Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




చెప్పన శక్యము కాని వరము

THE UNSPEAKABLE GIFT
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము సాయంకాలం, జనవరి 25, 2015
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, January 25, 2015

"చెప్పనశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము" (II కొరిందీయులకు 9:15).


1994 లో అర్ధరాత్రి భూకంపము మా ఇంటిని కదిపేసింది. మాఇంటిలో ఉన్న వస్తువుల విలువను గూర్చి అది నన్ను ఆలోచింప చేసింది. అగ్ని ప్రమాదమును గూర్చి ఆలోచించాను. కాలిపోతే ఎలా ఉండేది? తప్పించు కోడానికి మూడు నాలుగు నిమిషాలే సమయముంటే ఎలా ఉండేది? నాతో ఏమి తీసుకెళ్ళే వాడిని? అప్పుడనుకున్నాను, నా పడక గదిలోనికి వెళ్లి డ్రాయరు తెరచి, తొలిసారిగా కత్తిరించిన మాకుమారుల తలవెంట్రుకలు తీసుకొని, బల్లపై నుండి కాశ్యము బూటులను తీసికొనే వాడిని. ఇంకొక నిమిషము సమయముంటే, నా తల్లి కొడుకులు ఫోటో తీసికొనే వాడిని. కొన్ని క్షణాలుంటే నా భార్య పెళ్లి దుస్తులు, మూసి ఉంచిన పెట్టె నుండి తీసుకొనే వాడిని, తరువాత 1934 లో నా తల్లి కివ్వబడిన కొన్ని మట్టి పాత్రల పెళ్లి బహుమతిని తీసుకొనేవాడిని.

ఆ వస్తువుల విలువ ఏంటి? ఏమి కాదు. ఆ పాత పెళ్లి దుస్తులకు $25 డాలర్లు రావచ్చు. మిగిలినవి ధన రూపములో విలువ లేనివి. కాని అవి నాకు వెలకట్టలేనివి! ఆ గొప్ప బహుమతులు మన హృదయాలలో, ఆత్మలలో పెనవేసుకు పోయాయి.

నా మామ్మ చనిపోయాక మరుసటి రోజు తన ఇల్లు కడుగ బడుతుందని వారు నాతో చెప్పారు. అక్కడకు రావడం నాకు ఇబ్బందయింది. ఇంటిలో పరుగెత్తి ఒక వస్తువే తీసుకున్నాను – ద్రాక్షవళ్ళితో ఉన్నకుండ. అది ఆమెకు నచ్చింది, అది మాత్రము తీసుకున్నాను. ఈ ప్రసంగము వ్రాస్తున్నప్పుడు ఆ ద్రాక్షవళ్ళిని చూసాను. ఆ మొక్కను అరవై సంవత్సరాలుగా ఎక్కడికి వెళ్ళినా నాతోనే ఉంచుకున్నాను. రెండు డాలర్ల విలువ కూడ ఉండదు, 15 సంవత్సరాలు బాలునిగా అది తన ఇంటి నుండి తీసుకున్నాను. అది $2 డాలర్లు కూడ ఉండదు, కాని అది నాకు వెలకట్టలేనిది! గొప్ప బహుమానాలు మన హృదయాలలో, అత్మలలో ఉండిపోతాయి.

నా సోదరుడు జానీ తన భార్య చనిపోయినప్పుడు, తన ఇంటికి వెళ్లాను. అది అమ్మబడింది అంతా మరునాడు అప్పగించబడింది. అంతా మొదటి గదిలో పేర్చబడింది. ఎవరో అడిగారు, "నీకేమైనా కావాలా అని?" నేనన్నాను, "అవును, బాతులు ఉన్న ప్లైవుడ్ ముక్క." అది నాకిచ్చారు విచారంగా తిరిగి వచ్చేసాను. ఇప్పటికి అది నా కొడుకు పడక గదిలో వేలాడుతుంది. నేను పదమూడు సంవత్సరాల బాలుడుగా ఉన్నప్పటి నుండి ఆ ఇంటిలో ఉండేది. అది $25 డాలర్లు కూడా ఉండదు, కాని అది నాకు వెలకట్టలేనిది! గొప్ప బహుమానాలు మన హృదయాలలో, అత్మలలో ఉండిపోతాయి.

