Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




నీ సిలువ నెత్తుకో

TAKE UP YOUR CROSS
(Telugu)

డాక్టరు ఆర్. ఎల్ హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

బాప్టిష్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలెస్ నందు బోధింపబడిన ప్రసంగము
ప్రభువు దినము సాయంత్రము, సెప్టెంబర్ 15, 2013
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, September 15, 2013

"అంతట ఆయన తన శిష్యులను జన సమూహమును, తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు, తన్ను తాను ఉపేక్షించుకొని, తన సిలువ ఎత్తికొని, నన్ను వెంబడింప వలెను" (మార్కు 8:34).


ఈ సంఘటన మూడు సువార్తలలో వ్రాయబడింది – మత్తయి, మార్కు, లూకా. కొంత మంది బైబిలు బోధకులు అంటారు ఇది కేవలము పరిపక్వ క్రైస్తవులకని. కాని మూడు సువార్తలు ప్రత్యేకంగా చెబుతున్నాయి ఇది అందరి కొరకని. మత్తయిలో మనం చదువుతాం, "ఎవడైనను నన్ను వెంబడింపగోరువాడు, తన్ను తాను ఉపేక్షించుకొని, తన సిలువ ఎత్తికొని, నన్ను వెంబడింపవలెను" (మత్తయి 16:24). కనుక, మత్తయిలో ఉపేక్షించుకొనుట సిలువను ఎత్తికోనుట "ఎవ్వరికైనా." నిజానికి "మనుష్యుడు" పదము కే జే వి అనువాదకులచే ఇటాలిక్సులో పొందు పర్చబడింది. ఆధునిక ప్రతి "ఏదైనను" "ఎవరైన," అని ఎన్ కే జే వి లో అనువదింపబడింది. కనుక క్రీస్తును వెంబడించే ఎవనికైనా అన్వయిస్తుంది. మార్కు పాఠ్యములో చెప్పబడింది యేసు "ప్రజలను పిలిచాడు," శిష్యులతో పాటు, అన్నాడు, "నన్ను [ఎవరైన] వెంబడింపగోరువాడు, తన్ను తాను ఉపేక్షించుకొని, తన సిలువ ఎత్తికొని, నన్ను వెంబడింపవలెను." కనుక, మరల, ఇది గుంపులో ప్రతి ఒక్కరికీ, పన్నెండు మంది శిష్యులకు మాత్రమే కాదు. లూకా 9:23 లో, చదువుతాము, "ఆయన అందరితో యిట్లనెను, ఎవడైనను..." కనుక ఇది సారాంశ సువార్తలలో స్పష్టంగా ఉంది యేసు అందరిని శిలువ భాద భారించమని, కేవలం పన్నెండు శిష్యులకు మాత్రమే కాదు. యేసు అందరితో మాట్లాడుతూ అన్నాడు, "నన్ను వెంబడింపగోరువాడు, తన్ను తాను ఉపేక్షించుకొని, తన సిలువ ఎత్తికొని, నన్ను వెంబడింపవలెను" (మార్కు 8:34). ఈ రెండు విషయాలు ఈ పాఠ్యము లో కనుపిస్తున్నాయి.

I. మొదటిది, ఆధునిక మతదూరతలు కాదంటారు ఇది నిజ మార్పులో సంభవిస్తుందంటే.

గత ఆదివారం రాత్రి నేను మతదూరత పై ప్రసంగము బోధించాను. నేను రిఫర్మేషన్ స్టడీ బైబిలు నుండి చెప్పను, ఇలా, "మతదూరతల అభిప్రాయాలు క్రైస్తవుని జీవితాన్ని దేవుని న్యాయ శాస్త్రము నియంత్రిస్తుంది అనే విషయాన్ని వ్యతిరేకిస్తాయి...వారు తప్పుడు ముగింపు తెస్తారు వారి ప్రవర్తన లో మార్పు ఉండదని, నమ్ముతూ ఉంటే...క్రీస్తులో ఉంటూ పాపాన్ని హత్తుకొని జీవించడం సాధ్యము కాదు" (పేజీ 1831). నేను చెప్పాను డాక్టర్ ఎ.డబ్ల్యూ. టోజర్, చెప్పినది,

