Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




ఈనాటి పోరాటానికి ప్రార్ధనా యోధులు

PRAYER WARRIORS FOR TODAY’S BATTLE!
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము సాయంత్రము, ఆగష్టు 9, 2015
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, August 9, 2015


నేను నేర్చుకున్న అతి ప్రాముఖ్యమైన విషయము ఏమిటి? క్రైస్తవ్యము వాస్తవము అని నేర్చుకున్నప్పుడు అని చెప్తాను! క్రైస్తవ్యము వాస్తవమని లాస్ ఎంజిలాస్ మొదటి చైనీయ బాప్టిస్టు సంఘములో, డాక్టర్ తిమోతి లిన్ నుండి నేర్చుకున్నాను. ఆయన అరుదైన బోధకుడు, దేవుని నిజంగా విశ్వసించాడు. ఒక వ్యక్తి దేవుని నిజంగా విశ్వసిస్తే అది అతని వేరుగా పెడుతుంది. అది అతని ఇతర బోధకుల నుండి వేరుగా, మెరుగుగా ఉంచుతుంది.

డాక్టర్ తిమోతి లిన్ చైనా నుండి సంఘ కాపరి. పెద్దవాడయ్యే వరకు అమెరికా రాలేదు. అతడు నమ్మిందీ బోధించింది "జీవించే క్రైస్తవ్యము." లేదు, ప్రజలు అనుకున్నట్టుగా అతడు పెంతేకొస్తు గాని ప్రసిద్ధి గాంచిన వాడు – గానీ కాదు అయిననూ అతడు ఆత్మా నింపుదలను, దెయ్యాలను, దేవదూతలను, దేవుని నుండి వచ్చు "ప్రసంగాలను," నిజ ప్రార్ధనలకు నిజ జవాబులను, ఉజ్జీవములొ పరిశుద్ధాత్మ క్రుమ్మరింపును నమ్మాడు. అప్పుడు, అతడు "క్రైస్తవ్యము" జీవింపులో. అది యవనస్తునిగా చైనాలో నేర్చుకున్నాడు. అతని తండ్రి కాపరిగా తన జీవిత కాలమంతా అక్కడ గడిపాడు.

చాలామంది నాతో అన్నారు, "సంఘము నుండి బయటకు వచ్చిన వారందరిలో మీరు ఎక్కువగా డాక్టర్ లిన్ లా ఉన్నారని." డాక్టర్ కాగన్ గత గురువారం మళ్ళీ చెప్పాడు. దానిని ప్రశంశగా భావిస్తాను ఎందుకంటే డాక్టర్ లిన్ "జీవించే" క్రైస్తవ్యాన్ని విశ్వసించాడు.

నాకు నిజంగా అన్ని సంవత్సరాలుండడం కష్టమనిపించింది, ఎందుకంటే చాలాకాలము నేనొక్కడినే తెల్లవాడిని. కాని నాకు తెలుసు నేను ఉండాలని, నేను అక్కడ ఉండడం దేవుని చిత్తమని. అక్కడ నేను డాక్టర్ తిమోతి లిన్ నుండి నాకు, తెలిసినదంతా నేర్చుకున్నాను. ప్రతి అంశముపై అతనితో ఏకీభవించను, కాని నాకు అతడు ఇష్టము అనుకుంటాను. నేను జీవించే క్రైస్తవ్యమును విశ్వసిస్తాను!

మీరు నిజంగా డాక్టర్ లిన్ లా ఆలోచించాలి ఎఫేస్సీయులకు ఆరవ అధ్యాయము, రెండవ భాగము అర్ధము చేసుకోవాలంటే. నేను చాల వ్యాఖ్యానాలు చదివాను అవి ఈపాఠ్యభాగముపై తికమకపడ్డాయి. కొన్ని నిమిషాలలో అది వివరిస్తాను. దయచేసి ఎఫేస్సీయులకు 6:10 చూడండి. స్కోఫీల్ద్ పఠన బైబిలులో 1255 వ పేజీలో ఉంది. 6వ అధ్యాయము, 10 నుండి 12 వచనాలు చదువుతున్నప్పుడు దయచేసి నిలబడండి.

