Print Sermon

ఈ ప్రసంగ ప్రతులు ప్రతీ నెల 221 దేశాలకు సుమారు 116,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కానీ వారు వెంటనే యూట్యూబ్ ని వదిలివేస్తున్నారు, ఎందుకంటే ప్రతి ఒక వీడియో వారిని మన వెబ్ సైట్ కు తీసుకువెళ్తుంది. యూట్యూబ్ ప్రజలను మన వెబ్ సైట్ ని పరిచయం చేస్తుంది. ప్రతి నెల ప్రసంగ ప్రతులు 37 భాషలలో వేల మందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులకు ఎలాంటి కాపీ అధికారం లేదు, కనుక బోధకులు అందరు మా యొక్క అనుమతి లేకుండా వాటిని ఉపయోగించుకోవచ్చు. దయచేసి మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి ఎలా సహాయపడాలో, ముస్లీము హిందూ దేశాలకు సువార్తను వ్యాపింపచేయడంలో తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.


మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
నోవాహు కృపను కనుగొన్నాడు!

(ప్రసంగము 19 ఆదికాండముపై)
NOAH FOUND GRACE!
(SERMON #19 ON THE BOOK OF GENESIS)
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు శనివారము సాయంకాలము, జూన్ 24, 2017 బోధింపబడిన ప్రసంగము
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Saturday Evening, June 24, 2017

"యెహోవా ఈ తరము వారిలో నీవే, నా యెదుట నీతిమంతుడనై యుండుట చూచితిని; కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి" (ఆదికాండము 7:1).


నోవాహు మంచివాడని రక్షింపబడలేదు. అతడు రక్షింపబడ్డాడు ఎందుకంటే దేవుడు చెప్పాడు, "నీవు నా యెదుట నీతిమంతుడైయుండుట చూచితిని" (ఆదికాండము 7:1). దేవుడు అతనిని నీతిమంతుడుగా చూసాడు. ఎందుకు? జవాబు సులభమైనది. అది ఆదికాండము, ఆరవ అధ్యాయము, ఎనిమిదవ వచనంలో ఇవ్వబడింది. దయచేసి బైబిలు చూడండి.

"అయితే నోవాహు యెహోవా దృష్టియందు కృప పొందిన వాడాయెను" (ఆదికాండము 6:8).

నోవహు దేవుని దృష్టిలో దయపొందాడు. దేవుడు అన్నాడు, "ఈ తరము వారిలో నీవు నీతిమంతుడవైయుండుట చూచితిని" (ఆదికాండము 7:1).

ఇది ఆపాదింపబడిన నీతిని గూర్చి మాట్లాడుతుంది. హెబ్రీయులకు 11:7 తేటగా చెప్తుంది నోవహు విశ్వాసము ద్వారా రక్షింపబడ్డాడని:

"విశ్వాసమును బట్టి నోవహు...తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను" (హెబ్రీయులకు 11:7).

నేను మళ్ళీ చెప్తాను, నోవహు మంచివాడని రక్షింపబడలేదు, చాలా విధాలుగా మంచివాడు అయినప్పటికీ. కాని అతడు పరిపూర్ణుడు కాదు, ఎందుకంటే గొప్ప జల ప్రళయము తరువాత అతడు ద్రాక్ష రసము త్రాగెనని బైబిలు తేటగా చెప్తుంది (ఆదికాండము 9:20-21). మనము నోవహును క్షమింపవచ్చు. అతడు అతి భయంకర ఘట్టము ద్వారా వెళ్లి, బహుశా వణుకు పుట్టించే భయాలను రాత్రి కలవరాలను ద్రాక్షా రసముతో కప్పి పుచ్చాలనుకున్నాడేమో. లేక బహుశా అది కేవలము పొరపాటు, ద్రాక్ష రసము పర్యవసానము అతనికి తెలియలేదు ఎందుకంటే ప్రలయములో నీరంతా నిలబడి ఉండి పోయింది.

