Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




కయప - క్రీస్తు హత్యను
రూపొందించిన వ్యక్తి!

CAIAPHAS – THE MAN WHO
PLANNED THE MURDER OF CHRIST!
(Telugu)

ప్రసంగము డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే గారిచే వ్రాయబడినది మరియు జాన్ సామ్యూల్ కాగన్ గారిచే బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము ఉదయము, ఏప్రిల్ 9, 2017 బోధింపబడిన ప్రసంగము
A sermon written by Dr. R. L. Hymers, Jr.
and preached by Mr. John Samuel Cagan
at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, April 9, 2017

"అయితే వారిలో, కయప అను ఒకడు, ఆ సంవత్సరము, ప్రధాన యాజకుడైయుండి, మీకేమియు తెలియదు, మన జనమంతయు నశింప కుండునట్లు, ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట, మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించు కొనరు అని వారితో చెప్పెను. తనంతట తానే ఈలాగు చెప్పలేదు: గాని ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై యుండెను, యేసు జాతి కొరకు చనిపోయాడు; గనుక యేసు ఆ జనము కొరకును, ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు చాపనైయున్నాడని ప్రవచించెను. కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంప ఆలోచించు చుండిరి" (యోహాను 11: 49-53).


ఇది క్రీస్తు పరిచర్య చివరిలో సంభవించింది. యేసు లాజరును మృతులలో నుండి లేపిన తరువాత పట్టణము విడిచిపెట్టాడు. ఆయన యెరూష లేమునకు తిరిగి రాలేదు సిలువ వేయబడు వారము రోజుల ముందు వరకు. ఎవరైనా అనుకోవచ్చు లాజరును మృతులలో నుండి లేపడం మత నాయకులను ఒప్పించిందని, కానీ అలా జరగలేదు. యేసు మునుపు చెప్పాడు,

"అందుకతడు మోషేయ ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని యెడల, మృతులలో నుండి ఒకడు లేచినను, వారు నమ్మరని అతనితో చెప్పెననెను" (లూకా 16:31).

ప్రజలు తరుచు అద్భుతాలు చూచి ఒప్పింపబడరు. వారికి కావలసిన అద్భుతము వారి ఆత్మలలో దేవుని ఆత్మ ఒప్పించే పని చేయడం, "వారు అపరాధములలోను పాపములలోను చచ్చిన వారు" (ఎఫెస్సీయులకు 2:1). ఒక వ్యక్తి అద్భుత రీత్యా పాపపు ఒప్పుకోలు పొందకపోతే, అతడు మార్పు చెందలేదు. అతడు మారలేదు "మృతులలో నుండి ఒకడు లేచినప్పటికినీ" (లూకా 16:31). మేల్కొలిపే దేవుని ఆత్మ ఒప్పుకోలు, మనుష్యులను వారి పాపాన్ని గమనించేటట్టు చేస్తుంది, ఆ అద్భుతము వారు పొందుకోవాలి నిజ మార్పు అనుభవించడానికి.

అద్భుతాలు దేవునికి విరుద్ధంగా హృదయాలు కఠినం అవడానికి కూడ దోహద పడతాయి. ఇప్పుడు, ప్రధాన యాజకులు పరిశయ్యలు యేసు "చాలా అద్భుతాలు" చెయ్యడం చూసాక, వారు "ఒక సమాజంగా" కూడుకున్నారు, మహా సభను సమకూర్చారు (యోహాను 11:47). ఆ కూడికలో, విచిత్ర విషయము జరిగింది. ప్రధాన యాజకుడు కయప క్రీస్తును గూర్చి నిక్కచ్చి ప్రవచనము చేసాడు. నూతన నిబంధన వ్యాఖ్యానము సన్నివేశాన్ని వివరిస్తుంది: కయప "తారుమారు చేయువాడు, అవకాశవాది, న్యాయము ధర్మము అర్ధము అతనికి తెలియదు... అమాయక రక్తం కార్చడం అతనికి బాధగా లేదు. [ఏమి చెయ్యాలో అదే చేసాడు] అది సమాజానికి మంచిదైనట్టుగా. కయప యేసు మీద అసూయ పడ్డాడు. కయప తన స్వార్ధ అవసరాలకు యేసును చంపాలని ఆలోచించాడు. యేసు శిక్షను అమలు చేయడానికి, తెలివైన లెక్కలతో కొన్ని సాధనాలు ఉపయోగించాడు...అతడు వేషధారి, ఆఖరి తీర్పులో... అతడు అనుకున్నది క్రీస్తు శిక్షకు మూలమనుకున్నాడు, ప్రగాఢ విచారము ఉందన్నట్టు యాజక వస్త్రాన్ని చింపుకున్నాడు! అలాంటి వాడు కయప. జోసేఫస్ ను చూడండి, పురాతనాలు, XVIII, 4:3" (William Hendriksen, Th.D., New Testament Commentary, Baker Book House, 1981 edition, volume I, p. 163; note on John 11:49-50). గమనించండి ఈ చెడు ప్రధాన యాజకుడు ప్రవచనము చెప్పాడు. పాత నిబంధనలో బాలాము చెప్పినట్టు, ఈ దుష్టుడు నిజానికి నిజ ప్రవచనము ఇచ్చాడు,

