Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




ఇమ్మాను యేలు - దేవుడు మనకు తోడు!

EMMANUEL – GOD WITH US!
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము ఉదయము, డిసెంబర్ 22, 2013.
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Morning, December 22, 2013.

"ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు, భాషాంతరమున దేవుడు, మనకు తోడు అని అర్ధము" (మత్తయి 1:23).


కొన్నిసార్లు రెండు అనువాదాలతో బోదిస్తున్నందుకు ప్రజలు నన్ను విమర్శిస్తారు. ఒకతనన్నాడు, "మీ ప్రసంగంపై ఏకాగ్రత చూపడం కష్ట మవుతుంది ఎందుకంటే ప్రతి ఆంగ్ల వాక్యము చైనీ స్పెనిస్ లలోనికి అను వదింపబడుతుంది." వాళ్ళకు జవాబిచ్చాను ఆంగ్లము తెలిసిన అమెరికన్లకు మాత్రమే బోదించడం లేదని. వెబ్ సైట్ లో, యూట్యూబ్ లో, కేవలం చైనీయ స్పెనిస్ తెలిసిన వేల మందికి భోదిస్తున్నాను. మూడు భాషల్లో భోధించే విడియోలు సగ ప్రపంచానికి అర్ధం అయ్యేలా చేస్తున్నాయి. 28 భాషల్లో ప్రసంగమేని స్క్రిప్తులున్నాయి, అందుకు అనేకులు ప్రసంగాలు అర్ధం చేసుకుంటారు. నా తోటి అమెరికన్లకు భోధించడమే నా ఉద్దేశము కాదు. ప్రపంచమంతటా సువార్త ప్రకటించాలను కుంటున్నాను.

గత వారం హోండూరాస్ నుండి ఇంటికి ఫోన్ వచ్చింది. నేనప్పుడు లేను, నా భార్య అరగంట సేపు స్పెనిస్ లో మాట్లాడగలిగింది. ఆయనన్నాడు 20 మందికి ప్రతివారం సువార్తకు మాయింటికి కొచ్చే వాళ్ళకు స్పెనిస్ లో నా ప్రసంగాలు చదివి వినిపిస్తాడు. ఆయన ఆమెతో అన్నాడు తన గ్రామ కాపరులు వాళ్ళు మునుపే క్రైస్తవుని చెప్పుకునే వాళ్ళకు భోధిస్తారు. తానన్నడు తను తన స్నేహితులు రక్షింపబడడానికి నా ప్రసంగాలు వింటారని! సెంట్రల్ అమెరికాలో హొన్దాజ్ అనే గ్రామంలో, ఒక వ్యక్తి గృహంలో ఇది జరిగింది! విడియోలు కూడా చూస్తానని చెప్పాడు. తన అన్నాడు స్పెనిస్ లో మేన్సియా గారు ఇచ్చే ప్రసంగాలు, గ్రిఫిత్ గారి పాటలు ప్రేమిస్తానని! అది సంభవించేది కాదు నా ప్రసంగాలు విడియోలో అనువదింపబడకపోతే, మాన్యు స్క్రిప్తులలో 28 భాషలలో అనువదింపబడకపోతే! తిరిగి మన పాఠ్య భాగము దగ్గరకు అది తెస్తుంది,

"ఆయనకు ఇమ్మాను యేలు అను పేరు పెట్టుదురు, భాషాంతరమున దేవుడు, మనకు తోడు అని అర్ధము" (మత్తయి 1:23).

