Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




దేవుడు రక్తమును చూచునప్పుడు

WHEN GOD SEES THE BLOOD
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము సాయంకాలము, ఆగష్టు 27, 2017
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, August 27, 2017

"నేను ఆ రక్తమును చూచినప్పుడు, నేను మిమ్మును దాటి పోయెదను"
(నిర్గమ కాండము 12:13).


హెబ్రీ ప్రజలు కరువు కాలములో ఐగుప్తునకు వెళ్ళారు. మొదటిసారి వారు గౌరవముగా చూడబడ్డారు ఎందుకంటే, యాకోబు కుమారుడైన యోసేపు, ఫరో క్రింద పరిపాలకుడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు వర్ధిల్లి విస్తరించారు, కాని యోసేపును ఎరుగని కొత్త ఫరో ఉద్భవించాడు. హెబ్రీయులు త్వరగా విస్తరించుచున్నారు కనుక భూమిని ఆక్రమించుకుంటారని అతడు భయపడ్డాడు. అందుకు వారిని బానిసలుగా చేసాడు. హెబ్రీయులు దేవునికి ప్రార్ధించి మోరపెట్టగా, ఆయన వారిని విడిపించడానికి మోషేను పంపాడు. కాని ఫరో కఠినంగా క్రూరంగా ఉన్నాడు. అతడు దేవుని ప్రజలను పోనియ్యలేదు. కనుక దేవుడు ఐగుప్తుపై తొమ్మిది తెగుళ్ళు పంపించాడు. తెగులు వచ్చిన ప్రతిసారి, మోషే ఫరో దగ్గరకు వచ్చి ఇలా అనేవాడు, "హెబ్రీయులు ప్రభువు దేవుడు ఇలా పలికాడు, నా ప్రజలను పోనియ్యము." కాని ఫరో ఎన్నడు వినలేదు. అతని హృదయము కఠినమైనది. ఇప్పుడు పదవ తెగులు పంపడానికి దేవునికి సమయము వచ్చింది.

"మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో మీదికిని ఐగుప్తు మీదికిని, ఇంకొక తెగులును రప్పించేదను; అటు తరువాత అతడు ఇక్కడ నుండి మిమ్మును పోనిచ్చును..." (నిర్గమ కాండము 11:1).

మరియు మోషే ఫరో సముఖమునకు మరలవచ్చి, ఇలా అన్నాడు,

"యెహోవా సెలవిచ్చునదేమనగా, మధ్య రాత్రి నేను ఐగుప్తు దేశములోనికి బయలు వెళ్ళేదను; ఐగుప్తు దేశము నందలి తొలి పిల్లలందరును చచ్చెదరు... ఈ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి, ఐగుప్తు దేశమందలి తొలి సంతతిని హతము చేసెదను" (నిర్గమకాండము 11:4-5; 12:12).

కాని దేవుడు తన ప్రజలను శిక్షింప ఇష్ట పడలేదు. ఆయన మోషేకు ప్రతి కుటుంబము వారు ఒక గొర్రె పిల్లను వధించాలని చెప్పాడు.

"మరియు వారు రక్తము తీసుకొని, ఇండ్ల ద్వారా బంధువు రెండు నిలువు కమ్ముల మీదను పైకప్పు మీదను చల్లవలెను..." (నిర్గమ కాండము 12:7).

ఇప్పుడు నిలబడి నిర్గమకాండము 12:12 నుండి 13 వరకు బిగ్గరగా చదవండి.

"ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి, ఐగుప్తు దేశమందలి మనష్యులలోనే గాని జంతువులలో గాని, తొలి సంతతి అంతయు హతము చేసి; మరియు...ఐగుప్తు దేవతలందరికిని తీర్పు తీర్చెదను: నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును: మరియు నేను ఆ రక్తమును చూచి మిమ్మును, నశింప చేయక దాటి పోయెదను, నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా, మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు" (నిర్గమకాండము 12:12-13).

