Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




గొప్ప దేవుడు – శక్తిగలవాడు భయంకరుడు!

A GREAT GOD – MIGHTY AND TERRIBLE!
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము ఉదయము, జనవరి 11, 2015
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Morning, January 11, 2015

"ప్రతి లేఖనము దైవావేశము వలన ఇవ్వబడినది, సిద్ధాంతమునకు అది ప్రయోజనకరము..." (II తిమోతి 3:16).


బైబిలు తెరచునప్పుడు మనము దేవుని ప్రత్యక్షతను చదువుతాం. నేను డాక్టర్ డబ్ల్యూ. ఎ. క్రీస్ వెల్ (1909-2002) విషయాలు చూపిస్తున్నాను – చాల విషయాలు మనం అధ్యయనం ద్వారా గమనిక ద్వారా నేర్చుకుంటాం. భూమి విత్తనాలు, చెట్లు ఫలాలు, నీరు ఖనిజాలు, చేపలు పశువులు, భూమ్యాకర్షణ శక్తి బలము నక్షత్రాల కదలికను గూర్చి నేర్చుకుంటాం. అధ్యయనం ద్వారా గమనించడం ద్వారా ప్రపంచ సృష్టిలోని చాల విషయాలు నేర్చుకోవచ్చు. కాని వాస్తవం వెనుక ఏమి ఉంది? ఈ భౌతిక ప్రపంచంలో మనం చదివే గమనించే విషయాలు మించి ఏ వాస్తవం ఉంది? జీవితం అర్ధం ఉద్దేశం ఏంటి? చదువుట ద్వారా గమనించుట ద్వారా ఈ విషయాలు నేర్చుకోలేము. ఈ ప్రపంచాన్ని నక్షత్రాలను విశ్వాన్ని ఎవరు చేసారు? ఇంతమట్టుకే తెలివి గమనిక చదువు వెళ్తాయి. కాని బాహ్య భౌతిక విషయాలను మించి మనము వెళ్ళలేము. మనం చూసే భావించే వాసన చూసే వినే వాటికి మించిన అర్ధము – దానిని మనం నేర్చుకోలేము.

మనం నక్షత్రాలు చూచి ముగింపుకు వస్తాం వాటిని చేసిన వాడు గొప్పవాడు మిక్కిలి శక్తి వంతుడని. కాని అతని పేరేంటి? ఆయన ఎలా ఉంటాడు? ఆయనకు మనం తెలుసా? మన పేరుతో ఆయన పిలుస్తాడా? నక్షత్రాలను గూర్చి నిరంతరము చదవవచ్చు కాని ఆయనను ఎరుగలేము.

సూర్యాస్తమయ అందాన్ని గూర్చి మనం చదువవచ్చు, వనములో అందమైన చెట్లు, భూమి నుండి మొలిచే పూలు. సృష్టిలో అందాలను గూర్చి మనం చదవవచ్చు. ఒక ముగింపుకు రావచ్చు వాటిని చేసినవాడు అందాన్ని సమన్వయతను రంగును ప్రేమించే వాడని. కాని ఆయన ఎవరు? ఆయన ఎలా ఉంటాడు? ఇంద్ర ధనుస్సు మేఘాలను గూర్చి, గ్రౌండ్స్ కెన్యాన్ లోని రంగుల నీడలు ఆరిజోనాలోని సూర్యాస్తమయ అందాన్ని గూర్చి మనం చదవవచ్చు. నిరంతరం వాటిని గూర్చి చదవవచ్చు కాని ఆయనను ఎరుగము.