గొప్ప స్పర్జన్ అన్నాడు, "ఈ పదాలు, ‘అనువదింపబడినది,’ మధురంగా నా చెవికి తాకుతున్నాయి. ‘ఇమ్మాను యేలు’ పదము హేబ్రీలో, ఎందుకు అనువదింప బడింది? అది అన్యులకు చెందినది, కనుక అన్యుల లోకంలో, ప్రధాన భాష గ్రీకు లోనికి అనువదింపబడింది... ‘అనువదింపబడినది' అంటే ఆయా దేశాలు చెప్పబడ్డాయి. మన పాఠ్యభాగంలో మొదటి హేబ్రీలో ‘ఇమ్మాను యేలు,’ తరువాత అన్య భాషలో అనువదింపబడింది, ‘దేవుడు మనకు తోడూ;’ అని ‘అనువదింపబడినది,’ అంటే [మన అందరమూ] ఆహ్వానింపబడ్డామని, [మన అందరమూ] పిలువబడ్డామని, దేవుడు మన [అవసరాలు] చూసి అనుగ్రహిస్తున్నాడని, మనం ఉదారంగా రావడానికి, అన్యులమైన పాపులమైనప్పటికీ, దేవునికి దూరస్తుమైనప్పటికీ. భయపూరిత ప్రేమతో రెండు ప్రశస్త నామాలను భద్రపరుద్దాం మన హెబ్రీ సహోదరులు వాళ్ళ ‘ఇమ్మాను యేలు’ ను మన ‘దేవుడు మనకు తోడుతో’” ఐక్య పరిచే ఆనంద దినం కొరకు ఎదురు చూద్దాం (C. H. Spurgeon, “God With Us,” The Metropolitan Tabernacle Pulpit, Pilgrim Publications, 1971 reprint, volume XXI, p. 709).

"ఆయనకు ఇమ్మాను యేలు అను పేరు పెట్టుదురు, భాషాంతరమున దేవుడు, మనకు తోడు అని అర్ధము" (మత్తయి 1:23).

అర్ధ సహిత పేర్లతో మనం పిల్లలను పిలవం. నా పేరు "రోబర్ట్." అంటే "ఎర్ర గడ్డం" అని. నాకు ఎర్ర గడ్డం లేదు. నాది నల్లని గోధుమ రంగు. కాని వదిలి పెడితే, తెల్లగా మారుతుంది. నా జుట్టు ఇంకా గోధుమ రంగులో ఉంది, నాకు గడ్డము తెల్లగా ఉంది. నాకు ఎర్ర గడ్డము ఎప్పుడు లేదు, కనుక నా పేరుకు ప్రత్యెక అర్ధము లేదు. చాలా శతాబ్దాల క్రితం రోబర్ట్ అనే ఎర్ర గడ్డం మనిషి ఉన్నాడేమో, తనకు నాకు పొత్తు లేదు. నా తండ్రిని బట్టి, నాకు రోబర్ట్ పేరు వచ్చినది. కాని బైబిలు దినాల్లో పేర్లకు అర్ధము ఉండేది. "యేసు" అంటే "యోహవా రక్షించును" లేక, ఇంకా, "యెహోవా విడిపించును" అని. "ఇమ్మాను యేలు" అంటే "దేవుడు మనకు తోడూ" అని అర్ధము. కొత్త నిబంధనలో యేసు "ఇమ్మాను యేలు" అని పిలువబడలేదు. అపోస్తలుడైన పౌలు ఆయనను అభివర్ణించాడు "శరీర దారి" అని (I తిమోతి 3:16). "ఇమ్మాను యేలు" పేరు వివరింపబడిన నామము. క్రీస్తు లోకంలో పుట్టాడు కాబట్టి దేవుడు మనతో ఉన్నాడు. ఇలా "ఇమ్మాను యేలు" పేరు ప్రభువైన యేసు క్రీస్తుని గూర్చి రెండు ప్రాముఖ్య విషయాలు చెపుతుంది.

I. మొదటిది, ఇమ్మాను యేలు చూపిస్తుంది ఆయన శరీర దారిగా దివి నుండి భువికి వచ్చాడని.

చార్లెస్ వెస్లీ (1707-1788), అతని క్రైస్తవ పాటలో, ఇలా అన్నాడు,

శరీర దారిలో దైవత్వము;
   శరీర రూపములో నిత్యత్వము,
మనిషిగా ఎంచబడి జీవించాడు,
   యేసు, మన ఇమ్మాను యేలు.
ఆహా! దూతల సమూహపు పాట,
   "జన్మించన రాజుకు మహిమ."
("ఆహా, దూతల సమూహపు పాట" చార్లెస్ వెస్లీచే, 1707-1788).

