Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




ఆయన రక్తము ద్వారా మనము కడుగబడ్డాము!

BY HIS BLOOD WE ARE CLEANSED!
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము సాయంకాలము, జనవరి 28, 2018
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, January 28, 2018

"అతడు తృణీకరింపబడిన వాడును ఆయెను; మనష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనా క్రాంతుడు గాను ఆయెను: వ్యాధిని అనుభవించిన వాడు గాను మనష్యులు చూడనోల్లని వాడుగాను ఉండెను; అతడు తృణీకరింప బడినవాడు, గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి" (యెషయా 53:3).

"మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను నలుగ గోట్టబడెను...అతడు పొందిన [దెబ్బల చేత] మనకు స్వస్థత కలుగుచున్నది" (యెషయా 53:5).


గత ఆదివారము రాత్రి క్రీస్తు రక్తము అవసరతను గూర్చి ఒక ప్రసంగము చేసాను ("రక్తముతో లేక రక్తము లేకుండా"). ప్రసంగములు రెండు విషయాలు ఉన్నాయి. మొదటిది, క్రీస్తు రక్తము లేకపోతే నీకు ఏమి జరుగుతుంది. రెండవది, క్రీస్తు రక్తము నీకు ఉంటే నీకేమి జరుగుతుంది.

మొదటి అంశము ప్రారంభములో నరకమును గూర్చి నేను విషయాలు సంక్షిప్తంగా చెప్పాను. తరువాత పాపమును గూర్చి చెప్పాను. నేనన్నాను యేసు రక్తము లేకుండా, "నీ పాపము నుండి నీకు స్వేచ్చ లేదు. నీ పాపము నుండి నీకు విడుదల లేదు. నీ పాపము నుండి స్వతంత్రత లేదు. నీ పాపమునకు క్షమాపణ లేదు." తరువాత రెండవ విషయానికి వెళ్లాను, "యేసు రక్తము కలిగి ఉంటే నీకేమి జరుగుతుంది." నాలుగు పూర్తి పేజీలు ఉపయోగించాను ప్రకటించడానికి క్రీస్తు రక్తము యొక్క అద్భుత శక్తిని వర్ణించడానికి "నీ పాపమును తుడిచివేస్తుంది," "నీ పాపమును క్షమిస్తుంది," "నీ పాపము నుండి విడుదల కలిగిస్తుంది," "నీ పాపము నుండి స్వతంత్రత ఇస్తుంది," "నీ పాపమును క్షమిస్తుంది," "పరలోకానికి తీసుకెళ్తుంది." నేనన్నాను పరలోకములో ఉండువారు పాడతారు వారు "క్రీస్తు రక్తముచే విమోచింపబడ్డారని." నేను ఫేన్నీ క్రాస్ బీ పాటను గూర్చి చెప్పాను, "గొర్రె పిల్ల రక్తముచే విమోచింపబడ్డాము." స్పర్జను చెప్పింది చెప్పాను, "రక్తము లేని సువార్త...దెయ్యముల సువార్త." చార్లెస్ వెస్లీ పాటను గూర్చి, చెప్పాను,

ఆయన రక్తము అపవిత్రుని శుద్ధి చేస్తుంది,
ఆయన రక్తము నా కొరకు అందుబాటులో ఉంది.
   ("ఓ వెయ్యి నాలుకలు" చార్లెస్ వెస్లీచే, 1707-1788).
   (“O For a Thousand Tongues” by Charles Wesley, 1707-1788).

