Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




దేవునిచే ఊదబడిన గ్రంథము

THE GOD-BREATHED BOOK
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము సాయంత్రము, నబంబరు 30, 2014
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Evening, November 30, 2014

"దైవ జనుడు ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు, దైవావేశము వలన, కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును సన్నద్ధుడై ఉన్నాడు: నీతియందు శిక్ష చేయుటకును, ప్రయోజనకరమైయున్నది" (II తిమోతి 3:16, 17).


సత్యానికి నిలబడడానికి భయపడే బోధకులు నన్ను "జన సందోహంను రెచ్చగొట్టే" వానిగా పిలుస్తారు. వాళ్ళ ఉద్యోగాలు నిలుపుకొనే ఉద్దేశము ఉన్న బోధకులు నన్ను "గొప్ప" అంటారు. సంఘస్తులను సంతోషపరిచే జీవిత ఉద్దేశము ఉన్నవారు నన్ను "శ్రమలు తెచ్చేవాడు" అని పిలిస్తారు. మరియు, అవును, నేను "అతివాది" ని అని పిలువబడ్డాను సంఘ నాయకులచే వారు పరిశుద్ధ లేఖనాలు సమర్ధింపును పట్టించుకోరు!

బైబిలుపై నా నిర్ణయము ఎప్పుడు మారనిది. నేనెప్పుడు చెప్తాను బైబిలు అంతా, మొదటి నుండి చివరి వరకు, దేవుని వాక్యము, హెబ్రీ గ్రీకులో ప్రతిమాట "దేవావేశము" వలన ఇవ్వబడింది (II తిమోతికి 3:16). దక్షిణ బాప్టిస్టు నాయకులు నాతొ అన్నారు నేను "పరిత్యజింపబడతాను," అలా చెప్పుకుంటూపోతే, సంఘాన్ని పొందుకోలేను! అప్పుడు నేను ప్రాధమిక బాప్టిస్టునయ్యాను – ప్రాథమికులు నాపై ఎదురు తిరిగారు స్వతంత్ర దక్షిణ బాప్టిస్టులు వ్యతిరేకంగా స్పందించారని చెప్పినందుకు.

రుక్మణిజం నమ్మకం కింగ్ జేమ్స్ బైబిలులోని పదాలు స్పూర్తిచే ఇవ్వబడ్డాయని ఆంగ్లములో తప్పులు లేనివని. కొంతమంది ఇంకా చెప్తారు కెజేవి లోని ఆంగ్ల పదాలు గ్రీకును హెబ్రీని సరిదిద్దుతాయని. ఈ వింతైన సాతాను అభిప్రాయాలు 1950 ముందు ఎవ్వరు నమ్మేవారు కారు, గాని డాక్టర్ పీటర్ ఎస్. రుక్మాన్ (1921-) వీటిని ప్రసిద్ధి చెందించాడు. రుక్మణిజం ప్రాముఖ్యంగా స్వతంత్ర ప్రాధమికులు బాప్టిష్టుల, మద్య చాల విభేదాలు కలహాలు తీసుకొచ్చాయి. నేను ఒక పుస్తకము వ్రాసాను "రుక్మణిజం బహిర్గతమైంది," ఇది rlhymersjr@scbglobal.net కు ఈ మెయిల్ పంపడం ద్వారా పొందవచ్చు. బైబిలు అనువాదాలు నేరుగా KJV ఆంగ్లము నుండి చేయబడ్డాయి, హెబ్రీ మరియు గ్రీకు, స్పానిష్, కోరియాన్, రష్యను మరియు ఇతర భాషల నుండి కాకుండా, తద్వారా రుక్మణిజం యొక్క తప్పుడు దయ్యపు సిద్ధాంతాలను ప్రపంచమంతా విస్తరింపచేస్తున్నాయి. ఒక కోపిష్టి రుక్మ నైట్ నా ప్రసంగము కార్యక్రమాన్ని బాప్టిష్టు బైబిలు కాలేజి నందు, రద్దు చేయించాడు, అది చెప్పినందుకు! న్యూయార్క్ లో ఒక కోపిష్టి బోధకుడు అలా చెప్పినందుకు రాకుండా చేసాడు. నా భార్య తండ్రి సుపరిచిత స్నేహితుని కుమారుడు ఇతని గుడికి వెళ్ళాడు. అతడు నన్ను వెన్నుపోటు పొడిచి ఎంతగానో నన్ను విమర్శించాడు కనుక ఆ అబ్బాయి గుడి నుండి తికమకలో వెళ్ళిపోయి ఇప్పటి వరకు రక్షింపబడలేదు. స్వతంత్రుల కనసర్వేటివ్ల బాణాల ద్వారా నేను శ్రమ పడ్డాను, అన్ని వైపులా నుండి, చారిత్రాత్మక నిర్ణయానికి కట్టుబడినందుకు గ్రీకు హెబ్రీ పదాలు బైబిలులోనివి స్పూర్తితో ఇవ్వబడ్డాయి, కింగ్ జేమ్స్ వెర్షన్ లోనికి అనువదింపబడ్డాయి! రెండు స్వతంత్ర సెమినరీలలోనికి నేను తరగతిలోనికి కేజేవి నాతో తీసుకెళ్ళాను, విద్యార్ధులందరూ రివైజడ్ స్టాండర్డ్ వెర్సన్, స్వతంత్ర తర్జుమా కలిగి యున్నారు. ఈ నాటికి కూడా KJV తీసుకెళ్ళి ప్రసంగ వేదిక నుండి ప్రతి ఆరాధనలో బోధిస్తాను.

డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు మనకు కొత్త అనువాదం ఉండాలి అనే అభిప్రాయం "...కేవలం అవివేకం!" ఆయన అన్నాడు ప్రజలు బైబిలు చదవడం మానలేదు "భాష అర్ధం చేసుకోలేకపోవడం కాదు, గాని దానిని నమ్మరు కాబట్టి. వారు దేవుని నమ్మరు...వారి సమస్య భాష పదజాలము కాదు; వారి హృదయ స్థితి" (Martyn Lloyd-Jones, M.D., Knowing the Times, The Banner of Truth Trust, 1989, pp. 112, 114).

నేనెప్పుడు బోధించాను హెబ్రీ గ్రీకులోని, బైబిలు ఆవేశము వలన ఇవ్వబడినదని. ఇదే అపోస్తలుడైన పౌలు మన పాఠ్యభాగములో చెప్పాడు,

"దైవ జనుడు ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు, దైవావేశము వలన, కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును సన్నద్ధుడై ఉన్నాడు: నీతియందు శిక్ష చేయుటకును, ప్రయోజనకరమైయున్నది" (II తిమోతి 3:16, 17).

అరవై సంవత్సరాలుగా అదే బోధిస్తున్నాను, నాకు దానిని మార్చే ఉద్దేశము లేదు! తీసుకున్న వదిలేసినా! బైబిలు తనను గూర్చి అదే చెప్తుంది!

I. మొదటిది, నేను నమ్ముతాను బైబిలు "దైవావేశము వలన ఇవ్వబడింది."

గ్రీకు పదము "ఆవేశము" ను "తియోప్నేస్లోస్" గా అనువదింపబడినది. దాని అర్ధము "దేవుడు-ఊదాడు." పరిశుద్ధ లేకనాలు "దేవునిచే ఊదబడ్డాయి." అపోస్తలుడైన పేతురు మనకు చెప్తాడు లేఖన రచయితలూ "పరిశుద్ధాత్మ ద్వారా కదిలింపబడి మాట్లాడారు" (II పేతురు 1:21). గ్రీకు పదము "ఫెరో" నుండి "కదిలింపబడుటగా" అనువదింపబడినది అనగా "తీసుకొనివెళ్ళుట." II తిమోతికి 3:16 మరియు II పేతురు 1:21 నుండి మనం చూస్తాం పరిశుద్ధాత్మ వారి మనసులను తీసుకొని వెళ్ళింది రచయితలు దేవునిచే ఊదబడిన బైబిలు మాటలు రాస్తున్నప్పుడు. ఉదాహరణకు, ఇర్మియా 1:9, మనం చదువుతాం,

"యెహోవా యిలాగు సెలవిచ్చెను, నేను నీ నోట, నా మాటలు ఉంచి యున్నాను" (యిర్మియా 1:9).

యేసు కూడా నూతన నిబంధన స్పూర్తిని గూర్చి ముందుగా చెప్పాడు ఇలా,

"ఆకాశమును భూమియు గతించును: గాని నా మాటలు గతింపవు" (మార్కు 13:31).

