Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




రక్షణా లేక నరకమా – ఏది?

SALVATION OR DAMNATION – WHICH?
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
శనివారం ఉదయము, ఫిబ్రవరి 19, 2017
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Morning, February 19, 2017


హోషేయ తన జీవితంలో చాలాకాలము ఇశ్రాయేలు ఉత్తర రాజ్య భాగములో బోధించాడు. హోషేయ "హృదయము పగిలిన ప్రవక్తగా" పిలువబడ్డాడు. అతని సందేశము సారంశము నమ్మకస్తురాలు కాని, తన భార్యపై తన ప్రేమను నమ్మకత్వము లేని ఇశ్రాయేలుపై దేవుని ప్రేమను పోల్చాడు. ఇశ్రాయేలు గోత్రములలో ఎఫ్రాయము అతి పెద్దది. అందువలన ఎఫ్రాయము అంటే ఇశ్రాయేలును సూచిస్తుంది. వారు విగ్రహారాదనలో ఎంతగా మునిగిపోయారంటే వారికి ఉజ్జీవము నిరీక్షణ లేదు. మన పాఠ్య భాగములో దేవుడు హోషేయకు బోధించడం ఆపమని చెప్పాడు ఎందుకంటే ఆయన వారిని విడిచి పెట్టాడు.

"ఎఫ్రాయము విగ్రహములతో కలిసికొనేను: వానిని ఆలాగుననే యుండనిమ్ము" (హోషేయ 4:17).

గత సంవత్సరము మనము ఉజ్జీవపు "తాకిడి" పొందాము. కొన్ని కూటాలలో దేవుడు దిగి వచ్చాడు సుమారు పదిమంది మార్చబడ్డారు! కాని పదముగ్గురు తప్పుడు మార్పిడి పొందారు. వారు ఇంకనూ నశించి నరకానికి పోతున్నారు.

ఈ కూటాలలో దేవుడు నేర్పిన ముఖ్య విషయము దేవుడు దిగి వచ్చినప్పుడు సాతాను విజ్రుంబిస్తుంది. అనుభవము ద్వారా మేము నేర్చుకున్నది దేవుడు సాతాను ఇద్దరు చాలా వాస్తవము. మారిన వారు కనీసము ఆ పాఠము నేర్చుకొని ఉండాలి.

నలభై సంవత్సరాలుగా ఉజ్జీవములో దేవుని సన్నిధిని మనము అనుభవించ లేదు. నేను తరుచు దానిపై బోధించాను. కాని నేను అలా చేసినప్పుడు మన సంఘస్తులు చాలామంది తిరగబడ్డారు, హోషేయా బోధకు ఇశ్రాయేలు తిరగబడినట్టు. వారిలో చాలామంది రెండు పెద్ద చీలికలలో మన సంఘాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఇక ఉజ్జీవము ఉండదని సాతాను వారికి చెప్పింది. వారు బైబిలు బదులు సాతనును నమ్మారు. పెద్ద సంఖ్యలో గుడిని విడిచిపెట్టి వెళ్ళారు. వెనుదిరిగి చూస్తే డాక్టర్ కాగన్ నమ్ముతాడు వారిలో ఎవ్వరికి నిజ మార్పులేదని. అందుకు నేను ఉజ్జీవముపై బోధించినప్పుడు వారు ప్రార్ధించ లేక పోయారు. వారు తిరుగుబాటు మాత్రము చేసారు.

"ఎఫ్రాయము విగ్రహములతో కలిసికొనేను: వానిని ఆలాగుననే యుండనిమ్ము" (హోషేయ 4:17).

