Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




విడుదల లేక దండన

DELIVERANCE OR DAMNATION
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము సాయంకాలము, మే 3, 2015
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, May 3, 2015

"భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతిపరులను తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్ధుడు" (II పేతురు 2:9).


నీరో చక్రవర్తి రోమా పట్టణాన్ని 64 ఎ.డి.లో అగ్నితో దహించాడు. నీరో (54-68 ఎ.డి.) క్రూరమైన భయంకర వ్యక్తి. తన కుటుంబ సభ్యులను చాలామందిని హత మార్చాడు. రోమా భగ్నమవుచున్నప్పుడు అతడే అంటించాడని అనుమానించారు. వేరే వారిని నిందించాలని చూసాడు. అగ్నికి కారకులు క్రైస్తవులని నిందించాడు! రెండవ శతాబ్దపు ఆరంభంలో టేసిటస్ (56-117) అన్నాడు, "క్రైస్తవులని ఒప్పుకున్న వారు బందింపబడ్డారు... వారి చావులలో...అడవి జంతువుల చర్మాలతో కప్పబడ్డారు, కుక్కలతో చంపబడ్డారు, సిలువ వేయబడ్డారు కాల్చబడ్డారు – చీకటిలో రాత్రులలో కాల్చబడ్డారు" (Tacitus, Annals 15:44, early second century). కొన్ని నెలల తరువాత పేతురు IIవ పేతురు వ్రాసాడు. అప్పటి సంప్రదాయము చెప్తుంది పేతురు తన కోరికతో తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడని – ఎందుకంటే యేసులా సిలువ వేయబడడానికి అనర్హుడిగా తలంచాడు.

భయంకర శ్రమలలో, వందలాది క్రైస్తవులు చనిపోయారు. నీరో స్తంభాలపై క్రైస్తవులను కట్టేసి తన తోటలో వెలుతురుకు వారిని కాల్చేవాడు! పేతురు బందింపబడి సిలువ వేయబడక మునుపు II పేతురు వ్రాసాడు.

II పేతురులో అపోస్తలుడు బైబిలు ప్రేరణ అధికారాన్ని గూర్చి మాట్లాడాడు (II పేతురు 1:19-21). ఆయన హెచ్చరిస్తున్నాడు "మీ మధ్య అబద్ధపు బోధలు ఉంటాయి" (II పేతురు 2:1-3). ఆయన గుర్తు చేస్తున్నాడు దేవుడు "పాపమూ చేసిన దూతలను తీర్పు తీర్చాడని" (2:4), దేవుడు "సొదొమొగొమొర్రా పట్టణాలను బూడిదగా మార్చాడని" (2:6). కాని ఆయన "నీతిమంతుడైన లోతును, భక్తిహీనుల [సరియైన నడవడి] లేని దుష్టులతో విసిగి విడిపించాడు" (2:7). అప్పుడు అపోస్తలుడు మన పాఠ్యభాగము ఇస్తున్నాడు,

"భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతిపరులను తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్ధుడు" (II పేతురు 2:9).

