Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




స్థానిక సంఘము యొక్క ప్రాముఖ్యత

THE IMPORTANCE OF THE LOCAL CHURCH
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము ఉదయము, ఆగష్టు 30, 2015
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, August 30, 2015

"మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని సంఘములో అనుదినము వారితో చేర్చుచుండెను" (అపోస్తలుల కార్యములు 2:47).


కొంతమంది అనవచ్చు నేను స్థానిక సంఘాన్ని గూర్చి చాల ఎక్కువగా మాట్లాడుచున్నానని. కాని నేనలా అనుకోవడం లేదు. నేననుకుంటాను స్థానిక సంఘంపై పాత పధ్ధతి బాప్టిస్టు వక్కనింపు ఈ తరానికి అవసరము. మనకు సహాయపడని తికమక పెట్టే అభిప్రాయాలు చాల విన్నాం సంఘ అభివృద్ధిని గూర్చి. స్థానిక సంఘముపై మనము పాతకాలపు బాప్టిస్టు భోధనకు మనము వెళ్ళాలి. ఈ తికమక స్వధర్మ దినాలలో ఏదీ మనకు స్థిరత్వము ఇవ్వలేదు.

"మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని సంఘములో అనుదినము వారితో చేర్చుచుండెను" (అపోస్తలుల కార్యములు 2:47).

ఈ వచనము దేని గూర్చి మాట్లాడుతుంది? దేని గూర్చి మాట్లాడడం లేదో ముందు చెప్తాను. అది తెగను గూర్చి మాట్లాడుట లేదు. సంఘము అనేది మెథడిస్టు తెగ, ప్రెస్ బిటేరియన్ తెగ, లేక కేథలిక్ తెగను గూర్చి మాట్లాడుట లేదు. ఈ వచనము ఇవ్వబడినప్పుడు తెగలు లేవు! రెండవది, అది సంఘ భవనమును గూర్చి మాట్లాడుట లేదు. మొదటి శతాబ్దములో సంఘ భవనాలు లేవు. కొత్త నిబంధన చదివితే అది త్వరగా చూస్తారు. ఈనాడు, సంఘాన్ని గూర్చి మాట్లాడేటప్పుడు, భవనాన్ని గూర్చి తరుచు మాట్లాడుతుంటారు. వారంటారు, "ఆ గుడి అందంగా లేదా?" భవనాన్ని గూర్చి మాట్లాడుతున్నారు. కాని ఈ వచనము వ్రాయబడేటప్పుడు సంఘ భవనాలు లేవు. భవనాన్ని గూర్చి మాట్లాడకూడదు. ఆ మొదటి శతాబ్దములో ప్రజలు ఇళ్ళల్లో కూడుకొని క్రైస్తవ ఆరాధనలు జరిపించు కొనేవారు! కనుక మన పాఠ్యభాగము సంఘ భవనాన్ని సూచించడం లేదు! మూడవది, అది "సార్వత్రిక సంఘాన్ని"గూర్చి మాట్లాడడం లేదు. ఈ వచనంలో ఆ తలంపు లేదు. అది నిజ, ప్రజలను గూర్చి మాట్లాడుతుంది, వారు వాస్తవంగా కలుసుకుంటారు ఒక స్థలములో, స్థానిక సంఘములో! అది "యేరూష లేములో ఉన్న సంఘము" (అపోస్తలుల కార్యములు 8:1).

"మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని సంఘములో అనుదినము వారితో చేర్చుచుండెను" (అపోస్తలుల కార్యములు 2:47).

అంటే ప్రజలు ఒక తెగకు, లేక "సంఘానికి" భవనానికి, లేక "సార్వత్రిక సంఘములో" చేర్చబడుట లేదు. కాదు! ఏమి చెప్పుతుందో అదే దాని అర్ధము. రక్షింపబడిన వారిని "ప్రభువు యేరూష లేము సంఘములో చేర్చుచున్నాడు"! అది చెప్పుచున్నదే దాని అర్ధము! దాని అర్ధ మేంటో అది చెప్తుంది!

"సంఘము" ఆంగ్ల అనువాదము "ఎన్లేషియా" అను గ్రీకు పదానికి. అది సమన్వయ పదము, "ఎక్" ను (బయటకు) క్రియను "కాలియో" (పిలుచుట) ను కలుపుతుంది, వాస్తవ అర్ధము "పిలువబడినవారు" (cf. The Criswell Study Bible, note on Ephesians 5:23).