ఏవిధంగా కూడ, బైబిలు నోవహును పరిపూర్ణుడుగా చిత్రీకరించలేదు. కాని అతడు, కఠోర మతనాయకులు చెప్పినట్టు, "పాపము చేసినా నీతిమంతుడుగా తీర్చబడ్డాడు." అతడు పరిపూర్ణుడు కాదు, కాని అతడు దేవుని దృష్టిలో అవతార క్రీస్తునందలి విశ్వాసము ద్వారా నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. నోవహుకు క్రీస్తు నందు విశ్వాసము ఉంది, అది దేవుని కృప చేత అతనికి అనుగ్రహింపబడింది (ఆదికాండము 6:8). ఎప్పుడైతే నోవాహు క్రీస్తు నందు, విశ్వాసము ప్రకటించాడో, దేవుడు, అతనికి క్రీస్తు నీతిమత్వాన్ని ఆపాదించాడు. కొత్త నిబంధన గ్రంధములో ఈ విషయంపై బైబిలు అద్భుత విషయాన్ని చెప్తుంది. వినండి రోమా, నాల్గవ అధ్యాయము, వచనములు ఐదు మరియు ఆరు.

"పనిచేయక భక్తీ హీనుని, నీతిమంతునిగా తీర్చువాని యందు, విశ్వాసము ఉంచు వానికి వాని [విశ్వాసము] నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా, దేవుడు ఎవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనష్యుడు ధన్యుడని దావీదు కూడ చెప్పుచున్నాడు" (రోమా 4:5-6).

దేవుడు నోవాహుతో ఇలా అన్నప్పుడు, "ఈ తరము వారి యెదుట నీవు నీతిమంతుడై యుండుట చూచితిని" (ఆదికాండము 7:1), ఆయన చెప్తున్నాడు ఆయన నోవహు పాపములను చూడలేదు, ఎందుకంటే క్రీస్తు నీతిమత్వము విశ్వాసము ద్వారా అతనికి ఆపాదించబడింది. సంస్కరణకు అది గమనింపు మాట – "సోలాపైడ్" – క్రీస్తు నందలి విశ్వాసము ద్వారానే రక్షణ! మంచివానిగా ఉండడం వలన నోవహు రక్షింపబడలేదు. అవతార క్రీస్తు నందలి విశ్వాసము ద్వారా అతడు రక్షింపబడ్డాడు!

ఇప్పుడు ఓడను గూర్చి ఆలోచించండి. ఓడ పడవ కాదు. విహరించడానికి కట్టబడలేదు. అది కేవలము ఒక పొడవైన నల్లని పెట్టె లాంటిది. పూర్తిగా నల్లని శీసముతో ముద్రింపబడింది. ఓడపై డాక్టర్ మెక్ గీ ఇలా వ్యాఖ్యానించారు:

     ఓడను గూర్చి చాలామందికి ఉండే ఉద్దేశము సబ్బాతు బడిలో ఇవ్వబడే చిన్న పడవలా కనిపించే చిత్రపటము. నాకు, అది, గమ్మత్తు అయిన విషయము. అది కేవలము ఒక చిత్రము కాదు అది ఒక పెద్ద ఓడ.
     ప్రారంభించడానికి, ఓడ నిర్మాణమునకు ఇవ్వబడిన సూచనలు చూస్తే ఓడ చాలా పెద్దదని తెలుస్తుంది. "ఓడ పొడవు మూడు వందల మూరలు." ఒక మూర పద్దెనిమిది అంగుళాలు అయితే, ఓడ ఎంత ఎక్కువ పొడవైనదో తెలుస్తుంది.
     ప్రశ్న ఏంటంటే ఆ రోజులలో ఆ ఓడను ఎలా తయారు చేసారు. నా స్నేహితుడా, గుహ మనష్యులను గూర్చి ప్రస్తావించడం లేదు. చాలా తెలివైన మనిషిని గూర్చి మాట్లాడుతున్నాము. చూడండి, ఈ జాతి వారికున్న తెలివి తేటలు నోవాహు నుండి సంక్రమించాయి, అతడు చాలా తెలివైన వ్యక్తి.
     నోవాహు యాభై అడుగుల కెరటాలు ఎదుర్కునే సముద్రపు ఓడను తయారు చెయ్యలేదు. అతడు నిర్మించింది జీవనానికి, మనషులకు జంతువులకు, చాలాకాలము ఉండేలాంటి స్థలము – తుఫాను ద్వారా వెళ్ళకుండా, ప్రళయము నుండి కాపాడుకొనుటకు. ఆ కారణాన్ని బట్టి, సముద్రపు ఓడలా ఈ ఓడ కనిపించకపోవచ్చు, అది ఎక్కువ స్థలము ఉండేలా నిర్మింపబడింది (J. Vernon McGee, Thru the Bible, Thomas Nelson, 1983, volume I, p. 39).