ఈ పాఠ్య భాగముపై మాట్లాడే ముందు II పేతురును సాతాను ఎంతగా అసహ్యించు కుంటుందో మీరు తెలుసుకోవాలి. దెయ్యము ఈ చిన్న గ్రంధాన్ని క్రొత్త నిబంధనలోని ఏ ఇతర గ్రంధము కంటే ఎక్కువగా అసహ్యించుకుంటుంది. మీరు హాలి ఉడ్ కి గాని లాస్ వేగాస్ కు గాని వెళ్ళనక్కర లేదు పనిచేసే దెయ్యాన్ని చూడడానికి. మీరు చెయ్యల్సింది కాలిఫోర్నియా, పాసదేనాలోని పుల్లర్ సెమినెరీకి వెళ్ళాలి. అమెరికాలోని పెద్ద సెమినెరీలన్ని ఈనాడు బైబిలుపై దాడి చేస్తున్నాయి. అది బహుశా II పేతురు పుస్తకాన్ని క్రొత్త నిభందనలోని పుస్తకాలన్నింటి కంటే ఎక్కువగా అసహ్యించు కుంటున్నాయి. ఉత్తర శాన్ ప్రాన్సిస్కో సదరన్ బాప్టిస్టు సెమినేరీలో నేను చదువుచున్నప్పుడు, అక్కడి బోధకులు II పేతురును "మోసమయము" అని పిలిచేవారు. బైబిలును తిరస్కరించే స్వతంత్ర బోధకులు సంవత్సరాలుగా ఇలా చెబుతూనే ఉన్నారు. కాని డాక్టర్ ఏ. టి. రోబర్ట్ సన్, గొప్ప గ్రీకు కొత్త నిబంధన వేదాంతి, II పేతురును సమర్ధించాడు. ఆయన చెప్పాడు దాని గూర్చిన వ్యాఖ్యానాలు వచనాలు అరిసిటైడ్స్ లో ఉన్నాయని (చనిపోయాడు సి. 134 ఏ.డి), జస్టిస్ మార్టర్ లో (చనిపోయాడు సి. 165 ఏ.డి.), ఇరేనాయెస్ లో (130-202), ఇగ్నేషియస్ లో (35-107), క్లెమెంట్ ఆఫ్ రోమ్ (చనిపోయాడు 99 ఏ.డి.), అతనాసియాస్ (296-373), అగస్టిన్ (354-430) మరియు గొప్ప సంస్కర్త మార్టిన్ లూథర్ (1483-1546), (A. T. Robertson, D.D., Litt.D., Word Pictures in the New Testament, volume VI, Broadman Press, 1933, pp. 139-146 – Dr. Robertson’s defence of II Peter).

డాక్టర్ రాబర్ట్ సన్ చెప్పాడు, "ఈ పత్రికలో, కొత్త అభిప్రాయాలు లేవు...అది పూర్తిగా చాదస్తపు నింపే బోధతో కూడినది" (ఐబిఐడి., పేజి 140). డాక్టర్ జె. వెర్నోన్ మెక్ గీ, అమెరికా సుపరిచిత ప్రియ బైబిలు బోధకుడు, అన్నాడు, "ఈనాడు నిర్ధారించబడింది పేతురు ఈ పత్రిక వ్రాసాడని" II పేతురును గూర్చి (J. Vernon McGee, Th.D., Thru the Bible, volume V, Thomas Nelson Publishers, 1983, p. 714).

కాని స్వతంత్రులు పుల్లర్ సెమినరీలో ముక్కలుగా చెయ్యడాన్ని వాక్కుగా భావిస్తారు! డాక్టర్ హెన్రీ యం. మోరిస్ అన్నాడు, "ఈ తిరస్కారము [ఇది] ఎందుకంటే [II పేతురును] గూర్చి సంఘములో అబద్ధపు బోధకులను గూర్చిన గొప్ప ఖండింపును బట్టి...[II] పేతురు ‘మోసపూరిత సాధనాలను గద్ధిస్తుంది’ (II పేతురు 1:16), వేషధారణ, క్రీస్తును కాదనే బోధకులు (II పేతురు 2:1), లాభానికి [డబ్బును ప్రేమించే] బోధకులు (II పేతురు 2:3, 15), నిందాస్మదులు (II పేతురు 2:13, 19), ముఖ్యంగా అవతారికత సమాంతరత్వత (II పేతురు 3:3-6)" (Henry M. Morris, Ph.D., The Defender’s Study Bible, World Publishing, 1995, p. 1401).

సాతాను అతని అబద్ధపు బోధకులు II పేతురుపై దాడి చేయడంలో ఆశ్చర్యము లేదు! దెయ్యము II పేతురును అసహ్యించుకోవడానికి మరియొక కారణము అది రెండు బలమైన ప్రకటనలిస్తుంది బైబిలు యొక్క ప్రేరేపణ కచ్చితత్వతను గూర్చి, II పేతురు 1:19-21 లో (మరియొకటి II తిమోతి 3:15-17). దెయ్యము II పేతురును అసహ్యించుకోవడంలో ఆశ్చర్యంలేదు!