డాక్టర్ డబ్ల్యూ. ఎ. క్రీస్ వెల్ చెప్పాడు ‘సంఘము’ ప్రజల గుంపు, అపనమ్మకము అవిశ్వాసము నుండి క్రీస్తు యొక్క విశ్వాసములోనికి పిలువబడ్డారు, విశ్వాసుల బాప్తిస్మము ద్వారా విశ్వాసానికి సాక్షులు ఐచ్చిక సహవాసములో జత పరచబడిన వారు" (ఐబిఐడి.). అది మంచి నిర్వచనము. సంఘము అనేది ప్రజల గుంపు వారు రక్షింపబడినవారు సహవాసపు గుంపులో జత చేయబడిన వారు. అదే అపోస్తలుల కార్యములు 2:47 చెప్తుంది!

"మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని సంఘములో [యేరూషలేము] అనుదినము వారితో చేర్చుచుండెను" (అపోస్తలుల కార్యములు 2:47).

అందుకే నేను తరుచు అంటాను, "ఎందుకు ఒంటరిగా? ఇంటికి రండి – సంఘానికి! ఎందుకు నశించుట? ఇంటికి రండి యేసు నొద్దకు రక్షణ పొందండి." గుడికి రావడాన్ని క్రీస్తు నొద్దకు రావడానితో తికమక చేస్తున్నానా? కానేకాదు! నేను మళ్ళీ మళ్ళీ చెప్తానా క్రీస్తు నొద్దకు రావడం గుడికి రావడం రెండు వేరు వేరు విషయాలు. క్రీస్తు నొద్దకు రాకుండా గుడికి వస్తే నరకానికి వెళ్తారు! క్రీస్తు మాత్రమే నిన్ను రక్షింపగలరు! నేను తరుచు అపోస్తలుల కార్యములు 16:31 చెప్తాను, "ప్రభువైన యేసు క్రీస్తు నందు విశ్వాసము ఉంచుము, అప్పుడు నీవు రక్షింపబడుదువు." అది చాలా తేటగా చెప్తున్నాను. రక్షణ సంఘ సభ్యత్వాలు రెండు వేరు వేరు విషయాలు. ఎందుకు ఒంటరిగా ఉండడు? ఇంటికి రండి – సంఘానికి! ఎందుకు నశించాలి? ఇంటికి రండి – క్రీస్తు నొద్దకు! అది చాలా తేటగా చెప్తుంది రక్షణ సంఘ సభ్యత్వము రెండు వేరు వేరు విషయాలని.

"మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని సంఘములో అనుదినము వారితో చేర్చుచుండెను" (అపోస్తలుల కార్యములు 2:47).

ఈ ఉదయాన్ని మూడు సామాన్య విషయాలు మీ ముందుంచు చున్నాను:

I. మొదటిది, సంఘానికి రావడం నీ ఒంటరి తనాన్ని బాగు చేస్తుంది.

నేనెవరిని గూర్చి మాట్లాడుచున్ననో అర్ధం చేసుకోండి. ఇప్పుడు మీతోనే మాట్లాడుతున్నాను! ఇది మన వెబ్ సైట్ లో పదానికి పదముగా వెళ్తుంది – ప్రపంచమంతా – 32 భాషలలో. ఒంటరితనాన్ని అనుభవించని వారు ఇది చదువు చుండవచ్చు. నాకు తెలియదు. చాలామంది యవనస్థులు ఈ రోజు ఒంటరిగా ఉన్నారేమో నాకు తెలియదు.

