Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




క్రీస్తు శ్రమ - సత్యము అసత్యము

(ప్రసంగము సంఖ్య 5 యెషయా 53)
CHRIST’S SUFFERING – THE TRUE AND THE FALSE
(SERMON NUMBER 5 ON ISAIAH 53)
(Telugu)

డాక్టరు ఆర్. ఎల్ హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

బాప్టిష్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలెస్ నందు బోధింపబడిన ప్రసంగము
శనివారము, సాయంత్రము, మార్చి 17, 2013
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, March 17, 2013

"నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను: అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన భాదింబడినవాని గాను, శ్రమ పొందినవాని గాను మనమతనిని ఎంచితిమి" (యెషయా 53:4).


మన పఠనములోని మొదటి భాగం ఏమి చెబుతుందంటే “యేసు మన రోగములను భరించెను, మన వ్యసనమును వహించెను." ఈ వచన భాగము క్రొత్త నిబందనలో మత్తయీ 8:17 లో చెప్పబడినది,

“అందువలన ఆయనే [యెషయా] మన బలహీనతలను వహించుకొని,మన రోగములను భరించెనని, ప్రవక్తయైన యెషయా ద్వార చెప్పబడినది నెరవేరెను" (మత్తయీ 8:17).

మత్తయీ 8:17 అన్వయింపు ఎక్కువగా నేరుగా చెప్పబడిన యెషయా 53:4 కంటే. డాక్టర్ ఎడ్వర్డ్ జె. యంగ్ అన్నారు, "మత్తయీ 8:17 లో చెప్పబడినది సముచితము, రోగమును గూర్చి చెప్పబడినది పాపమే అయినప్పటికీ, ఈ వచనములో ఇమడబడింది, పాపము యొక్క పరిహారముల తొలగింపు. రోగము పాపము యొక్క విడదీయ నేరని భాగస్వామి" (ఎడ్వర్డ్ జె.యంగ్, పి.హెచ్.డి., ద బుక్ ఆఫ్ యెషయా, విల్లియం బి. ఎర్ద మాన్స్ పబ్లిషింగ్ కంపెని, ప్రతి 3, పేజీ. 345). (Edward J. Young, Ph.D., The Book of Isaiah, William B. Eerdmans Publishing Company, volume 3, p. 345).

మత్తయీ 8:17 లో రోగనివారణ నేరవేర్పుకు అన్వయింపవచ్చు. కాని మనము గుర్తుంచుకోవాలి అది కేవలము మత్తయీచే ఇవ్వబడిన అన్వయింపు గాని, మన పాఠ్యభాగములో ఇవ్వబడిన అసలు అర్దము కాదు. ప్రొఫెసర్ "హేన్ స్టెన్ బర్గ్ సరిగ్గా చెప్పారు, సేవకుడైన [క్రీస్తు] పాపపరినములను భరిస్తాడు, వాటిలో రోగములు, బాధలు ప్రాముఖ్య స్తానములో ఉంటాయి. ఒక విషయము గుర్తించాలి మత్తయి బాహాటముగా దారి మల్లిస్తున్నాడు [యెషయా 53:4 హెబ్రీయుడిని]... సత్యాన్ని నొక్కి వాక్కానించడానికి క్రీస్తు మన రోగములను వహించెను" (చెప్పబడింది యంగ్, ఐబిఐడి., పేజి 345, గమనిక 13).