నా తల్లి ఇల్లు అమ్మబడినప్పుడు, వారు పిలిచి అన్నారు, "నీకేమైనా కావాలంటే, ఈ రోజే తీసుకోవాలి, ఇది ఆఖరి రోజు." అప్పటికే మధ్యాహ్న మైయింది. రెండు మూడు రోజుల ముందు నన్నెందుకు పిలవలేదో చెప్పలేదు! ఒక్క ట్రక్కు అద్దెకు తీసుకున్నాను. తన పాత పియోను, రెండు ప్లాస్టిక్ బాతులు, రెండు ప్లాస్టర్ బస్ట్ లను తీసుకున్నాను – ఒకటి అమెరికాను ఇండియాను ఇంకొకటి స్పానిస్ కౌబాయి. అవన్నీ $200 డాలర్ల కంటే తక్కువే. కానీ వాటిని నా నుండి $10,000 డాలర్లకు కూడా కొనలేరు. అవి వెలకట్టలేనివి నాకు. అవును, గొప్ప బహుమానాలు మన హృదయాలలో, అత్మలలో ఉండిపోతాయి.

పాత పెళ్లి దుస్తులు, రెండు తల సవరాలు, కుండలో ఉన్న ద్రాక్ష వల్లి, పాత రెండు జతల చెక్క వస్తువులు, పాడైన పియానో, గీకివేయబడిన పాత విగ్రహాలు – ప్రపంచానికి అవి నిరుపయోగము – కాని నాకు భాగ్యము కంటే ఎక్కువ! నేను మీకు వివరించలేను, వర్ణించలేను, వాటి విలువ. వెల చూసారా, గొప్ప బహుమానాలు మన హృదయాలలో ఆత్మలలో ఉండిపోతాయి.

ఉన్నత పాఠశాలలో మైక్ అనే స్నేహితుడు ఉండేవాడు. నేను పాఠశాల వదిలాక అతడు నిరాశతో ఆత్మహత్య చేసుకున్నాడు. అతని తల్లిని చూడడానికి వెళ్ళాను. అతడు నా మంచి మిత్రుడని తన తల్లితో చెప్పాను. ఆమె తన కొడుకు ఖరీదైన టైపు రైటర్, అతని బట్టలు ఇవ్వ ప్రయత్నించారు. ఏకైక కుమారుని పోగొట్టుకున్నందుకు ఆమె నిర్ఘాంత పోయి దుఃఖితురాలయ్యారు. ఆమె గొప్ప వారైతే, తప్పకుండా ఆమె ఇలా అని ఉండేవారు, "నాకు బెవెర్లీ హిల్స్ల్ లో భవనం ఉంది. బెంకులో 10 మిలియను డాలర్లు ఉన్నాయి. వెలకట్టలేని డైమండ్ నెక్లెస్ ఉంది. అదంతా ఇచ్చేదాన్ని నా కొడుకు తిరిగి వస్తే." చూసారా, గొప్ప బహుమానాలు మన హృదయాలలో అత్మలలో ఉండిపోతాయి.

అపోస్తలుడైన పౌలు, వ్రాసిన పాఠ్య భాగము చదువుతుంటే, ఆయన అంతరార్ధము నాకు తెలుసు,

"చెప్పనశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము" (II కొరిందీయులకు 9:15).

"చెప్పన శక్యము కాని" మాటకు గ్రీకులో అనెక్ డిగేటోస్ అంటారు. అంటే "పూర్తిగా వర్ణింపబడలేదని, వివరింపలేనిది" (జేమ్స్ స్ట్రాంగ్). అంటే "చెప్పన శక్యము కానిది" (జార్జి రిక్కర్ బెర్రీ). అంటే వివరింప లేని, వర్ణింప లేని, మాటలలో చెప్పలేని నీకివ్వబడిన వరము. అది ప్రభువైన యేసు క్రీస్తును గూర్చి చెప్తుంది – దేవుని ప్రేమ బహుమానము పాపపూరిత, నశించు లోకానికి! అది యేసు, దైవ కుమారుడు! ఈ విధంగా అది ఆలోచించండి.

