Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




సమూహంలో స్త్రీ

THE WOMAN IN THE CROWD
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము ఉదయము, మార్చి 2, 2014
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, March 2, 2014

"అందుకాయన, కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థ పరిచెను; సమాధానము గల దానివై పొమ్ము, నీ భాద నివారణయై నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పెను" (మార్కు 5:34).


యేసు వ్యక్తీ నుండి దెయ్యాలను వెల్లగొట్టాడు గలిలయ సముద్ర దక్షిణ తీరాన. వాళ్ళు యేసును వెళ్లి పోమన్నారు. కోరని స్థలములో ఆయన ఎప్పుడు ఉండలేదు, కనుక వారిని విడిచి, సముద్రాన్ని దాటి, ఉత్తర తీరానికి వచ్చాడు. గొప్ప జన సమూహము ఆయనను వెంబడించింది. జనాన్ని తోసుకొని ఒక వ్యక్తీ పరిగెత్తి యేసు నోద్దకు వచ్చాడు. యేసు పాదాలపై పడి తన చిన్న కుమార్తె చావనైయుందని చెప్పాడు. "తను బ్రతికి...జీవించునట్లు" ఆయన వచ్చి చేతులుంచాలని యేసును బతిమాలాడు. యేసు తనతో వెళ్లి, ప్రజలు ఆయనను వెంబడించి, ఆయనపై పడుచుండిరి.

ఆగుంపులో ఒక వ్యాధి గ్రస్తురాలు ఉంది. ఆమె రోగము కలిగి, పన్నెండు యేండ్ల నుండి రక్త స్రావము కలిగి ఉంది. ఆమె అనేక వైద్యుల దగ్గరకు వెళ్లి, తన ధనమంతా వ్యయ పరిచింది, కాని మరింత సంకట పడింది. యేసు ప్రజలను స్వస్థపరుస్తున్నాడని వినింది. జన సమూహంలో వెనుకకు వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టింది. వెంటనే ఆమె రక్త ధర కట్టింది శరీర స్వస్థత పొందింది. తనలో నుండి ప్రభావము వెళ్లినట్టు యేసు గ్రహించాడు. యేసు అన్నాడు, "నా వస్త్రములు ముట్టిన దెవరు?" శిష్యులు అన్నారు గుంపులో అనేకులు ఆయనను ముట్టారని.

"అప్పుడా స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి, వణుకుతు వచ్చి, ఆయన ఎదుట సాగిలపడి, తన సంగతి అంతయు చెప్పెను" (మార్కు 5:33).

యేసును ఆమెతో అన్నాడు, "కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను."

యేసు చేసిన అన్ని స్వస్థతలు మనకు చూపిస్తున్నాయి మన ఆత్మలను మార్పు ద్వారా ఆయన భాగు చేస్తాడని. ఈ ఉదయాన్న రక్షింప బడకపోతే జాగ్రత్తగా ఈ స్త్రీ స్వస్థత మార్పు గమనించండి. నాలుగు ప్రాముఖ్య గుణ పాఠాలు నేను చెప్తాను మార్పుపై దేవుడు నీలో మార్పు తెచ్చు నట్లు – నీవు జాగ్రత్తగా వింటే!

I. మొదటిది, ఆమె నిజంగా స్వస్థత పరచ బడాలనుకుంది.

ఆమె బుద్ది హీనురాలుగా లేదు. రక్షణ విషయంలో నటించే వారు తరుచూ "మోసపోతారు." అదే పాత పాఠశాల సువార్తికులు బుద్ది హీనుల గురించి చెప్తారు, నటిస్తూ బుద్ది లేని ప్రశ్నలడుగుతారు. "మూర్ఖులు" ఏమీ పొందరు. యేసును అడిగిన వ్యక్తిలా ఉంటారు, "రక్షణ పొందు వారు కొద్దిమందేనా?" (లూకా 13:23). అది సోమరి ప్రశ్న – అల్పమైన, అనవసరమైంది. ఊరికనే అడిగానంటే. అది అంత ప్రాముఖ్యం కాదు. అతను "మూర్ఖుడు."