నేను ఆ పాట పాడించాను. తరువాత ఇంకొక పాట పాడించాను, "శక్తి ఉంది, శక్తి ఉంది, గొర్రె పిల్ల ప్రశస్త రక్తములో అద్భుత శక్తి ఉంది" (లూయిస్ యి. జోన్స్ చే, 1865-1936). నిజానికి మూడు సార్లు పాడించాను! తరువాత 19 వ శతాబ్దపు గొప్ప ప్రసంగీకుడు, ఒక్టావియాస్ విన్ స్లో చెప్పిన విషయాన్ని ప్రస్తావించాను, అతనన్నాడు, "క్రీస్తు ముందు మొకాల్లని ఆయన రక్తముతో మనస్సాక్షిని కడుగుకోవాలి, అది క్షమిస్తుంది, కప్పి పుచ్చుతుంది, నేరారోపణను రద్దు చేస్తుంది." తరువాత స్పర్జన్ ఒక యువకునితో చెప్పినది చెప్పాను, "యేసు నొద్దకు రమ్ము. ఆయన ప్రశస్త రక్తములో ఆయన మీ పాపములను కడిగివేసాడు." తరువాత "ఉన్నపాటున నేను" అనే పాట గురించి చెప్పాను ఆపాట చెప్తుంది యేసు రక్తము "నా కొరకు కార్చబడింది." తరువాత ప్రసంగము ఇలా చెప్పి ముగించాను, "యేసును విశ్వసించు, యేసు నొద్దకు రమ్ము, యేసు ప్రశస్త రక్తములో కడుగబడు." ఇంకా ఎంత తేటగా చెప్పాలో నాకు తెలియదు!

ఆదివారము ఉదయము, జాన్ సామ్యూల్ కాగన్ "క్రీస్తు ఆధిక్యత"ను గూర్చి బోధించాడు. కాగన్ కొలస్సయులకు 1:14 చెప్పి ప్రసంగము ముగించాడు,

"ఆ కుమారునియందు మనకు విమోచనము, అనగా పాప క్షమాపణ కలుగుచున్నది."

తరువాత కాగన్ చెప్పాడు, "ఆయన రక్తము నీకు పాప ప్రాయశ్చిత్తము కలిగిస్తుంది. ఆయన కృపపై ఆధారపడు. ఆయన రక్తము ద్వారా ఆయనే నీ పాపము నుండి విమోచింపగలడు. మీరు క్రీస్తును విశ్వసిస్తారని నా ప్రార్ధన." కాగన్ ప్రసంగము గ్రిఫిత్ గారు ఈ పాట పాడాక ప్రారంభమయింది "ఓ పరిశుద్ధుడా, ఇప్పుడు గాయపడి," ఇది మన పాపము నిమిత్తము క్రీస్తు రక్త త్యాగాన్ని తెలియచేస్తుంది. ఓ, ఆదివారము రాత్రి గ్రిఫిత్ గారి పాటయందు ఇవ్వబడింది, ఆ పాట "ప్రవాహమున్నది" విలియమ్ కౌపర్ చే – అది ఇలా చెప్తుంది,

రక్తముతో నింపబడిన ప్రవాహము ఉంది,
   ఇమ్మానుయేలు సిరలు నుండి వచ్చినది;
ఆ ప్రవాహములో, మునిగిన పాపులు,
   నేర మరకలను పోగొట్టుకుంటారు.

అయినను ఆ ప్రసంగము పాటలు యేసు రక్తము పాపమును కడుగును అనే విషయము నశించు అనేక మందిపై ప్రభావము చూపలేదు! అస్సలు లేదు! సాయంకాలము ప్రసంగము తరువాత ఒక అమ్మాయి నన్ను కలిసింది. నేనన్నాను, "మోకాళ్ళుని యేసును నమ్ము." కోపంగా నా వైపు చూచి, "కాదు" అని చెప్పింది! నేను నమ్మలేకపోయాను! ఆమె నన్ను కలవడానికి ఎందుకు వచ్చింది? నన్ను చూస్తే రక్షింపబడుతుంది అనుకుందా? నేను ఆశ్చర్యపోయాను! తరువాత యవనస్థుడు నన్ను చూడవచ్చాడు. కన్నీరు కారుతున్నాయి, పాపపు ఒప్పుకోలులో ఉన్నాడు అనుకున్నాడు. కాని, కాదు. నరకానికి వెళ్తానేమోనని భయపడుతున్నాడు, నా ప్రసంగములో అది చెప్పలేదు! నరకమును గూర్చి భయపడుతున్నాడు! అంతే! తన పాపమును గూర్చి ఏమి చెప్పలేదు. ఒక్క మాట కూడ చెప్పలేదు – ఒక్క మాట కూడ – పాపములను కడుగు యేసు రక్తము శక్తిని గూర్చి! ఒక్క మాట కూడ – కడుగు యేసు రక్తము గూర్చి రోజంతా వినినప్పటికినీ – ఆదివారము ఉదయము జాన్ కాగన్ ప్రసంగము మొదలు ఆదివారము రాత్రి నా ప్రసంగము వరకు. యేసు రక్తము పాపము కడుగుతుంది ఆ విషయము కూడ ప్రస్తావించలేదు. రోజంతా శుద్ధి చేసే యేసు రక్తపు శక్తిని గూర్చి ఒక్క మాట కూడ విననట్టు చేసాడు – ఒక్క మాట కూడ తనకు గుర్తు లేదు!