I. మొదటిది, దేవుని వరమైన క్రీస్తు భూమిని ఒక ప్రత్యేక స్థలంగా చేసింది.

దేవుడు యేసును మన కొరకు పంపినప్పుడు, అది మన చిన్న లోకాన్ని ఒక విశిష్ట స్థలంగా మార్చేసింది. భూమి లాంటిది మరి ఏదియు ఈ సువిశాల విశ్వములో లేదు. భూమి పూర్తిగా విశిష్టమైనది. లెక్కింపలేని నక్షత్రాలు గ్రహాల మధ్యలో, భూమి లాంటిది ఏదియు లేదు. కాని ఎందుకు భూమి ఈ అంతరిక్షంలో మిగిలిన గ్రహాల కంటే వేరుగా ఉంది?

ఒకవేళ మీరంటే, "భూమి వేరుగా ఉంది ఎందుకంటే జీవముంది కాబట్టి," అవిశ్వాసి అనవచ్చు, "కాదు." అతడు అనవచ్చు ఇతర ప్రపంచాలలో గ్రహాలలో కూడా జీవము ఉంది అని. మీరు తర్కము చెయ్యలేదు. అది వాస్తవము కాదని అనలేరు, ఎందుకంటే నిరూపింపలేరు కాబట్టి. ఇతర గ్రహాలలో కూడా జీవము ఉంది. అది మన గ్రహాన్ని వేరుగా చెయ్యలేదు. చివరి విశ్లేషణలో, మన గ్రహాన్ని ప్రత్యేకమైనదిగా విశిష్ట మైనదిగా చేసింది యేసు రాక. దేవుడు నివసించే చూడని లోకాల నుండి, వేరే దృక్పధములో, మూడవ ఆకాశము నుండి, యేసు వచ్చి మన మధ్య నివసించాడు. బైబిలు చెప్తుంది,

"అయితే కాలము సంపూర్ణమైనప్పుడు, దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి, మనము దత్త పుత్రులము కావలెనని లోబడిన వాడాయెను" (గలతీయులకు 4:4).

కాలము సంపూర్ణమైనప్పుడు, "దేవుడు తన కుమారుని పంపెను." ఆయన యేసును పంపెను. గ్రీకు పదము ఎక్స్ సాపోస్టెల్లో (పంపేయడం, పంపుట, బయటికి పంపుట). ఎక్కడ నుండి యేసు పంపబడ్డాడు? ఎక్కడ నుండి పంపబడ్డాడు? ఎక్కడికి పంపబడ్డాడు? ఆయన పరలోకము నుండి, పంపి వేయబడ్డాడు, పంపింపబడ్డాడు! తల్లి మరియ, గర్భములోనికి పంపబడ్డాడు. ఆయన మూడవ ఆకాశము నుండి మన లోకానికి పంపబడ్డాడు. అదే మన లోకాన్ని విభిన్నంగా చేస్తుంది! అదే మన లోకాన్ని విశిష్టంగా చేస్తుంది! యేసు ఇక్కడకు, ఈ గ్రహానికి, ఈ చిన్న భూమికి వచ్చాడు. సర్వ విశ్వానికి నక్షత్రాలకు పరిపాలకుని కుమారుడు, కుమారుడు గ్రహానికి పంపబడ్డాడు, ఎవరి కొరకో కాదు! "దేవుడు ఆయన కుమారుని పంపాడు" ఈ చిన్న దీవికి, ఈ భూగ్రహానికి – ఎవరి కోసమో కాదు! దేవుడు తన కుమారుని ఈ భూమికి పంపాడు, అది మన గ్రహాన్ని వేరే గ్రహాల నుండి వేరు చేస్తుంది ఈ దేవుని ఆశ్చర్యకర అనంత విశ్వములో! క్రీస్తు ఇక్కడకు వచ్చాడు! అదే మనలను వేరుగా చేస్తుంది! "దేవుడు తన కుమారుని పంపాడు," ఆయన "శరీర ధారియై, మన మధ్య నివసించెను, (తండ్రి వలన కలిగిన, అద్వితీయ కుమారుని మహిమ వలే మనము,) ఆయన మహిమను కనుగొంటిమి" (యోహాను 1:14). విలియం బూత్ సాల్వేషన్ ఒకప్పుడు, ఆర్మీ అధినేత. అతని మనమడు ఈ అందమైన పాట వ్రాసాడు,

