Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




మీరు నరకము యొక్క దండన నుండి
ఎలా తప్పించుకోగలరు?

HOW CAN YOU ESCAPE
THE DAMNATION OF HELL?
(Telugu)

డాక్టర్ ఆర్. యల్. హైమర్స్, జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము ఉదయము, మే 8, 2016
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, May 8, 2016

"నరక శిక్షను మీరెలాగు తప్పించుకొంటారు?" (మత్తయి 23:33).


నేను క్రైస్తవ గృహములో పెంచబడలేదు. చిన్నవానిగా చాలాసార్లు నాకు నేనుగా కేథలిక్ గుడి ఆరాధనకు వెళ్ళేవాడిని. పదమూడు సంవత్సరాలప్పుడు మా పొరుగు వారు నన్ను బాప్టిస్టు సంఘానికి తీసుకొని వెళ్ళారు. అది చాలా కాలము క్రిందట, 1954 లో. అప్పటి నుండి నరకముపై బోధకులు, ప్రసిద్ధ బోధకులు, బోధ వినడము మామూలైపోయింది. చాలామంది గొప్ప దక్షిణ బాప్టిస్టు బోధకులు డాక్టర్ డబ్ల్యూ. ఎ. క్రీస్ వెల్, డాక్టర్ ఆర్. జి. లీ, బిల్లీ గ్రాహం, నా యుక్త వయస్సులో, చాలా తీవ్ర ప్రసంగాలు నిత్య నరక శిక్షను గూర్చి చేసారు.

కాని అది అరవై సంవత్సరాల క్రిందట! ఈనాడు ఏ బోధకుడు నరకమును గూర్చి ప్రజలను హెచ్చరిస్తూ, ప్రసంగాలు చేయడం నాకు తెలియదు. నిజానికి వారిలో చాలా మంది అసలు బోధించరు. ఓ, దానిని మీరు బోధ అంటారు! కాని వారిది తప్పు! వారంతా ఇప్పుడు చిన్న ఉపన్యాసాలు ఇస్తారు వారు వాటిని "వివరణాత్మక" ప్రసంగాలు అని పిలుస్తారు. అవి వివరణాత్మకము – కాని బోధించుట కాదు. వారి కంఠములో తపన లేదు. వారు సాగదీస్తారు, సంభాషణా స్వరముతో, ఒక వచనము తరువాత ఇంకొక లేఖన వచనము వివరిస్తూ. కాని నేను పరలోకమును గూర్చి కూడ బలమైన బోధ వినడం లేదు! నేను బలమైన ప్రసంగాలు నెరవేర్పు, సిలువ, రక్తము, లేక ఇతర సిద్ధాంత పర బోధలపై వినడం లేదు. ఈనాడు బోధలో కరువు ఉంది. మీ తరము వారు బలమైన, తపనతో కూడిన బోధ వినడం లేదు నిజంగా మీ కొరకు శ్రద్ధ ఉన్న వారి దగ్గర నుండి మీ ఆత్మల నిత్య గమ్యమును గూర్చి.

రోబర్ట్ ముర్రే మెక్ చెనీ ఇరవై తొమ్మిది సంవత్సరాలకే టైపాయిడ్ జ్వరముతో చనిపోయాడు. కాని అతడు ఎంత గొప్ప బోధకుడు సుమా! అతడు 1843 లో చనిపోయినా, ఇప్పటికీ ఆయన బోధలను గూర్చి వారు మాట్లాడుకుంటారు. అతడు 23 వ ఏట బోధింపనారంభింఛి, 29 వ ఏట చనిపోయాడు. వారు ఎందుకు ఇంకా ఆయనను జ్ఞాపకము చేసుకుంటారు? ఆయన ఆరు సంవత్సరాలే బోధించాడు, కాని చాలా కొద్దిమంది బోధకులు రోబర్ట్ మెక్ చేనీలా వారితరము వారిపై గొప్ప ముద్ర వేసారు. ఆంగ్లము మాట్లాడే ప్రపంచంలో ప్రతి బోధకునికి అతని పేరు తెలుసు ఎందుకంటే దేవుడు గొప్ప నిజ ఉజ్జీవపు తరంగాలు అతని గుడికి పంపించారు. అతని రహస్యమేమిటి? ఆ యవనస్థుడు లోతైన ప్రార్ధనాపరుడు, పూర్తిగా పరిశుద్ధాత్మపై ఆధారపడే వాడు. అతడు ప్రార్ధించాడు, "ప్రభు, నన్ను రక్షింప బడిన పాపి అంత శుద్దునిగా చెయ్యి." ఒక సువార్తికుడు అతని గూర్చి ఇలా అన్నాడు, "నిత్యత్వము అతని నుదుటిపై ముద్రింపబడినట్టుగా బోధించాడు. నేను వణికిపోయాను, దేవుడు చాలా దగ్గరగా ఉన్నట్టుగా భావించాను."

