఆయన రక్తములో కడుగబడతాయి – ఆయన మృతుల పునరుత్థానము కారణంగా మీరు తిరిగి జన్మిస్తారు. మీరు త్వరలో క్రీస్తు నొద్దకు రావాలని నా ప్రార్ధన ! ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే:
"క్రీస్తులో మాత్రమే" (కీత్ గెట్టీ స్టార్ట్ టౌన్ ఎండ్ చే, 2001).
“In Christ Alone” (by Keith Getty and Stuart Townend, 2001).



ద అవుట్ లైన్ ఆఫ్

క్రీస్తు పునరుత్థానమును గూర్చిన మూడు ఋజువులు

THREE PROOFS OF CHRIST’S RESURRECTION

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

"రాజు ఈ సంగతులు ఎరుగును, గనుక అతని యెదుట నేను ధైర్యముగా మాటలాడుచున్నాను: వాటిలో ఒకటియు అతనికి మరుగై యుండలేదని రూడిగా నమ్ముచున్నాను; ఇది ఒక మూలను జరిగిన కార్యము కాదు" (అపోస్తలుల కార్యములు 26:26).

(అపోస్తలుల కార్యములు 25:19; I కొరింధీయులకు 15:14)

I.   మొదటిది, కాళీ సమాధి, మత్తయి 28:12-15; యోహాను 20:19;
మత్తయి 27:63-64, 65, 66.

II.  రెండవది, ప్రత్యక్ష సాక్షి కధనము., యోహాను 20:19; అపోస్తలుల కార్యములు 1:3;
I కొరింధీయులకు 15:5-8.

III. మూడవది, అపోస్తలులు హత సాక్ష్యులవడము, మత్తయి 28:17;
యిర్మియా 29:13; రోమా 10:10; లూకా 13:24.