Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




నేను క్రిస్మస్ ను ప్రేమిస్తాను - డాక్టర్ జాన్ ఆర్. రైస్ నుండి తీసుకొనబడినది

I LOVE CHRISTMAS – ADAPTED FROM DR. JOHN R. RICE
(Telugu)

డాక్టర్ ఆర్.ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

సంస్కరణ సాయంత్రము బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము, డిసెంబర్ 18, 2011
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Evening, December 18, 2011

"వారు అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి, తల్లియైన మరియను ఆ శిశువును చూచిరి; సాగిలపడి, ఆయనను పూజించిరి: తమ పెట్టెలు విప్పు, సమర్పించిరి; బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి" (మత్తయి 2:11).


డాక్టర్ జాన్ ఆర్. రైస్ (1895-1980) ఒక మంచి తెలివి గల క్రైస్తవుడు. ఈ సాయంకాలము ఆయన ప్రసంగములోని ముఖ్య విషయాలు మీకు ఇస్తాను, "నేను క్రిస్మస్ ను ప్రేమిస్తాను." ప్రసంగము కుదింపబడినది కొన్ని భాగాలలోని పదాలు వేరుగా చెప్పబడ్డాయి. డాక్టర్ రైస్ అన్నాడు:

నేను క్రిస్మస్ కాలాన్ని ప్రేమిస్తాను. క్రిస్మస్ అంశాలు దేవదూతలు, గొల్లలు, పశువుల పాక, కన్యకా గర్భము, జ్ఞానులు అంశాలపై బోధించడంలో నాకు గొప్ప సంతోషము ఉంది. క్రిస్మస్ కేరల్స్ లో కూడ నాకు గొప్ప సంతోషము ఉంది. మా ఇంటిలో సంతోషకర, ఆరాధన సంతోషపు గమనింపు ఉంది, నా హృదయంలో, క్రిస్మస్ సమయంలో, దేవునికి వందనాలు చెల్లిస్తాను. నా ప్రియులు కుటుంబ సభ్యులు క్రిస్మస్ కొరకు కూడుకోవడం నేను ప్రేమిస్తాను. బహుమానా లివ్వడం నాకు ప్రియము, నా ప్రియులు నా స్నేహితులు నన్ను జ్ఞాపకము చేసుకోవడంలో నేను ఆనందిస్తాను. క్రిస్మస్ కాలాన్ని నేను ప్రేమిస్తాను (Dr. John R. Rice, I Love Christmas, Sword of the Lord, 1955, p. 7).

కాని డాక్టర్ రైస్ చెప్పాడు కొంతమంది "క్రిస్మస్ ను గూర్చి చింతిస్తారు, అంగీకరించని వారుగా ఉంటారు, ఎన్నో అభ్యంతర కలిగి ఉంటారు" (ఐబిఐడి.). క్రీస్తు జననమును గూర్చి ఆచరించు వారిని వారు విస్మరిస్తారు.

I. మొదటిది, క్రిస్మస్ క్రీస్తు పుట్టిన రోజు కాదని వారు అంటారు.

యేసు ఏదినాన జన్మించాడో మనకు తెలియదు అనేది నిజమే. బైబిలు ఆ విషయము మనకు చెప్పడం లేదు. కాని క్రిస్మస్ దినాన్న క్రీస్తు జననమును జ్ఞాపకం చేసుకోవడం తప్పు కాదు పాపమూ కాదు.

డాక్టర్ రైస్ కు ఒక చిన్న పాప లీపు సంవత్సరము ఫ్రిబ్రవరి 29 న, పుట్టడం తెలుసు. ఆ రోజు లీపు సంవత్సరము, నాలుగు సంవత్సరాలకు ఒకసారే వస్తుంది కాబట్టి, ఆయన చెప్పాడు తన పుట్టిన రోజును తల్లిదండ్రులు ఫిబ్రవరి 28 న జరపడం తప్పుకాదు, అది తన అనలుపు పుట్టిన రోజు కానప్పటికినీ.