II పేతురులో బలమైన మాంసముంది! 1961 సెప్టెంబర్ లో నేను బయోలా (ఇప్పుడు యూనివర్సిటీ) లో చేరాను. ఆ సెమిస్టర్ లో కాలేజీలో వారమంతా ఉదయపు ఆరాధన లుండేవి. ఆ సంవత్సరము ప్రత్యేక బోధకుడు డాక్టర్ చార్లెస్ జె. ఉడ్ బ్రిడ్జి. డాక్టర్ ఉడ్ బ్రిడ్జి పుల్లర్ సెమినరీలో ప్రీతి పాత్ర బోధించే సభ్యుడు. రెండు సంవత్సరాల ముందు రాజీనామా చేసాడు ఎందుకంటే పుల్లర్ స్వతంత్రత వైపు వెళ్తుందని, బైబిలు అధికార తిరస్కృతి అది. బహుశా పుల్లర్ అధికారాలు దానిని తిరస్కరించారు. వారు డాక్టర్ ఉడ్ బ్రిడ్జిను తొందర సృష్టించే వాడని, చెడ్డ విషయాలను ఆపాదించారు. కాని ఎవరూ క్షమాపణ చెప్పలేదు – కొత్త సువార్తికులు కూడా. యాభై సంవత్సరాలు గడిచాయి, డాక్టర్ ఉడ్ బ్రిడ్జి ఊహించింది నిజమైంది. ఈ రోజు పుల్లర్ రాబ్ బెల్ లాంటి బోధకులను తయారు చేస్తుంది. ఆయన ఒక పుస్తకం రాసాడు ప్రతి ఒక్కడు (హిట్లర్ కూడా) పరలోకానికి వెళ్తాడని. ఇటీవల ఆయన ఇంకొక పుస్తకము వ్రాసాడు అందులో అశ్లీల లైంగిక దృశ్యాలు చూపించాడు. డాక్టర్ ఉడ్ బ్రిడ్జి 1950 లోనే ఇది చూసాడు. డాక్టర్ చార్లెస్ జె. ఉడ్ బ్రిడ్జి! (చప్పట్లు) కొడదాం.

డాక్టర్ ఉడ్ బ్రిడ్జి బయోలాకు వచ్చి ప్రతిరోజూ వారం పాటు ఆరాధనలో బోధించాడు. II పేతురును నేరుగా బోధించాడు! మొదటిసారిగా అలా బోధించడం విన్నాను! నేను కేవలం సాధారణ ప్రసంగాలు విన్నాను, "మాంసము" లేనివి. అమోఘం! డాక్టర్ ఉడ్ బ్రిడ్జి II పేతురును బోధిస్తున్నప్పుడు నా ఏకాగ్రత నిలిపాను – మొదటి అధ్యాయములో బైబిలు కచ్చితత్వము; రెండవ అధ్యాయములో అబద్ధపు ప్రవక్తలు; పాపం చేసిన దేవదూతలు వెళ్ళ గోట్టబడడం; గొప్ప ప్రళయము సొదొమొ గోమోర్రాలు కాలిపోవడం! గొప్ప శక్తితో ఆయన బోధించాడు. ఆ వారంలో గురువారం నేను మారాను – సెప్టెంబరు 28, 1961 – యేసు నామానికే స్తుతి!! ఆరోజు నుండి నా పని నిర్దిష్టమైంది! మొదటి రోజే మారిన తరువాత నాకు తెలుసు నేను బైబిలుపై స్వతంత్రుల దాడులను నేను వ్యతిరేకిస్తానని, రక్షణపై, పాపముపై! అప్పుడే నాకు తెలుసు, ఈ ఉదయం కూడా నాకు తెలుసు! యేసు నామమునకు స్తుతి!