మన సంఘము చాల సువార్తీకరణ చేస్తుంది – ప్రాముఖ్యంగా చాల లౌకిక కళాశాలలో, యవనస్థులు కలుసుకొనే ప్రాంతాలలో, లాస్ ఎంజిలాస్ ప్రాంతములో. ఈ సంఘము కళాశాల ఉన్నత పాఠశాల పిల్లలతో నిండి ఉంది అందుకు – నేను మీతో మాట్లాడుతున్నాను! నేను గుడికి రాకముందు ఒంటరిగా ఉన్నట్టు మీరు కూడ ఒంటరి వారని నాకు తెలుసు. యవనస్థు లందరూ – మీరు కూడ – కనీసం కొంత మంది. నేనంటున్నాను దేవుడు మీరు ఒంటరిగా ఉండాలని కోరుకోవడం లేదు. ఏదేను వనంలో దేవుడు అన్నారు, "నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు" (ఆదికాండము 2:18). దేవుడు ఆదాము నుండి హవ్వను సృష్టించాడు కాబట్టి అతడు ఒంటరి వాడుకాదు (సిఎఫ్. ఆదికాండము 2:18, 21-22). దేవుడు మనవడు ఒంటరిగా ఉండాలనుకోవడం లేదు. దేవుడు మీరు ఒంటరిగా ఉండడానికి ఇష్ట పడడం లేదు. ఆ కారణాన్ని బట్టి దేవుడు ఈ స్థానిక కొత్త నిబంధన బాప్టిస్టు సంఘాన్ని తయారు చేసాడు – మీరు ఒంటరిగా ఉండకుండా.

"మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను" (అపోస్తలుల కార్యములు 2:47).

చైనీ అమ్మాయి మాతో కొన్ని వారాలు మాత్రమే ఉంది ఆమె ఈ మెయిల్ వ్రాసింది. ఆమె ఆంగ్లంలో పరిపూర్ణము కాదు, కానీ తన హృదయములో నుండి మాట్లాడింది.

డాక్టర్ హైమర్స్, మీ భోధ అద్భుతం! క్రీస్తును నమ్మి రక్షింపబడాలని నాకు బోధించాడు! సత్యాన్ని తెలుసుకునేలా చేసారు! మీ భోధ ఇంకా వినాలని ఉంది! ఈ సంఘానికి నిరంతరం రావాలనుకుంటున్నాను! మన సంఘాన్ని గూర్చి కన్నీటితో ప్రార్ధిస్తున్నాను, మన సంఘానికి పరిశుద్ధాత్మ రావాలని ప్రార్ధిస్తున్నాను! ఇంకా మీరు బాగా బోధించాలని ప్రార్ధిస్తున్నాను!!! ఈ సంఘము నిజంగా నా రెండవ ఇల్లు! వాస్తవానికి ఇది నా ముఖ్య గృహము! చాలాకాలంగా ఈ ఇంటిని గూర్చి వెదుకుతూ ఉన్నాను!

మీకు వందనాలు!!!! మీకు వందనాలు!!!! మీకు వందనాలు!!!!!

కనుక, మేముంటాం, "ఎందుకు ఒంటరిగా? ఇంటికి రండి – సంఘానికి!" ఆ అమ్మాయి నామాట విని ద్వారము తెరిచినప్పుడల్లా సంఘానికి వస్తుంది!

అలా అనడం తప్పా? ఒకరనవచ్చు, "ఈ చిన్న పిల్లలకు అలా చెప్పకండి. తప్పుడు కారణానికి రావచ్చు." సరే, మొత్తానికి మానేసే కంటే తప్పుడు కారణానికి రావడం మంచిది! వస్తు ఉంటే రక్షింపబడవచ్చు! అప్పుడు సరైన కారణానికి వచ్చినట్టవుతుంది!

ఒంటరిగా ఉన్నారు కాబట్టి వస్తే అది "తప్పుడు కారణము," నేను కూడ తప్పుడు కారణానికే వచ్చినట్టు అవుతుంది. పదమూడు సంవత్సరాలప్పుడు మా ప్రక్కింటి వారు గుడికి ఆహ్వానించారు. ఒంటరిగా ఉన్నాను కాబట్టి వచ్చాను. ఒంటరిగా ఉన్నాను కనుక వస్తూనే ఉన్నాను. తరువాత నేను మార్చబడ్డాను. దానిలో తప్పేముంది? దానితో ఏమి తప్పులేదు!

ఈ సంఘాన్ని ఆనంద స్థలంగా చేద్దాం! భూమిపై అతి ఆనంద స్థలంగా చేద్దాం! గొప్ప సువార్త పాటలు పాడదాం! పాతకాలపు ప్రసంగాలు భోదిద్దాం – "ఆమెన్" గట్టిగా చెప్పదా! కూర్చొని కలిసి భోం చేద్దాం (మధ్యాహ్నం భోజనము కాదు! అది మీరు తెచ్చుకునేది!). సంఘ ఆవరణలో "భోజనం చేద్దాం," పాతకాలంలోలా! పాత పద్దతి సహవాసము కలిగి ఉందాం. ఆపాట పాడదాం, "ఇంటికి భోజనానికి రండి." మీ పాటల కాగితములో మూడవ వచనము! పాడండి!

