Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




ఎందుకు సంఘాలు చచ్చుబడి చల్లారిపోతున్నాయి

(ఆఖరి దినాల్లో సంఘాలు – భాగము I)
WHY CHURCHES ARE SLUMBERING AND COLD
(THE CHURCHES OF THE LAST DAYS – PART I)
(Telugu)

డాక్టర్ ఆర్.ఎల్.హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

బాప్టిష్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలెస్ నందు బోధింపబడిన ప్రసంగము
ప్రభువు దినము సాయంత్రము, అక్టోబర్ 13, 2013
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, October 13, 2013

"ఏ దుష్టుడును ఈ సంగతులు గ్రహింపకపోవును; గాని బుద్ధిమంతులు గ్రహించెదరు" (దానియేలు 12:10).


దానియేలు 12 వ అధ్యాయములో లోక అంతమును గూర్చి చాల ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఒకటవ వచనములో గొప్ప శ్రమల కాలమును గూర్చి చదువుతాము. రెండవ వచనములో నిజ క్రైస్తవులు ఎత్తబడుటను గూర్చి చెప్పబడింది, మృతులు పునరుత్థానమును గూర్చికూడ. నాల్గవ వచనములో "ఆఖరి దినాలలో" ప్రపంచ-యాత్రలు ఊహించబడ్డాయి. ఐదు నుండి ఏడు వచనాలలో ఆఖరి మూడున్నర సంవత్సరాల శ్రమల కాలమును గూర్చి చెప్పబడింది. ఎనిమిది తొమ్మిది వచనాలు కూడ చాల ఆశక్తికరమైనవి. వాటిని చూడండి. ప్రవక్త అన్నాడు,

"నేను, వాటిని గాని గ్రహింపలేక పోతిని: నా యేలిన వాడా, నేనడుగగా అతడు ఈ సంగతులు అంత్య కాలము వరకు? [వీటికి అంతమేమని] అతడు అన్నాడు, ఉండునట్లు ముద్రింపబడినవి, కనుక దానియేలు: నీవు అంతము వరకు ఉరకుండుమని [మరుగగా] చెప్పెను" (దానియేలు 12:8, 9).

దయచేసి, చూడండి.

దానియేలు జరుగబోవు కార్యాలకు సాక్షి అయినప్పటికిని, దాని భావము ఆయనకు అర్ధము కాలేదు. దేవుడు జ్ఞాపకం చేసాడు అంత్య దినాలలో, ఈ సంఘటనలు జరుగుతాయని గాని అవి మరుగుగా ఉంచబడును. అప్పుడు, "అంత్య దినాలలో" - "తెలివి అధికమగును" (దానియేలు 12:4). డాక్టర్ జె. వెర్నోన్ మెక్ గీ అన్నారు, "నేను నమ్ముతాను అది ప్రవచన జ్ఞానమును గూర్చి" (Thru the Bible, Thomas Nelson, 1982, volume III, p. 605; note on Daniel 12:4).

నేనకుంటాను డాక్టర్.మెక్ గీ ప్రాథమికంగా సరియేనని. బైబిలు ప్రవచనాలను గూర్చిన తెలివి పరిశుద్దాత్మతే నిజంగా ప్రభావితం చేయబడలేదు పంతోమ్మిదోవ శతాబ్దంలోని సగ భాగము వరకు. దేవుడు దానియేలుకు చెప్పినట్టు, "గ్రంథము మూయబడి ముద్రింపబడింది.అంత్య కాలము వరకు" (దానియేలు 12:9). బైబిలు ప్రవచనాలపై భోదించడం ఇరవై శతాబ్దపు సమగ్ర క్రైస్తవుల మధ్య చాల ఎక్కువ, అంత్య దినాలను సమీపిస్తుండగా. కానీ, ఆసక్తికరంగా, బైబిలు ప్రవచనాల ధ్యానము 1980 లో పాతగిలిపోయింది. ఈ రోజుల్లో మన సంఘాల్లో ప్రవచనాలపై భోదలు వినడం చాల అరుదు. నేను నమ్ముతాను ఈ రెండు సంఘటనలు దానియేలు పన్నెండవ అధ్యాయములో ఇవ్వబడ్డాయి. దానియేలుకు చెప్ప బడింది బైబిలు ప్రవచనాల జ్ఞానము "అంత్య దినాలలో" పెరుగుతుందని. కాని అతడు చెప్పాడు,

"...దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు: గనుక ఏ దుష్టుడను ఈ సంగతులు గ్రహింపక పోవును; గాని బుద్ధిమంతులు గ్రహించెదరు" (దానియేలు 12:10).