పేతురు చెప్పాడు బైబిలు "ప్రవచనాత్మకము" (II పేతురు 1:19). పేతురు అన్నాడు అబద్ధపు బోధకులు సంఘాలలో పుడతారు వారు అధైవికతను నాశనాన్ని తెస్తారు (II పేతురు 2:1-3). పేతురు అన్నాడు దేవుడు గొప్ప జల ప్రళయంలో ప్రపంచమంతటికి తీర్పు తీర్చాడు, "కాని నోవహును ఎనిమిది మందిని రక్షించాడు" (II పేతురు 2:5). పేతురు అన్నాడు దేవుడు అగ్నిని కురిపించి "నీతిమంతుడైన లోతును సొదొమొ మాటల నుండి విడిపించాడు" (II పేతురు 2:6). పేతురు అన్నాడు "సోదోము అగ్ని నుండి వచ్చి లోతు నుండి వెలువడినది" (II పేతురు 2:7). ఇప్పుడు పేతురు మన పాఠ్యభాగము ఇస్తున్నాడు,

"భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతిపరులను తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్ధుడు" (II పేతురు 2:9).

ఔను, అయ్యా! పేతురు తన విషయాన్ని నిరూపించుకున్నాడు! ప్రభువుకు తెలుసు జల ప్రళయంలో నశించు లోకాన్ని ముంచి నోవహును ఎలా రక్షించాలో. ప్రభువుకు తెలుసు నీతిమంతుడైన లోతును రక్షించి, సొదొమొ పట్టణాన్ని కాల్చి బూడిద చెయ్యాలో! కనుక,

"భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతిపరులను తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్ధుడు" (II పేతురు 2:9).

ఇంకొక మాటల్లో, పాత దినాల్లో ఎంతశక్తి ఉందో ఈ రోజు కూడా దేవునికి అదే శక్తి ఉంది!

I. మొదటిది, భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దేవునికి శక్తి ఉంది.

"ప్రభువుకు తెలుసు భక్తులను శోధనలలో నుండి ఎలా తప్పించాలో..."

ఆయన చేస్తున్నది దేవునికి తెలుసు – ఆయన అది చేయగలడు! నేను బాలుడుగా ఉన్నప్పుడు జార్జి బెవేర్లీషి గొప్ప స్వరము వినడానికి ఇష్టపడే వాడిని ఈ క్రింది మాటలు,

అప్పుడు నా ఆత్మ పాడుతుంది, నా రక్షకుడైన దేవుడున్నాడని,
నీ కార్యము ఎంత గొప్పది, నీ కార్యము ఎంత గొప్పది!
అప్పుడు నా ఆత్మ పాడుతుంది, నా రక్షకుడైన దేవుడున్నాడని,
నీ కార్యము ఎంత గొప్పది, నీ కార్యము ఎంత గొప్పది!

దేవుడు అధిక శక్తిగలవాడు! దేవుడు నియంత్రించువాడు. అవును, గొప్ప దుష్టత్వము లోకములో ఉంది. కాని చెడు ఉంది దేవుడు అనుమంతించాడు కనుక. ఎందుకు అనుమతించాడు? నాకు తెలియదు. అది అంత సామాన్యము. నాకు తెలియదు. కాని అనూహ్యమైన, అగమ్యగోచరమైన దేవుని మనసు, చెడును అనుమతిస్తాడు.

"ఆయన తీర్పులు శోదింప నెంతో అవశక్యము, ఆయన మార్గము లేంతో అగమ్యములు!" (రోమా 11:33).

"భక్తులను శోధనలో నుండి ఎలా తప్పించాలో దేవునికి తెలుసు!" రోమా పట్టణంలో ఆది క్రైస్తవులు తప్పకుండా గొప్ప భయంకర శోధనల ద్వారా శ్రమల ద్వారా వెళ్ళారు. నేను చెప్పినట్టు, నీరో స్థంభాలకు పైన కట్టి, సజీవ దహనము చేసాడు. ప్రతి రాత్రి కాలుతున్న క్రైస్తవులతో తన తోటను వెలిగించేవాడు.

ఒకరు అన్నాడు, "అది విరుద్ధము. ఆయన వారిని విడుదల చెయ్యలేదు." మీరు తప్పు. ఆయన వారిని విడుదల చేసాడు "శోధన నుండి." ఆయన వారికి శక్తినిచ్చాడు శ్రమల ద్వారా వెళ్ళడానికి, అగ్ని గుండా వెళ్ళడానికి శక్తినిచ్చాడు! గొప్ప పాతపాట ఇలా అంటుంది!