మనం నిజ క్రైస్తవులను కలిగి యున్నందుకు దేవునికి స్తోత్రము. గత సంవత్సరము ఉజ్జీవము లేకపోతే ఇంకొక చీలిక సంఘములో వచ్చియుండేది. చాలామంది గుడిని వదిలి వెళ్ళిపోయేవారు. 1980-81 గుడి చీలికలో అయినట్లు చాలా సంఖ్యలో వెళ్ళిపోయి ఉండేవారు. వారు సంఘము చీల్చేసి ఉండేవారు, 1990లో ఒలీవ సంఘ చీలికలో జరిగినట్టు. కాని గత సంవత్సరము ఆరుగురు మాత్రమే వెళ్ళిపోయారు. వెళ్ళిన వారు తిరిగి రాలేదు. నలభై రెండు సంవత్సరాలలో ఒక్కరు రాలేదు. కంప్యూటర్ లో మన ప్రసంగాలు చూస్తారు, కాని వారు తిరిగి వచ్చి రక్షించబడలేదు. ఎన్నడు! నలభై రెండేళ్లలో ఒక్కరు కూడ! అది ప్రశంసనీయము ఎందుకంటే ప్రతి ఆరాధనలో మనము క్రీస్తు ద్వారా రక్షణ అని బోధిస్తుంటాము. ఎందుకు వారు తిరిగి వచ్చి యేసును విశ్వసించరు? "ఎఫ్రాయము విగ్రహాలతో కలిసికొనెను: వానిని అలాగే ఉండనిమ్ము" – అందుకే!

వారలా అంటారు ఎందుకంటే నేను పట్టించుకుంటాను కాబట్టి. వారలా అంటారు ఎందుకంటే వారి పాపానికి వ్యతిరేకంగా నేను బోధిస్తాను దానికి వారు నన్ను ద్వేషిస్తారు, వారు హోషేయాను ద్వేశించినట్టు! డాక్టర్ కాగన్ నేను ఒక యవనస్తురాలి "సాక్ష్యము" వింటున్నాము. తన సాక్ష్యము అబద్ధమని తనతో చెప్పినప్పుడు తను చెప్పింది, "వారు తెరిచిన ద్వారము వలే, సంకుచితులు." "తెరచిన ద్వారము" అని చెప్పిన నాట నుండి ఆ అమ్మాయి మన గుడికి రాలేదు. నాకు తెలుసు తనముందు తన తల్లిదండ్రులు నాపై చెడుగా మాట్లాడారు. రెండు నెలల తరువాత తన తండ్రి గర్జించు సింహము వలే యవనస్తులందరి సమక్షంలో నాపైకి వచ్చాడు. పోలీసును పిలుస్తానని నప్పుడు భవనము విడిచి వెళ్ళాడు. ఇతడు ఈ భవనానికి చెల్లించిన"39 మందిలో" ఒకడు. క్రైస్తవుని వలే నటిస్తూ, తిరిగుబాటు కలిగి ఉన్నాడు. తన పిల్లలలో ఒకరిని సాతాను తీసుకున్నప్పుడు తప్పు నాది అన్నట్టు నాపై లేచాడు. కొద్ది వారాల క్రితము నా భార్య అతనిని చూసింది. గెడ్డము పెంచాడు. హిప్పీలా అయిపోయాడు. స్పర్జన్ అన్నాడు, "తగ్గింపు లేకుండా వచ్చారు, అలానే ఉన్నారు, తగ్గింపు లేకుండా వారు గురిని విడిచిపెట్టారు." చాలాకాలము మారినట్టు నటించవచ్చు. తప్పుడు మార్పు ఉంటే ఇప్పుడో తరువాతో సాతాను లాక్కెళ్ళి పోతుంది! అప్పుడు దేవుడిలా చెప్పాడు.

"ఎఫ్రాయము విగ్రహములతో కలిసికొనేను: వానిని ఆలాగుననే యుండనిమ్ము" (హోషేయ 4:17).

దేవుడు చూస్తాడు మీరు పాపములో ఉన్నారని క్రీస్తును విశ్వసించరని, అందుకే ఆయన మిమ్మును ఒంటరిగా విడిచి పెడతాడు. ఆయన "భ్రష్ట మనస్సుకు" మిమ్మును అప్పగిస్తాడు (రోమా 1:28). దేవుడు మిమ్మును విడిచిపెడితే, మీరు ఎన్నటికీ రక్షింపబడలేరు. మీ జీవితమూ మీరు జీవించి రక్షింపబడనేరరు.