         మన సువార్తిక క్రైస్తవ పరిదుల్లోకి గమనించ దగ్గ వ్యతిరేకత చోటు చేసుకుంది – ఎక్కువగా అంగీకరింప బడే విషయము మానవులమైన మనము ఎన్నుకోవచ్చు క్రీస్తును అంగీకరించ వచ్చు రక్షకుడుగా ఆయన మనకు అవసరం కాబట్టి మరియు ప్రభువు ఆయనకు విధేయత చూపడం ఎంతకాలమై నా వాయిదా వేసే హక్కు మనకుంది!...
         ఎంత విషాదం మన దినాల్లో తరుచూ వింటాం ఇలాంటి దానిపై ఇవ్వబడ్డ సువార్తను: "యేసు నోద్దకు రా! ఎవ్వరికీలోబడవలసిన అవసరం లేదు. దేనిని మార్చనక్కరలేదు. దేనిని విడిచి పెట్టనక్కరలేదు – వచ్చి రక్షకునిగా ఆయనను నమ్మాలి!"
         కనుక వారు వచ్చి రక్షకుని నమ్మారు. తరువాత, కూటములోనో సదస్సులోనో, ఇంకో సువార్త వింటారు: "ఇప్పుడు ఆయనను రక్షకునిగా స్వీకరించారు, ఆయనను ఏ విధంగా ప్రభువుగా తీసుకుంటారు?"
         ఇది అన్ని చోట్ల విన్నంత మాత్రాన అది సరి కాదు అనేది సత్యము. విభజింపబడిన క్రీస్తును నమ్మమని స్త్రీ పురుషులను బలవంతపెట్టడం తప్పు ఎందుకంటే క్రీస్తులో సగభాగాన్ని ఎవ్వరూ స్వీకరించలేరు...యేసు క్రీస్తును ఒక వ్యక్తి నమ్మినప్పుడు యేసు వ్యక్తి ప్రభువును సంపూర్ణంగా నమ్మాలి – ఏ అరమరిక లేకుండా! ఒక దైవిక నర్సుగా యేసును చూడడం తప్ప పాపం మనలను రోగ గ్రస్తులను చేసునప్పుడు, సహాయం పొందాక, "గుడ్ బై" చెప్పడం – మన మార్గంలో మనం వెళ్ళడం...
         మనం ఆయన దగ్గరకు ఎలా రాకూడదంటే, చెక్క వస్తువులు కొన్నవాడు, అన్నాడు: "ఈ బల్ల తీసుకుంటాను ఆ కుర్చీ తీసుకొను" – విభాగించడం! లేదు, అయ్యా! క్రీస్తు సంపూర్ణంగా లేక క్రీస్తు లేకుండా!
         నేను నమ్ముతాను ప్రపంచానికి మనం తిరిగి సంపూర్ణ క్రీస్తును ప్రకటించాలి – క్రీస్తు మన క్షమాపణలు అవసరము లేని, విభజింపబడని క్రీస్తు, క్రీస్తు అందరికి ప్రభువుగా ఎవ్వరికీ ప్రభువు కాకుండా!
         నేను హెచ్చరిస్తున్నాను – ఆయన నుండి సహాయము పొందలేవు నీవనుకుంటే ఆయన ఆజ్ఞాపించ లేని వారిని రక్షింపరు! ఆయన పరిపాలన విభాగింపబడదు. సగ – క్రీస్తును నమ్మలేము. ఆయనను ఉన్న పాటున తీసుకోవాలి – అభిషిక్తుడైన రక్షకుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు! ఆయన ఉండలేడు మనలను రక్షించి పిలిచి ఎన్నుకొని గ్రహించాలి ఆయన నడిపిస్తాడు మన జీవితాలను నియంత్రణ చేస్తాడు...
         మనము అనుకోగలమా మనము యేసు క్రీస్తు పట్ల విధేయత లేకుండా ఉండగలమని? మనం రక్షణ కోసం మోర పెట్టిన క్షణం నుండి మన విధేయత ఆయన పట్ల కనుపర్చాలి, [నీవు] ఆ విధేయత ఇవ్వకపోతే, నేను ఆశ్చర్య పడడానికి కారణముంది [నీవు] నిజంగా మార్పు నొందలేదని!
         నేను చూస్తున్నాను వింటున్నాను క్రైస్తవులు చేసే పనులు...వాళ్ళు నిజంగా మార్పు నొందారా అనే ప్రశ్న లేవనేత్తుతున్నాను…
         నేను నమ్ముతాను ఇది తప్పుడు బోధ ఫలితము. ప్రభువును ఆసుపత్రి గాను యేసును ప్రధాన ఉద్యోగి గాను వారు తలస్తారు శ్రమలో ఉన్న పేద పాపులను లేవనెత్తడానికి! "నన్ను నిర్ధారించు, ప్రభువా," వారు వక్కాణిస్తున్నారు, "నా దారిలో నేను వెళ్లేటట్టు!"
         అతి చెడ్డ బోధ...స్వార్ధ-మోసాలతో నిండుకుంది. మనం మన ప్రభువైన యేసును చూద్దాం, ఉన్నతంగా, పరిశుద్ధంగా, కిరీటిగా, ప్రభువులకు ప్రభువుగా రాజులకు రాజుగా, పరిపూర్ణ అధికారము కలవానిగా అతనిచే రక్షింపబడిన ప్రజల నుండి పూర్తి విధేయత పొందటానికి!... (A. W. Tozer, D.D., I Call It Heresy!, Christian Publications, 1974 edition, pp. 9-21).