మనలను మనం చూసుకోవచ్చు. ప్రపంచపు సంస్కృతులను చదవవచ్చు. సామాజిక శాస్త్రము నీతిత్వము చదివి, ముగింపుకు రావచ్చు మనవ జాతిని చేసిన వాడికి క్రమము తెలివి నీతి ఉన్నాయని. కాని ఆయన ఎవరు ఆయన పేరేంటి? ఆయనకు మనం తెలుసా? దేవుడు మనలను ఎందుకిలా చేసాడు? ఈ విషయాలు పూర్తిగా మానవుని నుండి దాచబడ్డాయి. దేవుని యొక్క స్వబహిర్గత స్వప్రత్యక్షత ద్వారా మాత్రమే ఈ విషయాలు తెలువబడతాయి. దేవుడు తన్ను బయలు పర్చుకోపోతే, మనం ఎన్నటికి ఆయనను తెలుసుకోం ("దేవుని స్వ-ప్రత్యక్షత" డబ్ల్యూ. ఎ. క్రీస్ వెల్ చే, పిహెచ్.డి. నుండి తీసుకొనబడినది).

కాని దేవుడు బైబిలు ద్వారా తన్ను ప్రత్యక్ష పరచుకున్నాడు. నశించు లోకానికి బైబిలు దేవుని స్వప్రత్యక్షత. అపోస్తలుడైన పేతురు చెప్పినట్టు, బైబిలు "చీకటి చోట వెలుగిచ్చు దీపము" (II పేతురు 1:19). మతాన్ని గూర్చి అర్ధ శతాబ్దానికి పైగా చదివాను. ప్రపంచములో సుమారు 600 మతాలున్నాయని మాకు చెప్పారు. ఏది సరియైనది? ఎలా తెలుసుకుంటాం? ప్రపంచపు మతాలను గూర్చి నిరంతరము చదివినా ఆయనను ఎరుగక పోవచ్చు. దేవుడే మనకు బయలు పరచుకోవాలి. అదే ఆయన చేసాడు. దేవుడు మానవునికి బైబిలు ద్వారా బయలు పర్చుకున్నాడు, అది "ప్రతి లేఖనము దైవావేశము వలన ఇవ్వబడినది, సిద్ధాంతమునకు అది ప్రయోజన కరము..." (II తిమోతి 3:16). కేవలము బైబిలు మాత్రమే దేవుని గూర్చిన జ్ఞానమూలము. బైబిలు లేకుండా, మనము ఆయనను ఎరుగము. దేవుడు త్రిత్వమని మనకు తెలియదు. దేవుని గుణ గణాలు మనకు తెలియదు – ఆయన సమర్ధ ఉనికి, సర్వజ్ఞత, ఆయన సర్వేశ్వంత, ఆయన స్థిరత్వత, ఆయన పరిశుద్ధత, ఆయన నీతి, ఆయన న్యాయము, ఆయన మంచితనము, ఆయన సత్యము. దేవుని గూర్చిన ఈ విషయాలు బైబిలు బయలు పర్చబడకపోతే మనకు తెలియదు. నిజ దేవుని గూర్చిన ప్రతీదీ బైబిలు నుండి మాత్రమే,

"ప్రతి లేఖనము దైవావేశము వలన ఇవ్వబడినది, సిద్ధాంతమునకు అది ప్రయోజనకరము..." (II తిమోతి 3:16).

మనం ఏమి చెప్తాం, తరువాత, పాపాన్ని శిక్షించే దేవుని గూర్చి? డాక్టర్ జార్జి బట్రిక్, బైబిలును తిరస్కరించే సంపాదకుడు తర్జుమా వాని బైబిలు, అన్నాడు, "దేవుడు నా దెయ్యము." అతడు అన్నాడు బైబిలు దేవుడు "దెయ్యము" అని. రోబర్ట్ ఇంగర్ సార్ బైబిలు దేవుడిని, "స్నేహ పూరిత దేవుడు," అన్నాడు, "నేను ఆయనను అసహ్యించుకుంటాను." పాపాన్ని శిక్షించే దేవుని పట్ల అసహ్యతను గూర్చి తరుచు కాలేజి అధ్యాపకుల ద్వారా విధ్యార్ధులు వింటుంటారు. కాని జార్జి బట్రిక్ కు దేవుని తీర్పును తిరస్కరించడంలో ఆధారము లేరు ఆయన బ్రాంతి తప్ప. ఇంగర్ సోల్ కు ఆధారము లేదు దేవుని "స్నేహపూరితము" అని పిలవడానికి ఆయన బ్రాంతి మాత్రమే. కళాశాల అధ్యాపకుడు పాపాన్ని తీర్పు తీర్చే దేవుని తిరస్కరించడానికి ఆధారము లేరు ఆయన బ్రాంతి తప్ప.