ఇది ఎఫెస్సీలో క్రైస్తవులకు పాల్ ఉపదేశకుడు యొక్క చివరి ప్రకటన. ఆ తొలి క్రైస్తవులు ఈనాడు మనకు గొప్పగా ఉపయోగపడుతున్నారు.

I. మొదటిది, అపోస్తలుడు ఆత్మీయ యుద్ధాన్ని గూర్చి మాట్లాడుతున్నాడు.

"తుదకు, ప్రభువు యొక్క, మహా శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా, మనము పోరాడునది శరీరులతో కాదు. ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులను లోకనాధులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను, పోరాడుచున్నాము" (ఎఫెస్సీయులకు 6:10-12).

కూర్చోండి. అపోస్తలుడు మనము యుద్ధ భూమిలో నివసిస్తున్నామని చెప్తున్నాడు. క్రైస్తవ జీవితమూ యుద్ధ జీవితము. దెయ్యముతోను తనవారితోను మనము యుద్ధములో ఉన్నాము. డాక్టర్ ఎ. డబ్ల్యూ. టోజర్ ఒక వ్యాసము వ్రాసాడు, ఈ ప్రపంచము: ఆట భూమా, లేక యుద్ధ భూమా? (Christian Publications, 1988, pp. 1-4). డాక్టర్ టోజర్ చెప్పారు ,

         ఆదిమ దినాలలో...మనష్యులు ప్రపంచాన్ని యుద్ధ భూమిగా భావించారు. తన తండ్రులు పాపాన్ని దయ్యాన్ని నరకాన్ని నమ్మారు, ఒక శక్తిగా మరియు మరోవైపు దేవుని నీతిని పరలోకాన్ని నమ్మారు. స్వాభావికంగా, ఈ శక్తులు ఒకదానికొకటి వ్యతిరేకమై, లోతైన సమాధి, సమాధాన పర్చబడలేని పగగా మారాయి. మానవుడు, మనతండ్రులు ఏదో ఒకటి, ఎన్నుకోవాలి – మధ్యస్తంగా ఉండలేడు. అతనికి అది జీవితమూ లేక మరణము, పరలోకము లేక నరకము, దేవుని వైపు ఉండడానికి ఎన్నుకుంటే, దేవుని శత్రువులతో బహిరంగ యుద్ధాన్ని ఊహించాలి. ఆ యుద్ధము వాస్తవము భయంకరము జీవితకాలమంతా ఉంటుంది [ఈ భూమిపై], ఐబిఐడి., పేజి 2.

కాని డాక్టర్ టోజర్ అన్నాడు అది మన కాలములో మారిందని. అతనన్నాడు, "ఈ ప్రపంచము యుద్ధ స్థలము బదులు ఆట స్థలము అనే అభిప్రాయము చాలామంది ప్రాధమిక క్రైస్తవులచే ఆచరణలో అంగీకరింపబడుతుంది" (ఐబిఐడి., పేజి 4).

నేననుకుంటాను డాక్టర్ టోజర్ సరియే అని మనం ఒప్పుకోవాలి. ఈనాడు సువార్తిక క్రైస్తవులు దెయ్యాలు సాతాను గూర్చి విన ఇష్టపడడం లేదు. దుష్ట శక్తులతో సైనికుల వలే యుద్ధములో ఉన్నారని వారు తలంచ ఇష్టపడడం లేదు. ముఖ్యకారణము నేననుకుంటాను వారిలో చాలామంది మారలేదు. ఆత్మీయ సంఘర్షణకు వారి కళ్ళు గుడ్డివయ్యాయి. "ప్రభువు నందు బలవంతులైయుండుడి" అని అపోస్తలుడు చెప్పడం, వారు విన్నప్పుడు అతని భావము వారికి అర్ధం కావడం లేదు. వారు ఎందుకు తెలుసుకోరు? ఎందుకంటే వారు "ప్రభువు నందు" లేదు కాబట్టి – వారు యేసు ప్రభువు "నందు" లేరు, కాబట్టి వారు ఆయన నుండి శక్తి పొందుకోలేరు! డాక్టర్ ఎస్. డి. ఎఫ్. సాల్మండ్ అన్నాడు బలపడడం అనేది "క్రీస్తుతో ఐక్యంగా ఉన్నప్పుడు మాత్రమే వీలవుతుంది" (“The Epistle to the Ephesians,” The Expositor’s Greek New Testament, volume III, Eerdmans, n.d., p. 382).