ఆయన మహిమ నుండి,
      నిత్య జీవించు కథ,
నా దేవుడు రక్షకుడు వచ్చాడు,
      ఆయన పేరు యేసు.
పశువుల పాకలో పుట్టాడు,
      ఆయనే అపరిచితుడులా,
విచారము, కన్నీళ్ళు ఆవేదన కలిగిన వాడు.
("ఆయన మహిమ నుండి" విలియం ఇ. బూత్-క్లిబ్బోర్న్,1893-1969;
విలియం బూత్ మనవడు, సాల్వేషన్ ఆర్మీ సంస్థాపకుడు).
   (“Down From His Glory” by William E. Booth-Clibborn, 1893-1969;
      grandson of William Booth, founder of the Salvation Army).

కాలిఫోర్నియా, ఆరెంజ్ కౌంటిలో, యెర్బా లిండా పట్టణంలో, చిన్న తెల్ల ఇల్లు ఉంది. అది చిన్న రెండు గదులు చిన్న వంట గది మొదటి అంతస్థులో, పైన చిన్న గది ఉన్నాయి. అయినా వేలమంది ఆ చిన్న ఇంటిలోని మొదటి గది వంట గది నుండి నడుచుకు వెళ్ళారు. నేను ఆ చిన్న ఇంటి నుండి 40 సార్లు నడిచాను, సందర్శకులతో. ఎందుకు ఎక్కువ మంది అక్కడకు వస్తారు? ఆ చిన్న ఇంటికి ఎందుకంత ఆకర్షణ? అక్కడ జన్మించిన అతని బట్టి. అమెరికా 37 వ అధ్యక్షుడు, మొదటి అంతస్తులోని చిన్న పడక గదిలో జన్మించాడు. అది ఆ ఇంటికి ప్రత్యేకించి ఇచ్చింది! అక్కడ జన్మించిన అతని బట్టి. ఆయన చనిపోయినప్పుడు, బ్రతికున్న ఐదుగురు అధ్యక్షులు నాలుగు వేలమందితో కూర్చున్నారు, బిల్లీ గ్రేహం తన అంత్యక్రియల ప్రసంగము చేసాడు, ఆ చిన్న ఇంటి ముందు, అక్కడ జన్మించిన తన బట్టి. అధ్యక్షుడు అక్కడ జన్మించాడు. భూమి ఒక విశిష్ట స్థలముగా తీర్చబడింది, విశ్వములో ప్రత్యేక స్థలముగా, ఎందుకంటే యేసు క్రీస్తు దిగి వచ్చి ఇక్కడ జన్మించాడు! ఈ స్థలములో! ఈ గ్రహముపై!

"చెప్పనశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము" (II కొరిందీయులకు 9:15).

II. రెండవది, దేవుని క్రీస్తు అనే వరము మానవ జీవితాన్ని పవిత్ర పరుస్తుంది.

ఆ గొప్ప జల ప్రళయము తరువాత, దేవుడు పితరుడైన నోవహుతో ఇలా మాట్లాడాడు,

"నరుని రక్తమును చిందించు వాని రక్తము, నరుని వలననే చిందింపబడును: ఏలయనగా దేవుడు తన స్వరూప మందు నరుని చేసెను" (ఆదికాండము 9:6).