నిజ మార్పుకు రావాలి నీవు పశ్చాత్తాపపడి ప్రభువైన యేసు క్రీస్తును నమ్మాలి. అంటే నీ జీవితం ఒక కొత్త మలుపు తీసుకుంటుంది నీవు నిజంగా ఆయనను నమ్మితే. అపోస్తలుడైన పౌలు దానిని తేట పరిచాడు చెప్పాడు,

"కాగా ఎవడైనను క్రీస్తు నందున్న యెడల, వాడు నూతన సృష్టి: పాతవి గతించెను; ఇదిగో, కొత్త వాయెను" (II కోరిందీయులకు 5:17).

నశించిన పాపికి కృప ద్వారానే, ప్రభువైన యేసు క్రీస్తు నందలి విశ్వాసము ద్వారానే జీవితంలో కొత్త మలుపు వస్తుంది!

"మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింప బడియున్నారు; ఇది మీ వలన కలిగినది కాదు: దేవుని వరమే: అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడును అతిశయ పడ వీలులేదు. మరియు వాటి యందు మనము నడుచుకొన వలెనని, దేవుడు ముందుగా సిద్ధ పరిచిన సత్ర్యియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృస్టించబడిన వారమై, ఆయన చేసిన వారమై యున్నాము" (ఎఫెస్సీయులకు 2:8-10).

"సత్ర్కియలు చేయుటకు క్రీస్తు యేసు నందు సృస్టించబడిన వారమై" – యేసును ప్రేమించు వారందరికి అది తేట తెల్లము, యేసు అన్నాడు, "మీరు నన్ను ప్రేమిస్తే, నా ఆజ్ఞలు గైకొంటారు" (యోహాను 14:15). మరల, యేసు అన్నాడు, "నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు" (యోహాను 14:24). కోరిందు సంఘ మతదూరతలను అపోస్తలుడైన పౌలు గద్ధించినప్పుడు, అన్నాడు, "దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తి తోనే ఉన్నది" (I కోరిందీయులకు 4:20). యేసును ప్రేమించడం అనే పదాలకు అర్ధం ఉండదు ఒకని జీవిత మార్పుకు కృపా శక్తి అవసరమని గ్రహించకపోతే. మతదూరతలు "దైవత్వము ధరిస్తారు, దాని శక్తిని తిరస్కరిస్తారు" (II తిమోతీ 3:5). అలా, "ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటారు, సత్య గ్రహింపు లోనికిరారు" (II తిమోతీ 3:7). మన పాఠము లో యేసు ఆ సత్యాన్ని గూర్చి చెప్తాడు,

"నన్ను వెంబడింపగోరువాడు, తన్ను తాను ఉపేక్షించుకొని, తన సిలువ ఎత్తికొని, నన్ను వెంబడింపవలెను" (మార్కు 8:34).

II. రెండవది, నిజంగా మార్పు నొందిన వారికి దానిని నమ్మడంలో ఎలాంటి ఇబ్బంది లేదు.

అయినా అది మారని, సహజ మనిషి నుండి పూర్తిగా దాచబడి ఉంది.

"ప్రకృతి సంబందియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపదు: అవి అతనికి వెర్రి తనముగా ఉన్నవి: అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును, కనుక అతడు వాటిని గ్రహింపజాలడు" (I కోరిందీయులకు 2:14).

అది సాతాను ద్వారా దాచబడింది, "ఈలోక అధికారి వాడు,"

"మా సువర్త మరుగు చేయబడిన యెడల, నశించుచున్న వారి విషయములోనే మరుగు చేయబడి ఉన్నది: దేవుని స్వరూపి యైయున్న క్రీస్తు మహిమ కనుపరుచు సువార్త ప్రకాశము వారికీ ప్రకాశింపబడు నిమిత్తము, ఈ యుగ సంబంధయైన దేవత అవిశ్వాసులైన వారి, మనో నేత్రములకు గుడ్డి తనము కలుగ చేసెను" (II కోరిందీయులకు 4:3-4).