ఓ, దేవుడు యవనస్తులను లేపి "నిత్యత్వపు ముద్ర నొసటిపై ఉన్నట్టుగా" బోధించాలని నా ప్రార్ధన రోబర్ట్ ముర్రే మెక్ చెన్ వలే!!! ఈ ఉదయము నేను మెక్ చెన్ గొప్ప ప్రసంగము "నిత్య శిక్ష" నుండి కొన్ని విషయాలు పంచుకుంటాను. మీరు యేసును విశ్వసింఛి మరియు రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మీరు కదలవచ్చు!

నేను ఈ ప్రసంగానికి వేరే పాఠ్యభాగము ఉపయోగిస్తున్నాను మెక్ చేన్ ఉపయోగించినది కాకుండా, అది అదే ప్రసంగాలకు కనిపిస్తుంది,

"నరక శిక్షను మీరెలాగు తప్పించుకొంటారు?" (మత్తయి 23:33).

ఈ పాఠ్య భాగము పరిశయ్యలకు వ్యతిరేకంగా క్రీస్తు చేసిన గొప్ప ప్రసంగము నుండి తీసుకొనబడినది. మన ప్రభువు దినాలలో వారు బైబిలు బోధకులు. ఆయన వారిని వేష ధారులు అనిపిలిచాడు (23:14). ఆయన వారిని "అవివేకులు గుడ్డివారు అని పిలిచాడు" (23:17). ఆయన అన్నాడు, "సర్పములారా, సర్పసంతానం, మీరు నరక శిక్షను ఎలా తప్పించు కుంటారు?"

I. మొదటిది, బైబిలులో నరకమును గూర్చి మాట్లాడిన వారు చెప్పింది వినాలి.

దావీదు దేవుని హృదయానుసారి. మనష్యుల పట్ల ప్రేమతో నింప బడినవాడు. నరకమును గూర్చి క్రీస్తును విశ్వసించడానికి నిరాకరించే వారికి. దావీదు ఏమి చెప్పాడో వినండి,

"దుష్టులను దేవుని మరచు జనులందరును, పాతాళము నకు దిగిపోవుదురు" (కీర్తనలు 9:17).

దావీదు అన్నాడు,

"దుష్టుల మీద [దేవుడు] ఉరులు కురిపించును, అగ్ని గంధకములను వడగాలియు, వారికి పానీయ భాగమగును" (కీర్తనలు 11:6).

అపోస్తలుడైన పౌలు క్రీస్తు ప్రేమతో నింపబడ్డాడు, పాపుల కొరకు గొప్ప ప్రేమ కలవాడు. పౌలు ఎన్నడూ "నరకము"ను గూర్చి చెప్పలేదు. చెప్పడానికి భయంకర పదంగా అనిపించింది. అతనన్నది వినండి,

"ప్రభువైన యేసు తన ప్రభావము కనుపరచు దూతలతో కూడ పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై, దేవుని నెరుగని వారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతి దండన చేయునప్పుడు: మిమ్మును శ్రమ పరచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడ విశ్రాంతియు అనుగ్రహించుట, దేవునికి న్యాయమే" (II దెస్సలోనీకయులకు 1:7-9).

యోహాను, క్రీస్తు అతిప్రియ శిష్యుడు ప్రేమతో నింపబడిన వాడు. అయినను నరకమును గూర్చి మాట్లాడాడు. ఏడు సార్లు నరకమును ఆయన "పాతాళ కూపము" అని సంభోదించాడు – ఆ గోతిలో నిత్యత్వములో నశించు పాపులు కూరుకుపోయారు. యోహాను నరకమును "అగ్నిగుండము" అని పిలిచాడు (ప్రకటన 20:14). అది తరుచు బైబిలులో "నరకము" అని పిలువబడింది. కాని యోహాను "అగ్ని గుండము" అని పిలిచాడు.