వారు తప్పని మనకెలా తెలుస్తుంది? దేవుని గూర్చి వారికంటే మనకు ఎక్కువ తెలుస్తుంది? జవాబు మన పాఠ్యభాగము,

"ప్రతి లేఖనము దైవావేశము వలన ఇవ్వబడినది, సిద్ధాంతమునకు అది ప్రయోజనకరము..." (II తిమోతి 3:16).

బైబిలులోని అన్ని హెబ్రీ గ్రీకు పదాలు తిమోప్నియి స్టోన్ (‘దేవుని-ఆత్మచే’ ప్రేరేపించబడినది,) మరియు లాభదాయకము (ఒఫెలియోస్ – ఉపయోగము) సిద్ధాంతమునకు (డిడక్షాలియన్ – ఉపదేశము, సిద్ధాంతము). జర్మన్ వేదాంతి డాక్టర్ ఫ్రిడ్జ్ రినేక్కర్ అన్నాడు, "[లేఖనాల] వ్రాతలు దేవునిచే ఊదబడినవి... రబ్బీ బోధలు దైవావేశముచే ప్రవక్తల ద్వారా ఇవ్వబడ్డాయి మాటలు వారి నుండి రాలేదు, దేవుని నోట నుండి వెలువడి పరిశుద్ధత్మచే వ్రాయబడ్డాయి. ఆది సంఘము [పూర్తి] అంగీకారములో ఉంది" (Fritz Rienecker, Ph.D., A Linguistic Key to the Greek New Testament, translated from the German by Cleon L. Rogers, Jr.; note on II Timothy 3:16).

అలా బైబిలు దైవావేశము వలన కలిగిన పరిపూర్తి నిధి; ప్రతి హెబ్రీ గ్రీకు పదము "దేవుని నోట నుండి" వెలువడ్డాయి! దేవుని గూర్చి ఏమి తెలుసుకోవాలన్నా బైబిలు నుండే రావాలి, ఎక్కడ నుండి కాదు. లూథర్ చెప్పినట్లు, "సోలా స్క్రిప్తులా" – బైబిలు మాత్రమే మన నమ్మకాలకు సిద్ధాంతాలకు మూలము. డాక్టర్ మార్టిన్–ల్లాయిడ్ జోన్స్ అన్నాడు, "కేవలము రెండు అంతిమ స్థితులున్నాయి; మనం బైబిలును అధికారముతో కూడినదిగా చూడొచ్చు, లేక మానవ అభిప్రాయాలు నమ్ముతాం...బైబిలు అంతా దేవుని విశిష్ట ప్రత్యక్షత" (దేవునితో సహవాసము, క్రాస్ వే బుక్స్, 1993, పేజీ 104). ప్రజలు అన్నారు, "అది నీ అభిప్రాయము" అని అంటున్నప్పుడు – నా జవాబు, "కాదు, అది నా అభిప్రాయము కాదు, అది బైబిలు అభిప్రాయము, బైబిలు వాక్య సిద్ధాంత పూరిత బోధ." అప్పుడు వారంటారు, "కాని నీవు దానినెలా తర్జుమా చేస్తావు?" నేనంటాను, "వార్తా పత్రికను తర్జుమా చేసినట్టు – అంటే అది చెప్పే దానిని."