సువార్త అపోస్తలుడైన పౌలుచే వర్ణింపబడినది,

"నాకియ్యబడిన ఉపదేశములను మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి చెందెను; సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మృతులలో నుండి లేచెను" (I కోరిందీయులకు 15:3-4).

ఏ విధంగా సువార్త నిన్ను రక్షించి నీ జీవితాన్ని మారుస్తుంది?

నీవు క్రీస్తును నమ్మితే, సిలువపై ఆయన మరణము నీ పాపానికి ప్రాయశ్చిత్తమిస్తుంది. నీవు క్రీస్తును నమ్మితే, ఆయన పునరుత్ధానము నీ జీవితంలో కొత్త మలుపుకు శక్తినిస్తుంది. మళ్ళీ, ఎఫెస్సీయులకు 2:8-10 చూడండి,

"మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింప బడియున్నారు; ఇది మీ వలన కలిగినది కాదు: దేవుని వరమే: అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడును అతిశయ పడ వీలులేదు. మరియు వాటి యందు మనము నడుచుకొన వలెనని, దేవుడు ముందుగా సిద్ధ పరిచిన సత్ర్యియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృస్టించబడిన వారమై, ఆయన చేసిన వారమై యున్నాము" (ఎఫెస్సీయులకు 2:8-10).

కృప ద్వారా యేసు నందలి విశ్వాసము ద్వారా మనం రక్షింప బడ్డాము. మనం రక్షింపబడ్డాక, "వాటి యందు [కొరకు] నడుచు కొనవలెనని, దేవుడు ముందుగా సిద్ధపరిచిన [ముందు సిద్ధపరిచిన], సత్ర్కియలు చేయుటకు సృస్టించబడ్డాము" (ఎఫెస్సీయులకు 2:10). యేసు నందలి విశ్వాసము మనలను దేవునిచే అంగీకరింప చేస్తుంది. క్రీస్తు నందలి విశ్వాసం ద్వారా తిరిగి జన్మించగలము. తిరుగు జన్మ కొత్త జీవితాన్ని ఇస్తుంది, కొత్త దిశ చూపిస్తుంది. పరిపూర్ణత కాదు. అది పలుగబడే ప్రక్రియ ద్వారా వస్తుంది. కాని కొత్త దిశ – నూతన జీవన శైలి – క్రీస్తుకు లోబడాలనే ఇష్టత! ఇక్కడ మన పాఠ్యము వస్తుంది,

"నన్ను వెంబడింపగోరువాడు, తన్ను తాను ఉపేక్షించుకొని, తన సిలువ ఎత్తికొని, నన్ను వెంబడింపవలెను" (మార్కు 8:34).

మేల్కొలుపు, ప్రత్యేకంగా తిరుగు జన్మ, ఆశ పుట్టిస్తుంది హృదయంలో క్రీస్తు ఆజ్ఞ గైకొనాలని! కొత్త జన్మ లేకపోతే, యేసుకు లోబడాలనే ఆశ ఉండదు. కాని దేవుని ఆత్మ తన పని చేసినప్పుడు, పై విధంగా జన్మించిన వాడు క్రుశించక క్రీస్తు ఆజ్ఞ తిరస్కరించకుండా ఉంటాడు,

"నన్ను వెంబడింపగోరువాడు, తన్ను తాను ఉపేక్షించుకొని, తన సిలువ ఎత్తికొని, నన్ను వెంబడింపవలెను" (మార్కు 8:34).