సుమారుగా 1,500 సంవత్సరములు యూదులు పస్కా పండుగను ఆచరించారు. వారు ప్రత్యేక గొర్రె పిల్ల మాంసము భుజించి పులియని రొట్టెలతో పస్కా పండుగ కాలములో ఈ లేఖన భాగమును చదివేవారు, ఐగుప్తు బానిసత్వము నుండి వారి విడుదలను జ్ఞాపకము చేసుకుంటాం. "పస్కా పండుగ" అనే పదము మన పాఠ్య భాగము నుండి వచ్చింది,

"నేను ఆ రక్తమును చూచినప్పుడు, నేను మిమ్మును దాటి పోయెదను" (నిర్గమ కాండము 12:13).

మూడు విధాలుగా ఈ పాఠ్యభాగమును గూర్చి మీరు ఆలోచించాలని నేను కోరుతున్నాను. మొదటిది, రక్తము యొక్క అర్ధము. రెండవది, రక్తము యొక్క ప్రభావము. మరియు, మూడవది, రక్తము యొక్క అన్వయింపు.

I. మొదటిది, రక్తము యొక్క అర్ధము.

"నేను ఆ రక్తమును చూచినప్పుడు, నేను మిమ్మును దాటి పోయెదను."

ఈ రోజు ఆ వచనములో మన కొరకు ఏమైనా ఉందా? అవును, అందులో పూర్తి అర్ధము ఉంది, తొలి పస్కా పండుగలో చిందింపబడిన రక్తము పస్కాలో యేసు చిందింపబోవు – రక్తమును చూపిస్తుంది. ఓ అవును, పస్కా పండుగ సమయములో యేసు సిలువ వేయబడ్డాడు.

"ఆయన శిష్యులు నీవు పస్కాను భుజించుటకు, మేమెక్కడికి వెళ్లి సిద్ధ పరచ వలెనని కోరుచున్నావు అని ఆయనను అడిగిరి?" (మార్కు 14:12).

వారు మేడగది మీదికి వెళ్లి భోజనమునకు కూర్చున్నప్పుడు ఈ వచనమును చదివారు, నిర్గమకాండము 12:13,

"నేను ఆ రక్తమును చూచినప్పుడు, నేను మిమ్మును దాటి పోయెదను" (నిర్గమ కాండము 12:13).

మొదట యేసు వారికి పులియని రొట్టెలను ఇచ్చాడు.

"పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని, కృతజ్ఞతా స్తుతులు చెల్లించి, దాని వారికిచ్చెను...వారందరూ దానిలోనిది త్రాగిరి, అప్పుడాయన ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు, చిందింప బడుచున్న నా రక్తము" (మార్కు 14:23-24).

క్రీస్తు వారికి చూపిస్తున్నాడు నిర్గమకాండము 12:13 లోని ద్వార బంధములకు పూయబడిన రక్తము నూతన నిబంధన రక్తమునకు చిత్రపటము, మరునాడు ఆయన సిలువపై కార్చబోవు రక్తమునకు సూచన.

"నేను ఆ రక్తమును చూచినప్పుడు, నేను మిమ్మును దాటి పోయెదను" (నిర్గమ కాండము 12:13).

అది ఏదో రక్తమును గూర్చి మాట్లాడడం లేదు. అది ఈ రక్తమును గూర్చి మాట్లాడుతుంది

"లోక పాపమును మోసికొని పోవు, దేవుని గొర్రె పిల్ల" (యోహాను 1:29).

ద్వార బంధముల మీద పూయబడిన రక్తము నాశనము నుండి పాపులను విమోచించే రక్తమును చిత్రపటంగా చూపిస్తుంది, అది వారిలో నాటుతుంది

"దేవుడు తన స్వరక్తమిచ్చి, సంపాదించిన తన సంఘము" (అపోస్తలుల కార్యములు 20:28).