అలాంటి చాలా మంది సమాచార గదికి వచ్చి మమ్ములను కలుస్తారు. కొన్ని ప్రశ్నలడుగుతారు. కొద్దిగా మాట్లాడతారు. రక్షణ గూర్చి ఏమాత్రమూ శ్రద్ధ ఉండదు. ఎందుకంటే ఆ గది వదిలిన రెండు నిమిషాలకే నవ్వుతూ జోకులేసుకుంటారు. రక్షణ గూర్చి ఏమాత్రమూ శ్రద్ధ లేదు. వాళ్ళు మోసగిచ్చుకుంటారు. వాళ్ళు "మూర్ఖులు." అందుకు వాళ్ళ గురించి బైబిలు చెప్తుంది,

"సత్య విషయమైన, అనుభవ జ్ఞానము ఎప్పుడు పొందరు" (II తిమోతి 3:7).

వారు శ్రద్ధగా వెదకరు గనుక క్రీస్తును కనుగోరు. వారు ఆసక్తితో, శ్రద్ధతో, కోరికతో క్రీస్తును వెదకరు. ఉత్సాహముండదు, క్రీస్తును కనుగోనాలనే ఆతృత ఉండదు. వారు శ్రద్ధలేని, నులివచ్చని, చలనంలేని "మూర్ఖులు" – వారు "సత్యమును గూర్చిన, జ్ఞానము పొందుకోరు." సమాచార గది వదిలిన ఐదు నిమిషాలలో గమనించవచ్చు వారికి క్రీస్తును వెదికే శ్రద్ధ లేదని. వాళ్ళు మోసపుచ్చుకుంటారు. వాళ్ళు కేవలము శ్రద్ధలేని "మూర్ఖులు." రక్షింపబడాలంటే శ్రద్ధ ఉండదు కళ్ళెత్తి చూసే వరకు నరక యాతనను. అప్పటికే ఆలస్యమైపోతుంది! నిత్యత్వములొ సమస్తము కోల్పోతారు.

ఇప్పుడు "మూర్ఖునికి" వ్యతిరేకంగా మన పాఠ్యములో స్త్రీ. రక్త స్రావము నుండి స్వస్థ పడాలనే ఆసక్తి ఆమెకుంది. స్వస్థత కొరకు తీవ్రంగా ఎదురుచూస్తుంది. యేసు ఆజ్ఞకు లోబడే వారి వలే ఉంది, "శ్రద్ధ ప్రవేశించడంలో" (లూకా 13:24). పదము "శ్రద్ధ" గ్రీకు పదము అగోనిజోమై నుండి వచ్చింది. "వేదన" పదము అలా వచ్చింది. ఇప్పుడు, రక్త స్రావము స్త్రీ వివరణ అదే కదా? స్వస్థత కొరకు విక్షించింది కదా? ఆ విధానములో ఆవేదన ద్వారా వెళ్ళలేదా? చాలా మంది వైద్యుల దగ్గరకు వెళ్ళింది. "చాలా మంది వైద్యుల శ్రమలను అనుభవించింది." నిస్సందేహంగా ఆమెను కష్ట పెట్టారు – చాలా నొప్పి. అప్పట్లో మత్తు మందు లేదు, కాబట్టి మెలకువలోనే ఆపరేషన్ చేసి ఉంటారు! విష పూరిత మందులు తినిపించి ఉంటారు స్వస్థత బదులు! ఆమె ధనము కూడా బెట్టిందంతా నిష్పయోజన "మందులకు" ఖర్చు పెట్టింది.

ఆమె అప్పుడు మారింది అందులో ఆశ్చర్యం లేదు! చాలా తీవ్రత కలిగిఉంది. ఆమె తప్పక రక్షింపబడాలనుకుంది! అలాంటి వ్యక్తీ రక్షింప బడతారు, తెలుసా. "మూర్ఖులు" తప్పిపోయి తిరుగుతారు. ఆ స్థితిలో ఆతృత ఆతృత ఉంటే వాళ్ళు యేసును కనుగొంటారు త్వరగా. అవును – ఎల్లప్పుడూ! "మీరు తప్పక నన్ను కనుగొంటారు!"