ప్రజలు పట్టించుకోని పెద్ద పట్టణము;
కొద్దిగా ఇస్తారు ప్రేమ చూపించరు.
కాని ఇంటికి రమ్ము యేసు నొద్దకు మీకు తెలుస్తుంది,
బల్లపై భోజనము ఉంటుంది సహవాసము పంచబడుతుంది!
ఇంటికి రండి సంఘానికి భోం చెయ్యండి, మధుర సహవాసానికి కూడండి;
అది శ్రేష్టము, భోజనానికి కూర్చున్నప్పుడు!
("భోజనానికి ఇంటికి రండి" డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్, జూనియర్ చే., స్వరాలు "పావురపు రెక్కలపై.")
   (“Come Home to Dinner” by Dr. R. L. Hymers, Jr.,
      to the tune of “On the Wings of a Dove.”)

పద్దెనిమిది పంతొమ్మిది శతాబ్దాలలో పాతకాలపు సువార్త కూటాలలో చాలామంది యవనస్థులు "భోజనాలకు వచ్చేవారు" – దేవుడు ఆయన శక్తిని పంపినప్పుడు ఆ పిల్లలు తినడానికి వచ్చినవారు ఉండి ప్రసంగ వేదిక నుండి బైబిలు గాలిలో ఊపుతూ – క్రీస్తు సువార్తను గట్టిగా చెప్పడం వినేవారు. అది ఈరోజు మనకు అవసరం!

"రాజ మార్గములోనికి కంచేలలోనికి వెళ్లి, లోపలి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయుము" (లూకా 14:23).

అవును, గుడికి రావడం మా ఒంటరి తనాన్ని బాగు చేస్తుంది. ఎందుకు ఒంటరిగా ఉందాం? ఇంటికి రండి – సంఘానికి! మళ్ళీ చరణము పాడండి!

ఇంటికి రండి సంఘానికి భోం చెయ్యండి, మధుర సహవాసానికి కూడండి; అది శ్రేష్టము, భోజనానికి కూర్చున్నప్పుడు!

II. కాని, రెండవది, గుడికి రావడం మిమ్ములను రక్షింపదు.

ఒక పాత సువార్తీకుడు చెప్పవాడు, "గుడికి వెళ్ళడం మిమ్ములను క్రైస్తవుని చెయ్యదు గేరేజి లోని కెళ్తే వాహనంలోనికి వెళ్లినట్టు కానట్టుగా." ఆ విషయంలో అతడు సరియే. ప్రతి ఆదివారం గుడికి వెళ్తున్నాం కాబట్టి రక్షింపబడ్డాం అనుకునే వారితో ఆయన మాట్లాడుచున్నాడు. ఈనాడు లాస్ ఎంజిలాస్ లో అలాంటి వాడు ఎక్కువ లేరు. కొద్దిమంది "ఆధునిక" ప్రజలు మన పట్టణంలో అలా అనుకుంటారు. వారికి రక్షణ విషయంలో తప్పుడు నిరీక్షణ ఉంది.

కాని ఈ ఉదయాన ఎవరో ఒకరుండవచ్చు, నశించు సంఘ పిల్లవాడిలా ఆలోచించే వారు. మీ హృదయంలో అనుకోవచ్చు, "ఇప్పుడు సంఘానికి వస్తున్నాను. నేను బాగున్నాను" ఓ, కాదు! అలా అనుకోవద్దు! గుడికి రావడం నిన్ను క్రైస్తవుని చెయ్యరు గేరేజికి వెళ్తే వాహనము లోనికి వెళ్లినట్టు కానట్టుగా! నేను చెప్పింది విని ఒకతడు అన్నాడు, "నేను గుడికి రాను." ఆ తలంపు సాతాను నుండి వస్తుంది! గుడిలో ఉండడం నిన్ను రక్షింపదు – కాని గుడిలో ఉండడం సువార్త బాధలో నిన్ను ఉంచుతుంది, అది రక్షింపబడడానికి దారి తీస్తుంది! సువార్త బోధ వినడానికి మీరు గుడికి రావాలి!

క్రీస్తు అన్నాడు, "మీరు తిరిగి జన్మించాలి" (యోహాను 3:7). రక్షింప బడడానికి నూతన జన్మ అనుభవాన్ని పొందాలి.