ఆ రక్తమునకు ఎందుకు అంత శక్తి ఉందని మీరు అడగవచ్చు. స్పర్జన్ అన్నాడు,

ఒకవేళ క్రీస్తు సామాన్య మానవుడైతే... రక్షించడానికి ఆయన రక్తంలో సమర్ధత ఉండేది కాదు; కాని క్రీస్తు "ఆయన దేవుడే ఆయన దేవుడే;" యేసు కార్చిన రక్తము దేవుని యొక్క రక్తమే. అది మానవుని రక్తము, ఎందుకంటే ఆయన మనలాంటి మానవుడు కాబట్టి; కాని దేవత్వము మానవత్వముతో మిళితమైంది, తద్వారా దాని నుండి రక్తము సమర్ధతను పొందుకుంది...అది నిత్యత్వములో మారని అద్భుతము, దేవుడు చనిపోవడానికి మానవునిగా మారడం. ఓ! క్రీస్తులోక సృష్టికర్త అని మనము అనుకొనినప్పుడు, విశ్వమంతా ఆయన భుజ స్కందముల మీద ఉందనుకుంటే, ఆయన మరణము మనలను విమోచింప గలదనడంలో ఆశ్చర్యము లేదు, ఆయన రక్తము మన పాపమును కడగాలి... ఎందుకంటే ఆయన దైవికము, ఆయన "ఆయన ద్వారా దేవుని దగ్గరకు వచ్చు వారిని, రక్షింప సమర్ధుడు." ఆయన రక్తము ద్వారా మీరు దేవుని కోపమును ఉగ్రతను తప్పించు కోగలరు (C. H. Spurgeon, “The Blood,” The New Park Street Pulpit, Pilgrim Publications, 1981 reprint, volume V, pp. 27-28).

"నేను ఆ రక్తమును చూచినప్పుడు, నేను మిమ్మును దాటి పోయెదను" (నిర్గమ కాండము 12:13).

ద్వార బంధముల మీద ఉన్న రక్తము దైవ మానవుడు, క్రీస్తు యేసు రక్తమును సూచిస్తుంది.

"అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను" (I కొరింధీయులకు 5:7).

అది రక్తము యొక్క అర్ధము!

II. రెండవది, రక్తము యొక్క ప్రభావము.

"నేను ఆ రక్తమును చూచినప్పుడు, నేను మిమ్మును దాటి పోయెదను" (నిర్గమ కాండము 12:13).

"నేను మిమ్ములను దాటిపోయెదను." తీర్పు మీకు రాదు. శాపము మీపైకి రాదు – మీరు రక్తము కలిగియుంటే.

"యెహోవా ఐగుప్తీ యులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు; ద్వార బంధపు పైకమ్మ మీదను, రెండు నిలువు కమ్మల మీదను, ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోయెను, మిమ్ము హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనియ్యడు" (నిర్గమకాండము 12:23).

రక్తము కలిగియున్న పురుషుని పైన గాని స్త్రీ పైనగాని దేవుని తీర్పు పడదు.

"మరియు హిస్సోపు కుంచె తీసుకొని పళ్ళెము లోనున్న రక్తములో దానిముంచి, ద్వార బంధపు పైకమ్ముకుని రెండు నిలువు కమ్ములకును పల్లెములోని రక్తమును తాకింపవలెను, తరువాత మీలో నెవరును ఉదయము వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు..." (నిర్గమకాండము 12:22).

పై కమ్మిపై ఉన్న రక్తము – పైన ఉన్న కమ్ము. ప్రక్కన ఉన్న కమ్మల, ఇరువైపుల రక్తము. దిగువ పళ్ళెములో ఉన్న రక్తము. పైన. క్రింద. ఇరువైపుల. ఈ వర్ణన క్రీస్తు సిలువను సూచిస్తుంది!

చూడు, ఆయన తలనుండి, ఆయన చేతులు, ఆయన కాళ్ళ నుండి,
   విచారము ప్రేమలు మిళితమై క్రిందికి ప్రవహిస్తున్నాయి;
అలాంటి ప్రేమ విచారములు ఎప్పుడైనా కలుస్తాయా,
   లేక ముళ్ళు అంత గొప్ప కిరీటమును అల్లగలవా?
("నేను అద్భుత సిలువను గమనించినప్పుడు" ఐజాక్ వాట్స్ చే, 1674-1748).
(“When I Survey the Wondrous Cross” by Isaac Watts, 1674-1748).