డాక్టర్ వేర్నోన్ మెక్ గీ అన్నాడు, "మీరు మీ స్వంత శక్తితో గాని బలముతో గాని దెయ్యాన్ని జయించలేరు. పౌలు తప్పకుండా రెండు గ్రీకు పదాల భావన చెప్తున్నాడు: పెనో ప్లియన్ [ఆయుధము] దేవుని యొక్క అవసరము అది మేథోడియాన్ దెయ్యము యొక్క [వ్యూహాలు, కుతంత్రాలు, లేక పద్ధతులను] ఎదుర్కోడానికి అందుబాటులో ఉంటాయి. ‘ప్రభువు నందు బలవంతులై యుండుడి’ – అక్కడే మీరు నేను శక్తిని పొందుకుంటాము" (J. Vernon McGee, Th.D., Thru the Bible, volume 5, Thomas Nelson Publishers, 1983, pp. 278, 279; note on Ephesians 6:10, 11).

మొదటగా మీరు విశ్వాసము ద్వారా రక్షింపబడడానికి క్రీస్తు నొద్దకు రావాలి. మళ్ళీ మళ్ళీ ప్రార్ధన ద్వారా ఆయన యొద్దకు రావాలి "ఆయన శక్తిని పొందుకోడానికి," సిలువ సైనికుడిగా!

II. రెండవది, అపోస్తలుడు మన శత్రువులను గూర్చి మాట్లాడుచున్నాడు.

ఎఫెస్సీయులకు 6:12 చదువు చుండగా దయచేసి నిలబడండి.

"ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులను లోకనాధులతోను, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడు చున్నాము" (ఎఫెస్సీయులకు 6:12).

కూర్చోండి.

ఈ వచనములో పౌలు మాట్లాడిన దయ్యాలను గూర్చి మొదటి రెండవ శతాబ్దపు క్రైస్తవులు గమనిక కలిగియున్నారు. ఆదిమ సంఘములో సువార్తీకరణ అనే పుస్తకములో డాక్టర్ మైకల్ గ్రీన్ అన్నాడు ఆదిమ క్రైస్తవులు ఏమి నమ్మారంటే

ప్రపంచమంతా పరిసరాలన్నీ దెయ్యలతో నిడుకున్నాయి; విగ్రహారాధన మాత్రమే కాదు, కాని ప్రతి జీవన శైలి వాటిచే పరిపాలింపబడింది. అవి సింహాసనాలపై కూర్చిని, ఉయ్యాలల చుట్టూ తిరిగాయి. భూమి వాస్తవానికి నరకము, అది దేవుని సృష్టి అయినప్పటికిని. ఈ నరకాన్ని దయ్యాలను ఎదుర్కోడానికి క్రైస్తవులు కనిపించని ఆయుధాల కొరకు అజ్ఞాపించారు... క్రైస్తవులు లోకములోనికి శూరులుగా వెళ్ళారు...అది క్రైస్తవుని నమ్మకాన్ని బలపరచింది అది ఏమంటే యేసు సిలువపై దుష్ట శక్తులను జయించాడు, ఆయన రక్షణ ఇవ్వడానికి వచ్చాడు (Michael Green, Ph.D., Evangelism in the Early Church, Eerdmans, 2003, pp. 263, 264).

