Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




మూల పాపము దాని నివారణపై లూథర్

(ప్రొటస్టెంట్ సంస్కరణ 500వ వార్శికోత్సవమున బోధింప బడిన ప్రసంగము)
LUTHER ON ORIGINAL SIN AND ITS CURE
(A SERMON PREACHED ON THE 500th ANNIVERSARY OF THE PROTESTANT REFORMATION)
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము సాయంకాలము, అక్టోబర్ 29, 2017
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, October 29, 2017

"లోపలి నుండి, అనగా మనష్యుల హృదయములో నుండి, దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణము, అహంభావమును, అవివేకమును వచ్చును: ఈ చెడ్డవన్నియు లోపలి నుండియే బయలు వెళ్లి, మనష్యుని అపవిత్ర పరచునని ఆయన చెప్పెను" (మార్కు 7:21-23).


భోజనమునకు ముందు ఆయన శిష్యులు చేతులు కడుగు కొనలేదని పరిశయ్యలు యేసును తప్పు పట్టారు. శిష్యులు పారంపర్యాచారము ప్రకారము చేతులు కడుగుకొన కుండుట వారి చూచినప్పుడు, వారు అపవిత్రులని చెప్పారు. మనము తినేది మనలను అపవిత్ర పరచదని యేసు చెప్పాడు. వారి హృదయాలలో ఉన్న దానిని బట్టి ప్రజలు అపవిత్రులవుతారని ఆయన చెప్పాడు. "ఈ చెడ్డవన్నియు లోపలి నుండియే బయలు వెళ్లి, మనష్యుని అపవిత్ర పరచును" (మార్కు 7:23). "మనష్యుల హృదయములో నుండి, దురాలోచనలు వచ్చును" (మార్కు 7:21).

ఈ దిక్కు నుండి ఆ చివరి వరకు మన హృదయాలు చెడ్డవని బైబిలు బోధిస్తుంది. బైబిలు చెప్తుంది, "హృదయము అన్నింటికంటే మోసకరమైనది... అది ఘోరమైన వ్యాధి కలది: దాని గ్రహింప గలవాడేవాడు?" (యిర్మియా 17:9). బైబిలు చెప్తుంది, "మేము మాచెడు హృదయపు ఆలోచనల చొప్పున నడుచుకొందుము" (యిర్మియా 18:12). బైబిలు చెప్తుంది, "వారి హృదయము సరిగా లేదు" (కీర్తనలు 78:37). "దేవుడు లేదని బుద్ధి హీనులు, తమ హృదయంలో అనుకొందురు" (కీర్తనలు 14:1). మీ హృదయమును గూర్చి, డాక్టర్ వాట్స్ తన పాటలో ఇలా చెప్పాడు.

"బాహ్య విషయాలు [మిమ్మును] శుద్ధి చేయలేవు;
కుష్టు రోగము లోలోపల దాగి ఉంది" –

మీ దుష్ట హృదయము లోలోపల ఉంది. బైబిలు చెప్తుంది "అపనమ్మకము అనే దుష్ట హృదయమును గూర్చి" (హెబ్రీయులకు 3:12).

"బాహ్య విషయాలు [బయటి ఆచారాలు – పాపి ప్రార్ధన చెప్పుట] [మిమ్మును] శుద్ధి చేయలేదు; కుష్టు రోగము లోలోపల ఉంది" –

అవును కదా? అవును కదా? మీకు తెలుసు! నిర్ణయాలు ప్రార్ధనలు మిమ్మును కడుగలేవు. మీరు నేర్చుకున్నదే అనిపించినదే మిమ్మును శుభ్ర పరచలేవు! మీకు అది తెలుసు. " (పాపపు) కుష్టు రోగము లోలోపల దాగి ఉంది" అపనమ్మకమనే మీ చెడు హృదయము! మీకు తెలుసు –కదా?