ప్రభువైన యేసు స్వయంగా. ఆయన దేవుడు యెద్ద నుండి వచ్చాడు, "దేవుడు ప్రేమయైయున్నాడు." ఆయన పరిచర్య అంతా ఆయన పాపుల పట్ల ప్రేమ చూపించాడు – అయినను నరకమును గూర్చి మాట్లాడాడు. ప్రభువైన యేసు క్రీస్తు చెప్పింది వినండి. ఆయన అన్నాడు,

"సర్పములారా, సర్పసంతానం, మీరు నరక శిక్షను ఎలా తప్పించు కుంటారు?" (మత్తయి 23:33).

మళ్ళీ, క్రీస్తు అన్నాడు,

"శపింపబడిన వారలారా, నన్ను విడిచి, నిత్య అగ్నిలోనికి పోవుడి" (మత్తయి 25:41).

మళ్ళీ, క్రీస్తు అన్నాడు,

"నమ్మిన వారికి శిక్ష విధింపబడదు" (మార్కు 16:16).

యేసు పెదవుల నుండి వచ్చిన ఆ మాటలను మించిన సాదా మాటలు ఉన్నాయా?

II. రెండవది, ఎందుకు దావీదు, పౌలు, యోహాను మరియు యేసు నరకమును గూర్చి అంత సామాన్యముగా మాట్లాడారు.

ఎందుకంటే అది నిజము కాబట్టి. యేసు అన్నాడు, "అది అలా కాకపొతే, నేను మీకు చెప్పి ఉండేవాడిని." యేసు ఈ భూమి మీదికి వచ్చినప్పుడు, ఆయన ప్రేమతో వచ్చాడు. యేసు ప్రేమను బట్టి నశించు పాపులను నరకమును గూర్చి హెచ్చరించాడు. ప్రేమను బట్టి ఆయన నశించు పాపులకు చెప్పాడు ఆయన వారి పాపముల నుండి వారిని రక్షించ డానికి వచ్చాడని వారు నరక అగ్ని నుండి తప్పించాలని. యేసు చేసినదే బోధకులు కూడ చెయ్యాలి. అది నిజము! అది నిజము! అది నిజము!

కొందరనవచ్చు, "నేను దానిని నమ్మను." అది దేనినైనా మార్చగలదా? హేరీ ట్రూమాన్ అనే వృద్ధుడు నమ్మలేదు సెయింట్ హెలెన్ పర్వతము పేలి అగ్ని పర్వతముగా మారుతుందని. ప్రతి ఒక్కరు అది నమ్మి ఆ స్థలాన్ని వదలి వెళ్ళిపోయారు. కాని ట్రూమాన్ అన్నాడు, "నేను దానిని నమ్మను." కనుక ఆ గొప్ప పర్వతము ప్రక్క తన ఇంటిలో ఉండిపోయాడు. అతని అపనమ్మకము తనను రక్షించిందా? ఓ, లేదు! ఆ అగ్ని పర్వతము వచ్చినప్పుడు అది అతనిని అతని ఇంటి నంతటిని నిత్యత్వానికి పేల్చేసింది. తరువాత వారు అతనిని కనుగొనలేకపోయారు. అతనన్నాడు, "అది నేను నమ్మను." కాని అతని అపనమ్మకము అతనిని రక్షింప లేదు – అలాగే మీ అపనమ్మకము కూడ మిమ్ములను నరక అగ్ని జ్వాలల నుండి రక్షింపలేదు! ఇది నిజము! ఇది నిజము! ఇది నిజము!

ఇంకొక కారణము దావీదు, పౌలు, యోహాను, మరియు యేసు నరకమును గూర్చి మాట్లాడడానికి వారికి నశించు పాపుల పట్ల గొప్ప ప్రేమ ఉంది. మన శ్రేష్ట స్నేహితులు, అతి సన్నిహిత స్నేహితులు, మన సంఘములో మనకు ఎప్పుడు సత్యమే చెప్తారు. యేసు మీకు అతి శ్రేష్టమైన స్నేహితుడు. ఒక పాత పాట ఇలా చెప్తుంది, " యేసులో మనకు ఎంత మంచి స్నేహితుడు ఉన్నాడు, మన పాపలు దుఃఖాలు భరించడానికి!" యేసు మీకు అతి శ్రేష్టమైన స్నేహితుడు. మీ శ్రేష్టమైన స్నేహితుడు ఇలా అన్నాడు, "ఈ నరక శిక్షను మీరేలాగు తప్పించు కొందురు?" (మత్తయి 23:33).