డైట్రిక్ బోన్ హొఫర్ (1906-1945) స్ఫూర్తి పట్ల స్వతంత్ర ఉద్దేశము కలిగి యున్నప్పటికినీ, దేవుడు ఈ సత్యాన్ని అతనికి చూపించాడు. ఈ సత్యాన్ని గ్రంహించాడు, చాలా మంది తప్పిపోయినప్పటికి. బోన్ హొపర్ ఒక యవ్వన లూధరన్ కాపరి హిట్లర్ కు వ్యతిరేఖంగా మాట్లాడాడు, జర్మనీ ఓడిపోయే ముందు నాజీలచే ఉరి తీయబడ్డాడు. ఆయన 39 సంవత్సరాలవాడు. ఆయన చక్కని పుస్తకములో, ద కాస్ట్ ఆప్ ది సైపుల్ షిప్, బోన్ హొపర్ అన్నాడు, "క్రీస్తు ఒక వ్యక్తిని పిలిచినప్పుడు, తను వచ్చి చనిపోవాలంటాడు. ఇల్లు వదిలి వారి కోసం పని చేసిన మొదటి శిష్యుల చావు లాంటిది, లేక లూధర్ లాంటి మరణము, ఆ స్థానం వదిలి ప్రపంచంలోకి వెళ్ళాడు. ప్రతీరోజు అదే చావు…నిజానికి యేసు ప్రతి ఆజ్ఞ చనిపోమని, మన మమకారాలు, కమాతురతల విషయంలో... ప్రతి రోజు మనం కొత్త శోధనలు ఎదుర్కొంటాం, ప్రతీ రోజు క్రీస్తు యేసు కొరకు శ్రమ పడాలి. గాయాలు చారలు [మనం] పొందేవి [యుద్ధములో] ప్రభువు సిలువలో మన పాలు పంపులకు గుర్తులు...శ్రమ పడుట నిజ వ్యక్తిత్వానికి గుర్తింపు. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాదు. క్రీస్తును వెంబడించుట అంటే పాసియో పాశివ, శ్రమ పడాలి కాబట్టి శ్రమ పడుతున్నాం. అందుకే లూధర్ నిజ సంఘ శూచికలో శ్రమను అనుభవించాడు, ఆగ్స్ బర్గ్ ఒప్పుకోలు వివరణ ఏర్పాటుకు దోహద పడింది సంఘము సమాజమనిపించుకోంది ‘సువార్త నిమిత్తము హింసింపబడి హత సాక్షులుగా మారారు.’ మన సిలువను ఎత్తుకోవడం తిరస్కరిస్తే మనస్యుల చేతులలో శ్రమ తిరస్కారానికి వద్దంటే [పోగొట్టుకుంటారు] క్రీస్తు సహవాసాన్ని వెంబడించడం ఆపేస్తారు...ఆదిమ క్రైస్తవ హత సాక్షులు క్రియలు చూపిస్తుంది ఎట్లు క్రీస్తు ఆయన మారిపోయి ఆయన నిమిత్తము వారి తాత్కాలిక వేదన కలిగి ఆయన సన్నిది గూర్చిన చెప్పన శక్యము కాని హామీ పొందాడు. భయంకర శ్రమాలలో వాటిని ఆయన నిమిత్తం భరించారు, వారు ఆయన సహవాసములొ పాలి భాగస్తులయ్యారు. సిలువను భరించడం శ్రమపై విజయాన్ని పొందడానికి తార్కాణము. క్రీస్తును వెంబడించే అందరికి ఇది వాస్తవము, ఎందుకంటే అది ఆయనకు వాస్తవము...ప్రతీ క్రైస్తవునిపై సిలువ ఉంచబడింది. మొదటి క్రైస్తవుని శ్రమ ప్రతి మనుష్యుడు అనుభవించాలి ప్రపంచ భాందవ్యాలు విడిచిపెట్టాలి. ముసలివాని చావు అతడు క్రీస్తును ఎదుర్కోడానికి ఫలితము. మనం [శిష్యులవడం ఆరంభిస్తే] మనం మనలను క్రీస్తుడు ఆయన మరణ సమ్మేళనముతో ఎదుర్పాటుకు దోహదం చేస్తుంది – మన ప్రాణాలు మరణానికి ఇస్తాం. అది అలా ప్రారంభమై; సిలువ...మన ప్రారంభపు క్రీస్తుతో కలయిక పట్ల నడిపిస్తుంది. క్రీస్తు ఒక వ్యక్తిని పిలిస్తే, చావుకు సిద్ధమవాలనుకుంటాడు" (Dietrich Bonhoeffer, The Cost of Discipleship, Collier Books, 1963 paperback edition, pp. 99-101).