అది సత్యమని మీకు నిజాయితీ ఉంటే తెలుస్తుంది. బాహ్యపు పాపము మీరు చేయకముందే మీకు తెలుసు. మీరు అది బుద్ధి పూర్వకంగా చేసారు. మీరు చేస్తుంది మీకు తెలుసు. అది తప్పని తెలిసి ఎందుకు చేసారు? మీ మారని స్థితిలో మీరు చీకటిని ప్రేమించారు. పాపాన్ని అనుభవిస్తున్నారు. పాపము చేయడంలో సంతోషిస్తున్నారు. దాని రుచిని మీరు ప్రేమించారు. అది తప్పని తెలిసినా దానిని ప్రేమించారు! అందుకే మీ పాప హృదయమును గూర్చి సత్యము చెప్పుచున్నందుకు నన్ను అసహ్యించుకుంటున్నారు! మీ పాపపు హృదయమును గూర్చిన సత్యాన్ని మీరు అసహ్యించుకుంటారు. అది మిమ్మును ఖండిస్తుంది సత్యము వినడం భయంకరంగా ఉంటుంది! " కుష్టు రోగము లోలోపల ఉంది"! మీ హృదయము త్రిప్పబడి పెడదారి పట్టింది! మంచిది సరైనది బదులు మీరు పాపాన్ని అనుభవిస్తారు. అపనమ్మకమనే దుష్ట హృదయములో కుష్టు రోగము లోలోపల దాగి ఉంది! ఇది నేను కూర్చలేదు. మీలాంటి పాపపు హృదయాన్ని గూర్చి అంతా బాగా తెలిసిన వైద్యుడు డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్ జోన్స్ చెప్పింది, చెప్తున్నాను!

అవును, అది మునుపు మీరు విన్నారు. నయమాను కుష్టు రోగము శుద్ధి చేయబడుట అనే ప్రసంగములో డాక్టర్ ల్లాయిడ్ జోన్స్ చెప్పింది చెప్పాను. ఆ ప్రసంగము విన్న తరువాత రక్షింపబడాలనుకున్న ఒక యవనస్తుడు పారిపోయాడు. అతడు రక్షింప బడుటను గూర్చి డాక్టర్ కాగన్ తో మాట్లాడడానికి రాలేదు. దానికి బదులు అతడు పారిపోయి వైద్యుడు నిజంగా చెప్పాడా తెలుసుకోడానికి డాక్టర్ ల్లాయిడ్ జోన్స్ ప్రసంగాలు చదివాడు!

అవును, డాక్టర్ ఆ విషయము చెప్పాడు, "మానవుని ప్రాధమిక సమస్య" అనే ప్రసంగములో. డాక్టర్ అన్నాడు, "మనము బుద్ధి పూర్వకంగా చేసాం, మనము చేసేది తెలిసి కూడ. అది తప్పని తెలిసి ఎందుకు చేసాము?...మనం యదార్ధంగా ఉండి మనలను అసహ్యించుకుంటాయి. అవి మన సహజత్వాలు. వారు చీకటిని ప్రేమించి, వెలుతురును అసహ్యించుకుంటారు. అది త్రిప్పబడి మరల్చబడ్డాయి, అవి మంచికి బదులు తప్పును కోరుకుంటాయి మంచిని కాక చెడును ఇష్ట పడతాయి...అది సరియే ఏది మంచిదో మనకు తెలుసు కాని అది చేయడంలో విఫలులమవుతాం ఎందుకంటే మన స్వభావాలు అలాంటివి...మీ స్వభావము తప్పు, మన హృదయము, మీ వ్యక్తిత్వము ఉనికి...మన పాపాలు అనుకూలము, బాహాటము బుద్ధి పూర్వకము!" ఇవి ఆయన మాటలు – అవి నేను చెప్పాను! (see Dr. Martyn Lloyd-Jones, Evangelistic Sermons at Aberavon, Banner of Truth, 2010, pp. 65-77).

"బాహ్యపు విషయాలు [మిమ్మును] శుద్ధి చేయలేవు;
కుష్టు రోగము లోలోపల ఉంది."

డాక్టర్ ల్లాయిడ్ జోన్స్ చెప్పిన విషయము సంఘములో ఉన్న రక్షింప బడిన వారు అంగీకరిస్తారు. కాని రక్షింపబడాలని నటించిన యవనస్తుడు ఆవరణములోనుండి పారిపోయాడు. తరువాత వారము అతని దుష్ట హృదయమును గూర్చి డాక్టర్ ల్లాయిడ్ జోన్స్ నిజంగా చెప్పాడా అని కనుగొన ప్రయత్నించాడు. అతడెందుకలా చేసాడు? ఎందుకంటే అతడు, స్వతహాగా, అపనమ్మకమనే దుష్ట హృదయం కలిగి యున్నాడు! అందుకే! యవనస్తుడా,

"బాహ్యపు విషయాలు మిమ్మును శుద్ధి చేయలేవు;
కుష్టు రోగము లోలోపల ఉంది."