మన రోజుల్లో, డాక్టర్ జె. వేర్నోన్ మెక్ గీ అన్నాడు,

శత్రువు ఆత్మీయము. సాతాను దుష్ట శక్తులను నడిపిస్తుంది. యుద్ధము ఎక్కడుందో మనము గుర్తించాలి. నేననుకుంటాను సంఘము ఆత్మీయ పోరాటము సన్నివేశాన్ని చూడలేక పోతుంది (ibid., p. 280; note on Ephesians 6:12).

అదే విషయాన్ని డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్ చెప్పాడు. అతనన్నాడు, "ఈనాటి సంఘ స్థితికి ముఖ్యకారణము [చెడు] దయ్యము మర్చిపోబడుదము...సంఘము లాగబడి నిర్వీర్యమవుతుంది; దానికి సంఘర్షణను గూర్చి తెలియనే తెలియదు" (The Christian Warfare, The Banner of Truth Trust, 1976, pp. 292, 106).

గత సంవత్సరము దక్షిణ బాప్టిస్టులు 200,000 మందిని కోల్పోవడంలో ఆశ్చర్యము లేదు. ఈ సంవత్సరము ఇంకా ఎక్కువ మందిని పోగొట్టుకుంటున్నారు. సువర్తికులుగా పిలువబడే వీరు గుడుల నుండి గుంపులు గుంపులుగా వెళ్లి పోతున్నారు. ఐస్ఐస్ (ISIS) గురుంచి భయబడు తున్నారు, లైంగిక విప్లవమును గూర్చి భయపడుతున్నారు, ఇరాన్ గూర్చి, ఒబామాను గూర్చి, ప్రతి దాని గూర్చి భయపడుతున్నారు! మనం క్రీస్తు శక్తితో కప్పబడి ఉంటే మనం భయపడ నవసరము లేదు!

III. మూడవది, అపోస్తలుడు కవచమును గూర్చి మాట్లాడుతున్నాడు.

వచనము 13 నుండి 17 వరకు చదువుచుండగా దయచేసి నిలబడండి,

"అందు చేతను మీరు ఆ పద్దిన మందు వారిని ఎదిరించుటకు, సమస్తము నెరవేర్చిన వారి నిలబడుటకును శక్తి మంతులగునట్లు, దేవుడిచ్చి సర్వాంగ కవచమును, ధరించుకొనుడి. ఎలాగనగా, మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నీతియును మైదురువు; తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలబడుడి; ఇవన్నియు గాక, విశ్వాసము డాలు పట్టుకోనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని భాణములన్నింటిని ఆర్పుటకు శక్తి మంతులవుదురు. మరియు రక్షణకు శిర స్త్రానమును, దేవుని వాక్యమును, ఆత్మఖడ్గమును ధరిచుకొనుడి" (ఎఫెస్సీయులకు 16:13-17).

కూర్చోండి.

అపోస్తలుడు చెప్పింది గమనించండి, "దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి" – చెయ్యడం కాదు, కాని తీసుకోవడం. కవచమంతా ఉచితంగా తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. డాక్టర్ మెక్ గీ అన్నాడు, "కవచములోని ప్రతి భాగము క్రీస్తును గూర్చి మాట్లాడుతుంది." ఆయన సత్యము (వచనము 14ఎ). ఆయన రుననీతి (వచనము 14 బి). నీతిమార్గములలో మనలను నడిపిస్తాడు (వచనము 15). ఆయన మనకేదియు. ఆయన మన రక్షణ శిరస్త్రాణము (వచనము 16). ఇవన్ని ఆయుధాలే. క్రీస్తు మన ఆయుధమని ఇవి చెప్తున్నాయి. ఆయననే నమ్మితే మీరు మారతారు. ఆయన సన్నిధిలో నివసిస్తే ఆయన ఈ ఆయుధాలతో నిన్ని కప్పుతాడు. క్రీస్తు మన ఆయుధము. నీవాయనను నమ్మినప్పుడు మారతావు, ఆయన సన్నిధిలో నివసిస్తే ఆయన ఈ ఆయుధాలతో నిన్ను కప్పుతాడు.