డాక్టర్ మెక్ గీ ఇలా వ్యాఖ్యానించారు,

      "ఏ దుష్టుడను గ్రహింపకపోవును" అంటే సహజ మానవుని గూర్చి. "కానీ సహజ మానవుడు దేవుని ఆత్మను గూర్చిన విషయాలు తీసుకోడు: ఎందుకంటే అవి వారికీ అవివేకము అనిపిస్తాయి: వాటిని గ్రహింపడు కూడ, ఎందుకంటే వారికీ ఆత్మీయ గ్రహింపలేదు" (కోరిందీయులకు 2:14).
      "కానీ తెలివైన అర్థం ఉంటుంది." "అయితే ఆయన, అనగా సత్య స్వరూపియైన ఆత్మ, వచ్చినప్పుడు, మిమ్మును సర్వ సత్యము లోనికి నడిపించును: అతను తనంతట తానే ఏమి మాట్లాడలేదు; కానీ అసలు అతను వింటాడు, అతను మాట్లాడుతాడు: అతను మీకు రాబోయే విషయాలు చెప్తాడు" (యోహాను 16:13). (J. Vernon McGee, Th.D., ibid.).

అది చూపిస్తుంది ఒక కారణాన్ని ఈ దిన సంఘాలలో ప్రవచనముపై బోధ తక్కువగా ఉందని. ఎందుకంటే చాలామంది భోదకులు మారలేదు –అందుకే ఈ ప్రాముఖ్య అంశమును వారి కళ్ళు మూయబడ్డాయి. వృద్దులు ఎక్కువ ఆత్మీయంగా ఉన్నారు. కానీ చాల మంది యవ్వన భోదకులు శారీరకంగా ఉన్నారు, చాల మంది తిరిగి జన్మించలేదు. కనుక గత ఇరవై ఐదు సంవత్సరాలుగా చాల తక్కువ భోదలు బైబిలు ప్రవచనముపై విన్నాము. అది నిజంగా సిగ్గుకరం. నా సహాయకుడు డాక్టర్ కాగన్ చెప్పాడు, "ఈ ప్రవచనాల నెరవేర్పు సమయములో, యవ్వన భోదకులు ప్రవచనముపై పూర్తిగా మాట్లాడం మానేసారు." బైబిలు ప్రవచనముపై పూర్తి ప్రసంగాన్ని గతంలో ఎప్పుడు విన్నావు? డాక్టర్ క్రిస్ వేర్ లేరు! డాక్టర్ మెక్ గీ లేరు! డాక్టర్ యమ్. ఆర్. డిహాన్ లేరు! ఇప్పుడు మనం వినేదంతా ప్రజలు ఏ దినాలలో, అది చెప్పే విషయంలో మెతుకగా ఉండేవారే ఉన్నారు! బిల్లీ గ్రేహలకు 95 సంవత్సరాలు. ప్రవచనముపై ఆయన భోదించడం మళ్లీ వినం. నేను బిల్లీ గ్రేహంతో అంగీకరించను "నిర్ణయత్వత" విషయంలో, కానీ బైబిలు ప్రవచనం విషయం కాదు. 1965 లో బైబిలు ప్రవచనంపై నిజంగా కొట్టోచ్చే పుస్తకం రాసాడు, దాని పేరు వరల్డ్ ఎఫ్లెమ్ (డబుల్ మరియు కంపెనీ) అంత్య దినాలను గూర్చి. ఆ పుస్తకంలో బిల్లిగ్రేహం ఈ వివరణ ఇచ్చారు,

      యేసు అన్నారు కొన్ని లక్షణాలు కలిగిన భవిష్యత్తు తరము ఉంటుంది అంతం సమీపంగా ఉందని చెప్పడానికి. ఇంకో మాటల్లో "ఎక్స్ జనరేషన్" ఒక విషయంలో… సూచనలన్నీ సంభవిస్తాయి [సమకూర్పు]… యేసు క్రీస్తుచే మార్చబడిన హృదయాలు, పరిశుద్దాత్మచే ప్రభావితమైన మనసులు, ఆ దిన సూచనలు చదవగలుగుతారు నోవహులా ప్రజలను హెచ్చరిస్తారు. ఈ రోజుల్లో ఈ సూచనలు నిజంగా సంభవిస్తున్నాయి [సమ కూర్పు] మొట్టమొదటిగా క్రీస్తు పరలోకానికి ఆరోహాణమైన నాటనుండి (Billy Graham, D.D., World Aflame, Doubleday and Company, 1965, p. 216).