"పితృపారం పర్యమైన మీ వ్యర్ధ ప్రవర్తనను విడిచి పెట్టునట్లుగా వెండి బంగారముల వంటి, క్షయ వస్తువుల చేత మీరు విమోచింప బడలేదు... గాని అమూల్యమైన రక్తము చేత అనగా, నిర్దోషమును నిష్కళం కమునగు గొర్రె పిల్లవంటి క్రీస్తు రక్తము చేత విమోచింప బడితిరని మీరెరుగుదురు గదా" (I పేతురు 1:18-19).

మార్టిన్ లూథర్ అడిగాడు,

అప్పుడు, ఏ ధని నిధితో మనము విమోచింపబడ్డాం? వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత కాదు గాని, దేవుని కుమారుడైన క్రీస్తు ప్రశస్త రక్తము ద్వారా విమోచింపబడ్డాం. ఆ ధన నిధి చాలా విలువైనది ఘనమైనది, దానిని మానవ తెలివితేటలు గ్రహించ లేవు లోక పాపమంతటికినీ ఈ స్వచ్చ రక్తములోని ఒక బొట్టు చాలు. అయినను తండ్రి తన కృపను విస్తారముగా సమృద్ధిగా కనుపరిచాడు మరియు మన విమోచనము కొరకు, ఆయన తన కుమారుని అనుమతించాడు, తన రక్తమంతటిని కార్చడానికి తన ధన నిధినంతటిని మన కొరకు అనుగ్రహించాడు (Luther, Exposition of I Peter 1:18-19).

క్రీస్తు రక్తము గెత్సమనేలో చెమట బిందువుల వలే నేలపై పడింది. పిలాదు ఆవరణములో ఆయన కొరడాలచే కొట్టబడుచున్నప్పుడు ఆ గాయముల నుండి రక్తము ప్రవహించింది. ముండ్ల కిరీటము ఆయన నుదుటపై గుచ్చబడింది రక్తము ఆయన కళ్ళ మీదుగా పారింది. ఆయన చేతులకు కాళ్ళకు మేకులు కొట్టబడ్డాయి, సిలువ నుండి రక్తము ప్రవహించింది. అప్పుడు, సైనికుడు ఆయన ప్రక్కలో పొడిచాడు,

"వెంటనే రక్తమును నీళ్ళను కారెను " (యోహాను 19:34).

"[దేవుడు] తన కుమారుడైన, క్రీస్తును అనుమతించాడు, మన కొరకు తన రక్తము కార్చడానికి తన సమస్తమును మనకు అనుగ్రహించడానికి" (లూథర్, ఐబిఐడి.).

మరియు

"యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును" (I యోహాను 1:7).

క్రీస్తు యేసు రక్తముచే పాపమంతయు కడగబడుతుంది! పాపమంతయు! ఆయన రక్తము కడగ లేని గొప్ప పాపము ఏదియు లేదు! రక్తము కడగలేని పాపమంటూ ఏమి లేదు. అది మగ్ధలేనే మరియు లోని ఏడు దెయ్యములను వెళ్ళగొట్టింది. దెయ్యము పట్టిన వాని పిచ్చితనము నుండి వాని విడిపించింది. అది వర్ణింపనశక్యము కాని కుష్టు రోగమును కూడ బాగు చేయగలదు. అది బాగు చేయలేని ఆత్మీయ రోగము లేదు. ఏదీ కూడ దానికి గొప్పకాదు, అది ఎంత భయంకరమైనదయినప్పటికినీ, క్రీస్తు రక్తము సమృద్ధి అయినది.

"నేను ఆ రక్తమును చూచినప్పుడు, నేను మిమ్మును దాటి పోయెదను" (నిర్గమ కాండము 12:13).