రోబర్ట్ మెక్ చేన్ అన్నాడు, "మీరు నిన్న మైదానంలో నడుస్తుండగా, గొప్ప శక్తితో ఒక తలంపు వచ్చింది, నేను బోధించిన ప్రతి ఒక్కడు త్వరలో పరలోకానికి కాని నరకానికి గాని వెళ్తారు. కాబట్టి, నేను మిమ్ములను హెచ్చరించాలి. నేను మీకు నరకాన్ని గూర్చి చెప్పాలి." అదే ప్రతి నిజమైన నమ్మకమైన బోధకుడు చెయ్యాలి. నరకమును గూర్చి మాట్లాడని కాపరి మంచి వ్యక్తి కాదు. నరకమును గూర్చి బోధింపని కాపరిని ఎప్పుడు నమ్మవద్దు. అతడు బోధించలేదంటే, దాని అర్ధము అతడు నీ ఆత్మను గూర్చి పట్టించుకోవడం లేదు! యేసు సాదాగా చెప్పాడు, "ఈ నరక శిక్షను మీరేలాగు తప్పించు కొందురు?" (మత్తయి 23:33).

III. మూడవది, బైబిలులో చెప్పబడిన నరకము నిత్యమూ ఉండేది.

యెహోవా సాక్షులు చెప్తుంటారు నరకము నిత్యమూ ఉండదని. మీరు వారిని నమ్మగలరా? గాయకుడు "ప్రిన్స్" కొన్ని రోజుల క్రితం చనిపోయాడు. అతడు యెహోవా సాక్షి. అతనికి ఎయిడ్స్ రోగము వచ్చినప్పుడు అతనికి వైద్యము తీసుకోవద్దని చెప్పారు. కనుక అతడు చనిపోయి నరకానికి వెళ్ళాడు ఎందుకంటే అతడు ఆ దుష్టపు తెగ యొక్క బోధలు నమ్మాడు.

రాబ్ బెల్ స్వతంత్ర బైబిలును తిరస్కరించే పుల్లర్ వేదాంత కళాశాల, పట్ట భద్రుడు. బెల్ అన్నాడు నరకము నిత్యమూ ఉండదని. మీరు అతని నమ్ముతారా? అతడు బైబిలులో తప్పులున్నాయని చెప్పాడు. ఎవరైతే క్రీస్తును తప్పు బడతారో ఆయన నిత్య నరకమును గూర్చి మాట్లాడి నందుకు అతడు అబద్ధికుడైన అయి ఉండాలి లేక అబద్దపు బోధకుడైనా అయి ఉండాలి. లక్షలాది మంది ఈ అబద్ధపు బోధకులు తెగ నాయకులు చెప్పే దాని నుండి ఉపశమనము పొందుకుంటారు. కాని ఇది అబద్ధపు ఉపశమనము. యేసు, దైవ కుమారుడు, సాదాగా చెప్పాడు, "అగ్ని ఆరదు" (మార్కు 9:44). యేసు క్రీస్తు అది మూడు సార్లు మార్కు తొమ్మిదవ అధ్యాయములో చెప్పాడు! "అగ్ని ఆరదు." "అగ్ని ఆరదు." "అగ్ని ఆరదు." అదే యేసు క్రీస్తు చెప్పాడు మార్కు, తొమ్మిదవ అధ్యాయములో. అపోస్తలుడైన యోహాను చెప్పాడు, "వారి భాద సంబంధమైన పొగ యుగ యుగములు లేచును" (ప్రకటన 14:11). యేసే స్వయంగా చెప్పాడు, "వీరు నిత్య శిక్షకు పోవుదురు" (మత్తయి 25:46).

IV. నాల్గవది, మీరు నరకమును ఎలాగు తప్పించు కొనగలరు?

మన పాఠ్యభాగములో, యేసు చెప్పాడు, "మీరు నరక శిక్షను ఎలా తప్పించుకొనగలరు? " (మత్తయి 23:33).