ఆ సూచనలు ప్రతిరోజు చూస్తున్నాం. నిజంగా ఇది ఎక్స్ తరము. నిజంగా ఇది "అంత్యదినాలు." కాని మన సంఘాలలో అది ఎక్కువ వినడం లేదు! నేను నిర్ధారించుకున్నాను అది ఎందుకంటే ఈ రోజుల్లో మన భోధనలలో ఉండే శరీర కార్యములు.

"ఏ దుష్టుడును ఈ సంగతులు గ్రహింపలేక పోవును; కాని బుద్ధిమంతులు గ్రహించెదరు" (దానియేలు 12:10).

అంత్య దినాలలో మన సంఘాలను గూర్చి బైబిలులో ఇవ్వబడిన కొన్ని సూచనలు.

I.  మొదటిది, బైబిలు అంత్య-దినాల సంఘాల వెనుకబడిన స్థితిని గూర్చి ప్రవచిస్తుంది.

మీరు అర్ధం చేసుకోవాలి క్రొత్త నిబంధన గ్రంధము అంత్య-దిన సంఘాలను గూర్చి రెండు పటాలు ఇస్తుంది. ఉదాహరణకు, "అక్రమము విస్తరించును" అని మనకు చెప్పబడింది మత్తయి 24:12 లో. ఇదే విషయము ఉనికిలో ఉంటుంది "ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యర్ధమై లోకమంతటను ప్రకటింపబడును; ప్రకటన గ్రంధములో మనం చూస్తాము" (మత్తయి 24:14). "గొప్ప సంగమం" కలుపబడిన అపోస్తలుల సంఘాన్ని దాని ఉనికిని చూస్తాము అదే సమయంలో శ్రమల దినాలలో వచ్చే గొప్ప ఉజ్జీవము మనం గమనిస్తాము, ప్రకటన గ్రంధము 7:4-17 లో.

మొన్నటి రాత్రి సమాచారపూరిత వీడియో చూసాను దక్షిణ ఆఫ్రికాలో క్రైస్తవములో ఆశ్చర్యకర అభివృద్ధిని గూర్చి (“African Christianity Rising: Christianity’s Explosive Growth in Africa,” produced and directed by James Ault, Ph.D.). నల్లజాతి వేదాంతి, వీడియోలో చూపించాడు, ఎలా క్రైస్తవ్యము ఉత్తర దిశ ప్రపంచంలో ఎలా దిగజారిందో, దక్షిణ దిశలో, చైనాలో, ఎలా ఉజ్జీవము ప్రబలిందో. ఇంకోలా వివరించవచ్చు క్రైస్తవ్యము చల్లారి చనిపోయింది అభివృద్ధి ప్రపంచములో (యూరపు, అమెరికాలో, మొదలగు దేశాలలో) కాని అభివృద్ధి నొందు మూడవప్రపంచపు దేశాలలో జీవించి విస్తరిస్తుంది. ఖచ్చితంగా, కొన్నిసంఘలలో తప్పుడు సిద్ధాంతాలున్నాయి, కాని ఉజ్జివ సమయంలో అది వాస్తవము.

కాని మనం యూరప్ అమెరికాలపై ప్రసంగములో దృష్తి పెడుతున్నాము. అది ప్రాముఖ్యము ఎందుకంటే ప్రపంచమంతా మనవైపు చూస్తుంది, క్రైస్తవ్యానికి మనం మాదిరిగా ఉండాలని – నిజానికి, చాల శ్రేష్టమైన, మన సంఘాలు మునిగిపోయి, లవోదికంను స్థితిలో ఉన్నాయి. నేను గ్రహించాను మన ప్రజలు దీనిని అర్ధం చేసుకోరు ఎందుకంటే, మన పాఠ్య భాగం చెపుతుంది,

"ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింప లేకపోవును; గాని బుద్ధిమంతులు గ్రహించెదరు" (దానియేలు 12:10).