బైబిలులోని అభిప్రాయాలు దేవునిచే ఇవ్వబడలేదు. బైబిలులోని తలంపులు దేవునిచే ఇవ్వబడలేదు. ఆ మాటలు దేవుడు ఊదాడు! రచయితలు ఆ మాటలు రాసేటట్టు పరిశుద్ధాత్మ వారిని కదిలించింది! బైబిలు మాటలు వ్యతిరేకిస్తే తీర్పు వస్తుంది, "ఎందుకంటే వారు దేవుని మాటలు వ్యతిరేకించారు" (కీర్తనలు 107:11).

దుష్టుడైన రాజైన యెహొయాకీము బారుకును అడిగాడు యిర్మియా గ్రంథము ఎక్కడ నుండి వచ్చిందని. బారుకు జవాబిచ్చాడు ప్రవక్త "ఈ మాటలు నా కొరకు పలికాడు...వాటిని నేను పుస్తకంలో సిరాతో వ్రాసాను" (యిర్మియా 36:18). ఎవరైనా మాటలు స్పూర్తిదాయకం కాదంటే నమ్మవద్దు! హెబ్రీ వింత నిబంధనలోని ప్రతి మాట, గ్రీకు నూతన నిబంధనలోని ప్రతి మాట – బైబిలులోని ప్రతి మాట – "దేవునిచే ఊదబడిన" మాట! "లేఖనములన్నియు దైవావేశము చేత ఇవ్వబడినవి" (II తిమోతి 3:16). అది రెండవ విషయానికి తీసుకెళ్తుంది.

II. రెండవది, నేను నమ్ముతాను బైబిలు అంతా దేవావేశము వలన ఇవ్వబడినది.

"లేఖనము లన్నియు దైవావేశము చేత ఇవ్వబడినవి..." (II తిమోతికి 3:16).

దాని అర్ధము బైబిలులోని హెబ్రీ గ్రీకు పదాలన్ని, ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకు, దైవావేశము చేత, దేవునిచే ఊదబడిన మాటలు. వేత్తలు దీనిని "ప్లీనరీ, బైబిలు పదజాల స్పూర్తి." అని అంటారు." "వెర్ బల్" అనగా మాటలు స్పూర్తింపబడ్డాయి. "ప్లీనరీ" అనగా "పూర్తిగా." బైబిలు అంతా స్పూర్తిదాయకము, ఆవేశముచే ఇవ్వబడినది.

డాక్టర్ డబ్ల్యూ. ఎ. క్రీస్ వెల్, గొప్ప సంఘ కాపరి డెల్లాస్ మొదటి బాప్టిష్టు చర్చి, టెక్సాస్, ఇలా అన్నాడు,

"అది ప్లీనరీ అంతా లేఖనలన్ని, తియోప్నేస్టోస్, అంతా దేవునిచే ఊదబడింది. అది వెర్బల్ ప్రతి అంశము శీర్షిక స్పూర్తిచే ఇవ్వబడింది..." (W. A. Criswell, Ph.D., The Bible for Today’s World, Zondervan Publishing House, 1967 edition, p. 49).

యేసు అన్నాడు,

"ఆకాశమును భూమియు గతించి పోయిననే గాని, ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దానినుండి ఒక పోల్లయినను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను" (మత్తయి 5:18).

"జాట్" చిన్న హెబ్రీ మాట, ఒక కామా లాంటి, చిన్న మార్క్ లాంటిది. "శీర్షిక" అంటే హెబ్రీ పత్రికపై ఒక అంశము. ఈ చిన్న హెబ్రీ పదాలు కూడా లేఖనాలలో అధిక శక్తి గల దేవుని అసాధారణ ప్రేరణచే ఇవ్వబడ్డాయి!

నేను నా చేతిలో ఈ బైబిలు పట్టుకున్నప్పుడు, గొప్ప ధన నిధిని పట్టుకున్నట్టు. ఇది ప్రతి మాటకు అనువాదము దేవునిచే ఊదబడిన ప్రభువైన దేవుని మాటలకు! దేవుని వాక్యపు ప్రతి మాట అనువాదాన్ని నా చేతిలో పట్టుకున్నాను! ఒక విషయంపై దేవుడు ఏమనుకుంటున్నాడు అనేది తెలుసుకోవడానికి, తత్వవేత్త ఏమనుకుంటున్నాడో నేను చూడను, వేదాంతి ఏమనుకుంటున్నాడో నేను చూడను. ఒక విషయంపై దేవుడు ఏమి తలుస్తున్నాడో తెలుసుకోడానికి, నేను నా బైబిలు తెరచి దేవుడిచ్చిన ప్రేరణతో కూడిన మాటలు చదువుతాను. నేను మాటలు "మార్చకూడదు." వాటిని అర్ధవంతంగా తీసుకోవాలి. దేవుడు చెట్టు గూర్చి మాట్లాడితే, ఆయన ఉద్దేశము చెట్టు. ఆయన బలిపీథమును గూర్చి మాట్లాడితే, ఆయన అర్ధము బలిపీఠము.