డిసెంబర్ 25 క్రీస్తు జననానికి చాలా సమీపంగా ఉంది. ప్రియమైన ప్రభువైన యేసును మనం ప్రేమిస్తాం, ఆయన పుట్టిన రోజును ప్రతి ఒక్కరు జ్ఞాపకము చేసుకోవాలని ఆశిస్తాం. మన పిల్లలకు పశువుల పాకలోని శిశువును గూర్చి, తూర్పు నుండి ఆయనను ఆరాధించడానికి వచ్చిన జ్ఞానులను గూర్చి నేర్పిస్తూ ఉంటాం, ఇంకా దేవదూత మరియకు ప్రకటించడం దేవదూతలు గొల్లల కొరకు పాట [పాడడం]. ఇతర రోజులకంటే డిసెంబర్ 25 ఎందుకు మంచిదినము కాకూడదు? క్రీస్తు జననమును జ్ఞాపకము చేసుకోవడం తప్పును కుంటున్నారా ఆ దినాన ఏదైతే క్రీస్తు జన్మ దినానికి ఎంతో దగ్గరగా ఉన్న దానిని?

II. రెండవది, క్రిస్మస్ అంటే "క్రీస్తుకు ఆరాధన" అని అర్ధమని, చాలామందికి కేథలిక్ సెలవు దినమని వారంటారు.

వారంటారు క్రీస్తు ఆరాధన నుండి క్రిస్మస్ వచ్చిందని, కేథలిక్కులచే ప్రారంభింపబడిందని, కనుక ప్రోటేస్టంటులు దానిని ఆచరింపకూడదని. ఆ అభ్యంతర కొంత అవివేకంగా నాకు తోస్తుంది.

[కాలిఫోర్నియాలోని చాల నగరాల పట్టణాల పేర్లు కేథలిక్కుల నుండి వచ్చాయి. లాస్ ఎంజిలాస్ అస్సలు అది కేథలిక్ పేరు. పేరు "లాస్ ఎంజిలాస్" వాడేటప్పుడు కెథలిక్కులను గూర్చి ఆలోచించము. కెథలిక్కులను గూర్చి మనము తలంచము మనం చెప్తున్నప్పుడు "సాన్ డియోగో," లేక "శాన్ ప్రాన్సిస్కో," లేక "శాక్రమేంటో."] పేర్లు అంటే వాటి అర్ధము, కాని దాని పూర్వము కాదు.

సెవెంత్ డే ఎడ్వెంటిష్టులు కొన్నిసార్లు రబస చేస్తారు మనం ఆదివారం ఆరాదిస్తామని, సూర్య ఆరాధన నుండి ఆదివారము వచ్చిందని. నా జవాబు శనివారము అన్యదేవుడు సాటర్న్ ఆరాధన నుండి వచ్చింది! కాని సూర్యుని ఆరాదిస్తున్నట్టుగా ఎవరు అనుకోరు "ఆదివారము" అనే పదాన్ని ఉపయోగిస్తున్నప్పుడు. క్రిస్మస్ ను ఆచరిస్తున్న ప్రజలలోని మనసులో హృదయాలలో అదిలేనప్పుడు ఆ తారతమ్యము చేయడం అవివేకము. జనవరి రోమా దేవుడు జనస్ ద్వారా వచ్చింది. ఆపేరును బట్టి ఆ నెలను పిలిస్తే క్రైస్తవులు పాపము చేస్తున్నట్టా? ప్రతి జ్ఞానవంతునికి, క్రిస్మస్ అంటే అర్ధము క్రిస్మస్తే. అది ఆరాధన అని అర్ధము కాదు. కెథలిక్కులు దానిని ఆరాధనగా ఆచరిస్తారు, కాని ప్రోటేస్టంట్ కాదు.

III. మూడవది, క్రిస్మస్ అనేది మునపటి అన్య సెలవు దినము అని వారు అంటారు.

క్రిస్మస్ మునపటి అన్య సెలవు దినము అని నేను అనుకుంటాను. ఈ తర్కము ప్రాముఖ్యం కాదు. అన్యజనులు ప్రతి రోజు ఏదో చేస్తూనే ఉంటారు. విత్తుటను గూర్చి కోయుటను గూర్చి, అంతరిక్షము, కొత్త చంద్రులును గూర్చి వారికి సంబరాలు ఉన్నాయి. కనుక, ఒకవేళ అన్య జనులు డిసెంబర్ ఇరవై ఐదును విగ్రహారాధనకు ఉపయోగిస్తే, ఎందుకు ఇప్పుడు క్రైస్తవులు దానిని యేసు క్రీస్తును ఆయన జననమును గౌరవించడానికి ఉపయోగించకూడదు? క్రీస్తు జననమును జ్ఞాపకం చేసుకోడానికి ఈరోజు ఉపయోగించినా, వేరే వారు చెడు కారణాలను ఉపయోగిస్తారు. కాని, దేవునికి వందనాలు, ఇప్పుడు అన్ని రోజులు యేసు క్రీస్తుకు చెందినవే, ఈరోజు కూడ అన్య దేవుళ్ళకు చెందినది కాదు, డిసెంబర్ 25 కూడ! డిసెంబర్ 25, కూడ, ఏదో విధంగా ఆయనను గౌరవించడానికి ఉపయోగించాలి.