ఓలివల కొండపై క్రీస్తు ప్రసంగము (ద ఓలివేట్ దిస్క్లోసర్) ఇవ్వబడింది శిష్యుల ప్రశ్నలకు జవాబుగా, "నీ రాకడకును, ఈ యుగ సమాప్తికిని సూచన లేవి?" (మత్తయి 24:3). మత్తయి 24 మిగిలిన భాగము, మత్తయి 25 అంతా ప్రశ్నలకు బదులుగా క్రీస్తుచే చెప్పబడింది, "నీ రాకడకును, ఈ యుగ సమప్తికిని సూచన లేవి?" తరువాత మత్తయి 25:1-13 లో ఆయన "బుద్ధిగల బుద్ధిలేని కన్యకల ఉపమానము" యిచ్చాడు.

నేను విశ్వసించాను ఈ ఉపమానము ప్రవచానత్మకముగా ప్రపంచ సగ భాగంలో ఉన్న సంఘాల స్థితిని గూర్చి మాట్లాడుతుంది. పది మంది కన్యకలు సంఘాలను చూపిస్తారు. "ఐదుగురు బుద్దిగలవారు, ఐదుగురు బుద్దిలేనివారు" (మత్తయి 25:2). జాన్ నెల్సన్ డార్బి (1800-1882) అన్నాడు పది మంది కన్యకలు సంఘాన్ని గురించి కాదు, కాని ఇశ్రాయేలు దేశము గురిండి అని. కాని ఆయన తప్పు. ఈ ఉపమానము క్రైస్తవ చరిత్రలోని సంఘాలను సూచిస్తుంది, గొప్ప వ్యాఖ్యాతలను ఆది దినాలలోని క్రైస్తవ్యము సంఘ తండ్రులను గూర్చి చెప్పబడింది.

ఉపమానము మన సంఘములను గూర్చి ఏమి చెబుతుంది? ఇలా ఉంది,

"పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా, వారు కుని నిద్రించుచుండిరి" (మత్తయి 25:5).

డాక్టర్ మెక్ గీ అన్నారు, "బుద్ధి గల లేనివారు నిద్రిస్తున్నారు. వాళ్ళ మధ్య తేడా ఏంటంటే కొంత మందికి పరిశుద్ధాత్మ ఉంది (నూనేచే సూచింప బడింది) కొంత మందికి లేదు – ఎందుకంటే వాళ్ళు నిజ విశ్వాసులు కాదు" (J. Vernon McGee, Th.D., Thru the Bible, Thomas Nelson Publishers, 1983, volume IV, p. 135; note on Matthew 25:5).

కనుక, డాక్టర్ మెక్ గీ అన్నారు సగము మంది రక్షింపబడ్డారు సగం నశించి పోయారు. అది సహజ చిత్ర పఠం ఈ రోజుల్లో పడమరలో ఉన్న సంఘాల యొక్క. వారు రక్షింపబడిన నశించిన ప్రజల కలయిక. ఆగండి! క్రీస్తు అన్నాడు,

"వారు కునుకు నిద్రించుచుండిరి" (మత్తయి 25:5).

వాళ్ళందరూ నిద్రిస్తున్నారు – రక్షింపబడిన నశించినవారు! అదే చెప్తుంది!