డాక్టర్ మెక్ ఆర్డరు విషయంలో ఆ దేవుడిని భాధ పెడుతుంది. చెప్పడానికి ఆయనకు చాల విషయాలు ఉన్నాయి. కాని ఆయన అంటాడు, "మరణానికి బదులుగా రక్తము వాడబడినదని" (The MacArthur Study Bible; note on Hebrews 9:14). తాను అంటాడు "క్రీస్తు రక్తము ఎంత ఎక్కువగా...మృత క్రియలు విషయంలో మీ మనస్సాక్షిని గద్ధిస్తుంది." నేను బైబిలు వెర్బల్ ప్రేరణ నమ్ముతాను కాబట్టి, అతడు సరికాదని నాకు తెలుసు. అతడు చెప్పాడు క్రీస్తు "రక్తము" "మరణానికి బదులు." ఓ, ఎంత తప్పు! క్రీస్తు మరణము మన మనస్సాక్షిని గుచ్చాడు. ఓ, కాదు! క్రీస్తు రక్తము మాత్రమే చేయగలదు! అతని పొరపాటు చూపిస్తుంది ఎంత ప్రాముఖ్యమో మనం తెలుసుకోవడం బైబిలు మాటలన్నీ ప్రేరణ ద్వారా వచ్చాయి – దేవునిచే పంపబడ్డాయి, ప్రతి పదము ప్రతి శీర్షిక! హెబ్రీ 9:14 లో గ్రీకు పదము "హైమా." దాని అర్ధము "రక్తము." మన ఆంగ్ల పదము "హేమరేజ్" (ఎక్కువ మోతాదులో రక్తము) గ్రీకు పదము నుండి వచ్చింది. "హెమటాలజీ," అంటే రక్తమును గూర్చిన, పఠనము. ఈ రెండు ఆంగ్ల పదాలు గ్రీకు పదము "హైమా" నుండి వచ్చాయి. ఇది తేటగా చూపిస్తుంది డాక్టర్ మెక్ ఆర్డర్ తప్పు చెప్పాడు, "రక్తము మరణమునకు బదులుగా అన్నప్పుడు." కాదు – గ్రీకు పదము హైమా అంటే రక్తము! అది "మరణము" కాదు. మరణానికి గ్రీకు పదము "తనాటోస్." ఈ గ్రీకు పదము ఆంగ్లములోనికి "యూతనేషియా" గా వచ్చింది. "తానా" ఆంగ్ల పదము "తానాటోస్" నుండి వచ్చింది అంటే "మరణము." "యూ" అనగా గ్రీకులో "మంచి." కనుక "యూతనేషియా" అనగా "మంచి మరణము" అని అర్ధం. దీనినే స్వతంత్రులు సహాయక ఆత్మహత్య అంటారు. విషయము ఇది – "హైమా" అంటే రక్తము. "తనాటోస్" అంటే మరణము. మెక్ ఆర్డరు తప్పుగా చెప్పాడు, "రక్తము మరణము అనుపదానికి బదులుగా వాడబడింది." అపోస్తలుడైన పౌలు అర్ధము "రక్తము." ఆయన ఉద్దేశము "మరణము" అయితే గ్రీకు పదము "తనాటోస్" ను ఉపయోగించే వాడు. సంస్కరణ స్టడీ బైబిలు చెప్తుంది, "కాదు...ఆకర్షిత పద్దతి అసలు రచయిత అర్ధాన్ని విస్మరిస్తే సరి అవవచ్చును" (గమనిక పేజి 844, "దేవుని వాక్యము అర్ధం చేసుకొనుట"). నేననుకుంటాను డాక్టర్ మెక్ ఆర్డర్ "రక్తమును" మరణము"నకు మార్చడం కొలోనెల్ ఆర్. బి. తీమ్ నుండి నేర్చుకున్నాడు. 1961 పతనంలో నేనున్నాను, ప్రత్యక్ష సాక్షిని. యవ్వన జాన్ మెక్ ఆర్డర్ ఈ పదాలు రాయడం చూసాను తీమ్ చెప్పాడు, "రక్తము మరణము అను పదమునకు బదులుగా వాడబడింది." బహుశా, చాల మంది వేత్తలకు తెలుసు కొలోనెల్ తీమ్ ఈ విషయంలో తప్పు అని. కొలోనెల్ థీమ్ కు క్రీస్తు రక్తమంటే, అయిష్టత, విరక్తి. అతని పొరపాటు మనకు డాక్టర్ మెక్ ఆర్డరు ద్వారా వచ్చింది. మనము ఒక గ్రీకు పదాన్ని వేరే అర్ధానికి మార్చకూడదు, "అసలు రచయిత భావ వ్యక్తీకరణను నిర్లక్ష్య పరచకూడదు" (సంస్కరణ స్టడీ బైబిలు, ఐబిఐడి.).