దేవుని స్వరూపములో మానవుడు చెయ్యబడ్డాడు. దేవుని ముద్ర మానవుడు కలిగి యున్నాడు. అందుకే దేవుడే ఇతరులను చంపే వారికి శిక్ష విధించాడు. మానవ జీవితం దేవుని కుమారుడైన క్రీస్తు వరముచే, నిత్యత్వములో పవిత్ర పరచబడింది. అందుకే ప్రతి సంవత్సరం జనవరిలో ఒక ఆదివారం "జీవ హక్కు ఆదివారంగా" ఏర్పాటైంది. గత ఆదివారం అది జరుపుకున్నాం, నలభై రెండవ వార్షికోత్సవం రావ్ వి. వేడ్ గారిది, అప్పుడు నల్ల వస్త్రాలు ధరించిన కొందరు వృద్ధులు అన్నారు స్త్రీ తన శిశువును చంపడం న్యాయ పరమని. అప్పటి నుండి 57 మిలియన్ పిల్లలు గర్భ స్రావము ద్వారా చంపబడుతున్నారు. దేవుడే సహాయం చెయ్యాలి!

గత ఆదివారం ఉదయం అదంతా నా ప్రసంగములో చెప్పాను. అలా చేస్తే, ఒక స్త్రీ తన కుమార్తె గుడి నుండి లేచి వెళ్లి పోయారు. అందుకే అనుకుంటాను చాల మంది బోధకులు గర్భ స్రావాలపై మాట్లాడరు. కాని అది సిగ్గు చేటు, ఎందుకంటే గర్భస్రావము చేయించుకున్న ప్రతి స్త్రీ యేసు రక్తముచే కడగబడాలి. ఆ యవన స్త్రీ ఉండి తన పట్ల యేసు ప్రేమను గూర్చి విని ఉంటే బాగుండేది! యేసు రక్తము ద్వారా కడగబడకుండా, ఒక స్త్రీ మనస్సాక్షి తన జీవితమంతా వేధిస్తుంది. దానిచే నిత్యత్వంలో ఆమెను తరుముతూ ఉంటుంది. "నా బిడ్డను చంపాను! నా బిడ్డను చంపాను! ఓ దేవా, నా బిడ్డను చంపాను!" ఆ తలంపు ఒక స్త్రీని తన జీవిత కాలమంతా నిత్యత్వంలో వేధిస్తుంది. మీ లౌకిక, కాలేజీ అధ్యాపకుడు అది మీకు చెప్పడు! తలలేని లౌకిక మనస్తత్వ వేత్త అది మీకు చెప్పడు. కాని మీ హృదయం మీ మనస్సాక్షి ఎప్పుడు చెప్తూనే ఉంటుంది గర్భస్రావము చేయించుకుంటే! "ఓ, దేవా! నా బిడ్డను చంపాను!" లౌకిక దేవుని-తిరస్కారులు దానిని స్త్రీ "ఎన్నుకునే హక్కు" అంటారు. కాని వారు ఒక అమ్మాయికి చెప్పరు తన జీవితాంతము పొందుకునే నిరంతర భయాందోళనను గూర్చి! ఎందుకు? ఎందుకంటే మానవ జీవితం పరిశుద్ధం, అందుకే! మానవుడు దేవుని సారూప్యములో చెయ్యబడ్డాడు, అందుకే!

మొన్న ఆ చక్కని పాటలో రెండవ వచనము నేర్చుకున్నాను, "దేవుని ప్రేమ," పేద పిచ్చోనిచే పిచ్చి స్థితిలో వ్రాయబడింది. సహచరుడు చనిపోయాక, తన గదిలో గోడపై ఈ పదాలు వ్రాయబడ్డావు,

గందర గోళ సమయము గతించాక, భూ సింహాసనాలు రాజ్యాలు పడిపోయాక,
   మనష్యులు, ప్రార్ధించడానికి ఇష్టపడని వారు, కొండలు శిఖరాలు పర్వతాలపై పిలుస్తున్నప్పుడు,
దేవుని ప్రేమ కచ్చితము, ఇంకను సహిస్తుంది, కొలవలేనిది బలమైనది;
   ఆదాము జాతికి విమోచించు కృప – పరిశుద్ధుల దూతల పాట.
ఓ దేవుని ప్రేమ,ఎంత గొప్పది పవిత్రమైనది! ఎంత కొలవ లేనిది బలమైనది!
   అది నిరంతరము సహిస్తుంది, పరిశుద్దుల దూతల పాట.
      ("దేవుని ప్రేమ" ఫ్రెడరిక్ యం. లెహ్ మాన్, 1868-1953; రెండవ వచనము అపరిచితము).