ఈ చెడు దినాలలో ఎలాంటి వివరణ మన సంఘాలను గూర్చి! గమనించండి అది రాత్రి సమయము సంఘాలు నిద్ర పోతున్నాయి, "అర్ధ రాత్రి" (మత్తయి 25:6). నేను ఒక ప్రత్యక్ష సాక్షిని ఉజ్జీవము అర్ధ రాత్రి వచ్చిన సంఘటనకు. డాక్టర్ టోజర్ "అర్ధరాత్రి తర్వాత జననం" అనే వ్యాస రచన చేసాడు. ఎందుకు ఈ రోజుల్లో మన సంఘాలలో ఉజ్జీవము లేదు? ఆదివారం రాత్రి జరిగే ఆరాధనలు కొన్ని సంఘాలు మూసేయడానికి దీనికి సంబంధం ఏమైనా ఉందా? ఆఖరి-ప్రాంతీయ ఉజ్జీవము పాశ్చాత్య దేశములో అర్ధరాత్రి వచ్చింది స్కాట్ల్యాండ్ తీర లూయిస్ ఇసలేలో, 1949 లో – అర్ధరాత్రి! చైనాలో "గృహ సంఘాలు" రాత్రులలో కూటాలు ఉండేవి. వారు ఉజ్జీవంతో సజీవంగా ఉండడానికి ఒక కారణము! మన సంఘాలు పశ్చిమంలో బుధవారం రాత్రులు ఆదివారం రాత్రులు మూతపడ్డాయి. లీనార్డ్ రావన్ హిల్ అన్నాడు, "గట్టి సిద్దంతము ఎక్కువ మంది విశ్వాసులను నిద్ర పుస్తుంది...గట్టి ప్రసంగము ఆంగ్లంలో తప్పులు లేకుండా మంచి తర్జుమా నోటిలో వేయబడే యిసుకగా నిస్సారంగా ఉంటుంది...మనకు అగ్ని బాప్మిస్మపు గుడి కావలి...మండుచుండు గుడి ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది, దాని మద్యలో సజీవుడైన దేవుని స్వరం వింటారు" (Leonard Ravenhill, Why Revival Tarries, Bethany Fellowship, 1979, p. 106).

కాని ఈరోజు మన గుడులలో అది నిజం కాదు.

"పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా, వారందరూ నిద్రించుచుండిరి" (మత్తయి 25:5).

దేవుడు మనకు సహాయం చెయ్యాలి! క్రీస్తు మనతో అంటున్నారు, పాశ్చాత్య ప్రాంతములో,

"నీ క్రియలు నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైననూ లేవు: నీవు చల్లగా నైననూ వెచ్చగా నైనను ఉండిన మేలు. నీవు చల్లగానైనను వెచ్చగా నైననూ ఉండక, నులివెచ్చగా ఉన్నావు, కనుక నేను నిన్ను నానోటి నుండి ఉమ్మి వేయను. ఉద్దేశించు చున్నాను, నేను ధనవంతుడను, ధన వృద్ధి చేసియున్నాను, నాకేమియు కొదువలెదని చెప్పు కోనుచున్నావు: నీవు ధనవృద్ధి చేసికొనినట్టు, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుదవును, గ్రుడ్డి వాడవును దిగంబరుడవునై యున్నానని యెరుగక; అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, ధన వృద్ధి చేసియున్నాను; నీ దిసమొల, సిగ్గు కనబడకుండునట్లు భరించు కొనుటకు, తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు; నీ కన్నులకు కాటుక నాయొద్దు కొనుమ, నీకు బుద్ధి చెప్పుచున్నాను" (ప్రకటన గ్రంధము 3:15-18).

"ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింప లేకపోవును; గాని బుద్ధిమంతులు గ్రహించెదరు" (దానియేలు 12:10).

II.  రెండవది, బైబిలు ప్రవచిస్తుంది ఆఖరి దిన సంఘాలలో క్రైస్తవ ప్రేమ లోపిస్తుందని.

క్రీస్తు అన్నాడు, "అక్రమము విస్తరించుట చేత, ప్రేమ [తండ్రి ప్రేమ - క్రైస్తవ ప్రేమ] అనేకులలో చల్లరును" (మత్తయి 24:12). ఆఖరి దినాలలో సంఘాలను గూర్చి క్రీస్తు ఇచ్చిన సూచనలలో అది ఒకటి.

నా దీర్ఘ కాలపు కాపరి చైనీ గుడిలో డాక్టర్ తిమోతీ లిన్. డాక్టర్ లిన్ అన్నాడు, "క్రైస్తవులు ఒకరి నొకరు ప్రేమించు కోవాలి... మన ప్రభువులో పరిపూర్ణ విశ్వాసం ఉండాలి, ఒకరినొకరు ప్రేమించుకోవడం కూడా తప్పని సరి...ఆఖరి దినాల్లో సంఘం దీనిని గూర్చి మూడుసార్లు ఆలోచించాలి ...ఆదిమ సంఘం దేవుని సన్నిధి కలిగి ఉంది, ఎందుకంటే అపోస్తలులు దేవునిచే పిలుపబడి పంపబడ్డారు, సహొదరులు ఒకరినొకరు ప్రేమించుకున్నారు" (Timothy Lin, Ph.D., The Secret of Church Growth, FCBC, 1992, pp. 28, 29). బైబిలు చెబుతుంది,

"మనము సహొదరులను ప్రేమించుచున్నాము, కనుక మరణములో నుండి జీవములొనికి దాటి యున్నామని యెరుగుదుము. ప్రేమ లేని ఎండు మరణమందు నిలిచియున్నాడు" (I యోహాను 3:14).