నశించు ప్రజలకు ఇది ఇష్టముండదు. ఎందుకో మీకు తెలుసా? ఎందుకంటే దెయ్యము మాట వారు వింటున్నారు. దెయ్యము మన ఆదిమ తల్లిని తికమక పెట్టింది చెప్పడం ద్వారా దేవుడు అన్నది నిజంగా అనలేదని (ఆదికాండము 3:1-5). దేవుని మాటను నమ్మవు అనే అభిప్రాయము మనవ పతనాన్ని నుండి వచ్చింది, మానవ జాతి నాశనము నుండి! దేవుడు మనకు సహయము చెయ్యాలి! నిజ దేవుని గూర్చి మనం తెలుసుకున్నది బైబిలు నుండి మాత్రమే వచ్చింది. గమనించండి నేను అన్నాను, "నిజ దేవుని గూర్చిన సమస్తము..." బైబిలు నుండే వస్తుంది. కొరాన్ నుండి కాదు. మోర్మొను పుస్తకము నుండి కాదు. మేరీ బేకర్ ఎడ్డీ సామాన్యశాస్తము ఆరోగ్యము నుండి కాదు, ముడచబడిన, బాహాటముగా తప్పుడు తర్జుమా చేయబడిన, జెహోవా విట్నెస్ బైబిలును నుండి కాదు. నిజ దేవుని గూర్చి మనం ఎరిగిన సమస్తము బైబిలు నుండే వస్తుంది. ఇప్పుడు, దేవుని గూర్చి బైబిలు ఏమి చెప్తుంది? దేవుని గూర్చి బైబిలు చెప్పేది ఈనాడు ప్రజలు ఆయనను గూర్చి చెప్పేరా విరుద్ధంగా ఉంది. వీధులలో తిరిగే సగటు మానవుడు దేవుని గూర్చి. ఈ రెండింటిలో ఒకటి అనుకుంటాడు,


1. నిజ దేవుడు ఉనికిలో లేడు, లేక

2. దేవుడు ప్రేమ గల దేవుడు, పాపాన్ని ఎన్నడు శిక్షింపడు.


ఆ రెండు అభిప్రాయలు బైబిలు నుండి వచ్చినవి కావు. రెండు మానవుని నుండి వచ్చినవి, అవి నిజ దేవుని వివరించవు.

అవును, బైబిలు బోధిస్తుంది దేవుడు ప్రేమయని (I యోహాను 4:16). కాని దేవుడు తీర్పు తీర్చే దేవుడు. ఉగ్రత దేవుని తీర్పును గూర్చి ప్రేమ కంటే ఎక్కువ సార్లు బైబిలులో చెప్పబడింది. డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు, "తీర్పు అభిప్రాయము బైబిలు నుండి తీసివేస్తే చాల తక్కువే మిగులుతుంది" (The Heart of the Gospel, Crossway Books, 1991, p. 98). వేరేచోట, డాక్టర్ ల్లాయిడ్–జోన్స్ అన్నాడు, "చివరకు ప్రజలకు వచ్చే శ్రమ దేవుని ఉగ్రతను గూర్చిన సిద్ధాంతాన్ని నమ్మని వారికి ఎందుకంటే బైబిలు పర దేవుని ప్రత్యక్ష తను వారు నమ్మరు కనుక. వారు సృష్టించుకున్న దేవుడు వారికుంటాడు" (God’s Sovereign Purpose (Romans 9), The Banner of Truth Trust, 1991, p. 212).

దేవుని ఉగ్రత, దేవుని తీర్పు సిద్ధాంతాలు బైబిలంతా కనిపిస్తాయి, పాత కొత్త నిభందనలలో. గతవారము జల ప్రళయములో దేవుని తీర్పు నేను చదివాను.

"అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను భూమి మీద ఉండకుండ తుడిచి వేయుదును" (ఆదికాండము 6:7).

"దేవుడు నోవహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి యున్నది; కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది; మరియు, ఇదిగో, వారిని భూమి వారిని భూమితో కూడా నాశనము చేయుదును" (ఆదికాండము 6:13).

"నరులతో కూడా, పశువులను పురుగులను, ఆకాశ పక్షులను నేల మీద నున్న జీవరాసు లన్నియు, తుడిచి వేయబడెను, మరియు స్వర్గం నుండి కూడా తొలగించబడును; మరియు వారు భూమి నుండి నాశనం చేయబడును: నోవహును అతనితో కూడా, ఆ ఓడలో నున్నవియు మాత్రమే మిగిలియుండెను" (ఆదికాండము 7:23).