మీరు తిరిగి సంఘమునకు రాకపోతే మీరు దానిని తప్పించు కొనలేరు. ఒకరనవచ్చు, "నేను ఎప్పుడు తిరిగి డాక్టర్ హైమర్స్ బోధించేది వినడానికి వెళ్ళడం లేదు! ఆయన నన్ను భయపెట్టాడు! నేను తిరిగి ఆ సంఘానికి వెళ్ళడం లేదు." నాకు తెలుసు ఇలా చెప్పే కొందరు యవనస్తులు ఇక్కడ ఉన్నారని. కాని నేను నిన్ను వదులుకుంటాను గాని నీకు అబద్ధము చెప్పను! నేను నరకము గురించి బైబిలు చాలా ప్రసంగాలు చేసాను. నేను మీకు ఆ రోబర్ట్ మెక్ చేన్, యవ్వన బోధకుని గూర్చి ఆలోచనలను ఇచ్చాను. వారు ఆయనను, "చాల బోధకుడు" అని పిలిచారు. అతడు ఆరు సంవత్సరాలు మాత్రమే బోధించినా, ఈ యవనస్థుడు అతని రెండు పదుల వయస్సులోనే, అతి గొప్ప ప్రెస్బిటేరియన్ బోధకునిగా లెక్కింపబడ్డాడు. "అతడు [నుదిటిపై] నిత్యత్వ ముద్ర కలిగి బోధించాడు." మీకు అతడు నచ్చనప్పటికి, ఆ గొప్ప దైవిక యవ్వన బోధకుడు చెప్పింది నమ్మాలని మిమ్ములను ప్రార్ధిస్తున్నాను.

తరువాత, మీరు ఇక్కడ ఆదివారము తరువాత ఆదివారము ఇక్కడ కూర్చొని పశ్చాత్తాప పడడానికి యేసును నమ్మడానికి నిరాకరిస్తే మీరు నరకమును తప్పించుకోలేరు. ఇక్కడ ఉన్నంత మాత్రాన రక్షింపబడతారని మీరనుకుంటున్నారా? మీరు సంఘానికి డబ్బు ఇవ్వడం ద్వారా రక్షింప బడతారని మీరనుకుంటున్నారా? మీరు గుడిలో బల్లలు తుడవడం, కార్లు చూసుకోవడం, ఇతర పనులు చెయ్యడం ద్వారా, రక్షింపబడతారని మీరనుకుంటున్నారా? అలా అనుకుంటే, దెయ్యము మిమ్ములను మోసము చేసినట్టే! బైబిలు సాదాగా చెప్తుంది మీరు మోసమోయారు! బైబిలు చెప్తుంది, "మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడియున్నారు... ఇది మీ వలన కలిగినడి కాదు దేవుని కృపయే: అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవరును అతిశయపడలేదు" (ఎఫెస్సీయులకు 2:8, 9). బైబిలు చెప్తుంది, "మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయుట...ద్వారా మనలను రక్షించెను" (తీతుకు 3:5, 6).

మళ్ళీ, ఎలాంటి పాపపు ఒప్పుకోలు లేకుండా విచారణ గదికి మళ్ళీ మళ్ళీ రావడం ద్వారా రక్షింపబడవచ్చని మీరు అనుకుంటున్నారా? నాకు తెలుసు ఈ ఉదయాన్న మీలో చాలా మంది వస్తారు ఎందుకంటే మీకు నరకము అంటే భయము కాబట్టి. కాని నరకాన్ని గూర్చి భయపడిన వారు రక్షింపబడడం మేము చూడలేదు. కనీసం, ఒక్కరిని కూడ ఎన్నడూ చూడలేదు! ఎప్పుడు లేదు, 58 సంవత్సరాల పరిచర్యలో. ఒక్కరిని కూడ! మీరు నరకాన్ని గూర్చి భయపడుతున్నారు కాబట్టి విచారణ గదికి వస్తారు. కాని మీరు రక్షింపబడలేదు!

మీ పాపాన్ని గూర్చి మీరు ఆలోచించాలి. నీవు చేసిన పాపాలే కాకుండా, నీ హృదయా పాపాలు కూడ! మీరు మీ పాపపు హృదయమును బట్టి, మీ తిరుగుబాటులను బట్టి, దుష్ట తలంపులను బట్టి అంతరంగిక పాపములను బట్టి విసిగి పోవాలి. నరకము అంటే భయపడే వారిని రక్షింప డానికి యేసు రాలేడు. లేదు! "క్రీస్తు యేసు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చినప్పుడు" – మరి ఎవ్వరినీ కాదు! (I తిమోతి 1:15).