"అక్రమము విస్తరించుట చేత [అన్యాయము], ప్రేమ [దేవుని ప్రేమ-క్రైస్తవ ప్రేమ] అనేకుల ప్రేమ [మరి] చల్లారును" (మత్తయి 24:12).

ఒక కారణం చల్లారడానికి, మన సంఘాల్లో ప్రేమ లేకపోవడానికి చాలా మంది సంఘ సభ్యులు రక్షణ పొందలేదు. "తన సహొదరుని ప్రేమింపని వాడు మరణమందు నిలిచి యున్నాడు" (I యోహాను 3:14). డాక్టర్ మెక్ గీ అన్నాడు మత్తయి 24:12 ను గూర్చి, "అక్రమము విస్తరించినప్పుడు అనేకుల ప్రేమ చల్లారును, ఇది ఆఖరి దినాలలో ఇంకా ఎక్కువ" (ఐబిఐడి., పేజి 127; గమనిక మత్తయి 24:12). డాక్టర్ లిన్ అన్నాడు, "ఆఖరి దినాల సంఘము దీని గూర్చి మూడు సార్లు ఆలోచించాలి" (ఐబిఐడి.).

ఆరాధనల అనంతరము గుడి ద్వారాలు వెంటనే మూసేస్తారు. ప్రజలకు కొన్ని అవకాశాలిస్తారు ఒకరినొకరు తెలుసుకోడానికి, ఒకరినొకరు ప్రేమించుకోడానికి కాదు! అందుకే మన గుడిలో చాలా మంది నిజంగా మారలేదు – అక్రమము (అన్యాయము) పెరుగుతుంది, నిజ క్రైస్తవులు కూడా నిరుత్సాహ పడి ఒకరి పట్ల ఒకరి ప్రేమ కోల్పోతారు. డాక్టర్ లిన్ అన్నాడు, "ఆఖరి దినాల సంఘము దీని గూర్చి మూడుసార్లు ఆలోచించాలి" (ఐబిఐడి.).

"ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింప లేకపోవును; గాని బుద్ధిమంతులు గ్రహించెదరు" (దానియేలు 12:10).

డాక్టర్ జాన్ ఎప్. వాల్వార్డ్, ప్రవచనముపై గౌరవనీయ వ్యాఖ్యాత, అన్నాడు "ఆఖరి దినాలకు ఒక సూచన",

అక్రమము విస్తరించడం ప్రేమ చల్లారడం. యేసు అన్నాడు "అక్రమము విస్తరించుట చేత, అనేకుల ప్రేమ చల్లారును" (మత్తయి 24:12). అబద్ద సిద్దంతము వలన ఇది సంభవిస్తుంది ["నిర్నయత్వత," నశించు ప్రజలతో గుడులను నింపుతుంది]. ఇది తేట తెల్లము క్రీస్తు నామము నుచ్చరించు వారు లౌక్యులు ప్రభువు కొరకు. ఆశక్తి లేనివారు ప్రకటన 3 లోని లవోదికయ సంఘము వలే...

క్రీస్తు అన్నాడు, "నానోటి నుండి ఉమ్మి వేయ నుద్దేశించుచున్నాను," ప్రకటన 3:16 (John F. Walvoord, Th.D., Major Bible Prophecies, Zondervan Publishing House, 1991, p. 256).

"ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింప లేకపోవును; గాని బుద్ధిమంతులు గ్రహించెదరు" (దానియేలు 12:10).