విట్ కూంబ్ మరియు మోరిస్ చెప్పారు బాబులోనియులు మూరకు 19.8 అంగుళాలు మరియు ఐగుప్తీయులు మూరకు 20.65 అంగుళాలు కలిగి ఉండేవారు. విట్ కూబ్ మరియు మోరిస్ మనకు చెప్తున్నారు హెబ్రీయులు మూరకు 20.4 అంగుళాలు కలిగి ఉండేవారని (John C. Whitcomb and Henry M. Morris, The Genesis Flood, Presbyterian and Reformed Publishing Company, 1993, p. 10). దానిని బట్టి ఓడ ఐదు వందల ఒక అడుగుల పొడవు ఉంటుంది. క్వీన్ మేరీ, లాస్ ఎంజిలాస్ సముద్రములో, మునిగిపోయింది, 1018 అడుగుల పొడవు, ఓడ కంటే రెండింతలు పెద్దది. కాని క్వీన్ మేరీ లో చాలా స్థలము ఇంజన్లు యంత్రాలచే నింపబడింది. ఓడలో అలాంటి యాంత్రిక పరికరాలు లేవు. అది అంతా ఖాళీగా ఉంది, క్వీన్ మేరీతో పోలిస్తే ఓడలో మనష్యులు జంతువులూ పట్టిన స్థలము ఓడలోనే చాలా ఎక్కువ, బహుశా చాలా పెద్దదిగా ఉంటుంది, క్వీన్ మేరీ కన్నా – ఏది అత్యంత పెద్దది.

డాక్టర్ విట్ కుంబ్ మరియు డాక్టర్ మోరిస్ సరిగ్గానే చెప్పారు ఓడ చాలా పెద్దది జల ప్రళయాన్ని ఎదుర్కొంది:

చిన్న ప్రళయానికి అంత పెద్ద పరిమాణాలు కలిగిన ఓడ అవసరము లేదు, అసలు ఓడే అవసరము లేదు! ఒక శతాభ్దపు ప్రణాళిక శ్రమ, అలాంటి ఓడను చేసే ప్రక్రియ, ఒక చిన్న ప్రళయము నుండి తప్పించు కోవడానికి, అనవసర అవివేక విషయంగా చెప్పవచ్చు. ఎంత వివేకము దేవుడు నోవాహును రాబోవు నాశనము నుండి హెచ్చరించాడు, తద్వారా ప్రళయము నుండి తప్పించబడి క్షేమ ప్రాంతానికి వెళ్ళడానికి, ఆకాశము నుండి అగ్ని దిగి సొదోమోపై పడకముందు లోతును తప్పించినట్టు. అంతేకాదు, చాలా రకములైన జంతువులు, పక్షులు, సులభంగా కదిలేవి అన్ని కూడ, ఓడలో రక్షింపబడ్డాయి! ఈ కథ అంతా విడ్డూరమే ఒకవేళ ప్రళయము ఒక ప్రాంతానికే పరిమితం అయిపోయినట్లయితే (John C. Whitcomb and Henry M. Morris, The Genesis Flood, Presbyterian and Reformed, 1993, p. 11).

ఓడను గూర్చి చాల విషయాలున్నాయి మనకు ఆసక్తిని కలిగిస్తాయి. వాటిలో మూడింటిని గూర్చి ఈరాత్రి మనము ఆలోచన చేద్దాం.

I. మొదటిది, ఓడ మనకు చెప్తుంది మనము క్రీస్తు లోనికి ఉండాలి రక్షింప బడడానికి.

మన ప్రారంభపు వాక్య భాగము చెప్తుంది

"యెహోవా ఈ తరము వారిలో నీవే నా యెదుట నీతిమంతుడవై యుండుట చూచితిని, గనుక నీవును నీ ఇంటివారును ఓడ లోనికి ప్రవేశించుడి" (ఆదికాండము 7:1).