యేసు ప్రేమను గూర్చి పాపము నిమిత్తము కార్చే త్యాగమును గూర్చి, ఒక్క నిమిషము కూడ ఆలోచించకుండా ఆ అమ్మాయి ఎందుకు కోపముతో రావాలి? ఎందుకు ఆ యవనస్తుడు నరక భయంతో రావాలి – పాపము కడిగే యేసు రక్తమును గూర్చి ఒక్క పదము కూడ లేకుండా? జవాబు మన మొదటి పాఠ్య భాగములో ఉంది,

"అతడు తృణీకరింపబడిన వాడును ఆయెను మనష్యుల వలన విసర్జింపబడిన వాడును ఆయెను... మనష్యులు చూడనోల్లని వాడుగాను ఉండెను; అతడు తృణీకరింపబడినవాడు, గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి" (యెషయా 53:3).

నా ప్రియ స్నేహితులారా, యేసును తిరస్కరించడం తృణీకరించడం నశించు పాపులు అద్భుత కృపచే తనే ఆపేస్తారు. ఒక పాపి యేసు నుండి తన ముఖమును చాటు చేసుకొనకుండా పరిశుద్ధాత్మ నశించు పాపిని మేల్కొలుపుతుంది – పాప శుద్ధి నిమిత్తము ఆయన రక్త త్యాగమును గూర్చి హెచ్చింప చేస్తుంది.

మన రెండవ పాఠ్యభాగము మీకు చెప్తుంది, యేసు మిమ్మును రక్షింప డానికి ఏమి చేసాడో ఆయన రక్షించు రక్తమును తిరస్కరించి తృణీ కరించినప్పటికి. మీరు ఆయన రక్తమును ఆయనను తిరస్కరించినప్పటికీ,

"[మీ] అతి క్రమములను బట్టి అతడు గాయపరచబడెను, [మీ] దోషములను బట్టి నలుగ గోట్టబడెను...అతడు పొందిన దెబ్బల చేత [మీకు] స్వస్థత కలుగుచున్నది" (యెషయా 53:5).

గత ఆదివారము రాత్రి నేను బోధించే ముందు స్పర్జన్ సంఘము హాజరయిన ఇద్దరు యవ్వన స్త్రీల సాక్ష్యము నేను చదివాను. మొదటిది ఇలా ఉంది,

ఆమె హృదయము కఠినముగా ఉంది స్పర్జన్ బోధ వినే ముందు వరకు. తన పాపమునకు తీర్పును గూర్చి ఆమె చాలా భయపడింది. గుడికి వస్తున్నప్పటికీ చాలా నెలలు నిస్పృహలో ఉంది. ఆమె స్పర్జన్ బోధ వినిన తరువాత [మరియు] ఆమె విశ్వసించి విమోచించే రక్తాన్ని బట్టి, ఆనందించింది. యేసును మాత్రమే నమ్మి, రక్షింప బడింది.

రెండవ యవ్వన స్త్రీని గూర్చి ఇలా చెప్పబడింది,

ఆతృతతో స్పర్జన్ బోధ వినాలని వచ్చింది. భయముతో గుడిని విడిచి వెళ్ళిపోయింది. ఆమె చెప్పింది, "ఆయన బోధ వినకుంటే బాగుండేది. తిరిగి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను. దూరంగా ఉంటే దుర్భరము అనిపించింది. ఆయన బోధ వినడానికి వచ్చి దుర్భర స్థితి తెచ్చుకున్నాను, దూరంగా ఉన్నా దుర్భరంగానే ఉంది. చివరకు యేసును విశ్వసించాను ఆయనలో శాంతిని ఆదరణను పొందుకున్నాను. యేసు నందు శాంతిని వెదక ఆరంభించినప్పుడు మాత్రమే యేసును కనుగొన్నాను. మొదట అంతా ప్రయత్నించాను. నాకు ఏది శాంతిని ఇవ్వలేదు క్రీస్తును ఆయన రక్షించు రక్తమును కనుగొన్నంత వరకు."