అది దేవుని తీర్పు! సోదోమో గొమోర తీర్పును కూడా చదివాను,

"అప్పుడు యెహోవా సోదొమ మీదను గొమోర మీదను యోహావా యెద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించాడు; ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణములలో నివశించు వారినందరిని, నేల మెలకలను నాశనము చేసెను" (ఆదికాండము 19:24-25).

అది దేవుని తీర్పు! ఐగుప్తుయులపై దేవుని భయంకర ఉగ్రతను గూర్చి చదివాను – హెబ్రీ ప్రజలను పోనీయకుండా ఆపినందుకు దేవుడు వారిని ఎలా తీర్పు తీర్చాడో,

"అర్ధరాత్రి వేళ జరిగిన దేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు, ఐగుప్తు దేశమందలి తోని పిల్లల నందరిని హతము చేసెను; పశువుల తొలి పిల్లలనన్నిటిని యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు, అతను, అతని సేవకులందరును, ఐగుప్తీయులందరును లేచినప్పుడు; మరియు ఐగుప్తు మొత్తం గొప్ప ఏడుపుతో ఉంది; శవము లేని ఇల్లు ఒకటైన లేకపోయినందున ఐగుప్తులో మహా ఘోష పుట్టెను" (నిర్గమ కాండము 12:29-30).

అది దేవుని తీర్పు! తరువాత నేను ఆరోహణ కుమారులైన, నాదాబు అబీహులపై వచ్చిన తీర్పును గూర్చి చదివాను,

"ఆరోహణ కుమారులైన, నాదాబు మరియు అలీహులు, తమతమ దూపార్తులను తీసికొని, వాటిలో నిప్పులాంటి వాటి మీద, దూప ద్రవ్యము వేసి, మరియు యోహావా తమకు ఆజ్ఞాపించి, వేరొక అగ్నిని ఆయన సన్నిధికి వస్తాయి. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు దేరి వారిని కాల్చివేసెను, మరియు వారిని మ్రింగి వేయబడి, వారు యెహోవా సన్నిధిని మృతి నొందిరి" (లేవియా కాండము 10:1-2).

అది దేవుని తీర్పు! తరువాత నేను విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట ద్వారా చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తిని గూర్చి చదివాను,

"తరువాత యెహోవా, ఆ మనష్యుడు మరణ శిక్ష నొందవలెను: సర్వ సమాజము పాలెము వెలుపుల రాళ్ళతో వానికొట్టి చంపవలెను. కాబట్టి యెహోవా మోషేకు, ఆజ్ఞాపించినట్లు, సర్వ సమాజము పాలెము వెలుపలికి తీసికొని పోయి; రాళ్ళతో వాని చావగొట్టెను" (సంఖ్యా కాండము 15:35-36).

అది దేవుని తీర్పు! తరువాత నేను మోషేకు వ్యతిరేకంగా తిరగబడిన కోరహు, అతని అనుచరులను చదివాను,

"అతడు ఆ మాటలన్నియు చెప్పి, చాలించగానే, వాని కింద నేల నేరవిడిచెను: భూమి తన నోరు తెరచి, వారిని వారి కుటుంబములను, కోరహు సంబందులందరినీ, వారి సమస్త సంపాద్యమును, మ్రింగి వేసెను. వారును, వారి సంబంధులందరిని, ప్రాణముతో పాతాళంలో కూలిరి, భూమి వారిని మ్రింగి వేసెను: వారు సమాజంలో ఉండకుండా నశించిరి. వారి చుట్టూనున్న ఇశ్రాయేలీయులందరు వారి ఘోషలిని: భూమి మనలను మ్రింగి వేయునేమో అనుకొనుచు, పారిపోయిరి. మరియు యెహోవా యెద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణంను తెచ్చిన, ఆ రెండు వందల ఏబది మందిని కాల్చి వేసెను" (సంఖ్యా కాండము 16:31-35).