అది అద్భుత సత్యము. ఇశ్రాయేలు దేవుడు చిన్న బాలుడిగా జీవించాడు. దేవుడు మానవ శరీరంలో జీవించాడు శ్రమ పడి సిలువపై మరణించాడు మన పాపాల నుండి రక్షించడానికి.

శరీర దారి అద్భుతంలో ఉన్న సత్యము విశ్వ దేవుడు తగ్గించుకొని మానవ శరీర రూపము దాల్చాడు. ఆయన శ్రమపడే, చనిపోయే, శరీర దారి. మనం పూర్తిగా గ్రహించ లేదు దేవుడు శరీరదారిగా మారడం ఎంత అద్భుతమో – "దేవుడు మనకు తోడుగా మారడం" – యేసు మన ఇమ్మాను యేలు! బైబిలు చెప్తుంది ఆయన,

"...మనస్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపము ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను" (ఫిలిప్పీయులకు 2:7).

కాని గుర్తింపదగ్గ సత్యం ఏమిటంటే క్రీస్తు పాపపు లోకంలో శరీర దారిగా దిగి వచ్చాడు. పాపమూ చేయనప్పటికీ, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే జాతిలో ఆయన చేరాడు. ఆయన మనలో కలిసి పోయాడు మనలను పాపమూ నుండి దుస్థితి నుండి లేవనెత్తడానికి! లేఖనాలు చెప్తున్నాయి,

"దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు, శిక్ష విదించెను" (రోమా 8:3).

మనలను పాప స్థితి నుండి రక్షించడానికి దిగి వచ్చిన దేవుని ప్రేమ మనలను ఆశ్చర్య పరుస్తుంది! మనము పతన జాతి. మనం పాపపు బానిసలం. సాతాను శక్తి కింద ఉన్నాం. కాని క్రీస్తులో దేవుడు, మన విడుదల కోసం, దిగి వచ్చాడు. "దేవుడు మనకు తోడూ" కనుక మనకు నిరీక్షణ ఉంది – యేసును బట్టి, ఇమ్మాను యేలును బట్టి!

ఒకప్పుడు దేవుడు మనకు వ్యతిరేకి. బైబిలు చెప్తుంది "దుష్టులపై ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు" (కీర్తనలు 7:11). కాని ఇప్పుడు దేవుడు మనలను క్షమించి ఆయన పిల్లలని పిలుస్తాడు. ఇప్పుడు, "ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనం దేవునితో సమాదానము కలిగి యున్నాము: మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన అందులో నిలిచి యుండి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయ పడుచున్నాము" (రోమా 5:1, 2). ఇప్పుడు యోహావా మనకు వ్యతిరేక దేవుడు కాదు, కాని "దేవుడు మనకు తోడూ"! ఆయన "కుమారిని మరణము ద్వారా ఆయనతో సమాధాన పరుచుకున్నాడు" (రోమా 5:10).

నేను చిన్నగా ఉన్నప్పుడు ఈ విషయాలు తెలియదు. క్రైస్తవ గృహములో పెంపకము లేదు. యుక్త వయస్కుని వరకు సువార్త ప్రకటించే గుడికి హాజరు కాలేదు. అప్పుడు జాగ్రత్తగా వినలేదు. దేవునితో సమాధానంగా ఉండడం నాకు తెలియదు – ఇరవై సంవత్సరాల వరకు. అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ చూపించింది యేసు వచ్చి సిలువపై మరణించాడు దేవునితో నన్ను సమాధాన పరచడానికి. అప్పుడు తెలుసుకున్నను నన్ను రక్షించడానికి ఆయన దివి నుండి భువికి వచ్చాడని! అప్పుడు ఆయన నాతో ఉన్న దేవుడు – యేసు, నా ఇమ్మాను యేలు! నేను యేసును నమ్మిన క్షణమే రక్షింపబడ్డాను!

"ఆయనను ఇమ్మాను యేలు అను పేరు పెట్టుదురు, భాషాంతరమున దేవుడు మనకు తోడూ, అని అర్ధము" (మత్తయి 1:23).