రక్షణ కృప చేతనే. మానవ పనులు నిన్ను రక్షింపవు – గుడికి రావడం కూడ మార్చబడడానికి ఒకటే మార్గము. యేసు క్రీస్తు నొద్దకు నేరుగా రావడం, ఆయన దైవ కుమారుడు. యేసు అన్నాడు,

"సమస్త భారము మోయుచున్న వారలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ జేతును" (మత్తయి 11:28).

రక్షణ కృప ద్వారా మాత్రమే, క్రీస్తు నందలి విశ్వాసము ద్వారానే. నీవు యేసు నొద్దకు వచ్చి హృదయమంతటిలో ఆయనను నమ్మాలి, "నీతి కలుగునట్లు మనష్యుడు హృదయంలో విశ్వసించును" (రోమా 10:10). యేసు నొద్దకు వచ్చుట ద్వారా మార్చబడ్డారు. గుడి హాజరు మాత్రమే నిన్ను రక్షింప జాలదు.

మన పాఠ్యభాగము చెప్తుంది,

"మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను" (అపోస్తలుల కార్యములు 2:47).

మీరు నిజంగా రక్షింపబడుట ద్వారా "సంఘములో చేర్చబడుతారు." యేసును నమ్ముట ద్వారా మీరు రక్షింపబడతారు.

"ప్రభువైన యేసు నందు విశ్వాసము ఉంచుము, నీవు రక్షింపబడుదువు" (అపోస్తలుల కార్యములు 16:31).

మూడవ చరణము "భోజనానికి ఇంటికి రండి" పాడండి.

ప్రజలు పట్టించుకోని పెద్ద పట్టణము;
కొద్దిగా ఇస్తారు ప్రేమ చూపించరు.
కాని ఇంటికి రమ్ము యేసు నొద్దకు మీకు తెలుస్తుంది,
బల్లపై భోజనము ఉంటుంది సహవాసము పంచబడుతుంది!
ఇంటికి రండి సంఘానికి భోం చెయ్యండి, మధుర సహవాసానికి కూడండి;
అది శ్రేష్టము, భోజనానికి కూర్చున్నప్పుడు!

III. మూడవది, గుడికి రావడం మిమ్ములను సువార్త బోధ క్రింద ఉంచుతుంది.

అపోస్తలుడైన పౌలు అన్నాడు,

"వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించు వాడు లేకుండా వారెట్లు విందురు?" (రోమా 10:14).

పేతురు బోధ పెంతేకోస్తూ దినాన దేవుడు ప్రజలను రక్షించాడు (అపోస్తలుల కార్యములు 2:37-41). అప్పుడు వారు సంఘములో చేర్చబడిరి (అపోస్తలుల కార్యములు 2:41, 47).

"ఆ దినమందు ఇంచుమించు మూడువేలమంది చేర్చబడిరి" (అపోస్తలుల కార్యములు 2:41)

పేతురు బోధ ద్వారా రక్షింపబడివారు సంఘములో చేర్చబడ్డారు.

సువార్త బోధ నేను నమ్ముతాను! ఈ సంఘములో ప్రతి ఆదివారం రెండు సార్లు బోధిస్తాను. నాకు తెలుసు ఈనాడు సువార్త బోధ పాతబడి పోయింది. కాని నేను "హంగులో" ఉండడం నేను అంతగా పట్టించుకోను! యవనులైన మీరు రక్షింపబడడానికి నేను బోధించాలి! పాతకాలపుసువార్త ప్రతి ఆదివారము ఆరాధనలో బోధింపబడకపోతే మనం ఉజ్జీవాన్ని ఎన్నడు చూడలేము!

కొరిందు సంఘముతో పౌలు ఇలా అన్నాడు,

"మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము" (I కొరిందీయులకు 1:23).

ఇతరులు ప్రజలు వినోదానికి ఒక కథ చెప్తారు. ఇతరులు సుదీర్ఘ లేఖనాల వివరణ ఇస్తారు. కొందరు 15 నిమిషాల "ప్రేరేపిత ప్రసంగాలు" చెప్తారు. "కాని మనము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము" (I కొరిందీయులకు 1:23). ఇక్కడ బాప్టిస్టు టేబర్నేకల్ లో మనము ఇంకా "సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తాము" (I కొరిందీయులకు 1:23). "కాని మనము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తాం." ఇతరులు ఏమి చేస్తున్నా సరే, మనము ప్రతి ఆదివారము సువార్తను బోధిస్తున్నాము!