నా కుమారుడా, దాని నుండి నీవు పారిపోలేవు. నీ పాపపు తిరుగుబడిన హృదయాన్ని గూర్చి నేను చెప్పినది డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ నమ్మాడు! ఈ సాయంకాలము మీకు చెప్తున్నాను, నీతోను దేవుని తోనూ నీ హృదయము "తిప్పబడి మరలిందని" ఒప్పుకునే వరకు నీవు రక్షింపబడలేవు డాక్టర్ ల్లాయిడ్ జోన్స్ చెప్పినట్టు. యేసే ఇలా అన్నాడు, "మీ హృదయములో నుండి, దురాలోచనలు వచ్చును, ఇవన్నియు...అపనమ్మకమనే" మీ దుష్ట హృదయము నుండి వచ్చును! (మార్కు 7:21, 23). యిర్మియా 17:9 ప్రకారము "మీ హృదయము దుష్టమైనది".

మీ తల్లిదండ్రులను నిందించలేరు. వారెంత చెడ్డవారైనా నా తల్లిదండ్రులంతా కాదు. లేదు, మీ తల్లిదండ్రులను నిందించలేదు, వారెంత చెడ్డ వారైనను! మిమ్మును మీరే నిందించుకోవాలి. మీ దుష్ట హృదయమును గూర్చి వైద్యుడు చెప్పింది నేను వివరించగా విన్నారు. వైద్యుడు చెప్పాడు అది నీ తప్పు, నీదిమాత్రమే, నీవు అలాంటి దుష్ట త్రిప్పబడిన మరలిన, అపనమ్మకపు హృదయం కలిగియున్నావు. నీవే యేసు క్రీస్తును తిరస్కరిస్తున్నావు. నీవే పాప విషయాలు ఎన్నుకున్నావు. ఎవ్వరు అవి చెయ్యమని మీతో చెప్పలేదు. నీవు చీకటిని ప్రేమిస్తున్నావు కాబట్టి అవి చేస్తున్నావు. పాపము చేయడం అనుభవిస్తున్నారు. పాపం చేయడంలో సంతోషిస్తున్నారు. దాని రుచిని మీరు ప్రేమిస్తున్నారు! అది తప్పని తెలిసినా దానిని ప్రేమిస్తున్నారు. అపనమ్మకపు దుష్ట హృదయంలో ఆత్మను నశింప చేసే కుష్టు రోగము పాపము దాగి ఉంది! మీ దుష్ట హృదయాన్ని గూర్చిన సత్యము చెప్పుతున్నందుకు మీరు నన్ను అసహ్యించుకుంటున్నారు – అవును కదా?

"బాహ్యపు విషయాలు [మిమ్మును] శుద్ధి చేయలేవు;
కుష్టు రోగము లోలోపల ఉంది" –

నీ పాప హృదయంలోకి లోతైనది!

మీరు మీ పర్యావరణాన్ని నిషేధించలేరు. మహా జలప్రళయము తరువాత పూర్వపు వరద ప్రపంచములో చెడు వాతావరణము పోయింది. దేవుడు నోవహుతో అన్నాడు, "నేను వాటిని భూమిని నాశనం చేస్తాను" (ఆదికాండము 6:13). వరద పూర్వ ప్రపంచంలోని అన్ని చెడు వ్యక్తులు పోయారు. ఇంకా, జలప్రళయం తర్వాత, దేవుడు ఇలా చెప్పాడు, "మానవుని హృదయం యొక్క ఊహాత్మకత తన బాల్యం నుండి దుష్టము" (ఆదికాండము 8:21). లూథర్ ఇలా అన్నాడు, "జలప్రళయ నుండి మరే ఇతర వ్యక్తులు ఓడలో ఉన్నవారిని కాపాడలేదు. ఇంకా మానవుని కల్పన అనేది చెడు అని దేవుడు వారితో చెపుతున్నాడు" (లూథర్ వ్యాఖ్యానం ఆదికాండము 8:21). మీరు ఇతరుల నుండి ఒకరిని నేర్చుకున్నారంటే మీకు చెడు హృదయం లేదు. మీరు గర్భంలో ఉద్భవించిన క్షణం నుండి నీ హృదయం చెడుగా ఉంది. లూథర్ అన్నాడు పాపపు హృదయం "కీర్తన 51:5 లో చూపించిన విధంగా, గర్భంలో జీవిస్తున్న పిండము, శిశువుల్లో, చిన్నపిల్లల్లో ఉందని, చెప్పాడు... [పాపపు హృదయం] సంపాదించబడలేదు [నేర్చుకోలేదు]; ఇది చాలా పిండంలలో నిద్రాణమైన ఉంది." సమయం సరైనది ఉన్నప్పుడు ప్రతీకారంతో ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది!