"మీరు నన్ను వెదికిన యెడల, పూర్ణ మనస్సుతో, నన్ను గూర్చి విచారణ చేయునేడల మీరు నన్ను కనుగొందురు" (ఇర్శియా 29:13).

రక్షకుని కనుగొంటారు! తప్పక! తప్పక! నీవాయనాను వెదికితే "పూర్ణ హృదయంతో" – ఈ స్త్రీ వలే!!! ఆమె నిజంగా స్వస్థత కోరుకుంది! దాని గురించే ఆలోచించింది! నువ్వు దాని గురించే ఆలోచించావా? నిన్ను తొందర పెట్టుంచు? దాని గురించే చింతపడ్డావా? నువ్వు అలా చెయ్యాలి!

II. రెండవది, తను చూసిన వైద్యులు తనకు సహాయపడలేదు.

ఆ వైద్యుల గూర్చి చెప్పను. ఇంకొన్ని మాటలు చెప్పాలి. ముఖ్యమైంది – ఎవ్వరు తనను బాగు చేయలేదు! అస్సలు సహాయం చెయ్యలేదు – ఇంకా అద్వానం చేసారు.

కొన్నిసార్లు యువకులు ఆత్మలను గూర్చి శ్రద్ధ గలవారు గుడికి వస్తారు. పాపం నిత్యత్వం గురించి, చింత పడతారు. నశించు స్నేహితుల దగ్గరకు వెళ్లి వాళ్ళ అనుభవంతో చెప్తారు. క్రైస్తవేతర స్నేహితులు అంతా, సరే అంటారు., గుడి మానేయమంటారు. కనుక, ఆ రక్షింపబడని స్నేహితులు రక్త స్రావము గల స్త్రీని బాగు చేయలేని వైద్యులు లాంటివారు. వాళ్ళు అంతా గందర గోళం చేసి ఆమె డబ్బు తీసుకున్నారు!

కొన్ని సార్లు పాపపు ఒప్పుకోలు కలిగిన యవనస్తుడు ఇంకొక పాస్టరు దగ్గరకేల్తాడు, తప్పుడు ఆదరిస్తాడు. అలా అవకూడదు, చాలా దుష్ట బోధకులున్నారు, మన పాఠ్యములో వైద్యుల వలే. వారు సంతోషంగా మీ కానుకలు తీసుకుంటారు – మీ డబ్బు కావాలి! వాళ్ళు మీ పాప భూ ఇష్ట ఆత్మకు సహాయపడరు!

చాలా ఏళ్ళ క్రితం ఒక స్థలంలో బోధిస్తున్నారు. అనంతరం ముగ్గురు యువకులు రహస్యంగా నా దగ్గర కొచ్చారు, అబ్బాయి ఇద్దరమ్మాయిలు. వారి నశించారని చెప్పిన దానిని బట్టి తేటగా తెలుస్తుంది. రక్షింపబడలేక పోయారు. కన్నీళ్ళలో ఉన్నారు, తీవ్ర ఒప్పుకోలుతో. చాలా సార్లు మాట్లాడాను తేటగా రక్షింపబడే వరకు, ఆ ముగ్గురు స్పష్టంగా రక్షించబడే వరకు వరకు. సంతోషంగా ఇంటికెళ్ళి నా కూటంలో రక్షింపబడినట్టు వాళ్ళు కాపరికి చెప్పారు. మర్నాడు ఉదయం తను నాకు ఫోన్ చేసాడు. గట్టిగా అరిచాడు – "నిన్ను తిరస్కరిస్తున్నా! నిన్ను తిరస్కరిస్తున్నా! నిన్ను తిరస్కరిస్తున్నా!" ("తిరస్కరిస్తున్నా" అంటే "నిన్ను తిరస్కరిస్తున్నా!" "నిన్ను తులనాడుతున్నా!"). తరువాత ఎవరో చెప్పారు నేనంటే తనకు అసూయ అని తనే వాళ్ళను రక్షించాడని తను చెప్పు కోవాలనుకున్నాడు! పేద, బలహీన కాపరి నన్ను "తిరస్కరించాడు" అగ్ని గుండం నుండి ముగ్గురు యవనస్తులను రక్షించినందుకు! ఈ స్వనీతి పరుడు కూటం ఆపే వరకు పోరాడాడు. జవాబు చెప్పుకోవాలి ఆఖరి తీర్పులో దేవుని ఎదుర్కొనేటప్పుడు! బెమా తీర్పు కాదు, ఆఖరి తీర్పులో! ఆ చేసిన కాపరి ఒక ప్రొటెస్టంట్ అయినా, కన్నా దారుణంగా కాదు, చెడ్డ వాడు, అతను ఒక రోమన్ కాథలిక్ పూజారి కంటే హీనుడు! అలా ఈ రోజుల్లో చాల మంది ఉన్నారు. అలంటి అబద్ద ప్రవక్తల నుండి దేవుడు మిమ్మును విడిపించును గాక! అలాంటి బోధకులను గూర్చి దేవుడు అన్నాడు,