నిత్యత్వములో నశిస్తారు. నిత్యత్వము. నిత్యత్వము. నిత్యత్వములో నశిస్తారు.

ప్రవక్త హోషేయ అన్నాడు, "వారు గొర్రెలను ఎడ్లను తీసుకొని…యెహోవాను వెదక పోవుదురు; గాని ఆయన వారిని తన్ను మరుగు చేసుకొని నందున; వారికి కనబడ కుండును" (హోషేయ 5:6).

గత సంవత్సరము వారు మళ్ళీ ప్రయత్నించారు. ఆరుగురు మంచికి గుడికి విడిచిపెట్టారు. ఒక యవనస్తుడు నా కార్యాలయానికి వచ్చి, వేలు నాపై చూపించి, "నీతో ఈ గుడితో ఏంటి తప్పు, డాక్టర్ హైమర్స్." అతనికి తెలియదు, కాని ఆ మాటలు నా పాపాలు ఒప్పుకునేటట్టు చేసాయి. తిరిగుబాటుతో అతడు ఆ మాటలు పలికాడు. కాని దేవుడు వాటిని నన్ను పరీక్షించుకునేలా చేసాడు. నేను సహాయము పొందాను. తరువాత నలుగురు అబ్బాయిలు నాతో ప్రార్ధించడానికి నా ఇంటికి వచ్చారు. ఆరోన్, జాక్, జాన్ నోవా ప్రతివారము నాతో ప్రార్ధించారు – నాకు స్నేహితులయ్యారు. హోషేయ వలే, నావలే వృద్ధ బోధకునిగా ఉండడం ఎంత ఒంటరి తనమో ఎవరికీ తెలియదు! నేను విఫలుడనౌతానో అని అనిపించినప్పుడు – ఆ నలుగురు అబ్బాయిలు నాతో ప్రార్ధించడానికి వచ్చారు. ఇప్పుడు వారు నా స్నేహితులు! దేవుడు నా కొరకు వారిని పంపించాడు – వారి ప్రార్ధనల ద్వారా స్నేహము ద్వారా నన్ను రక్షించారు.

జాన్ కాగన్ అన్నారు గత సంవత్సరము "నరక సంవత్సరము" అని. అతడు సరియే. సాతాను గర్జించింది. సంఘము వణికింది, నా భార్య రోగి అయింది, నేను నిద్ర లేకపోయాను, భూకంపము వలే ఈ సంఘము తిరిగింది. అప్పుడు దేవుడు పరలోకము నుండి దిగివచ్చాడు. మేము ప్రార్ధించాము,

"గగనము చీల్చుకొని, నీవు దిగి వచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక" (యెషయా 64:1).

42 సంవత్సరాలలో, మొదటి ఉజ్జీవములో దేవుడు దిగి వచ్చాడు!

నేను ఆయనను స్తుతిస్తాను! నేను ఆయనను స్తుతిస్తాను!
   పాపుల కొరకై వధించబడిన గొర్రె పిల్లకు స్తోత్రము;
ఆయనకు మహిమనివ్వండి, ప్రజలంతా,
   ఆయన రక్తము ప్రతి మరకను కడిగివేస్తుంది.

లేచి నాతో పాటు పాడండి!

నేను ఆయనను స్తుతిస్తాను! నేను ఆయనను స్తుతిస్తాను!
   పాపుల కొరకై వధించబడిన గొర్రె పిల్లకు స్తోత్రము;
ఆయనకు మహిమనివ్వండి, ప్రజలంతా,
   ఆయన రక్తము ప్రతి మరకను కడిగివేస్తుంది.
("నేను ఆయనను స్తుతిస్తాను" మార్గరేట్ జే. హేరిస్ చే, 1865-1919).
(“I Will Praise Him” by Margaret J. Harris, 1865-1919).