అది రక్తము యొక్క ప్రభావమును చూపిస్తుంది!

III. మూడవది, రక్తము యొక్క అన్వయింపు.

ఒకవేళ గొర్రె పిల్ల విషపూరితమైనదైతే, నశింప చేయువాడు ప్రతి గృహములోని తొలిచూలును సంహరించేవాడు. ఒకవేళ గొర్రెపిల్ల చంపబడితే దాని శరీరము ద్వార బంధమునకు కట్టబడితే, నశింప చేయువాడు తీర్పులో ఎదురు వచ్చేవాడు. రక్తము లేదని చెప్పువారు దీనిని గమనించాలి. గొర్రె పిల్ల మరణము మాత్రమే కాదు, గొర్రె పిల్ల రక్తము తేడా కనుపరించింది. ఇది నిజం, గొర్రె పిల్ల చనిపోవాలి, అయినను దేవుడు అన్నాడు,

"నేను ఆ రక్తమును చూచినప్పుడు, నేను మిమ్మును దాటి పోయెదను" (నిర్గమ కాండము 12:13).

కాని పళ్ళెములో ఉంచబడిన రక్తము తీర్పును ఆపలేదు. అది అన్వయింప బడాలి. ఆ హిస్సోపును తీసుకోవాలి

"పళ్ళెములో ఉన్న రక్తములో ముంచి....ద్వార బంధపు పైకమ్మికిని రెండు నిలువు కమ్ములకును పల్లెములోని రక్తమును తాకింప వలెను" (నిర్గమకాండము 12:22).

రక్తము అన్వయింపబడాలి లేనిచో అది నిరుపయోగము. ఓ, పాపి, క్రీస్తు రక్తమును తీసుకో! యేసు రక్తములో పాపము నుండి కడుగబడు!

"క్రీస్తు యేసు: రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణా ధారముగా బయలు పరచెను" (రోమా 3:24-25).

ఎన్ఏఎస్ వి (NASV) దీనిని తప్పుగా అనువదించడం ఆశ్చర్యము, గ్రాంధిక అనువాదము! అయినను ఎన్ఐవి (NIV) దానిని సరిగ్గా అనువదిస్తుంది, "ఆయన రక్తములో విశ్వాసము ద్వారా." ఇటు అటు వెళ్ళడం నాకు అసహ్యము. అందుకే నేను పాత నమ్మకమైన కేజేవితో (KJV) అంటి పెట్టుకొని ఉంటాను, అది వాస్తవంగా అనువదింప బడినది నమ్మదగినది.

"ఆయన రక్తములో విశ్వాసము ద్వారా."

విశ్వాసమునకు మూలము యేసు క్రీస్తు రక్తము. అలా మీరు కలవబడతారు. అలా బైబిలు మీకు అన్వయింపబడుతుంది – "ఆయన రక్తములో విశ్వాసము ద్వారా."

"ఓ కాదు," కొంతమంది నూతన సువర్తికులు అనవచ్చు, "ఆయన రక్తములో విశ్వాసము ద్వారా మీరు రక్షింప బడలేదు!" సరే, అది లేకుండా మీరు ఎలా రక్షింపబడగలరో తెలుసుకోవాలని ఉంది! "సరే, ఒక వ్యక్తి రక్తముపై ఆధారపడితే, అతడు నశించవచ్చు." కానేకాదు! అలా అవదు! క్రీస్తు రక్తముపై ఆధారపడడం ద్వారా మీరు నశించిపోతే దేవుడు అబద్ధికు డవుతాడు!

"ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము, అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము" ...పాప క్షమాపణ నిమిత్తము (మత్తయి 26:28).

రక్తము అన్వయింపబడినట్లు చాలామంది భావించరు. అది విషయము కాదు, మీరు రక్తము చూడాలి అని మన పాఠ్యభాగము చెప్పడం లేదు. ఓ లేదు! అది చెప్తుంది,

"నేను ఆ రక్తమును చూచినప్పుడు, నేను మిమ్మును దాటి పోయెదను" (నిర్గమ కాండము 12:13).