"నేను వారిని పంపలేదు, వారికీ ఆజ్ఞ యియ్యలేదు: వారు ఈ జనులకు ఏ మాత్రము ప్రయోజన కారులు కాదు, ఇదే యెహోవా వాక్కు" (ఇర్శియా 23:32).

కొంత మంది బాప్టిస్టు బోధకులు అబద్ధపు ఉపదేశం ఇస్తుంటారు – ఈ గుడి వదిలి వాళ్ళ దగ్గరకు వెళ్ళాలని – తద్వారా మీ కానుకలు రాబట్టు కోడానికి! మీ డబ్బు! అలాంటి వారు "గొర్రెల దొంగలు" అబద్ద ప్రవక్తలు! అలాంటి వారిని గూర్చి ఆలోచిస్తే కడుపు మండుతుంది! రక్త స్రావ రోగ స్త్రీని బాగు చేయలేని వైద్యుల లాంటి వారు వారు!

III. మూడవది, యేసు వస్ర్తాన్ని ముట్టినప్పుడు ఆమె శరీరము బాగు పడింది.

గుంపు ద్వారా రక్షకుని దగ్గర కొచ్చింది. చాలా మంది కనుక దొమ్మిగా ఉన్నారు – ఒకరి పై ఒకరు పడుతున్నారు – యేసును చూడాలని! చాలా మంది యేసును ముట్టినా, ఈ స్త్రీ మాత్రమే యేసు నుండి శక్తి పొందుకొని శరీర స్వస్థత పొందుకుంది. ఇంకోసారి "ఆయన ముట్టిన వారందరూ స్వస్తపడ్డారు" (మార్కు 6:56). ఇప్పుడైతే ఈమె స్వస్థత పొందింది. ఎందుకిలా మనం చెప్పలేము. బహుశా ఇతరులు "తండ్రి దేవుని ఎన్నికలో లేకపోవచ్చు" (I పేతురు 1:2).

నేను నమ్ముతాను ఆమె శరీర స్వస్థత మేల్కొలుపుతో కలిసి ఉంది. ప్రతి పాపివలె, ఆమె "అపరాధములొ పాపములో చచ్చినది" (ఎఫేస్సీయులకు 2:1). పాపములో చచ్చిన వారు యేసు నోద్దకు వచ్చే వలయ శక్తి పొందుకోవాలి. దీనిని కొందరు "పునరుద్దరణ" అంటారు. ఇది పొరపాటు. దీనిని నేను "మేల్కొలుపు" అంటాను. అదే అపోస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు,

"నిద్రించుచున్న నీవు మేల్కొని, మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును" (ఎఫేస్సేయులకు 5:14).

పరిశుద్దాత్మ ద్వారా మేల్కొనినప్పుడు, పాప ఒప్పుకోలు వస్తుంది. పాపానికి బానిసయ్యవని గ్రహిస్తావు. "పాపాల్లో చచ్చారని" గ్రహిస్తావు (ఎఫేస్సీయులకు 2:5). డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్ జోన్స్ అన్నాడు, "ఆత్మీయ జీవితపు తోలి సూచన నీవు చచ్చావని గ్రహించడం" (The Law: Its Functions and Limits, The Banner of Truth Trust, 1975, p. 145).