IV. నాల్గవది, క్రిస్మస్ చెట్టు అలంకరణలు హేమము అని వారు అంటారు.

కొందరంటారు బైబిలు ఇర్మియా 10:3-4 లో క్రిస్మస్ చెట్లను తిరస్కరిస్తుందని. కాని ఆ లేఖనము క్రిస్మస్ చెట్లను గూర్చి మాట్లాడడం లేదు. వెండి బంగారముతో నిండిన చెక్క నుండి తయారు చేయబడిన, విగ్రహాన్ని గూర్చి అది మాట్లాడుతుంది. మిగిలిన లేఖనము చెప్తుంది ఎంత వివరంగా ఎంత ఖరీదైనదిగా, ఆ విగ్రహము వెండి బంగారము బోలములతో తయారు చేయబడిందో. [డాక్టర్ హైమర్స్ గమనిక: ఈ పాఠ్యభాగము రెండు కారణాలను బట్టి క్రిస్మస్ చెట్లను గూర్చి మాట్లాడడం లేదు (1) ఇర్మియా దినములలో క్రిస్మస్ గాని క్రిస్మస్ చెట్టు కాని లేదు (2) ఎవ్వడు ఈరోజు క్రిస్మస్ చెట్టును ఆరాధించడం లేదు.] లేదు, బైబిలు క్రిస్మస్ చెట్టును బహిష్కరించడం లేదు. [క్రిస్మస్ సమయంలో చాలామంది వారి గృహాలలో సంఘాలలో ఉంచే పువ్వుల కంటే అవి ఎక్కువ పాప భూ ఇష్టము కాదు.]

ఒక ఇంటిని చక్కగా లేక అట్టహాసంగా, లేక పచ్చదనంగా అలకరించుకోవడంలో, హాని ఏమైనా ఉందా? ఇక వందన సమర్పణ సమయంలో ఇళ్ళను చూడముచ్చటగా అలంకరించుకోకూడదు! స్మారక దినాన సమాధులను పూలతో అలంకరించకూడదు! నిజంగా దేవుడు అసంతృప్తి చెందడు మనం ఆయన సహజ సౌందర్యాల పట్ల మన దృష్టి పెట్టితే.

[డాక్టర్ హైమర్స్ గమనిక: చెప్పబడింది ప్రోటేస్టెంట్ సంస్కర్త మార్టిన్ లూధర్ నుండి క్రిస్మస్ చెట్టు వచ్చిందని ఆయన దానిమ్మ చెట్టు ఆకుల నుండి ప్రకాశించే నక్షత్రాలను చూడడం, దానిని అతడు ఇంటిలోనికి తెచ్చి క్రొవ్వత్తులతో అలంకరించాడు, యేసు జన్మించినప్పుడు పుట్టిన నక్షత్రానికి అది జ్ఞాపకంగా. ఈ చరిత్రే నిజమైతే, క్రిస్మస్ చెట్టు అనే దానికి ప్రోటే స్టెంట్ మూలము ఆధారము.]

నేను క్రిస్మస్ ను అలంకరనలను ప్రేమిస్తారు, అవి తప్పని నేననుకోవడం లేదు. నా హృదయంలో ఉన్న ఆనందాన్ని వ్యక్త పరచడమే దేవుడు ఎలా మానవుడయ్యాడు, సృష్టి కర్త ఎలా బాలుడయ్యాడు, ఎలా "ఆయన ధనవంతుడయినప్పటికిని, నీకోసం ఆయన ఎలా దరిద్రుడయ్యాడో, ఆయన పేదరికము ద్వారా నీవు ధనికుడు అవడానికి" (II కొరిందీయులకు 8:9).