నాకు పాస్టరు రిచర్డ్ వర్మ్ బ్రాండ్ (1909-2001) తెలుసు. మన గుడిలో ఒక ఫోటో ఉంది అందులో ఆయన తన భార్య మా అబ్బాయిల చేతులు పట్టుకొని, ప్రార్ధించి క్రీస్తుకు సమర్పించే దృశ్యము. నాకు చాలా గొప్ప క్రైస్తవులు తెలుసు. డాక్టర్ తిమోతి లిన్, చైనీస్ గుడిలో నా పాస్టరు, చాలా గొప్ప కాపరి. డాక్టర్ క్రిస్టఫర్ కాగన్ నేను వ్యక్తిగతముగా తెలిసిన వాళ్ళలో గొప్పవాడు. పాస్టరు హెర్ మాన్ ఓటన్ దేవుని దృష్టిలో పరిశుద్దుడు. ఆయన 50 సంవత్సరాలుగా బైబిలుకు వ్యతిరేకంగా జరిగే స్వతంత్ర దాడులనుండి కాపాడుతూ వచ్చాడు, అది ఆయనకు చాలా శ్రమలు కలిగించింది, స్నేహితులు కోల్పోయారు, మిస్సోరీ సైనాడ్ లూధరన్ తెగలో. అలాంటి వ్యక్తిని హర్షిస్తాను – ఆయన చెప్పే ప్రతీ దానితో అంగీకరించాకున్నా. కాని పాస్టరు వర్మ్ బ్రాండ్, నేను కలిసిన వారిలో, మిక్కిలి గొప్పవాడు.

రిచర్డ్ వర్మ్ బ్రాండ్ లూధరన్ పాస్టరు పద్నాలుగు సంవత్సరాలు రోమోనియా కమ్యూనిస్టు జైలులో గడిపాడు. రెండు సంవత్సరాలు అంధకారంలో ఉన్నాడు, సూర్యుని చూడకుండా, మానవ స్వరం వినకుండా. ఆయన కొట్టబడి, ఈడ్చబడి, చిత్ర హింసలు పెట్టబడ్డాడు. ఆయన శరీరము దెబ్బలచే తీవ్రంగా గాయ పరచబడింది. భయంకరులు లోతైన గాయాలు నడుమ మెడల మీద చేసారు. మన గుడిలో నిలబడి ప్రసంగము చెయ్యలేక పోయారు, ఆయన పాదాలు అంతగా కొట్టబడ్డాయి. తన పుస్తకంలో, ఇన్ గాడ్స్ అండర్ గ్రౌండ్, తను అన్నాడు, “ప్రత్యేక విభాగంలో గట్టి స్వరం వినేవాడ్ని, ప్రతీ రోజూ.

క్రైస్తవత్వము చచ్చిపోయింది.
క్రైస్తవత్వము చచ్చిపోయింది.
క్రైస్తవత్వము చచ్చిపోయింది.

క్రమేణా నాకు తెలిసింది చాలా నెలల ఆ విషయాలు చెప్పారు. క్రైస్తవత్వము చచ్చిపోయింది. బైబిలు ముందుగా చెప్పింది, దీని గూర్చి అది జరిగింది. నేను మగ్ధలేనే, మరియు దీని గూర్చి ఆలోచించాను, మరి యొక దాని గూర్చి కాదు, అది నాకు సహాయపడింది ఆత్మను చంపే మెదడు తుడిచిపెట్టడం నుండి. ఆమె క్రీస్తు పట్ల నమ్మకంగా ఉంది ఆయన సిలువపై పలుకుతున్నప్పుడు, ‘నా దేవా, నా చేయి ఏల విడిచితివి?’ ఆయన సమాధిలో ఉన్నప్పుడు, అచ్చట ఆమె ఏడ్చింది ఆయన లేచెంత వరకు. చివరకు క్రైస్తవత్వము చచ్చిపోయిందని నమ్మి, అన్నాను, ‘అయినా, నమ్ముతాను, సమాధి వద్ద ఏడుస్తాను అది లేచే వరకు, తప్పకుండా అలా జరుగుతుంది’" (Richard Wurmbrand, Th.D., In God’s Underground, Living Sacrifice Books, 2004, pp. 263, 264).

నేను యేసు కొరకు ఎక్కువ శ్రమ పడవలసిరాలేదు. కాని ఆఖరి లిబరల్ సదరన్ బాప్టిస్టు సెమినరీలొని రెండు సంవత్సరాలు శాన్ ప్రాన్సిస్కో దగ్గర చాలా కష్టమైనవి. ఉద్రేకంగా గెత్సమనేలో ఉన్నట్టు బావించాను. నా స్నేహితులు నన్ను వదిలినప్పుడు ఒంటరిగా, ఇద్దరు అధ్యాపకులన్నారు క్రీస్తును బైబిలును సమర్ధిస్తే సదరన్ బాప్టిస్టు సంఘములో పాస్టరుగా తీసుకోబడనని. డాక్టర్ గ్రీన్, ఇంకొక బోధకుడు, అన్నాడు, "నువ్వు మంచి బోధకుడవే. తొందర పెట్టడంలో మంచి పేరు వస్తుంది. ఒక సంఘ కాపరి కావాలంటే, అది మానుకోవాలి." అదే కాలేజీలో చెప్పుతున్నట్టు," బైబిలును సమర్ధించడం ఆపే వరకు నీకు ఉద్యోగం రాదు."