నేను థీమ్/మెక్ ఆర్డరు సమస్య ఉపయోగించాను బైబిలు సిసలైన ప్రేరణ ప్రాముఖ్యతను ఉదాహరించడానికి, దాని బోధన దేవుడు హెబ్రీ గ్రీకులలో బైబిలులోని ప్రతి మాటలను ఊదాడు.

డాక్టర్ హరాల్డ్ లిండ్ సెల్ గొప్ప తత్వవేత్త, బైబిలు కచ్చితత్వాన్ని బాగా సమర్ధిస్తాడు. ఆయన పుస్తకము, బైబిలు కొరకు పోరాటము, నిస్సందేహంగా ఈ రోజులలో అతి ప్రాముఖ్యమైన పుస్తకము. డాక్టర్ లిండ్ సెల్ అన్నాడు, "ప్రేరణ వ్రాయబడిన దేవుని వాక్యమంతటికి చెందినది దానిలో పరిశుద్ధాత్మ హస్తము నడిపింపు లేఖన పదాల సేకరణకు కూడా దోహదపడింది" (Harold Lindsell, Ph.D., The Battle for the Bible, Zondervan Publishing House, 1978 edition, p. 31; emphasis mine). బహుశ డాక్టర్ లిండ్ సెల్ హెబ్రీ గ్రీకు పదాలను గూర్చి చెప్పాడు, పరిశుద్ధాత్మ రచయితలను నడిపించింది "లేఖన పదాల ఎన్నికలో కూడా." డాక్టర్ హెన్రీ యమ్. మోరిస్ అన్నాడు పౌలు చేసాడు "పద ప్రేరణకు మహత్తర కచ్చిత నిర్ధారణ ఇచ్చాడు" లేఖన మాటలకు గలతీ 3:16 లో. ఆయన అన్నాడు పౌలు వాదము దీనిపై ఆధారపడింది, "కేవలం ఒక మాట, ఒక పదము, ఒక ‘విత్తనము’ గాని ‘విత్తనాలకు’ బదులుగా" (Henry M. Morris, Ph.D., The Defender’s Study Bible, World Publishing, 1995 edition, p. 1296; note on Galatians 3:16; emphasis mine).

నేను పూర్తిగా డాక్టర్ లిండ్ సెల్ మరియు డాక్టర్ మోరిస్ తో ఏకీభవిస్తాను. నాకు వారిద్దరూ తెలుసు, వారు సరియే. అందుకే నేను శ్రద్ధ కలిగియున్నాను డాక్టర్ మెక్ ఆర్డరు ప్రకటనను గూర్చి "రక్తము మరణము అను పదమునకు బదులుగా వాడబడింది." మనం అలా చెయ్యనే కూడదు మనం లేఖనాల సిసలైన ప్రేరణను నమ్మితే. బైబిలు చెప్పినది దేవునికి తెలుసు. మీరు పూర్తిగా నమ్మవచ్చు హెబ్రీ గ్రీకు లేఖనాల్లో బైబిలు చెప్పేది. యేసు అన్నాడు, " మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండివచ్చు ప్రతి మాట వలన జీవించును" (మత్తయి 4:4; ద్వితీయోపదేశకాండము 8:3 లోనిది క్రీస్తు పలికాడు; ఒక్కాణింపు).