నాలుగు సువార్తలు జాగ్రత్తగా పరించినచో తెలిసేదేమిటంటే క్రీస్తు రోగమును స్వస్థపరిచాడు, ఆత్మను కుడా బాగుచేస్తాడు అని, నిదర్శనానికి, మార్పు ద్వారా రక్షించుట ద్వారా. దీనికి ఒక ఉదాహరణ చూడవచ్చు పదిమంది కుష్టు రోగులు యేసుకు ఎలుగెత్తి చెప్పారు, అన్నారు, "ప్రభువా, మమ్మును కరుణించుము" (లూకా 17:13). యేసు వారిని దేవాలయానికి పంపాడు ప్రజలకు వారికి కనువిప్పుకే దానికి, మరియు "వారు వెళ్లి చూడగా, వారు శుద్దులైరి" (లూకా 17:14). వారు క్రీస్తు శక్తి ద్వారా శారిరకముగా శుద్దులైరి, కానివారు రక్షింపబడలేదు. వారిలో ఒకడే తిరిగి వచ్చాడు. అతడు తన పాపములకు ఆత్మీయ స్వస్థత పొందాడు, మార్పిడి ద్వారా యేసు వద్దకు తిరిగి వచ్చిన తరువాత, "ఆయనకు కృతజ్ఞతాస్తులను చెల్లించుచు, ఆయన పాదముల యొద్ద సాగిపడెను" (లూకా 17:16). అప్పుడు యేసు అతనితో అన్నాడు, "నీవు లేచి పొమ్ము: నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచేనని వానితో చెప్పెను" (లూకా 17:19). అప్పుడు అతడు ఆత్మీయముగాను, శారీరకముగాను స్వస్థతపడ్డాడు, ఇది మనము క్రీస్తు జరిగించిన అద్భుత స్వస్థతలలో చేస్తాము, గ్రుడ్డి వాని కన్నులు తెరచుట యోహాను 9వ అధ్యాయము, మొదట అతడు గ్రుడ్డితనానికి స్వస్థత పొందాడు, కాని అతడు అనుకున్నాడు యేసు కేవలము "ఒక ప్రవక్త" అని (యోహాను 9:17). తరువాత అతను అన్నాడు,

"అంతటివాడు ప్రభువా, నేను విశ్వసించు చున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కేను” (యోహాను 9:38).

అప్పుడు మాత్రమే ఆ మనుష్యుడు రక్షింపబడ్డాడు.

కాబట్టి మనము నిర్ణయించవచ్చు శారీరక స్వస్థత రెండవది, మరియు యెషయా 53:4 ఆత్మీయ స్వస్థతను నొక్కివక్కానిస్తుంది. డాక్టర్ జె. వెర్నొన్ మెక్ గీ అన్నారు,

యెషయాలోని ఈ పాఠ్యభాగము తేటగా చెబుతుంది మన అతిక్రమములనుండి [యెషయా 53:5] దోషము నుండి స్వస్థ పరచబడ్డాం. మీరు నాతో అనవచ్చు, "దీని గురించి మీరు కచ్చితమేనా అని?". నాకు తెలుసు ఈ వచనలు ఈ విషయాన్నే ప్రస్తావిస్తున్నాయీ ఎందుకంటే పేతురు అన్నాడు, “మనము పాపముల విషయమై చనిపోయి, నీతి విషయమై జీవించునట్లు, ఆయన తానె తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికోనెను: అయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి" (I పేతురు 2:24). దేని ద్వారా స్వస్థత? "పాపములు." పేతురు చాలా తేటుగా చెపుతున్నారు తన పాపాన్ని గూర్చి మాట్లాడు చున్నాడని (మెక్ గీ, ఐబిఐడి., పేజీ 49).

ఈ వివరణ తిరిగి మన పాఠ్య భాగానికి తెసుకెళ్తుంది,

"నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను: అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన భాదింబడినవానిగాను, శ్రమ పొందినవాని గాను మనమతనిని ఎంచితిమి" (యెషయా 53:4).

ఈ వచనము సహజముగా రెండు భాగాలుగా విభజించబడింది: (1) క్రీస్తు శ్రమకు నిజ కారణము , బైబిలు లో ఇవ్వబడింది; మరియు (2) అబద్ద కారణము గ్రుడ్డి వారిచే నమ్మబడినది.

I.  మొదటిది, క్రీస్తు శ్రమలకు నిజ కారణము,
పరిశుద్ధ లేఖనాల్లో ఇవ్వబడినది,

"నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను…” (యెషయా 53:4).

ఈ పదము "ఖచ్చితంగా" పరిచయం చేస్తుంది, తారతమ్యతను క్రీస్తు శ్రమకు నిజ కారణానికి, అబద్ధ కారణానికి గ్రుడ్డి వారు నమ్మేటట్లు. "ఖచ్చితంగా," తరువాత నిజవ్యక్తత; "కానీ" తరువాత అబద్ధ వ్యక్తత;

"నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను: అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన భాదింబడిన వాని గాను, శ్రమ పొందిన వాని గాను మనమతనిని ఎంచితిమి" (యెషయా 53:4).