ఇప్పుడు వినండి ఆదికాండము ఏడూ, వచనము పదహారు:

"లోపలికి ప్రవేశించిన వన్నియు, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము, సమస్త శరీరులలో మగదియు ఆడదియు ప్రవేశించెను: అప్పుడు యెహోవా ఓడ లోనికి అతని మూసివేసెను" (ఆదికాండము 7:16).

మరియు వచనము ఏడూ చెప్తుంది:

"అప్పుడు నోవాహును అతనితో పాటు లోనికి, అతని కుమారులు, అతని భార్య, అతని కోడళ్ళు, ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై, ఆ ఓడ లోనికి ప్రవేశించిరి" (ఆదికాండము 7:7).

దేవుడు చెప్పినట్లు నోవాహు అతని కుటుంబము చేసారు (ఆదికాండము 7:1). వారు ఓడ లోనికి ప్రవేశించారు. మరియు మీరు క్రీస్తు లోనికి రావాలి. బైబిలు చెప్తుంది,

"ఆయన యందు [యేసు] విశ్వాసము ఉంచువారికి తీర్పు తీర్చబడదు..." (యోహాను 3:18).

పదము "మీద" "ఈజ్" గా అనువదింపబడింది. డాక్టర్ జోడియిట్స్ ప్రకారము, దాని అర్ధము "ఒక స్థలము ఒక విషయములోనికి కదలిక భావము." మీరు విశ్వాసము ద్వారా యేసు లోనికి రావాలి – ఆయన, దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. నోవాహు ఓడలోనికి వచ్చినట్టు, మీరు క్రీస్తులోనికి రావాలి. "ఆయన [లోనికి] విశ్వాసము ఉంచువానికి తీర్పు తీర్చబడదు..." (యోహాను 3:18). "క్రీస్తు నందు" ఉన్న వారి విషయంలో చాలా సార్లు బైబిలు చెప్పింది. ఇవి రెండు సుపరిచిత వచనాలు:

"కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు లోన ఉన్న వారికి ఏ శిక్షా విధీయ లేదు..." (రోమా 8:1).

"కాగా ఎవడైనను క్రీస్తు లోనవున్న యెడల, వాడు నూతన సృష్టి..." (II కొరింధీయులకు 5:17).

"క్రీస్తునందున్న" వారిని గూర్చి పౌలు మాట్లాడుచున్నాడు (రోమా 16:7).

మీరు క్రీస్తు నందు ఉన్నారా? మీరు విశ్వాసము ద్వారా, ఆయనలోనికి రావాలి నోవాహు ఓడలోనికి వచ్చినట్టు. యేసు అన్నాడు,

"నేనే ద్వారమును: నా ద్వారా తప్ప ఎవడైనను లోపలకి ప్రవేశించిన యెడల, వాడు రక్షింప బడును" (యోహాను 10:9).

అది ఎలా వివరించాలో నాకు సరిగ్గా తెలియదు, కాని పరిచర్యలో అతి కష్టమైన విషయము ఈ చిన్న విషయాన్ని ప్రజలు గ్రహించేటట్టుగా చేయడం: క్రీస్తు నొద్దకు రండి. క్రీస్తులోనికి రండి!

ఇలా చెప్పనివ్వండి. ఒకవేళ మీరు నోవాహు కాలములో ఉన్నారు గొప్ప జల ప్రళయము రాబోతుందని ఆయన బోధించడం విన్నారు. ఆయన చెప్పడం విన్నారు రక్షింపబడడానికి ఓడలోనికి రావాలని. "ఔను," మీరంటారు, "అది నిజము. తీర్పు వస్తుంది. అవును, అది నిజము, ఓడ మాత్రమే నన్ను రక్షింపగలదు. నేను అది నమ్ముతాను." మీరు ప్రళయము నుండి రక్షింపబడ్డారా? బహుశా లేదు! మీరు వాస్తవానికి లేచి రక్షింప బడడానికి ఓడ లోనికి ప్రవేశించాలి – అది రక్షిస్తుందని నమ్మడం మాత్రము కాదు – కాని దాని లోనికి ప్రవేశించాలి! అదే మీరు చెయ్యాలని నేను మిమ్ములను అడుగుతున్నాను! అక్కడ కూర్చొని క్రీస్తు మిమ్ములను రక్షిస్తాడని అనుకోకండి! విశ్వాసము ద్వారా క్రీస్తులోనికి రండి! యేసు అన్నాడు:

"నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసి వేయను" (యోహాను 6:37).