మీరు బైబిలు చదివేటప్పుడు మీరు కచ్చితంగా ఉండాలి మీరు దేవుని మాటలే చదువుతున్నారని. మీరు ఈ మాటలు చదివేటప్పుడు, "ప్రభువైన యేసు క్రీస్తు నందు విశ్వాసముంచుము, నీవు రక్షింపబడుదువు," మీరు నమ్మాలి అపోస్తలుల కార్యములు 16:31 లో దేవుడు చెప్పినది. నీవు నమ్మినప్పుడు "ప్రభువైన యేసు క్రీస్తు నందు విశ్వాసముంచుము" దైవ కుమారుని ద్వారా నీవు పాపమూ నుండి రక్షింపబడతావు. మీరు యేసు మాటలు చదువునప్పుడు, "నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమూ త్రోసి వేయను" మీకు నిర్ధారణ మీరు ఆయన దగ్గరకు వస్తే ఆయన మిమ్ములను త్రోసివేయడు (యోహాను 6:37). యేసు మాటలు చదువునప్పుడు, "ప్రయాసపడి భారము మోసి కొనుచున్న, సమస్త జనులారా, నా యొద్దకు రండి," నేను మీకు విశ్రాంతి కలుగచేతును (మత్తయి 11:28). మీరు యేసు మాటలు చదువునప్పుడు, "దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుని నామమందు, విశ్వాసముంచు ప్రతివాడును నశింపక, నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను," ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక, నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను (యోహాను 3:16). మీరు ఈ మాటలు చదువుతున్నప్పుడు, "యేసు క్రీస్తు రక్తము ప్రతిపాపము నుండి మనలను పవిత్రులుగా చేయును," మీకు కచ్చితం "యేసు రక్తము" "పాపములన్నిటి నుండి" మిమ్ములను కడుగుతుంది (I యోహాను 1:7).

"దైవ జనుడు ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు, దైవావేశము వలన, కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును సన్నద్ధుడై ఉన్నాడు: నీతియందు శిక్ష చేయుటకును, ప్రయోజనకరమైయున్నది" (II తిమోతి 3:16, 17).

బైబిలులోని ఈ మాటలు నిజమని నమ్మితే, ప్రభువును నమ్మి మీ పాపముల నుండి ఎందుకు రక్షింపబడకూడదు? దేవుడు చెప్పేది నమ్మితే, వచ్చి ఆయన కుమారుని నమ్ము, ఆయన నిన్ను ప్రేమించి నీ పాపము నుండి, మరణము నరకము నుండి రక్షించడానికి సిలువపై మరణించాడు! గొప్ప పాత పాటలోని, మాటలు చెప్పు,

నేను వస్తున్నాను, ప్రభు!
     ఇప్పుడే మీ యొద్దకు!
నన్ను కడుగు, రక్తములో శుద్ధి చెయ్యి
      కల్వరిలో ప్రవహించినది.
("నేను వస్తున్నాను, ప్రభూ" లూయిస్ హార్ట్ సాట్ చే, 1828-1919).
(“I Am Coming, Lord” by Lewis Hartsough, 1828-1919).

ఆమెన్. డాక్టర్ చాన్, దయచేసి ప్రార్ధనలో నడిపించండి.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ఫ్రుథోమ్: II తిమోతి 3:12-17.
ప్రసంగము ముందు పాట బెంజిమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్:
"నాకు తెలుసు బైబిలు సత్యమని" (డాక్టర్ బి. బి. మెక్ కిన్నీచే, 1886-1952).
“I Know the Bible is True” (by Dr. B. B. McKinney, 1886-1952).


ద అవుట్ లైన్ ఆఫ్

THE GOD-BREATHED BOOK

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"దైవ జనుడు ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు, దైవావేశము వలన, కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును సన్నద్ధుడై ఉన్నాడు: నీతియందు శిక్ష చేయుటకును, ప్రయోజనకరమైయున్నది" (II తిమోతి 3:16, 17).

I. మొదటిది, నేను నమ్ముతాను బైబిలు "దైవావేశము వలన ఇవ్వబడింది," II పేతురు 1:21; ఇర్మియా 1:9; మార్కు 13:31; కీర్తనలు 107:11; ఇర్మియా 36:18.

II. రెండవది, నేను నమ్ముతాను బైబిలు అంతా దేవావేశము వలన ఇవ్వబడినది, మత్తయి 5:18; 4:4; అపోస్తలుల కార్యములు 16:31; యోహాను 6:37; మత్తయి 11:28; యోహాను 3:16; I యోహాను 1:7.