మరియు, పదాలు "దుఃఖము" మరియు "విచారములు" అర్ధం చేసుకోవాలి. "దుఃఖము" నకు హెబ్రీ పదము అర్ధము "రోగములు." యెషయాచే పర్యాయ పదంగా వాడబడింది, "పాపము" యెషయా 1:5-6. అది ఒక పర్యాయ పదము "పాపము" నకు, దుఖములు పాపము యొక్క రోగాలకు సూచన. "విచారములు" తెలియచేస్తాయి "నొప్పి విషాదాల అనుభూతి." కనుక, "వ్యసనము, రోగము," పాపము యొక్క మరియు "విచారములు, నొప్పి మరియు విషాదము" పాపము ద్వారా ఉద్బవిస్తాయి, వాటి అర్ధము - పాప రోగము మరియు దానిలోని భాద.

తరువాత గమనించండి, "భరించుట" అనే పదాన్ని. దాని అర్ధం "మోయుట." కానీ “మోయుట [మోయుట ] కంటే ఎక్కువ అర్ధాన్ని యిస్తుంది. ఆ తలంపు ఎత్తుకొనుట మోయుట" (యాంగ్, ఐబిఐడి., పేజీ 345). క్రీస్తు మానవుని పాపాన్ని ఎత్తి వేసాడు, ఆయనపై వేసుకున్నాడు, ఆ పాపాలను మోసాడు. క్రీస్తు తన సిలువను ఎత్తుకుని కల్వరి వైపు మోసినట్లు, ఆయన మారిన వ్యక్తి పాపాన్ని మోసుకొని వెళ్తాడు. అదే అపోస్తలుడైన పేతురు భావన, క్రీస్తును గూర్చి చెప్పుతున్నప్పుడు,

"ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను" (I పేతురు 2:24).

కీల్ అండ్ డెలీట్ జెక్ వ్యాఖ్యానము ఇలా అంటుంది,

అర్ధము కేవలము కాదు (క్రీస్తు) ప్రవేశించాడు మన శ్రమల సహవాసములోనికి, కానీ ఆయన ఆయన మీద వేసుకున్నాడు శ్రమలను మనము భరించవలసినవి తగినట్లుగా, మరియు కాబట్టి తీసివేయడం మాత్రమే కాదు... ఆయన పై వేసుకొని భరించాడు వ్యక్తి [ఆయన శరీరము], ఆయన మనలను విడుదల చేయునట్లు, కాని ఒక వ్యక్తి ఆయనపై వేసుకున్నప్పుడు శ్రమను దేనినైతే మరియొకరు భరించాల్సి ఉందో, మరియు కాబట్టి ఆయనలో సహించుట మాత్రమే కాకుండా, కానీ ఆయన [స్థానములో], దేనినే అంటారు బదులుగా (ఫ్రేంజ్ డెలిక్ జెస్క్, టిహెచ్.డి., వ్యాఖ్యానము పాత నిభందన పై పది ప్రతులలో, విలియం బి. ఎర్డ్ మాన్స్ పబ్లిషింగ్ కంపనీ, 1973 తిరుగు ముద్రణ, ప్రతి VII, పేజి 316).

క్రీస్తు మన పాపాలను ఆయన స్వశరీరంపై మోసాడు, కల్వరి కొండ వరకు, సిలువ వరకు, అక్కడ ఆయన మన పాపములకు వెల చెల్లించాడు, "దీనినే ప్రత్యామ్నాయము"అంటారు !!!

"అవమానమును బరి తెగింపును భరించి." పాడండి!

భరించి అవమానమును బరి తెగింపును,
నా స్థానములో వెలి వేయబడి ఆయన నిలిచి;
ముద్రించాడు క్షమాపణను ఆయన రక్తముతో;
హల్లేలూయా!ఎంతటి రక్షకుడు!
   ("హల్లేలూయా! ఎంతటి రక్షకుడు!" ఫిలిప్, పి. బ్లిస్ చే, 1838-1876).