అవును, ఓడ చెప్తుంది మీరు క్రీస్తులోనికి రావాలని.

II. రెండవది, ఓడ చెప్తుంది మీరు క్రీస్తు శరీరమైన, సంఘములోనికి రావాలి.

నేను గ్రహించాను చాలామంది నాతో ఏకీభవించరు. ఈనాడు చాలామంది స్థానిక సంఘాన్ని చులకనగా చూస్తారు. కాని వారిది తప్పు. ఓడ క్రీస్తు లాంటిది మాత్రమే కాదు. అది ఒక రకమైన, నూతన నిబంధన స్థానిక సంఘము యొక్క చిత్ర పటము.

ఇప్పుడు, మీరు గుడిలోనికి ఎలా వస్తారు? I కొరింధీయులకు, అధ్యాయము పన్నెండు, వచనము ఇరవై ఏడు, ఇలా చెప్తుంది,

"అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై యుండి వేరువేరుగా అవయవములై యున్నారు. మరియు దేవుడు కొందరిని సంఘములో నియమించెను..." (I కొరింధీయులకు 12:27-28).

మనం ఇక్కడ ఆగుదాం. నేను ఒక సత్యాన్ని రూడి పరచాలనుకుంటున్నాను "క్రీస్తు శరీరము" అనగా సంఘము, యేసు నందలి స్థానిక విశ్వాసులు. ఇప్పుడు పదమూడవ వచనము వినండి:

"మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి..." (I కొరింధీయులకు 12:13).

మీరు పరిశుద్ధాత్మ ద్వారా స్థానిక సంఘములోనికి బాప్తిస్మము ఇవ్వబడ్డారు. అలా మీరు నిజమైన సంఘములో, సజీవ సభ్యునిగా అయ్యారు!

ఇప్పుడు, అది ఎలా సంభవిస్తుంది అని చింతపడడం మీ వ్యాపకము కాదు. యేసు నొద్దకు రావడం మీ వ్యాపకము. మీరు యేసు నొద్దకు వస్తే, స్వయం చలితంగా పరిశుద్ధాత్మ మీకు సంఘములోనికి బాప్తిస్మమిస్తుంది!

దయచేసి ఆదికాండము, అధ్యాయము ఏడు, వచనము పదహారు చూడండి. నోవాహు ఓడ లోనికి వచ్చినప్పుడు, బైబిలు చెప్తుంది, "యెహోవా ఓడలో అతని మూసివేసెను" (ఆదికాండము 7:16). పరిశుద్దాత్మ దేవుడు బాప్తిస్మమిచ్చి సంఘమైన శరీరములో మిమ్ములను మూసివేస్తాడు! అవును, ఓడ క్రీస్తుతో ఐక్యత స్థానిక సంఘంతో ఐక్యతను గూర్చి మాట్లాడుతుంది. మీరు క్రీస్తుతో ప్రభువు ద్వారా స్థానిక సంఘములో "మూయబడకపోతే", మీరు తీర్పులో నశించిపోతారు. మీరు "మూసివేయబడితే" మీరు భద్రంగా ఉంటారు. ఇది మార్చబడిన వారి నిత్యత్వ భద్రతను గూర్చి మాట్లాడుతుంది. క్రీస్తు మాట వినేవారు ఎన్నడు నశించరు!

III. మూడవది, ఓడ చెప్తుంది మీరు ఇరుకు మార్గము ద్వారా లోపలికి ప్రవేశించాలి.

నోవాహు ఎలా ఓడలోనికి ప్రవేశించాడు? ఆదికాండము, అధ్యాయము ఆరు, వచనము పదహారు చూడుడి:

"...ఓడ తలుపు దాని ప్రక్కను ఉంచవలెను..." (ఆదికాండము 6:16).