II. రెండవది, ఇమ్మాను యేలు అనగా అయన మనకు అందుబాటులో ఉన్నాడని.

ఇది ఇస్తుండగా, హోండురా వ్యక్తీ ఫోన్ చేసాడు. ఆంగ్లములో మాట్లాడాను. నా భార్య వేరే ఫోనులో స్పేనిష్ లో అనువదించారు. ఆయన అన్నాడు గ్రామములో నా ప్రసంగము చెప్పితే, సంఘ కాపరులంతా ఆయనపై కోపపడ్డారు. రేడియో కార్యక్రమములో నా ప్రసంగము భోదిస్తున్నాడు, కాపరులు స్టేషన్ ను మూయించేసారు. నేనడిగాను గుడులు ఏమి బోధిస్తున్నాయని. వాళ్ళు ఐశ్వర్యముపై భోదిస్తున్నారని – దేవుని నుండి ఎక్కువ డబ్బు ఎలా పొందాలి. బాప్టిస్టు సంఘం గురుండి అడిగాను. తానన్నాడు, "బాప్టిస్టు అందరి కంటే హీనులని."

ఆయన గృహానికి నా ప్రసంగాలు వినడానికి ఇరవై మంది వస్తారు. స్వంత గుడి ప్రారంభించమన్నాను – నా ప్రసంగాలు చెప్పుమన్నాను. ఆయన కొరకు ప్రార్ధించండి. తన పేరు నెస్టర్.

ఈ సంఘటన చూపిస్తుంది ఇంటర్నెట్ యూట్యూబ్ లో నిజ సువార్త ప్రకటించే అవసరత ఎంతో ఉందని. మొన్న జిమ్మీ స్వగార్ట్ చెప్పడం విన్నాను పెంతే కోస్తులు సువార్త ప్రకటించడం లేదని. చాలా బాప్టిస్టు సంఘాలు వచనం వెంబడి వచనం బైబిలు స్టడీ చేస్తున్నారు సువార్త భొదించె బదులు. చాలా కాపరులు సువార్త భోధిస్తే గుడులు వదిలేస్తారని భయపడుతున్నారు! సిగ్గు చేటు! ఇది దేవుని నుండి తీర్పు. బైబిలు చెప్తుంది, "అబద్దమును నమ్మునట్లు, మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు" (II దెస్సలొనీకయులకు 2:11). సువార్త ప్రకటన లేకపోవడం దేవుని అంతిమ తీర్పుకు తప్పుకు క్రైస్తవముపై ఒక ప్రారంభము.

ఇప్పుడు, ఎప్పుడైనా, అంతర్జాలము యూట్యూబ్ లో మనం సువార్త ప్రకటించడం ప్రాముఖ్యము. గత కొద్ది వారాల్లో ఇద్దరు నా ప్రసంగాలు ప్రజలకు బోధిస్తున్నారు – ఒకరు క్యూబాలో ఒకరు హోండురాస్ లో. ఒక డాక్టర్ ఇండియాలో డాక్టర్ కాగన్ కు గత వారంలో ఈ–మెయిల్ పంపాడు. ఆమె అన్నారు, "మేము చూసాము డాక్టర్ హైమర్స్ ముక్కు సూటి, సత్తా గల దైర్య పూరిత భోధ, లోకమంతా చాలా మంది [ప్రజలు] ఆశీర్వదింప బడుతున్నారు. నేను చాలా మంది హిందీ [ప్రజలకు ] వెబ్ సైట్ ద్వారా మీ ప్రసంగాలు చూసి దీవించబడాలని." గట్టిగా ప్రార్ధించండి మా సువార్త ప్రసంగాలు 177 దేశాలకు 28 భాషలలో వెళ్తుండగా. మన సంఘాలు చేస్తున్న వాటిలో ఇది చాలా ప్రాముఖ్యమైంది!

ఈ ఆఖరి రోజులలో యేసు మన ఇమ్మాను యేలు! ఆయన అన్నాడు, "ఇదిగో, భోదిగతముల వరకు, నేను మీతో కూడా ఉన్నాను" (మత్తయి 28:20). యేసు ఈ ఉదయము మీకు అందుబాటులో ఉన్నాడు. మీ మీద ఆయనకు కోపము లేదు – లేనే లేదు! బైబిలు చెప్తుంది,

"క్రీస్తు యేసు పాపులను రక్షించడానికి ఈ లోకము నాకు వచ్చెను" (I తిమోతి 1:15).