అపోస్తలుడు అంటున్నాడు, "దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును, ధరించుకొనుడి" (వచనము 17). అందుకే మీరు బైబిలు పఠించి వీలున్నంత కంఠస్తము చెయ్యాలి. నా జీవితంలో కొన్ని సమయములు ఉన్నాయి, నేను కంఠత పెట్టిన వచనము సాతానును ఓడించడానికి నాకు సహాయ పడింది. ఆ రాత్రి మర్చిపోలేను "ప్రియుని యందు మనలను స్వీకరించెను" (ఎఫెస్సీయులకు 1:6) నా దగ్గరకు వచ్చి నిస్పృహ నుండి నన్ను పూర్తిగా రక్షించింది. ఎక్కువ బైబిలు వచనాలు కంఠత పట్టే కొద్ది ఎక్కువగా ఆత్మ ఖడ్గము దేవుని వాక్యమని తెలుసుకుంటాము. నా జీవిత వచనము ఫిలిప్ఫీయులకు 4:13,

"నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను."

యాభై సంవత్సరాలకు పైగా ఆ వచనము భయాలకు బలహీనతలకు వ్యతిరేకంగా ఖడ్గముగా ఉంది. నేను నిరాశా పరిస్థితులలో ఉన్నప్పుడు కీర్తనలు ఇరవై ఏడు సార్లు నా ఖడ్గముగా నిలిచింది, ప్రత్యేకంగా ఆఖరి రెండు వచనాలు. మీరు వాటిని గుర్తు చేసుకోవాలి. విశ్వాస పోరాటంలో అవి సహాయ పడతాయి.

IV. నాల్గవది, అపోస్తలుడు చిరవగా, యోధుని యుద్ధాన్ని గూర్చి, మాట్లాడుచున్నాడు.

18 మరియు 19 వచనాలు చదువుతుండగా దయచేసి నిలబడండి.

"ఆత్మవలన ప్రతి సమయము నందున ప్రతి విధమైన ప్రార్ధనలను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి; మరియు దేని నిమిత్తము, రాయబారినై సంకెళ్ళలో ఉన్నానో, ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు, నేను మాట్లాడ నోరు తెరచును" (ఎఫెస్సీయులకు 6:18, 19).

కూర్చోండి.

లినార్డ్ రావెన్ హిల్ చెప్పింది గుర్తొస్తుంది. ఎక్కడ చెప్పాడా గుర్తు లేదు, కాని నా మనస్సులో నిలిచిపోయింది. రావెల్ హిల్ అన్నాడు, "ప్రార్ధన ఒక యుద్ధము." ప్రార్ధన యుద్ధానికి మనలను సిద్ధ పరచదు. కాదు! ప్రార్దనే ఒక యుద్ధము!

డాక్టర్ మెర్లిల్ ఎఫ్. ఉంగర్ డల్లాస్ వేదాంతి సెమినరీలో ఉపన్యాసకుడుగా ఉన్నాడు. అతడు అద్భుతమైన పుస్తకము రాసాడు అది, బైబిలు డెమోనోలొజీ (Kregel Publications, 1994 reprint). అది ప్రమాదకర పుస్తకమని కొంతమంది లౌకిక బోధకులు చెప్పడం విన్నాను. బోధకులు ప్రమాదకరం అని నేననుకుంటాను! దయ్యాలు గురుంచి పరిశుద్ధాత్మను గూర్చి, ప్రార్ధనా శక్తికి గూర్చి తెలుసుకోకుండా, వారు ఎలా బోధిస్తారు? గత సంవత్సరము దక్షిణ బాప్టిస్టులు 200,000 మంది పారిపోవడంలో ఆశ్చర్యం లేదు! చాల స్వతంత్ర బాప్టిస్టు సంఘాలు ఆదివారము సాయంకాలము ఆరాధనలు మూసేయడంలో ఆశ్చర్యం లేదు! మన బాప్టిస్టు సంఘాలు యవనులలో 88% మందిని లోకానికి వదిలేయడంలో ఆశ్చర్యం లేదు! దెయ్యాలను గూర్చి, ప్రార్ధనా శక్తిని గూర్చి ఆలోచింపని బోధకులు, మన సంఘాలలో స్వధర్ములను ఆపడానికి ఏమి చెయ్యలేరు. కాని ప్రసిద్ధ వేత్త డాక్టర్ విల్బర్ యం. స్మిత్ దయ్యలపై ఉంగర్ పుస్తకాన్ని గూర్చి ఎక్కువగా ఆలోచించాడు. డాక్టర్ స్మిత్ అన్నాడు, "[అది] ఈనాడు ప్రతి సువార్త సేవకుని చేతిలో ఉండాలని అనిపించింది" (Introduction to Dr. Unger’s book, p. xi). డాక్టర్ విల్బర్ యం. స్మిత్ సరియే అన్నాడు. మీరు అది చదువుతుంటే, లేక వెబ్ సైట్ లో చదువుతుంటే, ఉంగర్ పుస్తకము కొని అది లేని కాపరికి ఇవ్వాలని మిమ్ములను ప్రోత్సహిస్తున్నాను.