V. ఐదవది, లోకరీతిని బట్టి సెలవు దినాలలో చోటు చేసుకొనే క్రైస్తవ్యము లేని స్థితి వలన వారు క్రిస్మస్ ను అడ్డగిస్తున్నారు.

చాలామంది యేసు క్రీస్తును క్రిస్మస్ దినాన గౌరవించరు అది వాస్తవము. వారు ఎక్కువగా పాపమూ చేస్తున్నారు అనుకుంటాను. కొన్నిసార్లు శాంతా క్లాస్ ను గూర్చి చిన్న అబద్ధము చెప్పి అన్య కథతో పిల్లలను మోసగిస్తారు, ప్రియ ప్రభువైన యేసును గూర్చి చెప్పకుండా. అది దుష్టత్వమని నేననుకుంటాను. అబద్ధము ఎప్పుడు తప్పే అది దేవునికి అసత్యము. యేసు జననమును గౌరవించడానికి మోసము చిన్న ఆటంకము. తప్పకుండా చిన్న పిల్లలకు శాంతా క్లాస్ ను గూర్చిన అబద్ధము చెప్పడము ఒక పాపమూ. క్రైస్తవుడు అలా చెయ్యకూడదు. అవును, ప్రజలు క్రిస్మస్ దినాన దేవుని అగౌర పరుస్తారు. వారు చేస్తారు నాకు విచారము. నా నిరీక్షణ ప్రసంగము వింటున్న ఏ క్రైస్తవుడు కూడ అలాంటి పాపాల ద్వారా దేవుని దుఃఖ పరచకూడదు.

కాని మనము క్రిస్మస్ ను సాతానుకు అప్పగించకూడదు దుష్టులను కూడ కొందరు క్రిస్మస్ రోజున పాపమూ చేస్తున్నారని. దుర్వినియోగం చేయబడుతుందని ఆదివారాన్ని వదులుకుంటామా? వారంలో ఈరోజు లేనంతగా ఆదివారము త్రాగు బోతుతనము ఉంటుంది. ఎక్కువ చెడు తనముంటుంది. అందుకు క్రైస్తవులు ఆదివారాన్ని విడిచి పెట్టి దెయ్యపు దినముగా లెక్కగట్టాలా? కానేకాదు! చాలా గొప్పవారన్నారు రక్షణకు బాప్మిస్మము అవసరమని బోధించేవారు. వారు క్రీస్తు రక్తము కంటే నీటిని ఎక్కువగా గౌరవిస్తారు. అది తప్పు. కాని, మనం యేసు క్రీస్తుకు అవిదేయులము అవాలా, బాప్తిస్మమును గూర్చి ఎందుకంటే కొందరు ఎక్కువ నొక్కి చెప్పారు తప్పుడు సిద్ధాంతము చెప్పారు కాబట్టి? కానేకాదు!

క్రీస్తు రెండవ రాకడ ఎక్కువగా తిరస్కరింపబడుతుంది చాలామందికది త్రోవ మళ్ళించే సిద్ధాంతము. క్రీస్తు రాకడ సిద్ధాంతాన్ని అబద్ధపు తెగలు ఎక్కువగా దారి మళ్ళించాయి. ప్రజలు తేది పెడతారు. మిగిలిన మనము, తరువాత, క్రీస్తు రెండవ రాకడను గూర్చిన బైబిలు సిద్ధాంతాన్ని నిర్లక్ష్యము చేస్తామా ఆ సిద్ధాంతము మాలినమైయిందని? కానేకాదు!

ఆత్మ పరిపూర్ణతను గూర్చిన బైబిలు సిద్ధాంతాన్ని మనము నిర్లక్ష్యము చేయకూడదు ఎందుకంటే చాలామంది దానిని భాషలో మాట్లాడడానికి పాపరహిత పరిపూర్ణతకు మెలి పెట్టుచున్నారు.

అలాగే, మనము క్రిస్మస్ ను సాతానుకు లోక సంబంధ ప్రజలకు అప్పగిస్తే అది చాలా అవివేకము. లోకము క్రిస్మస్ ను భయంకర పార్టీలకు వాడితే, మనము దానిని క్రైస్తవ ప్రేమ సహవాసము దినముగా, క్రీస్తును గౌరవించే దినముగా చెయ్యాలి!

ఇతరులు బహుమానాలు ఇవ్వడం ఒక ఆచారముగా చేస్తున్నారా? సరే, అది క్రైస్తవులకు అవసరము లేదు. నిజంగా ప్రేమను వ్యక్తపరిచే బహుమానాలు క్రైస్తవులు ఇవ్వవచ్చు.