నేను ఈ ప్రసంగము రాస్తున్నప్పుడు ఫ్లోరిడా నుండి ఫోను చేసి జాన్ కాగన్ ప్రసంగము "ఉజ్జీవము క్రీస్తు రక్తముపై తన ఆనందాన్ని పంచుకున్నాడు. అతనన్నాడు, "వందనాలు, కాపరి గారు. వందనాలు. ఆ ప్రశస్త బాలుడు! అతని ప్రసంగము నన్ను దీవించింది!" ఈ ఉదయము నోవాసాంగ్ చైనా ఇండోనేషియాలో బోధించి వచ్చారు! ఆ ఇద్దరు యవనస్తులు క్రీస్తు చెప్పిన శక్యము కాని ఐశ్వర్యమును గూర్చి బోధించడం మనకు ఆశీర్వాద కరము!

ఇప్పుడు, ఈ ఉదయము యేసు సువార్తను మీకు అందిస్తాను. యేసును గూర్చి మీ పాపాలు కడిగి వేయడానికి సిలువపై, ఆయన కార్చిన రక్తాన్ని గూర్చి మళ్ళీ చెప్తాను. డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు, "కొందరు క్రైస్తవ బోధకులు ఉన్నారు రక్తము వేదాంతముపై బురద జల్లుతారు. దానిని అపహాస్యము చేస్తారు...అందుకే సంఘము ఇలా ఉంది [ఈనాడు]. కాని ఉజ్జీవ కాలములో, ఆమె సిలువను మహిమ పరచి, రక్తము విషయం గర్వపడుతుంది...ఇది క్రైస్తవ సువార్తలో, కేంద్ర బిందువు, హృదయము, పూర్వము చేయబడిన పాపమును, ‘దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీటిని కనుపరచెను’ (రోమా 3:25). ‘ఆయన రక్తము వలన మనకు విమోచనము, మన అపరాధములకు క్షమాపణ’ (ఎఫెస్సీయులకు 1:7)...[మీలో నిరీక్షణ లేదు] ‘సిలువ వేయబడిన యేసు, క్రీస్తు నందు రక్షణ’ (I కొరింధీయులకు 2:2)... స్త్రీ పురుషులు తిరస్కరిస్తున్నప్పుడు [నిర్లక్ష్యము చేస్తున్నప్పుడు] క్రీస్తు రక్తాన్ని ఉజ్జీవ నిరీక్షణ ఉండడు" (Revival, Crossway Books, 1994 edition, pp. 48, 49).

రక్తములో నీవు కడుగబడ్డావా,
   ఆత్మను శుద్ధి చేసే గొర్రె పిల్ల రక్తములో?
నీ వస్త్రాలు మరకలేనివిగా? హిమము కంటే తెల్లగా ఉన్నాయా?
   గొర్రె పిల్ల రక్తములో నీవు కడుగబడ్డావా?
("రక్తములో నీవు కడుగబడ్డావా?" ఎలీషా ఏ. హాఫ్ మాన్ చే, 1839-1929).
(“Are You Washed in the Blood?” by Elisha A. Hoffman, 1839-1929).

అవును, యేసు రక్తము దేవుని ఉగ్రతను ఉపేక్షిస్తుంది. అవును, యేసు రక్తము దేవునితో మిమ్ములను సమాధాన పరుస్తుంది. అవును, యేసు రక్తము అధిగమించే శక్తినిస్తుంది, "ఆయన రక్తము ద్వారా మనకు విమోచనము" (కొలస్సయులకు 1:14).

ఇప్పుడు మన సంఘములో ఉన్న ఇద్దరి మాటలు వినండి, వీరు యేసు రక్తములో విశ్వాస ముంచడము ద్వారా రక్షింపబడ్డారు.