నేను నా గదికి వెళ్ళిపోయాను. నా జాకెట్ వేసుకొని నడిచాను. సముద్రపు చల్లని గాలి నన్ను వణికించింది. అధ్యాపకుడు అన్న మాటలు ఆలోచించాను, "నీకు చెడ్డ పేరు వస్తుంది. నీకు సంఘములో స్థానము దొరకదు. బైబిలును సమర్ధించడం ఆపు." నడుస్తూ, నాలో నేను అనుకున్నాను, "ఏంటది---! ఏది జరిగినా యేసు కొరకు ఆయన మాట కొరకు నేను నిలబడతాను. గుడికి రాక పోయినా---పరవా లేదు!" నాకు తెలుసు దాన్ని ఇంకొక విధంగా చెప్పాలని కాని, వికటంగా అలా అనుకుంటాను, నాలో నేను నాతో ఆరోజు! డాక్టర్ జాన్ రాలింగ్స్ (1914-2013) అదే చెప్పి ఉంటారు! లూధర్ (1483-1546) అలానే చెప్పి ఉంటాడు! అపోస్తలుడైన పౌలు అన్నాడు, "నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన, అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై, సమస్తమును నష్టముగా ఎంచుకోనుచున్నాను" (ఫిలిప్పీయులకు 3:8). కొన్ని సార్లు వేరే మార్గము లేదు బలవంతముగా ఒక ఉద్దేశము చెప్పడానికి. నేనన్నాను, "ఏంటి--- ఈ విడ్డూరమంతా! ఏమైనా సరే క్రీస్తు కొరకు ఆయన మాటకోరకు మాట్లాడడం మానను!" నేను సమస్తమును "పెంటకుప్పగా ఎంచుకొనుచున్నాను, క్రీస్తు నిమిత్తము"!

ఏమి కోల్పోతావని భయపడుతున్నావ్? ఏది వదిలి పెట్టాలని భయపడుతున్నావ్? నిన్ను నీవు ఉపేక్షించుకోకుండా, ఏది నిన్ను భయపెడుతుంది, సిలువ నెత్తుకొని క్రీస్తును వెంబడించకుండా? సాధారణంగా ఒక రకమైన భయం ప్రజలను ఆపుతుంది. ఈ భయాలను "పెంటకుప్పలా," ఎంచి క్రీస్తు నోద్దకు వస్తావా? అలా చేస్తే నీవు, దేవుని దృష్టిలో ప్రత్యేక వ్యక్తి అవుతావు!

ఆదిమ సంఘములో క్రీస్తు కొరకు చనిపోయిన వారిని "హత సాక్షులు" అనేవారు. కాని వర్మ్ బ్రాండ్ లాంటి వారు, చనిపోకుండా బహు శ్రమలు అనుభవించిన వారిని, "ఒప్పుకొనేవారు" అంటారు. పాస్టరు వర్మ్ బ్రాండ్ ఒప్పుకునేవారు. తానూ ఉపేక్షించుకొని, సిలువ నెత్తికొని యేసు దగ్గరకు వచ్చాడు, చాలా శ్రమలు పడవలసివచ్చినప్పటికీ. నువ్వు అలా చేస్తావా? అన్నీ లెక్కిస్తావా "పెంటకుప్పలా [నీవు] క్రీస్తును పొండుకునే వరకు?" నిన్ను ఉపేక్షించుకుంటావా, సిలువను ఎత్తుకొని, యేసు దగ్గరకు వస్తావా? నీవు అంటావా, డాక్టర్ జాన్ ఆర్. రైస్ గారి ప్రియమైన పాటలోని మాటలు,

యేసు, నేను సిలువ ఎత్తుకొని, సమస్తం విడిచి నిన్ను వెంబడిస్తాను;
   నిరాశ్రయులైన, విడిచిపెట్టిన, నీచంగా చూసినా, అయినా, నీవు, నా సమస్తము కొరకు నీవన్నీ పోగొట్టు కున్నావు:
ప్రతి అభిలాష నశించి, కోరుతున్న, నిరీక్షిస్తున్న, తెలుసు;
   అయినా నా స్థితి ఎంత గొప్పది, దేవుడు పరలోకము ఇంకనూ నావే.