విమోచింపబడ్డాను! నాతో ఈ పాట పాడండి!

విమోచింపబడ్డాను, విమోచింపబడ్డాను, గొర్రె పిల్ల రక్తము ద్వారా విమోచింపబడ్డాను;
విమోచింపబడ్డాను, విమోచింపబడ్డాను, నేను నిత్యము ఆయన బిడ్డను.
   ("విమోచింపబడ్డాను" ఫేన్నీ జే. క్రాస్ బీ చే, 1820-1915).
    (“Redeemed” by Fanny J. Crosby, 1820-1915).

మళ్ళీ పాడండి!

విమోచింపబడ్డాను, విమోచింపబడ్డాను, గొర్రె పిల్ల రక్తము ద్వారా విమోచింపబడ్డాను;
విమోచింపబడ్డాను, విమోచింపబడ్డాను, నేను నిత్యము ఆయన బిడ్డను.

మనలను విమోచించే యేసు రక్తము సామాన్య రక్తము కాదు. అపోస్తలుల కార్యములు 20:28 లో మనం నేర్చుకున్నాము యేసు రక్తము ఎంత గొప్పదో. ఎఫెసు సంఘ పెద్దలకు పౌలు ఇలా చెప్పాడు,

"దేవుడు తన స్వరక్తము ఇచ్చి, సంపాదించిన తన సంఘము."

కింగ్ జేమ్స్ బైబిలు అనువాదము తప్పనుకుంటున్నారా? అయితే నూతన అంతర్జాతీయ అనువాదము చూడండి,

"దేవుని సంఘమునకు కాపరులుగా ఉండండి, దానిని ఆయన తన స్వరక్తమిచ్చి కొన్నాడు."

మీరు ఇంకా ఒప్పింపబడలేదేమో. నేను కొత్త అమెరికాను ప్రమాణ అనువాదము ఇస్తాను,

"దేవుని సంఘమును కాపాడండి దానిని ఆయన తన స్వంత రక్తముతో కొన్నాడు."

యేసు రక్తము, మీ పాపమును కడిగేది, సామాన్య రక్తము కాదని తేటగా చూస్తున్నారు. "దేవుని రక్తము" ద్వారా మనము పాపము నుండి విమోచింప బడ్డాము. యేసు క్రీస్తు త్రిత్వములో రెండవ వ్యక్తి – దైవ కుమారుడు. దేవుడు నరావతారి. మానవ శరీరములో దేవుడు. కనుక రక్తమును "దేవుని రక్తము" అని పిలుచుట చాలా పరిపూర్ణము. అందుకే గొప్ప స్పర్జన్ అన్నాడు, "క్రీస్తు రక్తము కడుగ లేని పాపాలు ఏమి లేవు." చార్లెస్ వెస్లీ బాగా చెప్పాడు,

పాపపు శక్తిని ఆయన విరిచియున్నాడు,
   ఖైదీలను ఆయన విడుదల చేసియున్నాడు;
ఆయన రక్తము అపవిత్రులను శుద్ధులను చేస్తుంది,
   ఆయన రక్తము నాకు అందుబాటులో ఉంది.
("ఓ వేయినాలుకలు పాడును" చార్లెస్ వెస్లీ చే, 1707-1788; స్వరమునకు "ఓ నాకు బయలు పర్చబడు").
   (“O For a Thousand Tongues to Sing” by Charles Wesley, 1707-1788;
   to the tune of “O Set Ye Open Unto Me”).

పాడండి!

పాపపు శక్తిని ఆయన విరిచియున్నాడు,
   ఖైదీలను ఆయన విడుదల చేసియున్నాడు;
ఆయన రక్తము అపవిత్రులను శుద్ధులను చేస్తుంది,
   ఆయన రక్తము నాకు అందుబాటులో ఉంది.