డాక్టర్ ఉంగర్ సరిగ్గా అన్నాడు, "[ఎఫెస్సీయులకు 6:18, 19] లో ఉన్న ప్రార్ధనాంశము యోధుని వనరులుగా పరిగణింపకూడదు...వేరే ఆయుధముగా గాని...ఎఫెస్సీ 6 లో ఉన్న ప్రార్ధన అది నిజ సంఘర్షణ దానిలో విరోధి [సాతాను] పరాజితుడవుతాడు [ఓడిపోతాడు] జయము వస్తుంది, మనకు మాత్రమె కాదు, ఇతరుల కొరకు విజ్ఞాపన చేయడం ద్వారా కూడ" (ఐబిఐడి., పేజి 223; ఎఫెస్సీ 6:19, 20 పై; వ్యాఖ్యానము).

బ్రిటిష్ కాపరి పాల్ కుక్ ఆకాశము నుండి అగ్ని (ఎవాంజెలి కల్ ప్రెస్ బుక్స్, 2009) వ్రాసాడు. ప్రతి ఒక్కరు అది చదవాలి. అతనన్నాడు, "మనము పరిశుద్ధాత్మ విడుదల కొరకు మళ్ళీ మళ్ళీ ప్రార్ధించాలి...అంటే మనం ప్రార్ధిస్తూ అడుగుతూ ఉండాలి. అది సంఘము చేసింది, కనుక మనము చెయ్యాలి. దేవుని పని అంతా దానిపై ఆధారపడి ఉంది...నూతన నింపుదల [శక్తి] పరిశుద్ధాత్మ నుండి...మనము [మనము] ఆత్మ నూతన శక్తి కొరకు వెదుకుతూ ఉండాలి" (Rev. Paul E. Cook, Fire From Heaven: Times of Extraordinary Revival, ibid., pp. 120, 121).

ప్రతిరోజూ మీరు ప్రార్ధించడం ఒక ప్రాముఖ్య విషయము – ముఖ్యంగా ఉపవాసపు రోజు, శనివారము. డాక్టర్ జాన్ ఆర్. రైస్ అన్నాడు, "ఉపవాస ప్రార్ధనకు జవాబుగా పరిశుద్ధాత్మ శక్తి వస్తుంది" (John R. Rice, D.D., Prayer: Asking and Receiving, Sword of the Lord Publishers, 1970, p. 225).

"ఆత్మ వలన ప్రతి సమయ మందును ప్రతి విధమైన ప్రార్ధనను విజ్ఞాపనము చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండుడి" (ఎఫెస్సీ 6:18).