అది దేవుని తీర్పు! ద్వితీయోపదేశ కాండములో నేను చదివాను,

"ఏలయనగా నీ దేవుడైన యెహోవా, పరమ దేవుడును, పరమ ప్రభునైయున్నాడు, ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు, ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టిని వాడు, లంచము పుచ్చుకొనని వాడు" (ద్వితీయోపదేశ కాండము 10:17).

ఇంకా ఇలా చెప్తుంది,

"నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి; ఆయనను హత్తు కొనవలెను" (ద్వితీయోపదేశ కాండము 10:20).

అది కూడా దేవుని తీర్పే.

ఈ విషయాలన్నీ మోషే రచించిన, ఐదు గ్రంధాలలో ఇవ్వబడ్డాయి. అది లేఖనాలలో మొదటి ఐదు గ్రంధాలలోని కొన్ని దేవుని తీర్పులు! అక్కడ చెప్పబడింది "దేవుడు పరమ దేవుడు, ప్రభువులకు ప్రభువు, మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరము..." (ద్వితీయోపదేశ కాండము 10:17).

తరువాత దేవుడు ప్రవక్త యెషయా ద్వారా చెప్పాడు, "కోపగించుకోని వారిని త్రోక్కితిని" (యెషయా 63:3). నెహేమ్యా ప్రవక్త అన్నాడు, "గొప్ప భయంకర దేవుడు" (నెహేమ్యా 1:5). దానియేలు ప్రవక్త ఆయనను, "మహాత్మ్యము గలిగిన భీకరుడైన దేవుడు అన్నాడు" (దానియేలు 9:4).

కాని ఎవరైనా అనవచ్చు, "అది పాత నిభందన దేవుడు. నేను కొత్త నిభందన దేవుని నమ్ముతాను." నీవు కొత్త నిభందన విషయంలో నిర్ల్యక్ష్యముగా ఉన్నవని చూపిస్తుంది! నూతన నిభంధనలో మనం చదువుతాం, "జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము" (హెబ్రీయులకు 10:31). II కొరిందీయులకు 5 లో, అపోస్తలుడైన పౌలు అన్నాడు, "ప్రభువు భయంకరత్వాన్ని తెలుసుకొని, ప్రజలను మనము ఒప్పించాలి." ప్రభువైన యేసు క్రీస్తు తీర్పును గూర్చి నరకమును గూర్చి అందరి కంటే ఎక్కువగా బైబిలులో చెప్పాడు. క్రీస్తు అన్నాడు,

"వీరు నిత్య శిక్షకు పోవుదురు" (మత్తయి 25:46).

క్రీస్తు అన్నాడు,

"నీ కన్ను నిన్ను అభ్యంతర పరిచిన యెడల, దాని పెరికి, నీ యెద్ద నుండి పారవేయుము: రెండు కన్నులు కలిగి అగ్ని గల నరకములో పడవేయబడుట కంటే ఒక కన్ను గలిగి, జీవముతో ప్రవేశించుట నీకు మేలు" (మత్తయి 18:9).

క్రీస్తు అన్నాడు,

"మనష్యు కుమారుడు తన దూతలను పంపును, వారాయనను రాజ్యములో నుండి ఆటంకములను, సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి; అగ్ని గుండములో పడవేయుదురు: అక్కడ ఏడ్పును పండ్ల కొరుకుటయును ఉండును" (మత్తయి 13:41-42).

రక్షింప బడని ధనికుడు నరకాని కెళ్ళినప్పుడు క్రీస్తు ఇలా అన్నాడు,

"అప్పుడతడు పాతాళములో బాధపడుచు, కన్నులెత్తి దూరము నుండి, అబ్రహమును అతని రొమ్మున ఆనుకొనియున్న, లాజరును చూచెను. తండ్రివైన అబ్రహాము, నాయందు కనికరపడి, తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి, నా నాలుకను చల్లర్చుటకు, లాజరును పంపును; నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను" (లూకా 16:23-24).