భయంకర శ్రమలలో మీ మార్గము ఉంటుంది,
   నా కృప, పూర్తిగా చాలు, మీ అనుగ్రహము ఉంటుంది;
అగ్ని నీకు హాని చెయ్యదు, నేనే నియమిస్తాను,
   నీ చిత్తము కరగడానికి, నీ బంగారము శుద్ధి చేయబడడానికి.
("ఎంత గట్టి పునాది" జార్జి కీత్, 1638-1716, "కె" ఇన్ రిప్పిన్స్ పాటల ఎన్నిక, 1787).
   (“How Firm a Foundation” George Keith, 1638-1716,
      “K” in Rippon’s Selection of Hymns, 1787).

ఇది నా ఆధిక్యత జీవించు హత సాక్షిని గూర్చి నేను వ్యక్తిగతంగా తెలుసుకోవడం. అతని పేరు రిచర్డ్ వర్మ్ బ్రాండ్. నేనెప్పుడు చూడని గొప్ప క్రైస్తవుడతాను, ఆయన నాకు బాగా తెలుసు. పాస్టర్ వర్మ్ బ్రాండ్ కమ్యూనిస్టు చెరసాలలో పదునాలుగు సంవత్సరాలు బంధింపబడ్డాడు. సువార్త బోధించినందుకు కమ్యూనిస్టు భటులు చిత్రహింసలు పెట్టారు. ఎర్రని వేడి ఇనుప ఊసలతో పద్దెనిమిది గాయాలు ఆయన శరీరముపై ఉన్నాయి. శ్రమపడు సంవత్సరాలన్నీ ఆయన ఇతర శ్రమపడు ఖైదీలకు సువార్త పంచుకున్నాడు, చాలామంది రక్షింపబడ్డారు. రెండు సంవత్సరాలు ఏకాంత స్థలములో ఉంచారు. మానవ స్వరము వినలేదు. ఆహారములో వారు పెట్టే మందులకు ఆయన మతి స్థిమితము కోల్పోయాడు. చివరకు ఆయనతో చెరసాలలో ఉన్న మిగిలిన వారికి ఆయన సువార్త బోధించడం ప్రారంభించాడు. మూర్సే కోడ్ లో బైబిలు వచనాలు ప్రార్ధనలు వారికిచ్చాడు.

చివరకు "నాల్గవగది" – "చావుగది" లో ఉంచారు. అక్కడ వదిలేసారు, క్షయవ్యాధితో చనిపోయారు. "నాల్గవగది"లో ఉన్నవారు బ్రతకలేదు. చనిపోవడానికి అక్కడకు పంపిస్తారు. కాని పాస్టరు వర్మ్ బ్రాండ్ జీవించాడు. ఆ "చావుగది"లో చనిపోతున్న ఖైదీలను యేసు క్రీస్తు నొద్దకు నడిపించాడు. ఆయన అన్నాడు, "ఆ గది స్వఅర్పణతో పునరుద్దరింపబడిన విశ్వాసము నింపబడింది. ఆ క్షణాలలో మన చుట్టూ దేవదూతలు ఉంటాయి."

నేను నిరుత్సాహంగా ఉన్నప్పుడు లేక విచారంగా ఉన్నప్పుడు నేను రిచర్డ్ వర్మ్ బ్రాండ్ పుస్తకము క్రీస్తు కొరకు చిత్ర హింసలు తీసుకొని పేజీలు చదువుతాను. గతవారం అతని వేరే పుస్తకము చదివాను, దేవుని భూగర్భము (లివింగ్ సేక్రిఫిస్ బుక్ కంపని, 2004). ఈ పుస్తకాలూ భయంకరము. క్రైస్తవుల చిత్రహింసలను గూర్చిన వివరాలు ఉంటాయి. కాని ఎప్పుడు నన్ను ప్రోత్సహిస్తాయి. మన పాఠ్యభాగాన్ని అనుభవించిన తరువాత, రిచర్డ్ వర్మ్ బ్రాండ్ ను ఎరుగుట, నాకు ప్రోత్సాహము. ఈ పాఠ్యభాగము గొప్ప ప్రోత్సాహము ఇస్తుంది, "ప్రభువుకు తెలుసు భక్తులను శోధనలో నుండి ఎలా తప్పించాలో..." (II పేతురు 2:9).