"మన అతి క్రమములను బట్టి అతడు గాయ పరచబడెను, మన దోషములను బట్టి పలుగగొట్ట బడెను" (యెషయా 53:5).

"లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి చెందెను” ( I కోరిందీయులకు 15:3).

"నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసములను వహించెను…" (యెషయా 53:4).

డాక్టర్ డబ్ల్యూ. ఎ. క్రిస్ వెల్ అన్నారు,

సిలువపై క్రీస్తు మరణము మన పాపముల కారణముగా, ఎవరు ప్రభువైన యేసును చంపారు? ఎవరు చంపి వేసారు మహిమా రాజును? ఎవరు ఆయనను సిలువకు అప్పగించారు ఎక్కడైనా ఆయన శ్రమించి మరణించాడో? ఎవరి తప్పిదము ఇది?.... ఇక్కడ చెప్పక తప్పదు మనందరికీ అందులో భాగముంది. నా పాపాలు ముళ్ళ కిరీటాన్ని ఆయన తలపై ఉంచాయి. నా పాపాలు మేకులను ఆయన చేతులకు గుచ్చాయి. నా పాపాలు శూలాన్ని ఆయన హృదయము లోనికి గుచ్చాయి. నా పాపాలు ప్రభువైన యేసును ఆ చెట్టుకు వ్రేలాడదీసాయి. అది... ప్రభువు మరణానికి అర్ధము (డబ్ల్యూ. ఎ. క్రిస్ వెల్, పి.హెచ్.డి., "సిలువ రక్తము," మెసేజెస్ ఫ్రమ్ మై హార్ట్, ఆర్ఈఎల్ పబ్లికేషన్స్, 1994, పేజీలు 510-511). (W. A. Criswell, Ph.D., “The Blood of the Cross,” Messages From My Heart, REL Publications, 1994, pages 510-511).

"లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి చెందెను” (I కోరిందీయులకు 15:3).

"నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసములను వహించెను…” (యెషయా 53:4).

"అవమానమును, బరి తెగింపును భరించి." మళ్ళీ పాడండి!

భరించి అవమానమును బరి తెగింపును,
నా స్థానములో వెలి వేయబడి ఆయన నిలిచి;
ముద్రించాడు క్షమాపణను ఆయన రక్తముతో;
హల్లేలూయా! ఎంతటి రక్షకుడు!

అది నిజమైన కారణము క్రీస్తు శ్రమలకు - నీ పాపములకు వెల చెల్లింపు! కాని మానవాళి, తన అంధత్వము మరియు తిరుగు బాటు వలన, మార్చేసింది అందమైన, రక్షించు సత్యాన్ని క్రీస్తు యొక్క ప్రత్యామ్నయ మరణమును ఒక అబద్దముగా! ఇది రెండవ విషయానికి తీసుకు వెళ్తుంది.

II.  రెండవది, అబద్దపు కారణము క్రీస్తు శ్రమ విషయములో,
అందులైన , మనుష్యులచే ఇవ్వ బడినది,

మన పాఠ్య భాగము మళ్ళీ చూడండి. మనము లేచి నిలబడి కలిసి గట్టిగా చదువుదాం.

"నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను: దేవుని వలన భాదింపబడిన వాని గాను, శ్రమను నొందిన వాని గాను, మనమతని ఎంచితిమి" (యెషయా 53:4).

మీరు కూర్చోండి.