అది ప్రజలను నిస్సారులనుగా చేయదా? అది మన ప్రజలను నిస్సారులనుగా చేయుట లేదా! మన సంఘములో నాకు తెలియని మంచి క్రైస్తవులు ఉన్నారు. వారిలో చాలామంది ప్రతి ఆదివారము ఉదయము రాత్రి, నా భోధ క్రింద మార్పునొందారు. ఆదివారము ఉదయము సాయంకాలము, నా బోధచే భుజింపబడ్డారు. నా సువార్త బోధ ద్వారా వారు అద్భుత క్రైస్తవులుగా తయారయ్యారు, ఆదివారము ఉదయము రాత్రి.

మన పరిచారకుడు, గ్రిఫిత్ గారు, నా సువార్త బోధ కింద రక్షింపబడ్డాడు – అతడు అద్భుత దైవజనుడు. మన సహాయ సంఘ కాపరి, డాక్టర్ చాన్, నా సువార్త బోధ కింద రక్షింపబడ్డాడు, అతడు అద్భుత దైవజనుడు. డాక్టర్ కాగన్, మన సహాయక సంఘ కాపరి, మార్పిడి తరువాత ఇక్కడకు వచ్చాడు, 38 సంవత్సరాల నుండి ప్రతి ఆదివారము ఉదయము సాయంకాలము నా సువార్త బోధ వింటున్నాడు. అతడు మీరెప్పుడు కలవని శ్రేష్టమైన క్రైస్తవుడు. డాక్టర్ కాగన్ ప్రుథొమ్ గారు తప్ప, మన సంఘములో ప్రతి నాయకుడు నా సువార్త బోధ ద్వారా రక్షింపబడ్డారు. వారు ఆదివారము ఉదయము రాత్రి, సువార్త ప్రసంగాలు తప్ప ఏమి వినలేదు, పూర్తీ క్రైస్తవ జీవితమంతా. వారు అద్భుత క్రైస్తవులు. వారు పాతకాలపు సువార్త బోధ ద్వారా బలమైన క్రైస్తవులు అయ్యారు!

కాదు, సువార్త బోధ మిమ్ములను నిస్సారులను చేయుచు – నిస్సార సువార్త బోధ అయితే తప్ప! డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్ ప్రతి ఆదివారము రాత్రి ఆదివారము ఉదయము కూడ – లండన్ లో తన గొప్ప సంఘములో సువార్త బోధించాడు. అతడు ఇరవై శతాబ్దపు గొప్ప బోధకునిగా పరిగణింపబడ్డాడు. ఈ మధ్య ఆయన సువార్త ప్రసంగపు టేపు విన్నాను. అది అత్యద్భుతం! ఉత్తేజ పరిచేది! అలాంటి సువార్త బోధ నిన్ను మార్చడానికి దేవునిచే ఉపయోగింప బడడమే కాకుండా – నిన్ను అది బలమైన క్రైస్తవునిగా కడుతుంది.

సువార్త బోధ నిన్ను రక్షిస్తుంది, ఒక క్రైస్తవునిగా నిర్మిస్తుంది, బైబిలు కాలములో చేసినట్టు. అపోస్తలుల కార్యములలో, ఒకటి తప్ప, ప్రతి ప్రసంగము సువార్త ప్రసంగము. అపోస్తలుడైన పౌలు అన్నాడు,

"నేను యేసు క్రీస్తును అనగా, సిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప, మరి దేనిని మీ మద్య నేరుగా కుందునని నిశ్చయించు కొంటిని" (I కొరిందీయులకు 2:2).

అవును, ఇంటికి రండి గుడికి. కాని భోధ విని యేసు నొద్దకు రండి. పశ్చాత్తాప పడి యేసు క్రీస్తును నమ్మండి. ఆయన రక్తము ప్రతి పాపము నుండి మిమ్ములను శూర్దులనుగా చేస్తుంది! మీ పాప ప్రాయశ్చిత్తానికి ఆయన సిలువపై మరణించాడు. నీకు నిత్య జీవము ఇవ్వడానికి ఆయన మృతులలో నుండి లేచాడు! ఆయన దగ్గరకు వచ్చి ఆయనను విశ్వశించుడి – రక్షింపబడండి! నా బోధ వినండి, పెంతేకోస్తూ దినాన ఆ ప్రజలు చేసినట్టు, మరియు యేసు క్రీస్తు మిమ్ములను కూడ రక్షిస్తాడు! పాటల కాగితములో ఆఖరి పాట పాడండి, "భోజనానికి ఇంటికి రండి."