క్రీస్తు యేసులో దేవుని వరము నిత్యమూ మానవ జీవితాన్ని పవిత్ర పరుస్తుంది, మతి స్థిమితము లేని స్థితిలో చనిపోయిన ఆ పేద దరిద్రుని జీవితం కూడా. ఒక మనిషిగా దేవుని దృష్టిలో అతడు ప్రశస్తము. దేవుడు అతని ప్రేమించి అతని కొరకు చనిపోడానికి యేసును పంపించి అతని ఆత్మను రక్షించడానికి! "చెప్పనశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము" (II కొరిందీయులకు 9:15).

III. మూడవది, క్రీస్తు అనే దేవుని వరము మన పాపముల క్షమాపణకు మన ఆత్మల రక్షణకు అవకాశము కలిగిస్తుంది.

లేఖనములలోని గొప్ప వాక్య భాగము ప్రుదోమ్ గారు చదివింది మళ్ళీ విందాం,

"ఏలయనగా మనమింకా బలహీనులమై యుండగా, క్రీస్తు యుక్త కాలమున భక్తి హీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు: మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడి పరచు చున్నాడు, ఎట్లనగా, మనమింకను పాపులమై యుండగానే, క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఇప్పుడు, ఆయన రక్తము నీతిమంతులుగా తీర్చి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదురు" (రోమా 5:6-9).

యేసు సిలువపై మరణించినప్పుడు మన పాపముల నిమిత్తము పూర్తి పరిహారము చెల్లించాడు. "మనము ఇంకను బలహీనులమై యుండగా, క్రీస్తు యుక్త కాలమున భక్తి హీనుల కొరకు చనిపోయెను" (రోమా 5:6). దేవుని సంతోష పెట్టడానికి మనలను రక్షించుకోడానికి మనకు తగినంత శక్తి లేదు. మనమందరమూ భక్తి హీనులము. కాని "భక్తి హీనుల కొరకు క్రీస్తు చనిపోయాడు." అది దేవుని చెప్పన శక్యము కాని వరము!

మనమందరమూ పాపులము. మనము "ఇంకను పాపులమై యుండగా, క్రీస్తు మన కొరకు చనిపోయెను" (రోమా 5:8). అది దేవుని చెప్పన శక్యము కాని వరము!

"కాబట్టి ఆయన రక్తము, ఇప్పుడు నీతిమంతులుగా తీర్చి, మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము" (రోమా 5:9). మన స్థానంలో ఆయన మరణం – అది దేవుని చెప్పన శక్యము కాని వరము! సమర్ధన, ఆయన రక్తము ద్వారా మన అందరి పాపములు కడగబడడం – అది దేవుని చెప్పన శక్యము కాని వరము!

దేవుడు మనలను అడిగేది మన పాపాలను నుండి మరలి, ఆయన కుమారుడైన ప్రభువు యేసు నందు విశ్వాస ముంచడం. యేసును నమ్మిన క్షణమే రక్షింపబడతావు! అది దేవుని చెప్పన శక్యము కాని వరము యేసును నమ్మిన ప్రతి ఒక్కరి కొరకు!

రక్షించాడు! రక్షించాడు! నా పాపాలు అన్ని క్షమించాడు, నా నేరాలు అన్ని పారిపోయాయి!
రక్షించాడు! రక్షించాడు! నేను శిలువ వేయబడిన రక్తం ద్వారా రక్షింపబడ్డాను!
("రక్తముచే రక్షించాడు" ఎస్. జె. హెండర్సన్ చే, 19 వ శతాబ్దంలో).
(“Saved by the Blood” by S. J. Henderson, 19th century).

యేసు తన ప్రశస్త రక్తాన్ని కార్చాడు గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వడానికి;
ఆ ప్రవాహంలో ఇప్పుడే మునుగు అది హిమము కంటే తెల్లగా కడుగుతుంది.
ఆయననే నమ్ము, ఆయననే నమ్ము, ఆయననే నమ్ము ఇప్పుడు;
ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు.
   ("ఆయననే నమ్ము" జాన్ హెచ్. స్టాక్టన్ చే, 1813-1877).
   (“Only Trust Him” by John H. Stockton, 1813-1877).