చూడండి, ప్రార్ధన ఒక యుద్ధము. మీరు నశించు వారి నిమిత్తము వివరంగా (సాధ్యమైతే) పేరు పేరున ప్రార్ధించండి. దేవుని ఆత్మ వారిని మన సంఘాలలోనికి తెచ్చేటట్టు, సువార్త సత్యానికి వారికి కనువిప్పు కలిగేటట్టు, పాపపు ఒప్పుకోలు వచ్చేటట్టు, ఆయన ప్రశస్త రక్తము ద్వారా వారి పాపాలు కడగబడేటట్టు ప్రార్ధించండి. ప్రార్ధన ఒక యుద్ధము. నేను ఏమి బోధించాలో దేవుడు చూపించేటట్టు, అవిశ్వాసుల హృదయాల్లో బోధ పని చేసేటట్టు, సహవాస సమయము శక్తివంతంగా ఉండేటట్టు ప్రార్ధించండి. బహిరంగ ప్రార్ధనలలో, ఒకరు నడిపించేటప్పుడు మీరు ప్రోత్సహించేటట్టు చూసుకోండి. వ్యక్తి చేస్తున్న ప్రార్ధనపై మీ మనస్సు పెట్టి – ప్రతి విజ్ఞాపన తరువాత "ఆమెన్" చెప్పండి. మరియు, ఉపవాస దినము శనివారము ఎక్కువ సార్లు ప్రార్ధించేటట్టు చూసుకోండి. శనివారము మీరు ఉపవసించేటప్పుడు, మీరు తెలుసుకోవలసిన కనీస విషయాలు ఇస్తున్నాను. ఆమెన్. మీరు సాతానుతో యుద్ధములో పోరాడే ప్రార్ధనా యోధులు! మీరు గొప్పవారు! దేవుడు మిమ్ములను దీవించును గాక!

నశించుచున్న వారినికి కొన్ని మాటలు చెప్పకుండా ముగించలేను. దేవుని ఉగ్రత నుండి పాపులను రక్షించడానికి యేసు సిలువపై మరణించాడు. పాపులకు నూతన జన్మ నిత్య జీవము ఇవ్వడానికి యేసు మృతులలో నుండి లేచాడు. దేవుని ఆత్మ పని లేకుండా ఇవి మీకు నిజము కానేరవు.

కాబట్టి, వారమంతా, ప్రార్దిస్తున్నపుడు, పాపుల రొట్టెల కొరకు ప్రార్ధించండి. దేవునికి ప్రార్ధించండి పరిశుద్ధాత్మ దిగి మన ఆరాధనలో వారి అంధకార మనస్సులను వెలిగించి, పాపపు ఒప్పుకోలు వారికి కలిగేటట్టు చేసి, ప్రభువైన యేసు క్రీస్తు అవసరత వారు గ్రహించేటట్టు ప్రార్ధించండి! ఇప్పుడు లూకా 11:13 చూడండి. స్కోఫీల్ద్ పఠన బైబిలులో 1090 పేజీలో ఉంది. నేను చదువుతుండగా దయచేసి నిలబడండి.

"కాబట్టి, మీరు చెడ్డ వారి యుండి, మీ పిల్లలకు ఎంతో నిశ్చయంగా అనుగ్రహించుననెను: పరలోక మందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించును?" (లూకా 11:13).

ఇక్కడ ఒక జాబితా ఉంది ఈవారం ప్రార్ధించడానికి, ముఖ్యంగా శనివారము నాడు.


1.    మీ ఉపవాసము రహస్యంగా (సాధ్యమైనంత వరకు) ఉండాలి. మీరు ఉపవాసమున్నట్టు అందరికి చెప్పుకోవద్దు.

2.    బైబిలు చదవడంలో సమయం గడపండి. అపోస్తలుల కార్యముల గ్రంథములో కొన్ని భాగాలు చదవండి (ముఖ్యంగా ఆరంభంలోనివి).

3.    శనివారపు ఉపవాసములో యెషయా 58:6 కంటస్తం చెయ్యండి.

4.    దేవునికి ప్రార్ధించండి 10 మంది కొత్తవారిని వచ్చేటట్టు వారు మనతో ఉండేటట్టు.