"అయితే వారిలో, కయప అను ఒకడు, ఆ సంవత్సరము, ప్రధాన యాజకుడైయుండి, మీకేమియు తెలియదు, మన జనమంతయు నశింప కుండునట్లు, ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట, మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించు కొనరు అని వారితో చెప్పెను. తనంతట తానే ఈలాగు చెప్పలేదు: గాని ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై యుండెను, యేసు జాతి కొరకు చనిపోయాడు; గనుక యేసు ఆ జనము కొరకును, ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు చాపనైయున్నాడని ప్రవచించెను. కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంప ఆలోచించు చుండిరి" (యోహాను 11: 49-52).

కాని బైబిలు చెప్తుంది,

"కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంప ఆలోచించు చుండిరి" (యోహాను 11:53).

వారము తరువాత, కయప దేవాలయపు భటులను పంపించాడు యేసును బంధించడానికి ఆయన గెత్సమనే వనములో ప్రార్ధించు కొనుచున్నప్పుడు. ఆ సైనికులు ఆయనను కయప వద్దకు తీసుకెళ్ళారు, అతడు ఆయనతో అన్నాడు, "నీవు దేవుని కుమారుడైన, క్రీస్తుతో చెప్పుము" (మత్తయి 26:63). యేసు సరళముగా ఇలా జవాబిచ్చాడు,

"తరువాత ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, వీడు దేవ దూషణ చేసెను, అనెను; మనకిక సాక్షులతో ఏమి పని? ఇదిగో, ఈ దూషణ మీరిప్పుడు విన్నారు. మీకేమి తోచుచున్నదని అడిగెను? అందుకు వారు, వీడు మరణమునకు పాత్రుడనిరి. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసి, ఆయనను గుద్దిరి; కొందరు, ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో, ప్రవచింపు, అనిరి?" (మత్తయి 26:65-68).

ప్రధాన యాజకుని ప్రజలకు ఉరి శిక్ష వేసే అధికారము లేదు. కాబట్టి కయప యేసును పొంతి పిలాతు దగ్గరకు లాక్కెల్లాడు, అతడు రోమా గవర్నరు – అలా ఆయనను సిలువ వేయడానికి రోమీయులను పిలిపించాడు.

ఇలాంటి నిర్మాణాత్మక ప్రసంగము చెయ్యడం కష్టం, కాని రెండు సామాన్య ముగింపులు చెయ్యడం సమంజసము, యోసేపు కయప మాటలు క్రియలను బట్టి, అతడు ప్రధాన యాజకుడు క్రీస్తు సిలువ మరణమును రూపొందించిన వాడు.

I. మొదటిది, కయప చాలా మతపరమైన వ్యక్తి, మరియు క్రీస్తు యొక్క ప్రత్యామ్నాయ త్యాగమును గూర్చి ప్రగాఢ సత్యము చెప్పాడు.

కయప పాత ప్రధాన యాజకుడు అన్నా యొక్క అల్లుడు. అతడు తన ప్రధాన యాజకుని పదవిని 18 సంవత్సరాలు కాపాడుకున్నాడు, ఆ సమయంలో అదే సుధీర్ఘ కాలము.