"బాహ్యపు విషయాలు మిమ్మును శుద్ధి చేయలేవు;
కుష్టు రోగము లోలోపల ఉంది."

మొదటి పాపి ఆదాము నుండి, దుష్ట హృదయం మీకు సంక్రమించింది. మనమందరము ఆయన సంతానము. లూథర్ అన్నాడు, "యవ్వనము నుండి మానవుని హృదయ ఆలోచనలు చెడ్డవి, అంటే మానవుని కారణము...[నీ] కారణము. [నీ హృదయ తలంపులు] దేవుని ధర్మ శాస్త్రమునకు వ్యతిరేకము, పాప భూఇష్టము, [దేవుని] ఉగ్రతకు లోనైనది, స్వశక్తితో విడుదల పొందలేనిది." బైబిలు చెప్తుంది,

– "స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులము" (ఎఫెస్సీయులకు 2:3).

– "అందరమూ" పాపమునకు లోనైనవారము" (రోమా 3:9).

– మీరందరూ "పాపముల చేత చచ్చినవారు" (ఎఫెస్సీయులకు 2:5).

ఎందుకు? ఎందుకంటే

– "ఒక మనష్యుని ద్వారా [ఆదాము] పాపము లోకములోనికి ప్రవేశించెను" (రోమా 5:12).

– అందుకే "నీతిమంతుడు లేడు, ఒక్కడును, లేడు...మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను, లేడు" (రోమా 3:10, 12).

– "నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది" (ఆదికాండము 8:21).

"బాహ్యపు విషయాలు శుద్ధి చేయలేవు;
కుష్టు రోగము [పాపములను] లోలోపల [మిమ్మును] ఉంది."

మార్టిన్ లూథర్ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం, అతడు కేథలిక్ సంఘపు అబద్ధపు బోధలకు వ్యతిరేకంగా పోరాడాడు, అతడు 500 సంవత్సరాల క్రిందట, ఈ మంగళవారం జెర్మనీలో విట్టెన్ బర్గ్ లో ఉన్న తన సంఘపు ద్వారానికి, తొంభై ఐదు పక్షాలను మేకులతో కొట్టాడు. ప్రొటెస్టెంట్ బాప్టిస్టు సంస్కరణలలో "మూల పాపము" కేంద్ర బిందువుగా ఉంది. నీకు దుష్ట హృదయము ఉందని బైబిలు బోధిస్తుంది – నీవు దానిని మార్చలేవు!

"బాహ్యపు విషయాలు మిమ్మును శుద్ధి చేయలేవు;
కుష్టు రోగము లోలోపల ఉంది."

"ఊహాగానము" హెబ్రీ పదము నుండి వచ్చినది, దాని అర్ధము నీ మనసు నీ అపనమ్మకపు హృదయము.

"నరుల హృదయాలోచన [ఆలోచనలు] వారి బాల్యము నుండి చెడ్డది" (ఆదికాండము 8:21).

ఈ సంఘంలో ప్రతివ్యక్తి హృదయంలో మూల పాపము ఉందనేది – నిజమైన బోధ! మనమందరము! లూథర్ అన్నాడు, "మానవాళి, పరిశుద్ధాత్మ దేవుని దయ లేకుంటే, పాపము తప్ప ఏమి చెయ్యలేడు, నిరంతరాయంగా పాపము, ఒక అతిక్రమానికి మరియొకటి కలుపుతూ...[మరియు] అతడు దేవునికి విరోధి, తన దుష్ట హృదయ ఆలోచనలకు లోబడతాడు...నీతిమంతులని నటించినా."

బాహ్యపు విషయాలు మిమ్మును శుద్ధి చేయలేవు;
కుష్టు రోగము లోలోపల ఉంది!

మన సంఘములో మనము చూచిన దానిని బట్టి లూథర్ చెప్పింది నిజమే అనిపిస్తుంది కదా? ఒకరి తరువాత ఒకరు వచ్చి క్రీస్తును నమ్మినట్టు నటించడం మనం చూడడం లేదా – తరువాత గుడి నుండి తొలగిపోయి పాపపు జీవితములో మునిగిపోలేదా? చాలామంది కొంతకాలము క్రైస్తవులుగా నటించి, తరువాత దేవునికి శత్రువులుగా మారడం మనం చూడలేదా? ఒలివాస్ తన ప్రజలు అలాగే చేయలేదా? వారు మన సంఘమును నాశనము చేయ ప్రయత్నించినప్పుడు, లూథర్ చెప్పింది సరియే అని మనము చూస్తున్నాము,

"నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది" (ఆదికాండము 8:21).