వేలకొలది క్రైస్తవులు హింసింపబడ్డారు ముస్లీములచే ఇప్పుడు, మన కాలములో చంపబడ్డారు. చావునుండి తప్పించు కోవడానికి ఈ మాటలు వారు చెప్పాలి: "దేవుడు లేదు అల్లా తప్ప మహమ్మదు అతని ప్రవక్త." చెప్పడానికి నిరాకరించి ముస్లీములయ్యారు. వారి గుడులు కాల్చబడ్డాయి. ఇల్లు దగ్ధమయ్యాయి. చాలామంది శిరచ్చేదనము చేయబడ్డారు. చాలామంది సజీవ దహనమయ్యారు. అయినను వారి విశ్వాసాన్ని వదిలి పెట్టడానికి నిరాకరించారు. ముస్లీము ప్రపంచంలో వేలమంది క్రీస్తు వైపు తిరుగుచున్నారు, అది చాల ప్రమాదకరమైనప్పటికిని. మీరు కంప్యూటర్ లో www.persecution.com. వారి కథలు కొన్ని చదవవచ్చు. అనుభవము ద్వారా వారికి తెలుసు చాలామంది పాశ్చాత్య సంఘ సభ్యులకు తెలియనిది – "ప్రభువుకు తెలుసు భక్తులను శోధనలలో నుండి ఎలా తప్పించాలో...".

లోతైన నీళ్ళ ద్వారా వెళ్ళాలని పిలిచినప్పుడు,
   విచార నదులు పొంది పొర్లావు;
నేను నీతో పాటు ఉంటాను, శ్రమలలో ఆశీర్వదించడానికి;
   లోతైన నిస్పృహలో నిన్ను శుద్దీకరించడానికి.

మూడు వారాల క్రితం ఈ గుడి 40 వ వార్షికోత్సవం ఆచరించుకున్నాం. మనం గొప్ప స్తుతి సమయము, నవ్వు సమయం కలిగియున్నాం! విడియో చూసిన వారన్నారు ఎంత గొప్ప సంఘము మనకుందని! కాని వారికి తెలియదు ఈ సంఘానికి జన్మనివ్వడానికి మన ఎంత శ్రమల ద్వారా వెళ్ళామో. "ద 39," వారికి తెలియదు, గుడికి చెల్లించిన వారు 400 మంది వదిలిపెట్టినప్పుడు, మానసిక బాధ శ్రమకు లోనయ్యారు. "ద ముప్పై తొమ్మిది" రెండున్నర మిలియను డాలరు భవనానికి చెల్లించారు. ఇప్పుడు ఆ శ్రమ ముగిసింది. దేవుడు దాని ద్వారా మనలను నడిపించాడు. కాని భవిష్యత్తులో ఇతర శ్రమలుంటాయి, కొన్ని బహుశా ఇంకా చెడ్డవి. కాని మనం భయపడం ఎందుకంటే "ప్రభువుకు తెలుసు భక్తులను శోధనలో నుండి ఎలా తప్పించాలో..." (II పేతురు 2:9).

II. రెండవది, ప్రభువు దుర్నీతి పరులను తీర్పు దినము వరకు కావలిలో ఉంచును.

"భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను తీర్పు దినము వరకు, కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్ధుడు" (II పేతురు 2:9).

అపోలో జెటిక్స్ పుస్తకములో, కాబట్టి నిలబడు, గొప్ప డాక్టర్ విల్ బర్ యం. స్మిత్ రాబోవు తీర్పు దినమును గూర్చి ఇలా అన్నాడు,