ఇంకోసారి, డాక్టర్ లాయిడ్ జోన్స్ అన్నాడు, "నీవు క్రైస్తవుడవు కాలేవు విధేయత లేకుండా" (Authentic Christianity, Volume I, The Banner of Truth Trust, 1999, p. 114).

నీవు మేల్కొనినప్పుడు, నీ స్వశక్తి లేదని, పాపంలో నిస్సహాయంగా చనిపోయావని గ్రహిస్తావు. నీవు తగ్గించుకున్నప్పుడు, రక్షకుని నోద్దకు రాడానికి సిద్ధపడతావు. నీకు సహాయపడేది ఏమి నేర్చుకోలేవని ఒప్పుకుంటావు. యేసు తప్ప ఎవ్వడు నిన్ను రక్షింపలేరని నీకు నీవుగా ఒప్పుకుంటావు.

నీవు మేల్కొనినప్పుడు క్రీస్తును గూర్చిన సిద్ధాంతాలు నీవు మేలు చెయ్యవని గ్రహిస్తావు. యేసు మాత్రమే రక్షిస్తాడని గమనిస్తావు. డాక్టర్ లాయిడ్-జోన్స్ దీనిని తేట పరిచాడు తన పుస్తకము, ఉజ్జీవములో. ఆ పేజి చివరలో అన్నాడు, "అది భయంకరము నిజ సిద్ధాంతాన్ని వ్యక్తీ నిజ గ్రహింపుకు బదులుగా వాడడం" (ఉజ్జీవము, క్రాస్ వే బుక్స్, 1987, పేజి 58). నీవు మేల్కొనినప్పుడు, యేసును గూర్చిన విషయం తెలుసు కోవడం నిన్ను తృప్తి పరచదు! యేసునే కోరుకుంటావు! యేసు మాత్రమే నిన్ను రక్షించగలడని గ్రహిస్తావు! దెయ్యాలకు తెలుసు యేసు ఎవరో. కపెర్న హోములో దెయ్యాలు మోరపెట్టాయి, "నీవు దేవుని కుమారుడైన క్రీస్తు...ఆయన క్రీస్తుని వాటికీ తెలుసు" (లూకా 4:41). దెయ్యాలకు సిద్ధాంతాలు తెలుసు. వాటికి తెలుసు ఆయన క్రీస్తని (మెస్సియా). ఆయన దేవుని కుమారుడని వాటికి తెలుసు. క్రీస్తును గూర్చిన సిద్ధాంతాలు వాటికి తెలుసు, కాని అది ఆయనను వ్యక్తీ గతముగా ఎరుగవు. యేసును గూర్చిన కొన్ని సిద్ధాంతాలు వాటికి తెలుసు. నీవు మేల్కొన్నాక, యేసును గూర్చిన విషయాలు తెలుసుకోవడంలో తృప్తిపడవు. యేసునే కోరుకుంటావు! నీ తప్పినా దుస్థితిని గూర్చి మేల్కొంటే, బైబిలు వచనాన్ని నమ్మడంలో తృప్తి చెందవు. క్రీస్తు యేసు మాత్రమే నిన్ను రక్షించగలడని నీవు తెలుసు కుంటావు,

"ఆయన...దేవునికి నరునికి మద్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు" (I తిమోతి 2:5).

నీవు ఎరాగాలి నమ్మాలి "మనవ క్రీస్తు యేసు" మాత్రమే రక్షింపగలడని.

"అద్వితీయ సత్య దేవుడైన నిన్నును, నీవు పంపిన నిజ దేవుడు, యేసు క్రీస్తును, ఎరుగుటయే నిత్య జీవము" (యోహాను 17:3).

దేవుని గూర్చిన విషయాలు తెలుసుకోవడం కాదు. దేవునిని ఎరగాలి. యేసు క్రీస్తు గూర్చిన విషయాలు కాదు. యేసు క్రీస్తును ఎరగాలి! నిత్య జీవానికి అదే మార్గము! రక్షింపబడడానికి అదొక్కటే మార్గము! యేసు క్రీస్తూనే ఎరగాలి!