ఒక స్త్రీ వేరే బాప్టిస్టు సంఘానికి వెళ్ళింది. బాప్టిస్మము తీసుకుంటావా అని అడిగారు. "అవును" అని చెప్పింది, వారు యేసును గూర్చి, తన పాపాలకు ఆయన రక్ష ప్రోక్షణ గూర్చి చెప్పలేదు. రక్షింపబడకపోయినా తనకు బాప్తిస్మమిచ్చారు. ఆమె చెప్పింది, "నా కొరకు, నేను జీవిస్తూ ఉన్నాను." తరువాత తన కూతురు తనను మన గుడికి తీసుకొచ్చింది. ఆమె "అనుకుంటుంది [మనము] అన్ని ఆరాధనలకు రమ్మంటాము అని, సమయము వృధా కాబట్టి రావాలనుకోలేదు. నేను స్వార్ధ పరురాలను, దేవుడు నా సమయమంతా తీసుకుంటాడు. కాని దేవుడు... నా హృదయములో చూపించాడు నా కొరకు నేను జీవిస్తున్నానని... ఆయన కృపలో దేవుడు చూపించాడు నేను చనిపోతే యేసును తిరస్కరించినందుకు, నా పాపాలను బట్టి తీర్పు తీర్చబడతాను. నాకు చింత భయము కలిగాయి"…[డాక్టర్ ఏ. డబ్ల్యూ. టోజర్ అన్నాడు, "దేవుని భయము తెలియకుండా దేవుడి కృపను ఎవరు ఎరుగరు."]. పాపపు ఒప్పుకోలుతో విచారణ గదికి వెళ్ళింది. డాక్టర్ కాగన్ అడిగారు యేసు ఎక్కడ ఉన్నాడని. తన హృదయములో ఉన్నాడని చెప్పింది. డాక్టర్ కాగన్ చెప్పాడు యేసు పరలోకము తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడని చెప్పాడు. ఆమె చెప్పింది, "నేను యేసు నొద్దకు వచ్చి ఆయన ప్రశస్త రక్తములో నా చెడు పాపలన్నింటిని కడిగి వేయమని చెప్పాను. నా కొరకు కార్చబడిన రక్తము... ఈ రోజు నేను సంతోషంగా ఉన్నాను. నేను రక్షింపబడునట్లు యేసు తన ప్రశస్త రక్తాన్ని సిలువపై కార్చాడు... ఆయన దైవిక రక్తముతో నా పాప పరిహారము చెల్లించాడు...ఈరోజు సువార్త పని చేయడానికి సంతోషిస్తున్నాను...యవనులను [గుడి] తీసుకు రావడానికి వారు సంఘ కాపరి మాటలు వినేటట్టు చేయడానికి. నేను సంతోషిస్తున్నాను [డాక్టర్ హైమర్స్] యేసు రక్తమును గూర్చి యవనస్తులతో మాట్లాడుతారు...నాకు [ఒక] కాపరి ఉన్నాడు ఆత్మల ద్యాస ఆయనకుంది యేసును గూర్చి మాట్లాడతారు...యేసు నేను రక్షింపబడునట్లుగా ఆయన ప్రశస్త రక్తము సిలువపై కార్చాడు...నా సుందర రక్షకుడు యేసు!"

ఒక చైనీయ కళాశాల విద్యార్ధి అన్నాడు, "నేను గుడిలోనికి వచ్చినప్పుడు నా హృదయము భారంగా ఉంది. నేను పాపిని దేవుడు మేల్కొల్పాడు...అందరు నా చుట్టూ నవ్వుతున్నప్పటికినీ...నేను మంచి వ్యక్తినని [నన్ను నేను] మోస పరుచుకోలేను. నేను మంచి వాడను కాను మంచి తనముతో లేదు. [డాక్టర్ హైమర్స్ బోధిస్తున్న] ప్రసంగము వినుచుండగా కాపరి నాతో నేరుగా మాట్లాడుతున్నట్టు అనిపించింది... నా పాపము ప్రజల నుండి దాచాలని ప్రయత్నించినా ప్రజల నుండి గాని, దేవుడు నుండి గాని వాటిని దాచలేకపోయాను...నేను ఆదాము వలే, దేవుని నుండి దాచుకోన ప్రయత్నించాను...