రక్తమును చూడాల్సింది దేవుడు. దేవుడు మాత్రమే రక్తమును చూడాలి ఆయనకు అనిపించాలి ఆ రక్తము సమస్త పాపముల నుండి మిమ్మును కడుగుతుంది. అది చెప్పడం లేదు " నీవు రక్తమును చూచినప్పుడు అని." అది చెప్పలేదు క్రీస్తు రక్తముచే కడుగబడడం పూర్తిగా అర్ధం చేసుకొని ఉండాలని. అది చెప్తుంది, "నేను దానిని చూచునప్పుడు." మీ విశ్వాసము చాలా గొప్పగా ఉండనక్కర లేదు. కాని మీరు యేసు నొద్దకు వచ్చి ఆయన రక్తమును విశ్వసిస్తే, దేవుడు దానిని చూస్తాడు. ఆయన ఒక్కడే లెక్కిస్తాడు. మరియు

"నేను ఆ రక్తమును చూచినప్పుడు, నేను మిమ్మును దాటి పోయెదను" (నిర్గమ కాండము 12:13).

హెబ్రీయులు రక్తమును చూడలేరు. వారు వాళ్ళ ఇళ్ళల్లో ఉన్నారు. వారు ద్వార బంధము వెలుపల ఉన్న కమ్మలను ప్రక్కను ఉన్న వాటిని వారు చూడలేదు. కాని దేవుడు అక్కడ రక్తమును చూసాడు. ఆ షరతు మీదనే పాపి రక్షణ ఆధారపడి ఉంది – మీకు అన్వయింపబడిన రక్తమును దేవుడు చూచుచున్నాడు, మీరు దానిని చూడడం కాదు. తరువాత ప్రార్ధనలో దేవుని దగ్గరకు వచ్చి చెప్పండి, "ప్రభువా, క్రీస్తు రక్తమును బట్టి నన్ను రక్షింపుము. నేను దానిని చూడలేను చూడ గలిగినట్టుగా, కాని ప్రభువా, మీరు దానిని చూసారు, మీరు చెప్పారు,

"నేను ఆ రక్తమును చూచినప్పుడు, నేను మిమ్మును దాటి పోయెదను" (నిర్గమ కాండము 12:13).

"ప్రభువా, మీరు రక్తమును చూసారు. దానిని రక్షించే శక్తియందు నాకు నమ్మకముందని మీరు చూడండి. నన్ను క్షమించి క్రీస్తు రక్తమును బట్టి మాత్రమే నన్ను కడుగుము." దానిని మీ హృదయ పూర్వక ఆశగా చేసుకోండి త్వరలో యేసు రక్తములో మీరు కడుగబడతారు!

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు బైబిలు పఠనము: మార్కు 14:12-25.
ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే:
"నేను రక్తమును చూచునప్పుడు" (జాన్ ఫూట్ చే, 19వ శతాబ్దము).
“When I See the Blood” (by John Foote, 19th century).



ద అవుట్ లైన్ ఆఫ్

దేవుడు రక్తమును చూచునప్పుడు

WHEN GOD SEES THE BLOOD

డాక్టర్ జాన్ ఆర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

"నేను ఆ రక్తమును చూచినప్పుడు, నేను మిమ్మును దాటి పోయెదను" (నిర్గమకాండము 12:13).

(నిర్గమకాండము 11:1, 4-5; 12:12, 7)

I.      మొదటిది, రక్తము యొక్క అర్ధము, మార్కు 14:12, 23-24; యోహాను 1:29; అపొస్తలుల కార్యములు 20:28; I కొరింధీయులకు 5:7.

II.    రెండవది, రక్తము యొక్క ప్రభావము, నిర్గమకాండము 12:23, 22;
I పేతురు 1:18-19; యోహాను 19:34; I యోహాను 1:7.

III.  మూడవది, రక్తము యొక్క అన్వయింపు, రోమా 3:24-25; మత్తయి 26:28.