"అవును మనమతనిని భాదింపబడిన వాని గాను, శ్రమ నొందిన వారి గాను ఎంచితిమి.” "మనము," ఆదాము సంతతి వారము. సాతాననే అందులముగా అయి, మనము విఫలమవుతున్నాము క్రీస్తు శ్రమలను చూడడానికి, ఆయన మన స్థానములో, ప్రత్యామ్నాయముగా మరణించాడని. మనము అనుకున్నాము ఆయన ఒక వెర్రి వాడని, బహుశా పిచ్చి వాడని, లేక పరిశయ్యలు చెప్పినట్లు, "అపవిత్రాత్మ పట్టినవాడు," అని, ఆయనే కావాలని పద్దతికి విరుద్ధముగా కొని తెచ్చుకున్నాడని, యోబు స్నేహితులవలె, మనం అనుకున్నాం ఆయన పాపాలు తప్పిదాలు మానవ ఉగ్రతను ఆయనపై వేశామని, మనం అనుకున్నాం, ఆయన ఆకారణముగా హత సాక్షి అయ్యాడని, ఒకటి రెండు సార్లు, మనలో చాలా మంది తలంచాం యేసు ఒక విప్లవ కారుడని. చాలా మంది మనది ఒక తలంపులో ఉన్నాం ఆయన మాట నాయకులను రెచ్చగొట్టి ఆయన చావును ఆయనే తెచ్చు కున్నాడని.

అర్ధమైందా? అవును, మనకు తెలుసు ఆయన మెత్తబడ్డాడు! బాదింపబడ్డాడు? అవును, మనకు తెలుసు ఆయన మెత్తబడ్డాడని! శ్రమ నొందాడా? అవును, అది కూడా మనకు తెలుసు! మనకు తెలుసు వారు ఆయన ముఖము మీదపడి గుద్దులు గుద్దారని. మనకు తెలుసు కొరడాతో ఆయనను కొట్టారని. మనకు తెలుసు ఆయన సిలువ వేయబడ్డాడని! సుమారు ప్రతి ఒక్కరికి ఈ నిజాలు తెలుసు! కాని మనం వాటిని తప్పుగా చూపించాం. వాటిని అపార్ధం చేసుకున్నాం. మనం గ్రహించలేదు ఆయన మన దుఃఖాన్ని భరించాడని, మన విచారాన్ని మోసాడని! మనం ఆయనను చూస్తున్నప్పుడు మనసులో ఆయన సిలువ వేయబడినట్టు, మనం అనుకున్నాం ఆయన శిక్షింప బడుతున్నాడు ఆయన తిరుగు బాటు తనాన్ని బట్టి తప్పులు బట్టి అని.

“కాని కాదు! అని మన అతి క్రమములను బట్టి, మన పాపములను బట్టి, మనము [దేవునితో ] సమాధాన పర్చబడునట్లు, [పాపము నుండి ] మనం స్వస్థత పొందడానికి. సత్య మేమిటంటే మనము దారి తప్పిపోయి, స్వంత చిత్తములోనడిచితే, [దేవుడు] మన పాపములను ఆయనపై వేసాడు, పాప రహితుడు" (విలియం మెక్ డోనాల్డ్, బిలివర్స్ బైబిల్ కామెంటరీ, ధామస్ నెల్సన్ పబ్లిషర్స్, 1995, పేజి 979). (William MacDonald, Believer’s Bible Commentary, Thomas Nelson Publishers, 1995, p. 979).

మన నేరారోపణ కు ఆయన శాంతి నిచ్చాడు,
మన బంధకాల నుండి విడిపించాడు,
ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన పొందిన దెబ్బల చేత,
ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగు చున్నది.
   ("ఆయన గాయపర్చబడ్డాడు" ధామస్ ఓ. చిస్ లోమ్ చే, 1866-1960. )

"నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యపనములను వహించెను: అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన భాదింబడినవానిగాను, శ్రమ పొందినవాని గాను మనమతనిని ఎంచితిమి" (యెషయా 53:4).

గ్రిఫిత్ గారు, దయ చేసి ఆ వచనము పాడండి.

అది నీ విషయములో నిజమేనా? నీవు ఆలోచించావా యేసు సిలువ మీద మరణించాడని కేవలము నీ పాపాలను తీసివేయడానికేనని? అప్పుడు, క్రీస్తు నీ స్థానములో నీ పాపాలకు జరిమానా తొలగించడానికి చని పోయాడనే సంగతి తెలుసుకొని, సామాన్య విశ్వాసముతో ఆయన యందు నమ్మిక ఉంచుతావా? దైవ కుమారుని నీవు నమ్ముతావా నమ్మి ఆయన ప్రశస్త రక్తముతో నీ ప్రతీ పాపాన్ని కడుగుకొని నీటి మంతునిగా తీర్చబడుతావా?