దురదుష్టవశాత్తు, అతడెలాంటివాడో మనకు తెలుసు. ఉదాహరణకు, చాలా సార్లు, డాక్టర్ హైమర్స్ యవనంలో ఉన్నప్పుడు, అతనికి చెప్పారు, "అది నీవు బోధింప లేవు," లేక "నీవు అలా బోధించ లేవు." సంవత్సరాలు గడిచే కొద్ది ఈ సలహా తప్పని తేలింది. అలా చెప్పిన వారు బైబిలులో చెప్పబడినట్టు సత్యానికి కాకుండా, వారి స్థితికి ప్రాధాన్యత ఇచ్చారు. ఒక బోధకుడు మనష్యులను సంతోష పెట్టలేదు వారు ఉద్యోగాలు కాపాడుకుంటూ, ఎవరిని బాధ పెట్టకూడదనుకుంటారు. కయప అలాంటి వ్యక్తి. అతనికి తెలుసు యేసు "చాలా అద్భుతాలు" చేసాడని (యోహాను 11:47), కాని అతడు యేసును రాజకీయ స్థితి నుండి ఆపేయాలనుకున్నాడు. అతననుకున్నాడు, "అతనిని ఒంటరిగా ఒదిలేస్తే మనం ఏదైనా కోల్పోతాం."

యేసు చెప్పాడు చెప్పిందే చేసాడు ప్రేమతో దేవునికి విధేయుడై. కయప చెప్పాడు చెప్పింది చేసాడు దేవుని గూర్చి ఎలాంటి తలంపు లేకుండా. అలాంటి వారు ఈనాడు సంఘాలలో చాలామంది ఉన్నారు. అతడు చాలా మత చాందస్తుడు. అది గ్రహించకుండా, క్రీస్తు నేరవేర్పును గూర్చి సత్యమే పలికాడు ఇలా,

"ఒక మనష్యుడు ప్రజల కొరకు చనిపోవుట, యుక్తము" (యోహాను 11:50).

అలా, అతడు పాపులకు ప్రతిగా క్రీస్తు మరణమును గూర్చి సత్యమే పలికాడు, యెషయా మాటల వలే,

"మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచ బడెను, మన దోషములను బట్టి నలుగ గొట్టబడెను: మన సమాధానార్ధమైన శిక్ష అతని మీద పడెను; అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది" (యెషయా 53:5).

జాగ్రత్త సుమా! ఎలాంటి ప్రయోజనము లేకుండా మీరు ఈ మాటలు తెలుసుకొని ఉండవచ్చు! కయప విషయం అదే జరిగింది. అతనికి నిజ మాటలు తెలుసు, కాని అవి అతని జీవితముపై ప్రభావము చూపలేదు.

ఈ ప్రధాన యాజకుడే పేతురును భయపెట్టాడు అతడు యేసు మృతులలో నుండి లేచాడని బోధించినందుకు. కాని ప్రజలకు భయపడి, పేతురును బెదిరించి విడిచి పెట్టాడు (అపోస్తలుల కార్యములు 4:21). మళ్ళీ, కయప ప్రధాన యాజకునిగా ఉండి అపోస్తలులను చెరసాలలో పెట్టించాడు (అపోస్తలుల కార్యములు 5:17-18). కాని దేవుడు దూతను పంపించి జైలు ద్వారాలు తెరిచి వారిని విడిపించింది. కయప అధికారులను పంపి పేతురును మహా సభకు రప్పించాడు "హింస లేకుండా...రాళ్ళు రువ్వబడేటట్టు" (అపోస్తలుల కార్యములు 5:26). చాలా మంది అపోస్తలుల బోధలు విన్నారు కనుక కయప వారు తనపై రాళ్ళు రువ్వి చంపుతారని వారికి భయపడ్డాడు! మహాసభలో శాన్ హెడ్రిన్, గమలీయేలు అనే వ్యక్తి, కయప తోనూ ఇతరులతోనూ ఇలా చెప్పాడు

"ఈ మనష్యుల జోలికి పోక వారిని విడిచి పెట్టుడి: ఈ ఆలోచన యైనను ఈ కార్యమైనను మనష్యుల వలన కలిగిన దాయేనా, అది వ్యర్ధ మగును: దేవుని వలన కలిగిన దాయేనా, మీరు వారిని వ్యర్ధ పరచలేదు; మీరొక [వేళ] దేవునితో పోరాడు వారవుదురు సుమా" (అపోస్తలుల కార్యములు 5:38-39).

కయప ఇతరులు గమలీయేలుతో ఏకీభవించారు. కాని వారు ఏమి చేసారు? వారు దేవుని పట్టించుకున్నారా? లేదు! వారు అపోస్తలులను కొట్టి "యేసు నామమున బోధింప కూడదని ఆజ్ఞాపించి, వారిని విడిచి పెట్టిరి" (అపోస్తలుల కార్యములు 5:40).

"ప్రతి దినము దేవాలయములోను, ఇంటింటను మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించు చుండిరి" (అపోస్తలుల కార్యములు 5:42).