అన్నింటి తరువాత, నిన్ను రక్షించడానికి యేసు క్రీస్తు ఏమి చేసాడో ఆలోచించు! గేత్సమనే వనములో ఎలా శ్రమ పడ్డాడో ఆయన చెమట రక్త బిందులుగా ఎలా మారిందో నిన్ను రక్షించడానికి. అది అర్ధ రహితమని విన్నావా? నీ మనసులో తేలిగ్గా తీసుకున్నవా? సిలువపై ఆయన మరణాన్ని ఆలోచించు – నీకు బదులుగా, నీ స్థానములో, దుఃఖించి నీ పాపాల కోసం మరణించడం. అది నీకు ఏమీ కాదు అని విన్నావా? త్వరగా మనసులో నుండి తీసేస్తున్నవా? అలా అయితే నీకు నిరీక్షణ లేదు! ఎవరు లేరు!

ఒక వృద్దుడు ఒక కాపరి దగ్గరకు వచ్చాడు. ఆయన ఏకాంతి, కాపరి గుడిలో చిన్న అపార్టుమెంటులో ఉండనిచ్చాడు. బుగ్గలపై కన్నీళ్ళతో ఒక సువార్త గీతం రాసాడు. నేను ఆ సంఘాన్ని దర్శించినప్పుడు తను చచ్చిన స్థితిలో ఉన్నాడు. కాని ప్రజలు తన అపార్టుమెంటు నాకు చూపించాడు. వాళ్ళు ఏడ్చి తన పాటను పాడారు,

యేసును గూర్చి నేననుకున్నది నేను నీతో చెప్పాలని ఆకాంక్ష
   ఆయనలో బలమైన నిజ స్నేహితుని కనుగొన్నాను;
నేను నీకు చెప్తాను ఆయన నా జీవితాన్ని ఎలా పూర్తిగా మర్చేసాడో,
   ఏ స్నేహితుడు చేయనిది ఆయన చేసాడు.
యేసు వలే ఎవరు నన్ను లక్ష్య పెట్టలేదు,
   ఆయనంత దయానీయ స్నేహితుడు ఎవరు లేదు;
ఎవ్వరు పాపాన్ని చీకటిని నా నుండి తొలగించ లేరు,
   ఓ ఎంతగా ఆయన నన్ను పట్టించుకున్నాడో!
("యేసు వలే ఎవరు నన్ను లక్షపెట్టలేదు" చార్లెస్ ఎఫ్. వైగిల్, 1871-1966).
(“No One Ever Cared For Me Like Jesus” by Charles F. Weigle, 1871-1966).

కాని రక్త స్రావము గల స్త్రీ విషయంలో నాల్గవ విషయము, అది మనలను చివరి విషయంనకు తీసుకెళ్తుంది.

IV. నాల్గవది, యేసు నోద్దకు వచ్చినప్పుడు ఆమె మారింది.

నేనన్నాను యేసు తన స్నేహితుడని తను తలంచలేదు. యేసు ఆమెను గూర్చి చూచినప్పుడు, బైబిలు చెప్తుంది,

"అప్పుడా స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి… వణుకుతు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి, తన సంగతి అంతయు చెప్పెను" (మార్కు 5:33).

ఆయనను గూర్చి ఆమె ఇంకా భయపడుతుంది. ఆమె ఇంకా రక్షింపబడలేదని నాకనిపిస్తుంది. ఆమె మేల్కొనింది, కాని ఇంకా మారలేదు.

కాని వణుకుతూ, ఆయన యొద్దకు వచ్చింది. "ఆయన ఎదుట సాగిల పడింది." ఆయనను ఇంకా ఎరుగలేదు తన భయాల వలన. కాని ఆయన దగ్గర కొచ్చింది. భయంతో వణుకుతూ, ఆమె వచ్చింది. గొప్ప విశ్వాసం లేదు. అంతా ఎక్కువ తెలియని పేద స్త్రీ. యేసు స్వస్థ పరచాడని మాత్రమూ తెలుసు. ఆయన కృపచే మేల్కొనింది, ఆయన ప్రేమను ఇంకా ఎరుగలేదు. అయినా ఆయన దగ్గరకు వచ్చింది!