లేఖనాలు తప్పనిసరిగా మాట్లాడుతున్నాయి రాబోవు తీర్పును గూర్చి, మనము పాపంచేసాం ఈ భయంకర దైవిక సత్యాన్ని గూర్చిన బోధను దొంగిలించడం ద్వారా... చాలామందిమి.... భయపడతాము నిలబడి తీర్పు దినాన్ని గూర్చి లేఖన భాషను ఉపయోగించడానికి. మన దీవించు ప్రభువు మళ్ళీ మళ్ళీ "తీర్పు దినము" అనే పదాన్ని వాడాడు... అపోస్తలుడైన పేతురు "తీర్పుదినము" గూర్చి మాట్లాడాడు, మరియు "తీర్పుదినము దుష్టులైన వారి నాశనము." అపోస్తలుడైన యోహాను "తీర్పుదినము" గూర్చి, మరియు "మృతులు తీర్పు తీర్చబడు సమయము అన్నాడు" (Wilbur M. Smith, D.D., Therefore Stand, W. A. Wilde Co., 1945, p. 443).

అపోస్తలుడైన యోహాను ఆఖరి తీర్పును గూర్చి. ఇలా చెప్పాడు,

"మరియు గొప్పవారేమి కొద్దివారేమి, మృతులైన వారందరూ, ఆ సింహాసనం ఎదుట నిలబడియుండుట చూచితిని; అప్పుడు గ్రంధములు విప్పబడెను: మరియు జీవ గ్రంధమును, వేరొక గ్రంధము విప్పబడెను: ఆ గ్రంధముల యందు వ్రాయబడియున్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున, మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాల లోకమును వాటి వశముననున్న మృతులనప్పగించెను: వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పుపొండెను. మరణమును మృతుల లోకమును అగ్ని గుండములో పడవేయబడెను. ఈ అగ్ని గుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంధమందు వ్రాయబడినట్టు కనబడని యెడల వారు అగ్ని గుండములో పడవేయబడెను" (ప్రకటన 20:12-15).

"అగ్నిగుండము" శిక్ష నుండి తప్పించుకొనే ఒకే మార్గము పశ్చాత్తాప పడి ప్రభువైన యేసు క్రీస్తును విశ్వసించడం. ఆయన నీ పాప ప్రాయశ్చిత్తం చెల్లించడానికి సిలువపై మరణించాడు. ప్రతిపాపము నుండి నిన్ను కడగడానికి ఆయన తన ప్రశస్త రక్తము కార్చాడు. ఆయన లేచాడు, శరీర ఎముకలతో, మృతులలో నుండి నీకు నిత్య జీవము ఇవ్వడానికి. కాని ఇప్పుడు ఈ జీవితంలో, నీవు ఆయనను విశ్వసించాలి. చనిపోయిన తరువాత, రక్షింపబడడానికి, చాల ఆలస్యమైపోతుంది.

"భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతిపరులను తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్ధుడు" (II పేతురు 2:9).

"భక్తులు" అనగా పశ్చాత్తాపపడి ప్రభువైన యేసు క్రీస్తును విశ్వసించిన వారు. "దుర్నీతి పరులు" అనగా ఆయనను నమ్మడానికి నిరాకరించువారు. చాల ఆలస్యము కాకముందే నీవు యేసు వైపు మరలాలని నా ప్రార్ధన! ఆమెన్.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రుదోం: II పేతురు 2:1-9.
ప్రసంగము ముందు పాట బెంజిమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్:
"మా తండ్రుల విశ్వాసము" (ఫ్రెడరిక్ డబ్ల్యూ. ఫాబెర్ చే, 1814-1863).
“Faith of Our Fathers” (by Frederick W. Faber, 1814-1863).


ద అవుట్ లైన్ ఆఫ్

విడుదల లేక దండన

DELIVERANCE OR DAMNATION

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతిపరులను తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్ధుడు" (II పేతురు 2:9).

(II పేతురు 1:19-21; 2:1-3, 4, 6, 7; 1:16; 2:1, 3, 15, 13, 19; 3:3-6;
II పేతురు 1:19; 2:1-3, 5, 6, 7)

I. మొదటిది, భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దేవునికి శక్తి ఉంది,
II పేతురు 2:9ఎ; రోమా 11:33.

II. రెండవది, ప్రభువు దుర్నీతి పరులను తీర్పు దినము వరకు కావలిలో ఉంచును,
II పేతురు 2:9బి; ప్రకటన 20:12-15.