అలా, మనము కయపను వదిలేస్తాం – బలహీనుడై, సువార్త ప్రకటన క్రైస్తవ్యము విస్తరించము ఆపలేకపోయాడు. దేవుని గూర్చి ఆలోచించడం పాపము ఒప్పుకోవడం అతని మనసులో ప్రవేశింప లేదు. అతడు రాజకీయాలు ఆడాడు – మత చాందస్తుడు, దేవుని భయము లేదు – అతడు రెండు సంవత్సరాల తరువాత తన యాజకత్వాన్ని తన తదుపరి వ్యక్తి పిలాతు వలన పోగొట్టుకున్నాడు. ఏ. డి. 36లో జోసేఫస్ ప్రకారము (పురాతన విషయాలు, XVIII:4, 2). వదిలిపోయిన తరువాత తనకేమయిందో తెలియదు. (ఆస్తి పంజరము) మృత దేహపు ఎముకలు యేరూష లేములో 1991లో కయప పేరుతో కనుగొనబడ్డాయి – భూగర్భ శాస్త్రజ్ఞులు అవి అతని అస్తికలు అని నమ్మారు (Archaeological Study Bible, Zondervan, 2005, p. 1609; note on Matthew 26:3). అతడు గుర్తుకు వస్తాడు "అమాయకపు ఖైదీ [యేసు] యొక్క హత్యకు అతడు పూర్తిగా బాధ్యుడు" (John D. Davis, D.D., Davis Dictionary of the Bible, Baker Book House,1978 edition, p. 114).

II. రెండవది, కయప, కయీను వలే , ఎన్నడు పశ్చాత్తాప పడలేదు – ఎన్నటికీ రక్షింప బడలేదు.

కయపకు మరియు కయినుకు పోలిక ఉంది. కయీనుకు తెలుసు రక్తబలి తీసుకొని రావాలని, హేబెలు వలే. కాని కయీను పశ్చాత్తాప పడలేదు. దానికి బదులు,

"కయీను తన సహోదరుడైన హేబెలుపై లేచి, అతనిని సంహరించెను" (ఆదికాండము 4:8).

నూతన నిబంధన పోలిక కూడ ఉంది కయీనుకు కయప లాంటి మనష్యులకు. అపోస్తలుడైన యోహాను చెప్పాడు,

"మనము కయీను వంటి వారమై యుండరాదు, వాడు దుష్టుని సంబందియై, తన సహోదరుని చంపెను. వాడటని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవయు, తన సహోదరుని క్రియలు నీతిగలవై యుండెను. మర్వెల్ కాదు, నా సోదరుడైనా, ఈ ప్రపంచం మొత్తం నిన్ను ద్వేశించినను" (I యోహాను 3:12-13).

కయప, కయీను వలే, "దుష్టుడైన" సాతానుచే, ప్రభావితము చెయ్యబడ్డాడు. కయీను వలే, కయప "లోకస్థుడు." సాతాను మాట వినడం మానలేదు. "లోకమును" విడిచి దేవుని సేవించలేదు. యూదా సమాజపు మూలములు, మృత సముద్రపు చుట్టాలను తయారు చేసినది, కయపను గూర్చి తీవ్రంగా పరిగణించాయి, అవి అతనిని "దుష్ట యాజకుడు" అని పిలిచాయి (భూగర్భ పఠన బైబిలు, ఐబిఐడి.).

కయీను కయప మత పరముగా ఉండి నశించు వారికి గొప్ప హెచ్చరిక చేస్తున్నారు. కయప మరియు కయీనుకు రక్ష ప్రోక్షణ గూర్చి తెలుసు. కయీను కయపలతో దేవుడు నేరుగా మాట్లాడాడు. దైవ కుమారుడు కయపతో నేరుగా మాట్లాడాడు – కయీనుతో మాట్లాడినట్టు (ఆదికాండము 4:6-7). కయీను కయపలు ఇద్దరు కూడ దేవుని స్వరాన్ని విస్మరించి, వారి మనస్సాక్షులతో మాట్లాడుకొని, స్వార్ధ పూరిత జీవితాలు కొనసాగించారు. కయీను కయపలు ఇద్దరు ఆఖరి తీర్పులో క్రీస్తు ముందు నిలబడతారు, ఆయన వారితో అంటాడు,

"వారెవరో నేను ఎరుగును: అక్రమము చేయు వారలారా, నా నుండి తొలగి పోవుడి" (మత్తయి 7:23).

అప్పుడు వారు "అంధకారములో త్రోయబడతారు: అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును" (మత్తయి 8:12).