అన్నా డబ్ల్యూ. వాటర్ మెన్ చక్కని పాట నాకు ప్రీతి పాత్రము, గ్రఫిత్ ప్రసంగం ముందు పాడారు. అది సత్యమని తెలుసు అందుకే అంత ఇష్టం. అది నా జీవితంలో నిజం నీ జీవితంలో కూడా, యేసు నోద్దకు వస్తే.

నాకు తెలుసు, అవును, నాకు తెలుసు,
   యేసు రక్తము భయంకర పాపిని కడుగుతుంది.
నాకు తెలుసు, అవును, నాకు తెలుసు,
   యేసు రక్తము భయంకర పాపిని కడుగుతుంది.
("అవును, నాకు తెలుసు!" అన్నా డబ్ల్యూ. వాటర్ మెన్, 1920).
   (“Yes, I Know!” by Anna W. Waterman, 1920).

రక్షకుని దగ్గరకు వస్తే, ఈ ఉదయాన ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన ప్రశస్త రక్తంలో నీపాపాన్ని కడిగేస్తాడు – ఆయన నీతో మాట్లాడతాడు రక్త స్రావము గల స్త్రీతో మాట్లాడినట్టు,

"అందుకాయన, కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థ పరిచెను; సమాధానము గల దానివై పొమ్ము, నీ భాద నివారణయై నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పెను" (మార్కు 5:34).

నీవు ఈ ఉదయాన్న యేసు నోద్దకు వస్తే నీ పాపమూ నుండి ఆయన నిన్ను రక్షిస్తాడు, ఈ మధ్యాహ్నము నీ ఇంటికి పంపిస్తాడు ఆ స్త్రీకి ఇచ్చిన ఆశీర్వదముతో,

"నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను; సమాధానము గల దానివై పొమ్ము, నీకు స్వస్థత కలుగును గాక."

యేసు ద్వారా పాపమూ నుండి రక్షింపబడాలనే విషయం మాతో మాట్లాడాలనుకుంటే, దయచేసి నీ కుర్చీ వదిలి ఆవరణము వెనుకను రండి. డాక్టర్ కాగన్ ఇంకో గదికి తీసుకెళ్ళి ప్రార్ధించి మీతో మాట్లాడుతాడు. ఇప్పుడే వెళ్ళండి. డాక్టర్ చాన్, కొందరు యేసు నమ్మునట్టు ప్రార్ధించండి ఈ ప్రాతఃకాలం. ఆమెన్.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రదోమేచే: మార్కు 5:25-34.
ప్రసంగమునకు ముందు పాట బెంజమన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్ గారిచే:
"అవును, నాకు తెలుసు!" (అన్నా డబ్ల్యూ. వాటర్ మెన్, 1920).
“Yes, I Know!” (by Anna W. Waterman, 1920).


ద అవుట్ లైన్ ఆఫ్

సమూహంలో స్త్రీ

THE WOMAN IN THE CROWD

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"అందుకాయన, కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థ పరిచెను; సమాధానము గల దానివై పొమ్ము, నీ భాద నివారణయై నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పెను" (మార్కు 5:34).

(మార్కు 5:33)

I. మొదటిది, ఆమె నిజంగా స్వస్థత పరచబడాలనుకుంది, లూకా 13:23; II తిమోతి 3:7; ఇర్శియా 29:13.

II. రెండవది, తను చూసిన వైద్యులు తనకు సహాయపడలేదు, ఇర్శియా 23:32.

III. మూడవది, యేసు వస్ర్తాన్ని ముట్టినప్పుడు ఆమె శరీరము బాగుపడింది, మార్కు 6:56; I పేతురు 1:2; ఎఫేస్సీయులకు 2:1; 5:14; 2:5; లూకా 4:41; I తిమోతి 2:5; యోహాను 17:3.

IV. నాల్గవది, యేసు నోద్దకు వచ్చినప్పుడు ఆమె మారింది, మార్కు 5:33.