మీలో పాపము లేదని అనుకుంటున్నారా? రక్షింపబడక మునుపు చార్లెస్ వెస్లీ అంత శుద్దులుగా మీరు ఉండకపోవచ్చు. వారానికి చాలా రోజులు వారు ఉపవసించారు. మీరు చేసారా? చాలా గంటలు అంతులేకుండా ఆయన ప్రార్ధించాడు. మీరు చేయగలరా? ఆయన అమెరికాను భారతీయుల దగ్గరకు మిస్సేనరీగా వెళ్ళాడు. మీరు వెళ్ళగలరా? తన హృదయములో పాపము ఉందని ఆయన ఒప్పుకోలేదు. అతడు స్పర్జన్ సంఘపు అమ్మాయిలా ఉన్నాడు తను అన్నాడు,

నేను ముందు అంతా ప్రయత్నించాను. యేసు నందు శాంతిని వెదక ప్రయత్నించే వరకు క్రీస్తును నేను కనుగొనలేదు. నేను ముందు అంతా ప్రయత్నించాను. కాని నాకు ఏమి శాంతి ఇవ్వలేదు నేను ఆయన రక్షించు రక్తమును [యేసును విశ్వసించాను].

నీవది చేసావా? నీవు అంతా ప్రయత్నించావు. కాని అది నీకు శాంతిని ఇవ్వలేదు – కదూ? కదా? లేదు బహుశా! నీకు ఎప్పుడు శాంతి ఉండదు. శాంతి ఎప్పుడు ఉండదు! శాంతి ఎప్పుడు ఉండదు! అంతా ఆపేసి ఆయన రక్షించే రక్తము కావాలని ఒప్పుకునేవరకు నీకు ఎన్నాడలా శాంతి ఉండదు!

ఇంకొక యవన స్త్రీని గూర్చి ఇలా చెప్పబడింది,

ఆమె గుడికి వస్తుంది కాని చాలా నెలలు నిస్పృహలో ఉండి పోయింది. తరువాత స్పర్జన్ బోధ విని [చివరకు] యేసును ఆయన విమోచించే రక్తాన్ని నమ్మి, ఆనందించింది. ఆమె యేసును మాత్రమే నమ్మింది, రక్షింప బడింది.

యేసును తప్ప మిగిలినది వెదకడం మానేసినంత వరకు నేను క్రీస్తును కనుగొనలేదు. ముందు ప్రతీది ప్రయత్నించాను. క్రీస్తును ఆయన రక్షించు రక్తమును కనుగోనేంత వరకు నేను శాంతిని కనుగొనలేదు.

బైబిలు చెప్తుంది,

"ఆయన రక్తములో విమోచన ఉంది, పాప క్షమాపణ కూడ ఉంది."

తరువాత జాన్ శామ్యూల్ కాగన్ అన్నాడు, "ఆయన రక్తము మీకు పాప విమోచన ఇస్తుంది. ఆయన కృపపై ఆధారపడండి. ఆయన రక్తము ద్వారా ఆయన మాత్రమే మిమ్ములను విమోచింప గలడు. యేసును ఈరోజు మీరు నమ్మాలని నా ప్రార్ధన."

"అతడు మనష్యుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనా క్రాంతుడు గాను ఆయెను... మరియు మనం చేసాము... మన ముఖాలను ఆయన నుండి దూరంగా. కాని మన అతి క్రమములను బట్టి అతడు గాయపరచెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను... మరియు ఆయన [గాయాలతో] మనం స్వస్థత పరచబడ్దాం" (యెషయా 53:3, 5).

"రక్తము చిందింపకుండా విమోచనము లేదు" (హెబ్రీయులకు 9:22). దేవునికి వందనాలు "ఆయన కుమారుడైన యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును" (I యోహాను 1:7). ఓ, రాత్రి, చార్లేట్టే ఇల్లియాట్ (1789-1871) మాటలు మీ మాటలుగా ఉండాలి. ఆమె చెప్పింది,

ఉన్నపాటున నేను, ఏమి చెప్పకుండా
   మీ రక్తము నా కొరకు చిందింప బడింది;
మీరు మీ దగ్గరకు రమ్మని పిలుస్తున్నారు,
   ఓ దేవుని గొర్రెపిల్ల, నేను వస్తాను! నేను వస్తాను!