ఆయన దివి నుండి కన్యయైన మరియ గర్భములో ఉదయించాడు. సిలువకు వెళ్ళాడు, మన పాప పరిహార్ధం మరణించాడు. ఆయన పునరుత్తానుడయ్యాడు మీకు నిత్య జీవము ఇవ్వడానికి. పాప జీవితం నుండి మరలి ఆయనను నమ్ము. ఆయన మనతో ఉన్నాడు. ఆయన మన ఇమ్మాను యేలు. ఆయన మీ పాపములను క్షమించి ఆయన ప్రశస్త రక్తముతో మిమ్ములను కడుగుతాడు. ఇది శ్రేష్టమైన విషయం మేము మీకు చెప్పేడు క్రిస్మస్ కు, సంవత్సరమంతటికి!

నీ ఆహ్వాన స్వరం విన్నాను, నాకు చెప్తుంది, ప్రభూ, నాకు
   నీ ప్రశస్త రక్తములొ కడుగబడడానికి కల్వరిపై చిందినది.
నేను వస్తున్నాను, ప్రభూ! ఇప్పుడే నీ చెంతకు!
   కడుగు, రక్తములొ శుద్ధి చెయ్యి
కల్వరిలొ చిందినది.

బలహీనునిగా వ్యర్దునిగా ఉన్నా, నీవే నా శక్తి;
   నీవే నా సంపూర్ణ శుద్ధి చేయువాడవు, మచ్చ లేకుండా పరిశుద్ధంగా.
నేను వస్తున్నాను, ప్రభూ! ఇప్పుడే నీ చెంతకు!
   కడుగు, రక్తములొ శుద్ధి చెయ్యి
కల్వరిలొ చిందినది.
   ("నేను వస్తున్నాను, ప్రభూ" లూయిస్ హార్ట్ సా చే, 1828-1919).
      (“I Am Coming, Lord” by Lewis Hartsough, 1828-1919).

రక్షింపబడడానికి మాతో మాట్లాడాలనుకుంటే – నిజ క్రైస్తవుడవాలంటే – దయచేసి మీ స్థలము వదిలి ఆవరణము వెనుకకు వెళ్ళండి. డాక్టర్ కాగన్ వేరే గదికి తీసుకొని వెళ్లి మీతో ప్రార్ధించి మాట్లాడతారు. డాక్టర్ చాన్, ఈ ఉదయ కాలమున యేసును నమ్మునట్లు ప్రార్ధించండి. ఆమెన్.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసగాలు ప్రతీవారము”
అంతర్జాలములో www.realconversion.com ద్వారా చదువవచ్చు.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రదోమేచే: మత్తయి 1:18-23.
ప్రసంగమునకు ముందు పాట బెంజమన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్ గారిచే:
"రమ్ము, రమ్ము, ఇమ్మాను యేలు"
      (రచయితా తెలియదు; లేటిన్ నుండి అనువాదము జాన్ యమ్. నీల్ చే, 1818-1866).

“O Come, O Come, Emmanuel”
     (author unknown; translated from Latin by John M. Neale, 1818-1866).


ద అవుట్ లైన్ ఆఫ్

ఇమ్మాను యేలు - దేవుడు మనకు తోడు!

EMMANUEL – GOD WITH US!

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు, భాషాంతరమున దేవుడు, మనకు తోడు అని అర్ధము" (మత్తయి 1:23).

(I తిమోతి 3:16)

I.   మొదటిది, ఇమ్మాను యేలు చూపిస్తుంది ఆయన శరీర దారిగా దివి నుండి భువికి వచ్చాడని, ఫిలిప్పీయులకు 2:7; రోమా 8:3; కీర్తనలు 7:11; రోమా 5:1, 2, 10.

II.  రెండవది, ఇమ్మాను యేలు అనగా అయన మనకు అందుబాటులో ఉన్నాడని, II దెస్సలొనీకయులకు 2:11; మత్తయి 28:20; I తిమోతి 1:15.