యేసు అన్నాడు, "నేనే ద్వారమును: నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన యెడల, వాడు రక్షింపబడును..." (యోహాను 10:9). నోవాహు ద్వారము ద్వారా ఓడలో ప్రవేశించాడు. మీరు క్రీస్తు ద్వారా రక్షణలోనికి రావాలి. యేసు అన్నాడు, "[ఇరుకు] ద్వారమున ప్రవేశించుడి" (మత్తయి 7:13).

మళ్ళీ, క్రీస్తు చెప్పాడు:

"ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడుడి: అనేకులు, ప్రవేశింప జూతురు, గాని వారి వలన కాదని, మీతో చెప్పుచున్నాను" (లూకా 13:24).

ఇదే నోవాహు కాలములో సంభవించింది. ఆదికాండము, అధ్యాయము ఏడు, వచనము నాలుగు వినండి. దేవుడు అన్నాడు:

"ఇంకను ఏడూ దినములకు, నేను భూమి మీద వర్షము కురిపింతును..." (ఆదికాండము 7:4).

పదవ వచనము కూడ గమనించండి:

"ఏడు దినములైన తరువాత, ఆ ప్రవాహ జలములు భూమి మీదికి వచ్చెను" (ఆదికాండము 7:10).

నోవాహు ఓడలోనికి వెళ్ళాడు. దేవుడు అతని మూసివేసాడు. ద్వారము మూయబడింది. ఏడూ రోజులు గడిచాయి ఏమి జరగలేదు. అప్పుడు తీర్పు ఆరంభమయింది. వేరే వారెవ్వరూ ఓడలోనికి ప్రవేశింపలేదు! చాలా ఆలస్యమైయింది!

ప్రజలు అరవడం నేను వింటాను, "లోపలికి రానివ్వండి! లోపలికి రానివ్వండి!" కాని ఇప్పటికే చాలా ఆలస్యమయింది!

"ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి: అనేకులు, ప్రవేశింప జూతురు, కాని వారి వలన కాదని, మీతో చెప్పుచున్నాను" (లూకా 13:24).

ఇప్పుడే యేసు క్రీస్తు నొద్దకు రండి – నిత్యత్వములో చాలా ఆలస్యము అవకముందే!

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు బైబిలు పఠనము నోవాసాంగ్: ఆదికాండము 6:5-8.
ప్రసంగమునకు ముందు పాట నోవాసాంగ్ గారిచే:
"మీరు ఎక్కువగా తిరుగులాడుతూ ఉంటే" (డాక్టర్ జాన్ ఆర్. రైస్ గారిచే, 1895-1980).
“If You Linger Too Long” (by Dr. John R. Rice, 1895-1980).ద అవుట్ లైన్ ఆఫ్

నోవాహు కృపను కనుగొన్నాడు!

(ప్రసంగము 19 ఆదికాండముపై)
NOAH FOUND GRACE!
(SERMON #19 ON THE BOOK OF GENESIS)
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

"యెహోవా ఈ తరము వారిలో నీవే, నా యెదుట నీతిమంతుడనై యుండుట చూచితిని; కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి" (ఆదికాండము 7:1).

(ఆదికాండము 6:8; బ్రీయులకు 11:7;
ఆదికాండము 9:20-21; రోమా 4:5-6)

I.   మొదటిది, ఓడ మనకు చెప్తుంది మనము క్రీస్తులోనికి ఉండాలి రక్షింప బడడానికి, ఆదికాండము 7:16,7; యోహాను 3:18; రోమీయులకు 8:1; II కొరింధీయులకు 5:17; యోహాను 10:9; యోహాను 6:37.

II.   రెండవది, ఓడ చెప్తుంది మీరు క్రీస్తు శరీరమైన, సంఘములోనికి రావాలి,
I కొరింధీయులకు 12:27-28, 13; ఆదికాండము 7:16.

III.  మూడవది, ఓడ చెప్తుంది మీరు ఇరుకు మార్గము ద్వారా లోపలికి ప్రవేశించాలి, ఆదికాండము 6:16; యోహాను 10:9; మత్తయి 7:13; లూకా 13:24;
ఆదికాండము 7:4; ఆదికాండము 7:10.