పదిహేను సంవత్సరాల వయస్సులో, జాన్ సామ్యూల్ కాగన్ ఇలా అన్నాడు,

నేను ఎలాంటి శాంతి కనుగొనలేకపోయాను... చిత్ర హింస భావన నాలో ఆగలేదు...శ్రమ పడడంతో అలసిపోయాను, అన్నింటితో విసిగిపోయాను...రక్షింపబడ ప్రయత్నించాను. క్రీస్తును నమ్మాలనుకున్నాను కాని అలా చెయ్యలేకపోయాను. క్రీస్తుకు నా ఇష్టాన్ని ఇవ్వలేకపోయాను. క్రైస్తవుడవడానికి నిర్ణయించుకోలేకపోతున్నాను, అది నిరీక్షణ లేకుండా చేసింది...యేసు ఆయన జీవితాన్ని నా కొరకు ఇచ్చాడు. నా కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు... ఈ తలంపు నన్ను విరుగగొట్టింది. నాకు యేసు కావాలి...ఆ క్షణంలో నేను ఆయనకు అర్పించుకున్నాను. విశ్వాసముతో ఆయన యొద్దకు వచ్చాను...హృదయ పూర్వకంగా, ఆయనపై ఆనుకున్నాను ఆయన నన్ను రక్షించాడు! నేను ఆయన రక్తముతో కడుగబడి పాపమునకు దూరంగా ఉన్నాను!... నాకు ఎలాంటి భావన లేదు. నేను క్రీస్తును కలిగియున్నాను! యేసును విశ్వసించడంలో నా పాపము నా ఆత్మను విడిచి వెళ్లినట్టు అనిపించింది. నా పాపము నుండి మరలి, యేసు వైపే చూసాను! యేసు నన్ను రక్షించాడు... యేసు నందు విశ్వసించాను, ఆయన నన్ను మార్చాడు...ఆయన నాకు జీవితం శాంతిని అనుగ్రహించాడు...క్రీస్తు నా దగ్గరకు వచ్చాడు, ఇందికు ఆయనను విడిచి పెట్టను... ఆయన రక్తములో నా పాపాన్ని కడిగి వేసాడు.

ఉన్నపాటున నేను, ఏమి చెప్పకుండా
   మీ రక్తము నా కొరకు చిందింప బడింది;
మీరు మీ దగ్గరకు రమ్మని పిలుస్తున్నారు,
   ఓ దేవుని గొర్రెపిల్ల, నేను వస్తాను! నేను వస్తాను!

ఉన్నపాటున నేను, వేచి యుండకుండా
   చీకటి నుండి ఆ ఆత్మను తప్పించుకుంటాను,
మీ రక్తము ప్రతి మచ్చ నుండి కడుగుతుంది,
   ఓ దేవుని గొర్రె పిల్ల, నేను వస్తాను! నేను వస్తాను!

ఉన్న పాటున నేను, మీరు నన్ను చేర్చుకుంటారు,
   ఆహ్వానిస్తారు, క్షమిస్తారు, కడుగుతారు, విమోచిస్తారు,
ఎందుకంటే మీ వాగ్ధానము నేను నమ్ముతాను,
   ఓ దేవుని గొర్రె పిల్ల, నేను వస్తాను! నేను వస్తాను!

మీ రక్తము ప్రతి మచ్చ నుండి కడుగుతుంది,
   ఓ దేవుని గొర్రె పిల్ల, నేను వస్తాను! నేను వస్తాను!

నీవు యేసు నొద్దకు వస్తావా ఆయన ప్రశస్త రక్తములో పాపమంతటి నుండి కడుగబడతావా? నీవు యేసు నొద్దకు రావాలనుకుంటే మీ కొరకు ప్రార్ధింప వేచియున్నాము. మిగిలిన వారు పైఅంతస్తుకు భోజనానికి వెళ్తుండగా, దయచేసి వచ్చి మొదటి రెండు వరుసలలో కూర్చోండి. ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే:
"సిలువవేయబడిన వాని రక్తముతో రక్షింపబడ్డాను" (ఎస్. జే. హెండేర్ సన్ చే, 1902).
“Saved by the Blood of the Crucified One” (S. J. Henderson, 1902).