నేను నిన్ను అడుగుతున్నాను నీ మనసులో నుండి ప్రతి తప్పుడు తలంపు తొలగించాలని ఆయన శ్రమల గూర్చి మరణమును గూర్చి. ఆయన మరణించాడు నీ పాపపు జరిమానా చెల్లించడానికి, ఆయన మృతులలో నుండి లేచాడు. ఆయన పరలోకములో దేవుని కుడి పార్శ్వమున ఆ సీనుడైయున్నాడు. నేను నిన్ను అడుగుచున్నాను ఆయనను నమ్మి నీ పాపముల నుండి రక్షింపబడాలని.

కాని యేసుని గూర్చి ఈ విషయాలు తెలుసుకుంటే సరిపోదు. నీవు తెలుసుకోవచ్చు ఆయన మరణమును గూర్చిన ఆసత్యాలన్ని కానీ, ఇంకా క్రైస్తవుడవు కాలేదు. నీకు తెలియవచ్చు సిలువ మీద క్రీస్తు మరణానికి సంబందించిన సత్యము; నీవు తెలుసుకోవచ్చు పాపుల స్థానములో ఆయన మరణించాడని, కానీ మార్చబడి ఉండకపోవచ్చు. నీవు మృత్యుంజయుడైన యేసు క్రీస్తును నమ్మాలి. నీవు నిజానికి ఆయనను నమ్మి ఆయనకు సమర్పించుకొవలి. రక్షణకు ఆయనే మార్గము. నిత్య జీవానికి ఆయనే ద్వారము. ఇప్పుడు ఆయనను నమ్ము, అప్పుడు నీవు తక్షణమే క్షమింపబడి పాపమునుంది రక్షింపబడతావు. గ్రీఫిత్ గారు ఆ చరణము మళ్ళి పాడతారు. ఒకవేళ నీవు నీ రక్షణ గురించి మాట్లాడాలనుకుంటే, మీరు వెంటనే మరల గది లోనికి వెళ్ళండి.

మన నేరారిపణకు ఆయన శాంతినిచాడు,
మన బంధకాలనుండి విడిపించాడు,
ఆయన దెబ్బలచేత, ఆయనపోందిన దెబ్బలచేత,
ఆయనపోందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది.

డాక్టర్ చాన్, దయచేసి స్పందించిన వారి కొఱకు ప్రార్ధించండి. ఆమెన్.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసగాలు ప్రతీవారము”
అంతర్జాలములో www.realconversion.com ద్వారా చదువవచ్చు.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ప్రసంగమునకు ముందు బైబిలు పఠనము ఏబెల్ ప్రుదోమే గారిచే: I పేతురు 2:21-25.
ప్రసంగమునకు ముందు పాట బెంజమన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్ గారిచే:
"ఆయన గాయపర్చబడ్డాడు" (థామస్ ఒ.కిఫొమ్, 1866-1960;
స్వరానికి "ఓక్ పార్క్").


ద అవుట్ లైన్ ఆఫ్

క్రీస్తు శ్రమ - సత్యము అసత్యము

(ప్రసంగము సంఖ్య 5 యెషయా 53)

డాక్టరు ఆర్. ఎల్ హైమర్స్ జూనియర్, గారిచే,

"నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను: అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన భాదింబడినవాని గాను, శ్రమ పొందినవాని గాను మనమతనిని ఎంచితిమి" (యెషయా 53:4).

(మత్తయి 8:17; లూకా 17:13, 14, 16, 19;

యెహను 9:17, 38; I పేతురు 2:24)

I.   మొదటిదిగా, నిజ కారణము క్రీస్తు శ్రమల కొరకు, పరిశుద్ధ లేఖనములలో ఇవ్వబడినట్టు, యెషయా 53:4ఎ, 5; I కోరిందీయులకు 15:3.

II.  రెండవది, అబద్ధ కారణము క్రీస్తు శ్రమల కొరకు, అంధులైన మనుష్యులచే ఇవ్వబడినట్టు, యెషయా 53:4బి.