అందుకే కదా మన సంఘము ఫిన్నీ నుండి వైదొలగి లూథర్, సంస్కర్తలు, పాత బాప్టిస్టుల వైపు తిరిగింది? ఫిన్నీ ప్రసిద్ధ ప్రసంగము, "పాపులు వారి హృదయాలు మార్చుకోవాలి." నీవెలా చేయగలవు? ఎలా? ఎలా? నీ హృదయాన్ని ఎలా మార్చుకోగలవు? నీవు చెయ్యలేవు! ఫిన్నీ పూర్తిగా వేరు వ్యక్తి. లూథర్ సంస్కర్తలు మానవుని దుష్ట హృదయము, మూల పాపమును గూర్చి బోధించిన దానికి ఫిన్నీ వ్యతిరేకంగా పోరాడాడు.

నీ హృదయాన్ని నీవు మార్చుకోలేవు! ఫిన్నీ దయ్యము పట్టిన వాడని నేను ఒప్పింప బడ్డాను. అతనిని నమ్మవద్దు! దానికి బదులు నీ హృదయాన్ని చూడు; అక్కడ పాపము దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు తనము చూస్తావు!

"బాహ్యపు విషయాలు మిమ్మును శుద్ధి చేయలేవు;
కుష్టు రోగము లోలోపల ఉంది."

కేవలము ప్రభువైన యేసు క్రీస్తు మాత్రము నీ హృదయాన్ని కడిగి మార్చగలడు. నీ పాప ప్రాయశ్చిత్తము నిమిత్తము యేసు చనిపోయాడు. సిలువపై పాపమంతటి నుండి నిన్ను కడగడానికి యేసు ఆయన రక్తాన్ని కార్చాడు. నీకు నూతన హృదయము ఇవ్వడానికి యేసు మృతులలో నుండి లేచాడు! నీవు యేసును విశ్వసించినప్పుడు ఆయన నీకు ఇస్తాడు "నూతన హృదయము...నూతన ఆత్మను నీలో ఉంచుతాము" (యేహెజ్కేలు 36:26).

యేసు ప్రభూ, దీని నిమిత్తము నేను వినయ మనస్కుడనవుతాను,
   నేను వేచి ఉంటాను, ఆశీర్వాదపు ప్రభూ, మీ సిలువ వేయబడిన కాళ్ళ దగ్గర.
విశ్వాసము ద్వారా, కడగబడడానికి, ప్రవహించే మీ రక్తాన్ని నేను చూస్తాను,
   ఇప్పుడు నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా నేను ఉంటాను.
హిమము కంటే తెల్లగా, అవును, హిమము కంటే తెల్లగా;
   ఇప్పుడు నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా నేను ఉంటాను.

యేసు ప్రభూ, నేను ఓపికతో కనిపెడుతున్నానని మీరు చూస్తున్నారు,
   ఇప్పుడు రమ్ము, నూతన హృదయము నాలో సృష్టించుము;
మిమ్మును వెదకు వారికి, మీరు ఎన్నడు "లేదు" అని చెప్పరు,
   ఇప్పుడు నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా నేను ఉంటాను.
హిమము కంటే తెల్లగా, అవును, హిమము కంటే తెల్లగా;
   ఇప్పుడు నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా నేను ఉంటాను.
   ("హిమము కంటే తెల్లగా" జేమ్స్ నికోల్సన్ చే, 1828-1876).
   (“Whiter Than Snow” by James Nicholson, 1828-1876).

మానవుని హృదయంలో ఉండే మూల పాపమును గూర్చి ఇది లూథర్ ప్రసంగ వేదాంతము నేను మాట్లాడాను. ఇది మీకు అర్ధము కానప్పటికినీ, ఈ రాత్రి, మీరు యేసును నమ్మాలని బ్రతిమాలుచున్నాను. ఆయన మీ పాపము క్షమిస్తాడు. ఆయన మీ పాపము కడిగివేస్తాడు. ఆయన మీకు నూతన హృదయము నూతన ఆత్మ దయచేస్తాడు. "ప్రభువైన యేసు క్రీస్తు నందు విశ్వాసము ఉంచుము, నీవు రక్షింపబడుదువు" (అపోస్తలుల కార్యములు 16:31).

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు పాట బెంజమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్ గారిచే:
"హిమము కంటే తెల్లగా" (జేమ్స్ నికోల్సన్ చే, 1828-1876).
“Whiter Than Snow” (by James Nicholson, 1828-1876).