యేసును "నమ్ముట" అంటే ఏంటి? దాని అర్ధం నిన్ను నీవు ఆయన చేతులలో పెట్టుకోవడం, ఒక మంచి వైద్యున్ని నమ్మినట్టు. ఏడు సంవత్సరాలప్పుడు, డాక్టర్ ప్రాట్ నా తల్లితో చెప్పాడు నా టాన్సిల్స్ తొలగించాలని. నాకు చాల భయమేసింది తల్లి నాతో చెప్పినప్పుడు "నిద్ర పుచ్చుతారని." నేను భయపడ్డాను. "నిద్ర పుచ్చుడం" నాకు భయం పుట్టించింది. తరువాత, ఏడు సంవత్సరాలే నా వయసు. ఆసుపత్రికి వెళ్ళేటప్పుడు, నా హృదయం వేగంగా కొట్టుకుంటుంది నేను వణుకు తున్నాను. నన్ను "నిద్ర పుచ్చేటప్పుడు" ఏమి జరుగుతుందో తెలియదు. ఒక భయపెట్టే, చూపుల నర్సు, తెల్ల దుస్తులలో, వచ్చి నన్ను సిద్ధ పరిచింది. నేను భయపడి గంతేసి పారిపోయాను! తరువాత డాక్టర్ ప్రాట్ లోనికి వచ్చాడు. నా యవ్వన కాలములో ఆయన తెలుసు. నేను పుట్టినప్పుడు ఆయన పురుడు పోసాడు, అప్పటి నుండి నా వైద్యుడు. ఆయన మంచి వృద్ధుడు. నేను ఆయనను ప్రేమించాను. నేను ఆయనను నమ్మాను. ఆయన అన్నాడు, "భయపడకు, రోబర్ట్. కొన్ని నిమిషాలలో అంతా అయిపోతుంది." నా గుండె వేగంగా కొట్టుకోవడం ఆగింది ఎందుకంటే నేను డాక్టర్ ప్రాట్ ను నమ్మాను. క్షణంలో "నిద్ర పుచ్చాడు." మరో క్షణంలో, లేచి ఆయన నవ్వు ముఖము చూసాను. డాక్టర్ ప్రాట్ అన్నాడు, "అంతా అయిపోయింది, రోబర్ట్. త్వరలో ఇంటికి వెళ్ళవచ్చు." నేను ఆ మంచి వృధ్యాప్య, వైద్యుని నమ్మాను. అదే మీరు యేసుతో చెయ్యలంటున్నాను.

ఆయననే నమ్ము, ఆయననే నమ్ము, ఆయననే నమ్ము ఇప్పుడు;
ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు.

డాక్టర్ చాన్, ప్రార్ధనలో నడిపించండి. ఆమెన్.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ఫ్రుథోమ్: రోమా 5:6-9.
ప్రసంగము ముందు పాట బెంజిమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్:
"దేవుని ప్రేమ" (ఫ్రెడరిక్ యం. లెహ్ మాన్, 1868-1953).
“The Love of God” (by Frederick M. Lehman, 1868-1953).


ద అవుట్ లైన్ ఆఫ్

చెప్పన శక్యము కాని వరము

THE UNSPEAKABLE GIFT

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"చెప్పనశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము" (II కొరిందీయులకు 9:15).

I. మొదటిది, దేవుని వరమైన క్రీస్తు భూమిని ఒక ప్రత్యేక స్థలంగా చేసింది, గలతీయులకు 4:4; యోహాను 1:14.

II. రెండవది,దేవుని క్రీస్తు అనే వరము మానవ జీవితాన్ని పవిత్ర పరుస్తుంది, గలతీయులకు 9:6.

III. మూడవది, క్రీస్తు అనే దేవుని వరము మన పాపముల క్షమాపణకు మన ఆత్మల రక్షణకు అవకాశము కలిగిస్తుంది, రోమా 5:6-9.