ఈ ఉదయాన మిమ్ములను హెచ్చరిస్తున్నాను – దేవుని గూర్చి ఆలోచించేటట్టు నిర్ధారణ చేస్తుకోండి! మీ పాపాన్ని గూర్చి ఆలోచించేటట్టు చూసుకోండి! "మంచి మాటలు" చెప్పకుండా చూసుకోండి. మీ పాపాలు గుర్తెరిగేటట్టు చూసుకోండి!

"వ్యాకుల పడుడి, దుఃఖ పడుడి, ఏడువుడి: మీ నవ్వు దుఃఖము మీ ఆనందము, చింతను మార్చుకొనుడి" (యాకోబు 4:9).

నిజమైన మార్పు అనుభవించేటట్టు చూసుకోండి – యేసు క్రీస్తుతో ముఖాముఖిగా వచ్చి "ఆయన స్వరక్తములో మీ పాపాలు కడగబడేటట్టు చూసుకోండి" (ప్రకటన 1:5). కనిపెట్టవద్దు! యేసు నొద్దకు రావడానికి తిరస్కరించవద్దు! దేవుడు మిమ్ములను విడిచి పెట్టి దుష్ట మనస్సుకు అప్పగించే వరకు, తిరుగుతూ ఉండవద్దు!

చాలాకాలము నేను రక్షకుని నిర్లక్ష్యము చేసాను.
   చాలాకాలము పాపములో ఉన్నాను.
చాలాకాలము నా తిరస్కరణను లెక్క చేయలేదు,
   ఇప్పుడు నేను ఆయన లేకుండా నశించి పోయాను.
ఆలస్యమయింది, ఓ, చాలా ఆలస్యమయింది! అయినను ఆయన తలుపు తట్టుచున్నాడు,
   యేసు, మధుర రక్షకుడు, ఇంకొకసారి పిలుస్తున్నాడు.
("చాలాకాలము నిర్లక్ష్యము చేసాను" డాక్టర్ జాన్ ఆర్. రైస్ చే, 1895-1980).
       (“Too Long I Neglected” by Dr. John R. Rice, 1895-1980).

డాక్టర్ హైమర్స్, దయచేసి వచ్చి ఈ ఆరాధన ముగించండి.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే:
"చాలాకాలము నిర్లక్ష్యము చేసాను" (డాక్టర్ జాన్ ఆర్. రైస్ చే, 1895-1980).
“Too Long I Neglected” (by Dr. John R. Rice, 1895-1980).



ద అవుట్ లైన్ ఆఫ్

కయప - క్రీస్తు హత్యను
రూపొందించిన వ్యక్తి!

CAIAPHAS – THE MAN WHO
PLANNED THE MURDER OF CHRIST!

ప్రసంగము డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే గారిచే వ్రాయబడినది మరియు జాన్ సామ్యూల్ కాగన్ గారిచే బోధింపబడినది

"అయితే వారిలో, కయప అను ఒకడు, ఆ సంవత్సరము, ప్రధాన యాజకుడైయుండి, మీకేమియు తెలియదు, మన జనమంతయు నశింప కుండునట్లు, ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట, మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించు కొనరు అని వారితో చెప్పెను. తనంతట తానే ఈలాగు చెప్పలేదు: గాని ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై యుండెను, యేసు జాతి కొరకు చనిపోయాడు; గనుక యేసు ఆ జనము కొరకును, ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు చాపనైయున్నాడని ప్రవచించెను. కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంప ఆలోచించుచుండిరి" (యోహాను 11: 49-53).

(లూకా 16:31; ఎఫెస్సీయులకు 2:1; యోహాను 11:47-48, 49-52, 53;
మత్తయి 26:63, 65-68)

I. మొదటిది, కయప చాలా మతపరమైన వ్యక్తి, మరియు క్రీస్తు యొక్క ప్రత్యామ్నాయ త్యాగమును గూర్చి ప్రగాఢ సత్యము చెప్పాడు, యోహాను 11:47, 50; యెషయా 53:5; అపోస్తలుల కార్యములు 4:21; 5:17-18, 26, 38-39, 40, 42.

II. రెండవది, కయప, కయీను వలే , ఎన్నడు పశ్చాత్తాప పడలేదు – ఎన్నటికీ రక్షింప బడలేదు, ఆదికాండము 4:8; I యోహాను 3:12-13; ఆదికాండము 4:6-7; మత్తయి 7:23; 8:12; యాకోబు 4:9; ప్రకటన గ్రంథము 1:5.