పాతాళ కాగితంలో 8వ పాట. దయచేసి లేచి నిలబడి పాడండి.

యేసు, నేను సిలువ ఎత్తుకొని, సమస్తం విడిచి నిన్ను వెంబడిస్తాను;
   నిరాశ్రయులైన, విడిచిపెట్టిన, నీచంగా చూసినా, అయినా, నీవు, నా సమస్తము కొరకు నీవన్నీ పోగొట్టు కున్నావు:
ప్రతి అభిలాష నశించి, కోరుతున్న, నిరీక్షిస్తున్న, తెలుసు;
   అయినా నా స్థితి ఎంత గొప్పది, దేవుడు పరలోకము ఇంకనూ నావే.

లోకము నన్ను తృణీకరించినా విడిచినా, వారు నా రక్షకుని కూడా, విడిచారు;
   మానవ హృదయాలు చూపులూ మోసగించాయి; నీ వల్ల కాదు, మానవునిలా, అసత్యంగా;
మరియు, నీవు నిన్ను చూసి నవ్వి, జ్ఞానము గల దేవా, ప్రేమ, శక్తి,
   శత్రువులు అసహ్యించినా, స్నేహితులు విడిచినా; నీ ముఖము చూపు, అంతా ప్రకాశ వంతమూ.

నరుడు తొందర పెట్టి భాదించవచ్చు, "నేను నీ భాహువు వైపే నడవనీ;
   శ్రమల జీవితమూ నన్ను పలుగగొట్టినా, పరలోకము మధుర విశ్రాంతిని ఇస్తుంది.
ఓ దుఃఖము నాకు హాని చేయదు, నీ ప్రేమ నా కొరకు ఉంచబడింది;
   ఓ ఈ సంతోషము నన్ను సంతోష పరచదు, ఆ ఆనందము నీతో అమిలితము.
   ("యేసు, నా సిలువ ఎత్తుకొన్నాను" హెన్రీ ఎఫ్.లైఫ్ చే, 1793-1847).
   (“Jesus, I My Cross Have Taken” by Henry F. Lyte, 1793-1847).

క్రైస్తవుడవడానికి మాతో మాట్లాడాలనుకుంటే, మీ స్థలాలు విడిచి ఆడిటోరియం వెనుక భాగానికి రండి. డాక్టర్ కాగన్ ప్రశాంత స్థలానికి తీసుకొని వెళ్లి మీ కొరకు ప్రార్ధిస్తారు. డాక్టర్ చాన్, రక్షింపబడడానికి స్పందించిన వారి కొరకు దయచేసి ప్రార్ధించండి.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసగాలు ప్రతీవారము”
అంతర్జాలములో www.realconversion.com ద్వారా చదువవచ్చు.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రదోమే చే: మార్కు 8:34-38.
ప్రసంగమునకు ముందు పాట బెంజమన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్ గారిచే:
"యేసు, నా సిలువ ఎత్తుకొన్నాను" (హెన్రీ ఎఫ్.లైఫ్ చే, 1793-1847).
“Jesus, I My Cross Have Taken” (by Henry F. Lyte, 1793-1847).


ద అవుట్ లైన్ ఆఫ్

నీ సిలువ నెత్తుకో

డాక్టరు ఆర్. ఎల్ హైమర్స్, జూనియర్ గారిచే.

"అంతట ఆయన తన శిష్యులను జన సమూహమును, తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు, తన్ను తాను ఉపేక్షించుకొని, తన సిలువ ఎత్తికొని, నన్ను వెంబడింప వలెను" (మార్కు 8:34).

(మత్తయి 16:24; లూకా 9:23)

I.   మొదటిది, ఆధునిక మతదూరతలు కాదంటారు ఇది నిజ మార్పులో సంభవిస్తుందంటే, ఎఫీస్సీయులకు 2:8-19; యోహాను 14:15, 24; I కోరిందీయులకు 4:20; II తిమోతీ 3:5, 7.

II.  రెండవది, నిజంగా మార్పు నొందిన వారికి దానిని నమ్మడంలో ఎలాంటి ఇబ్బంది లేదు, II కోరిందీయులకు 5:17; I కోరిందీయులకు 2:14; II కోరిందీయులకు 4:3-4; I కోరిందీయులకు 15:3-4; ఎఫీస్సీయులకు 2:8-10; ఫిలిప్పీయులకు 3:8.