అప్పుడు, ప్రసంగము ముగుస్తూ ఉండగా, మొదటిసారిగా యేసు క్రీస్తు సువార్త విన్నాను [ఆమె చాలా కాలముగా గుడికి వస్తూ వినుచున్నప్పటికినీ!]. క్రీస్తు నా స్థానంలో, నా పాపముల కొరకు, చనిపోయాడు... ఆయన రక్తము పాపుల కొరకై కార్చబడింది. ఆయన రక్తము నా కొరకు చిందించబడింది! నాకు క్రీస్తు అవసరం వచ్చింది. నాలో నేను మంచితనాన్ని వెదకడం మానేసి, దేవుడి దయ వలన నా కళ్ళు తెరవబడ్డాయి. మొదటిసారిగా క్రీస్తును చూసాను, ఆ క్షణంలో ఆయన నన్ను రక్షించాడు! క్రీస్తు ముఖము తిప్పుకోలేదు, నేను ఆయన పట్ల చేసినట్టు, ఆయన నన్ను చేరుకున్నాడు, ఆయన రక్తముతో నన్ను కడిగాడు...ఆయన రక్తము నన్ను కప్పి నా పాపలన్నిటిని కడిగేసింది. క్రీస్తు ఆయన రక్తములో నన్ను చుట్టాడు. ఆయన నీతితో నన్ను చూసాడు. ఆయన రక్తము నా దుష్ట హృదయాన్ని కడిగి నూతన పరిచింది...నా విశ్వాసము నిశ్చయత క్రీస్తులోనే ఉంది. ఇప్పడు నాకు అర్ధమయింది జాన్ న్యూటన్ అభిమతము [ఆయన చెప్పినప్పుడు] ‘అద్భుత కృప! స్వరమెంత మధురము, నాలాంటి దుష్టుని రక్షించింది! నేను తప్పిపోయి, దొరికాను; గుడ్డివాడను, ఇప్పుడు చూస్తున్నాను.’ ... నేను పాపిని, యేసు క్రీస్తు నన్ను రక్షించాడు... ఆయన నన్ను చేర్చుకొని ఆయన రక్తములో నన్ను కడిగాడు."

యేసు సిలువ, యేసు రక్తముపై నన్ను బోధింపనివ్వండి? లేదు, మీరు అలసిపోరు! నశించు వారిని బాప్తిస్మమిచ్చు కాపరుల వలే కాదు – అర్లేలా, కాలిఫోర్నియాలో కాపరి లిడియా ఎస్ర్తడాకు యేసును నమ్మడా అని నిర్ధారించుకోకుండా, బాప్తిస్మమిచ్చినట్టు. ఎలా నిర్ధారించుకోవాలో కూడ తనకు తెలియదు? నాకు అనుమానమే! అలాంటి అబద్దపు ప్రవక్తలు నుండి దూరంగా ఉండాలి!

నా మట్టుకు, నేను యేసు క్రీస్తు రక్తమును గూర్చి బోధిస్తూనే ఉంటాను ఈ నత్తి నాలుక సమాధిలో మౌనము వహించే వరకు, అప్పుడు ఘనమైన, మధుర గీతము పాడతాను నీ శక్తే నన్ను రక్షిస్తుంది. రక్త ప్రవాహం ఉంది, రక్షకుని నరాల నుండి కారినది; మరియు పాపులు ఆ రక్తము క్రిందకు వస్తారు వారి మరకలు పోగొట్టుకోవడానికి!

నేర మరకలు పోగొట్టుకుంటారు, నేర మరకలు పోగొట్టుకుంటారు;
మరియు పాపులు, ఆ ప్రవాహాము క్రిందకు వస్తారు, నేర మరకలు పోగొట్టుకుంటారు.
("ప్రవాహముంది" విలియమ్ కాపర్ చే, 1731-1800).
      (“There Is a Fountain” by William Cowper, 1731-1800).

"ఆయన రక్తములో విమోచనము, పాప క్షమాపణ కలవు" (కొలస్సయులకు 1:14)

మీరు రక్షింపబడడం విషయం మాతో మాట్లాడాలకునుకుంటే, దయచేసి ముందుకు రండి, మీతో మాట్లాడతాం.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు ప్రార్ధన ఆరోన్ యాన్సీ గారు.
ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే:
      "సిలువ వేయబడిన వాని రక్తములో రక్షింపబడుట" (ఎస్. జే. హెండర్ సన్ చే, 19వ శతాబ్దము).
      “Saved by the Blood of the Crucified One” (S. J. Henderson, 19th century).