ఔను, మన సంఘాలలో చాలా మంది అంత్య-దినాలలో కునుకుచూ నిద్ర పోవుచున్నారు ఆదివారం రాత్రి, వారంలో ఇతర రోజులలో గుడికి రాకుండా. చాలా మందికి సహవాసము లేదు ప్రేమ లేదు ఎందుకంటే వారిలో చాలా మంది నిజంగా రక్షింపబడలేదు. నేను డాక్టర్ లిన్ ను గూర్చి మళ్ళీ చెప్పాలి. ఈ ప్రసంగముతో ఆయన తప్పక ఏకీభవిస్తాడు. ఆయన ఒక చైనీ కాపరే కాదు. నిజ విద్యావేత్త. ఆయన వివిధ భాషలు బాబ్ జోన్స్ విశ్వ విద్యాలయంలో బోదించాడు మా సంఘానికి రాకముందు. తరువాత తాల్బాట్ వేదాంత సేమినరీలో, ట్రినిటి సువార్త సేమినరీలో డీర్ ఫీల్డ్, ఇల్లీ నియాస్ లో బోధించాడు. ఆయన పరిచర్య ముగిసింది టైపీ, తైవాన్ లోని, చైనా సువార్త సేమినరీలో అధ్యక్షునిగా ఉన్నప్పుడు డాక్టర్ జేమ్స్ హడ్సన్ టేలర్ III అధ్యక్షత తరువాత. ఈ ప్రసంగంలో చెప్తున్నారు, డాక్టర్ లిన్ అన్నాడు, "ఆఖరి దినాల సంఘం దీని గూర్చి మూడు సార్లు ఆలోచించాలి."

"ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింప లేకపోవును; గాని బుద్ధిమంతులు గ్రహించెదరు" (దానియేలు 12:10).

ఇవి ఆఖరి దినాలు. నీవు రక్షింపబడడానికి చాలా ఆలస్యమై పోతుంది. బైబిలు ఆ హెచ్చరిక పదే పదే యిస్తుంది. రక్షింపబడడానికి యిదే అనుకూల సమయము. నిన్ను బ్రతిమాలుచున్నాను సమయముండగానే యేసు నోద్దకురా. నిన్ను బ్రతిమాలుచున్నాను ఆయన వైపు చూడమని, ఆయన సిలువపై వ్రేలాడి బహుశ్రమతో, నీ పాపన్నుంచి కడగడానికి రక్తం కార్చాడు. ఆలస్యము చెయ్యవద్దు. ఆయన యొద్దకు వచ్చి ఆయనను నమ్ము, ఇప్పుడే, ఈ సాయంకాలమే!

మీరు యేసు నమ్మడం గూర్చి మాతో మాట్లాడాలనుకుంటే, మీ కుర్చీలు వదిలి ఆవరణము వెనుకకు వెళ్ళండి. డాక్టర్ కాగన్ ప్రశాంత ప్రదేశానికి తీసుకెళ్ళి మాట్లాడి ప్రార్ధిస్తారు. నిజ క్రైస్తవుడవు కావాలనుకుంటే, ఆవరణము వెనుకకు ఇప్పుడే వెళ్ళండి. డాక్టర్ చాన్, యేసును నమ్మేటట్టు రక్షింపబడేటట్టు ఈ సాయంత్రమే ప్రార్ధించండి. ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రదోమే చే: మత్తయి 25:1-13.
ప్రసంగమునకు ముందు పాట బెంజమన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్ గారిచే:
      "ఐ విస్ వి ఉడ్ ఆల్ బీన్ రెడీ" (లారీ నోర్మన్ గారిచే, 1947-2008).
“I Wish We’d All Been Ready” (by Larry Norman, 1947-2008).



ద అవుట్ లైన్ ఆఫ్

ఎందుకు సంఘాలు చచ్చుబడి చల్లారిపోతున్నాయి

(ఆఖరి దినాల్లో సంఘాలు – భాగము I)
WHY CHURCHES ARE SLUMBERING AND COLD
(THE CHURCHES OF THE LAST DAYS – PART I)

డాక్టర్ ఆర్.ఎల్.హైమర్స్, జూనియర్ గారిచే.

"ఏ దుష్టుడును ఈ సంగతులు గ్రహింపకపోవును; గాని బుద్ధిమంతులు గ్రహించెదరు" (దానియేలు 12:10).

(దానియేలు 12:8, 9, 4; I కోరిందీయులకు 2:14; యోహాను 16:13)

I.   మొదటిది, బైబిలు అంత్య-దినాల సంఘాల వెనుకబడిన స్థితిని గూర్చి ప్రవచిస్తుంది, మత్తయి 24:12, 14, 3; 25:2, 5, 6;
ప్రకటన గ్రంధము 3:15-18.

II.  రెండవది, బైబిలు ప్రవచిస్తుంది ఆఖరి దిన సంఘాలలో క్రైస్తవ ప్రేమ
 లోపిస్తుందని, మత్తయి 24:12; I యోహాను 3:14.