ఇంటికి రమ్ము, యేసు నొద్దకు బల్ల పరచబడింది;
భోజనానికి ఇంటికి రండి మనం రొట్టె విరుద్ధాం.
యేసు మనతో ఉన్నాడు, ఇలా చెప్పబడనివ్వండి,
భోజనానికి ఇంటికి రండి మనం రొట్టె విరుద్ధాం!
సంఘానికి వచ్చి భుజించండి, మధుర సహవసములో కూడండి;
అది శ్రేష్టము, భోజనానికి కూర్చున్నప్పుడు!

సహవాసము మాధుర్యము మీ స్నేహితులు ఇచ్చట ఉంటారు;
బల్లపై కూర్చుంటాం, మన హృదయాలు ఆనందంతో నిండుతాయి.
యేసు మనతో ఉన్నాడు, ఇలా చెప్పబడ నివ్వండి,
భోజనానికి ఇంటికి రండి మనం రొట్టె విరుద్ధాం!
సంఘానికి వచ్చి భుజించండి, మధుర సహవసములో కూడండి;
అది శ్రేష్టము, భోజనానికి కూర్చున్నప్పుడు!

ప్రజలు పట్టించుకోని పెద్ద పట్టణము;
కొద్దిగా ఇస్తారు ప్రేమ చూపించరు.
కాని ఇంటికి రమ్ము యేసు నొద్దకు మీకు తెలుస్తుంది,
బల్లపై భోజనము ఉంటుంది సహవాసము పంచబడుతుంది!
ఇంటికి రండి సంఘానికి భోం చెయ్యండి, మధుర సహవాసానికి కూడండి;
అది శ్రేష్టము, భోజనానికి కూర్చున్నప్పుడు!

ఇంటికి రమ్ము, యేసు నొద్దకు బల్ల పరచబడింది;
భోజనానికి ఇంటికి రండి మనం రొట్టె విరుద్ధాం.
యేసు మనతో ఉన్నాడు, ఇలా చెప్పబడనివ్వండి,
భోజనానికి ఇంటికి రండి మనం రొట్టె విరుద్ధాం!
సంఘానికి వచ్చి భుజించండి, మధుర సహవసములో కూడండి;
అది శ్రేష్టము, భోజనానికి కూర్చున్నప్పుడు!
("భోజనానికి ఇంటికి రండి" డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్, జూనియర్ చే, స్వరము "పావురపు రెక్కలపై").
(“Come Home to Dinner” by Dr. R. L. Hymers, Jr.,
      to the tune of “On the Wings of a Dove”).

డాక్టర్ చాన్, దయచేసి ప్రార్ధనలో నడిపించండి.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి. దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రుదోం: అపోస్తలుల కార్యములు 2:41-47.
ప్రసంగము ముందు పాట బెంజమిన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్:
"ఆ అనుభందము ఆశీర్వదింపబడును గాక" (జాన్ ఫలీట్ చే 1740-1817).
“Blest Be the Tie That Binds” (by John Fawcett, 1740-1817).


స్థానిక సంఘము యొక్క ప్రాముఖ్యత

THE IMPORTANCE OF THE LOCAL CHURCH

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని సంఘములో అనుదినము వారితో చేర్చుచుండెను" (అపోస్తలుల కార్యములు 2:47).

(అపోస్తలుల కార్యములు 8:1; ఎఫెస్సీయులకు 5:23; అపోస్తలుల కార్యములు 16:31)

I.         మొదటిది, సంఘానికి రావడం నీ ఒంటరి తనాన్ని బాగు చేస్తుంది, ఆదికాండము 2:18; లూకా 14:23.

II.        కాని, రెండవది, గుడికి రావడం మిమ్ములను రక్షింపదు, యోహాను 3:7; మత్తయి 11:28; రోమా 10:10; అపోస్తలుల కార్యములు 16:31.

III.       మూడవది, గుడికి రావడం మిమ్ములను సువార్త బోధ క్రింద ఉంచుతుంది, రోమా 10:14; అపోస్తలుల కార్యములు 2:41; I కొరిందీయులకు 1:23; 2:2.