5.    మన మారని యవనస్తులు మార్పు నొందేటట్టు ప్రార్ధించండి. యెషయా 58:6 లో చెప్పినది దేవుడు వారికి చేసేటట్టు ప్రార్ధించండి.

6.    ఈ రోజు (ఆదివారము) తొలి సందర్శకులు వచ్చే ఆదివారము వచ్చేలా ప్రార్ధించండి. వీలుంటే పేరు పేరు వరుసన ప్రార్ధించండి.

7.    వచ్చే ఆదివారము ఏమి బోధించాలో దేవుడు నాకు చూపించే టట్టు ప్రార్ధించండి – ఉదయము సాయంత్రము కూడ.

8.    ఎక్కువ నీరు త్రాగండి. గంటకు ఒక గ్లాసు. మొదట్లో ఒక పెద్ద కప్పు కాఫీ త్రాగవచ్చు ప్రతి రోజు తాగే అలవాటు ఉంటే. శీతల పానీయాలు, శక్తి పానీయాలు లాంటివి, త్రాగవద్దు.

9.    ఏవైనా వైద్య పర ప్రశ్నలుంటే ఉపవాసముండే ముందు వైద్యుని కలవండి. (మీరు డాక్టర్ క్రైగ్ టన్ చాన్ లేక డాక్టర్ జుడిత్ కాగన్ మన గుడిలో కలువవచ్చు). ఒకవేళ తీవ్ర సమస్య ఉంటే ఉపవాసము చేయవద్దు, మధుమేహము కాని అధిక రక్తపోటు గాని ఉంటే. శనివారము ఈ మానవుల నిమిత్తము ప్రార్ధించండి.

10. శుక్రవారము సాయంత్ర భోజన అనంతరము మీ ఉపవాసము ఆరంభించండి. శుక్రవారము భోజనము చేసిన తరువాత ఏమి తినవద్దు శనివారము సాయంకాలము 5:30 వరకు.

11. గుర్తుంచుకొండి మీరు ప్రార్దించవలసిన ప్రాముఖ్య విషయము మన సంఘములో నశించుచున్న యవనస్తులు మార్పు నొందేటట్లు – ఈ సమయంలో కొత్తగా వచ్చే యవనస్తుల కొరకు, మనతో ఎన్నటికి ఉండేలాగున ప్రార్ధించండి.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి. దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రుదోం: ఎఫెస్సీయులకు 6:10-19.
ప్రసంగము ముందు పాట బెంజమిన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్:
"నేను నీ కొరకు ప్రార్ధిస్తున్నాను" (ఎస్. ఓ’మల్లే క్లావ్ చే, 1837-1910).
“I Am Praying For You” (by S. O’Malley Clough, 1837-1910).


ద అవుట్ లైన్ ఆఫ్

ఈనాటి పోరాటానికి ప్రార్ధనా యోధులు

PRAYER WARRIORS FOR TODAY’S BATTLE!

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"తుదకు, ప్రభువు యొక్క, మహా శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా, మనము పోరాడునది శరీరులతో కాదు. ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులను లోకనాధులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను, పోరాడుచున్నాము" (ఎఫెస్సీయులకు 6:10-12).

I.          మొదటిది, అపోస్తలుడు ఆత్మీయ యుద్ధాన్ని గూర్చి మాట్లాడుతున్నాడు, ఎఫెస్సీయులకు 6:10.

II.         రెండవది, అపోస్తలుడు మన శత్రువులను గూర్చి మాట్లాడుచున్నాడు, ఎఫెస్సీయులకు 6:12.

III.        మూడవది, అపోస్తలుడు కవచమును గూర్చి మాట్లాడుతున్నాడు, ఎఫెస్సీయులకు 6:13-17; ఎఫెస్సీయులకు 1:6; ఫిలిప్పీయులకు 4:13.

IV.        నాల్గవది, అపోస్తలుడు చిరవగా, యోధుని యుద్ధాన్ని గూర్చి, మాట్లాడుచున్నాడు, ఎఫెస్సీయులకు 6:18, 19; లూకా 11:13.