సంతోషించే రోజు కలిగి ఉండడం తప్పా? క్రిస్మస్ భోజనము కలిగి ఇతరులకు పంచి ఇవ్వడంలో తప్పు ఉందా? లేదు, నిజంగా! ఇశ్రాయేలు ప్రజలు నేహేమ్యా కాలములో, బబులోను చెరనుండి విడిపించబడినప్పుడు, ధర్మశాస్త్రము చదవబడి వివరింపబడింది, మరియు ప్రజలు దుఃఖించారు. కాని అది దుఃఖించడం కంటే ఆనందించే సమయము, అందుకు నెహెమ్యా అన్నాడు:

"ఈ రోజు మీ దేవుడైన యెహోవా ప్రతిష్ఠితుడు: ఓదార్చుటకును, ఏడుపు లేదు. ఏడుస్తున్న ప్రజల కొరకు, వారు న్యాయ పదాలు విన్నారు. తరువాత అతడు అన్నాడు, మీ దారిన మీరు వెళ్ళండి, కొవ్వు తినడానికి, మరియు తీపి త్రాగడానికి, మరియు మీరు ఏమి చేస్తారో దానిని తయారుచేస్తారు: దేవుడు ఈరోజు పవిత్రంగా ఉన్నాడు: లేకపోతే క్షమించండి; యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము నొందుదురు" (నెహెమ్యా 8:9-10).

తరువాత 12వ వచనము చెప్తుంది:

"ఆ తరువాత జనులు తమకు తెలియచేయబడిన మాటలన్నింటిని గ్రహించి తినుటకును, త్రాగుటకు లేని వారికి, ఫలహరములు పంపించుటకు, సంభ్రహాముగా ఉండుటకు, ఎవరి ఇండ్లకు వారు వెళ్లి" (నెహెమ్యా 8:12).

ఆ ఇశ్రాయేలీయులు దేవుని ఒక దినపు సంతోషాన్ని కలిగి యుండడం ద్వారా శ్రేష్ట ఆహారము భుజించి ఇతరులకు పంపించడం ద్వారా దేవుని ఘన పరచారు కాబట్టి దేవునిని ఆరాధించుట పునరుద్ధరింపబడింది కాబట్టి, ఇప్పుడు ఈనాడు క్రైస్తవులకు ఒక హక్కు ఉంది మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క జన్మ దినాన సంతోషించే దినము కలిగి యుండడానికి!

ఔను, నేను క్రిస్మస్ ను ప్రేమిస్తాను! క్రిస్మస్ సమయంలో నాకు దేవునికి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. క్రిస్మస్ దినాన దేవుని వాక్యాన్ని నేను ప్రేమిస్తాను. క్రిస్మస్ సమయాన్న దేవుని గొప్ప క్రిస్మస్ బహుమానమైన యేసును అంగీకరించాలని నేను పాపులను బతిమాలుతాను.

సంతోషకరమైన, క్రిస్మస్ కలిగియుందాం, తరువాత, ఈ రోజున క్రీస్తును విశిస్టునిగా ఉంచుదాం ఆయన జననమును గౌరవిస్తూ ఆ దినమున మనము జ్ఞాపకము చేసుకుందాం!

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము డాక్టర్ క్రైటన్ ఎల్. చాన్: మత్తయి 2:1-12.
ప్రసంగము ముందు పాట బెంజమిన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్:
"యేసు, బాల యేసు" (డాక్టర్ జాన్ ఆర్. రైస్ గారిచే, 1895-1980).
“Jesus, Baby Jesus” (by Dr. John R. Rice, 1895-1980).


ద అవుట్ లైన్ ఆఫ్

నేను క్రిస్మస్ ను ప్రేమిస్తాను - డాక్టర్ జాన్ ఆర్. రైస్ నుండి తీసుకొనబడినది

I LOVE CHRISTMAS – ADAPTED FROM DR. JOHN R. RICE

డాక్టర్ ఆర్.ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

"వారు అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి, తల్లియైన మరియను ఆ శిశువును చూచిరి; సాగిలపడి, ఆయనను పూజించిరి: తమ పెట్టెలు విప్పు, సమర్పించిరి; బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి" (మత్తయి 2:11).

I.    మొదటిది, క్రిస్మస్ క్రీస్తు పుట్టిన రోజు కాదని వారు అంటారు.

II.   రెండవది, క్రిస్మస్ అంటే "క్రీస్తుకు ఆరాధన" అని అర్ధమని, చాలామందికి కేథలిక్ సెలవు దినమని వారంటారు.

III.  మూడవది, క్రిస్మస్ అనేది మునపటి అన్య సెలవు దినము అని వారు అంటారు.

IV.  నాల్గవది, క్రిస్మస్ చెట్టు అలంకరణలు హేమము అని వారు అంటారు,
II కొరిందీయులకు 8:9.

V.   ఐదవది, లోకరీతిని బట్టి సెలవు దినాలలో చోటు చేసుకొనే క్రైస్తవ్యము లేని స్థితి వలన వారు క్రిస్మస్ ను అడ్డగిస్తున్నారు, నెహెమ్యా 8:9-10,12.