క్రీస్తు మీ పాపాల పరిహారార్ధం సిలువపై మరణించాడు! క్రీస్తు మీ పాపమును కడిగి వేయడానికి సిలువపై రక్తము కార్చాడు! క్రీస్తు మృతులలో నుండి లేచి పరలోకానికి ఆరోహణమయ్యాడు పాపము మీద మీకు శక్తిని ఇవ్వడానికి! మీరు విచారణ గదికి రావడానికి అదే మంచి కారణము! మీ పాపము! మీ పాపము! మీ పాపము! పశ్చాత్తాప పడి యేసును విశ్వసించు ఆయన మీ పాపము నుండి మిమ్ములను రక్షిస్తాడు! దయచేసి నిలబడి కీర్తనలు 139:23, 24 పాడండి. పాటల కాగితంలో అది 7 వ సంఖ్య పాట.

"నన్ను పరిశోధించుము, ఓ దేవా, నా హృదయము తెలుసుకొనుము:
ప్రయత్నించి నా తలంపులు గ్రహింపు ము:
నా హృదయాన్ని తెలుసుకొనుము;
ప్రయత్నించి నా తలంపులు గ్రహింపుము;
నీకాయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము,
నిత్య మార్గమున నన్ను నడిపించుము."

ఆమెన్. కళ్ళు మూసుకోండి. మీరు మాతో మీ పాపమును గూర్చి, యేసు రక్తముచే కడుగబడుటను గూర్చి మాట్లాడాలనుకుంటే, దయచేసి మీరు డాక్టర్ కాగన్, జాన్ కాగన్, నోవాహు సాంగ్ లను వెంబడించండి ఆవరణము వెనుకకు వెళ్ళడానికి. వారు మరియొక గదికి తీసుకొని వెళ్లి మీ కొరకు ప్రార్ధిస్తారు మీ పాపములను గూర్చి మీతో మాట్లాడతారు, యేసు రక్తము ద్వారా మీ పాపము కడగబడడాన్ని గూర్చి మీతో మాట్లాడతారు. ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఎబెల్ ప్రుదోమ్: ప్రకటన 14:9-11.
ప్రసంగము ముందు పాట బెంజమెన్ కినీకెయిడ్ గ్రిఫిత్ గారు:
"మీరు నిత్యత్వము ఎక్కడ గడుపుతారు?" (ఎలీషా ఎ. హాఫ్ మాన్ గారిచే, 1839-1929) /
"నన్ను పరిశోధించు, ఓ దేవా" (కీర్తనలు 139:23-24).
“Where Will You Spend Eternity?” (by Elisha A. Hoffman, 1839-1929)/
“Search Me, O God” (Psalm 139:23-24).


ద అవుట్ లైన్ ఆఫ్

మీరు నరకము యొక్క దండన నుండి
ఎలా తప్పించుకోగలరు?

HOW CAN YOU ESCAPE
THE DAMNATION OF HELL?

డాక్టర్ ఆర్. యల్. హైమర్స్, జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

"నరక శిక్షను మీరెలాగు తప్పించుకొంటారు?" (మత్తయి 23:33).

(మత్తయి 23:14, 17)

I. మొదటిది, బైబిలులో నరకమును గూర్చి మాట్లాడిన వారు చెప్పింది వినాలి, కీర్తనలు 9:17; కీర్తనలు 11:6; II దెస్సలొనీకయులకు 1:7-9; ప్రకటన 20:14; మత్తయి 23:33, 41; మార్కు 16:16.

II. రెండవది, ఎందుకు దావీదు, పౌలు, యోహాను మరియు యేసు నరకమును గూర్చి అంత సామాన్యముగా మాట్లాడారు, మత్తయి 23:33.

III. మూడవది, బైబిలులో చెప్పబడిన నరకము నిత్యమూ ఉండేది, మార్కు 9:44; ప్రకటన 14:11; మత్తయి 25:46.

IV. నాల్గవది, మీరు నరకమును ఎలాగు తప్పించు కొనగలరు? ఎఫేస్సీయులకు 2:8, 9; తీతుకు 3:5, 6; I తిమోతి 1:15.