కొత్త నిబంధనలోని ఆఖరి గ్రంధము ఇలా అంటుంది,

"ఏమియు కలపబడకుండా దేవుని ఉగ్ర పాత్రలో పోయబడిన, దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును; పరిశుద్ధ దూతల యెదుటను గొర్రె పిల్ల యెదుటను, అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును: వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును: దానిపేరు గల ముద్ర ఎవడైనను వేయించు కొనిన యెడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై యుందురు..." (ప్రకటన గ్రంధము 14:10-11).

లేదు, కొత్త నిబంధనలో ఆశ్రయము పొందలేరు! బైబిలు అంతటిలో, ఈ చివరి నుండి ఆ చివరి వరకు, దేవుని చూపించబడ్డాడు "గొప్ప దేవుడు, శక్తి గలవాడు, భయంకరుడుగా" (ద్వితీయోపదేశ కాండము 10:17).

ఒకటే నిరీక్షణ ప్రభువైన యేసు క్రీస్తు నందు విశ్వసించాలి. దేవుడు సిలువపై మరణించడానికి ఆయనను పంపాడు – మన పాప క్రయధమునకై, ఆయన రక్తములో మన పాపాలు కడగడానికి. దేవుని ఉగ్రత నుండి తీర్పు నుండి తప్పించుకొనే వేరే మార్గము లేదు! అపోస్తలుడైన పౌలు అన్నాడు, "ప్రభువైన యేసు క్రీస్తు నందు విశ్వాసముంచును, అప్పుడు నీవు రక్షింప బడుదువు" (అపోస్తలుల కార్యములు 16:31). బైబిలు చెప్తుంది, "నీ హృదయమంతటితో ప్రభువు నందు నమ్మిక యుంచుము" (సామెతలు 3:5). ప్రభువైన యేసు క్రీస్తు అన్నాడు,

"నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింప బడును; నమ్మిని వానికి శిక్ష విధింప బడును" (మార్కు 16:16).

గ్రిఫిత్ గారు, దయచేసి మొదటి రెండు వచనాలు పల్లవి పాడండి పాట "నేను రక్తాన్ని చూచినప్పుడు."

క్రీస్తు మన విమోచాకుడు సిలువపై మరణించాడు,
పాపికై మరణించాడు, మూల్యము చెల్లించాడు.
గొర్రె పిల్ల రక్తము నీ ఆత్మపై చల్లుకో,
నేను కొనసాగుతాను, నీ పైగా వెళ్తుంది.
నేను ఆ రక్తాన్ని చూచినప్పుడు, నేను ఆ రక్తాన్ని చూచినప్పుడు,
నేను ఆ రక్తాన్ని చూచినప్పుడు, నేను కొనసాగుతాను, నీ పైగా వెళ్తుంది.

ప్రధాన పాపులను, యేసు రక్షిస్తాడు;
వాగ్ధానము చేసినదంతా, ఆయన చేస్తాడు;
పాపముకై తెరువబడిన ఊటలో కడుగుతాడు,
నేను కొనసాగుతాను, నీపైగా వెళ్తుంది.
నేను ఆ రక్తాన్ని చూచినప్పుడు, నేను ఆ రక్తాన్ని చూచినప్పుడు,
నేను ఆ రక్తాన్ని చూచినప్పుడు, నేను కొనసాగుతాను, నీపైగా వెళ్తుంది.
("నేను ఆ రక్తాన్ని చూచినప్పుడు" జాన్ జి. ఫూట్ చే, 19 వ శతాబ్దము).
(“When I See the Blood” by John G. Foote, 19th century).

డాక్టర్ చాన్, ప్రార్ధనలో నడిపించండి. ఆమెన్.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ఫ్రుథోమ్: ప్రకటన 14:9-11.
ప్రసంగము ముందు పాట బెంజిమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్:
"నేను ఆ రక్తాన్ని చూచినప్పుడు" (జాన్ జి. ఫూట్ చే, 19వ శతాబ్దము).
“When I See the Blood” (by John G. Foote, 19th century).